బాబు అమెరికా పర్యటన ఒక మోసం
బాబు అమెరికా పర్యటన ఒక మోసం
Published Tue, May 9 2017 1:58 PM | Last Updated on Thu, Apr 4 2019 4:25 PM
విజయవాడ: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అమెరికా పర్యటన ఒక మోసమని ఏపీసీసీ అధ‍్యక్షుడు రఘువీరారెడ్డి విమర్శించారు. చంద్రబాబు అమెరికాలో తెలుగు వారి పరువు తీస్తున్నారన్నారు. తెలుగు వారిని కలవడానికి చందాలు వసూళ్లు చేయడమేంటని ప్రశ్నించారు. చంద్రబాబు ఎన్ని దేశాలు తిరిగినా పరిశ్రమలు రావని.. ప్రత్యేక హోదాతోనే రాష్ట్రానికి పరిశ్రమలు వస్తాయన్నారు. మూడు సంవత్సరాల్లో చంద్రబాబు రాష్ట్రానికి విదేశాల నుంచి ఎన్ని పరిశ్రమలు తెచ్చారో శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
కాగా మంగళవారం ఐఎన్టీయూసీ 70 వ వేడుకల్లో రఘువీరా రెడ్డి పాల్గొన్నారు. కార్మికుల హక్కులను పరిరక్షించడంలో కాంగ్రెస్ ముందు ఉంటుందని తెలిపారు. కార్మికుల కోసం అనేక చట్టాలను తెచ్చింది కాంగ్రెస్ పార్టీ అన్నారు. బీజేపీ, టీడీపీ పాలనలో కార్మికులు దోపిడీకి గురవుతున్నారన్నారు. కార్మిక వ్యతిరేక విధానాలను బీజేపీ, టీడీపీలు అవలంభిస్తున్నాయన్నారు. జన్మభూమి కమిటీలు బ్రోకర్స్‌కు నిలయంగా మారాయన్నారు. భవన కార్మికుల కోసం 1000 కోట్లు కేటాయించిన ఘనత కాంగ్రెస్ కే దక్కుతుందన్నారు. ఐఎన్టీయూసీ ని మండల స్థాయిలో మరింత బలెపేతం చేస్తామని రఘువీరా రెడ్డి తెలిపారు.
Advertisement