prattipati pullarao
-
అగ్రిగోల్డ్ బూచి... ప్రత్తిపాటి భూముల లాలూచీ
సాక్షి, అమరావతి: సామాన్య డిపాజిటర్లను నిండా ముంచేసిన అగ్రిగోల్డ్ కుంభకోణం మాటున టీడీపీ పెద్దలు కొల్లగొట్టిన భూములపై ప్రభుత్వం కొరఢా ఝళిపించింది. అందులో మొదటి అడుగుగా టీడీపీ ప్రభుత్వంలో మంత్రిగా చేసిన ప్రత్తిపాటి పుల్లారావు కుటుంబం అగ్రిగోల్డ్ నుంచి కొల్లగొట్టిన భూములను అటాచ్ చేయాలని నిర్ణయించింది. పుల్లారావు కుటుంబానికి చెందిన 6.19 ఎకరాలను అటాచ్ చేసేందుకు సీఐడీకి అనుమతిస్తూ హోమ్ శాఖ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అగ్రిగోల్డ్ కుంభకోణాన్ని ఆసరాగా చేసుకొని టీడీపీ నేతలు ఆ సంస్థకు చెందిన భూములను కొల్లగొట్టారు. ప్రత్తిపాటి పుల్లారావు కుటుంబం కూడా ఆ భూ దోపిడీలో అడ్డగోలుగా లబ్ధి పొందింది. బాపట్ల జిల్లా సంతమాగులూరు మండలం (అప్పటి ప్రకాశం జిల్లా) గురిజేపల్లిలోని సర్వే నంబర్లు 104/1, 104/3, 104/4, 104/5, 104/6, 103/2లో ఉన్న 6.19 ఎకరాలను హస్తగతం చేసుకుంది. అప్పటికే అగ్రిగోల్డ్ కంపెనీపై కేసు నమోదైంది. ఆ కేసు పేరుతో భయపెట్టి సెటిల్మెంట్ కింద ఆ భూమి తమ పరం చేసేలా డీల్ కుదుర్చుకున్నారు. అగ్రిగోల్డ్ డైరెక్టర్‌గా వ్యవహరించిన కనుకొల్లు ఉదయ్ దినకర్ పేరిట ఉన్న ఆ 6.19 ఎకరాలను పుల్లారావు భార్య తేనే వెంకాయమ్మ పేరిట బదిలీ చేశారు. ఈమేరకు గుంటూరు జిల్లా చిలకలూరిపేట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో 2015లో రిజిస్ట్రేషన్ చేయించారు. అనంతరం గుట్టు చప్పుడు కాకుండా ఆ భూములను కామేపల్లి లక్ష్మీ ప్రసాద్, చెరుకూరి కోటేశ్వరరావు, కామేపల్లి గ్రానైట్స్ పేరిట బదిలీ చేసేశారు. ఈ విధంగా అగ్రిగోల్డ్ భూములను హస్తగతం చేసుకున్నారు. అటాచ్‌మెంట్‌కు అనుమతి ఈ కేసు దర్యాప్తును సీఐడీ అధికారులు వేగవంతం చేశారు. డిపాజిటర్ల నిధులతో అగ్రిగోల్డ్ కంపెనీ కొనుగోలు చేసిన భూములను ప్రత్తిపాటి పుల్లారావు కుటుంబం దక్కించుకుందని గుర్తించారు. దాంతో ఆ భూములను అటాచ్ చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు సీఐడీ పంపిన ప్రతిపాదనలను హోమ్ శాఖ ఆమోదించి అటాచ్‌మెంట్‌కు అనుమతి జారీ చేసింది. -
మంత్రి ప్రత్తిపాటికి చెప్పినా...
సాక్షి, గుంటూరు: మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు చెప్పినా తన నియోజకవర్గంలో భూ అక్రమాలు ఆగడం లేదని మాజీ మంత్రి రావెల కిశోర్‌బాబు వాపోయారు. గుంటూరు రూరల్ మండలం ఓబులనాయుడిపాలెం క్వారీల్లో బుధవారం ఆయన ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. మట్టిని అక్రమంగా తవ్వుతున్నారని, ఇప్పటికే వంద కోట్ల రూపాయల విలువైన మట్టిని తరలించారని ఈ సందర్భంగా ఆరోపించారు. మైనింగ్, రెవిన్యూ, పోలీస్ అధికారులకు మామూళ్లు అందాయని పేర్కొన్నారు. తన నియోజకవర్గంలో భూ అక్రమాలు జరగడం వల్ల తన పాత్ర ఉందని చాలా మంది అనుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కొంతమంది దుర్బుద్ధి వల్ల ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోందన్నారు. కాగా, మంత్రికి ఫిర్యాదు చేసినా అక్రమాలు ఆగడం లేదని సాక్షాత్తూ అధికార పార్టీకి చెందిన మాజీ మంత్రి చెప్పడం ఏపీలో భారీ ఎత్తున జరుగుతున్న అవినీతి అక్రమాలకు అద్దం పడుతోందని రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. -
‘ఏ ఒక్క మంత్రికి వ్యవసాయం అంటే తెలియదు’
హైదరాబాద్: అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్ కాస్త...దుర్భిక్ష ఆంధ్రప్రదేశ్‌గా మారిందని వైఎస్ఆర్ సీపీ రైతు విభాగం అధ్యక్షుడు ఎంవీఎస్ నాగిరెడ్డి అన్నారు. ఆయన సోమవారమిక్కడ మాట్లాడుతూ.. ఏపీ కేబినెట్లో ఏ ఒక్క మంత్రికి వ్యవసాయం అంటే తెలియదని, జగన్‌ను తిట్టడమే వ్యవసాయ శాఖమంత్రి ప్రత్తిపాటి పుల్లారావుకి దినచర్యగా మారిందని విమర్శించారు. రాష్ట్రంలో వ్యవసాయ రంగం సంక్షోభంలో కూరుకుపోయిందని, మూడో విడత రుణమాఫీ ఇంకా రైతులకు చెల్లించలేదన్నారు. రాయలసీమ కరువుతో అల్లాడిపోతోందని, రైతులు నష్టపోతుంటే వ్యవసాయ మంత్రి చోద్యం చూస్తున్నారని నాగిరెడ్డి ధ్వజమెత్తారు. తొమ్మిది గంటల ఉచిత విద్యుత్ హామీని వెంటనే అమలు చేయాలని, ఇన్పుట్ సబ్సిడీ బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. వలసలను ఆపి రైతులను ఆదుకునే చర్యలు చేపట్టాలని నాగిరెడ్డి సూచించారు. -
పిచ్చి పుల్లయ్యలా తయారయ్యారు!
మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు పేరుకు తగ్గట్లే పిచ్చిపుల్లయ్యలా తయారయ్యారని వైఎస్ఆర్సీపీ నాయకుడు గౌతం రెడ్డి మండిపడ్డారు. ఆయన తీరు పిచ్చి ముదిరి రోకలి తలకు చుట్టుకున్నట్లుందని ఎద్దేవా చేశారు. తాను అగ్రిగోల్డ్ సంస్థకు లీగల్ అడ్వైజర్‌నని ఆయన చెప్పారని, దమ్ముంటే దాన్ని నిరూపించాలని చాలెంజ్ చేశారు. ఈ విషయమై ఆయన శనివారం విజయవాడలో మీడియాతో మాట్లాడారు. ఇప్పటికే హైకోర్టు ఆదేశాల మేరకు ఒక విషయంపై విచారణ పూర్తికాగా, దానిపై ఆయన విచారణకు ఆదేశిస్తామంటున్నారని, ఇదెక్కడి వ్యవహారమని ప్రశ్నించారు. చంద్రబాబు మాట్లాడమంటే ఈయనేదో మాట్లాడేస్తారని విమర్శించారు. రెండు ఎకరాల భూమి కొన్న వ్యక్తి తన భూమికి దారి లేదని, దారి చూపించాలని అడిగితే.. దానిపై హైకోర్టు ఆదేశాల మేరకు సీబీసీఐడీ విచారణ జరిగిందని ఆయన తెలిపారు. ఈ భూములతో తనకు గానీ, తన కుమారుడికి గానీ సంబంధం లేదని పోలీసులు తమ నివేదికలో తెలిపారని, అలాగే అగ్రిగోల్డ్‌తో కూడా సంబంధం లేదని చెప్పారని.. స్వయంగా డీజీపీయే దీనిపై డిక్లరేషన్ ఇచ్చారని అన్నారు. మీ పోలీసులు ఇచ్చిన నివేదికలను మీరు నమ్మరా అని ప్రత్తిపాటి పుల్లారావును గౌతం రెడ్డి ప్రశ్నించారు. ఇప్పటికే విచారణ అయిపోయిన తర్వాత.. మళ్లీ ఇప్పుడు విచారణకు ఆదేశిస్తామంటున్నారని ఎద్దేవా చేశారు. అగ్రిగోల్డ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నుంచి కొన్నట్లు ఆయనే చెప్పారని.. తాను మాత్రం రైతుల నుంచి తన కుమారుడి పేరు మీద కొన్నానని చెప్పారు. తాను కూడా అగ్రిగోల్డ్ బాధితుల్లో ఒకడినని, తనకు రావాల్సింది అడగలేని పరిస్థితుల్లో ఉన్నానని తెలిపారు. రాష్ట్రంలో 18 లక్షల మందికి పైగా ఉన్నబాధితుల గోడును వినిపించుకోవడం లేదని, ప్రత్తిపాటి పుల్లారావు మీద పరువునష్టం దావా వేస్తానని ఆయన స్పష్టం చేశారు. -
పిచ్చి పుల్లయ్యలా తయారయ్యారు!
-
దినకరన్ వద్ద భూములు కొన్నాను
-
దినకరన్ వద్ద భూములు కొన్నాను: మంత్రి ప్రత్తిపాటి
విజయవాడ: అగ్రిగోల్డ్ భూముల కొనుగోలు విషయంలో తనపై వచ్చిన ఆరోపణలను ఏపీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఖండించారు. అగ్రిగోల్డ్ భూముల కొనుగోలులో తనపై వచ్చిన ఆరోపణలపై విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. అగ్రిగోల్డ్ సంస్థల్లో, హాయ్‌ల్యాండ్ ప్రాపర్టీకి కూడా డైరెక్టర్‌గా ఉన్న దినకరన్ వద్ద తాను కొన్న భూములకు, ఆరోపణలు వెల్లువెత్తుతున్న అగ్రిగోల్డ్ భూములకు సంబంధం లేదన్నారు. అగ్రిగోల్డ్ సంస్థలో దినకరన్ ప్రొఫెషనల్ డైరెక్టర్ మాత్రమేనని తెలిపారు. తాను ముగ్గురు రైతుల వద్ద 14 ఎకరాలు కొన్నట్లు చెప్పారు. అదే విధంగా ఉదయ్ దినకరన్ వద్ద మరో 6 ఎకరాలు కొనుగోలు చేసినట్లు మంత్రి ప్రత్తిపాటి అంగీకరించారు. తనపై వచ్చిన ఆరోపణలను ప్రతిపక్ష వైఎస్ఆర్ సీపీ నేతలు రుజువు చేయలేకపోయారని పేర్కొన్నారు. మరోవైపు అగ్రిగోల్డ్ భూముల కొనుగోలు విషయంలో మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుపై తాను చేసిన ఆరోపణలన్నింటినీ నిరూపిస్తానని, అందుకు తనకు 20 నిమిషాల సమయం ఇవ్వాలని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కోరగా సభలో ఆయనకు అవకాశం ఇవ్వలేదన్న విషయం తెలిసిందే. -
ఇది వేల కోట్ల స్కాం.. సీబీఐ విచారణ అవసరం
-
ఇది వేల కోట్ల స్కాం.. సీబీఐ విచారణ అవసరం
అగ్రిగోల్డ్ పేరుతో జరిగినది వేల కోట్లతో కూడిన అతిపెద్ద స్కాం అని, ఇందులో 20 లక్షల కుటుంబాలకు నెత్తిన టోపీ పెట్టారని ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. దీనిపై హైకోర్టు జడ్జి ఆధ్వర్యంలో సీబీఐ విచారణ జరగాలని డిమాండ్ చేశారు. అదే సమయంలో సంస్థ భూములు, ఇతర ఆస్తులను వేలం వేసి మొత్తం బాధితులందరికీ వాళ్ల సొమ్ము ఇచ్చి న్యాయం చేయాలని కోరారు. అగ్రిగోల్డ్ అంశం గురించి అసెంబ్లీలో మాట్లాడేందుకు, తనకు బాధితులు ఇచ్చిన ఆధారాలను చూపించేందుకు అవకాశం ఇవ్వకపోవడంతో శుక్రవారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడారు. దానిపై ఆయన ఏమన్నారంటే... ఈరోజు అసెంబ్లీ జరిగిన తీరును అంతా చూసే ఉంటారు ఇంత దారుణమైన కౌరవ సభ దేశంలో ఎక్కడా ఉండి ఉండదు సాక్ష్యాధారాలు చూపిస్తూ, 20 నిమిషాల టైం ఇవ్వండి, ఆధారాలతో నిరూపిస్తానన్నాను అగ్రిగోల్డ్ సమస్య నాకు.. పుల్లారావుకు మధ్య వ్యక్తిగత సమస్య కాదని చెప్పాను ఆ టైం ఆయన ఇచ్చి ఉంటే ఈ ప్రెస్‌మీట్ పెట్టాల్సిన అవసరం ఉండేది కాదు నేను చూపుతున్న ఈ ఆధారాలతో అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం జరుగుతుందని అన్నాను బాధితులే ఈ ఆధారాలను తీసుకొచ్చి నాకు ఇచ్చారు.. ఇవేవో నేను తెచ్చినవి కావు ఈ ఆస్తులన్నీ బయటకు వెళ్లిపోతే తమకు డబ్బులు రావని.. పెద్దలు గద్దల్లా తన్నుకుపోతున్నారని చెప్పారు అందుకే ఈ ఆధారాలను మాకు తీసుకొచ్చి ఇచ్చారు మాకు ఇవ్వాల్సిన సొమ్ము రాకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు కానీ గురువారం అగ్రిగోల్డ్ టాపిక్ జరుగుతుంటే మధ్యలో స్పీకర్ మైక్ కట్ చేశారు ఆడవాళ్ల గురించి తాను చేసిన వ్యాఖ్యల గురించిన ప్రెస్‌మీట్ వీడియోను ప్రదర్శించి చూపించారు అంత దారుణంగా విషయాన్ని డైవర్ట్ చేశారు ఈరోజు కూడా అలాగే జరిగింది.. ఆధారాలు ఉన్నాయి, చూపిస్తానంటే అవకాశం ఇవ్వలేదు వాళ్ల ఆస్తులను కాపాడాల్సిన ప్రభుత్వమే గద్దల మాదిరిగా తన్నుకుపోతోంది ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. నాకు చాలెంజ్ చేస్తారు 20 లక్షల కుటుంబాలకు టోపీ పెట్టి, వేలకోట్లు మింగేసిన అతిపెద్ద స్కాం ఈ స్కాంలో పుల్లారావు అనే వ్యక్తి చిన్న చీమలాంటి వారు ఈయన లాంటివాళ్లు చాలామంది పెద్దమనుషులున్నారు.. వాళ్ల పేర్లు బయటకు రావాలి ఆ పెద్దమనుషుల చేతుల్లోంచి అగ్రిగోల్డ్ ఆస్తులను కాపాడాలి వాటిని మళ్లీ అటాచ్మెంట్లోకి తీసుకొచ్చి, డిపాజిట్ దారులకు మేలు జరిగేలా చూడాలి ఆస్తులను అమ్మి వాళ్లకు డబ్బులు ఇప్పించాలి మాట్లాడలేని ఆ గొంతుకలను నేను అసెంబ్లీలో వినిపించే ప్రయత్నం చేశాను దానికి నాకు, పుల్లారావుకు మధ్య ఏదో గొడవ ఉన్నట్లు చూపించారు సభలో ఆయనైనా ఉండాలట.. లేకపోతే నేనైనా ఉండాలట. అసెంబ్లీలో ప్రభుత్వం చేసిన తీర్మానం వల్ల అగ్రిగోల్డ్ బాధితులకు మంచి ఏమైనా జరుగుతుందా? ఆరోపణలు వినాలన్న ఉద్దేశం లేదు గానీ టాపిక్‌ను డైవర్ట్ చేస్తున్నారు దేశంలో బోఫోర్స్, స్పెక్ట్రం, కోల్ స్కాంల మీద విచారణ ఎలా మొదలైంది.. ప్రతిపక్షాలు తమవద్ద ఉన్న ఆధారాలను పార్లమెంటులో ప్రస్తావిస్తే చర్చ జరిగి ఆ తర్వాత విచారణ జరిగింది, అప్పుడే స్కాంలు బయటకు వచ్చాయి ఇప్పుడు పరిస్థితి ఏంటంటే.. బాధితులు ఇచ్చిన ఆధారాలను చూపించడానికి అసెంబ్లీలో 20 నిమిషాల సమయం అడిగినా ఇవ్వకుండా చాలెంజ్ అనే కొత్తపేరు తీసుకొచ్చారు ఇదే చంద్రబాబును అడుగుతున్నా.. చాలెంజ్ మీద నమ్మకం ఉంటే ఇదే సభలో ఎన్నిసార్లు మేం చాలెంజ్ చేశాం.. ఆయనేమైనా స్పందించారా? 21 మంది మా శాసన సభ్యులను కండువాలు కప్పి మీవైపు కూర్చోబెట్టుకున్నావు ఆ 21 మంది నీ పార్టీ గుర్తుతో గెలవలేదు.. వాళ్ల మీద అనర్హత వేటు పడకుండా సీఎం, స్పీకర్ కలిసి నాటకం ఆడుతున్నారు వాళ్లంతా అధికారపక్షం బెంచీలలో కూర్చున్నారు. వాళ్లను ఎందుకు అనర్హులుగా ప్రకటించడం లేదు ప్రజల మీద నమ్మకం ఉంటే, వాళ్లపై అనర్హత వేటు వేసి, నీ పార్టీ గుర్తుమీద వాళ్లను పోటీ చేయించు ప్రజలిచ్చే మాండేట్ను రిఫరెండంగా తీసుకుందాం.. మాకు మెజారిటీ వస్తే దాన్ని ప్రజాతీర్పుగా తీసుకొమ్మని సవాలు చేశాం తెలంగాణలో కోట్ల రూపాయల లంచం ఇస్తూ ఆడియో, వీడియో టేపులతో అడ్డంగా దొరికిపోయారు సుప్రీంకోర్టు ఆ కేసులో చంద్రబాబుకు నోటీసులు ఇచ్చారు. ఆ గొంతు చంద్రబాబుది కాదని నిరూపించగలరా అని చాలెంజ్ చేశాం.. వినలేదు ఆయన చాలెంజ్ తీసుకోరు గానీ, అవతలి వాళ్లు మాత్రం రెచ్చిపోయి, చాలెంజ్ తీసుకోవాలట. లేకపోతే ఏదో తప్పు చేసినట్లు అవుతుందట అసలు ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాన్ని మాట్లాడనివ్వాలి.. ఆరోపణలు వచ్చినప్పుడు సాక్ష్యాలలో పస ఉంటే విచారణ పిలిపించాలి 16 ఎకరాల హాయ్‌ల్యాండ్ భూములను ఎందుకు వేలం వేశారో ఎవరికీ తెలియదు విలువైన ఆస్తులు ఎందుకు బయటకు రావడం లేదో ఎవరికీ అర్థం కావట్లేదు ఎంపీలకు హస్తం ఉందని, చంద్రబాబు కొడుక్కి కూడా హస్తం ఉందని ఆరోపణలున్నాయి ఇప్పటివరకు అగ్రిగోల్డ్ బాధితులకు వచ్చింది కేవలం 16 కోట్లు మాత్రమే కేవలం 1152 కోట్లు ఇస్తే మొత్తం 14 లక్షల మందికి పైగా ఉన్న బాధితులందరికీ న్యాయం జరుగుతుందని అన్నారు కానీ చంద్రబాబుకు మాత్రం ఈ విషయాలేవీ పట్టవు అగ్రిగోల్డ్ గురించి మాట్లాడకుండా ఎలా కట్టడి చేయాలని మాత్రమే ఇలాంటి తీర్మానాలు చేస్తారు ఈ కేసులో ఇప్పటికి ఇద్దరిని మాత్రమే అరెస్టు చేశారు. చైర్మన్, ఆయన తమ్ముడు మాత్రమే ఈ కేసులో ఇంకా చాలామంది ఉన్నారు.. అంతా కంపెనీలలో ఉంటూ ప్రజల డబ్బులను దుర్వినియోగం చేసి, వాటితో బయట ఆస్తులు కొన్నారని అసెంబ్లీ దృష్టికి తెచ్చాను ఒక్క ప్రత్తిపాటి పుల్లారావు మాత్రమే కాదు, తిరుపతిలో 14.5 కోట్లకు ఒకటిన్నర ఎకరాల భూమిని అమ్మేశారు బ్రహ్మంగారి మఠంలో వాళ్లకున్న భూములను అమ్ముకున్నారని, 2016లో కూడా జరిగిందని చెప్పాం ఇన్ని జరుగుతుంటే, వీటిని వినాలన్న ఉద్దేశం లేదు ప్రత్తిపాటి పుల్లారావు భార్యకు భూములు అమ్మిన వ్యక్తి ఉదయ దినకరన్ ఆయన అగ్రిగోల్డ్ సంస్థల్లో డైరెక్టర్‌గా ఉన్నాడు, హాయ్‌ల్యాండ్ ప్రాపర్టీకి కూడా డైరెక్టర్‌గా ఉన్నాడు ఆర్కా లీజర్ అండ్ ఎంటర్టైన్మెంట్ కంపెనీ లిమిటెడ్‌లో 2010 మార్చి 8 నుంచి ఆయన డైరెక్టర్‌గా ఉన్నారు ఈ పెద్దమనిషి ఆ ఒక్క కంపెనీయే కాదు.. రామవ్వాస్ అనే మరో కంపెనీలో కూడా డైరెక్టర్‌గా ఉన్నారు ఒకవైపు అగ్రిగోల్డ్ ప్రజలకు టోపీ పెడుతోందని ఆరోపణలు వస్తున్నా, 2014లో ఈయన భూములు కొనుగోలు చేశారు వెంకట కృష్ణ ఆంజనేయ ప్రసాద్ నుంచి దినకరన్ 2014 జూలైలో కొన్నారు ఆ తర్వాత.. అగ్రిగోల్డ్ మీద కేసులు పడ్డాయి. 2015 జనవరి4న పశ్చిమగోదావరి జిల్లా పెదపాడులో కేసులు నమోదయ్యాయి ఇదే హాయ్‌ల్యాండ్‌లో ఉన్న డైరెక్టర్ ఉదయ్ దినకరన్ 19వ తేదీన ప్రత్తిపాటి పుల్లారావుకు భూములు అమ్మారు ప్రత్తిపాటి పుల్లారావు భార్య వెంకాయమ్మ.. ఉదయ్ దినకరన్ నుంచి భూములు కొన్న సేల్ డీడ్ కాపీ కూడా ఉంది స్పెక్ట్రం కేసులోను, కోల్ స్కాంలోను, బోఫోర్స్ స్కాంలోను ప్రతిపక్షాలు ఏం మాట్లాడాయో నాకు తెలియదు గానీ, వాటి మీద సీబీఐ విచారణ జరిగింది ఇప్పుడు నేను ఆధారాలతో సహా చూపిస్తున్నాను.. సీఐడీ విచారణ వద్దు, అది రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంటుంది హైకోర్టు న్యాయమూర్తి ఆధ్వర్యంలో సీబీఐ విచారణ జరగాలి అది జరిగినా కూడా అగ్రిగోల్డ్ డిపాజిట్‌దారులకు నష్టం మాత్రం జరగకూడదు. ఒక్క పుల్లారావే కాదు.. గద్దలు అందరిమీద విచారణ చేసి, ఆస్తులన్నింటినీ వెనక్కి తీసుకొచ్చి వాటిని రీ ఎటాచ్ చేసి, వాటిని వేలం వేయగా వచ్చిన డబ్బును డిపాజిట్‌దారులకు అందజేయాలి ఈ విషయాలు చెప్పడానికి 20 నిమిషాల సమయం అడిగితే ఇవ్వలేదు నేనేమైనా సీబీఐ అధికారినా, పోలీసునా.. నేను పిలిస్తే చంద్రబాబు, ఆయన కొడుకు ఏమైనా వస్తారా.. ఇది 20 లక్షల కుటుంబాలకు సంబంధించిన సమస్యే తప్ప జగన్ మోహన్ రెడ్డికి సంబంధించిన వ్యక్తిగత సమస్య కాదని చెప్పాను అందరి సంక్షేమం కోసం 20 నిమిషాల సమయం ఇవ్వమని అడిగితే వెంటనే మైక్ కట్ చేసేస్తున్నారు ప్రజాస్వామ్యంలో స్పీకర్ ఎంత దారుణంగా వ్యవహరిస్తున్నారో అందరికీ తెలియాలి స్పీకర్ మీద అవిశ్వాస తీర్మానం పెట్టేముందు 14 రోజుల సమయం ఉండాలని నిబంధనలు ఉన్నాయి కానీ ఇంతకుముందు స్పీకర్ దాన్ని తోసిపారేసి.. వెంటనే అవిశ్వాసం చేపట్టారు ఎందుకంటే, 21 మంది సభ్యులకు విప్ జారీ చేసే అవకాశం మాకు ఇవ్వకూడదని ఇప్పుడు కూడా దాదాపు అలాగే చేస్తారు.. తీర్మానం వీగిపోయేలా చేస్తారు అయినా అవిశ్వాస తీర్మానం పెడతాం.. ఎందుకంటే, ఈ సభలో ఉన్నది మనుషులు కారు, రాక్షసులని ప్రజలకు తెలియాలి చివరకు ప్రజలు మొట్టికాయలు వేస్తారు, పైనుంచి దేవుడు కూడా మొట్టికాయలు వేయాల్సిందే రుణమాఫీపై అసెంబ్లీలోనూ అబద్ధాలే ఆ తర్వాత రైతు రుణమాఫీపై వ్యవసాయ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అసెంబ్లీలో చెప్పిన విషయాలు, వాటిలోని అబద్ధాలను సాక్ష్యాధారాలతో సహా జగన్ నిరూపించారు. విశాఖపట్నానికి చెందిన వైఎస్ఆర్సీపీ నాయకుడు కరణం ధర్మశ్రీ కుటుంబానికి చెందిన మూడు రుణాలు పూర్తిగా మాఫీ అయిపోయినట్లు మంత్రి చెప్పారని, కానీ అదంతా పచ్చి అబద్ధమని చెప్పారు. అందుకు సంబంధించిన ఆధారాలను కూడా చూపించారు. ఈ సందర్భంలో జగన్ ఏమన్నారంటే.. చంద్రబాబు సీఎం అయ్యేనాటికి రైతులకు 87,612 కోట్ల రుణాలు ఉన్నాయి ఆయన కట్టొద్దన్నందుకు రైతులు ఆ రుణాలు కట్టలేదు, దాంతో వారికి బ్యాంకులు అపరాధ వడ్డీ వేస్తున్నాయి వీళ్లు ఏడాదికి 3500 కోట్లు ఇస్తూ మొత్తం రుణమాఫీ చేసేశామంటున్నారు దాదాపు 40 లక్షల రైతుల అకౌంట్లు ఎన్పీఏలుగా బ్యాంకులు ప్రకటించాయి మరోవైపు రైతుల రుణభారం విపరీతంగా పెరుగుతోంది.. ఇప్పుడు దాదాపు 1.05 లక్షల కోట్లకు చేరుకుంది కరణం ధర్మశ్రీకి 1.36 లక్షల రుణాలు మాఫీ అయ్యాయని చెప్పారు విషయం ఏమిటంటే.. ప్రత్తిపాటి పుల్లారావు మూడు సందర్భాలు ప్రస్తావించారు ధర్మశ్రీ భార్య విజయలక్ష్మి 49 సెంట్ల భూమి పెట్టి 2007లో 35 వేలు తీసుకున్నారని, కానీ స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం అంత రాదని చెప్పారు వడ్డీతో కలిపి ఇది 70వేలు అయ్యిందని చెప్పారు, దీనికి 13794 రుణమాఫీ చేశామని చెప్పారు విజయలక్ష్మికి మొత్తం 4 ఎకరాల భూమి ఉంది రెండు విడతలుగా ఆమెకు మొత్తం 5793 రూపాయలు మాత్రమే ఇప్పటికి మాఫీ అయింది రెండో కేసు.. ధర్మశ్రీ పేరుతో ఉన్నది 2013లో 50 వేల రుణం దీనికి మొత్తం రుణమంతా మాఫీ అయిపోయిందని పుల్లారావు చెప్పారు మొదటి దఫా 10 వేలు ఇచ్చారు. అందులో అసలు 3200, ఇంకా వడ్డీ ఉన్నాయి రెండోదఫాలో 11వేలు ఇచ్చారు.. ఈవాల్టికి 46వేలు, దానిపై వడ్డీ కలిపి 51వేల రుణం అలాగే ఉంది -
సలహాలు, సూచనలు ఇస్తే సవరించుకుంటాం'
గుంటూరు: పుష్కర ఘాట్ ఏర్పాట్లలో ఎక్కడైనా తప్పులు జరిగితే.. మీడియా సలహాలు, సూచనలు ఇస్తే సవరించుకుంటామని ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప, వ్యవసాయశాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు తెలిపారు. శనివారం సీతానగరం పుష్కర ఘాట్లను వారు పరిశీలించారు. పుష్కరాల సందర్భంగా వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా 12 రోజుల పాటు అన్ని ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా పుష్కర ఘాట్ల వరకు అన్ని జిల్లాల నుంచి వచ్చే బస్సులను అనుమతిస్తున్నామని చెప్పారు. బస్సులకు ఎలాంటి అసౌకర్యం కలగదన్నారు. ఒకే రోజు 50 లక్షల మంది వచ్చిన సరిపడే ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు. ఆగస్టు 14, 15 సెలవు దినాలు కావడంతో రెట్టింపు మంది భక్తులు పుష్కర స్నానాలకు వచ్చే అవకాశం ఉందని వారు అభిప్రాయపడ్డారు. -
'అందుకే మీడియాను నియంత్రించాం'
విజయవాడ: కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం దీక్ష నేపథ్యంలో మీడియా నియంత్రణపై గురువారం ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావును జర్నలిస్ట్‌లు ప్రశ్నించారు. దాంతో ప్రత్తిపాటి మాట్లాడుతూ.. శాంతి భద్రతల దృష్ట్యా మీడియాను హ్యాండిల్ చేశామంటూ చెప్పుకొచ్చారు. గతంలో తూర్పుగోదావరి జిల్లా తుని సంఘటనలో చోటుచేసుకున్న పరిణామాలు తెలిసిందే కాదా? అని చెప్పారు. మళ్లీ అలాంటి పరిస్థితులు వస్తాయనే మీడియాను నియంత్రించామని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు స్పష్టం చేశారు. -
ఏపీ మంత్రి పేరుతో అరకోటి వసూళ్లు
మంత్రి తనకు సమీప బంధువని చెప్పుకొంటూ.. ప్రత్తిపాటి సతీష్ అనే యువకుడు విజయవాడలో ఘరానా మోసానికి పాల్పడ్డాడు. నిరుద్యోగ యువత నుంచి దాదాపు 50 లక్షల రూపాయల వరకు వసూలు చేశాడు. కృష్ణపట్నం పోర్టులో ఉద్యోగాల ఖాళీలు ఉన్నాయని, అవి ఇప్పిస్తానని చెబుతూ సతీష్ పలువురు యువకుల నుంచి 50 లక్షల రూపాయలు వసూలు చేశాడు. ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, ఇతర టీడీపీ నేతలతో తాను ఉన్న ఫొటోలను ఫేస్బుక్లో పోస్ట్ చేసి, వాటిని చూపించి మంత్రి తనకు సమీప బంధువు అని అందరినీ నమ్మించాడు. మంత్రి ఇంటిపేరు, సతీష్ ఇంటిపేరు ఒకటే కావడంతో యువకులు కూడా నమ్మారు. తమకు ఉద్యోగాలు వస్తాయన్న ఆశతో.. 50 లక్షలను అతడికి ముట్టజెప్పారు. చివరకు ఉద్యోగాలు రాక, ఉన్న డబ్బులు పోయి యువకులు లబోదిబోమంటున్నారు. -
ఏపీ ఎంసెట్ ఇంజినీరింగ్ ఫలితాలు విడుదల
- విశాఖలో ఏపీ ఎంసెట్ 2016 ఫలితాలు విడుదల - ఇంజినీరింగ్ ఫలితాలు మాత్రమే విడుదల - సుప్రీంకోర్టు తీర్పుతో మెడిసిన్ ఫలితాలు నిలిపివేత - సుప్రీంకోర్టు తీర్పుపై అధ్యయనం చేశాకే మెడిసిన్ ఫలితాలు విడుదల - విశాఖలో విడుదల చేసిన ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు విశాఖపట్నం: జేఎన్టీయూ కాకినాడ ఆధ్వర్యంలో నిర్వహించిన ఏపీ ఎంసెట్-2016 ఫలితాలను సోమవారం రాత్రి విడుదల చేశారు. అయితే ఇంజినీరింగ్ ఫలితాలను మాత్రమే విడుదల చేసినట్టు మంత్రి గంటా శ్రీనివాసరావు వెల్లడించారు. 'నీట్'పై సుప్రీంకోర్టు ఇచ్చిన తుది తీర్పు నేపథ్యంలో ఫలితాలు విడుదలలో జాప్యం ఏర్పడినట్టు ఆయన చెప్పారు. సీడీల రూపంలో ఇంజినీరింగ్ ఫలితాలను విడుదల చేశారు. ఇప్పుడు ఇంజినీరింగ్ ఫలితాలను మాత్రమే విడుదల చేస్తున్నామని తెలిపారు. సుప్రీం తీర్పుతో మెడిసిన్ ఫలితాలను నిలిపివేసినట్టు చెప్పారు. సుప్రీంకోర్టు తీర్పుపై అధ్యయనం చేశాకే మెడిసిన్ ఫలితాలను విడుదల చేస్తామని మంత్రి గంటా తెలిపారు. ఈ ఫలితాలను ఏయూ వర్సిటీ ప్లాటినం జూబ్లీ హాలులో ఏపీ మంత్రులు గంటా శ్రీనివాసరావు, కామినేని శ్రీనివాస్, ప్రత్తిపాటి పుల్లారావు విశాఖపట్నంలో విడుదల చేశారు. ఎంసెట్ పరీక్షకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో 2,78,392 మంది హాజరుకాగా వారిలో 1,79,642 మంది ఇంజనీరింగ్, 98,750 మంది మెడిసిన్ అభ్యర్థులున్నారు. ఎంసెట్ కమిటీ ముందుగా ప్రకటించిన తేదీ కంటే ఏడు రోజులు ముందే ఫలితాల విడుదలకు ఏర్పాట్లు పూర్తి చేశారు. అయితే ఎంసెట్ ఫలితాలు విడుదల చేసిన అరగంటకు విద్యార్థి నమోదు చేసుకున్న సెల్ నంబర్‌కు ర్యాంక్‌ల సమాచారం అందుతుందని ఎంసెట్ చైర్మన్ వి.ఎస్.ఎస్.కుమార్ చెప్పారు. ఎంసెట్ ఫలితాలను www.sakshieducation.com వెబ్సైట్ నుంచి తెలుసుకోవచ్చు. -
'ప్రత్యేక హోదా కోసం మా ప్రయత్నం చేస్తాం'
గుంటూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం తమవంతు ప్రయత్నం కొనసాగిస్తామని ఏపీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు పేర్కొన్నారు. ఆదివారం ఆయన గుంటూరులో విలేకరులతో మాట్లాడారు. ఏపీ రాష్ట్ర ప్రయోజనాల విషయంలో తాము రాజీపడబోమని చెప్పారు. బీజేపీ మిత్రపక్షం అయినంత మాత్రాన చేతులు ముడుచుకుని కూర్చోమంటూ ప్రత్తిపాటి పుల్లరావు స్పష్టం చేశారు. -
ఎమ్మెల్యేలను చేర్చుకొమ్మని మాకు చెప్పలేదు
వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలను చేర్చుకోవాల్సిందిగా ముఖ్యమంత్రి చంద్రబాబు తమకు చెప్పలేదని ఏపీ మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, నారాయణ అన్నారు. దమ్ముంటే ప్రభుత్వాన్ని రద్దుచేసి మళ్లీ ఎన్నికలకు వెళ్లాలని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విసిరిన సవాలుకు వాళ్లు సమాధానం ఇచ్చారు. ప్రభుత్వాన్ని రద్దు చేసే ప్రసక్తి లేదని, తాము ఐదేళ్లూ అధికారంలోనే ఉంటామని మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, నారాయణ వెల్లడించారు. -
ప్రత్తిపాటిని నిలదీసిన రైతులు
* మాస్టర్‌ప్లాన్‌పై అవగాహనలో మంత్రి ఎదుటే రైతుల వాదులాట * ప్రజల అభిప్రాయూల మేరకు మార్పులు: ప్రత్తిపాటి తుళ్లూరు రూరల్: గ్రామ కంఠాల వ్యవహారంలో మంత్రి ప్రత్తిపాటి పుల్లారావును రైతులు నిలదీశారు. గ్రామాలను కదిలించేది లేదని భూసమీకరణ సమయంలో చెప్పి.. ఇప్పుడు ఇళ్లు తొలగిస్తామనడమేమిటని మంత్రి, అధికారులపై గ్రామస్తులు మండిపడ్డారు. మంత్రి ఎదుటే రైతులు ఇరు వర్గాలుగా విడిపోయి పరస్పరం వాదులాడుకున్నారు. గురువారం గుంటూరు జిల్లా తుళ్లూరు గ్రామస్తులు మాస్టర్ ప్లాన్‌పై నిర్వహించిన అవగాహన సదస్సును బహిష్కరించడంతో శుక్రవారం మంత్రి ప్రత్తిపాటి, స్థానిక ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్‌తో కలిసి ఇక్కడి సీఆర్డీఏ కార్యాలయానికి వచ్చారు. ఈ సందర్భంగా రైతులు పలు అంశాలను మంత్రి వద్ద ప్రస్తావించారు. గ్రామకంఠాల వ్యవహారంలో కొందరికి అన్యాయం జరిగిందన్నారు. అందరికీ సమన్యాయం చేయాలని, లేనిపక్షంలో రాజధాని నిర్మాణానికి అంగీకరించేది లేదని స్పష్టంచేశారు. ఈ నేపథ్యంలో రైతులు రెండువర్గాలుగా విడిపోయి ఒకరిపై ఒకరు వాదులాడుతున్నారు. మంత్రి ముందున్న బల్లలను గట్టిగా చరుస్తూ సవాళ్లు, ప్రతి సవాళ్లు విసురుకున్నారు. ఇప్పుడు గుర్తొచ్చామా? జొన్నలగడ్డ రవి అనే రైతు మాట్లాడుతూ.. ‘మేం ఇప్పుడు గుర్తుకొచ్చామా..’ అంటూ మంత్రి పుల్లారావుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో మంత్రి ప్రత్తిపాటి కల్పించుకుని ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగానే రహదారులు నిర్మిస్తామన్నారు. ప్రజల అభ్యంతరాల ప్రకారం మార్పులు, చేర్పులు చేస్తామని చెప్పారు. సమస్యలను సీఎం ముందుంచుతామన్నారు. వారంలో ఒక రోజు మంత్రి నారాయణ, ఎమ్మెల్యే టి.శ్రావణకుమార్, కలెక్టర్‌తోపాటు తాను కూడా రాజధాని గ్రామాల్లో ఉండి సమస్యల పరిష్కారాని కృషి చేస్తామని చెప్పారు. ఇక్కడ బజారు రాజకీయూలు చేయొద్దని వ్యాఖ్యానించారు. అనంతరం విలేకరుల సమావేశంలోనూ మంత్రి ఇదే రీతిలో మాట్లాడారు. సమావేశంలో సీఆర్డీఏ అదనపు కమిషనర్ ప్రసన్న వెంకటేష్, ల్యాండ్ డెరైక్టర్ బీఎల్ చెన్నకేశవులు ఇతర అధికారులు పాల్గొన్నారు. ఆందోళన వద్దు: కలెక్టర్ గ్రామ కంఠాలను ఆనుకొని ఉన్న స్థలాలను మినహాయించకపోవడంతో ప్రజల్లో ఆందోళన నెలకొందని కలెక్టర్ కాంతిలాల్ దండే అన్నారు. సీఆర్డీఏ, జిల్లా యంత్రాంగం సమన్వయంతో రాజధాని మాస్టర్‌ప్లాన్‌పై అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు. ప్రజల అభ్యంతరాలను ముఖ్యమంత్రి సమక్షంలో చర్చించి, అందరి ప్రజయోజనాలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటామని, ఆందోళన వద్దని సూచించారు. -
'రుణమాఫీపై ఆశలు వదులుకోండి'
గోరంట్ల: గతంలో రుణమాఫీ అమలు కాని రైతులు ఇక ఆశలు వదులుకోవాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు స్పష్టం చేశారు. శనివారం ఉదయం బెంగళూరు నుంచి రోడ్డు మార్గంలో పుట్టపర్తికి వెళుతూ అనంతపురం జిల్లా గోరంట్ల మండలం చింతలపల్లి బస్టాండ్ వద్ద ఆయన రైతులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రస్తుత వర్షాలకు పంటల నష్టంపై రైతలు ప్రత్తిపాటి దృష్టికి తీసుకువచ్చారు. ప్రస్తుత పంట నష్టాన్ని అంచనావేసి రైతులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. రుణమాఫీపై ప్రత్తిపాటి స్పందిస్తూ... గతంలో విడుదల చేసిన మేరకే రుణమాఫీ వర్తిస్తుందన్నారు. -
దమ్ముంటే చర్చకు రావాలి..
-
శంకుస్థాపనకు భారీ ఏర్పాట్లు
తాడికొండ: రాష్ట్ర నూతన రాజధాని అమరావతి నిర్మాణానికి ఈ నెల 22వ తేదీన జరగనున్న శంకుస్థాపన కార్యక్రమానికి అంతర్జాతీయస్థాయిలో ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర పురపాలకశాఖ, వ్యవసాయశాఖ మంత్రులు పి.నారాయణ, ప్రత్తిపాటి పుల్లారావు పేర్కొన్నారు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం ఉద్దం డ్రాయినిపాలెంలో శుక్రవారం వారు శంకుస్థాపన ఏర్పాట్లను పరిశీలిచి,కలెక్టర్ కాంతిలాల్ దండేను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ.. శంకుస్థాపన జరగనున్న ప్రాంగణంలో వీఐపీలకు ఒకటి, ఎంఐపీలకు ఒకటి, ప్రధాన వేదిక ఒకటి.. మొత్తం మూడు వేదికలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. శంకుస్థాపన కార్యక్రమానికి రావటానికి అంగీకరించిన ప్రధాని నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. శంకుస్థాపన వేదికను ఉద్దండ్రాయినిపాలెం ఎస్సీ కాలనీకి సమీపంలో ఈశాన్య ముఖ దిశగా ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. కార్యక్రమంలో వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు, జేసీ చెరుకూరి శ్రీధర్, అధికారులు, నాయకులు పాల్గొన్నారు. -
రాజకీయాలను భాష ప్రభావితం చేసినప్పుడే..
గుంటూరు: తెలుగు రాష్ట్రంలో రాజకీయాలను భాష ప్రభావితం చేసినప్పుడే మాతృభాష ఉన్నత స్థితికి చేరుకుంటుందని శాసనసభ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ అభిప్రాయపడ్డారు. గుంటూరు బృందావన్‌గార్డెన్స్‌లోని శ్రీవెంకటేశ్వరస్వామి దేవస్థానంలో శుక్రవారం తెలుగు భాషోద్యమ సమాఖ్య ఆధ్వర్యంలో తెలుగు భాషాదినోత్సవం పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్‌లో తెలుగు భాష రక్షణ, అభివృద్ధి మహాసభ, సదస్సు జరిగింది. తమిళనాట భాష రాజకీయాలను శాసిస్తున్న కారణంగా ఆ భాష అభివృద్ధికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుందన్నారు. యునెస్కో మాతృభాషలోనే విద్యాబోధన చేయాలని అన్ని దేశాలకు సూచించిన విషయాన్ని ఉటంకించారు. సమస్యకు అసలు మూలాలు గుర్తించి పరిష్కార మార్గాలను ఆచరణలో పెట్టినప్పుడే తెలుగు భాషకు మహర్ధశ అని వ్యాఖ్యానించారు. గాంధీజీ మాటలను గుర్తుంచుకోవాలి సాక్షి ఎడిటోరియల్ డైరెక్టర్ కె.రామచంద్రమూర్తి ప్రసంగిస్తూ మాతృభూమి, మాతృమూర్తి, మాతృభాషను మరిస్తే పుట్టగతులుండవన్న మహాత్మగాంధీ మాటలను అందరూ గుర్తుంచుకోవాలన్నారు. అమెరికాలోను తెలుగు వారు తమ పిల్లలకు శని, ఆదివారాల్లో తెలుగు భాష నేర్పి ఆదర్శంగా నిలుస్తున్నారన్నారు. సాంకేతిక పదాలు తెలుగులోకి తర్జుమా చేయడం, మన భాషను పరిపుష్టం చేస్తాయని చెప్పారు. మంచి పదాలు ఇతర భాషల నుంచి, తీసుకోవడం, కొత్తపదాలు అనువదించడం, కంప్యూటర్ వంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని మన భాషలో అందించడానికి మీడియా కృషి చేస్తున్నదని, ఇంకా చాలా చేయాల్సిన ఉందన్నారు. ప్రెస్ అకాడమి మాజీ చైర్మన్ పొత్తూరి వెంకటేశ్వర్ రావు తెలుగు భాషా పరిషత్ ఏర్పాటు చేసి తెలుగీకరించిన పదాలను, విషయాలను అన్ని పత్రికలకు అందించే బృహత్తర కార్యక్రమం కొన్నాళ్లు నిర్వహించిన విషయాన్ని గుర్తు చేశారు. వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ మాతృభాషను కాపాడడానికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. తెలుగు భాషాభివృద్ధికి తెలుగు భాషోద్యమ సమాఖ్య చేస్తున్న కృషిని అభినందిస్తున్నానన్నారు. సభకు అధ్యక్షత వహించిన సమాఖ్య అధ్యక్షులు డాక్టర్ సామల రమేష్‌బాబు ఉపన్యసిస్తూ.. గిడుగు రామ్మూర్తి జయంతి పురస్కరించుకొని నిర్వహిస్తున్న ఈ సభ తీర్మానాలను ప్రభుత్వం ఆచరణలో పెట్టాలని కోరారు. -
ప్రత్యేక హోదాపై నీళ్లు నమిలిన మంత్రి
-మీడియా ప్రతినిధుల ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి -సూటిగా సమాధానం చెప్పమన్న మీడియా సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా వ్యవహారమై సూటిగా సమాధానం చెప్పలేక వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, ప్రభుత్వ విప్ రవికుమార్ నీళ్లు నమిలారు. దేశ రాజధాని ఢిల్లీకి వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎంతో సాధించారని చెప్పాలనుకుని మంగళవారం రాత్రి 7 గంటలకు హడావిడిగా మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసిన మంత్రి.. విలేఖరులు అడిగిన ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరయ్యారు. ‘మనం భోజనం అడిగితే వాళ్లు (కేంద్రం) చికెన్ బిర్యానీ పెడతామంటుంటే వద్దంటారా?’ అని ప్రభుత్వ చీఫ్ విప్ రవికుమార్, మంత్రి పత్తిపాటి వ్యాఖ్యానించినప్పుడు మీడియా ప్రతినిధులు ప్రశ్నల వర్షం కురిపించారు. ప్రత్యేక హోదా వస్తుందా? రాదా? అనే దానిపై సూటిగా స్పష్టత ఇవ్వాలని కోరారు. కేంద్రమంత్రి అరుణ్ జెట్లీ ప్రత్యేక హోదా రాదని ఎక్కడా చెప్పలేదని, అంతకు మించే సాధిస్తామని మంత్రి బదులిచ్చారు. ‘ప్రత్యేక హోదా వస్తే కేవలం 30 శాతమే నిధులు వస్తాయని, ప్యాకేజీలయితే రాష్ట్రాభివృద్ధికి కావాల్సినన్ని నిధులు వస్తాయని’ మంత్రి, చీఫ్ విప్ చెప్పినప్పుడు ‘ఉల్లిపాయలున్నాయా? అనడిగితే మంచి చింతపండుందన్నట్టుగా’ మీ సమాధానం ఉందని మీడియా ప్రతినిధులు బదులిచ్చారు. ప్రత్యేక హోదా అనేది రాష్ట్ర ప్రజల ఆకాంక్షని, అందుకోసం కొందరు భావోద్వేగాలతో బలిదానాలకూ పాల్పడుతున్న విషయం తెలిసి కూడా ఇలా డొంకతిరుగుడుగా మాట్లాడవద్దని విలేఖరులు వాగ్వాదానికి దిగారు. వెనకబడిన ప్రాంతాల అభివృద్ధికి ఇస్తామన్న 2,250 కోట్ల రూపాయలకే దిక్కులేనప్పుడు కేంద్రం ఇవ్వబోయే ప్యాకేజీలతో సంతృప్తి చెందుతారా? అని విలేఖరులు ప్రశ్నించడంతో మంత్రి, చీఫ్ విప్ మళ్లీ ఇరకాటంలో పడ్డారు. ‘అదీ, ఇదీ రెండూ సాధించేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని’ చెబుతూ సమస్యను పక్కదోవ పట్టించేందుకు ప్రయత్నించారు. మొత్తం మీద మంత్రి, చీఫ్ విప్ ఏదో చెప్పాలనుకుని మీడియా సమావేశం ఏర్పాటు చేస్తే అది కాస్తా ఉల్టాపల్టా అయింది. -
'ఏపీలో 330 మండలాల్లో వర్షపాతం తక్కువ'
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో 330 మండలాల్లో వర్షపాతం చాలా తక్కువగా ఉందని ఆ రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు చెప్పారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కోస్తా జిల్లాలో వర్షపాతం మెరుగ్గా ఉందని, రాయలసీమలో తక్కువగా ఉందన్నారు. కోస్తాలో వరి పండించే రైతులు 1001, 1010 రకాల విత్తనాలు వేసుకోవాలని సూచించారు. వచ్చే నెల 5 నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రైతు భరోసా యాత్ర చేపట్టనున్నారని చెప్పారు. అదేవిధంగా గ్రామాల్లో రుణమాఫీ జాబితా ప్రకటన వెల్లడిస్తారని మంత్రి ప్రత్తిపాటి పుల్లరావు పేర్కొన్నారు. -
'రుణాలు రెన్యువల్‌కు ఆటంకాలు ఉండవు'
హైదరాబాద్: ఈ ఏడాది రైతులకు రుణాలు రెన్యువల్ చేసుకోవడానికి ఎలాంటి ఆటంకాలు ఉండవని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు హామీ ఇచ్చారు. రుణం ఉపసంహరణ పథకం కింద లబ్ధి పొందిన వారందరూ రుణాలను రెన్యువల్ చేసుకోవచ్చుని చెప్పారు. సోమవారం హైదరాబాద్‌లో ఎస్ఎల్బీసీ సమావేశంలో పాల్గొన్నారు. సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. మిగిలిన మొత్తాన్ని ఇంకా రైతులు చెల్లించకపోయినా రెన్యువల్ చేయడానికి బ్యాంకులు అంగీకరించాయన్నారు. డ్వాక్రా సంఘాలకు ఈ ఏడాది రూ. 15,880 కోట్లు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. గృహనిర్మాణం, ఎస్సీ, ఎస్టీ రుణాలకు బ్యాంకులు సహకరించడం లేదన్నారు. వాటిపై దృష్టి సారించాలని బ్యాంకు అధికారులను కోరినట్టు ప్రత్తిపాటి పుల్లరావు పేర్కొన్నారు. -
ఫోన్ ట్యాప్‌పై రోజూ మాటలెందుకు
హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులపై ప్రతి రోజూ మాట్లాడాల్సిన పనిలేదని, చట్టం తనపని తాను చేసుకుపోతుందని ఏపీ వ్యవసాయశాఖా మంత్రి ప్రతిపాటి పుల్లారావు అన్నారు. చంద్రబాబు రాజీపడిపోయారన్న బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలు ఖండిస్తున్నానని, ఈ విషయంలో వెనుకకు తగ్గేది లేదని చెప్పారు. రాష్ట్రం కోసం చంద్రబాబు బస్సులోనే ఉంటానని చెప్పారని అన్నారు. బస్సు ఎక్కుగానే నిద్ర పడుతుందని.. దానిపై కూడా విమర్శలు చేయడం తగదని హితవు పలికారు. వేరు శెనగ విత్తనాలు పక్క రాష్ట్రంలో కొందామన్న ఎవరూ ముందుకు రాలేదని ఆయన చెప్పారు. గతేడాది పంట దిగుమతి లేకపోవడం వల్ల ఈసారి విత్తనాల డిమాండ్ పెరిగిందని చెప్పారు. రైతులు బయటకొన్నా సబ్సిడీ ఇస్తామని చెప్పారు. రుణమాఫీపై ఆరు లక్షలకు పైగా ఫిర్యాదులు అందాయని ఇక నుంచి ఫిర్యాదులు తీసుకోబోమని స్పష్టం చేశారు. రుణమాఫీకి సుమారుగా మరో 2.50 లక్షల వరకు అర్హత వచ్చే అవకాశం ఉందని ప్రత్తిపాటి తెలిపారు. -
'టీఆర్ఎస్ ప్రభుత్వం పడిపోయే ఆధారాలున్నాయి'
-
'టీఆర్ఎస్ ప్రభుత్వం పడిపోయే ఆధారాలున్నాయి'
తమ వద్ద టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని పడగొట్టగలిగిన స్థాయిలో ఆధారాలున్నాయని ఆంధ్రప్రదేశ్ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. చంద్రబాబు నాయుడితో మంత్రుల సమావేశం అయిన అనంతరం ఆయన మరో మంత్రి అచ్చెన్నాయుడితో కలిసి సచివాలయంలో మీడియాతో మాట్లాడారు. ఆయనేమన్నారంటే.. ''టీడీపీ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే ప్రయత్నం టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తోంది. ఏసీబీకి నోటీసులు జారీచేసే అధికారం లేదు. కోడ్ ఆఫ్ కండక్ట్ అమలులోకి వచ్చినప్పుడు, ఎన్నికల ప్రక్రియ ఉన్నందువల్ల అంతా ఎన్నికల కమిషన్ పరిధిలోకి వస్తుంది. ఎలాంటి చర్య విషయంలోనైనా ఈసీ జోక్యం చేసుకోవాలి. ఏసీబీ కేవలం ఉద్యోగుల అవినీతిని అరికట్టడానికే ఏర్పాటైంది. ఈసీ మాత్రమే ఇలాంటి సందర్భంలో రియాక్ట్ అవ్వాలి. కానీ ఇక్కడ ఏసీబీతో నోటీసులు ఇప్పిస్తున్నామంటూ లీకులిస్తున్నారు. ఏసీబీకి నోటీసులిచ్చే అధికారంలేదు, దానికి భయపడాల్సిన అవసరం లేదు. చంద్రబాబు సంభాషణలు అంటున్నారు.. అది ఎక్కడి నుంచి వచ్చిందనే విషయాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి గానీ, ఏసీబీ అధికారులు గానీ ఈ నిమిషం వరకు చెప్పలేకపోతున్నారు. నోటీసులు ఇవ్వబోతున్నారు, సీఎం రాజీనామా చేస్తారు, అశోక్ సీఎం అవుతారు అంటూ తప్పుడు వార్త పంపిస్తున్నారు. తాటాకు చప్పుళ్లకు మేం భయపడేది లేదు. కేసీఆర్ మీద ఏపీలో నమోదైన 87 కేసులపై ఏపీ ప్రభుత్వం సిట్ విచారణ జరపబోతోంది. మత్తయ్యను బెదిరించడంపై సీబీసీఐడీ విచారణ జరపబోతోంది. ఫోన్ ట్యాపింగ్‌కు మా వద్ద పక్కా ఆధారాలున్నాయి. మేం భయపడాల్సిన అవసరం లేదు. కానీ మా దగ్గర తెలంగాణ ప్రభుత్వం కూలిపోయే ఆధారాలున్నాయి. తెలుగుదేశం పార్టీతో పెట్టుకున్న కాంగ్రెస్ నాయకులు ఏమయ్యారో ఒక్కసారి చూడండి. పెట్టుకునేవాళ్లకు అదే పరిస్థితి ఎదురవుతుంది. ఈరోజు ఒక అడుగు మీరు ముందుకేస్తే ఏపీ ప్రభుత్వం రెండు అడుగులు ముందుకేయడానికి సిద్ధంగా ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో ఇద్దరికీ అధికారాలున్నాయి. భయపడాల్సిన అవసరం లేదు, రాజీనామా అక్కర్లేదు, ఏపీ ప్రజలు కూడా భయపడక్కర్లేదు'' -
'ప్రాథమిక మిషన్ సక్సెస్ బాధ్యత మీదే'
* అధికోత్పత్తికి సహకరించండి * వ్యవసాయాధికారులతో మంత్రి ప్రత్తిపాటి * ప్రాథమిక రంగ మిషన్‌పై ముగిసిన సదస్సు సాక్షి, హైదరాబాద్: వ్యవసాయ రంగ ప్రాధమ్యాన్ని గుర్తిస్తూ ప్రభుత్వం ప్రకటించిన ప్రాధమిక మిషన్‌ను జయప్రదం చేయాల్సిన బాధ్యత వ్యవసాయాధికారులదేనని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు చెప్పారు. వ్యవసాయం, దాని అనుబంధ రంగాలలో రెండంకెల ప్రగతిని సాధించినప్పుడే ఈ మిషన్ లక్ష్యం నెరవేరినట్టన్నారు. ప్రాధమిక మిషన్ కార్యాచరణ ప్రణాళిక ఖరారుపై రెండు రోజులుగా ఇక్కడి ఇక్రిశాట్లో జరిగిన అధ్యయన గోష్టి బుధవారం ముగిసింది. ఈ సమావేశానికి ముఖ్య అతిధిగా హాజరైన మంత్రి ప్రత్తిపాటి మాట్లాడుతూ ఇప్పటికీ నూటికి 70 శాతం మంది వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారని, వారి జీవితాల్లో వెలుగులు నింపడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఏయే రంగాలలో అధికోత్పత్తి సాధించడానికి అవకాశం ఉందో పరిశీలించి రైతులకు తగు సూచనలు, సలహాలు ఇవ్వాలని వ్యవసాయాధికారులకు విజ్ఞప్తి చేశారు. భూ సార పరీక్ష అవసరాన్ని రైతులకు వివరించడంతో పాటు సూక్ష్మనీటి పారుదల పద్ధతులను ఇతోధికంగా ప్రోత్సహించేలా చర్యలు చేపట్టాలని కోరారు. పాడి, మత్స్య, ఉద్యానవన విభాగాల్లో అధికోత్పత్తికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయని, వరిలోనూ అధిక దిగుబడి వంగడాలను రైతులకు అందించాలన్నారు. మెట్టప్రాంతాల్లో వేసే స్వల్పకాలిక పంటలపై అవగాహన పెంచాలని, ఇక్రిశాట్ సేవలను వినియోగించుకోవాలని సలహా ఇచ్చారు. అధికోత్పత్తి, యంత్రపరికరాల వినియోగం, సూక్ష్మ నీటి పద్ధతుల అమలే ధ్యేయంగా అధికారులు పని చేయాలని సూచించారు. వచ్చే ఖరీఫ్, రబీ సీజన్లలో అనుసరించాల్సిన ప్రణాళికలను, విత్తనాలు, ఎరువుల అందుబాటును అధికారులు సమీక్షించారు. జిల్లాల వారీ ప్రణాళికలను ఖరారు చేశారు. ముగింపు సమావేశానికి హాజరైన వారిలో ప్రణాళిక సంఘం ప్రత్యేక కమిషనర్ ఎస్పీ టక్కర్, వ్యవసాయ శాఖ కమిషనర్ కె.మధుసూదనరావు, వివిధ అనుబంధ రంగాల అధికారులు ఉన్నారు. వ్యవసాయ కమిషనర్ పదవీ విరమణ నేడు వ్యవసాయ కమిషనర్, డైరెక్టర్ కె.మధుసూదనరావు గురువారం పదవీ విరమణ చేయనున్నారు. 2013లో వ్యవసాయ కమిషనర్‌గా పదవీ బాధ్యతలు చేపట్టిన ఆయన మూడు సీజన్లను జయప్రదంగా నిర్వహించారు. ఉద్యానవన విభాగం డెరైక్టర్‌గా, మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్‌గా వ్యవహరించిన మధుసూదనరావు 1988లో సివిల్ సర్వీసులో చేరారు. -
అంతా అయిపోయాక హజారే వస్తే ఏం లాభం
-
అంతా అయిపోయాక హజారే వస్తే ఏం లాభం
అన్నాహజారే ఇప్పుడు అంతా అయిపోయాక వస్తే ఏం లాభమని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ప్రశ్నించారు. ఏపీ రాజధానికి 33 వేల ఎకరాల భూములను ఇప్పటికే సమీకరించామని ఆయన చెప్పారు. రైతులందరూ భూములు ఇచ్చారని, వాళ్లంతా సంతోషంగా ఉన్నారని మంత్రి తెలిపారు. అన్నాహజారే, మేధాపాట్కర్ లాంటి వాళ్లు ఇప్పుడు పర్యటించినంత మాత్రాన ఏమీ కాదని ఆయన వ్యాఖ్యానించారు. రాజధాని నగరం రావడం ఇష్టంలేనివాళ్లే అన్నాహజారే, మేధాపాట్కర్లను రప్పిస్తున్నారని విమర్శించారు. సినీ నటుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ రాజధానికి వ్యతిరేకం కాదని, భూసేకరణ చేస్తేనే వ్యతిరేకిస్తానని ఆయన చెప్పారని ప్రత్తిపాటి పుల్లారావు చెప్పారు. -
రాజధాని గ్రామాల్లో భూసేకరణపై త్వరలో నిర్ణయం
మంత్రి ప్రత్తిపాటి వెల్లడి సాక్షి, హైదరాబాద్: రాజధాని ప్రతిపాదిత గ్రామాల్లో భూసేకరణ ఉంటుందా? ఉండదా? అనే అంశాన్ని 15 రోజుల్లో తేలుస్తామని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు వెల్లడించారు. ఇప్పటివరకూ సమీకరించిన 33 వేల ఎకరాలతో పాటు మరో 1,000 ఎకరాలు అవసరమని తెలిపారు. అయితే దీనికి భూసేకరణ ఉండబోదని స్పష్టం చేశారు. సచివాలయంలో ఆదివారం మంత్రి ప్రత్తిపాటి మీడియాతో మాట్లాడారు. రైతులతో ఒప్పందం చేసుకునే విషయంలో అఫిడవిట్లలో గందరగోళం లేకుండా ఏకపత్రం (సింగిల్ పేపరు) విధానాన్ని అమలు చేయనున్నట్లు తెలిపారు. త్వరలో వ్యవసాయ పోస్టుల భర్తీ రాష్ట్రంలో త్వరలో వ్యవసాయశాఖలో ఖాళీగా ఉన్న వివిధ పోస్టులను భర్తీ చేయనున్ననట్లు మంత్రి ప్రకటించారు. ఇవి వ్యవసాయ, ఉద్యానవన శాఖల్లో ఉన్నాయన్నారు. వాటిని వచ్చే మార్చిలోగా భర్తీ చేస్తామని మంత్రి వెల్లడించారు. వ్యవసాయపరంగా ఐదు లక్షల ఎకరాల్లో బిందు, తుంపర సేద్యం అమలు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. ఈ సందర్భంగా ఉద్యాన పంటల రైతుల సమస్యల పరిష్కారం కోసం టోల్ ఫ్రీ నంబరును మంత్రి ప్రారంభించారు. 1800-425-2960 నెంబరుకు ఫోన్ చేసి రైతులు తమ సందేహాలు నివృత్తి చేసుకోవ చ్చన్నారు. ఉద్యానవన రైతులకు ‘మాఫీ’ రాజధాని ప్రాంతంలో భూములు కోల్పోయిన ఉద్యానవన పంటల రైతులకు రూ.1.50 లక్షల వరకు రుణ మాఫీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మున్సిపల్ శాఖ అందుకు సంబంధించిన ప్రతిపాదనలను ఆర్థిక శాఖ ఆమోదానికి పంపింది. ఇది రుణ మాఫీ పథకం కిందకు రాదంటూ ఆర్థిక శాఖ తిరస్కరించింది. మున్సిపల్ శాఖ నిధులనుంచే మాఫీ చేసుకోవాలని సూచించింది. రాజధానిలో భూములు కోల్పోయిన రైతులకు 5,000 ఎకరాల్లో ఉద్యానవన పంటలు ఉన్నాయని ప్రభుత్వం గుర్తించింది. వారికి మాఫీ వర్తించనుంది. 25 లోగా అమలు: నారాయణ తాడికొండ: రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన గుంటూరు జిల్లాలోని 29 గ్రామాల రైతులందరికీ ఈనెల 25వ తేదీలోగా ఒకేసారి రూ.1.5 లక్షల రుణమాఫీ చేస్తామని పురపాలకశాఖ మంత్రి పి.నారాయణ పేర్కొన్నారు. సోమవారం తుళ్లూరులో బ్యాంకు అధికారులతో ఆయన మాట్లాడారు. 3,450 ఎకరాలకు గాను 2,616 మంది రైతులకు రూ.9.35కోట్లకు కౌలు డీడీలను ఇచ్చామన్నారు. ‘సీఆర్డీఏ’పై విచారణ వాయిదా సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ(సీఆర్డీఏ) రాజ్యాంగబద్ధతను సవాల్ చేస్తూ హైకోర్టులో దాఖలైన పిటిషన్‌పై విచారణ వచ్చే వారానికి వాయిదా పడింది. సీఆర్డీఏ చట్టం రాజ్యాంగ విరుద్ధమే కాకుండా, ఏపీ విభజన చట్టానికి కూడా వ్యతిరేకమంటూ విశ్రాంత న్యాయమూర్తులు జస్టిస్ ఎ.గోపాల్‌రావు, జస్టిస్ పి.లక్ష్మణరెడ్డి, ప్రముఖ పాత్రికేయుడు ఏబీకే ప్రసాద్, సీనియర్ న్యాయవాది సి.సదాశివరెడ్డి గత వారం హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై సోమవారం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కల్యాణ్‌జ్యోతిసేన్ గుప్తా, న్యాయమూర్తి జస్టిస్ పీవీ సంజయ్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం విచారించింది. వ్యాజ్యంపై వాదనలు వినిపించేందుకు వీలుగా విచారణను వచ్చే వారానికి వాయిదా వేయాలని పిటిషనర్ల తరఫు న్యాయవాది డి.ప్రకాశ్‌రెడ్డి కోరడంతో, ధర్మాసనం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. -
' అడ్రస్ లేని పార్టీకి ఆయన నాయకుడు'
హైదరాబాద్ : ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి పై మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆయన గురువారమిక్కడ మాట్లాడుతూ అడ్రస్ లేని పార్టీకి రఘువీరా నాయకుడని విమర్శించారు. పట్టిసీమపై రఘవీరా రెడ్డి చేసిన విమర్శలను ఆయన ఖండించారు. చిన్నబాస్ కు రూ.500 కోట్లు ముట్టాయనడం కాదు..ఆధారాలు ఉంటే చూపాలన్నారు. విమర్శలు చేసే ముందు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని రఘువీరారెడ్డి కి ఆయన సూచించారు. -
వ్యవసాయ బడ్జెట్ ముఖ్యాంశాలు
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు శుక్రవారం వ్యవసాయ బడ్జెట్ సమర్పించారు. అలాగే శాసనమండలిలో కార్మికశాఖ మంత్రి అచ్చెన్నాయుడు వ్యవసాయ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. కాగా వ్యవసాయ బడ్జెట్ ప్రసంగంలో ముఖ్యాంశాలు: 2015-16 వ్యవసాయ బడ్జెట్ అంచనా రూ.14,184 కోట్లు మొదటి దశ రుణమాఫీకి 40.50 లక్షల ఖాతాలకు రూ.4,689 కోట్లు ఖర్చు చేశాం రెండో దశ కింద 42.16 లక్షల ఖాతాలకు వర్తింపు ప్రయివేటు భాగస్వామ్యంతో ప్రాథమిక రంగ మిషన్ ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు నష్టపరిహారం పెంపు రూ.1.5 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంపు భూసార పటిష్టతకు రూ.905 కోట్లు విత్తన మార్పిడికి రూ.80 కోట్లు ఎస్సీ, ఎస్టీ రైతులకు సబ్సిడీ 50 శాతం నుంచి 70 శాతానికి పెంపు యాంత్రీకరణకు రూ.141.63 కోట్లు శాటిలైట్ ఇమేజనరీకి రూ.81.21 కోట్లు పొలం బడి కార్యక్రమానికి రూ.1.46 కోట్లు వడ్డీలేని రుణాల కోసం రూ.172 కోట్లు పావలా వడ్డీకి రూ.10 కోట్లు రాష్ట్ర కృషి వికాస్ యోజనకు రూ.513.21 కోట్లు ఎన్టీ రంగా విశ్వవిద్యాలయానికి రూ.367.73 కోట్లు ఉద్యాన శాఖకు రూ.210 కోట్లు ఉద్యాన అభివృద్ధి మిషన్‌కు రూ.100 కోట్లు క్షేత్రస్థాయి నీటి నిర్వహణకు రూ.144 కోట్లు పట్టు పరిశ్రమకు రూ.93.61 కోట్లు వైఎస్ఆర్ హార్టీ కల్చర్ యూనివర్శిటీకి రూ.53.01 కోట్లు పశు సంవర్థక శాఖకు రూ.672.73 కోట్లు ఉపాధి హామీకి నిధులు పెంపు వ్యవసాయరంగంలో ప్రయివేటుకు పెద్దపీట త్వరలో వ్యవసాయ విస్తరణాధికారులుగా 6,354 మంది నియామకం ఉచిత విద్యుత్‌కు భారీగా తగ్గిన నిధులు, రూ.3,000 కోట్లు కేటాయింపు...గత ఏడాదితో పోల్చితే రూ.188 కోట్లు తగ్గింపు హుద్‌హుద్ తుపానులో నష్టపోయిన రైతులకు రూ.140 కోట్లు వెంకటేశ్వర పశువైద్య కళాశాలకు రూ.124 కోట్లు మత్స్యశాఖకు రూ.187 కోట్లు భూసార పటిష్టత మ్యాపుల తయారీ గత ఏడాదితో పోలిస్తే తగ్గిన వడ్డీ రాయితీ గతేడాది రూ.230 కోట్లు కేటాయింపు, ఈసారి రూ.182 కోట్లు సహకార శాఖకు రూ.7.88 కోట్లు సౌర విద్యుత్ తో నడిచే 10వేలు పంపుసెట్లు రైతులు మెరుగైన ధరలు పొందేందుకు చర్యలు అనంతపురంలో వేరుశెనగ పంటను కాపాడేందుకు సామూహిక స్ప్రింక్లర్ల ఏర్పాటు సేద్యపు ఖర్చులు తగ్గించడానికి చర్యలు ఎరువుల సరైన సరఫరాకు రూ.60 కోట్లు లక్షలోపు రుణాలకు వడ్డీ రాయితీ లక్ష నుంచి 3లక్షల లోపు రుణాలకు పావలా వడ్డీ పావలా వడ్డీ రుణాలకు రూ.10 కోట్లు మార్క్‌ఫెడ్‌కు రూ.60 కోట్లు గోదాముల నిర్మాణానికి రూ.56 కోట్లు నూతన వ్యవసాయ విశ్వవిద్యాలయానికి రూ.367.70 కోట్లు రైతు సంఘాలకు వాహనాలు 7 జిల్లాల్లో 238 కరువు మండలాలుగా గుర్తింపు అనంతపురం జిల్లాలోని మొత్తం మండలాలు పశ్చిమ గోదావరిలో 24 మండలాలు బిందు, తుంపర్ల సేద్యానికి రూ.144 కోట్లు ముడిపత్తి ఉత్పత్తికి రూ. 93 కోట్లు పట్టు పురుగుల పెంపకాన్న ప్రోత్సహిస్తాం మేలైన మామిడి, జీడిమామిడి ఉత్పత్తులకు ప్రాధాన్యం ఈ పాలన ద్వారా జిల్లా కార్యాలయాలు అనుసంధానం పశువైద్యశాల ఆధునికీకరణకు రూ.50 కోట్లు రూ.5 కోట్లతో పశు వసతి గృహాలు కూరగాయలు, రైతుల ప్రోత్సాహకానికి రూ.53 కోట్లు చెరకు, వరి పంటలకు అధిక ప్రాధాన్యం మన రాష్ట్రం పట్టు ఉత్పత్తిలోనే దేశంలోనే రెండో స్థానం చేపల ఉత్పత్తికి అనేక పథకాలు చేపలు, రొయ్యల ఉత్పత్తిలో దేశంలోనే ఏపీ మొదటిస్థానం మత్య్య పరిశ్రమను వృద్ధికారకంగా గుర్తించాం విజయవాడను ప్రపంచ ఆక్వా కల్చర్ రాజధానిగా చేస్తాం షెడ్యూల్ కులాల మత్య్సకారుల కోసం అనేక పథకాలు అనంతపురం, రాయలసీమ జిల్లాల్లో వేరుశెనగపంటకు ప్రత్యామ్నయంగా గోరుచిక్కుడు ఇందుకోసం రూ.8కోట్లు రాష్ట్రంలో 190 వ్యవసాయ మార్కెట్ కమిటీలు రైతుబంధు పథకం ద్వారా రూ.17కోట్లు రుణాలు రైతులు పొందారు 26,830 సహకార సంఘాలున్నాయి భూగర్భ జలమట్టం పెంచేందుకు చర్యలు -
రుణమాఫీలో అవినీతిపై దర్యాప్తు -మంత్రి ప్రత్తిపాటి
శ్రీకాకుళం : రుణమాఫీలో జరిగిన అవినీతిపై సీఐడీతో దర్యాప్తు చేపడతామని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. శనివారం శ్రీకాకుళం జిల్లా రాజాం మండలంలో ఎమ్మెల్యే కళావెంకట్రావును ఆయన కలిశారు. ఈ సందర్భంగా మంత్రిని కలిసేందుకు వచ్చిన నాయకులు రుణమాఫీకి సంబంధించిన పేర్ల సేకరణలో అవినీతి జరిగిందని వివరించారు. దీంతో స్పందించిన మంత్రి ఈ వ్యవహారంపై విచారణ జరిపిస్తామని హామి ఇచ్చారు. (రాజాం) -
రుణమాఫీ గడువు 7వ తేదీ వరకు పొడిగింపు
రుణమాఫీ పథకం గడువును ఫిబ్రవరి 7 వరకు పెంచినట్లు ఏపీ వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. ఇప్పటివరకు మొత్తం 40 లక్షల ఖాతాల్లో రూ. 4600 కోట్ల డబ్బు జమ చేశామన్నారు. రెండోదశలో 12 లక్షల ఖాతాలను కంప్యూటరీకరించినట్లు చెప్పారు. మరో 4 లక్షల ఖాతాలపై అభ్యంతరాలున్నాయని, రెండు మూడు రోజుల్లో వాటిని కూడా పూర్తి చేస్తామని అన్నారు. రైతులంతా బ్యాంకులకు వివరాలు ఇవ్వాలని కోరుతున్నట్లు చెప్పారు. ఇప్పటివరకు నాలుగు సార్లు పొడిగించామని, ఇకమీదట గడువు పొడిగించబోమని మంత్రి స్పష్టం చేశారు. సహకార బ్యాంకుల్లో అవకతవకల కారణంగా రూ. 150 కోట్ల చెల్లింపులు నిలిపివేశామని అన్నారు. -
లాభసాటి వ్యవసాయానికి కృషి
సాక్షి ప్రతినిధి, గుంటూరు: శాస్త్ర, సాంకేతిక రంగాల ద్వారా వ్యవసాయాన్ని లాభసాటిగా చేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు వెల్లడించారు. ఆహార కొరత తీర్చేందుకు ఒక వైపు ప్రయత్నాలు చేస్తూనే రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించే దిశగా మరోవైపు కృషి జరుగుతుందని చెప్పారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ, తమిళనాడుకు చెందిన డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ ఫౌండేషన్ సంయుక్తంగా వర్సిటీలోని డైక్మెన్ హాలులో ఏర్పాటు చేసిన ఆరవ ‘అఖిల భారత యువజన సైన్స్ కాంగ్రెస్’ సమావేశాలు సోమవారం కేంద్ర శాస్త్ర సాంకేతిక, భూ విజ్ఞానం శాఖ మంత్రి వై.ఎస్. చౌదరి(సుజనా చౌదరి)జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభమయ్యాయి. తొలిరోజు సమావేశంలో రాష్ట్ర మంత్రి ప్రత్తిపాటి పాల్గొని మాట్లాడారు. పెరుగుతున్న సాగు వ్యయాన్ని పరిగణనలోకి తీసుకుని రైతుకు 50 నుంచి 75 శాతం వరకు వ్యవసాయ పరికరాలను సబ్సిడీపై అందజేస్తున్నట్టు మంత్రి చెప్పారు. బయో టెక్నాలజీతో వ్యవసాయం చేయాలని, ఈ-మార్కెటింగ్ ద్వారా పంటకు గిట్టుబాటు ధర పొందేలా రైతులు చైతన్యవంతం కావాలని కోరారు. గుంటూరులో డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ ఫౌండేషన్‌ను ఏర్పాటు చేస్తే ప్రభుత్వ పరంగా అన్ని సౌకర్యాలు కల్పిస్తామని ఈ సందర్భంగా మంత్రి హామీ ఇచ్చారు. రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ మాట్లాడుతూ సాంకేతిక పరమైన అభివృద్ధి ల్యాబ్ నుంచి ల్యాండ్‌కు సరైన విధానంలో చేరడంలేదన్నారు. టెక్నాలజీలో వస్తున్న మార్పులను రైతులు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని సూచించారు. వ్యవసాయ రంగంలో యువత అధిక పరిశోధనలు చేయాలని గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ కోరారు. నూతన రాజధాని గుంటూరును సైన్స్ సిటీగా గుర్తించాలని కేంద్ర మంత్రి వై.ఎస్.చౌదరిని కోరారు. వ్యవసాయ రంగం, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి జరిగితేనే ఆకలిచావుల నిర్మూలన సాధ్యమవుతుందన్నారు. గుంటూరును కూడా హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్ వ్యవసాయ పరిశోధనా స్థానంలా అభివృద్ధి చేయాలని రాజ్యసభ మాజీ సభ్యుడు యలమంచిలి శివాజీ కోరారు. ప్రస్తుతం ఆహార ధాన్యాల దిగుబడిలో భారతదేశం అగ్రస్థానంలో ఉందని, వ్యవసాయాన్ని లాభసాటిగా చేయడానికి అన్ని రకాల ప్రయత్నాలు జరగాలని కోరారు. మండలి చీఫ్‌విప్ నన్నపనేని రాజకుమారి మాట్లాడుతూ స్వామినాథన్ ఫౌండేషన్ వ్యవసాయాభివృద్ధికి చేస్తున్న కార్యక్రమాలను కొనియాడారు. కేంద్రం నుంచి నిధులు సకాలంలో అందడం లేదని, ప్రకృతి వైపరీత్యాల సమయంలో నష్టానికి తగిన పరిహారం రైతుకు చేరడం లేదన్నారు. పొన్నూరు ఎమ్మెల్యే దూళిపాళ్ల నరేంద్ర మాట్లాడుతూ, ఆహారభద్రత, ఆకలి చావులు గురించి మాట్లాడేటప్పుడు గిట్టుబాటు ధర గురించి కూడా మాట్లాడాల్సిన అవసరం ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాలు రైతుకు నష్టం కలిగిస్తున్నాయని చెప్పారు. వినుకొండ ఎమ్మెల్యే, టీడీపీ జిల్లా అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు మాట్లాడుతూ సేంద్రియ ఎరువులకు సబ్సిడీ కల్పించాలని, యువశాస్త్రవేత్తలు నూతన వంగడాలపై విస్తృత పరిశోధనలు చేయాలని కోరారు. బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి మాట్లాడుతూ విశ్వవిద్యాలయాలు, వ్యవసాయ ఆధారిత పరిశ్రమల మధ్య అంతరాన్ని తొలగించాలని కోరారు. ప్రస్తుతం భూముల ధరలకు, వాటి నుంచి లభిస్తున్న ఆదాయానికి పొంతన లేదన్నారు. ఎమ్మెల్సీ కె.ఎస్. లక్ష్మణరావు మాట్లాడుతూ వ్యవసాయ రంగానికి నిధుల కేటాయింపులు తగ్గిపోయాయన్నారు. 1997 నుంచి ఇప్పటి వరకు దేశంలో ఐదు లక్షల మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని, వీరిలో 90 శాతం మంది కౌలురైతులే ఉన్నారని ఆందోళన వ్యక్తం చేశారు. సమావేశానికి అధ్యక్షత వహించిన నాగార్జున యూనివర్సిటీ వీసీ ఆచార్య కె. వియ్యన్నారావు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్న ఆహార కొరతపై సమావేశాలు నిర్వహించడం మంచి పరిణామమని పేర్కొన్నారు. వ్యవసాయ అభివృద్ధి కోసం యువత విస్తృత పరిశోధనలు చేయాలన్నారు. శాస్త్ర సాంకేతిక రంగ ఫలాలను సమాజానికి మరింత చేరువచేయాలని కోరారు. ఎంఎస్ స్వామినాథన్ ఫౌండేషన్ డెరైక్టర్ డాక్టర్ అజయ్ ఫరీదా, ఎస్ఆర్ఎం యూనివర్సిటీ రీసెర్చ్ డెరైక్టర్ ఆచార్య డి.నారాయణరావు, ఆర్జీఎన్వైడీ డెరైక్టర్ డాక్టర్ లతాపిళ్ళై, సదస్సు ఆర్గనైజింగ్ సెక్రటరీ ఆచార్య కేఆర్ఎస్ సాంబశివరావు, రిజిస్ట్రార్ ఆచార్య పి.రాజశేఖర్ పాల్గొన్నారు. సమావేశాలు మూడురోజులపాటు జరగనున్నాయి. -
మంత్రిగారికి సెల్‌ఫోన్ చిక్కులు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి చేసిన ప్రకటన..వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుకు చిక్కులు తెచ్చిపెట్టింది. రుణమాఫీ జాబితాపై ఏవైనా సమస్యలుంటే మంత్రి పుల్లారావుకు ఫోన్ చేయాలంటూ రఘువీరా ఆయన ఫోన్ నెంబర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. గత మూడు రోజులుగా రైతుల నుంచి వస్తున్న ఫోన్ కాల్స్‌కు మంత్రి ఇబ్బంది పడుతున్నారట. రైతులు తమ సమస్యలు గురించి మంత్రికి ఏకరువు పెడుతున్నారు. రైతుల ఫోన్ కాల్స్‌కు సమాధానం చెప్పలేక మంత్రి అవస్థలు పడుతున్నారు. ఒక్క ఫోన్ కాల్‌కు సమాధానం చెప్పేలోపే 10 మిస్డ్ కాల్స్ వస్తున్నాయంటూ మంత్రి పుల్లారావు ఆవేదన వ్యక్తం చేశారు. -
కార్మికులకు టీడీపీ అండ: ప్రత్తిపాటి
కొరిటెపాడు(గుంటూరు): కార్మికులకు టీడీపీ అండగా ఉంటుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు చెప్పారు. జిల్లా పార్టీ కార్యాలయంలో ఆదివారం జరిగిన జిల్లా టీఎన్టీయూసీ సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్మికుల సమస్యలను సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లి వాటి పరిష్కారానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. అన్ని ప్రభుత్వ విభాగాల్లో ఉన్న కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. అన్ని విభాగాల్లోను టీ ఎన్టీయూసీ బలోపేతం చేయాలన్నారు. పార్టీ సభ్యత్వ నమోదును ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలన్నారు. టీడీపీ జిల్లా కన్వీనర్ జీవీ.ఆంజనేయులు మాట్లాడుతూ కార్యికుల సమస్యలను పరిష్కరించేందుకు మంత్రులపై ఒత్తిడి తీసుకువస్తామన్నారు. ప్రతి సంస్థలోని కార్మికులు పార్టీ సభ్యత్వ నమోదు చేయించాలని కోరారు. విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులు తమను క్రమబద్దీకరించాలని కోరుతూ మంత్రి పుల్లారావుకు వినతిపత్రం అందజేశారు. సమావేశంలో పార్టీ నేతలు మన్నవ సుబ్బారావు, గంజి చిరంజీవి, టీఎన్టీయూసీ జిల్లా అధ్యక్షుడు నారా జోషి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుంటుపల్లి శేషగిరిరావు, నాయకులు మన్నవ సత్యనారాయణ, సానికొమ్ము వెంకటేశ్వరరెడ్డి, భానుమూర్తి, మేకతోటి ప్రకాశరావు, కనకరాజు, టి.కొండయ్య తదితరులు పాల్గొన్నారు. -
కౌలురైతు కష్టం దేవుడికే ఎరుక
‘కౌలు రైతుల కష్టాలు దేవుడికి ఎరుక’ అన్నట్టు సార్వా సీజన్ ముగుస్తున్నా ఇప్పటికీ కౌలు రైతులను పట్టించుకున్న నాధుడే లేరు. సాక్షాత్తూ రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ప్రాతినిధ్యం వహిస్తున్న సొంత జిల్లాలోనే పరిస్థితి ఇలా ఉంటే రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాల్లో పరిస్థితి వేరే చెప్పనవసరం లేదు. గుంటూరు జిల్లాలో కౌలు రైతులకు ఈ ఏడాది వందకోట్ల రూపాయలు రుణాలు ఇవ్వాలనేది ప్రభుత్వ లక్ష్యం కాగా, కేవలం రూ. 53 లక్షలు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకున్నారు. చిలకలూరిపేటరూరల్ : జిల్లా వ్యాప్తంగా లక్షల్లో ఉన్న కౌలు రైతులను ఈ ఏడాది ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ఖరీఫ్‌లో అప్పులపాలయ్యారు. సాగు ఖర్చులు పెరిగిన నేపథ్యంలో పెట్టుబడులకు అందినచోటల్లా అప్పులు చేశారు. ఏదో ఒక సమయంలో ప్రభుత్వం పట్టించు కోకపోతుందా అని ఆశించిన కౌలు రైతులకు నిరాశే ఎదురవుతోంది. చివరకు అప్పులే మిగిలేలా ఉన్నాయని ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వ లక్ష్యాల మేరకు పంట రుణాలు అందించడం, వివిధ కారణాలతో పంటలను నష్టపోయిన కౌలుదారులను ఆదుకుని, తిరిగి సాగుకు ప్రోత్సహించే విధంగా 2011లో భూ అధీకృత రైతుల చట్టాన్ని ప్రభుత్వం అమల్లోకి తీసుకువచ్చింది. దీని ద్వారా కౌలు రైతులను గుర్తించి కార్డులు అందజేయాలి. తద్వారా బ్యాంకు రుణం పొందే అవకాశం కల్పించాలి. అయితే ఇప్పటివరకు ప్రభుత్వం కౌలు రైతుల పట్ల నిర్లక్ష్యంగానే వ్యవహరించింది. ఏదో మొక్కుబడిగా కౌలు రైతుల గుర్తింపు చేపట్టి చేతులు దులుపుకుంది. ఖరీఫ్ సీజన్ ఆరంభం నుంచి కౌలు రైతులకు గుర్తింపు కార్డులు పంపిణీలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. నామమాత్ర సంఖ్యలో గుర్తింపు కార్డులు ఇచ్చి చేతులు దులుపుకోవడంతో కౌలు రైతులు నానా అగచాట్లు పడుతున్నారు. జిల్లాలోని నాలుగు రెవెన్యూ డివిజన్లలో కేవలం 27వేల మంది మాత్రమే కౌలు రైతులు ఉన్నట్లు గుర్తించి భూ అధీకృత గుర్తింపు కార్డులను పంపిణీ చేశారు. వారిలో 212 మందికి ఒక్కొక్కరికీ రూ. 25వేలు చొప్పున మాత్రమే వివిధ బ్యాంకులు రుణాలు ఇచ్చాయి. అధికారులు పట్టీపట్టనట్లు వ్యవహరించటం, రుణాల మంజూ రుకు బ్యాంకర్లు విముఖత వ్యక్తం చేయడంతో కౌలు రైతులు ప్రైవేటు వడ్డీ వ్యాపారస్తులను ఆశ్రయించి పెట్టుబడులకు అప్పులు చేశారు. ఖరీఫ్ ఆరంభంలో వాతావరణం అనుకూలించకపోవటం, వర్షా లు సక్రమంగా లేకపోవడం, పెరిగిన ఎరువుల ధరలతో రైతులు ఇబ్బందులు పడ్డారు. సాగు పెట్టుబడులతోపాటే అప్పులూ పెరిగాయి. వడ్డీ వ్యాపారుల నుంచి అధిక వడ్డీలకు రుణాలు తీసుకుని సాగు చేపట్టారు. ఇప్పటికీ బ్యాంకులు రుణాలు ఇవ్వకపోవడంతో ఖరీఫ్ దిగుబడులతో అప్పులు ఎలా తీర్చాలో అర్థంకాక కౌలు రైతులు తలలు పట్టుకుంటున్నారు. కౌలు రైతులకు రుణ పంపిణీ జరిగిన తీరు .... సంవత్సరం కౌలు దారుల సంఖ్య రుణాల లక్ష్యం పంపిణీ చేసింది 2011-12 40,470 రూ 100 కోట్లు రూ 26 కోట్లు 2012-13 16,664 రూ 100కోట్లు రూ 20కోట్లు 2013-14 21,413 రూ 100కోట్లు రూ 12.31కోట్లు 2014-15 27,000 రూ 100 కోట్లు రూ 53 లక్షలు -
'పుల్లారావు.. ఇంకా పట్టు రాలేదా?'
వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసంతృప్తి వ్యక్తం చేశారు. మంగళవారం జరిగిన కేబినెట్ భేటీలో ఆయన ఈ విషయాన్ని ప్రస్తావించారు. వ్యవసాయ శాఖ కార్యకలాపాలపై ఇంకా పట్టు సాధించడం లేదని చంద్రబాబు అన్నట్లు తెలిసింది. వ్యవసాయానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని అనుసంధానం చేయాలన్న ప్రక్రియ ఎంత వరకు వచ్చిందని ప్రత్తిపాటి పుల్లారావును సీఎం ప్రశ్నించారని సమాచారం. ఈ విషయంలో సరైన సమాధానం రాకపోవడంతో ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారంటున్నారు. -
పొగాకు పంటకు డ్రిప్ సౌకర్యం
కొరిటెపాడు(గుంటూరు) : పొగాకు పంటకు డ్రిప్ ఇరిగేషన్ సౌకర్యం కల్పిస్తామని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు హామీఇచ్చారు. స్థానిక రింగ్‌రోడ్డులోని సిద్ధార్థ గార్డెన్స్‌లో శనివారం టీటీఐఐ (ది టుబాకో ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా) ఆధ్వర్యంలో కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని ఉత్తమ పొగాకు రైతు అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. కార్యక్రమానికి మంత్రి ప్రత్తిపాటి ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు. తొలుత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నియమ, నిబంధనలు పాటిస్తూ పొగాకు పండిస్తున్న రైతులను మంత్రి అభినందించారు. పంటకు గిట్టుబాటు ధర లభించేలా కృషి చేస్తానని హామీఇచ్చారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చటానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. పొగాకు బోర్డు చైర్మన్ చురుగ్గా వ్యవహరించినప్పుడే రెతులు, వ్యాపారులకు మేలు జరుగుతుందన్నారు. పొగాకు ధర తగ్గినప్పుడు కొనుగోలు చేయటానికి పొగాకు బోర్డు ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేయాలని సూచించారు. పంటల బీమా సౌకర్యం కల్పించాలి : ఎంపీ వైవీ ఒంగోలు పార్లమెంట్ సభ్యుడు వై.వి.సుబ్బారెడ్డి మాట్లాడుతూ, పొగాకు సాగులో నూతన విధానాలను అవలంబించటానికి ఉత్తమ రైతులను ఎంపిక చేసి వారికి అవార్డులు ప్రదానం చేయటం అభినందనీయమన్నారు. మూడేళ్లుగా రైతులు వ్యవసాయంలో ఎంతో నష్టపోయారని ఆందోళన వ్యక్తం చేశారు. పొగాకు బోర్డు పంటల బీమా సౌకర్యం కచ్చితంగా కల్పించాలని కోరారు. రాష్ట్రంలో పొగాకు సాగు విస్తీర్ణం పెంచాల్సిన అవసరం వుందన్నారు. పెట్టుబడులు పెరిగి సాగు ఖర్చులు అధికమయ్యాయని ఆయన చెబుతూ, అపరాధ రుసుం లేకుండా 50 క్వింటాళ్ల వరకు బోర్డు కొనుగోలు చేయాలని సూచించారు. కిలోకు సగటున రూ.150లు ధర కల్పించేలా చూడాలన్నారు. శాస్త్రవేత్తలు ఎప్పటికప్పుడు పంట పొలాలను సందర్శించి రైతులకు సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరారు. ఈ సందర్భంగా అవార్డు పొందిన ఉత్తమ రైతులను ఎంపీ అభినందించారు. బోర్డుకు రైతులు, వ్యాపారులు రెండు కళ్లు : ఎంపీ రాయపాటి నరసరావుపేట పార్లమెంట్ సభ్యుడు రాయపాటి సాంబశివరావు మాట్లాడుతూ పొగాకు బోర్డుకు రైతులు, వ్యాపారులు రెండు కళ్లులాంటివారన్నారు. భారత్‌లో సిగరెట్ అక్రమ అమ్మకాలు జరగకుండా చూడాలన్నారు. ధరలు తగ్గినప్పుడు బోర్డు కొనుగోలు చేసి బఫర్‌స్టాక్ పెట్టాలని సూచించారు. సిగరెట్లపై అధిక పన్నులు వేయటం వల్ల వినియోగదారులు నష్టపోతున్నారు తప్ప తయారీదారులు నష్టపోవటం లేదన్న విషయాన్ని గుర్తించాలన్నారు. మంచి ధర లభించేలా చూస్తా : చైర్మన్ డాక్టర్ గోపాల్ పొగాకు బోర్డు ఛైర్మన్ డాక్టర్ కె.గోపాల్ మాట్లాడుతూ బోర్డు చట్టం ప్రకారం పంటకు మంచి ధర లభించేలా చూస్తామన్నారు. 100 రోజుల్లో వేలం చేయలేని పరిస్థితి నెలకొందన్నారు. రైతులకు మంచి ధర ఇవ్వలేక పోతే విజయవంతం కాలేనట్లేనని తెలిపారు. మేలైన వంగడాలు అందించాలి :ఎమ్మెల్యే ముస్తఫా గుంటూరు తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే మహ్మద్ ముస్తఫా మాట్లాడుతూ సీటీఆర్ఐ నాణ్యమైన, అధిక దిగుబడులను ఇచ్చే విత్తనాలను తయారు చేసి రైతులకు అందించాలని సూచించారు. పొగాకు పంటకు గిట్టుబాటు ధర లభించేలా చూడాల్సిన బాధ్యత అందరిపై వుం దన్నారు. పొగాకు రైతులతోపాటు వ్యాపారులకు ఇబ్బందులు తప్పటం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ మాట్లాడుతూ 60 శాతం పొగాకు ఒక్క ప్రకాశం జిల్లాలోనే పండుతుందని తెలిపారు. ఎకరా పండించటానికి రూ.1.20 లక్షల ఖర్చు అవుతుందన్నారు. శాసన మండలి చీఫ్ విప్ నన్నపనేని రాజకుమారి మాట్లాడుతూ పొగాకు బోర్డు, ఐటీసీ కలసి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని సూచించారు. అనంతరం కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని ఉత్తమ పొగాకు రైతులకు అవార్డులను ప్రదానం చేశారు. కార్యక్రమంలో సీటీఆర్ఐ డెరైక్టర్ దామోదరరెడ్డి, బోర్డు సభ్యుడు శేషగిరిరావు, ఐటీసీ ప్రతినిధి సంజీవ్ రంగరాజు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల రైతులు పాల్గొన్నారు. -
‘జన్మభూమి, మా ఊరు’ ప్రతిష్టాత్మకం
గుంటూరు ఈస్ట్ అక్టోబర్ 2 నుంచి ప్రారంభిస్తున్న జన్మభూమి, మా ఊరు కార్యక్రమాలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని అధికారులంతా పనిచేయాలని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కోరారు. స్థానిక రెవెన్యూ కళ్యాణ మండపంలో సోమవారం ప్రభుత్వ కార్యక్రమాలపై జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ ఈ కార్యక్రమాల్లో విశేషంగా కృషి చేసిన అధికారులను గుర్తించి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళతామన్నారు. బదిలీలు జరిగే సమయంలో వారికి ప్రాధాన్యత ఇచ్చి కోరుకున్నచోటికి బదిలీ చేసేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఎన్టీఆర్ సుజల పథకాన్ని ఎక్కువ గ్రామాల్లో అమలు చేసేందుకు ఎన్నారై, స్థానిక ఔత్సాహికుల సహకారం తీసుకోవాలని కోరారు. మరుగుదొడ్ల నిర్మాణం పథకం కింద ఎంపికైన వారందరికీ రూ.15 వేలు వెంటనే అందించాలన్నారు. ఇంటికి ఒక్కరికే పెన్షన్ ఇవ్వాలన్న నిబంధనలు లేవని చెప్పారు. అక్టోబర్ 15 వరకు ఆధార్ అనుసంధానం కానివారికి రేషన్ ఇవ్వాలని ఆదేశించారు. సాంఘిక సంక్షేమ శాఖమంత్రి రావెల కిషోర్‌బాబు మాట్లాడుతూ రాజధాని గుంటూరు జిల్లాలోనే నిర్మిస్తారని ఇది జిల్లా వాసుల అదృష్టమన్నారు. రాజధాని గుంటూరు జిల్లాకు రావడానికి ప్రధాన కారణం మంత్రి ప్రత్తిపాటి పుల్లారావే అంటూ ప్రశంసల వర్షం కురిపించారు. ఎస్సీ కార్పొరేషన్‌కు ప్రభుత్వం రూ. 520 కోట్లు మంజూరు చేసిందన్నారు. 557 గ్రామ పంచాయతీల్లో సర్వే ప్రక్రియ సరిగా జరుగలేదని ఆరోపణలు వచ్చాయని, నియోజకవర్గంలో తక్కువ పింఛనుదారులు నమోదైన ప్రాంతాల్లో ఒక ప్రత్యేక అధికారిని నియమించినట్లు తెలిపారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి కె.నాగబాబు, డీఆర్డీఏ పీడీ ప్రశాంతి, ఆర్డీవో భాస్కర్‌నాయుడు తదితరులు పాల్గొన్నారు. మంత్రి మృణాళిని వీడియోకాన్ఫరెన్స్ అక్టోబరు 2 నుంచి ప్రారంభించనున్న పెంచిన సామాజిక భద్రతా పింఛను పంపిణీని సమర్థవంతంగా నిర్వహించాలని రాష్ట్రగ్రామీణాభివృద్ధి, గృహనిర్మాణం, పరిశుభ్రత మంత్రి కిమిడి మృణాళిని ఆదేశించారు. సోమవారం హైదరాబాద్ నుంచి జన్మభూమి, మా ఊరు కార్యక్రమాలపై వీడియోకాన్ఫరెన్స్‌లో కలెక్టరేట్లోని అధికారులతో ఆమె మాట్లాడారు. రాష్ట్రంలో కొత్తవి, పాతవి కలిపి సామాజిక భద్రతా పింఛన్లు 44,59,683 మందికి అందజేస్తామన్నారు. కొత్త ఇసుక పాలసీకి రాష్ట్రంలో 28 లక్షల క్యూబిక్ మీటర్లు తీసుకోవడానికి అనుమతి వచ్చిందని మైన్స్ అండ్ జియాలజీ కమిషనర్ చెప్పారు. జిల్లాలో రెండు రిజర్వాయర్ ట్యాంకుల ద్వారా ఇసుక తీయాల్సి ఉందన్నారు. కలెక్టర్ కాంతిలాల్ దండే సమాధానం ఇస్తూ రాయపూడి, ఉండవల్లి ఇసుక పూడిక తీయాల్సి ఉందని చెప్పారు. అచ్చంపేట మండలంలో 9.63 లక్షల క్యూబిక్ మీటర్లు, తుళ్ళూరు మండలంలో 3.39 లక్షల క్యూబిక్ మీటర్లు ఇసుక తీయాల్సి ఉందని వివరించారు. -
అక్టోబర్ 15లోపు తొలి విడత రుణమాఫీ
ఏపీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు సాక్షి, కర్నూలు: రైతుల రుణమాఫీకి సంబంధించి మొదటి కంతు(ఇన్స్టాల్మెంట్)ను అక్టోబర్ 15లోపు వారి ఖాతాల్లో జమ చేస్తామని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం, రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ) సహకరించకపోయినా రుణమాఫీ చేసి తీరుతామని పునరుద్ఘాటించారు. ఆయన బుధవారం కర్నూలు జిల్లాలో నిర్వహించిన ‘పొలం పిలుస్తోంది’ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అంతకు ముందు కర్నూలు నగరంలోని సి.క్యాంప్ రైతు బజార్‌ను పరిశీలించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... రైతులకు సంబంధించిన పూర్తి వివరాలను బ్యాంకర్లు ఈనెల 26వ తేదీలోగా ప్రభుత్వానికి అందజేస్తారని తెలిపారు. ఆ తర్వాత నిధుల సమీకరణను అనుసరించి మూడు విడతల్లో రుణాలన్నింటినీ మాఫీ చేస్తామన్నారు. మొదటి కంతు(ఇన్స్టాల్మెంట్)ను అక్టోబర్ 15లోపు వారి ఖాతాల్లో జమ చేస్తామని చెప్పారు. అనంతరం ‘పొలం పిలుస్తుంది’ కార్యక్రమాల్లో భాగంగా బి.తాండ్రపాడు, హుస్సేనాపురం గ్రామాల్లో మంత్రి మాట్లాడారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. ఆధునిక వ్యవసాయ పద్ధతులపై రైతులు అవగాహన పెంచుకుని అత్యాధునిక యంత్రాల సహకారంతో తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి సాధించేందుకు కృషి చేయాలని సూచించారు. కర్నూలు జిల్లాలో ఎరువుల కొరత తన దృష్టికొచ్చిందని, మరో రెండు రోజుల్లో జిల్లాకు సరిపడా యూరియాను సరఫరా చేస్తామని తెలిపారు. -
''కేంద్ర సహాయం కోరతాం''
-
ఏసీ రూముల్లో కూర్చొని ప్రకటనలా?
హైదరాబాద్ : రైతు రుణమాఫీ గురించి ఏసీ రూముల్లో కూర్చొని ప్రకటన చేస్తే సరిపోదని.. గ్రౌండ్ లెవల్లో పరిస్థితిని చూడాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ సి.రామచంద్రయ్య ప్రభుత్వానికి సూచించారు. రైతులకు బ్యాంకులు నోటీసులు ఇస్తున్నాయని.. అన్నదాతల ఆత్మహత్యలు మొదలయాయ్యని ఆయన శుక్రవారం శాసనమండలిలో ప్రస్తావించారు. తాను ప్రభుత్వంపై నిందలు వేయడానికి చెప్పడం లేదని.. వాస్తవ పరిస్థితి సభ దృష్టికి తెస్తున్నానని తెలిపారు. దేవుడి కంటే రైతే ఎక్కువ అన్న వ్యవసాయ మంత్రి పుల్లారావు వ్యాఖ్యలను రామచంద్రయ్య ఎద్దేవా చేశారు. ఎద్దు వెనుక కాదు.. శవాల వెనుక ఈ ప్రభుత్వం వస్తుందని ఆయన అన్నారు. -
వ్యవసాయ బడ్జెట్-2014 హైలెట్స్
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ తొలి వ్యవసాయ బడ్జెట్‌ను వ్యవసాయ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు శుక్రవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టారు.14 వేల కోట్ల రూపాయలతో ఈ బడ్జెట్ రూపుదిద్దుకుంది. ఈ సందర్భంగా ప్రత్తిపాటి మాట్లాడుతూ 62శాతం మంది వ్యవసాయంపైనే ఆధారపడి ఉన్నారన్నారు. *జాతీయ వ్యవసాయ విస్తరణ సాంకేతిక మిషన్‌కు రూ.62 కోట్లు *జాతీయ ఆహారభద్రతా మిషన్‌లో...ముతకధాన్యాలు, వాణిజ్యపంటలు చేర్పు *3.6లక్షల హెక్టార్లు లక్ష్యంగా రూ.153 కోట్లు కేటాయింపు *జాతీయ నూనెగింజలు, ఆయిల్‌ఫాం మిషన్లకు రూ.59 కోట్లు *రాష్ట్రీయ కృషి వికాస్యోజన పథకం ద్వారా అనుబంధ శాఖలకు కేంద్ర ప్రభుత్వం రూ.230 కోట్లు *వర్షాధార ప్రాంతాల అభివృద్ధి కోసం రూ.169 కోట్లు *ఎన్జీరంగా విశ్వవిద్యాలయంలో ఏపీలో ఏర్పాటుకు కేంద్రం ఆమోదం, రూ.50 కోట్లు కేటాయించింది *దీనికి రాష్ట్ర ప్రభుత్వం రూ.192 కోట్లు కేటాయింపు *వాటర్ మేనేజ్మెంట్, బిందుసేద్యానికి రూ.348 కోట్లు * వైఎస్ఆర్ హార్టికల్చర్ వర్సిటీకి కేంద్రం నుంచి రూ.30 కోట్లు *పట్టుపరిశ్రమకు రూ.122 కోట్లు *పశుసంవర్ధక శాఖకు రూ.723 కోట్లు *మత్స్యశాఖకు రూ.60 కోట్లు *ఎస్వీ వెటర్నరీ యూనివర్సిటీకి రూ.112 కోట్లు *సహకార శాఖకు రూ.156 కోట్లు *రైతులకు 7 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్‌కు నిర్ణయం *దీనిని 9 గంటలు పెంచేందుకు కృషిచేస్తాం *ఉచిత విద్యుత్‌కు రూ.3188 కోట్లు -
నేడు ప్రత్యేక వ్యవసాయ బడ్జెట్
శాసనసభకు సమర్పించనున్న ఏపీ మంత్రి ప్రత్తిపాటి సాక్షి, హైదరాబాద్: ఆత్మస్తుతి, పరనిందలతో పాలనా ప్రస్థానాన్ని ప్రారంభించిన టీడీపీ ప్రభుత్వం వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్‌ను ప్రవేశపెట్టేందుకు సమాయత్తమైంది. శుక్రవారం ఉదయం 10.10 గంటలకు వ్యవసాయ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు రాష్ట్ర శాసనసభకు బడ్జెట్ప్రసంగ పాఠాన్ని సమర్పించనున్నారు. వాస్తవానికి బుధవారం అసెంబ్లీలో ప్రతిపాదించిన సాధారణ బడ్జెట్లో ప్రభుత్వానికి సమస్యగా మారిన రుణమాఫీ మొదలు వ్యవసాయ యాంత్రీకరణ, సుస్థిర వ్యవసాయ పద్ధతుల వరకు అన్ని అంశాలనూ ప్రస్తావించినందున ఈ ప్రత్యేక బడ్జెట్ నుంచి కొత్తగా ఏమీ ఆశించలేమనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. -
మా దృష్టికి రాలేదు.. వచ్చినప్పుడు చూస్తాం
రైతుల పొదుపు ఖాతాల స్తంభనపై ఏపీ మంత్రి ప్రత్తిపాటి రుణ మాఫీపై ఎప్పటికి స్పష్టత వస్తుందో చెప్పలేం హైదరాబాద్: రైతుల వ్యక్తిగత పొదుపు ఖాతాలను స్తంభిం పజేస్తున్న విషయం ప్రభుత్వం దృష్టికి రాలేదని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు పేర్కొన్నారు. రైతులు తమ వ్యక్తిగత ఖాతాల్లో దాచుకున్న నగదును డ్రా చేసుకోవడానికి వీలులేకుండా బ్యాంకులు ఆంక్షలు విధించడమే కాకుండా తీసుకున్న వ్యవసాయ రుణాల బకాయి కింద లాగేసుకోవడానికి ప్రయత్నాలు మొదలుపెట్టాయని ‘సాక్షి’ బుధవారం కథనాన్ని ప్రచురించింది. బుధవారం మంత్రి సచివాలయంలోని తన చాంబర్లో మీడియా సమావేశంలో మాట్లాడినప్పుడు విలేకరులు ఈ అంశం ప్రస్తావించగా.. అది తమ దృష్టికి రాలేదని ఆయన బదులిచ్చారు. తమ దృష్టికి వచ్చినప్పుడు అలా చేయొద్దని బ్యాంకులకు ఆదేశాలిస్తామని చెప్పారు. మాఫీపై స్పష్టత ఎప్పుడో చెప్పలేం... రైతుల రుణ మాఫీపై ఆర్బీఐ నుంచి స్పష్టత వచ్చినా రాకున్నా తమ ప్రభుత్వం రుణమాఫీకి కట్టుబడి ఉందని ప్రత్తిపాటి పేర్కొన్నారు. నేరుగా నగదు ఇవ్వకపోయినా రుణమాఫీని ఇప్పటికే ప్రకటించామని.. త్వరలో నిర్దిష్ట గడువునూ ప్రకటిస్తామని చెప్పారు. అయితే ఎప్పటిలోగా అనే గడువు చెప్పలేమన్నారు. నేరుగా రుణమాఫీ చేయలేకపోయినా రైతులకు భరోసా కల్పిస్తామని పేర్కొన్నారు. కొత్త రుణాలు తీసుకోదలచిన వారు పాతవి చెల్లించి తీసుకోవచ్చని సలహా ఇచ్చారు. ఆర్బీఐ నుంచి ఆదేశాలు వచ్చే వరకు ఈ పరిస్థితి తప్పదన్నారు. రుణాలు చెల్లించినప్పటికీ ప్రభుత్వం ప్రకటించిన లక్షన్నర రూపాయల రుణమాఫీ వర్తిస్తుందని వివరించారు. ఐ-ప్యాడ్లా..? ఉత్తిదే.. దృష్టి మరల్చడానికన్నాం..! రైతులకు ఉపగ్రహ సమాచారాన్ని చేరువ చేసేందుకు ప్రతి రైతుకు ఐ-ప్యాడ్లు ఇవ్వాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతిపాదన ప్రస్తుతానికి సంబంధించినది కాదన్నారు. రైతులు ఎక్కువ మంది వరి పంటపై దృష్టి సారిస్తున్నందున వారి దృష్టి మరల్చేందుకు ముఖ్యమంత్రి ఈ మాట చెప్పారని పేర్కొన్నారు. లాభసాటిగా ఉన్న వ్యవసాయ అనుబంధ రంగాలపై రైతులు దృష్టి సారించేలా చేసేందుకు ఐ ప్యాడ్ల ప్రస్తావన చేసినట్టు తెలిపారు. పరిస్థితులు అనుకూలిస్తే భవిష్యత్‌లో ఇస్తామన్నారు. -
లాభాల్లో ఉన్న సంస్థల తాకట్టు: మంత్రి ప్రత్తిపాటి
హైదరాబాద్: రైతు రుణాల మాఫీ కోసం లాభా ల్లో ఉన్న ప్రభుత్వ కార్పొరేషన్లను బ్యాంకులకు తాకట్టు పెట్టి అప్పు తీసుకుంటామని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు చెప్పారు. శనివారం ఆయన సచివాలయంలో పౌరసరఫరాల శాఖ మం త్రి సునీత, గురజాల ఎమ్మెల్యే శ్రీనివాసరావుతో కలి సి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గత ప్రభుత్వాలు కూడా వనరుల సమీకరణకు ఇదే పద్ధతిని అనుసరించాయన్నారు. లాభాల్లో ఉన్న ఏపీ బ్రూవరీస్ కార్పొరేషన్ వంటి సంస్థలను తాకట్టు పెడతామన్నారు. అలా వచ్చే ఆదాయాన్ని బ్యాంకులకు చెల్లించి తాకట్టు నుంచి సంస్థలను విడిపిస్తామని తెలిపారు. ఎఫ్ఆర్బీఏం నిబంధనలకు అనుగుణంగానే తాకట్టు పెడతామని చెప్పారు. బాండ్లు జారీ చేసే ఆలోచన కూడా ప్రభుత్వానికి ఉందని అన్నారు. -
ఒక కుటుంబానికి ఒక్క రుణమాఫీయే
ఒక కుటుంబానికి ఒక రుణమాఫీయే వర్తిస్తుందని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు స్పష్టం చేశారు. రైతుల రుణమాఫీపై తాము వెనక్కి వెళ్లలేదని ఆయన చెప్పారు. అయితే, రైతులకు మేలు చేయాల్సిన బాధ్యత రిజర్వు బ్యాంకు మీద కూడా ఉందని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో రైతు రుణాల రీషెడ్యూలుపై రిజర్వు బ్యాంకు ఒకటి రెండు రోజుల్లో ఆదేశాలిస్తుందని భావిస్తున్నామని, ఒకవేళ అక్కడినుంచి అలాంటి ఆదేశాలు రాకపోతే.. రిజర్వు బ్యాంకు గవర్నర్‌తో మళ్లీ ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడతారని ఆయన తెలిపారు. రీషెడ్యూల్‌పై ఆదేశాలిచ్చిన తర్వాతే కోటయ్య కమిటీ నివేదిక ఇస్తుందని వివరించారు. ఈ ఏడాది వ్యవసాయ ప్రత్యేక బడ్జెట్ ప్రవేశపెడతామని వ్యవసాయశాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు అన్నారు. -
పొగాకు రైతులకూ రుణమాఫీ
వ్యవసాయ మంత్రి ప్రత్తిపాటి ఒంగోలు టూటౌన్ : చిన్నసన్నకారు రైతులు బ్యాంకుల్లో తీసుకున్న రుణాల మాఫీపై ఇంత వరకు సర్కార్ స్పష్టత ఇవ్వకముందే రాష్ట్ర వ్యవసాయ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు పొగాకు రైతుల రుణాలు కూడా మాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. బ్యాంకుల్లో తీసుకున్న రుణాలు కట్టినా.. వాటిని తిరిగి రైతులకు చెల్లిస్తామని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్రీయ కృషి విజ్ఞాన కేంద్రం(దర్శి), నాబార్డు సంయుక్తంగా శుక్రవారం ఒంగోలులోని ఆచార్య ఎన్జీ రంగాభవన్‌లో శాస్త్రవేత్తలు, రైతులతో ఏర్పాటు చేసిన ముఖాముఖి కార్యక్రమానికి వ్యవసాయశాఖ మంత్రి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉదయం నిర్వహించిన సభలో మంత్రి మాట్లాడుతూ.. ప్రభుత్వం అందిస్తున్న రాయితీలను సద్వినియోగం చేసుకోవాలని రైతులకు సూచించారు. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు అందుబాటులోకి తెస్తామన్నారు. గొర్రెల పెంపకం రైతులకు రాయితీలు ఇస్తామని చెప్పారు. కోల్డ్ స్టోరేజీల్లో ధాన్యం నిల్వ చేసుకున్న రైతులకు వడ్డీ లేని రుణాలను రూ.లక్ష నుంచి రూ.2 లక్షలకు పెంచేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రతి మండలంలో భూసార పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేస్తామన్నారు. స్వామినాథన్ కమిటీ సిఫార్సులను దశలవారీగా అమలు చేస్తామన్నారు. సాగర్, గుండ్లకమ్మ ఆయకట్టు చివరి భూములకు నీరందించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. అనంతరం వ్యవసాయ శాఖ రూపొందించిన యాక్షన్ ప్లాన్‌ను ఆవిష్కరించారు. ముందుగా రవాణా శాఖ మంత్రి శిద్దా రాఘవరావు, పర్చూరు, కొండపి శాసనసభ్యులు ఏలూరి సాంబశివరావు, బాల వీరాంజనేయస్వామి, కరణం బలరాం, కలెక్టర్ విజయకుమార్ మాట్లాడారు. ప్రాంతీయ పరిశోధన సంస్థ(గుంటూరు) అధికారి డాక్టర్ ఈ నారాయణ అధ్యక్షతన నిర్వహించిన సభలో మంత్రిని ఘనంగా సన్మానించారు. సమావేశంలో పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ ఈదర మోహన్, డీసీసీబీ చైర్మన్ బీరం వెంకటేశ్వరరెడ్డి, ఉద్యానశాఖ ఉన్నతాధికారి విజయలక్ష్మి, వ్యవసాయశాఖ జేడీ జే మురళీకృష్ణ, ఉద్యానశాఖ ఏడీఏలు రవీంద్రబాబు, జెన్నమ్మ, పశుసంవర్ధక శాఖ జేడీ రజనీకుమారి, పట్టుపరిశ్రమ శాఖ అధికారి చిత్తరంజన్ శర్మ, నాబార్డు అధికారిణి జ్యోతి శ్రీనివాస్, మార్కెటింగ్ జేడీ శ్రీనివాస్, ఏపీఎంఐపీ పీడీ మోహన్‌కుమార్, మత్స్యశాఖ ఏడీ రంగనాథ్, ప్రాంతీయ ఉద్యానశాఖ ట్రైనింగ్ ప్రిన్సిపాల్ రామారావు, ఏఎంసీ చైర్మన్ ఘనశ్యామ్, రైతు సంఘ నాయకులు దుగ్గినేని గోపీనాథ్, చుంచు శేషయ్య, చుండూరి రంగారావు, కేవీవీ ప్రసాద్, ఆత్మ పీడీ, వ్యవసాయాధికారులు పాల్గొన్నారు. ఆహార పదార్థాల ప్రదర్శన సేంద్రియ ఎరువులతో పండించి, తయారు చేసిన ఆహార పదార్థాలు, విత్తనాలను సభ వేదిక వద్ద వ్యవసాయాధికారులు ప్రదర్శనగా ఉంచారు. రాగి ముద్దలు, అరిశలు, చెక్కలు, పలురకాల విత్తనాలు, రెడ్‌గ్రామ్, గ్రీన్‌గ్రామ్, నాణ్యమైన ఇతర కూరగాయలను ప్రదర్శనగా ఉంచారు. వ్యవసాయ శాఖ అనుబంధ శాఖల ద్వారా అమలు చేస్తున్న పథకాలకు సంబంధించిన కరపత్రాలను అందుబాటులో ఉంచారు. -
గుంటూరుకు ‘గల్లా’
సాక్షి ప్రతినిధి, గుంటూరు: రానున్న ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల ఎంపికపై తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడు చేస్తున్న కసరత్తు ఆ పార్టీలో కలవరాన్ని సృష్టిస్తోంది. కష్టకాలంలో పార్టీని బతికించినవారిని విస్మరించి సర్వేల పేరుతో ధనికులకు రెడ్ కార్పెట్ పరిచేందుకు చేస్తున్న ప్రయత్నాలను వ్యతిరేకిస్తున్నారు. కొనసాగుతున్న నియోజకవర్గాల నుంచే పోటీచేస్తామని తెగేసి చెబుతున్నారు. కసరత్తు ప్రారంభమైన రోజే నేతల నుంచి తిరుగుబాటు స్వరం వినపడటంతో ఆ కసరత్తును తాత్కాలికంగా వాయిదా వేసినట్లు తెలిసింది. గురువారం రాత్రి పొద్దుపోయిన తరువాత టీడీపీ జిల్లా అధ్యక్షుడు ప్రత్తిపాటి పుల్లారావు, మరి కొందరు ఎమ్మెల్యేల సమక్షంలో అధినేత రాజధానిలో అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేశారు. గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గం, తెనాలి, నరసరావుపేట అసెంబ్లీ నియోజకవర్గాలకు జరిగిన కసరత్తుపై ఆ పార్టీలో చర్చ కొనసాగుతోంది. గుంటూరు ఎంపీ అభ్యర్థిగా పారిశ్రామికవేత్త గల్లా జయదేవ్ పేరును అధినేత చంద్రబాబు దాదాపు ఖరారు చేసినట్టుగా తెలుస్తోంది. ఇటీవల పార్టీ నిర్వహించిన సర్వేలో గల్లా జయదేవ్‌కు పరిస్థితులు సానుకూలంగా ఉన్నట్టు అధినేత స్పష్టం చేశారు. అసెంబ్లీ సెగ్మంట్లలోని పార్టీనేతలు కూడా గల్లాకు అనుకూలంగా ఉండటంతో అతని పేరును ఖరారు చేసినట్టు తెలుస్తోంది. ఇక తెనాలి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి సినీ నటుడు ఘట్టమనేని కృష్ణ సోదరుడు ఆదిశేషగిరిరావు పేరును అధినేత పరిశీలించినట్టు తెలిసింది. ఆ నియోజకవర్గంలో ఆయనకు బంధువులు వున్నారని, కమ్మ సామాజికవర్గం కూడా అక్కడ అధికంగా ఉన్నట్టు గణాంకాలతో వివరించినట్టు తెలిసింది. ఆ నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ మంత్రి ఆలపాటి రాజాను గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీకి దింపాలనే అంశంపై చర్చ జరిగినట్టు తెలిసింది. అయితే ఈ ప్రతిపాదనను రాజా వ్యతిరేకించినట్టు సమాచారం. తాను గుంటూరు నుంచి పోటీచేయనని, తెనాలి నియోజకవర్గంలో ఐదేళ్ల నుంచి పార్టీని పటిష్టం చేస్తుంటే, అక్కడికి ఎలా వెళతానని ఆయన తన అభిమానుల వద్ద పేర్కొన్నట్టు తెలిసింది. రాజా కూడా దీనిని వ్యతిరేకిస్తున్న సమాచారం బాబు వద్ద ఉండటంతో తర్వాత పరిశీలించే ధోరణిలో ఉన్నట్టు తెలిసింది. ఇక నరసరావుపేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తిరుమల డెయిరీ మేనేజింగ్ డెరైక్టర్ దండా బ్రహ్మానందం పేరు కొత్తగా తెరపైకి వచ్చింది. ఆ నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ మంత్రి కోడెల శివప్రసాద్ వ్యతిరేక వర్గం ఇటీవల చంద్రబాబును కలిసి బ్రహ్మానందంకు సీటు ఇవ్వాలని కోరినట్టు పార్టీ వర్గాల కథనం. తిరుమల డెయిరీలో ముఖ్య భాగస్వాములంతా బ్రహ్మానందంకు మద్దతు పలకడంతో కోడెల వ్యతిరేక వర్గం తమ ప్రయత్నాలను ముమ్మరం చేసినట్టు పార్టీ వర్గాల కథనం. నియోజకవర్గాల పునర్విభజనలో కోడెల స్వగ్రామం కండ్లకుంట (నకరికల్లు మండలం) సత్తెనపల్లి నియోజకవర్గ పరిధిలో ఉండటంతో ఆయన్ను అక్కడికి పంపితే పరిస్థితులు సానుకూలంగా ఉంటాయనే అభిప్రాయం వినపడుతోంది. అయితే ఈ ప్రస్తావన అధినేత వద్ద రాలేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అభ్యర్థుల ఎంపికపై రాజధానిలో తరచూ కసరత్తులు జరుగుతుండటంతో పార్టీ నేతలు అక్కడే మకాం వేస్తున్నారని కార్యకర్తలు చెబుతున్నారు.