appcc
-
ఏపీ కాంగ్రెస్ అభ్యర్థుల దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం
ఎన్టీఆర్, సాక్షి: ఏపీ అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ కసరత్తులు ప్రారంభించింది. అసెంబ్లీతో పాటు పార్లమెంట్ ఎన్నికల అభ్యర్ధుల కోసం దరఖాస్తు స్వీకరణ ప్రక్రియను ప్రారంభించింది. బుధవారం ఉదయం ఆశావహులు అప్లికేషన్లను విజయవాడలోని పార్టీ కార్యాలయంలో ఏపీ వ్యవహారాల ఇంఛార్జి మాణిక్యం ఠాగూర్‌కు అందించారు. మొదటి అప్లికేషన్ మడకశిర నుంచి సుధాకర్ సమర్పించగా.. రెండవ అప్లికేషన్ గుంటూరు తూర్పు నుంచి మస్తాన్ వలీ ఇచ్చారు. మూడవ అప్లికేషన్ బద్వేల్ నుంచి కమలమ్మ సమర్పించారు. ఈ సందర్భంగా ప్రతీ కాంగ్రెస్ కార్యకర్తకు అప్లికేషన్ సమర్పించే అవకాశం ఉందని మాణిక్యం ఠాగూర్ వెల్లడించారు. ‘‘ఏపీలో కాంగ్రెస్ పార్టీ 175 అసెంబ్లీ, 25 పార్లమెంటు స్ధానాలకు అభ్యర్ధులను నిర్ణయిస్తుంది. ప్రతీ కాంగ్రెస్ కార్యకర్తకు అప్లికేషన్ తీసుకునే అవకాశం ఉంది. అప్లికేషన్లు మధుసూధన్ మిస్త్రీ ఆధ్వర్యంలోని స్టీరింగ్ కమిటీ పరిశీలిస్తుంది. మాజీలంతా నిజమైన కాంగ్రెస్‌లోకి రావాలని ఆహ్వానిస్తున్నాం. ఆళ్ల రామకృష్ణారెడ్డి(ఆర్కే) పోటీ చేసే స్ధానంపై త్వరలోనే స్పష్టత వస్తుందని అని అన్నారాయన. -
పీసీసీ ఉపాధ్యక్షుడిగా శ్రీపతి ప్రకాశం
సాక్షి, ఒంగోలు: ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(పీసీసీ )ఉపాధ్యక్షుడిగా సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, న్యాయవాది శ్రీపతి ప్రకాశంను నియమించారు. ఈ మేరకు ఏఐసీసీ కేంద్ర కార్యాలయం నుంచి ఉత్తర్వులు వచ్చాయి. అందులో భాగంగా పీసీసీ కార్యాలయం నుంచి నియామక పత్రాన్ని శ్రీపతి ప్రకాశంకు పంపించారు. శ్రీపతి ప్రకాశం టంగుటూరు మండలం కాకుటూరువారి పాలెం ఆయన జన్మస్థలం. విద్యాభ్యాసం నెల్లూరు జిల్లా కావలిలోని జవహర్ భారతి కాలేజీ, ఒంగోలులో తన విద్యాభ్యాసం పూర్తి చేశారు. ఒంగోలులోని ఇందిరా ప్రయదర్శిని లా కాలేజీలో న్యాయవాద పట్టా పుచ్చుకున్నారు. అనంతరం న్యాయవాద వృత్తి కొనసాగిస్తూ వచ్చారు. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు లోనై 1978లో యూత్ కాంగ్రెస్‌లో చేరి తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. అప్పటి నుంచి పారీ్టలో పలు పదవులు అలంకరించారు. స్టేట్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ, ఎస్టీ సెల్ కన్వీనర్‌గా, జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడిగా, ఆలిండియా టెలియం అడ్వైజరీ కమిటీ మెంబర్‌గా, ఉమన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డైరెక్టర్‌గా, ఆలిండియా కోర్ బోర్డు మెంబర్‌గా, ఆలిండియా సోలార్ బోర్డు మెంబర్‌గా, ఆలిండియా టెక్స్టైల్స్ బోర్డు మెంబర్‌గా వివిధ పదవులు అలంకరించారు. 2015లో కాంగ్రెస్ పార్టీ ఒంగోలు నగర అధ్యక్షుడిగా పదవిని చేపట్టి నేటికీ కొనసాగుతున్నారు. 2019లో కొండపి అసెంబ్లీకి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. శ్రీపతి ప్రకాశంకు నలుగురు సంతానం. వారిలో ఇద్దరు అబ్బాయిలు, ఇద్దరు అమ్మాయిలు. ఈ సందర్భంగా శ్రీపతి మాట్లాడుతూ 42ఏళ్లుగా పారీ్టకి సేవ చేసినందుకు గుర్తుగా తనకు ఈ అవకాశాన్ని అందించారని శ్రీపతి ప్రకాశం ఉధ్ఘాటించారు. పారీ్టనే నమ్ముకుని నాలుగు దశాబ్దాలుగా సేవలు చేశానని ఆయన పేర్కొన్నారు. తన సేవలను గుర్తించి పారీ్టకి చేసిన సేవలకు గుర్తుగా పీసీసీ ఉపాధ్యక్ష పదవి ఇచ్చినందుకు ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి, తమ నేత రాహుల్ గాందీకి, పీసీసీ అధ్యక్షుడు సాకె శైలజానా«థ్‌కు, మాజీ కేంద్ర మంత్రి జేడీ శీలంకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. జిల్లా అధ్యక్షుడిగా ఈదా కొనసాగింపు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు(పీసీసీ) రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం నూతన కమిటీలను ఎన్నుకోవడం జరిగింది. అందులో భాగంగా ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడుగా ఈదా సుధాకరరెడ్డిని తిరిగి రెండోసారి జిల్లా అధ్యక్షుడిగా ఆవకాశం కలి్పస్తూ నిర్ణయం తీసుకుంది. తొలిసారిగా 2017 ఫిబ్రవరి 20వ తేదీన అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఈదా మాట్లాడుతూ నాపై నమ్మకం ఉంచి రెండోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగించినందుకు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు (పీసీసీ) సాకె శైలజనాథ్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. పార్టీ పటిష్టతకు కృషి చేస్తానన్నారు. -
కలాంకు ఏపీ పీసీసీ ఘన నివాళి
సాక్షి, హైదరాబాద్: మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం దేశానికి చేసిన సేవలు చిరస్మరణీయమని కాంగ్రెస్ నేతలు కొనియాడారు. పీసీసీ ఉపాధ్యక్షుడు మాదాసు గంగాధరం, మాజీ మంత్రి శైలజానాథ్, మాజీ ఎంపీ తులసిరెడ్డి, రాష్ట్ర కిసాన్ సెల్ చైర్మన్ రవిచంద్రారెడ్డి తదితరులు మంగళవారం ఇందిర భవనలో అబ్దుల్ కలాం చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా అబ్దుల్ కలాం చేసిన సేవలను, వ్యక్తిత్వాన్ని స్మరించుకుంటూ దేశ చరిత్రలో ఆయన పేరు సుస్థిరంగా నిలుస్తుందన్నారు. హైదరబాద్‌తో ఆయనకున్న అనుబంధాన్ని వారు గుర్తు చేసుకున్నారు. -
వనజాక్షి ఘటనే కాదు.. ఇంకా అలంటావి ఎన్నో
హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో వచ్చిన సంక్షేమ పథకాలను టీడీపీ ప్రభుత్వం నీరుగారుస్తోందని ఆంధప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ రఘువీరారెడ్డి ఆరోపించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఆయన ప్రభుత్వ నేతలు పూర్తిగా విస్మరించారని మండిపడ్డారు. ఏపీలో జరిగిన రైతు ఆత్మహత్యలన్నీ కూడా సర్కార్ హత్యలేనని ఆరోపించారు. తహశీల్దార్ వనజాక్షి ఘటన ఒక్కటే వెలుగులోకి వచ్చిందని, ఇంకా వెలుగులోకి రానీ ఎన్నో సంఘటనలు ఉన్నాయని చెప్పారు. ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ను కాపాడేందుకు సీఎం పదవిని దుర్వినియోగం చేస్తున్నారని రఘువీరా విమర్శించారు. -
దోచుకోవడం..దాచుకోవడమే..
అనంతపురం: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పై ఆ రాష్ట్ర పీసీసీ చీఫ్ రఘవీరా రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అనంతపురంలో గురువారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ. రాష్ట్రంలో ఆటవిక రాజ్యం, అవినీతి రాజ్యం నడుస్తోందన్నారు. జన్మభూమి కమిటీ సభ్యుడి నుంచి మొదలుకొని సీఎం చంద్రబాబు వరకు దోచుకోవడం..దాచుకోవడమే సింగిల్ ఎజెండా గా పెట్టుకున్నారన్నారు. వారు చేసే పనికి ఎవరు అడ్డొచ్చినా ఖాతరు చేయడంలేదన్నారు. తాజాగా దెందులూరులో మహిళా ఎమ్మార్వో వనజాక్షిపై టీడీపీ ఎమ్మెల్యే, ఆయన అనుచరులు దాడి చేసిన ఘటనే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ అని అన్నారు. రాష్ట్రంలో ప్రతి ఒక్క టీడీపీ ఎమ్మెల్యే ఈ విధంగానే ఉన్నారని విమర్శించారు. అవినీతి, దౌర్జన్యాలపై ఆదేశాలు జారీ చేస్తే ప్రభుత్వ అధికారులకు తలనొప్పి ఉండదన్నారు. ఏపీ కి ప్రత్యేక హోదాపై ప్రశ్నించే హక్కు పవన్‌కే కాదు ఎవరికైనా ఉందని తెలిపారు. హంద్రీనీవా ప్రాజెక్ట్ కు మాజీ ఎంపీ అనంతవెంకటరెడ్డి పేరును తొలగించడం దారుణమన్నారు.ఈ నెల 24 న కాంగ్రె స్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అనంతపురంలో పర్యటిస్తారని తెలియజేశారు. -
'బాబు నిరుద్యోగులతో ఆడుకుంటున్నారు'
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ లోఉపాధ్యాయ నియామకాలు, రైతాంగ సమస్యలను చంద్రబాబు సర్కార్ పట్టించుకోవడం లేదని ఏపీ కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. కాగా ఇదే విషయమై ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి, కాంగ్రెస్ ముఖ్యనేతలు బుధవారం గవర్నర్ నరసింహన్ ను కలిసారు. ఏపీలో సమస్యల పరిష్కారం కోసం జోక్యం చేసుకోవల్సిందిగా కాంగ్రెస్ నేతలు గవర్నర్ ను కోరారు. అనంతరం రఘువీరా రెడ్డి మాట్లాడుతూ ఎస్జీటీ పోస్టులకు బీఈడీ అభ్యర్థులకు అనుమతించాలని ఆయన డిమాండ్ చేశారు. రైతులకు పంటబీమా, ఇన్పుట్ సబ్బిడీ చెల్లించడంలో ప్రభుత్వం జాప్యం చేస్తోందని విమర్శించారు. బాబు సర్కార్ నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడుకుంటోందని మండిపడ్డారు. -
' అడ్రస్ లేని పార్టీకి ఆయన నాయకుడు'
హైదరాబాద్ : ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి పై మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆయన గురువారమిక్కడ మాట్లాడుతూ అడ్రస్ లేని పార్టీకి రఘువీరా నాయకుడని విమర్శించారు. పట్టిసీమపై రఘవీరా రెడ్డి చేసిన విమర్శలను ఆయన ఖండించారు. చిన్నబాస్ కు రూ.500 కోట్లు ముట్టాయనడం కాదు..ఆధారాలు ఉంటే చూపాలన్నారు. విమర్శలు చేసే ముందు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని రఘువీరారెడ్డి కి ఆయన సూచించారు. -
'ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలి'
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ శుక్రవారం నుంచి కోటి సంతకాల సేకరణ ఉద్యమాన్ని చేపట్టనున్నామని పీసీసీ చీఫ్ రఘవీరారెడ్డి అన్నారు. పోలవరం ప్రాజెక్టు స్థలం వద్ద శుక్రవారం ఉదయం 11 గంటలకు సంతకాల సేకరణను ప్రారంభించనున్నట్టు ఆయన చెప్పారు. అక్కడ ఏర్పాటు చేసిన సభలో ఏపీ కాంగ్రెస్ సీనియర్ నేతలు అందరూ పాల్గొంటారు. విభజన హామీలను కేంద్రం అమలు చేసేలా రాష్ట్రం ఒత్తిడి తేవాలని కాంగ్రెస్ నిర్ణయించింది. -
ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లండి
అనంతపురం టౌన్ : 'ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చిన తరువాత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అమలు చేయలేదు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లి చైతన్యపర్చండి' అని అనంతపురం జిల్లాలోని మండల పార్టీ కార్యవర్గ సభ్యులకు పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి సూచించారు. సభ్యత్వ నమోదును గ్రామ స్థాయి నుంచి చేయించాలన్నారు. మంగళవారం జిల్లా కాంగ్రెస్‌పార్టీ కార్యాలయంలో డీసీసీ అధ్యక్షుడు కోటా సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన సమావేశానికి రఘువీరారెడ్డితో పాటు మాజీ మంత్రి శైలజానాథ్ ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రఘువీరెడ్డి మాట్లాడుతూ ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చిన తరువాత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అమలు చేయలేదన్నారు. రైతులకు రుణమాఫీ మొదలు ఏ ఒక్క హామీని అమలు చేయలేదన్నారు. ఇలా దొంగ దెబ్బ తీయడం తెలుగుదేశం పార్టీకి అలవాటే అన్నారు. ఆ పార్టీ అధికారంలోకి వచ్చి నవమాసాలు కాకముందే ప్రజలతో పెట్టుకున్న బంధం తెగిపోతోందన్నారు. ప్రజలు ఆ పార్టీని విశ్వసించడం లేదన్నారు. ఆ పార్టీ కూడా ప్రజలను విశ్వసించడం లేదన్నారు. హామీలను అమలు చేయడంలో ఘోరం గా విఫలమైన ప్రభుత్వ తీరును ప్రజల్లోకి తీసుకెళ్లి చైతన్యపర్చాలని సూచించారు. -
వెళ్లే వారేతప్ప... వచ్చే వారేరీ?
కాంగ్రెస్ నుంచి రోజురోజుకూ పెరిగిపోతున్న వలసలు ఏపీపీసీసీ అగ్రనేతలను తీవ్రంగా కలవరపరుస్తోంది. మంత్రులుగా పనిచేసిన వారు, ఎమ్మెల్యేలు, ఎంపీలు పార్టీని వీడగా ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యేలు, ద్వితీయ శ్రేణి నేతలు సైతం ఇతర పార్టీల్లోకి వెళ్లిపోతుండడం రాష్ట్ర పార్టీ ముఖ్యులను ఆందోళనకు గురిచేస్తోంది. మున్సిపల్, స్థానిక సంస్థల ఎన్నికలు, ఆపై సాధారణ ఎన్నికలు వరుసపెట్టి జరగనుండడంతో వీటిని ఎలా ఎదుర్కొనాలో తర్జనభర్జన పడుతున్నారు. పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి, కేంద్రమంత్రి చిరంజీవి, సీనియర్‌నేతలు బొత్స సత్యనారాయణ, ఆనం రామనారాయణరెడ్డి, సి.రామచంద్రయ్య, వట్టి వసంతకుమార్, మాదాసు గంగాధరం తదితర నేతలు సోమవారం భేటీ అయి తాజా పరిస్థితిపై చర్చించారు. గత కేబినెట్లోని రఘువీరారెడ్డి (పీసీసీ ప్రస్తుత చీఫ్) బొత్స సత్యనారాయణ (మాజీ చీఫ్), ఆనం రామనారాయణరెడ్డి, కన్నా లక్ష్మీనారాయణ, సి.రామచంద్రయ్య, కొండ్రు మురళి మాత్రమే మిగిలారు. మిగతా సీమాంధ్ర మంత్రుల్లో పలువురు ఇప్పటికే ఇతర పార్టీల్లో చేరగా, తక్కినవారు రేపోమాపో కాంగ్రెస్‌ను వీడుతారని ప్రచారం జరుగుతోంది. కేంద్రమంత్రుల్లో పురందేశ్వరి బీజేపీలో చేరగా ఇతర మంత్రులు పోటీకి గడ్డుపరిస్థితులు ఎదుర్కొంటున్నారు. ఎంపీలు మొత్తం పార్టీని వీడారు. సీమాంధ్రకు చెందిన 97 మంది పార్టీ ఎమ్మెల్యేల్లో మిగిలిన వారి సంఖ్య వేళ్లమీద లెక్కించేలా మారింది. ఈ తరుణంలో వచ్చే ఎన్నికలకు పార్టీ తరఫున పోటీచేసే అభ్యర్థులే కరవయ్యారు. నేతలు వలసలు పోయిన నియోజక వర్గాల్లో ప్రత్యామ్నాయ నేతలపై దృష్టి సారించాలని నిర్ణయించారు. యువజన కాంగ్రెస్, ఎన్ఎస్యూఐ, మహిళా విభాగాలలోని నేతలను పోటీకి అంగీకరించేలా చర్యలు తీసుకోవాలని భావిస్తున్నారు.