
' అడ్రస్ లేని పార్టీకి ఆయన నాయకుడు'
హైదరాబాద్ : ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి పై మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆయన గురువారమిక్కడ మాట్లాడుతూ అడ్రస్ లేని పార్టీకి రఘువీరా నాయకుడని విమర్శించారు. పట్టిసీమపై రఘవీరా రెడ్డి చేసిన విమర్శలను ఆయన ఖండించారు. చిన్నబాస్ కు రూ.500 కోట్లు ముట్టాయనడం కాదు..ఆధారాలు ఉంటే చూపాలన్నారు. విమర్శలు చేసే ముందు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని రఘువీరారెడ్డి కి ఆయన సూచించారు.