దోచుకోవడం..దాచుకోవడమే.. | appcc chief raghuveera slams on tdp government | Sakshi
Sakshi News home page

దోచుకోవడం..దాచుకోవడమే..

Published Thu, Jul 9 2015 10:57 AM | Last Updated on Thu, Apr 4 2019 12:50 PM

దోచుకోవడం..దాచుకోవడమే.. - Sakshi

దోచుకోవడం..దాచుకోవడమే..

అనంతపురం: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పై ఆ రాష్ట్ర పీసీసీ చీఫ్ రఘవీరా రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అనంతపురంలో గురువారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ. రాష్ట్రంలో ఆటవిక రాజ్యం, అవినీతి రాజ్యం నడుస్తోందన్నారు. జన్మభూమి కమిటీ సభ్యుడి నుంచి మొదలుకొని సీఎం చంద్రబాబు వరకు దోచుకోవడం..దాచుకోవడమే సింగిల్ ఎజెండా గా పెట్టుకున్నారన్నారు. వారు చేసే పనికి ఎవరు అడ్డొచ్చినా ఖాతరు చేయడంలేదన్నారు.

తాజాగా దెందులూరులో మహిళా ఎమ్మార్వో వనజాక్షిపై టీడీపీ ఎమ్మెల్యే, ఆయన అనుచరులు దాడి చేసిన ఘటనే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ అని అన్నారు. రాష్ట్రంలో ప్రతి ఒక్క టీడీపీ ఎమ్మెల్యే ఈ విధంగానే ఉన్నారని విమర్శించారు. అవినీతి, దౌర్జన్యాలపై ఆదేశాలు జారీ చేస్తే ప్రభుత్వ అధికారులకు తలనొప్పి ఉండదన్నారు.

ఏపీ కి ప్రత్యేక హోదాపై ప్రశ్నించే హక్కు పవన్కే కాదు ఎవరికైనా ఉందని తెలిపారు. హంద్రీనీవా ప్రాజెక్ట్ కు మాజీ ఎంపీ అనంతవెంకటరెడ్డి పేరును తొలగించడం దారుణమన్నారు.ఈ నెల 24 న కాంగ్రె స్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అనంతపురంలో పర్యటిస్తారని తెలియజేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement