‘ఏ ఒక్క మంత్రికి వ్యవసాయం అంటే తెలియదు’ | They don't know agriculture, says ysrcp leader MVS nagireddy | Sakshi
Sakshi News home page

‘ఏ ఒక్క మంత్రికి వ్యవసాయం అంటే తెలియదు’

Published Mon, Aug 7 2017 3:33 PM | Last Updated on Sat, Jul 6 2019 12:58 PM

They don't know agriculture, says ysrcp leader MVS nagireddy

హైదరాబాద్‌: అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్‌ కాస్త...దుర్భిక్ష ఆంధ్రప్రదేశ్‌గా మారిందని వైఎస్‌ఆర్‌ సీపీ రైతు విభాగం అధ్యక్షుడు ఎంవీఎస్‌ నాగిరెడ్డి అన్నారు. ఆయన సోమవారమిక్కడ మాట్లాడుతూ.. ఏపీ కేబినెట్‌లో ఏ ఒక్క మంత్రికి వ్యవసాయం అంటే తెలియదని, జగన్‌ను తిట్టడమే వ్యవసాయ శాఖమంత్రి ప్రత్తిపాటి పుల్లారావుకి దినచర్యగా మారిందని విమర్శించారు.

రాష్ట్రంలో వ్యవసాయ రంగం సంక్షోభంలో కూరుకుపోయిందని, మూడో విడత రుణమాఫీ ఇంకా రైతులకు చెల్లించలేదన్నారు. రాయలసీమ కరువుతో అల్లాడిపోతోందని, రైతులు నష్టపోతుంటే వ్యవసాయ మంత్రి చోద్యం చూస్తున్నారని నాగిరెడ్డి ధ్వజమెత్తారు. తొమ్మిది గంటల ఉచిత విద్యుత్‌ హామీని వెంటనే అమలు చేయాలని, ఇన్‌పుట్‌ సబ్సిడీ బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్‌ చేశారు. వలసలను ఆపి రైతులను ఆదుకునే చర్యలు చేపట్టాలని నాగిరెడ్డి సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement