
'అందువల్లే రైతు ఆత్మహత్యలు'
హైదరాబాద్: రైతు ఆత్మహత్యలపై ఏపీ సర్కార్ తప్పుదారి పట్టిస్తోందని ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి విమర్శించారు. ఆయనిక్కడ గురువారం మాట్లాడుతూ ఒక్క సెప్టెంబర్ లోనే 70 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డరన్నారు. ఏపీలో స్వామినాథన్, జేపీ ఘోష్, రామచెన్నారెడ్డి నివేదిక అమలును నిలిపివేయడం వల్లే ఆత్మహత్యలు చేసుకుంటున్నారని వ్యాఖ్యానించారు. ఆత్మహత్యలపై హైకోర్టుకు వాస్తవాలతో కూడిన నివేదిక సమర్పించాలన్నారు. ఈ కేసులో కాంగ్రెస్ కూడా ఇంప్లీడ్ అవుతుందని రఘువీరా తెలిపారు.
ఏపీ సీఎం చంద్రబాబు కుటుంబ ఆస్తులపై లోకేష్ చేసిన ప్రకటన అబద్ధమని తెలిపారు. వాస్తవ ఆస్తులు ప్రకటించామని, తమకు బినామీలు లేరని చంద్రబాబు కాణిపాకం వద్ద ప్రమాణం చేయగలరా అని ఆయన ప్రశ్నించారు. తన ఆస్తులు రూ.40 లక్షలే అంటున్న చంద్రబాబు కోటి రూపాయలకు వాటిని అమ్ముతారా అంటూ రఘువీరా నిలదీశారు.