MVS Nagi Reddy
-
‘చంద్రబాబు పాలనలో రైతులు ఎప్పుడూ సంతోషంగా లేరు’
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు పాలనలో రైతులు ఎప్పుడూ సంతోషంగా లేరని వైఎస్సార్సీపీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఎంవీఎస్ నాగిరెడ్డి అన్నారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, చంద్రబాబు, కరువు కవల పిల్లలని ప్రజలు చెబుతారన్నారు. బాబు పాలనలో రాష్ట్రం నుంచి ఇతర ప్రాంతాలకు వలసలు వెళ్లేవారని, వైఎస్సార్ అధికారంలోకి వచ్చాక రైతులకు మంచి రోజులు వచ్చాయన్నారు. జగన్ పాలనలో కూడా అంతకుమించి గ్రామాలన్నీ పచ్చగా ఉన్నాయని నాగిరెడ్డి అన్నారు. ఆహార ధాన్యాలు, పండ్లు ఉత్పత్తి భారీగా పెరిగింది జగన్ పాలనలోనే. భూగర్భ జలాలు సైతం అందుబాటులోకి వచ్చాయి. ప్రాజెక్టులన్నీ ప్రతి ఏటా నిండిపోయాయి. గేట్లు ఎత్తి నీటిని కిందకు వదిలిన పరిస్థితులు జగన్ పాలనలో ఉన్నాయి. చంద్రబాబు పాలనలో ఎప్పుడూ కరవు, కాటకాలే దర్శనమిచ్చాయి. చంద్రబాబు సీఎంగా ఉంటే ఆయన మనుషులు వేల కోట్లు సంపాదిస్తారు. జగన్ సీఎంగా ఉంటే అన్ని వర్గాలూ బాగుపడతాయని నాగిరెడ్డి అన్నారు. చదవండి: చింతకాయల విజయ్‌కు షాకిచ్చిన చంద్రబాబు -
సీఎం జగన్ పాలనలో వలసల్లేవు
ఇందుకూరుపేట(నెల్లూరు జిల్లా): ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలో ఉన్నత విద్య, ఉద్యోగం కోసమే రాష్ట్ర ప్రజలు బయటకు వెళుతున్నారు తప్ప, బతకడానికి పనుల కోసం వలసలు వెళ్లేవారు లేరని రాష్ట్ర వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ నాగిరెడ్డి స్పష్టం చేశారు. శనివారం ఆయన మండలంలోని రాముడుపాళెం వచ్చారు. ఈ సందర్భంగా నాగిరెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో లక్షలాది కుటుంబాలు బెంగళూరు, కేరళ, చెన్నై వంటి ప్రాంతాలకు దినసరి కార్మికులుగా వలసలు పోయారని వాపోయారు. జగన్మోహన్రెడ్డి వచ్చిన తర్వాత ఆ పరిస్థితి లేదన్నారు. రాష్ట్రంలో గత ప్రభుత్వ కాలంలో 38 లక్షల పింఛన్లు ఉండగా ప్రస్తుతం 62.70 లక్షల మందికి పింఛన్లు ఇస్తున్నారన్నారు. సీఎం చెప్పిన విధంగా ప్రాధాన్యత క్రమంలో అన్ని హామీలను నెరవేరుస్తున్నారన్నారు. రైతాంగానికి మరింత పెద్ద పీట వేశారని చెప్పారు. ప్రతి ఏటా విస్తారంగా కురుస్తున్న వర్షాల కారణంగా రోడ్లు దెబ్బతింటున్నాయని, వాటికి ఎప్పటికప్పుడు మరమ్మతులు చేయడం, పునర్ నిర్మా ణం చేస్తున్నారన్నారు. గతంలో ఆక్వా రంగానికి యూనిట్ విద్యుత్‌ను రూ.2లకు ఇవ్వాలని అప్పటి ఎంపీ రాజమోహన్‌రెడ్డితో కలిసి మండల కన్వీనర్ మావులూరు శ్రీనివాసులురెడ్డి జగన్మోహన్రెడ్డి పాదయాత్ర సమయంలో వినతిపత్రం అందించారన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత యూనిట్‌ను రూ.1.50లకే ఇచ్చిన ఘనత జగన్మోహన్రెడ్డికే దక్కిందన్నారు. మూడేళ్లలో ఆక్వా రంగానికి రూ.2,400 కోట్ల ఇచ్చారన్నారు. ప్రస్తుతం యూనిట్ విద్యుత్‌కు సుమారు రూ.6.50 ఖర్చు చేసి కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. జగనన్న కాలనీల్లో 30 లక్షల నివాసాలకు ఇళ్ల పట్టాలు ఇస్తే ఎలాంటి అసమానతలకు తావులేకుండా చేశారని నాగిరెడ్డి కొనియాడారు. ఆయన వెంట మాజీ ఎంపీపీ కైలా సం ఆదిశేషారెడ్డి, రైతు సంఘం నాయకులు కోటిరెడ్డి, పెనుబల్లి హనుమంతరావు నాయుడు, గూడూరు ప్రభాకర్‌రెడ్డి, నాగేశ్వరరెడ్డి, షబ్బీర్, కైలాసం శ్రీనివాసులురెడ్డి, పంబాల జనార్దన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
బాబు, పవన్‌కు రాజకీయ హాలిడే
సాక్షి, అమరావతి: చంద్రబాబు, పవన్ కల్యాణ్‌కు ప్రజలు ఎప్పుడో రాజకీయ హాలిడే ఇచ్చారని, అటువంటి వారు క్రాప్ హాలిడే పేరుతో రైతుల్ని రెచ్చగొడితే, వారి మాటలను ఎవరు విశ్వసిస్తారని వైఎస్సార్సీపీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, అగ్రికల్చర్ మిషన్ వైస్‌చైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి అన్నారు. అధికారంలో ఉంటే పసుపు పచ్చ కండువాలు, అధికారం పోయాక ఆకుపచ్చ కండువాలు వేసుకుని మోసంచేసే నేతలను ఎవరూ నమ్మరన్నారు. తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. రైతుల్ని గుండెల్లో పెట్టుకుని చూసే వైఎస్సార్ వారసుడిగా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి.. వ్యవసాయాన్ని లాభసాటిగా చేస్తూ, రైతు పక్షపాతిగా పరిపాలన చేస్తుంటే, అదిచూసి ఓర్వలేకే క్రాప్ హాలిడేల పేరుతో వారు ప్రభుత్వంపై కుట్రలు చేస్తున్నారని నాగిరెడ్డి ధ్వజమెత్తారు. ఆఖరికి రైతులను కూడా బాబు, పవన్‌లు స్వార్థ రాజకీయాలకు వాడుకోవడం భావ్యం కాదన్నారు. గత టీడీపీ పాలనలో ఇదే కోనసీమలో రైతులు క్రాప్ హాలిడే ప్రకటిస్తే, నిరంతరాయంగా సెక్షన్–30 అమలుచేసి, కేసులు పెడతామని రైతు సంఘాల నేతలను బెదిరించి, రైతులను అణచివేసిన చరిత్ర చంద్రబాబుదని గుర్తుచేశారు. అదే ఈ ప్రభుత్వంలో అక్కడి రైతులకు ఏమైనా సమస్యలుంటే, వాటిని సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్తే ఆయన పరిష్కరిస్తున్నారని నాగిరెడ్డి తెలిపారు. కానీ, 2014–19 మధ్య చంద్రబాబు ఇచ్చిన హామీల్లో ఒక్కటంటే ఒక్కటీ నెరవేర్చలేదని ఆయన గుర్తుచేశారు. రైతులకిచ్చిన హామీలన్నీ గాలికి.. అప్పట్లో బ్యాంకుల్లో తాకట్టు పెట్టిన పుస్తెలను ఇంటికే తెచ్చిస్తానని.. పగటిపూటే తొమ్మది గంటలపాటు నిరంతరాయంగా ఉచిత విద్యుత్ ఇస్తానని.. రూ.5 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటుచేస్తానని.. మద్దతు ధరల విషయంలో స్వామినాథన్ కమిటీ సిఫార్సులు అమలుచేస్తానని చంద్రబాబు చెప్పారని నాగిరెడ్డి వివరించారు. అలాగే, సాగునీటి ప్రాజెక్టులు వెలిగొండ, హంద్రీనీవా, గాలేరు–నగరి పోలవరం సహా అన్నింటినీ 2018 నాటికి పూర్తిచేసి, రాయలసీమకు నీళ్లిచ్చి ఎన్నికలకు వెళ్తానన్నారని.. అంతేకాక, రెయిన్ గన్లతో కరువును జయించానని.. తుపానులను, సముద్రాన్ని నియంత్రించి నీటిని పారిస్తానని కూడా చెప్పారని నాగిరెడ్డి గుర్తుచేశారు. ఇక రూ.87,612 కోట్లు వ్యవసాయ రుణాలను బేషరతుగా మాఫీ చేస్తానని హామీ ఇచ్చి, రకరకాల కోతలతో ఆ మొత్తాన్ని రూ.24 వేల కోట్లకు పరిమితం చేశారని, చివరికి అందులోనూ కోతవేశారని ఎద్దేవా చేశారు. ఆఖరి రెండు ప్రీమియంలను రైతులకు అసలు చెల్లించలేదని నాగిరెడ్డి మండిపడ్డారు. బాబును పవన్ ఏనాడైనా ప్రశ్నించాడా? 2014 ఎన్నికల్లో చంద్రబాబుకు మద్దతిచ్చి ఆయన అధికారంలోకి వచ్చాక హామీలను అమలుచేయని బాబును పవన్ ఏనాడైనా అడిగారా అని నాగిరెడ్డి సూటిగా ప్రశ్నించారు. వైఎస్ జగన్ అధికారం చేపట్టాక, 14 నెలలపాటు కోవిడ్ సంక్షోభంతో ప్రపంచ ఆర్థిక పరిస్థితులు తలకిందులైనా, రైతులను అన్నివిధాలా ఆదుకున్నారని.. ప్రజలకు మంచి చేయటానికి కావాల్సింది అనుభవం ఒక్కటే కాదని.. చిత్తశుద్ధని అన్నారు. ఇది సీఎం జగన్ నిరూపించారని ఆయన చెప్పారు. చెప్పిన దానికంటే మిన్నగా ముఖ్యమంత్రి జగన్ రైతులకు ఎంతో చేస్తున్నారంటూ ఆయా కార్యక్రమాల వివరాలను నాగిరెడ్డి మీడియాకు వివరించారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ అగ్రికల్చర్ మిషన్ సభ్యుడు జిన్నూరి రామారావు కూడా పాల్గొన్నారు. -
టీడీపీ అధికారంలో ఉంటే ఆ దరిద్రం తప్పదు: ఎంవీఎస్ నాగిరెడ్డి
-
కరువుకు బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు: ఎంవీఎస్ నాగిరెడ్డి
-
వెదురు.. రాబడికి ఉండదు బెదురు
సాక్షి, అమరావతి: వెదురు.. సహజసిద్ధమైన ప్రకృతి వనరు. పేదవాడి కలపగా, పచ్చబంగారంగా పిలుచుకునే సిరుల పంట. ఇతర మొక్కలతో పోలిస్తే 35 శాతం అధికంగా ఆక్సిజన్ ఉత్పత్తి చేయగలిగే సత్తా దీని సొంతం. ప్రస్తుతం అటవీ ప్రాంతానికే పరిమితమైన వెదురు పంటను మైదాన ప్రాంతాల్లోనూ సాగు చేయించే లక్ష్యంతో ప్రభుత్వం కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తోంది. 70 ఏళ్ల వరకు దిగుబడి వెదురు అన్ని నేలలకు అనువైనది. నీటి సౌకర్యం ఎక్కువగా ఉండాలి. ఒకసారి నాటితే 70 ఏళ్లపాటు నిరంతరాయంగా దిగుబడి లభిస్తుంది. 50 నుంచి 60 అడుగుల ఎత్తు వరకు పెరుగుతుంది. రకాలను బట్టి నాటిన మూడు, నాలుగేళ్ల నుంచి ఏటా 25–30 టన్నుల వరకు దిగుబడి ఇస్తుంది. తొలి ఏడాది ఎకరాకు రూ.60 వేల వరకు పెట్టుబడి అవసరం అవుతుంది. ఆ తర్వాత ఏటా ఎకరాకు రూ.10 వేల ఖర్చు చేస్తే చాలు రూ.50 వేల నుంచి రూ.70 వేల వరకు ఆదాయం వస్తుంది. వెదురులో 140కు పైగా రకాలున్నప్పటికీ మన ప్రాంతానికి అనువైనవి, మార్కెట్లో డిమాండ్ ఉన్నవి 14 రకాలే. వెదురు సాగును ప్రోత్సహిస్తే భూమి సారవంతమవుతుంది. సాగులో ఎలాంటి రసాయనాలు ఉపయోగించాల్సిన అవసరం లేదు. లంక, బీడు భూములతో పాటు పొలం గట్లు, పండ్ల తోటల చుట్టూ కంచె రూపంలో సాగు చేస్తే పంటలకు రక్షణతో పాటు రాబడికి ఢోకా ఉండదు. యాక్షన్ ప్లాన్ ఇలా.. అటవీ శాఖ అధీనంలో ఉండే వెదురు మిషన్‌ను ప్రభుత్వం ఇటీవలే ఉద్యాన శాఖ పరిధిలోకి తీసుకొచ్చింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో రాష్ట్ర స్థాయి కమిటీని ఏర్పాటు చేస్తున్నారు. ఈ కమిటీలో వ్యవసాయ శాఖ స్పెషల్ సీఎస్, వ్యవసాయ, ఉద్యాన శాఖ కమిషనర్లు, అటవీ, పర్యావరణ, పరిశ్రమల విభాగాల కార్యదర్శులు, ఏపీ వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ సభ్యులుగా ఉంటారు. వెదురు కార్పొరేషన్ చైర్మన్, వెదురు సాగుచేసే రైతులను కమిటీలో ప్రభుత్వం నామినేట్ చేస్తుంది. ఆర్బీకేల ద్వారా జిల్లాల వారీగా వెదురు సాగుకు అనువైన ప్రాంతాలను గుర్తించారు. కనీసం మూడేళ్ల పాటు సాగు విస్తరణను ప్రోత్సహిస్తారు. తొలి ఏడాది 500 హెక్టార్లు ఆత ర్వాత ఏటా 1,500 నుంచి 2వేల హెక్టార్ల చొప్పున విస్తరించాలని సంకల్పించారు. సబ్సిడీ ఇలా.. నాటిన తర్వాత ఒక్కో మొక్కకు మూడేళ్లపాటు రూ.240 వరకు ఖర్చవుతుంది. ప్రైవేటు భూముల్లో సాగు చేసే వారికి 50 శాతం, ప్రభుత్వ భూముల్లో నాటితే 100 శాతం సబ్సిడీ ఇవ్వనున్నారు. సబ్సిడీ మొత్తంలో తొలి ఏడాది 50 శాతం, రెండో ఏడాది 30 శాతం, మూడో ఏడాది 20 శాతం చొప్పున అందిస్తారు. పంట పొలాలు, పండ్ల తోటలు, ఆక్వా చెరువుల చుట్టూ కంచె రూపంలో వెదురు మొక్కలు వేసినా పరిగణనలోకి తీసుకుని నిర్దేశించిన సబ్సిడీని అందిస్తారు. రూ.7.5 లక్షలతో చిన్న నర్సరీలు, రూ.15 లక్షలతో పెద్ద నర్సరీలు ఏర్పాటుకు ముందుకొచ్చే వారికి 40 శాతం సబ్సిడీ అందిస్తారు. ఇక ప్రాసెసింగ్ యూనిట్లకు 50 శాతం సబ్సిడీ ఇస్తారు. ఫర్నిచర్, వెదురు ఉప ఉత్పత్తులను అమ్ముకునే వారికి సైతం 50 శాతం సబ్సిడీతో చేయూత ఇస్తారు. ఇలా విత్తు నుంచి విక్రయం వరకు చేయూత అందించేలా రూ.10కోట్ల అంచనాతో యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తున్నారు. జూలై నుంచి అమలుకు సన్నాహాలు చేస్తున్నారు. ఎరువు అవసరం లేదు రెండేళ్ల క్రితం హోసూరు నుంచి టిష్యూకల్చర్ భీమ వెదురు మొక్కలు తెచ్చి పెదకూరపాడు మండలం గారపాడులోని రెండెకరాల్లో నాటాను. ఎరువు వేయలేదు. డ్రిప్‌తో నీరందిస్తున్నా. ప్రస్తుతం గెడలు 15 అడుగులు పెరిగాయి. మూడేళ్ల తర్వాత మంచి దిగుబడి వస్తుంది. – వి.వెంకటేశ్వర్లు, సత్తెనపల్లి, పల్నాడు జిల్లా యాక్షన్ ప్లాన్ సిద్ధం రాష్ట్రంలో వెదురు సాగును ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తోంది. జూలై నుంచే అమలులోకి తీసుకొచ్చేందుకు కసరత్తు జరుగుతోంది. లంక భూముల కోతను వెదురు సాగుతో కట్టడి చేయొచ్చు. – ఎంవీఎస్ నాగిరెడ్డి, వైస్ చైర్మన్, ఏపీ వ్యవసాయ మిషన్ -
దిగజారుడు రాజకీయాలు చేసి ఢిల్లీ వీధుల్లో డ్రామాలా..?
-
దిగజారుడు రాజకీయాలు చేసి ఢిల్లీ వీధుల్లో డ్రామాలా..?: మంత్రి కన్నబాబు
సాక్షి, తాడేపల్లి: ఇప్పటి వరకు రైతు భరోసా కింద రూ.18,777 కోట్లు ఇచ్చామని వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు స్పష్టం చేశారు. మంగళవారం వైఎస్సార్ రైతు భరోసా, సున్నావడ్డీ, వైఎస్సార్ యంత్ర సేవా పథకాలను సీఎం వైఎస్ జగన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కన్నబాబు మాట్లాడుతూ.. టీడీపీ హయాంలో పంట రుణ మాఫీ కింద రూ.12,500 కోట్లు ఇస్తే ఈ రెండున్నరేళ్లలో 18,777 కోట్లు ఇచ్చాం. మేనిఫెస్టోలో రైతు కోసం ఇచ్చిన హామీలు నూటికి నూరు శాతం అమలు చేస్తున్నారు. కేవలం తన రాజకీయాల కోసం ఢిల్లీ వీధుల్లో రాష్ట్ర ప్రజల ఖ్యాతిని చంద్రబాబు తగ్గిస్తున్నారు. రాష్ట్రంలో మాదక ద్రవ్యాలు ఉన్నట్లు ఢిల్లీ వీధుల్లో చెప్తున్నారు. ఇలాంటి తప్పుడు ప్రచారం వల్ల ఇతర రాష్ట్రాలు ఏమనుకుంటాయి. మీరు తిట్టిన తిట్లు వాళ్లకి గుర్తు ఉండవా..?. రాష్ట్రపతి రాజధాని గురించి అడిగితే నాశనం చేశారని చెప్పారట. పదేళ్ల హక్కును వదిలేసి ఇక్కడికి పారిపోయి వచ్చి మేమేదో నాశనం చేశామని చెప్పారట. మీ రియల్ ఎస్టేట్ అవసరాల కోసం మూడు రాజధానులు అడ్డుకుని మాపై నిందలా?. దిగజారుడు రాజకీయాలు చేసి ఢిల్లీ వీధుల్లో డ్రామాలు చేస్తున్నారా?. పార్టీ బతికుందని చెప్పుకునే ప్రయత్నం కాదా?. పుస్తకాల్లో పేర్లు రాసుకోవడం కాదు మా కార్యకర్తపై చెయ్యి వేసి చూడండి. ఈ డ్రామాలన్నీ మోదీ, అమిత్ షాలకు తెలుసు. వాళ్లకి ఇక్కడి వాస్తవ పరిస్థితులు తెలియవా? ఆయన మాట్లాడిన మాటలు వాళ్లకు తెలియదా..?. తప్పకుండా ఎన్నికల కమిషన్‌కు పిర్యాదు చేస్తాం. ఎప్పుడు 356 పెట్టాలో వాళ్ళకి తెలియదా?. చంద్రబాబుకి ముందు నిబద్ధత, క్రమశిక్షణ, కట్టుబాటు లేదు అంటూ మంత్రి కురసాల కన్నబాబు ఫైర్ అయ్యారు. చదవండి: (రైతుల ఖాతాల్లో రూ.2,190 కోట్లు జమ చేసిన సీఎం జగన్) ఏపీ అగ్రిమిషన్ వైస్ చైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి మాట్లాడుతూ.. దేశ చరిత్రలోనే రైతుకు పెట్టుబడి సాయంగా నగదు ఇవ్వడం ఇక్కడే జరిగింది. అక్టోబర్ నెల రైతుకు చాలా కీలకం. అందుకే మూడు విడతలుగా విభజించాము. రైతులకు మేలు చేయడం కోసం రూ.12,500 నుంచి 13,500 చేశారు. కౌలు రైతులకు కూడా ఈ భరోసా అందిస్తున్నాం. చెప్పిన మాట చెప్పినట్లుగా విడుదల చేస్తున్న ప్రభుత్వం మాది. ఇంత సంక్షోభంలోనూ అమలు చేయడం సామాన్యమైన విషయం కాదు. టీడీపీ ప్రతిపక్షంలోకి రాగానే తాము చేసిన మోసాలు మర్చిపోయారు అని ఎంవీఎస్ నాగిరెడ్డి అన్నారు. -
తెల్లదోమ నియంత్రణకు జాతీయ స్థాయి పరిశోధనలు అవసరం
సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా కొబ్బరి, ఆయిల్‌పామ్, మామిడి, అరటి, బొప్పాయి, సీతాఫలం, కోకో పంటలను దెబ్బతీస్తున్న సర్పలాకార తెల్లదోమ (రుగోస్ స్పైరల్లింగ్ వైట్ఫ్లై) నియంత్రణకు విస్తృత పరిశోధనలు నిర్వహించేలా బాధిత రాష్ట్రాలతో కలిసి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాజెక్టు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఏపీ వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి స్పష్టం చేశారు. తెల్లదోమ ప్రభావంతో పంటలు తీవ్రంగా దెబ్బతిన్న తమిళనాడు రాష్ట్రంలో తీసుకుంటున్న నియంత్రణ చర్యలను పరిశీలించేందుకు నాగిరెడ్డి నేతృత్వంలోని బృందం కోయంబత్తూరులోని వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఆ రాష్ట్ర శాస్త్రవేత్తలతో బుధవారం భేటీ అయింది. ఈ సందర్భంగా నాగిరెడ్డి మాట్లాడుతూ.. తెల్లదోమ ప్రభావంతో మన రాష్ట్రంలో 2019–20లో 21,966 హెక్టార్లు, 2020–21లో 35,875 హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయని చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లాలో కొబ్బరి, ఆయిల్‌పామ్, నెల్లూరు జిల్లాలో అరటిపై ఈ దోమ ఎక్కువగా ఆశించినట్టు గుర్తించామన్నారు. ఇది జూన్, జూలై, ఆగస్టు నెలల్లో తగ్గిపోతున్నప్పటికీ.. తిరిగి సెప్టెంబర్‌లో మొదలై డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల్లో తీవ్ర ప్రభావం చూపుతోందన్నారు. ఈ విషయాన్ని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా విస్తృత పరిశోధనలు చేయాలని ఉద్యాన విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్‌ను ఆదేశించారన్నారు. ఉద్యాన వర్సిటీ అభివృద్ధి చేసిన జీవ నియంత్రణ చర్యల వల్ల 20 శాతానికి మించి నియంత్రించలేకపోతున్నారన్నారు. బయో కంట్రోలింగ్, ఆముదం రాసిన ఎల్లోపాడ్స్ ఎక్కువగా సిఫార్సు చేస్తున్నామని, పురుగుల మందులను అజాడిరక్టిన్‌తో కలిపి వాడొద్దని సూచిస్తున్నారని చెప్పారు. పెద్దఎత్తున బదనికలను సరఫరా చేయాలంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక పథకాన్ని ప్రకటించి ఆర్థిక చేయూత ఇవ్వాల్సిన అవసరం ఉందని నాగిరెడ్డి స్పష్టం చేశారు. -
ఏపీ పథకాలు దేశంలోనే ఆదర్శం
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ ఎంవీయస్ నాగిరెడ్డి తెలిపారు. అధికారం కోసం అడ్డగోలు హామీలు ఇచ్చి మోసం చేసిన చంద్రబాబును రైతులు ఎన్నటికీ నమ్మరని విమర్శించారు. 14 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు రాయలసీమకు చేసింది ఏమీ లేదన్నారు. పైగా ఆయన ఎప్పుడు అధికారంలోకి వచ్చినా రాష్ట్రంలో కరువే అన్నారు. చంద్రబాబు దండగ అన్న వ్యవసాయాన్ని దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి పండగ చేశారని చెప్పారు. ఆ మహానేత కుమారుడు వైఎస్ జగన్ సీఎం అయ్యాక వ్యవసాయానికి చేయూతనిచ్చి రైతును రాజును చేశారన్నారు. ఇలాంటి ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేందుకు టీడీపీ విష ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. ఈ మేరకు గురువారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఇందులో ఏం చెప్పారంటే.. ► రాష్ట్రంలో ఖరీఫ్‌లో వరి తర్వాత అత్యధికంగా సాగయ్యే పంట వేరుశనగ. 2014–15 నుండి ఇప్పటి దాకా ఈ పంట వివరాలు తెప్పించుకుని చూస్తే చంద్రబాబుకు వాస్తవాలు తెలుస్తాయి. ► రాయలసీమలో కేవలం 3 శాసన సభ స్థానాలకే టీడీపీని ప్రజలు పరిమితం చేశాక కూడా, అక్కడి ప్రజలను ఇంకా మోసం చేసేందుకు టీడీపీ నేతలు అబద్ధాలు ప్రచారం చేస్తుండటం దారుణం. ► కరువు, చంద్రబాబు కవల పిల్లలుగా సాగిన పాలన అందరికీ తెలుసు. వ్యవసాయ రుణాలన్నీ మాఫీ చేస్తానని.. పగటి పూటే తొమ్మిది గంటలు నిరంతరంగా వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఇస్తానని చెప్పి మాట తప్పారు. ఈ విషయాలు రైతులెవరూ మరచిపోరు. ► ఇలాంటి చంద్రబాబు, టీడీపీ నేతలు ఈ రోజు వ్యవసాయం గురించి, రైతుల గురించి మాట్లాడటం వింతగా ఉంది. కోవిడ్ సంక్షోభంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో ప్రకటించిన సమయానికి పథకాలు అమలవుతున్నాయి. ► క్షేత్ర స్థాయిలో ఎక్కడైనా చిన్న చిన్న లోటుపాట్లు కనిపిస్తే, ప్రభుత్వం దృష్టికి తెచ్చి.. నిర్మాణాత్మక ప్రతి పక్షంగా వ్యవహరించకపోగా.. కుల, మతాల పేరుతో, అబద్ధపు ప్రచారాలతో లబ్ధిపొందేందుకు యత్నిస్తున్న ఇటువంటి ప్రతిపక్షాన్ని చూడటం దేశంలో ఇదే ప్రథమం. -
ఏపీ: ‘భారత్ బంద్’ ప్రశాంతం
సాక్షి, అమరావతి: గులాబ్ తుపానుతో భారీవర్షం కురుస్తున్న వేళ పటిష్ట బందోబస్తు మధ్య రాష్ట్రంలో సోమవారం ‘భారత్ బంద్’ ప్రశాంతంగా ముగిసింది. సంయుక్త కిసాన్ మోర్చా పిలుపు మేరకు జరిగిన దేశవ్యాప్త బంద్‌లో రాజకీయ పార్టీలు తమ జెండాలను పక్కనబెట్టి రైతు సంక్షేమమే అజెండాగా పాల్గొన్నాయి. జన ప్రయోజనమే తమ ప్రాధాన్యత అని నినదించాయి. రాష్ట్రంలో అధికార వైఎస్సార్సీపీ బంద్‌కు మద్దతు తెలపడంతో బస్సులు, బడులు బంద్ అయ్యాయి. దారులు మూసుకుపోయాయి. రైళ్లు రద్దయ్యాయి. వాణిజ్య సముదాయాలు, వ్యాపారకేంద్రాలు మధ్యాహ్నం వరకు మూతపడ్డాయి. ముందస్తు హెచ్చరికలతోపాటు భారీవర్షం కూడా తోడవడంతో అత్యవసరమైతే తప్ప జనం రోడ్ల మీదకు రాలేదు. సినీ థియేటర్లలో ఉదయం ఆటలు రద్దయ్యాయి. పాడేరు ఏజెన్సీలో స్వల్ప ఉద్రిక్తత ఏర్పడింది. అంబులెన్స్, డాక్టర్లు.. ఇతర అత్యవసర సేవలకు అంతరాయం కలిగించకుండా శాంతియుతంగా నిరసనలు తెలిపినట్టు సంయుక్త కిసాన్ మోర్చా రాష్ట్ర కమిటీ ప్రకటించింది. వర్షాలను లెక్కచేయకుండా ఉదయం ఏడు గంటలకే వామపక్షాల, కార్మికసంఘాల నేతలు ఆందోళనకారులతో కలిసి విజయవాడ ఆర్టీసీ బస్టాండ్‌కు చేరుకుని ర్యాలీ నిర్వహించారు. విశాఖ ఉక్కును ప్రైవేట్‌పరం చేయవద్దని కోరుతూ భారీ ప్రదర్శనలు నిర్వహించి ప్లకార్డులు ప్రదర్శించారు. తిరుపతిలో రైలు పట్టాలపై బైఠాయించి రైళ్ల రాకపోకలను అడ్డుకున్నారు. పోలీసులు జోక్యం చేసుకుని వారిని బయటకు పంపించారు. కేంద్ర ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలను అవలంభిస్తోందంటూ ఆందోళనకారులు నినాదాలతో హోరెత్తించారు. కార్మిక కర్షక మైత్రి, లౌకిక ప్రజాతంత్ర శక్తుల ఐక్యత వర్ధిల్లాలని, సాగురంగాన్ని కార్పొరేట్ సంస్థల నుంచి కాపాడాలని, నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని, పెట్రో ఉత్పత్తుల ధరలు తగ్గించాలని, విశాఖ ఉక్కును ప్రైవేటుపరం చేయవద్దని, లేబర్ కోడ్లను రద్దుచేయాలని, రాష్ట్ర విభజన హామీలను అమలు చేయాలని నినాదాలు చేశారు. ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో ప్లకార్డులను ప్రదర్శించారు. భారత్ బంద్కున్న చారిత్రక నేపథ్యం దృష్ట్యా రాజకీయ పార్టీలు అంతర్గత విభేదాలను, వైరుధ్యాలను పక్కనబెట్టి బంద్‌లో పాల్గొన్నాయి. రైతుసంఘాలు భారత్ బంద్‌కు పిలుపు ఇచ్చిన నేపథ్యంలో వర్షంలోనే విశాఖలో బంద్ కొనసాగింది. నిరసనకారులు రోడ్లపై బైఠాయించి బంద్‌లో పాల్గొన్నారు. అన్ని జిల్లాల్లోను బంద్ విజయవంతమైంది. పలుచోట్ల వినూత్నంగా కేంద్ర ప్రభుత్వానికి నిరసనలు తెలిపారు. రైతుల గుండెచప్పుడు ఢిల్లీకి వినిపించడంలో సహకరించినందుకు ధన్యవాదాలని కిసాన్ మోర్చా నాయకులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ బంద్‌కు బీజేపీ దూరంగా ఉంది. రైతు సంఘాల ఆందోళనకు వైఎస్సార్సీపీ సంఘీభావం – వైఎస్సార్సీపీ రైతు విభాగం అధ్యక్షుడు, వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ ఎం.వి.ఎస్.నాగిరెడ్డి సాక్షి, అమరావతి: రైతు సంఘాల పిలుపు మేరకు సంయుక్త కిసాన్ మోర్చా సోమవారం దేశవ్యాప్తంగా నిర్వహించిన ఆందోళనలకు రైతు పక్షపాత పార్టీగా వైఎస్సార్సీపీ సంఘీభావం ప్రకటించినట్లు ఆ పార్టీ రైతు విభాగం అధ్యక్షుడు, వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ ఎం.వి.ఎస్.నాగిరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున మధ్యాహ్నం ఒంటిగంట వరకు స్వచ్ఛందంగా ఆర్టీసీ బస్సులను కూడా నిలిపేసినట్లు తెలిపారు. గతంలో కూడా ఇదే మాదిరిగా దేశవ్యాప్త రైతు సంఘాల ఆందోళనలకు వైఎస్సార్సీపీ సంఘీభావం ప్రకటించినట్లు ఆయన గుర్తుచేశారు. -
‘సీఎం జగన్‌ది రైతు ప్రభుత్వం'
-
‘సీఎం జగన్‌ది రైతు ప్రభుత్వం'
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డిది రైతు ప్రభుత్వమని, నవరత్నాల్లో కూడా మొదటిగా రైతుల సంక్షేమానికే ప్రాధాన్యమిచ్చినట్లు వైఎస్సార్సీపీ రైతు విభాగం అధ్యక్షుడు ఎంవీఎస్ నాగిరెడ్డి అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రేపటిభారత్ బంద్‌కు వైఎస్సార్సీపీ రైతు విభాగం మద్దతు ఇవ్వనున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం 9 గంటలు పగలు విద్యుత్ ఇస్తోందని, బీమా ప్రీమియం కూడా ప్రభుత్వమే చెల్లిస్తోందన్నారు. ఏదైతే కేంద్రాన్ని ప్రస్తుతం రైతులు డిమాండ్ చేస్తున్నారో వాటిని మన రాష్ట్రంలో పరిష్కరించామని వెల్లడించారు. రేపటి బంద్ వల్ల రైతుకు న్యాయం జరగాలని కోరుతూ.. రైతులపై, రైతుల సంఘాలపై గౌరవంతో ఈ బంద్ కి సంఘీభావం తెలుపుతున్నామని ఆయన చెప్పారు. చదవండి: Chandra Babu Naidu బాబోయ్.. మీకో దండం! -
మీ హయాంలో ఏటా కరువే
సాక్షి, అమరావతి: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ‘రైతు కోసం...’ అని పిలుపునివ్వడం ఈ శతాబ్ధంలోనే అతి పెద్ద జోక్ అని వైఎస్సార్సీపీ రాష్ట్ర రైతు విభాగం అధ్యక్షుడు, వ్యవసాయ మిషన్ ఉపాధ్యక్షుడు ఎంవీఎస్ నాగిరెడ్డి ఎద్దేవా చేశారు. 14 ఏళ్లపాటు సీఎంగా ఉన్న చంద్రబాబు ఏనాడూ రైతుల గురించి పట్టించుకోలేదన్నారు. ఆయన పదవి నుంచి దిగిపోయేనాటికి రాష్ట్రంలో రైతుల పరిస్థితి ఎలా ఉందో అందరికీ తెలిసిందేనని, వరుసగా ఐదేళ్లూ కరువు మండలాలను ప్రకటించడమే ఆ నిర్వాకాలకు నిదర్శనమన్నారు. ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతుల సమస్యకు పరిష్కారం చూపాలని, నష్టపరిహారం ఇవ్వాలని నాడు దివంగత వైఎస్సార్ కోరితే దానివల్ల మరింత మంది ఆత్మహత్యలు చేసుకుంటారని చంద్రబాబు అవహేళనగా మాట్లాడారన్నారు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఇస్తామని వైఎస్సార్ ప్రకటించినప్పుడు కూడా చంద్రబాబు చులకనగా మాట్లాడారని గుర్తు చేశారు. బుధవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో నాగిరెడ్డి విలేకరులతో మాట్లాడారు. రైతు కోసం.. ఏం చేశావ్ బాబూ? రాష్ట్రంలో ఇప్పుడు ఒక్క కరువు మండలం కూడా లేనందుకు, రైతులు బాగున్నందుకు చంద్రబాబు రోడ్డెక్కుతున్నారా? అని నాగిరెడ్డి ప్రశ్నించారు. 2014లో రాష్ట్రంలో 238 కరువు మండలాలు ఉన్నట్లు గత ప్రభుత్వమే అధికారికంగా ప్రకటించిందని చెప్పారు. ఆ తరువాత కూడా వరుసగా నాలుగేళ్లు కరువు మండలాలను ప్రకటించారని గుర్తు చేశారు. సాగునీటి ప్రాజెక్టులు దండగని, పావలా వడ్డీ కూడా రాదని చంద్రబాబు తన ‘మనసులో మాట’ పుస్తకంలో రాసుకున్నారని చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో 9 ఏళ్లు అధికారంలో కొనసాగి ఒక్క సాగునీటి ప్రాజెక్ట్ కూడా చేపట్టలేదని దుయ్యబట్టారు. దేవెగౌడను తానే ప్రధానిగా చేశానని గొప్పలు చెప్పుకుంటూ ఆల్మట్టి ఎత్తు పెంచుతున్నా నిర్లిప్తంగా వ్యవహరించారని ధ్వజమెత్తారు. ఐదేళ్లు అధికారంలో ఉండి ఒక్క హామీని కూడా నెరవేర్చలేదన్నారు. చంద్రబాబు ఇప్పటికైనా ఆత్మవిమర్శ చేసుకుని నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషించాలని హితవు పలికారు. -
‘రైతుల కోసం చంద్రబాబు ఆందోళన చేయడం హాస్యాస్పదం’
సాక్షి, తాడేపల్లి: రైతుల కోసం చంద్రబాబు నాయుడు ఆందోళన చేయడం హాస్యాస్పదమని వైఎస్సార్సీపీ రైతు విభాగం అధ్యక్షుడు ఎంవీఎస్ నాగిరెడ్డి ఎద్దేవా చేశారు. ఆయన తాడేపల్లిలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. చంద్రబాబు పాలనలో రైతులకు చేసిందేమి లేదన్నారు. గిట్టుబలు ధరలు లభించక రైతులు అప్పుల పాలయ్యారని మండిపడ్డారు. గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకులు దివాలా తీసే పరిస్థితి వచ్చిందని విమర్శించారు. 2004కి ముందు రైతుల పరిస్థితి ఏవిధంగా ఉందో అందరికీ తెలిసిందే అన్నారు. రైతులు అప్పులపాలై ఆత్మహత్యలకు పాల్పడ్డారని తెలిపారు. చదవండి: మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు ఆత్మహత్యలు చేసిన వారికి పరిహారం ఇవ్వాలంటే అలాఇస్తే మరింత మంది ఆత్మహత్య చేసుకుంటారన్న వ్యక్తి చంద్రబాబని తీవ్రంగా ధ్వజమెత్తారు. ఏపీలో చంద్రబాబు ఒక్క ప్రాజెక్టును కూడా చేపట్టలేదని, ఎన్నికలొస్తే ఆయనకు మళ్లీ రైతులు గుర్తొస్తారని ఎద్దేవా చేశారు. గత ఐదేళ్ల పాలనలో ఎక్కడన్నా చంద్రబాబు ఇచ్చిన హామీలు నెరవేర్చాడా? అని ప్రశ్నించారు. ఇప్పుడు ఎందుకు రైతు కోసం అని పిలుపునిచ్చారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. బాబు హయాంలో ఏటా అనేక కరువు మండలాలను ప్రకటించారని, ఈ రెండున్నరేళ్లలో ఒక్క కరువు మండలం లేదని చెప్పారు. -
‘రైతుకోసం’ మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదు
సాక్షి, అమరావతి: రైతు పేరెత్తే అర్హత టీడీపీ అధినేత చంద్రబాబుకు లేదని రాష్ట్ర వ్యవసాయ మిషన్ వైస్‌చైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి చెప్పారు. వ్యవసాయం దండగ అంటూ అధికారంలో ఉన్నప్పుడు రైతులను నిలువునా ముంచేసి ఇప్పుడు రైతుల కోసం అంటూ కపటప్రేమ చూపడం హాస్యాస్పదంగా ఉందన్నారు. 2014లో ఎన్నికల ముందు బేషరతుగా రుణమాఫీ చేస్తానని నమ్మించి రైతులను అప్పుల ఊబిలో కూరుకుపోయేలా చేశారని మండిపడ్డారు. వ్యవసాయానికి తొమ్మిది గంటల ఉచిత విద్యుత్, రూ.5 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు, స్వామినాథన్ కమిటీ సిఫార్సుల అమలు, సాగునీటి ప్రాజెక్టులన్నీ పూర్తిచేస్తాం వంటి వివిధ రకాల హామీలను ఇచ్చిన చంద్రబాబు.. వాటిలో ఒక్కటైనా పూర్తిచేశారా? అని ప్రశ్నించారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి 27 నెలల పాలనలో 14 నెలలు కోవిడ్–19 సంక్షోభ పరిస్థితుల మూలంగా రాష్ట్ర ఆదాయం గణనీయంగా తగ్గినప్పటికీ రైతులు, పేదలు సహా వివిధ వర్గాల ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ఎక్కడా వెనుకడుగు వేయలేదని చెప్పారు. కోవిడ్ సంక్షోభం కారణంగా దేశంలో సంపన్నమైన మహారాష్ట్ర, గుజరాత్, ఢిల్లీ వంటి రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఇచ్చిన హామీలను అమలు చేయలేదని తెలిపారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎం అయ్యాక రైతులకు రూ.83 వేల కోట్ల లబ్ధి చేకూర్చారని, పోలవరంతో సహా ప్రాజెక్టులన్నీ యుద్ధప్రాతిపదికన పూర్తిచేస్తున్నారని చెప్పారు. ఉచిత విద్యుత్‌తో సహా ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసి చూపించారన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా గత ఆగస్టు 31 వరకు రాష్ట్ర ప్రభుత్వం వైఎస్సార్ రైతుభరోసా కింద రూ.17,030 కోట్లు అన్నదాతలకు ఇచ్చిందన్నారు. 18.7 లక్షల వ్యవసాయ కనెక్షన్లకు 9గంటల పగటి ఉచిత విద్యుత్‌కోసం రూ.8,353 కోట్లు, విద్యుత్ సబ్స్టేషన్ల ఆధునికీకరణకు రూ.1,700 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో విద్యుత్ డిస్కమ్‌లకు రూ.20 వేల కోట్ల బకాయి ఉండగా ఇందులో రూ.8,750 కోట్లు ఉచిత విద్యుత్ బకాయిలేన న్నారు. -
మహానేత వైఎస్సార్: నిలువెత్తు సంక్షేమ రూపం
తన పంటకు మా ముఖ్యమంత్రి ఉన్నాడనే భరోసా రైతుకూ, తన వైద్యానికి మా ముఖ్యమంత్రి ఉన్నాడనే భరోసా రోగికీ, మా పిల్లల చదువుకు మా ముఖ్యమంత్రి ఉన్నాడనే భరోసా తల్లితండ్రులకూ, తలెత్తుకుని నడిచే సాధికారత మహిళలకూ, శేషజీవితానికి దిగుల్లేదనే భరోసా వృద్ధులకూ కల్పించిన గొప్ప మానవీయ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి. జలయజ్ఞంతో బీడుభూములను సస్యశ్యామలం చేశారు. ఆరోగ్యశ్రీ, ఉచిత విద్యుత్ పథకాలతో దేశానికే ఆదర్శంగా నిలిచారు. రెండవ హరిత విప్లవాన్ని కలగన్నారు. అభివృద్ధి, సంక్షేమం తన రెండు కళ్లుగా పాలన సాగించారు వైఎస్. కేవలం ఐదేళ్ల మూడు నెలలు మాత్రమే ముఖ్యమంత్రిగా ఉన్నారు వైఎస్ రాజశేఖర రెడ్డి. అయినా ప్రజా సంక్షేమం కోసం ఎవరూ చేయలేని పనులు చేశారు. రాజకీయ నాయకుడిగా తొలి రోజులలోనే అసెంబ్లీలో విస్పష్టంగా సాగునీటి అవసరం గురించి మాట్లాడారు. ‘నేను యువకుడిగా కోస్తా ప్రాంతానికి వెళ్ళినప్పుడు, ఆ కాలువలలో పారుతున్న నీటిని చూసి కరువు ప్రాంతాలకు కూడా ఇలా నీటిని తీసుకుని వెళ్ళాలనే సంకల్పం నాలో ఏర్పడింది. చెన్నారెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా రాయలసీమకు నీళ్ళివ్వమని నేను అడిగితే, దోసిలి పట్టు పోస్తానని ఎగతాళిగా మాట్లాడారు. ఆ రోజున నా సంకల్పం మరింత బలపడింది’ అన్నారు వైఎస్. ఆ సంకల్పబలం నుండి ఉద్భవించిందే మహత్తరమైన జలయజ్ఞం. సాగునీటి వనరుల అభివృద్ధి మొదలైన కృష్ణదేవరాయల పాలన నుండి వైఎస్ ముఖ్యమంత్రి అయ్యేదాకా ఆంధ్రప్రదేశ్‌లో సాగునీటి వనరులు ఉన్న భూమి 80 లక్షల ఎకరాలు మాత్రమే. ఈ పరిస్థితిలో లక్ష కోట్లతో కోటి ఎకరాలకు నీరు అందిస్తానని ఆయన జలయజ్ఞం ప్రారంభించారు. ఇందులో భాగంగా మొదట ప్రారంభించిన ప్రాజెక్టు పులిచింతల. కానీ మొదట పూర్తయ్యింది నిజామాబాద్ జిల్లాలోని అలీసాగర్. ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పేర్లు పెట్టినా ఏమాత్రం కూడా పనులు జరగని హంద్రీ–నీవా సుజల స్రవంతి, గాలేరు–నగరి సుజల స్రవంతులకు అవే పేర్లు కొనసాగించడం, ప్రకాశం జిల్లాలోని కరువు ప్రాంతానికి జీవనాడి అయిన వెలుగొండ ప్రాజెక్టుకు కమ్యూనిస్టు నాయకుడు పూల సుబ్బయ్య పేరు పెట్టడం, కృష్ణా డెల్టా రైతుల చిరకాల స్వప్నమైన పులిచింతలకు కృష్ణా డెల్టా వాసి, ఆంధ్రప్రదేశ్ గర్వించే ఇంజనీర్ కె.ఎల్.రావు పేరు పెట్టడం ఆయన రాజకీయ విజ్ఞతకు నిదర్శనం. అలాగే ఆంధ్రరాష్ట్రానికి వరం, పోలవరం. ఈ ప్రాజెక్టు విషయంలో ఆయన కృషి మరువలేనిది. దీనికోసం గోదావరి జిల్లా వాసులు పోలవరం సాధనా సమితి పేరుతో అనేక ఉద్యమాలు చేసి చివరికి అది అసాధ్యం అనుకున్న తరుణంలో– అన్ని అనుమతులు సాధించి, ప్రాజెక్టును ప్రారంభించారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉండగానే 70 శాతం పనులు పూర్తి చేయడం ఆయన కార్య శూరత్వానికి నిదర్శనం. 2004లో వైఎస్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసే నాటికి వ్యవసాయ రంగం కుదేలైంది. రైతులు అప్పులపాలై ఆత్మహత్యలు చేసుకుంటున్న దుస్థితి. అయినా రైతులను ఆదుకోకపోగా ఈ విషయమై అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఎగతాళిగా మాట్లాడారు. కానీ వైఎస్ సీఎంగా మే నెల రెండవ వారంలో ప్రమాణ స్వీకారం చేస్తే జూన్ మొదటి వారంలోనే ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలు అనా«థలు కాకూడదని రెండు లక్షల రూపాయల పరిహారం ఇచ్చేలా చర్యలు తీసుకున్నారు. ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు రైతుకు వెన్నెముక. రైతులు అప్పుల కట్టలేక సహకార సంఘాలు దివాలా తీసే పరిస్థితిలో వైద్యనాథన్ కమిటీ సిఫారసులు అమలు చేసి రూ.1,800 కోట్ల సాయం అందించారు. పూర్తి నష్టాలలో ఉన్న సంఘాలను పక్క సహకార సంఘంలో కలిపి సహకార వ్యవస్థను కాపాడారు. పావలా వడ్డీకే రైతులకు పంట రుణాలు అందించారు. ఒక ప్రాజెక్టు కట్టి ఒక ఎకరానికి నీరివ్వాలంటే ప్రభుత్వానికి లక్షలలో ఖర్చు అవుతుంది. పైగా నిర్వహణ భారం ప్రభుత్వానిదే. అదే భూగర్భ జలాలకైతే రైతు స్వయంగా బోరు వేయించుకోవడమో, బావి తవ్వడమో చేస్తాడు. దానికోసం అప్పు తెచ్చుకుంటాడు. దానికి అవసరమైన పూర్తి బరువు అతడే మోస్తాడు. ఈ తర్కం ఆధారంగా వ్యవసాయానికి ఉచితంగా విద్యుత్ ఇవ్వాలని వైఎస్ సంకల్పించారు. కానీ అది జరిగేపని కాదని కొందరు వ్యంగ్యంగా మాట్లాడారు. అయినా ఆయన పట్టు వీడలేదు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఇచ్చి చూపారు. ఆ పథకం దేశానికే ఆదర్శమై ఇప్పుడు తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, పంజాబ్ రాష్ట్రాల్లోనూ అమలవుతోంది. వ్యవసాయం రాష్ట్ర ప్రభుత్వం అధీనంలో ఉన్నప్పటికీ, వ్యవసాయ విధానాలన్నీ కేంద్ర ప్రభుత్వం చేతిలోనే ఉన్నాయి. అందువలన కేంద్ర–రాష్ట్రాల సమన్వయం కోసం ప్రత్యేక వ్యవస్థ ఉండాలని గుర్తించి ఆయన చైర్మన్‌గా, సోమయాజులు వైస్ చైర్మన్‌గా అగ్రికల్చర్ టెక్నాలజీ మిషన్ ఏర్పాటు చేశారు. 2006లో దాని ప్రారంభోత్సవం సందర్భంగా– ‘నీటిపారుదల, గిట్టుబాటు వ్యవ సాయ మూలంగానే రెండవ హరిత విప్లవం సాధ్యమవుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని భారతదేశానికే అన్నపూర్ణగా తీర్చిదిద్దడం నా లక్ష్యం’ అని ప్రకటించారు. అది ఆయన ఆత్మవిశ్వాసానికి సూచిక. వ్యవసాయంలో ఉత్పత్తి వ్యయం ఎక్కువ. పండించిన పంటను లాభసాటి ధరకు అమ్ముకుంటేనే రైతుకు ఆదాయం వస్తుంది. పెరుగుతున్న పెట్టుబడులకు అనుగుణంగా మద్దతు ధరలు లేవని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి అవి పెరిగేలా చేశారు. కేంద్ర ప్రభుత్వం రుణమాఫీ ప్రకటించడానికి కారణం వైఎస్ ప్రోద్బలమే. సన్న, చిన్నకారు రైతులు, కౌలు రైతులు ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోవడానికి కారణాలు విద్య, వైద్యం ఖర్చు. అందుకే గొప్ప పథకాలైన ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్, 108, 104 అమలు చేశారు. ఒక్క రూపాయి పన్ను పెంచకుండా, ఒక్క రూపాయి కొత్త పన్ను వెయ్యకుండా సంక్షేమ పథకాలన్నీ అర్హులందరికీ అందించారు. రాజశేఖరరెడ్డి పాలనలో రైతులకు భూములు అమ్ముకోవలసిన అగత్యం పట్టలేదు. వారి ఆదాయాలు పెరిగాయి. దీని ఫలితంగా వ్యవసాయ కార్మికులు, చిన్న వ్యాపారులు, చిరు వ్యాపారుల ఆదాయం కూడా పెరిగింది. ప్రకృతి ప్రేమికులు పాలకులుగా ఉంటే ప్రకృతిమాత సహకారం ఉంటుంది. ఇందుకు నిదర్శనం ఆయన పాలన సాగించిన ఐదేళ్లపాటు సకాలంలో వర్షాలు పడ్డాయి. ప్రాజెక్టులన్నీ నీటితో కళకళలాడాయి. ఆహార ధాన్యాల ఉత్పత్తులు గణనీయంగా పెరిగాయి. సంక్షేమ రాజ్యం సాక్షాత్కరించింది. వ్యాసకర్త: ఎం.వి.ఎస్. నాగిరెడ్డి రైతు విభాగం అధ్యక్షుడు, వైఎస్సార్ కాంగ్రెస్ -
రైతును రాజును చేసిన రాజన్న
ఏదైనా ఇవ్వడానికైనా, చేయడానికైనా మనసుండాలి. ఆ మంచి మనసున్న మారాజు కాబట్టే వైఎస్ రాజశేఖరరెడ్డి ఏ ముఖ్యమంత్రీ చేయలేనివి చేయగలిగారు, ఇవ్వలేనివి ఇవ్వగలిగారు. ఒక తార్కిక ఆలోచనతో రైతులకు ఉచిత విద్యుత్ ఎవరైనా ఇచ్చారా? మహత్తరమైన ఆరోగ్యశ్రీ ఆలోచన అంతకుముందు ఎవరికైనా వచ్చిందా? కలలో కూడా సంకల్పించలేని జలయజ్ఞానికి ఏ నాయకుడైనా శ్రీకారం చుట్టారా? అందుకే రైతు సంక్షేమం కోసం అహరహం తపించిన ఆ మహా నాయకుడి జయంతిని రైతు దినోత్సవంగా జరుపుకోవడం ఎంతో సముచితం. రైతు నాయకుడు, ఉత్తరప్రదేశ్ ముఖ్య మంత్రిగా, దేశ ఆర్థికమంత్రిగా, ప్రధానిగా రైతుల సంక్షేమం కోసం అనేక చట్టాల రూప కర్త అయిన చౌదరి చరణ్‌సింగ్ జయంతి డిసెంబర్ 23ను జాతీయ రైతు దినోత్సవంగా జరుపుకుంటున్నాం. పేదవాడి పౌష్టికాహారం అయిన చేపల ఉత్పత్తిని పెంచడం కోసం హేరాలాల్ చౌదరి, కె.హెచ్.అలీ కున్హి శాస్త్ర వేత్తల బృందం 1957 జూలై 10న కృత్రిమ పద్ధతి ద్వారా చేప పిల్లల ఉత్పత్తి పెంచే విధానాన్ని కనుక్కొంది. నీలి విప్లవ విజయానికి కారణమైన ఆ పరిశోధన విజయవంతమైన రోజును జాతీయ మత్స్య రైతు దినోత్సవంగా జరుపుకుంటున్నాం. అలాగే ఆంధ్రప్రదేశ్ విషయంలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి రైతు సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేపట్టినందున ఆయన జయంతి అయిన జూలై 8ని ప్రతి సంవత్సరం రైతు దినోత్సవంగా జరుపుకోవాలని ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. కేవలం ఐదేళ్ల మూడు నెలలు మాత్రమే ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ రైతు సంక్షేమం కోసం ఏ ముఖ్యమంత్రీ చేయలేని పనులు చేశారు. 2004లో ఆయన సీఎంగా ప్రమాణం చేసే నాటికి వ్యవసాయ రంగం కుదేలైంది. వర్షాలు పడక, ప్రాజెక్టుల నుండి నీరు విడుదల కాక, ఉత్పత్తులు గణనీయంగా తగ్గిపోయి, రైతులు అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకుంటుంటే ఎగతాళిగా మాట్లాడారు అప్పటి ముఖ్య మంత్రి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 22 జిల్లా కేంద్ర సహకార బ్యాంకు లుంటే 18 బ్యాంకులు దివాలా తీసిన పరిస్థితి. సీఎంగా వైఎస్ మే నెల రెండవ వారంలో ప్రమాణ స్వీకారం చేస్తే జూన్ మొదటి వారంలోనే ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలు అనా«థలు కాకూడదని రెండు లక్షల రూపాయల పరిహారం ఇచ్చేలా చర్యలు తీసుకున్నారు. సాగునీటి వనరుల అభివృద్ధి మొదలైన కృష్ణదేవరాయల పాలన నుండి వైఎస్ ముఖ్య మంత్రి అయ్యేదాకా ఆంధ్రప్రదేశ్‌లో సాగునీటి వనరులు ఉన్న భూమి సుమారు 80 లక్షల ఎకరాలు మాత్రమే. ఇలాంటి పరిస్థితిలో లక్ష కోట్లతో కోటి ఎకరాలకు నీరు అందిస్తానని జలయజ్ఞం ప్రారంభించారు. జలయజ్ఞంలో మొదట ప్రారంభించిన ప్రాజెక్టు పులిచింతల. మొదట పూర్తయ్యింది నిజామాబాద్ జిల్లాలోని అలీసాగర్ ప్రాజెక్టు. ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా పేర్లు పెట్టి ఏమాత్రం కూడా పనులు జరగని హంద్రీ– నీవా, గాలేరు–నగరి సుజల స్రవంతులకు అవే పేర్లు కొనసాగించడం, ప్రకాశం జిల్లాలోని కరువు ప్రాంతానికి జీవనాడి అయిన వెలుగొండ ప్రాజెక్టును చేపట్టి దానికి కమ్యూనిస్టు నాయకుడైన పూల సుబ్బయ్య పేరు పెట్టడం, కృష్ణా డెల్టా రైతుల చిరకాల స్వప్నమైన పులిచింతలకు కృష్ణా డెల్టా వాసి, ఆంధ్రప్రదేశ్ గర్వించే ఇంజనీర్ కె.ఎల్.రావు పేరు పెట్టడం ఆయన రాజకీయ విజ్ఞతకు నిదర్శనం. పోలవరం ప్రాజెక్టు కోసం గోదావరి జిల్లా వాసులు పోలవరం సాధనా సమితి పేరుతో అనేక ఉద్యమాలు చేసి చివరికి అది అసాధ్యం అనుకున్న తరుణంలో అన్ని అనుమతులు సాధించి, రాష్ట్రానికే వరమైన పోలవరంను మొదలు పెట్టడమే కాదు, సీఎంగా ఉండగానే 70 శాతం పూర్తి చేసిన గొప్పతనం ఆయనది. సాగునీటి వనరులకు ప్రధాన ఆధారం ఒకటి ప్రాజెక్టులయితే, రెండవది భూగర్భ జలాలు. ఒక ప్రాజెక్టు కట్టి ఒక ఎకరానికి నీరివ్వా లంటే ప్రభుత్వానికి లక్షలలో ఖర్చు అవుతుంది. కాల్వల నిర్వహణ ప్రభుత్వమే భరించాలి. అదే భూగర్భ జలాలకైతే రైతు స్వయంగా బోరు బావి ఏర్పాటు చేసుకుంటున్నాడు. సొంత ఖర్చుతో మోటార్లు కొనుక్కుంటున్నాడు. రైతు ఒక ఎకరంలో పంట పండించడం ద్వారా 40–60 పని దినాలు కల్పిస్తున్నాడు. వ్యవసాయ ఉత్పత్తుల మార్కె టింగ్ ద్వారా ప్రభుత్వానికి ఆదాయం కల్పిస్తున్నాడు. కాబట్టి వ్యవసా యానికి ఉచితంగా విద్యుత్ ఇవ్వాలని ఆయన సంకల్పిస్తే కొంతమంది ఎగతాళి చేశారు. అయినా సంకల్ప బలం గెలిచింది. వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఆదర్శమై తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, పంజాబ్ రాష్ట్రాల్లో అమలవుతోంది. వ్యవసాయ ఉత్పత్తి వ్యయం ఎక్కువ. రైతుకు ఆదాయం తాను పండించిన పంటను లాభసాటి ధరకు అమ్ముకుంటేనే వస్తుంది. పెరుగుతున్న పెట్టుబడులకు అనుగుణంగా మద్దతు ధరలు లేవని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి అవి పెరిగేలా చేశారు. ఉదాహరణకు 1999 నుండి 2004 వరకు రాష్ట్రంలో ఎక్కువగా సాగు జరిగే ధాన్యానికి పెరిగిన మద్దతు ధర రూ. 490 నుండి 550. అంటే 12.5 శాతం పెరుగుదల. అదే 2004 నుండి 2009 వరకు వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రూ. 550 నుండి 1,000 రూపాయలకు పెరిగింది. అంటే 82.5 శాతం పెరుగుదల. రాజశేఖరరెడ్డి ప్రోద్బలంతోనే కేంద్ర ప్రభుత్వం రుణమాఫీ ప్రకటించింది. అదీగాక కేంద్రం ప్రకటించిన రుణమాఫీలో సకాలంలో బకాయిలు చెల్లించిన రైతులకు లబ్ధి జరగలేదని గ్రహించి, రైతు సంఘాలు కూడా లేవనెత్తక ముందే, 36 లక్షల మంది రైతులకు ఐదు వేల రూపాయల చొప్పున రూ. 1,800 కోట్లు రైతుల ఖాతాలో జమ చేశారు. దేశంలో ఇలా చేసిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్. సన్న, చిన్న కారు రైతులు, కౌలు రైతులు ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోవడానికి కారణాలు విద్య, వైద్యం ఖర్చు. అందుకే గొప్ప పథకాలైన ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్, 108, 104 అమలు చేశారు. రాష్ట్రంలో సరాసరి 65 శాతం మంది రైతుల భూకమతాల పరి మాణం 1.05 సెంట్లు. మరో 22 శాతం మంది రైతుల పరిమాణం 3.45 ఎకరాలు మాత్రమే. అంటే 87 శాతం మంది రైతులకు తెల్ల రేషన్ కార్డులు, వృద్ధాప్య పెన్షన్లు, బలహీన వర్గాల గృహాలు కేటా యించి ఈ వర్గాలను కాపాడటం జరిగింది. 90 శాతం రాయితీతో పెద్ద ఎత్తున బిందుసేద్య పరికరాలు ఇచ్చారు. ఒక్క రూపాయి పన్ను పెంచలేదు, ఒక్క రూపాయి కొత్త పన్ను వెయ్యలేదు. సంక్షేమ పథ కాలన్నీ అర్హులందరికీ అందాయి. భూములు అమ్ముకోవలసిన అవ సరం రాలేదు. రైతులకు ఆదాయం పెరగడంతో వ్యవసాయ కార్మి కులు, చిన్న వ్యాపారులు, చిరు వ్యాపారుల ఆదాయం పెరిగింది. అభివృద్ధి, సంక్షేమం తన రెండు కళ్లుగా పాలనగావించారు వైఎస్. నాన్న ఒక అడుగు వేస్తే, ఆయన వారసుడిగా తాను రెండు అడుగులు వేస్తానని ప్రకటించారు ప్రస్తుత ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్రెడ్డి. రైతు లకు ఉత్పత్తి వ్యయం తగ్గాలనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేప ట్టిన రెండేళ్లలోనే రైతులకు రూ. 13,101 కోట్లు అందించిన పథకానికి వైఎస్సార్. రైతు భరోసా –పీఎంకిసాన్గా నామకరణం చేయడం జరి గింది. అలాగే వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకం, వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం, వైఎస్సార్ మత్స్యకార భరోసా పథకం, వైఎస్సార్ కాపరి బంధు పథకాలను రాష్ట్రప్రభుత్వం అమలుచేస్తోంది. పశు నష్ట పరిహారం పథకం, జలకళ పథకం, ఆసరా పథకం, చేయూత పథకం, కాపునేస్తం పథకం, వాహనమిత్ర పథకం, లా నేస్తం పథకం, కల్యాణ కానుక పథకం, కంటి వెలుగు పథకం, సంపూర్ణ పోషణ పథకం, గిరి పుత్రిక పథకం, ఈబీసీ నేస్తం లాంటివాటిని వైఎస్సార్ పేరుతో కొనసాగిస్తూ ప్రభుత్వం ఆ మహానేత పరిచిన బాటలో నడుస్తోంది. ఎం.వి.ఎస్. నాగిరెడ్డి వ్యాసకర్త వైస్ చైర్మన్, ఏపీ స్టేట్ అగ్రికల్చర్ మిషన్ -
తనది రైతు ప్రభుత్వం అని నిరూపించారు
-
అన్నదాతల ఆత్మబంధువు
రైతుల సంక్షేమం కోసం అనేక చట్టాలు రూపొందించిన మాజీ ప్రధాని చౌదరి చరణ్‌సింగ్ పుట్టిన రోజు అయిన డిసెంబర్ 23ను జాతీయ రైతు దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్ విషయంలో దివంగత ముఖ్య మంత్రి వై.ఎస్. రాజశేఖరరెడ్డి రైతు సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేపట్టినందున వారి పుట్టిన రోజైన జూలై 8ని రైతు దినోత్సవంగా జరుపుకోవాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. 2004లో రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసే నాటికి సకాలంలో వర్షాలు పడక, ప్రాజెక్టుల నుండి నీరు విడుదల గాక, ఆహార ధాన్యాల ఉత్పత్తులు గణనీ యంగా తగ్గిపోయి, ఆ పండిన ఉత్పత్తులను కనీస మద్దతు ధరలకు కూడా అమ్ముకోలేక రైతులు అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకునే దుస్థితి. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌లో 22 జిల్లా కేంద్ర సహకార బ్యాంకులు ఉంటే 18 దివాళా తీసిన పరిస్థితి. ముఖ్యమంత్రిగా ఆయన చేపట్టిన మొదటి కార్యక్రమం–ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుం బాలు అనాథలు కాకూడదనే ఉద్దేశంతో జీవో 421 విడుదల చేసి 2 లక్షల రూపాయల పరిహారం అందిం చడం. అంతకుముందు ప్రభుత్వ హయాంలో ఆత్మ హత్యలు చేసుకున్న రైతులకు కూడా అందేలా చర్య తీసు కోవడం. ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు రైతుకు వెన్నెముక. వైద్యనా«థన్ కమిటీ సిఫా రసులు అమలు చేసి రూ.1,800 కోట్లు సహకార సంఘా లకు సహాయం అందించి, పూర్తిగా నష్టాలలో ఉన్న సంఘాలను పక్క సహకార సంఘంలో కలిపి సహకార వ్యవస్థను కాపాడారు. కృష్ణదేవరాయల పాలన నుండి రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయ్యే నాటికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సాగునీటి వనరులు ఉన్న భూమి సుమారు 80 లక్షల ఎకరాలు. ఇలాంటి పరిస్థితిలో లక్ష కోట్లతో కోటి ఎకరా లకు సాగునీరందిస్తానని జలయజ్ఞం మొదలుపెట్టారు. ఇందులో ముందు మొదలుపెట్టిన ప్రాజెక్టు పులిచింతల అయితే, మొట్టమొదట పూర్తి చేసిన ప్రాజెక్టు నిజామా బాద్‌లోని అలీసాగర్. పోలవరం ప్రాజెక్టు కోసం గోదా వరి జిల్లావాసులు పోలవరం సాధనా సమితి పేరుతో అనేక ఉద్యమాలు చేసి చివరికి ఈ ప్రాజెక్టు అసాధ్యం అనుకున్న తరుణంలో అన్ని అనుమతులు సాధించి రాష్ట్రానికే వరమైన పోలవరం ప్రాజెక్టును మొదలు పెట్ట డమే కాదు, జలయజ్ఞంలో చేపట్టిన అన్ని పనులు ఆయన ముఖ్యమంత్రిగా ఉండగానే 70 శాతం పూర్తి చేసిన గొప్ప తనం ఆయనకే సాధ్యం. సాగునీటి వనరులకు ప్రధాన ఆధారం ఒకటి ప్రాజె క్టులయితే, రెండవది భూగర్భ జలాలు. ఒక ప్రాజెక్టు కట్టి ఒక ఎకరానికి నీరివ్వాలంటే ప్రభుత్వానికి లక్షలలో ఖర్చు అవుతుంది. అదే భూగర్భ జలాలకైతే రైతు సొంత ఖర్చుతో బోరు బావి ఏర్పాటు చేసుకుంటున్నాడు. అందుకని వ్యవసాయానికి ఉచితంగా విద్యుత్ ఇవ్వాలని సంకల్పిస్తే కొంతమంది ఎగతాళి చేశారు. కానీ ఆయన సంకల్ప బలం నేడు అనేక రాష్ట్రాలకు ఆదర్శమైంది. నేడు సుమారు 18.70 లక్షల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల ఉచిత విద్యుత్‌కు ఇదే పునాది. వ్యవసాయం రాష్ట్రప్రభుత్వం అధీనంలో ఉన్నప్ప టికీ, వ్యవసాయ విధానాలన్నీ కేంద్రప్రభుత్వం చేతిలోనే ఉన్నాయి. అందువలన కేంద్ర–రాష్ట్రాల సమన్వయం కోసం ప్రత్యేక వ్యవస్థ ఉండాలని గుర్తించి ఆయన ఛైర్మన్‌గా, పెద్దలు సోమయాజులు వైస్ చైర్మన్‌గా 2006లో అగ్రికల్చర్ టెక్నాలజీ కమిషన్ ఏర్పాటు చేశారు. రాజ శేఖరరెడ్డి పోద్బలంతోనే కేంద్రప్రభుత్వం రుణమాఫీ ప్రకటించింది. కేంద్రం ప్రకటించిన రుణమాఫీలో సకా లంలో బకాయిలు చెల్లించిన రైతులకు లబ్ధి జరగలేదని గ్రహించి, రైతుసంఘాలు కూడా లేవనెత్తక ముందే, 36 లక్షలమంది రైతులకు ఐదువేల రూపాయల చొప్పున రూ.1,800 కోట్లు రైతుల ఖాతాల్లో జమచేశారు. పావలా వడ్డీకే పంట రుణాలు, 90 శాతం రాయితీతో పెద్ద ఎత్తున బిందుసేద్య పరికరాలు, ఇలా ఎన్నో కార్యక్రమాలు ఆయన చేపట్టడం జరిగింది. ఆయన ఒక్క రూపాయి పన్ను పెంచలేదు, ఒక్క రూపాయి కొత్త పన్ను వెయ్య లేదు. అభివృద్ధి, సంక్షేమం తన రెండు కళ్లుగా పాలన గావించిన ముఖ్యమంత్రి వై.ఎస్. రైతుల గుండెల్లో చిరం జీవిగా మిగిలిన– ఆ మహానాయకునికి మనమిచ్చే గౌరవం ఈ రైతు దినోత్సవం. వ్యాసకర్త: ఎం.వి.ఎస్. నాగిరెడ్డి వైస్ చైర్మన్, ఏపీ స్టేట్ అగ్రికల్చర్ మిషన్ -
జగన్ సంకల్పానికి ప్రకృతి సహకరిస్తోంది..
సాక్షి, అమరావతి: బడ్జెట్లో వ్యవసాయానికి అత్యధికంగా నిధులు కేటాయించిన ఘనత వైఎస్ జగన్ ప్రభుత్వానికే దక్కుతుందని ఏపీ వ్యవసాయ మిషన్ వైఎస్ చైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రైతులకు మేలు చేసేలా సంకల్ప బలంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ముందుకెళ్తున్నారన్నారు. ప్రకృతి కూడా సహకరించి గత పది సంవత్సరాల్లో లేని విధంగా ఆహార ధాన్యాలు దిగుబడి గత ఏడాది కంటే పెరిగాయని పేర్కొన్నారు. ఉత్పత్తులు పెరగడమే కాదని.. సరాసరి దిగుబడులు కూడా పెరిగాయని తెలిపారు. కరోనా సంక్షోభం మూలంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఈ ఏడాది ఆదాయం పెరిగే అవకాశం లేనందున, మొత్తం బడ్జెట్ గత ఏడాది కంటే 1.4 శాతం తగ్గిందని వివరించారు. ఈ ఆర్థిక సంవత్సరం రూ.2,24,789.18 కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టారని.. అందులో వ్యవసాయానికి 29,159.97 కోట్లు కేటాయించారన్నారు. రెండో సంవత్సరం కూడా రెండంకెల శాతం వ్యవసాయ రంగానికి అధికంగా నిధులు కేటాయించారన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. -
‘లోకేష్ కూడా లేఖ రాయడం హాస్యాస్పదం’
సాక్షి, తాడేపల్లి : దేశంలో ఎక్కడ లేని విధంగా ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ అధికారులే వ్యవసాయ ఉత్పత్తులను కొలుగోలు చేసి మద్దతు ధర కల్పిస్తున్నారని వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి అన్నారు. రైతుకు ఇబ్బందులు లేకుండా ఎక్కడికక్కడ రైతు బజార్లను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రైతు పంటలకు మద్దతు ధర లేదని టీడీపీ నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. వ్యవసాయం అంటే ఏంటో తెలియని లోకేష్ కూడా వ్యవసాయం గురించి లేఖలు రాయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. చంద్రబాబు నాయుడు పాలనలో ఏనాడు తన కెబినెట్లో వ్యవసాయం గురించి చర్చించలేదని ఆరోపించారు. చంద్రబాబు ఎగ్గొట్టిన రూ.1100 కోట్ల ఇన్పుట్ సబ్సిడీని సీఎం జగన్ ఇచ్చారని గుర్తు చేశారు. సీఎం పాలనలో 14.70 శాతం ఆహార ధాన్యాల ఉత్పత్తి పెరిగిందన్నారు. 2019-20 సంవత్సరంలో పంటల దిగుబడి అధికంగా ఉందని ఎంవీఎస్ నాగిరెడ్డి పేర్కొన్నారు. -
టీడీపీ వాళ్లు ఆత్మ విమర్శ చేసుకోండి
సాక్షి, విజయవాడ : కరోనా వైరస్ సంక్షోభం సమయంలో వైఎస్సార్ సీపీ, స్వచ్ఛంద సంస్థలు సేవా కార్యక్రమాలు చేస్తుంటే.. టీడీపీ ఎక్కడైనా సహాయక కార్యక్రమాలు చేసిందా అని రాష్ట్ర వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ ఎం.వి.ఎస్. నాగిరెడ్డి ప్రశ్నించారు. ఈ విషయంపై టీడీపీ వాళ్లు ఆత్మ విమర్శ చేసుకోవాలని అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ వ్యక్తులకు ఎవరికైనా కరోనా వస్తే ఒక్క రూపాయి కూడా వాళ్లు ఖర్చు చేయకుండా అంతా ప్రభుత్వమే భరిస్తుందని అన్నారు. రాష్ట్రంలో నిత్యావసర సరుకులు తక్కువ ధరకు అందుతున్నాయని చెప్పారు. 11 లక్షల టన్నుల ప్రత్తి కొనుగోలు చేశామని తెలిపారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ధాన్యం కొనుగోలు చేస్తున్నామని వెల్లడించారు. లక్ష క్వింటాళ్ల శనగలు కొనుగోలు చేశామని, గత ప్రభుత్వం 3 వేల క్వింటాళ్లు కూడా కొనుగోలు చేయలేదని అన్నారు. ఏపీ నుంచి 35-40 కంటైనర్ల చేపలు చైనాకు ఎగుమతి అవుతున్నాయని, మదనపల్లి టమాటా మార్కెట్లో ప్రభుత్వమే టమాటాను కొనుగోలు చేస్తోందని చెప్పారు. -
‘వాస్తవాలు తెలుసుకుని మాట్లాడండి!’
సాక్షి, తాడేపల్లి : ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి రాసిన లేఖ నిరాధారితంగా ఉందని వ్యవసాయ మిషన్ వైస్ ఛైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి వ్యాఖ్యానించారు. కేంద్రం మొక్కజొన్న కొనుగోలుకు నిర్ణయించిన ధర ఎంతో కూడా తెలియకుండా కన్నా లేఖ రాశారని అన్నారు. సోమవారం నాగిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ రైతులను ఆదుకునేందుకు ఏపీ ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగా ఉంది. కావాలని బురదజల్లేందుకు ప్రయత్నించడం మంచిది కాదు. మొక్కజొన్నతో పాటు ఇతర పంటల కొనుగోలులో కేంద్రం సహకారం అందించేలా ప్రయత్నించాల్సిన వ్యక్తులు ఇలా విమర్శలకు దిగడం సరికాదు. ( కన్నా! మీరు సుజనాకు అమ్ముడుపోయారా? ) టీడీపీ నేతలు చేసినట్లు ఆరోపణలు చేయవద్దు.. వాస్తవాలు తెలుసుకుని మాట్లాడండి. రాష్ట్ర ప్రభుత్వం మొక్కజొన్న రైతులను ఇప్పటికే ఆదుకుంటోంది. మీకు చేతనైతే కేంద్రంతో మాట్లాడి ఓ లక్ష టన్నుల మొక్కజొన్న కొనుగోలు చేసేలా ప్రయత్నించండి. కేంద్రం, రాష్ట్రం వేరు కాదు.. ఈ విపత్కర సమయంలో అందరం కలిసి పనిచేస్తున్నామని గుర్తించండ’’ని అన్నారు. -
‘ఆ పిచ్చే 23 సీట్లకు పరిమితం చేసింది’
సాక్షి, తాడేపల్లి: రైతులకు నష్టం లేకుండా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్ని చర్యలు తీసుకుంటున్నారని వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి తెలిపారు. గురువారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. రైతులకు ఇబ్బందులు లేకుండా అరటి, టమాటా వంటి పంటలను ప్రభుత్వమే కొనుగోళ్లు చేస్తేందని పేర్కొన్నారు. వ్యవసాయ ఉత్పత్తులపై సీఎం వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించారని ఆయన వెల్లడించారు. (సీఎం జగన్‌కు కేంద్రమంత్రుల అభినందనలు) రవాణా నిబంధనలను సడలించాం.. పంటలు చేతికొచ్చే సమయంలో కరోనా వైరస్ ప్రభావం పడిందని తెలిపారు. లాక్ డౌన్ నేపథ్యంలో నిత్యావసర వస్తువులకు కొరత ఏర్పడుతుందని ప్రజలు ఆందోళన చెందారని.. వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా సీఎం అన్ని చర్యలు తీసుకున్నారని పేర్కొన్నారు. ధాన్యాన్ని గ్రామాల్లో కొనుగోలు చేస్తున్నామని.. ఉత్పత్తులకు ఇబ్బంది లేకుండా రవాణా నిబంధనలను సడలించామని చెప్పారు. రైతుబజార్లను సీఎం జగన్ ఎక్కడికక్కడ వికేంద్రీకరించారని.. మొబైల్ రైతుబజార్లను కూడా ఏర్పాటు చేశారని నాగిరెడ్డి వివరించారు. (కోవిడ్-19 నివారణ చర్యలపై సీఎం జగన్ సమీక్ష) ప్రధానిని ఎందుకు డిమాండ్ చేయలేదు..? ‘‘కుటుంబానికి రూ.5 వేలు ఇవ్వాలని ప్రతిపక్ష నేత చంద్రబాబు అడుగుతున్నారు. ప్రధానితో ఆయన మాట్లాడినప్పుడు .. దేశమంతా రూ.5 వేలు ఇవ్వాలని ఎందుకు డిమాండ్ చేయలేదని’’ నాగిరెడ్డి ప్రశ్నించారు రైతులకు చంద్రబాబు పెట్టిన బకాయిలను సీఎం జగన్ చెల్లించారన్నారు. చంద్రబాబు తన పబ్లిసిటీ కోసం రూ.కోట్లాది రూపాయలు ఖర్చు చేశారని.. ఆయన పబ్లిసిటీ పిచ్చే 23 సీట్లకు పరిమితం చేసిందన్నారు. చంద్రబాబు హైదరాబాద్‌లో ఉండి ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని.. ఆయన హైదరాబాద్‌లోని తన ఇంట్లో ఉంటే.. ప్రజల సమస్యలు ఎలా తెలుస్తాయని ఎంవీఎస్ నాగిరెడ్డి దుయ్యబట్టారు. -
రైతాంగాన్ని ఆదుకునేలా వైఎస్ జగన్ నిర్ణయాలు
-
అన్ని రకాల కూరగాయలు అందుబాటులో ఉన్నాయి
-
కరోనా: ఏపీ సీఎం రిలీఫ్ పండ్‌కు రూ. లక్ష విరాళం
సాక్షి, అమరావతి: కరోనా వైరస్ (కోవిడ్-19) నివారణ కోసం పలు రంగాలకు చెందిన ప్రముఖులు రాష్ట్ర ప్రభుత్వానికి విరాళాలు అందజేస్తున్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి సీఎం రిలీఫ్ ఫండ్‌కు లక్ష రూపాయలు విరాళంగా ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాను వ్యక్తిగతంగా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సహాయ నిధికి విరాళం ఇస్తున్నానని ఆయన చెప్పారు. ఇది కేవలం ప్రభుత్వానికి మద్దతుగా చేపట్టిన చర్య కాదని, ప్రజల్ని రక్షించడానికి చిత్తశుద్ధితో పనిచేస్తున్న ప్రభుత్వ యంత్రాంగంలో భాగస్వామిని కావాలని ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన పేర్కొన్నారు. కరోనా వంటి సంక్షోభ సమయంలో ఎంతో అంకిత భావంతో పనిచేస్తున్న ప్రభుత్వ యంత్రాంగం.. డాక్టర్లు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది, శానిటేషన్ సిబ్బంది, రెవెన్యూ, గ్రామ సచివాలయ సిబ్బంది, గ్రామ వలంటీర్లు, ఉద్యోగులకు ఆయన అభినందనలు తెలిపారు. సంక్షోభ నివారణలో ప్రజలంతా కూడా భాగస్వాములవ్వాలని ప్రార్థిస్తున్నట్లు ఆయన పెర్కొన్నారు. -
'ఎన్నికల కోడ్ ఎత్తివేతను స్వాగతిస్తున్నాం'
సాక్షి, తాడేపల్లి : రాష్ట్రంలో ఎన్నికల కోడ్‌ను ఎత్తివేస్తూ బుధవారం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును తాము స్వాగతిస్తున్నట్లు వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి ఎంవిఎస్ నాగిరెడ్డి పేర్కొన్నారు. ఎన్నికల కోడ్ ఎత్తివేయడం వలన పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడం యధాతధంగా జరుగుతుందని తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేసే మంచి పనిని అడ్డుకోవాలని ఎన్నికల సంఘం భావించదన్నారు. ఎన్నికలు వాయిదా వేయడం వలన రాష్ట్రానికి రావాల్సిన నిధులను అడ్డుకుందన్నారు. కాగా ఎన్నికలను వాయిదా వేసే ముందు విధిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించాలనే విషయం ఎన్నికల కమిషన్‌కు సుప్రీంకోర్టు గుర్తుచేసిందన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు, ఎన్నికల కమిషన్‌తో కుమ్మక్కై స్థానిక ఎన్నికలను అడ్డుకున్నారని దుయ్యబట్టారు. -
కేంద్ర బడ్జెట్‌పై ఎంవీఎస్ నాగిరెడ్డి అసంతృప్తి
సాక్షి, అమరావతి: 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని బడ్జెట్లో చెబుతారు కానీ, ఎలా చేస్తారో స్పష్టత ఉండదంటూ ఏపీ స్టేట్ అగ్రికల్చర్ మిషన్ వైస్ ఛైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి ఎద్దేవా చేశారు. రైతులకు పెద్ద పీట ఎక్కడ వేశారో అర్ధం కావటం లేదంటూ అసహనం వ్యక్తం చేశారు. శనివారం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై ఆయన స్పందిస్తూ.. 2019-20లో సబ్సిడీలకు రూ. 3,38,153.67 కోట్లు కేటాయించి రూ. 2,63,557.33 కోట్లు ఖర్చు చేశారన్నారు. 2020-21కి ఆహార, ఎరువుల సబ్సిడీలు తగ్గించి రూ. 2,62,108.76 కోట్లు మాత్రమే కేటాయించి, అత్యధికంగా దృష్టి పెట్టవలసిన వ్యవసాయ యాంత్రీకరణ మీద దృష్టి పెట్టకుండా విధానపరమైన కేటాయింపులు పెంచకుండా ‘కిసాన్ రైలు’ వేస్తామని చెప్పారన్నారు. దేశవ్యాప్తంగా 26 లక్షల సొలార్ పంపుసెట్లు ఏర్పాటు చేస్తామని చెప్పడమే వ్యవసాయానికి పెద్దపీట వెయ్యడమా అని ఎంవీఎస్ నాగిరెడ్డి ప్రశ్నించారు. (బడ్జెట్ 2020 : కేంద్ర బడ్జెట్ హైలైట్స్) -
చంద్రబాబు కరుడుగట్టిన రైతు వ్యతిరేకి
సాక్షి, అమరావతి: ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు కరుడుగట్టిన రైతు వ్యతిరేకి అని ఏపీ వ్యవసాయ మిషన్ వైఎస్ చైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి మండిపడ్డారు. ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. ఉచిత విద్యుత్‌ను ఎగతాళి చేయడంతో పాటు సాగునీటి ప్రాజెక్టులు దండగ అని చెప్పిన వ్యక్తి చంద్రబాబు అని దుయ్యబట్టారు. చంద్రబాబు చేస్తోన్న ఉద్యమాలు రైతుల కోసమా.. ఆయన బినామీ ఆస్తులను కాపాడుకోవడం కోసమా అని ప్రశ్నించారు. వైఎస్ జగన్ ప్రభుత్వం రైతులకు అండగా నిలిచిందని.. రైతు భరోసా పథకాన్ని అమలు చేయడంతో పాటు, తొమ్మిది గంటలు విద్యుత్‌ను అందిస్తున్నారని చెప్పారు. రాజధాని రైతులకు ఎలాంటి అన్యాయం చేయలేదని స్పష్టం చేశారు. రాజధాని తరలిస్తామని ఎవ్వరు చెప్పలేదని.. మూడు రాజధానులు ఏర్పాటు చేస్తామని మాత్రమే చెప్పారన్నారు. అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేస్తామన్నారని.. ఏ కమిటీలోనూ అమరావతి నుంచి రాజధానిని తరలిస్తామని చెప్పలేదన్నారు. రైతుల సమస్యలపై చర్చించి పరిష్కరించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. రైతులు తమ సమస్యలను హై పవర్ కమిటీ దృష్టికి తీసుకురావాలని.. ఎలాంటి నష్టం జరగకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. తండ్రి ఆశయాలకు అనుగుణంగా రైతులు కు మేలు చేసే విధంగా వైఎస్ జగన్ పరిపాలన అందిస్తున్నారని నాగిరెడ్డి పేర్కొన్నారు. -
చంద్రబాబు కరుడుగట్టిన రైతు వ్యతిరేకి
-
గిట్టుబాటు ధరలతో రైతులకు భద్రత
-
గిట్టుబాటు ధరలతో రైతులకు భద్రత
సాక్షి, విజయవాడ: కనీస గిట్టుబాటు ధరతో రైతులకు భద్రత కలుగుతుందని ఏపీ వ్యవసాయ మిషన్ వైఎస్ చైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి అన్నారు. సోమవారం విజయవాడ గేట్ వే హోటల్లో రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి అధ్యక్షతన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఆన్ కామర్స్ సమావేశం జరిగింది. పార్లమెంటరీ కమిటీ సభ్యులు, ఎంపీలు మాగుంట శ్రీనివాసులు రెడ్డి, నామా నాగేశ్వరరావు, కేశినేని నాని తో పాటు మొత్తం 11 మంది ఎంపీలు హాజరయ్యారు. ఈ సమావేశంలో రైతులు పండించే పంటలకు కనీస గిట్టుబాటు ధర, ఎగుమతులపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా మీడియాతో ఎంవీఎస్ నాగిరెడ్డి మాట్లాడుతూ.. వాణిజ్య పంటల్లో పత్తికి మాత్రమే గిట్టుబాటు ధర ఉందని.. మిర్చి, పసుపు పంటకు కనీస గిట్టుబాటు ధర లేకపోవడంతో సమస్య ఏర్పడుతుందని పేర్కొన్నారు. ఏపీలో పామాయిల్ పంట ఎక్కువగా సాగు అవుతోందని..దీనికి కూడా ఎన్ఎస్పీ రాలేదన్నారు. రాగులు సజ్జలు కు తప్ప మైనర్, మేజర్ మిల్లెట్లకు ఎన్ఎస్పీ, గిట్టుబాటు ధర లేవని, వాటికి కూడా కనీస గిట్టుబాటు ధర కల్పించాలని వినతిపత్రం అందజేశామని తెలిపారు. ఏపీ నుంచి ఎగుమతి అయ్యే పసుపు, మిర్చి, వరికి ఇన్సెంటివ్స్ ఇవ్వాలని కోరామని వెల్లడించారు. ఏపీ రైతుల ఉద్దేశాలను కేంద్రం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని విన్నవించామని చెప్పారు. మిర్చి, పసుపు బోర్డు ఏపీలో ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలు వచ్చాయని తెలిపారు. రొయ్యలు, చేపల సాగుకు మౌలిక వసతులు కల్పించాలని.. దీని కోసం కేంద్ర ప్రభుత్వం డెవలప్మెంట్ ఆక్వాకల్చర్ ఇన్ ఏపీ కింద స్పెషల్ ప్యాకేజీ ఇవ్వాలని కోరామన్నారు. ఏపీలో ఆక్వా రీసెర్చ్ సెంటర్‌ను ఏర్పాటు చేయాలని కోరినట్లు నాగిరెడ్డి తెలిపారు. -
2020 కూడా రైతు నామ సంవత్సరమే: నాగిరెడ్డి
సాక్షి, తాడేపల్లి: రైతులకు సంక్రాంతి కానుకగా ‘రైతు భరోసా’ అందచేస్తామని వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి తెలిపారు. తమది రైతు సంక్షేమ ప్రభుత్వమని, గత సంవత్సరం తరహాలో 2020ని కూడా రైతు నామ సంవత్సరంగా కొనసాగిస్తామన్నారు. సీఎం జగన్ ఉన్నారనే ధీమా రైతుల్లో నెలకొందని ఆయన అన్నారు. ఎంవీఎస్ నాగిరెడ్డి బుధవారం తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ .... ‘ సీఎం జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే రైతు భరోసా అందించారు. దేశంలో ఎక్కడాలేనివిధంగా కౌలు రైతులకు రైతు భరోసా అందచేశారు. వచ్చే ఏడాది నుంచి ఇవ్వాల్సిన పీఎం కిసాన్ రైతు భరోసా ఒక ఏడాది ముందు నుంచే ఇస్తున్నారు. సంక్రాంతి కానుకగా ఇవ్వాల్సిన రైతు భరోసా రూ.2వేలు త్వరలో పడుతుంది. సీఎం జగన్ మొత్తం బడ్జెట్లో 12.66 శాతం నిధులు వ్యవసాయానికే కేటాయించారు. పగటిపూట రైతులకు 9 గంటల ఉచిత కరెంట్ అందిస్తున్నాం’ అని తెలిపారు. రైతులకు ఉచితంగా పంటల బీమా చెల్లించారు. పశువులకు ఉచితంగా పశుబీమా అందించారు. చంద్రబాబు రుణమాఫీ, ఉచిత విద్యుత్ హామీలను నిలబెట్టుకోలేదు. చంద్రబాబు హయాంలో ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఇస్తున్నాం. చనిపోయిన రైతులను చంద్రబాబు పట్టించుకోలేదు. రైతుల కోసం ముఖ్యమంత్రి జగన్ ధరల స్థిరీకరణ కోసం బడ్జెట్లో రూ.3వేల కోట్లు కేటాయించారు. ఇన్పుట్ సబ్సిడీని 15 శాతం పెంచారు. ఆక్వా రైతులకు విద్యుత్ యూనిట్ ధర రూ.1.50 పైసలకే అందిస్తున్నారు. వరదలు మూలంగా నష్టపోయిన రైతులను ఆదుకున్నాం. పంటలకు సున్నా వడ్డీకే రుణాలు, పప్పు, చిరు ధాన్యాలకు గిట్టుబాటు ధరలు అందిస్తున్నాము. వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలో రైతులు సంతోషంగా ఉన్నారు. దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పాలనను రైతులకు... ఆయన తనయుడు వైఎస్ జగన్ అందిస్తున్నారు. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే 90 శాతం ఎన్నికల హామీని ముఖ్యమంత్రి నెరవేర్చారు’ అని తెలిపారు. -
43 లక్షల మందికి ‘వైఎస్సార్ రైతు భరోసా’
సాక్షి, అమరావతి: వైఎస్సార్ రైతు భరోసా పథకం ద్వారా 43 లక్షల మందికి సాయం అందించామని అగ్రికల్చర్ మిషన్ వైస్ చైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి వెల్లడించారు. సోమవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. రైతు భరోసా పథకానికి కౌలు రైతులు దరఖాస్తు చేసుకోవడానికి మరో నెల పొడిగించామని చెప్పారు. ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఈ పథకానికి అన్ని వర్గాల నుంచి మంచి స్పందన వచ్చిందని తెలిపారు. మార్కెటింగ్ సీజన్ ప్రారంభం అయ్యిందని, పత్తి కొనుగోలుకు సీసీఏ సెంటర్లు ఏర్పాటు చేశామన్నారు. వేరుశనగకు కూడా త్వరలో ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. ధరల స్థిరీకరణ విషయంలో నిరంతరం సమీక్ష చేస్తున్నామన్నారు. పొలంబడి కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నామన్నారు. అపరాల బోర్డు ఏర్పాటు చేయబోతున్నామని.. వాటికి కూడా గిట్టుబాటు ధర కల్పిస్తామని తెలిపారు. మధ్యాహ్న భోజన పథకానికి నాణ్యమైన గుడ్లు సరఫరా చేయాలని సీఎం ఆదేశించారని.. దానికి సంబంధించిన టెండర్ల ప్రక్రియలో నేరుగా రైతులే పాల్గొనేందుకు చర్యలు చేపడతామన్నారు. బయో ప్రొడక్ట్స్ పేరుతో మోసాలు జరుగుతున్నాయని రైతుల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయని, దానిపై కూడా చర్యలు చేపట్టేందుకు చర్చిస్తామన్నారు. కౌలు రైతుల విషయంలో రికార్డుల సమస్యలు ఉన్నాయని..వాటిని పరిష్కరించే దిశగా చర్యలు చేపడుతున్నామని ఎంవీఎస్ నాగిరెడ్డి వెల్లడించారు. -
చంద్రబాబు ఏపీని దివాళా తీశారు
-
చంద్రబాబుకు పుట్టుకతోనే ఆ లక్షణాలు..
సాక్షి, తాడేపల్లి : వ్యవసాయం దండగ అన్న టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకు రైతుల గురించి మాట్లాడే అర్హత లేదని వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి అన్నారు. రైతుల గురించి ఏనాడు పట్టించుకోని చంద్రబాబు నాయుడు.. ఇప్పుడు వైఎస్సార్ రైతు భరోసా- పీఎం కిసాన్ పథకంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఫెడరల్ వ్యవస్థలో.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసే ముందుకు సాగుతాయని... కేంద్రం సహకారం లేకుండా రాష్ట్రాలు పథకాలు అమలు చేస్తాయా అని ప్రశ్నించారు. తమ ప్రభుత్వం అర్హులైన రైతులకు రూ.12500 ఇస్తామని హామీ ఇచ్చినప్పటికీ.. రైతులకు మరింత అండగా ఉండాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అదనంగా మరో వెయ్యి రూపాయలు ఎక్కువ ఇచ్చేందుకు నిర్ణయించారని తెలిపారు. రైతు సంక్షేమం కోసం సీఎం జగన్ ప్రతిష్టాత్మకంగా రైతు భరోసా పథకాన్ని ప్రవేశపెట్టారని.. అర్హులు ఎవరైనా ఉంటే దరఖాస్తు చేసుకోవడానికి ఇంకా సమయం ఉందని తెలిపారు. బుధవారం నాగిరెడ్డి విలేకరులతో మాట్లాడుతూ.. గతంలో రైతు రుణాల అన్నింటినీ మాఫీ చేస్తామని హామీ ఇచ్చి మోసం చేసిన ఘనత చంద్రబాబుది అని ఎద్దేవా చేశారు. రూ. 87 కోట్ల రుణమాఫీని చంద్రబాబు రూ. 15 వేలకు కుదించారు.. ఆయన పాలనలో భూములన్నింటినీ పారిశ్రామిక వేత్తలకు దోచిపెట్టారని విమర్శించారు. ‘మేము ఇస్తామన్న డబ్బు కంటే వెయ్యి రూపాయలు అదనంగా ఇస్తున్నాము. గతంలో చంద్రబాబు కేంద్ర ప్రభుత్వ నిధులతోనే అనేక పథకాలు అమలు చేశారు. కుట్రలు, కుతంత్రాలు చంద్రబాబుకు పుట్టుకతోనే వచ్చాయి. చంద్రబాబు కంటే పెద్ద కుట్రదారుడు ఎవరు ఉన్నారు. మేధావులు, పెద్దలు సూచన సలహాతోనే మూడు విడతులుగా రైతు భరోసా అందిస్తున్నారు. దేవినేని ఉమాకు వ్యవసాయ శాఖకు, వ్యవసాయ మిషన్‌కు తేడా తెలియడం లేదు. ప్రతీ కుటంబానికి భేషరుతుగా రుణమాఫీ అమలు చేస్తామని చెప్పి చంద్రబాబు రైతులను మోసం చేశారు. ఐదు విడతల్లో రుణమాఫీ చేస్తామని చెప్పి రెండు విడతలను ఎగ్గొట్టారు. చంద్రబాబుకు రైతులు బుద్ది చెప్పినప్పటికీ ఆయనలో మార్పు రాలేదు. బ్యాంకుల్లో ఉన్న బంగారాన్ని ఇంటికి తెస్తామని చంద్రబాబు హామీ ఇచ్చి మహిళలను మోసం చేశారు’ అని చంద్రబాబు తీరుపై మండిపడ్డారు. మేనిఫెస్టో స్పష్టంగా ఉంది.. సీఎం జగన్ హయాంలో అర్హులైన 51 లక్షల మంది రైతులకు, 3 లక్షల మంది కౌలు రైతులకు వైస్సార్ రైతు భరోసా అందుతోందని తెలిపారు. దేశంలో మొదటి సారిగా కౌలు రైతులకు రైతు భరోసాను సీఎం జగన్ అందజేస్తున్నారని తెలిపారు. ‘వైఎస్సాసీపీ మేనిఫెస్టో స్పష్టంగా ఉంది. చంద్రబాబు లాగా మేనిఫెస్టోను వెబ్సైట్ నుంచి తొలగించలేదు. అయినా చంద్రబాబు శని ప్రభావంగా గతంలో వర్షాలు పడలేదు. వైఎస్ జగన్ సీఎం అయిన తర్వాత సమృద్ధిగా వర్షాలు పడుతున్నాయి’ అని నాగిరెడ్డి వ్యాఖ్యానించారు. -
అగ్రికల్చర్ మిషన్‌పై సీఎం జగన్ సమీక్ష
సాక్షి, అమరావతి: అగ్రికల్చర్ మిషన్‌పై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శనివారం సమీక్ష చేపట్టారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఈ సమావేశం జరుగుతోంది. రైతాంగం ఎదుర్కొంటున్న సవాళ్లపై సమావేశంలో చర్చిస్తున్నారు. అగ్రికల్చర్ మిషన్ వైస్ చైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి, మంత్రులు కన్నబాబు, మోపిదేవి వెంకటరమణ, అనిల్‌కుమార్ యాదవ్, ప్రముఖ జర్నలిస్ట్ పాలగుమ్మి సాయినాథ్, ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. -
ఇన్పుట్ సబ్సిడీని ఎగ్గొట్టి పరిహారంపై లేఖలా?
సాక్షి, అమరావతి: తాను అధికారంలో ఉండగా కరువు, పంట నష్టం కారణంగా రైతులకు చెల్లించాల్సిన సుమారు రూ.2,300 కోట్ల ఇన్పుట్ సబ్సిడీని ఎగ్గొట్టిన ప్రతిపక్ష నేత చంద్రబాబు ఇప్పుడు 20 రోజులు కూడా గడవకుండా ముందే పరిహారాన్ని అందచేయాలంటూ విమర్శలకు దిగటంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రైతులకు చిల్లిగవ్వ విదల్చని చంద్రబాబు ఇప్పుడు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేయడం దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని వ్యాఖ్యానిస్తున్నారు. పంట నష్టపోయిన సందర్భాల్లో నిబంధనల ప్రకారం ఎన్యూమరేషన్ జరుగుతుందని, విపత్తు సాయం గురించి తెలిసిన వారెవరూ ఇలాంటి వ్యాఖ్యలు చేయరని అధికార యంత్రాంగం పేర్కొంటోంది. వరదలకు రాష్ట్ర ప్రభుత్వమే కారణమంటూ చంద్రబాబు విమర్శలకు దిగడం పట్ల కూడా విస్తుపోతున్నారు. ‘మనుషులు సృష్టిస్తే వరదలొస్తాయా? విజ్ఞత కలిగిన వారెవరైనా ఇలా మాట్లాడతారా?’ అని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. చంద్రబాబు గతంలో అధికారంలోకి వచ్చిన వెంటనే హుద్ హుద్ తుపాన్‌తో విశాఖ తీవ్రంగా దెబ్బ తినడం ఆయనకు గుర్తు లేదా? అని ప్రశ్నిస్తున్నారు. రుణమాఫీ హామీని నెరవేర్చకుండా లేఖలా? ప్రతిపక్ష నేత చంద్రబాబు బురద రాజకీయాలు చేస్తుండటం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ‘గత 25 ఏళ్లలో ఎన్నడూ లేని స్థాయిలో భారీ వరదలు వచ్చి కృష్ణా నదిపై ప్రాజెక్టులన్నీ నిండుకుండల్లా మారాయి. ప్రకాశం బ్యారేజీకి ఒకే రోజు 7.5 లక్షల క్యూసెక్కులకుపైగా వరద నీరు వస్తే కరకట్టల వెంట ఉన్న లంక గ్రామాలు దెబ్బ తినకుండా ఉంటాయా?’ అని పరిశీలకులు, ప్రజలు పేర్కొంటున్నారు. కృష్ణా నదికి వరదల సమయంలో అధికార యంత్రాంగం అంతా అప్రమత్తమై సహాయక చర్యల్లో నిమగ్నం కాగా టీడీపీ నేతలు మినహా మరెవరూ విమర్శలు చేయలేదని, చంద్రబాబు ఉద్దేశపూర్వకంగానే బురద చల్లుతున్నారని స్పష్టం చేస్తున్నారు. చంద్రబాబు ఐదేళ్లు అధికారంలో కొనసాగి తాను తొలి సంతకం చేసిన రైతుల రుణమాఫీ హామీని నెరవేర్చకుండా బకాయిలు చెల్లించాలంటూ ఇప్పుడు ప్రభుత్వానికి లేఖలు రాయటాన్ని తప్పుబడుతున్నారు. వరదలకు ప్రభుత్వమే కారణమంటూ చంద్రబాబు లేఖలు రాయడం సిగ్గుచేటని వ్యవసాయ మిషన్ ఉపాధ్యక్షుడు ఎంవీఎస్ నాగిరెడ్డి మండిపడ్డారు. -
ప్రతి నెలా రైతుల సమస్యలు చర్చిస్తాం: నాగిరెడ్డి
సాక్షి, అమరావతి: అగ్రికల్చర్ మిషన్ వైస్ చైర్మన్ ఎంవిఎస్ నాగిరెడ్డి గురువారం సచివాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు నేరుగా వ్యవసాయ మిషన్‌కు వచ్చి వారి సమస్యలను తెలియజేయవచ్చని ఆయన పేర్కొన్నారు. ప్రతీ రైతు సమస్యను ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకువెళతామని తెలిపారు. రైతుల సమస్యలను ప్రతి నెలా అగ్రికల్చర్ మిషన్‌లో సీఎంతో చర్చించి నిర్ణయాలు తీసుకుంటామని వెల్లడించారు. రైతులు ఎప్పుడైనా వారి సమస్యలు చెప్పుకునేలా మిషన్‌ను రూపొందిస్తున్నామని అన్నారు. -
ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తున్న వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు
సాక్షి, కృష్ణా: జిల్లాలోని ముంపు ప్రాంతాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పర్యటిస్తూ.. సహాయక చర్యల గురించి ఆరా తీస్తున్నారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి పెనమలూరు నియోజకవర్గంలో పునరావాస కేంద్రాలను పరిశీలించారు. సహాయక చర్యల గురించి అధికారులతో సమీక్ష నిర్వహించారు. అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మంచి నీటి సమస్య, శానిటేషన్ సమస్య లేకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ముంపు ప్రాంతాల్లో పశువులకు గడ్డి ఏర్పాటుతో పాటు అంటువ్యాధులు ప్రబలకుండా వాక్సినేషన్ టీకాలు వేయ్యాలన్నారు. ముంపు ప్రాంతాల్లో దొంగతనాలు జరగకుండా పోలీసుల గస్తీ ఏర్పాటు చేయాలని పార్థసారథి అధికారులను ఆదేశించారు. వాణిజ్య పంటలు పూర్తిగా దెబ్బ తిన్నాయన్నారు. నష్టపోయిన రైతన్నను ప్రభుత్వం ఆదుకుంటుందని తెలిపారు. ప్రాణ నష్టం, ఆస్తి నష్టం తగ్గించడంలో అధికారులు బాగా కృషి చేశారని పార్థసారథి ప్రశంసించారు. నందిగామలో పర్యటించిన జగన్మోహన్ రావు కృష్ణా నది ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో ఎమ్మెల్యే డాక్టర్ జగన్ మోహన్ రావు కంచికచెర్ల, చందర్లపాడు మండలాల్లో పర్యటించారు. బాధితుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వరద ముంపు ప్రాంత ప్రజల కోసం ప్రత్యేక కాల్ సెంటర్‌ను ఏర్పాటు చేశామని.. ఏవైనా సమస్యలు ఉంటే (9493530303) కాల్ సెంటర్ నంబర్‌కు కాల్ చేయమని చెప్పారు. అవనిగడ్డలో పర్యటించిన ఎమ్మెల్యేలు అవనిగడ్డలోని ఎడ్లలంక, చిరువోలంక, బొబ్బర్లంక, కొత్తపాలెం, ఆముదాలంక గ్రామాల్లో ఎమ్మెల్యేలు సింహాద్రి రమేష్ బాబు, ఎంవీఎస్ నాగిరెడ్డి పర్యటించారు. ముంపు గ్రామల ప్రజలను పునరావాస కేంద్రాల వద్దకు తరలించి వారికి భోజనంతో పాటు, మెడికల్ సహాయ చర్యలు అందించారు. ఎమ్మెల్యేలతో పాటు స్థానిక డీఎస్పీ, సీఐ, ఎస్సైలు, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొన్నారు. జేసీ మాదవీలత, పామర్రు ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ ఎన్డీఆర్ ఎఫ్ బోటులో కృష్ణా నది దాటి తోట్లవల్లూరు మండలం పాములలంకకు వెళ్లారు. ఆ గ్రామ ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిరావాలని కోరారు. జిల్లా జాయింట్ కలెక్టర్-2 మోహన్ కుమార్, వైయస్ఆర్ సీపీ యువనేత సామినేని ప్రశాంత్ బాబు జగ్గయ్యపేట మండలం రావిరాల, ముక్త్యాల గ్రామాల్లో వరద ముంపు ప్రాంతాలను పరిశీలించి గ్రామస్తులతో మాట్లాడారు. -
‘సిగ్గు లేకుండా రాజకీయం చేస్తున్నారు’
సాక్షి, అమరావతి: కృష్ణా నదిలో వరద ఇంకా ఉదృతమయ్యే అవకాశముందని అగ్రికల్చర్ మిషన్ వైస్ చైర్మన్ ఎంవిఎస్ నాగిరెడ్డి హెచ్చరించారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ ప్రకాశం బ్యారేజీ నుంచి 6 లక్షలకు పైగా క్యూసెక్కుల వరద నీటిని విడుదల చేస్తున్నారని తెలిపారు. కరకట్టలో డ్రోన్ వినియోగానికి టీడీపీ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయటంపై ఆయన ధీటుగా స్పందించారు. ప్రజలను కాపాడటానికి, ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయడానికే అధికారులు డ్రోన్‌ను వినియోగించారని స్పష్టం చేశారు. డ్రోన్ల ద్వారా కరకట్టలో నిర్మాణాలు, ఇతర ముంపు ప్రాంతాల పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారన్నారు. టీడీపీలో అక్రమ కట్టడాన్ని సమర్థించుకోడానికి ఆ పార్టీ నేతలు డ్రామాలు ఆడుతున్నారన్నారు. కరకట్ట లోపల నిర్మించిన చంద్రబాబు నివాసం అక్రమ కట్టడం కాదా? అని నాగిరెడ్డి ప్రశ్నించారు. ముంపు వస్తుందనే ముందు జాగ్రత్తతో బాబు హైదరాబాద్ వెళ్లిపోయాక కూడా టీడీపీ నేతలు దిగజారిపోయి మరీ ధర్నాలు చేస్తున్నారని నాగిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు అసహ్యించుకునేలా టీడీపీ నేతలు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ముంపు కష్టాలను గాలికి వదిలేసి... ఇంట్లో ఎవరూ లేని అక్రమ కట్టడం కోసం టీడీపీ నేతలు ధర్నాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఇప్పటికైనా చంద్రబాబు అక్రమ నివాసాన్ని మర్యాదగా ఖాళీ చేసి వెళ్లిపోవాలని హెచ్చరించారు. -
‘చరిత్ర పునరావృతం కాబోతుంది’
సాక్షి, అమరావతి: దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్‌రెడ్డి హయాంలోనే పోలవరం ప్రాజెక్టుకి పునాదులు పడ్డాయని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి గుర్తుచేశారు. చంద్రబాబు నాయుడు ఐదేళ్ల పాలనలో పోలవరానికి చేసింది ఏమీ లేదని విమర్మించారు. ప్రాజెక్టును ప్రారంభించింది వైఎస్సార్ అయితే.. దానిని పూర్తి చేసేది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అని అన్నారు. శుక్రవారం విజయవాడలోని పార్టీ కార్యాలయంలో నాగిరెడ్డి మాట్లాడుతూ.. 2018లోనే పోలవరంను పూర్తి చేస్తామని టీడీపీ నేతలు గొప్పలు చెప్పారని, కానీ స్పీల్వే పనులు మాత్రమే పూర్తి చేశారని వివరించారు. ఎన్నికల కోసమే ప్రజలను బస్సుల్లో తీసుకెళ్లి ప్రచారం చేసుకున్నారని మండిపడ్డారు. దోచుకునేందుకే కేంద్రం వద్ద నుంచి పోలవరంను టీడీపీ నాయకులు లాక్కున్నారని, నామినేటెడ్ పద్దతిలో టెండర్లు జరపడం వల్ల రూ.2300 కోట్లు అవినీతి జరిగిందని నాగిరెడ్డి ఆరోపించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ‘‘టెండర్లను రద్దు చేస్తే చంద్రబాబుకు ఉలుకెందుకు. పోలవరం, ఇరిగేషన్ ప్రాజెక్టుల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదు. ఏపీకి పట్టిన శనివదిలింది కాబట్టే వర్షాలు పడుతున్నాయి. మరలా చరిత్ర పునరావృతం కాబోతుంది. కృష్ణా నది ప్రకాశం బ్యారేజీ దాటి సముద్రాన్ని చూడబోతుంది. 60 వేల కోట్లు ఖర్చు పెట్టి ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి చేయలేదు. పట్టిసీమ నీళ్లు ఇస్తే ప్రజలు టీడీపీని ఎందుకు తిరస్కరించారు. ప్రజలను ఇంకా మభ్యపెట్టాలని చూస్తే 23 కాస్తా తగ్గుతాయి. రాజశేఖర్ రెడ్డి ఆశయాలే వైఎస్ జగన్ ఆలోచనలు’’ అన్నారు. -
వైఎస్సార్ ఆశయాలే వైఎస్ జగన్ ఆలోచనలు
-
దానిని లోకేష్ రాజకీయ నిధిగా మార్చారు..
సాక్షి, విజయవాడ: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి బతికిఉంటే ఏపీ ప్రజల జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు ఎప్పుడో పూర్తి చేసేవారని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఇరిగేషన్ ప్రాజెక్టులపై ప్రభుత్వం విచారణ జరిపిస్తుందంటే చంద్రబాబు ఎందుకు కంగారు పడుతున్నారాని ప్రశ్నించారు. శనివారం విజయవాడలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. పోలవరం ప్రాజెక్టు పనులన్నీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలోనే ప్రారంభమయ్యాయని గుర్తుచేశారు. ఆయన జీవించి ఉంటే 2014 నాటికే పోలవరం పూర్తయ్యి ఉండేదని అన్నారు. చంద్రబాబు కుమారుడు నారా లోకేష్‌కు రాజకీయ స్థిరీకరణ నిధిగా టీడీపీ పోలవరంను భావించిందని ఆరోపించారు. గతంలో పూర్తయిన ప్రాజెక్టుల వద్దకు ఇప్పటి వరకు ఎవ్వరూ బస్సులు పెట్టి ప్రజల్ని తీసుకెళ్ళలేదని అన్నారు. చంద్రబాబు, లోకేష్ ట్విట్టర్లో కామెంట్లు పెడతారని.. రైతులు సోషల్ మీడియాను చూస్తారా? అని ప్రశ్నించారు. దేశంలోనే అతిపెద్ద మోసం టీడీపీ చేసిన రైతు ఋణమాఫీ అని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. చంద్రబాబు ఏ తప్పు చెయకపోతే రివర్స్ టెండరింగ్‌కు మద్దతు ఇవ్వాలని నాగిరెడ్డి డిమాండ్ చేశారు. జలయజ్ఞం ద్వారా రాజశేఖర్‌రెడ్డి గతంలో ప్రారంభించిన ప్రాజెక్టులను సీఎం వైఎస్ జగన్ పూర్తి చేస్తారని స్పష్టం చేశారు. పోలవరంలో జరిగిన అవినీతిని వెలికి తీసేందుకు కేంద్రం ప్రభుత్వం కూడా చొరవ చూపాలని పేర్కొన్నారు. -
ఎక్కువ పోషకాలు లభించే ఆహార పదార్ధం ఇదే...
ఆరోగ్యంగా ఉండాలంటే పౌష్టికాహారం చాలా ముఖ్యం. పోషకాలు సమృద్ధిగా లభించే ఆహార పదార్ధాలలో చేపలు ప్రధానమైనవి. చేపలలో ప్రోటీన్లు, ఫ్యాటీ యాసిడ్లు పుష్కలంగా ఉంటాయి. తక్కువ ఖర్చులో ఎక్కువ పోషకాలు లభించే ఆహార పదార్ధంగా చేపను చెప్పవచ్చు. 2001 నుంచి కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏడాది జూలై 9, 10 తేదీల్లో జాతీయ మత్స్య రైతుల దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఆక్వా కల్చర్ ఫార్మింగ్ దేశంలోనూ, ఆంధ్రప్రదేశ్‌లో ప్రధాన కల్చర్‌గా అభివృద్ధి అవుతున్న తరుణంలో జాతీయస్థాయిలో అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దేశం నలుమూలల నుంచి 5వేల మంది ప్రతినిధులు,అయిదువేల మంది ప్రజలు రెండు రోజుల పాటు ఈ కార్యక్రమాల్లో పాల్గొంటారు. చేపల పెంపకం సంబంధించిన సాంకేతిక సలహాలు, విశిష్ట ప్రసంగాలతోపాటు, 30కిపైగా రకాలు చేపల ప్రదర్శన, నోరూరించే చేపల వంటకాల ప్రదర్శన ఏర్పాటు చేస్తారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ ,వ్యవసాయ నిపుణులు యమ్‌వీఎస్ నాగిరెడ్డి ఏమంటున్నారో ఒకసారి చూద్దాం. -
ఇక నుంచి ప్రతినెలా వ్యవసాయ మిషన్ సమావేశం
-
కౌలు రైతులకు ఏపీ సర్కార్ శుభవార్త
సాక్షి, అమరావతి : కౌలు రైతులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త అందించింది. రైతు భరోసా పథకాన్ని కౌలు రైతులకు వర్తింపచేయనుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శనివారం అగ్రికల్చర్ మిషన్‌పై అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం అగ్రికల్చర్ మిషన్ వైస్ చైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి సమీక్షా సమావేశం వివరాలను మీడియాకు వెల్లడించారు. ‘తొలి సమావేశం బాగా జరిగింది. నకిలీ విత్తనాలు సరఫరా చేస్తే కఠిన చర్యలు చేపట్టాలని సీఎం సూచించారు. వచ్చే సీజన్‌కు విత్తన సరఫరాకు ప్రణాళికలు రూపొందించాలని చెప్పారు. మేనిఫెస్టోలో రైతులకు ఇచ్చిన హామీలు రైతు దినోత్సవం రోజు అమల్లోకి రాబోతున్నాయని, రైతు భరోసాలో ఇచ్చిన 12 హామీలను జూలై 8 నుంచి రైతు దినోత్సవం సందర్భంగా అమలు చేస్తాం. చదవండి: వ్యవసాయంపై ప్రత్యేక దృష్టి పెట్టిన సీఎం జగన్ ఇక నుంచి ప్రతి నెల అగ్రికల్చర్ మిషన్ సమావేశం ఉంటుంది. విత్తనాల కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశాలు ఇచ్చారు. రైతులకు 9 గంటలు పగలు కరెంట్ అందించేలా 60 శాతం ఫీడర్ల ఆధునీకరణ, అందుకోసం రూ.1700 కోట్లు ఖర్చు చేస్తాం. రైతులకు ఎలాంటి ఇబ్బందులు, సమస్యలు ఉండకూడదని ముఖ్యమంత్రి ఆదేశించారు. కౌలు రైతులకు కూడా రైతు భరోసా అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నాం. అవసరం అయితే అసెంబ్లీలో చట్ట సవరణ చేస్తాం. భూ రికార్డుల సవరణ కూడా చేపట్టాల్సి ఉంది. ఇక విత్తనాల కొరత, నాణ్యత విషయంలో ఓ ల్యాబ్ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రిని కోరాం. రైతు సహకార సంఘాల ఎన్నికలు, నీటి సంఘాల ఎన్నికలు కూడా నిర్వహిస్తాం. గతంలో నామినేట్ చేసిన వ్యక్తులే కొనసాగుతున్నారు. వాటిని ఇప్పటికే రద్దు చేశారు.’ అని పేర్కొన్నారు. -
సీఎం అధ్యక్షతన వ్యవసాయ మిషన్
సాక్షి, అమరావతి: వ్యవసాయ రంగ సంక్షోభానికి పరిష్కార మార్గాలు కనుగొనే దిశగా రాష్ట్ర ప్రభుత్వం తొలి అడుగు వేసింది. విధాన సలహా మండలిగా అగ్రికల్చరల్ (వ్యవసాయ) మిషన్‌ను ఏర్పాటు చేసింది. వ్యవసాయం, అనుబంధ రంగాలు, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య ఉత్తమ సమన్వయానికి ఈ మిషన్ దోహదపడుతుంది. రైతాంగం ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించేందుకు ఎప్పటి కప్పుడు ఉత్తమమైన సేవలు అందించడం, ఉత్పత్తి, మార్కెటింగ్, వ్యవసాయ, ఉద్యాన ఉత్పత్తుల ధరలు సహా వ్యవసాయానికి సంబంధించిన అన్ని అంశాలను పరిశీలిస్తుంది. అలాగే వ్యవసాయ సంస్థలకు, రైతాంగానికి ఎప్పటికప్పుడు మార్గదర్శకత్వం వహిస్తుంది. రైతులు సాధికారిత సాధించేలా విధానపరమైన ప్రాథమిక వేదికగా ఉంటుంది. ఈ మిషన్‌కు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చైర్మన్‌గా, రైతు నాయకుడు ఎంవీ ఎస్ నాగిరెడ్డి వైస్ చైర్మన్‌గా వ్యవహరిస్తారు. వ్యవసాయ, సహకారం, రెవెన్యూ, నీటిపారుదల, విద్యుత్, పశుసంవర్థక, మత్స్య, మార్కెటింగ్ శాఖల మంత్రులు, ఆ శాఖల కార్యదర్శులు, అధిపతులు, ఆచార్య ఎన్జీ రంగా విశ్వవిద్యాలయం మాజీ వైస్ చాన్సలర్ డాక్టర్ పి.రాఘవరెడ్డి, వ్యవసాయ ఆర్థిక వేత్త డాక్టర్ చంద్రశే ఖర్‌రెడ్డి, రైతు ప్రతినిధులుగా బోయ నరేంద్ర, జిన్నూరి రామారావు, గొంతు రఘురామ్, అనంతపురంలోని గ్రామీణాభివృద్ధి ట్రస్ట్ జీవావరణ విభాగం డైరెక్టర్ ప్రతిపాదించే వ్యక్తి, డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ ఫౌండేషన్ ప్రతినిధి, సీనియర్ జర్నలిస్టు పి.సాయినాథ్, వ్యవసాయ ఇన్పుట్ సరఫరాదారులు నిర్ణయించే ఇద్దరు ప్రతినిధులు సభ్యులుగా ఉంటారు. ఈ మేరకు వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి వై.మధుసూదనరెడ్డి పేరిట సోమవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. వైస్ చైర్మన్‌తో సంప్రదింపుల అనంతరం మెంబర్ సెక్రటరీ దీనికి సంబంధించిన ప్రత్యేక కార్యాలయం, సిబ్బంది తదితరాలను సమకూర్చుతారు. మిషన్ రోజువారీ కార్యకలాపాల నిర్వహణకు అవసరమైన బడ్జెట్ వ్యవహారాలను కూడా ఆయనే చూస్తారు. అవసరాన్ని బట్టి ఏర్పాటయ్యే జోనల్, జిల్లా స్థాయి మిషన్లతో అగ్రికల్చరల్ మిషన్ సమన్వయం చేస్తుంది. పనితీరు ఎలా ఉండాలనే దానిపై వేరుగా మార్గదర్శకాలను జారీ చేస్తారు. వ్యవసాయ శాఖ ప్రత్యేక కమిషనర్ ఇందుకు సంబంధించి అవసరమైన తదుపరి చర్యలను తీసుకుంటారు. -
సీఎం జగన్ మరో హామీని నిలబెట్టుకున్నారు!
సాక్షి, అమరావతి: రైతులకు పగటిపూటే 9 గంటల ఉచిత విద్యుత్ సరఫరాను రేపటి నుంచి అమలు చేస్తామని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించడంపై వైఎస్సార్సీపీ రైతు విభాగం అధ్యక్షుడు ఎంవీఎస్ నాగిరెడ్డి ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్‌ను కలిసి అభినందించారు. 2014 ఎన్నికల్లో చంద్రబాబు 9 గంటల విద్యుత్ ఇస్తానని చెప్పి మోసం చేశారని, కానీ సీఎం వైఎస్ జగన్ తాను ఇచ్చిన హామీని అమలు చేసి నిరూపించారన్నారు. రైతులకు గురువారం నుంచే పగటిపూట 9 గంటల ఉచిత విద్యుత్ సరఫరా చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించిన సంగతి తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 60 శాతం ఫీడర్ల ద్వారా రేపటి నుంచే పగటిపూట నిరంతరాయంగా 9 గంటల విద్యుత్ సరఫరా చేయాలని చెప్పారు. మిగిలిన 40 శాతం ఫీడర్ల మరమ్మతులకు రూ. 1700 కోట్ల రూపాయలు విడుదల చేశారు. వచ్చే ఏడాది జులై నుంచి మిగిలిన 40 శాతం ఫీడర్ల నుంచి కూడా వ్యవసాయానికి ఉచిత విద్యుత్ సరఫరా చేయాలని ఆదేశించారు. -
‘రైతు దినోత్సవ ప్రకటన ఆనందంగా ఉంది’
సాక్షి, విజయవాడ : అన్నదాతల ఆపద్బాంధవుడు దివంగత ముఖ్యమంత్రి, డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతిని(జూలై 8) రైతు దినోత్సవంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించడం ఆనందంగా ఉందని రైతు విభాగ రాష్ట్ర అధ్యక్షుడు ఎంవీఎస్ నాగిరెడ్డి అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో అనేక ప్రాజెక్టుల నిర్మాణాలు ప్రారంభించిన వైఎస్సార్ జయంతిని రైతు దినోత్సవంగా జరపాలన్న సీఎం వైఎస్ జగన్ ప్రకటన పట్ల రైతులంతా ఆనందంగా ఉన్నారన్నారు. రైతే దేశానికి వెన్నెముక అని అందరూ చెబుతారు కానీ.. సీఎం వైఎస్ జగన్ ఆ దిశగా పాలన సాగిస్తున్నారని ప్రశంసించారు. నవరత్నాలను ప్రకటించడమే కాదు అదే ఖురాన్, బైబిల్, భగవద్గీతగా నమ్ముతూ సీఎం జగన్ పాలన సాగిస్తున్నారన్నారు. రైతులకు పగటి పూట 9 గంటల కరెంట్, స్థిరీకరణ నిధి, ఇన్సూరెన్స్ వంటికి చేపట్టి రైతులకు భరోసా కల్పిస్తున్న సీఎం జగన్‌కు రైతులను రుణపడి ఉంటారన్నారు. వైఎస్సార్ కోరుకున్నట్లు రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్‌గా మార్చేందుకు అడుగులేస్తున్న సీఎం జగన్‌కు అందరూ సహకరించాలని కోరారు. -
రైతులందరి తరపున ప్రభుత్వానికి కృతఙ్ఞతలు
-
చంద్రబాబు భయంతోనే ఈవీఎంలపై నెపం నెడుతున్నారు
-
‘ఓటమికి కారణాలు వెతుకుతున్నారు’
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల్లో ఓడిపోతే టీడీపీ విచ్చిన్నం అవుతుందనే భయంతోనే చంద్రబాబు నాయుడు ఈవీఎంలపై నెపం నెడుతున్నారని వైఎస్సార్సీపీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఎంవీఎస్ నాగిరెడ్డి అన్నారు. ఓటమి కారణాలను వెతుకుతున్నారని, 2014 ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వచ్చింది ఈవీఎంలతోనే అని ఆయన గుర్తుచేశారు. మంగళవారం నాగిరెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. పోలింగ్ సరళి చూసి భయపడ్డ చంద్రబాబు.. ఓటు వేసిన గంటకే నా ఓటు ఎటుపోయిందో అంటూ మాట్లాడారని పేర్కొన్నారు. ఈవీఎంలే ఫైనలని.. వీవీప్యాట్లని ట్రయల్‌గా తీసుకున్నారని నాగిరెడ్డి అన్నారు. ఓటమి భయంతోనే చంద్రబాబు ఎన్నికల సంఘం, సీఎస్‌పై లేనిపోని ఆరోపణలకు చేస్తున్నారని మండిపడ్డారు. విజయంలేకపోతే పార్టీని నడపలేమనే భయంతో చంద్రబాబు ఉన్నారని, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా చంద్రబాబు ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గడిచిన ఐదేళ్లు ప్రజలతో గడిపారని.. నిరంతరం ప్రజల సమస్యలపై పోరాడారని స్పష్టం చేశారు. -
23న చంద్రబాబు దిగిపోవడం ఖాయం
సాక్షి, అమరావతి: సీఎం పీఠం నుంచి ఈ నెల 23 తర్వాత చంద్రబాబు దిగిపోవడం ఖాయం.. ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ. అందుకే కేబినెట్ 10వ తేదీన నిర్వహిస్తామని అంటున్నారు.. ఓటమి భయం పట్టుకోవడంతో చంద్రబాబు చిత్ర విచిత్రంగా వ్యవహరిస్తున్నారు.. అంటూ వైఎస్సార్సీపీ సీనియర్ నాయకుడు అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. సోమవారం వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యాలయంలో రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఎంవీఎస్ నాగిరెడ్డితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు రాబోయే ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకే కేబినెట్ మీటింగ్ అంటూ హడావుడి చేస్తున్నారు. ఈ నెల 23 తర్వాత చంద్రబాబు జీవితాంతం కేబినెట్ సమావేశం నిర్వహించలేరని ఎద్దేవా చేశారు. చంద్రబాబు.. తన ఓటమిని ఎన్నికల కమిషన్ (ఈసీ), ఈవీఎంలపై నేట్టే యత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. నూటికి నూరుపాళ్లు టీడీపీ అధికారం కోల్పోతుంది. ప్రజలంతా వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం కావాలన్న నిర్ణయంతో ఓట్లు వేశారని మే 23వ తేదీ తర్వాత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పడడం ఖాయం అన్నారు. టీడీపీ కార్యకర్తలా పని చేస్తున్నాడని ఇంటిలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంటకేశ్వరరావుపై ఫిర్యాదు చేస్తే... చంద్రబాబు చిందులు తొక్కారన్నారు. అప్పటి నీ మాటలు గుర్తుకు తెచ్చుకో ‘బాబు’ ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు, అధికారులు అందరూ ఎన్నికల కమిషన్ పరిధిలోనే ఉండాలని ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు అప్పట్లో చెప్పిన ఆయన ఇప్పుడు సీఎంగా ఉంటే చట్టాలు, నియమాలు మారిపోతాయా? అని ప్రశ్నించారు. ఎన్నికల కోడ్‌కు విరుద్ధంగా ఏపీపీఎస్సీ... ఎన్నికల ప్రక్రియ ఇంకా కొనసాగుతుండగా ఏపీపీఎస్సీ గ్రూప్–2 పరీక్షలో ఓటర్లను ప్రభావితం చేసేలా టీడీపీ, చంద్రబాబు చుట్టూ తిరిగే ప్రశ్నలను అడిగారని మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి రైతులకు నీళ్లిస్తానని ఇవ్వకుండా ఇప్పుడు ప్రాజెక్టును సందర్శించి సమీక్షలు చేసే నైతిక అర్హత చంద్రబాబుకు లేదన్నారు. ఎన్నికల సంఘంలోనే టీడీపీ కోవర్టులు: నాగిరెడ్డి దేశ చరిత్రలో ఎవరూ ఉల్లంఘించనన్ని ఉల్లంఘనలు ఈ ఎన్నికల్లో బాబు పాల్పడ్డారని నాగిరెడ్డి విమర్శించారు. ఎన్నికల కమిషన్‌లోనే టీడీపీ కోవర్టులను చొప్పించారని, వారు అధికార పార్టీకి సమాచారం చేరవేస్తున్నారని ఆరోపించారు. -
ఎన్నికల సంఘంలోనే టీడీపీ కోవర్టులు ఉన్నారు : నాగిరెడ్డి
-
‘ఎన్నికల సంఘంలో టీడీపీ కోవర్టులు’
-
‘ఎన్నికల సంఘంలో టీడీపీ కోవర్టులు’
సాక్షి, అమరావతి: ఎన్నికల సంఘంలోని సోషల్ మీడియా వింగ్‌లో టీడీపీ కోవర్టులు ఉన్నారని వైఎస్సార్సీపీ నేత ఎంవీఎస్ నాగిరెడ్డి సీఈఓ గోపాలకిృష్ణ ద్వివేదికి ఫిర్యాదు చేశారు. ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా, టీడీపీ ప్రభుత్వానికి అనుకూలంగా ఈసీలో కొంత మంది పనిచేస్తున్నారని అన్నారు . ఈమేరకు శుక్రవారం ఆయన ద్వివేదిని కలిసి వినతిపత్రం అందించారు. ఈసీ సోషల్ మీడియా వింగ్ పేరుతో టీడీపీకి అనుకూలంగా పనిచేసే వారిని చంద్రబాబు నాయుడు పథకం ప్రకారం నియమించుకున్నారని నాగిరెడ్డి ఆరోపించారు. పోస్టల్ బ్యాలెట్ల కోసం ప్రలోభాలకు పాల్పడుతున్న టీడీపీ అభ్యర్థి సబ్బంహరిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ప్రలోభాలతో సబ్బంహరి పోస్టల్ బ్యాలెట్స్‌ను రాబట్టే ప్రయత్నం చేస్తున్నారని, ప్రలోభాల ఆడియో టేపులను ఈసీకి అందచేశామని నాగిరెడ్డి తెలిపారు. టీడీపీకి తొత్తులుగా వ్యవహిస్తూ.. ఆబ్జెక్ట్ ఏజెన్సీ ఓటర్లని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసిందని, ఇంటలిజెన్స్ అండతోనే అది ఈసీలోకి ప్రవేశించిందని ఆరోపించారు. కౌంటింగ్ రోజు కేంద్రాల వద్ద భద్రత పెంచాలని కోరుతూ వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి రాసిన లేఖను సీఈఓకు అందచేశామని అన్నారు. -
కొనుగోలు కేంద్రాలు తెరచి ధాన్యం కొనడం మరిచారు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పేరుకు మాత్రమే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినా రైతుల నుంచి ధాన్యం కొనడం లేదని వైఎస్సార్సీపీ రైతు విభాగం అధ్యక్షుడు ఎంవీఎస్ నాగిరెడ్డి చెప్పారు. రైతు సమస్యలపై చర్చించేందుకు సోమవారం అఖిలపక్ష రైతు సంఘాల సమన్వయ కమిటీ రాష్ట్ర నాయకులతో కలిసి ఆయన పౌరసరఫరాల కమిషనర్ డి.వరప్రసాద్‌ను కలిశారు. క్షేత్ర స్థాయిలో రైతులు పడుతున్న ఇబ్బందులపై వినతిపత్రమిచ్చారు. మిల్లర్లు కొనుగోలు చేసిన ధాన్యాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేంద్రాలకు తీసుకెళ్లి రైతులే విక్రయించినట్లు రికార్డుల్లో నమోదు చేస్తున్నారని దీంతో రైతు నష్టపోయి మిల్లర్లు లాభపడుతున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర నామమాత్రంగా కూడా రైతుకు దక్కడం లేదని ఫిర్యాదు చేశారు. ధాన్యం కొనుగోలు చేసేందుకు కేంద్రాలు ప్రారంభించినా రైతుల నుంచి నేరుగా ధాన్యం కొనుగోళ్లు చేయడం లేదని చెప్పారు. రైతులు కొనుగోలు కేంద్రాలకు వెళ్తే గోనె సంచులు లేవని అక్కడి సిబ్బంది చెప్పడమే కాకుండా సంచులను మిల్లర్ల వద్ద తెచ్చుకోవాలంటూ సూచిస్తున్నారని కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. ధాన్యాన్ని మిల్లర్లు నేరుగా కొనుగోలు చేస్తున్నందున బస్తాకు దాదాపు రూ.200 రైతులు నష్టపోతున్నారన్నారు. ఒకవైపు అకాల వర్షాలు మరోవైపు తుపాను వస్తుందనే వార్తలతో రైతులు కలవర పడుతూ చేసేది ఏమీలేక ఎంతో కొంతకు ధాన్యాన్ని తెగనమ్ముకునే పరిస్థితి ఏర్పడిందన్నారు. ప్రతి కొనుగోలు కేంద్రానికి రైతులు తీసుకొచ్చిన ధాన్యాన్ని విధిగా కొనుగోలు చేయాలని కమిషనర్‌కు విజ్ఞప్తి చేశారు. మద్దతు ధర కంటే తక్కువకు కొనుగోలు చేస్తే అలాంటి వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని రైతు సంఘం నేతలకు కమిషనర్ హామీ ఇచ్చారు. -
‘కోవర్టులే తప్పుదారి పట్టిస్తున్నారు’
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రధానాధికారి గోపాల కృష్ణ ద్వివేదీని వైఎస్సార్సీపీ రైతు విభాగం అధ్యక్షులు, పార్టీ అధికార ప్రతినిథి ఎంవీఎస్ నాగిరెడ్డి మంగళవారం కలిశారు. ఈసీ తాకీదులకు సమాధానాలు ఇచ్చినా మళ్లీ నోటీసులు జారీచేశారని ఫిర్యాదు చేశారు. ద్వివేదిని కలిసిన అనంతరం ఎంవీఎస్ విలేకరులతో మాట్లాడుతూ.. డెప్యూటేషన్‌పై ఎన్నికల విధుల్లో ప్రభుత్వం నియమించిన టీడీపీ కోవర్టులే ఈసీని తప్పుదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల ప్రకటన వచ్చినప్పటి నుంచి నేటి వరకు టీడీపీ ఎన్నికల కోడ్ ఉల్లంఘనకు పాల్పడుతోందని విమర్శించారు. బాథ్యతాయుతమైన సీఎం పదవిలో ఉన్న చంద్రబాబు ఎన్నికల ప్రక్రియనే అవహేళన చేస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ కోడ్ ఉల్లంఘనపై ఎప్పటికప్పుడు సాక్ష్యాధారాలతో సహా ఈసీకి అందజేశామని తెలిపారు. ఫిర్యాదులని కూడా చంద్రబాబు లెక్కచేయకుండా నియంతలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తూ చంద్రబాబు ఎన్నికల సంఘానికే సవాల్ విసురుతున్నారని తీవ్రంగా దుయ్యబట్టారు. వైఎస్సార్సీపీకి ఈసీ ఇచ్చిన ప్రతి నోటీసుకి సమాధానం ఇచ్చామని తెలిపారు. టీడీపీ ఒక్క నోటీసుకి కూడా స్పందించలేదని వెల్లడించారు. మీడియా విషయంలోనూ సాక్షికి ఎక్కువ నోటీసులు ఇచ్చారని, టీడీపీ అనుకూల మీడియాకు తక్కువ నోటీసులు ఇచ్చారని పేర్కొన్నారు. చంద్రబాబు ఈసీని బెదిరించి అనుకూలంగా పనిచేయించుకుంటున్నాడని చెప్పారు. ఎవరెవరికి ఎన్ని నోటీసులు ఇచ్చారు.. ఎవరెవరు సమాధానాలిచ్చారు అన్న విషయం ఈసీ స్పష్టంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. -
‘ఆర్వోలను బాధ్యుల్ని చేయవద్దు’
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రధానాధికారి గోపాల కృష్ణ ద్వివేదిని ఏపీ డిప్యూటీ కలెక్టర్ అసోసియేషన్ సభ్యులు గురువారం కలిశారు. ఎన్నికల నిర్వహణలో ఆర్వోలను బాధ్యులను చేస్తూ నిర్ణయాలు తీసుకోవద్దని సీఈఓని సభ్యులు కోరారు. ద్వివేదిని కలిసిన అనంతరం కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ పి.బాబూ రావు విలేకరులతో మాట్లాడారు. ఏపీలో ఓట్ల పోలింగ్ శాతం పెరగడానికి సీఈఓ ద్వివేదీ బాగా కృషి చేశారని కొనియాడారు. ఓట్లు మిస్ అయ్యాయని ఫిర్యాదులు లేవు..ఒత్తిడి ఉన్నా బాగా పని చేశామని తెలిపారు. ఎన్నికల సంఘం సూచనల మేరకు ఓటర్ల కోసం అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పారు. ర్పాట్లు సరిగా లేవని కొన్ని ఫిర్యాదులు వచ్చిన మాట వాస్తవమేనన్నారు. క్షేత్రస్థాయిలో చిన్న చిన్న ఇబ్బందులు వచ్చిన మాట నిజమేనన్నారు. కింద స్థాయి సిబ్బందిలో కొందరికి ఎన్నికల నిర్వహణా అనుభవం లేకపోవడం వల్ల కొన్ని పొరపాట్లు జరిగాయన్నారు. ఉద్దేశపూర్వకంగా ఎవరూ తప్పుచేయలేదని, వాటికి ఆర్వోలను బాధ్యులు చేస్తూ చర్యలు తీసుకోవద్దని ద్వివేదీని కోరామని తెలిపారు. విచారణ చేసి ఎవరు పొరపాటు చేశారో వారిపైనే చర్యలు తీసుకోవాలని ద్వివేదిని కోరినట్లు వెల్లడించారు. ద్వివేదీని కలసిన నూజివీడు రైతులు వైఎస్సార్సీపీ రైతు విభాగం అధ్యక్షులు ఎంవీఎస్ నాగిరెడ్డి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రధానాధికారి ద్వివేదీని నూజివీడు రైతులు కలిశారు. సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఇవ్వకుండా టీడీపీ నేతలు ఇబ్బంది పెడుతున్నారని ఫిర్యాదు చేశారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చాక చెక్కుల పంపిణీ అధికారులు మాత్రమే చేయాలి..కానీ టీడీపీకి ఓటు వేస్తేనే చెక్కులు ఇస్తామని నిలిపివేశారని ద్వివేదీకి నాగిరెడ్డి వివరించారు. ఎన్నికలు పూర్తయిన తర్వాత కూడా చెక్కులు ఇవ్వకుండా టీడీపీ నాయకులు ఇబ్బంది పెడుతున్నారని ద్వివేదీకి ఫిర్యాదు చేశారు. -
అక్కడ రీపోలింగ్ జరిపించండి: ఎంవీఎస్
అమరావతి: టీడీపీ అరాచకాలకు పాల్పడిన చోట రీపొలింగ్ నిర్వహించాలని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి, రైతు విభాగం అధ్యక్షులు ఎంవీఎస్ నాగిరెడ్డి, రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేదీని కలిసి విజ్ఞప్తి చేశారు. అనంతరం ఎంవీఎస్ విలేకరులతో మాట్లాడుతూ.. చంద్రబాబు తీరు చూస్తుంటే ఆడలేక మద్దెల మీద పడినట్లు ఉందని ఎద్దేవా చేశారు. పోలింగ్ సరళి చూసి బెంబేలెత్తిన చంద్రబాబు టీడీపీ ఓటమికి ఎన్నికల సంఘమే కారణమని చెప్పే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల విధుల్లో పాల్గొని పోలింగ్ నిర్వహించింది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులే కదా అని సూటిగా బాబును అడిగారు. రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికలు నిర్వహించింది చంద్రబాబు ప్రభుత్వంలో నియమించిన అధికారులు కాదా అని ప్రశ్నించారు. ఎన్నికల సంఘాన్ని నిష్పక్షపాతంగా విధులు నిర్వహించమని కోరినట్లు తెలిపారు. తాము ఇచ్చిన ఫిర్యాదుల్లో 5శాతం వాటిపై కూడా ఈసీ చర్యలు తీసుకోలేదని చెప్పారు. చంద్రబాబు పాచికలు పారకపోవడంతో పోలింగ్ రోజు హింసాత్మక ఘటనలతో ఓటింగ్ శాతం తగ్గించే కుట్ర చేశారని ఆరోపించారు. టీడీపీ రిగ్గింగ్‌కు పాల్పడిన చోట రీపోలింగ్ నిర్వహించాలని సీఈఓని కోరామని చెప్పారు. -
సీఈఓకు వైఎస్సార్ సీపీ నేతల ఫిర్యాదు
సాక్షి, అమరావతి : ఈవీఎంలు పనిచేయడం లేదంటూ పుకార్లు పుట్టిస్తున్నారని.. ఈ విషయమై తక్షణమే చర్యలు తీసుకోవాలని వైఎస్సార్ సీపీ నేతలు వాసిరెడ్డి పద్మ, ఎంవీఎస్ నాగిరెడ్డి ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేదికి విఙ్ఞప్తి చేశారు. గురువారం ఆయనను కలిసి ఎన్నికల నిర్వహణతో పాటు పలు అంశాలపై ద్వివేదికి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా చాలా నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతున్న చోట డబ్బులు పంపిణీ చేస్తున్నారని ద్వివేది దృష్టికి తీసుకువెళ్లారు. ఈవీఎంల విషయంలో దుష్ప్రచారం చేస్తున్నారని, ఎన్నికల కమిషన్ వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం వాసిరెడ్డి పద్మ మాట్లాడుతూ.. ఈవీఎంలు పని చేయడం లేదని టీడీపీ నేతలు పుకార్లు పుట్టిస్తున్నారని ఆరోపించారు. సాంకేతిక సమస్యతో పాటు కొన్ని ఇబ్బందులు ఉన్నాయని ఎలక్షన్ కమిషన్ అధికారికంగా చెప్పినా.. ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఈవీఎంలను సాకుగా చూపి పోలింగ్ జరగకుండా చేయడంతో పాటు దాడులతో ప్రజలను భయపెట్టాలని చూస్తున్నారన్నారు. ఎన్నికల సంఘమే స్వయంగా చెప్పినా తీరు మార్చుకోని టీడీపీ నేతలు ప్రజల్లో గందరగోళం సృష్టించాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
ప్రజల్లో సానుభూతి కోసమే నిరసన దీక్ష
-
‘చంద్రబాబుకు ఓటమి భయం పట్టుకుంది’
సాక్షి, విజయవాడ : ఎన్నికలకు ముందు ప్లాన్ చేసుకుని అధికారులను బదిలీ చేశారని, ఇప్పుడు అలాంటి అధికారులపై ఈసీ చర్య తీసుకోవడంతో చంద్రబాబు ప్లాన్ బెడిసికొడుతుందని అందుకే ఆయన భయపడుతున్నారని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎమ్వీఎస్ నాగిరెడ్డి విమర్శించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తాను నియమించిన ఏజంట్లు బదిలీ కావటంతో చంద్రబాబుకు ఓటమి భయం పట్టుకుందని అన్నారు. 40 ఏళ్ల అనుభవం ఉన్న చంద్రబాబు ఈసీ కార్యాలయం ఎదుట నిరసన తెలుపుతూ ప్రజలకు ఏం సంకేతం ఇస్తున్నారని నిలదీశారు. ప్రశాంతంగా జరిగే ఎన్నికల్లో గందరగోళం సృష్టించాలని చూస్తున్నారని ఆరోపించారు. వివేకానంద హత్య అంశంపై కోర్టు ప్రస్తావించవద్దన్నా చంద్రబాబు ప్రస్తావిస్తున్నారని దుయ్యబట్టారు. ఎన్నికల ఫలితాలపై చంద్రబాబుకు భయం పట్టుకుందని ప్రజల్లో సానుభూతి కోసమే నిరసన దీక్ష చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఎన్నికల ప్రచార సమయం ముగిశాక ముఖ్యమంత్రి లెటర్ ప్యాడ్ మీద ప్రజలను ఓట్లు అర్థిస్తూ.. అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని అన్నారు. ఐదేళ్లు తమతో పని చేసిన అధికారులను నియమిస్తే ఉలుకుపాటు ఎందుకని ప్రశ్నించారు. చంద్రబాబు పాలనపై ఆయనకు నమ్మకం లేదా అని దుయ్యబట్టారు. -
చంద్రబాబు ‘ఆఖరి కుట్రల’ను అడ్డుకోవాలి!
సాక్షి, విజయవాడ: మరికొన్ని గంటల్లో రాష్ట్రంలో పోలింగ్ జరగనున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆఖరి ప్రయత్నంగా.. మరిన్ని కుట్రలకు పాల్పడే అవకాశముందని, ఈ కుట్రలను అడ్డుకోవాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేదికి విజ్ఞప్తి చేసింది. ఎన్నికల కమిషన్ నిర్ణయాలకు వ్యతిరేకంగా, ప్రభుత్వ అనుకూల అధికారుల బదిలీపై స్వయంగా సీఎం చంద్రబాబే నిరసనకు దిగి.. రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టి.. ప్రశాంతతను చెడగొట్టేందుకు, ఓటరు స్వేచ్ఛగా తన ఓటు హక్కు వినియోగించుకునే వీలు లేకుండా చేసేందుకు కుట్రలు పన్నుతున్నట్టు మీడియాకు ఇచ్చిన లీకుల ద్వారా తమకు సమాచారం అందిందని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంవీఎస్ నాగిరెడ్డి.. ద్వివేదికి రాసిన లేఖలో తెలిపారు. ఈ కుట్రలను అడ్డుకొని ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని, ఓటరు స్వేచ్ఛగా, నిర్భయంగా ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా.. ఓటు హక్కు వినియోగించుకునేవిధంగా ఎన్నికల కమిషన్ తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు. -
ఈసీకి వైఎస్సార్సీపీ నేతల ఫిర్యాదు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రధాన ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేదిని వైఎస్సార్సీపీ నేతలు ఎంవీఎస్ నాగిరెడ్డి, గౌతం రెడ్డిలు మంగళవారం కలిశారు. టీడీపీ నేతలతో పాటు, వారి తాబేదారులుగా వ్యవహరిస్తోన్న పోలీసులు కోడ్ ఉల్లంగిస్తున్నారని ఫిర్యాదు చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఎన్నికల సభల్లో సీఎం చంద్రబాబు ఎన్నికల నిబంధనలకు నీళ్లొదిలి వ్యక్తిగత విమర్శలు చేశారని గౌతం రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో దిగజారుడు రాజకీయాలతో రాక్షసపాలన సాగిస్తున్నారని విమర్శించారు. యథారాజ తథాప్రజ అన్నచందంగా టీడీపీ ఎమ్మెల్యేలు చంద్రబాబు దారిలో నడుస్తున్నారని దుయ్యబట్టారు. కార్మిక, ఉద్యోగవర్గాలు వైఎస్సార్సీపీకి అండగా ఉన్నాయన్న కక్షతో ఓట్లు వేయకుండా అడ్డుకుంటున్నారని అన్నారు. చంద్రబాబుకు నూరు తప్పులు పూర్తయ్యాయని, మహాభారతంలో శిశుపాలుడికి శ్రీకృష్ణుడు వేసిన శిక్షనే ఎన్నికల సంగ్రామంలో ప్రజలు వేయబోతున్నారని వ్యాఖ్యానించారు. విశాఖపట్నంలో ఏసీపీ పదవిలో ఉన్న మంత్రి సోదరుడు కింజారపు ప్రభాకర్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, ఖాకీ యూనిఫాం వేసుకుని టీడీపీ కార్యకర్తలా పనిచేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో ఇలాగే మరో ఐదు మంది పోలీసు అధికారులు పక్షపాత ధోరణితో వైఎస్సార్సీపీ నేతలని, కార్యకర్తలని ఇబ్బంది పెడుతున్నారని చెప్పారు. -
‘విద్వేషాలు రెచ్చగెట్టేందుకు టీడీపీ ప్రయత్నం’
అమరావతి: ఓడిపోతామన్న భయంతో భావోద్వేగాలను , ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టి లబ్ధిపొందాలని టీడీపీ ప్రయత్నిస్తోందని వైఎస్సార్సీపీ నేతలు ఎంవీఎస్ నాగిరెడ్డి, గౌతమ్ రెడ్డిలు వ్యాఖ్యానించారు. ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేదీని ఆదివారం నాగిరెడ్డి, గౌతం రెడ్డిలు కలిశారు. తన వాయిస్ ఇమిటేట్ చేసి ప్రజలను తప్పుదారి పట్టించే కుట్ర పన్నారంటూ ఎంపీ విజయసాయి రెడ్డి తరపున సీఈఓకి వైఎస్సార్సీపీ నేతలు ఫిర్యాదు చేశారు. అనంతరం విలేకరులతో వైఎస్సార్సీపీ నేతలు మాట్లాడుతూ.. ఏబీఎన్‌లో వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయ రెడ్డి వాయిస్‌ను ఇమిటేట్ చేసిన టేప్ ప్రసారం చేశారని వెల్లడించారు. అది తన వాయిస్ కాదని విజయసాయి రెడ్డి స్పష్టం చేసినా ఏబీఎన్ అడ్డదారి తొక్కటం దారుణమన్నారు. మోసపూరిత విధానంతో ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు టీడీపీ జేబు మీడియా కుట్ర పన్నుతోందని ఆరోపించారు. మిమిక్రీ ఆర్టిస్టులతో వాయిస్ ఇమిటేట్ చేసి దుష్ప్రచారం చేస్తే ప్రజలు వినే పరిస్థితిలో లేరని అన్నారు. టీడీపీకి ప్రజాస్వామ్యమన్నా, ఎన్నికల ప్రక్రియ అన్నా గౌరవం లేదన్నారు. ఎన్నికల కమిషన్ వాట్సాప్ గ్రూప్‌ల్లోకి తెలుగు తమ్ముళ్లు చొరబడి లొల్లి చేస్లున్నారని విమర్శించారు. టీడీపీని గెలిపిస్తే పథకాల అమలు కోసం మళ్లీ వచ్చే ఎన్నికల వరకు ఆగాలన్న వాస్తవాన్ని ప్రజలు గుర్తించారని తెలిపారు. ఎన్నికలు వస్తే తప్ప చంద్రబాబుకు ఇచ్చిన హామీలు గుర్తుకు రావన్న విషయం అందరికీ అర్ధమైపోయిందని చెప్పారు. ఎన్నికుట్రలు చేసినా, కుతంత్రాలు పన్నినా జగన్ జనసునామీలో కొట్టుకుపోకతప్పదని వ్యాఖ్యానించారు. -
‘జనం గుండెల సవ్వడి జగన్’ పుస్తకావిష్కరణ
విజయవాడ: వైఎస్సార్సీపీ మేధావుల ఫోరం ఆధ్వర్యంలో ‘జనం గుండెల సవ్వడి జగన్’ పుస్తకాన్ని వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి ఎంవీఎస్ నాగిరెడ్డి పార్టీ కార్యాయలంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నాగిరెడ్డి మాట్లాడుతూ..కదలిక పత్రిక ఎడిటర్ ఇమామ్ రాసిన ‘జనం గుండెల సవ్వడి జగన్’ పుస్తకం ఆవిష్కరించడం సంతోషంగా ఉందన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాదయాత్రల్లో పాల్గొన్న వ్యక్తి ఇమామ్ అని, 99 ఆర్టికల్స్ కలిపి ఈ పుస్తకం రూపుదిద్దుకున్నదని తెలిపారు. జలయజ్ఞంతో ఉమ్మడి ఏపీలో కోటి ఎకరాలకు నీళ్లు అందిస్తానన్న ఏకైక సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని కొనియాడారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి గురించి ‘ జనం చెక్కిన మనిషి’ అనే పుస్తకం ఇదివరకే రాశారని, ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డిపై పుస్తకం రాశారని చెప్పారు. ఈ పుస్తకాన్ని వైఎస్ విజయమ్మకు అంకితం ఇస్తున్నట్లు తెలిపారు. అలాంటి తెగువ జగన్‌లో చూశా: ఇమామ్(కదలిక పత్రిక ఎడిటర్) ప్రజల కోసం, ప్రజా సమస్యలపై పోరాడిన నాయకులు వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని కదలిక పత్రిక ఎడిటర్ ఇమామ్ కొనియాడారు. అలాంటి తెగువ వైఎస్ జగన్, షర్మిలలో చూశానన్నారు. పార్టీ మేనిఫెస్టో విడుదల రోజే తాను రాసిన పుస్తకం ఆవిష్కరించడం అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. మండేలాలా గుండె ధైర్యం ఉన్న వ్యక్తి జగన్: ఆర్సీ రెడ్డి(రిటైర్డ్ తెలుగు ప్రొఫెసర్) కర్షకుల కోసం కష్టపడే నాగిరెడ్డి ఈ పుస్తకం ఆవిష్కరించడం సంతోషకరమైన విషయమని రిటైర్డ్ తెలుగు ప్రొఫెసర్ రామచంద్రారెడ్డి అన్నారు. సకల సౌకర్యాలు వదిలి తండ్రి బాటలో నడిచి పాదయాత్ర చేసిన వ్యక్తి వైఎస్ జగన్ అని కొనియాడారు. నెల్సన్ మండేలాకు ఉన్నంత గుండె ధైర్యం వైఎస్ జగన్‌కు ఉందన్నారు. చంద్రబాబు బూటకపు మాటలు ప్రజలు నమ్మే స్థితిలో ప్రజలు లేరని అన్నారు. -
టీడీపీపై ఈసీకి వైఎస్సార్సీపీ ఫిర్యాదు
సాక్షి, విజయవాడ: ఎన్నికలకు నాలుగు నెలల ముందు ప్రవేశ పెట్టిన పసుపు కుంకుమ, అన్నదాత సుఖీభవ పథకాలను ఓటర్లను ప్రలోభపరిచేవిధంగా టీడీపీ ప్రభుత్వం ప్రచారం చేసుకుంటోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గురువారం రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి ఫిర్యాదు చేసింది. ఇలా చేయడం ఎన్నికల ప్రవర్తనా నియమావళికి విరుద్ధమని ఈసీకి ఇచ్చిన ఫిర్యాదులో ఎంవీఎస్ నాగిరెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వ ధనం ద్వారా అమలు చేస్తున్న ఈ పథకాలతోపాటు నిరుద్యోగ భృతి కింద యువతకు డబ్బులు చెల్లించేందుకు చంద్రబాబు సర్కారు జీఓలు కూడా జారీచేసిందని తెలిపారు. ప్రస్తుతం అమలవుతోన్న ప్రభుత్వ పథకాలను ప్రకటనలు, వీడియోల ద్వారా ప్రచారం చేసుకోవడం ఎన్నికల నియమాలు ఉల్లంఘించడమేనని.. ఇది ఓటర్లను తప్పుదోవ పట్టించడమేనని వివరించారు. ఇదేవిధంగా తెలుగుదేశం పార్టీ హోర్డింగ్‌ల ద్వారా చేస్తున్న ప్రచారంలో కూడా ఎన్నికల సంఘం నియమ నిబంధనలను ఉల్లంఘించిందని మరో ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఐదు లక్షల రూపాయలు హోర్డింగ్‌ల కోసం ఖర్చు పెట్టవచ్చని అయితే ప్రతి జిల్లాలో టీడీపీ 600 హోర్డింగ్ లను ఏర్పాటుచేసి తద్వారా 66,60,000 వ్యయం చేసిందని వెల్లడించారు. ఆంధ్రజ్యోతి,ఈనాడు దినపత్రికలలో తెలుగుదేశం పార్టీకి మేలు చేసి ఓటర్లను తప్పుదారి పట్టించేవిధంగా పెయిడ్ ఆర్టికల్స్ వస్తున్నాయని ఆధారాలతో సహా ఫిర్యాదు చేశారు. ఎన్నికల నిభందనలకు విరుద్దంగా ఉన్న పెయిడ్ ఆర్టికల్స్‌పై చర్యలు తీసుకోవాలని ఈసీకి నాగిరెడ్డి విజ్ఞప్తి చేశారు. -
ఏబీ వెంకటేశ్వరరావుపై హైకోర్టులో పిటిషన్
సాక్షి, అమరావతి : ఏపీ ఇంటలెజిన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావును బదిలీ చేసినప్పటికీ అనధికారికంగా విధుల్లో కొనసాగుతున్నారని పేర్కొంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఎంవీఎస్ నాగిరెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఈమేరకు ఆయన ఏపీ హైకోర్టులో గురువారం పిటిషన్ దాఖలు చేశారు. కిందిస్థాయి ఉద్యోగులు ఏబీ వెంకటేశ్వరరావుకు నివేదికలు ఇస్తున్నారని ఆయన పిటిషన్లో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో వెంకటేశ్వరరావు ఇంటలెజిన్స్ విధుల్లో కలుగజేసుకోకుండా.. అదే విధంగా ఆయన ఇచ్చిన గత నివేదికలను పరిగణనలోకి తీసుకోకుండా చూడాలని న్యాయస్థానాన్ని కోరారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కేంద్ర, రాష్ట్ర హోం శాఖ కార్యదర్శులు, రాష్ట్ర ప్రభుత్వం, ఏబీ వెంకటేశ్వరరావును ఎంవీఎస్ నాగిరెడ్డి ప్రతివాదులుగా చేర్చారు. ఈ నేపథ్యంలో పిటిషన్ విచారణను సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు హైకోర్టు పేర్కొంది. కాగా ఏపీ ఇంటెలిజెన్స్ విభాగం చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావును తప్పించాలని కేంద్ర ఎన్నికల కమిషన్ (సీఈసీ) ఇచ్చిన ఆదేశాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తుంగలో తొక్కిన సంగతి తెలిసిందే. ఆయనను ఐబీ చీఫ్‌గా తప్పించి డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేస్తున్నట్లు గత మంగళవారం జీవో (నంబర్ 716) ఇచ్చిన ప్రభుత్వం.. మరునాడే ఆ జీవోను రద్దు చేసింది. ఈ మేరకు జీవో నంబరు 720 జారీ చేసింది. అదే విధంగా సీఈసీ నిర్ణయాన్ని సవాలు చేస్తూ ఏపీ ప్రభుత్వం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది కూడా . దీనిపై విచారణ జరిపిన హైకోర్టు... ఏపీలో అధికారుల బదిలీలకు సంబంధించి ఈసీ ఆదేశాల్లో జోక్యం చేసుకునేందుకు నిరాకరిస్తూ గత శుక్రవారం తీర్పును వెలువరించింది. అంతేకాకుండా ఈసీ ఆదేశాలను శిరసావహించాల్సిందేనని ప్రభుత్వానికి స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నాగిరెడ్డి గురువారం పిటిషన్ దాఖలు చేశారు. -
‘వైఎస్ ఉంటే పోలవరం పూర్తయ్యేది’
విజయవాడ: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవించి ఉంటే పోలవరం ఈపాటికి పూర్తయ్యి ఉండేదని వైఎస్సార్సీపీ రైతు విభాగం అధ్యక్షులు ఎంవీఎస్ నాగిరెడ్డి వ్యాఖ్యానించారు. విజయవాడలో నాగిరెడ్డి విలేకరులతో మాట్లాడుతూ.. చాలా వరకు పోలవరం పనులు వైఎస్ఆర్ హయాంలోనే పూర్తయ్యాయని, చంద్రబాబు చేతగాని తనం వల్లే పోలవరం ఆలస్యమవుతోందని విమర్శించారు. జాతీయ హోదాకు కావాల్సిన అన్ని అనుమతులు తీసుకువచ్చిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి చంద్రబాబులా డబ్బా ప్రచారం చేసుకోలేదనీ, చంద్రబాబు మాత్రం తానే పోలవరం నిర్మాతనని చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు. 12 లక్షల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పని ఇంకా పెండింగ్‌లో ఉందని వెల్లడించారు. 2018 నాటికి పోలవరం నుంచి గ్రావిటీ ద్వారా నీరు ఇవ్వకపోతే ఓట్లు అడగను అని గతంలో సీఎం చంద్రబాబు అన్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ విషయం మరిచిపోయి ఇరిగేషన్ మంత్రి మాట్లాడుతున్నారుని అన్నారు. ట్విన్ టన్నెల్స్ 25 శాతం పనులు పూర్తి కావాలని చెప్పారు. ఇవి పూర్తి కాకుండా కుడి కాలువకు గ్రావిటీ ద్వారా నీరు ఎలా ఇస్తారని చంద్రబాబును సూటిగా ప్రశ్నించారు. చంద్రబాబు సీఎంగా ఉంటే వచ్చే ఐదేళ్లకు కూడా పోలవరం పూర్తి కాదని వ్యాఖ్యానించారు. కనకదుర్గమ్మ ఫ్లైఓవర్‌ను పూర్తి చేయలేని చంద్రబాబు ఎలా పోలవరం పూర్తి చేస్తారని ప్రశ్నించారు. చంద్రబాబు హయంలోనే ఆల్మట్టి అక్రమ నిర్మాణం జరుగుతున్నా కుంభకర్ణుడిలా నిద్రపోయారని అన్నారు. వైఎస్సార్ సీఎం అయిన తర్వాత ఇరిగేషన్ ప్రాజెక్టులకు ఊపిరి పోశారని వ్యాఖ్యానించారు. ప్రజలు వచ్చే ఎన్నికల్లో వైఎస్ జగన్‌ను ఆశీర్వదించనున్నారని, వైఎస్ జగన్ అధికారంలోకి రాగానే యుద్ధ ప్రాతిపదికన పోలవరం పూర్తి చేస్తారని హామీ ఇచ్చారు. చంద్రబాబు వంచనలను ప్రజలు నమ్మె స్థితిలో లేరని స్పష్టం చేశారు. -
చంద్రబాబు చేతగాని తనం వల్లే పోలవరం ఆలస్యమవుతోంది
-
‘దొంగ లెటర్ హెడ్ పేరుతో దుష్ప్రచారం’
సాక్షి, విజయవాడ : ఎన్నికల్లో గెలవాలనే కుయుక్తులతో చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఎంవీఎస్ నాగిరెడ్డి అన్నారు. శుక్రవారమిక్కడ విలేకరులతో పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ.. తమ పార్టీ పేరుతో దొంగ లెటర్ హెడ్ సృష్టించి తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. దీంతో పాటుగా పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేరుతో డూప్లికేట్ ట్విటర్ అకౌంట్ సృష్టించి తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల్లో తమ పార్టీకి వస్తున్న జనాదరణ ఓర్వలేక అయోమయం సృష్టించేందుకు గుర్తులు మారినట్లుగా ప్రచారం చేస్తున్నారని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అదే విధంగా శ్రీకాకుళం జిల్లాలో టీడీపీ తరఫున ఏకంగా పోలీసులే డబ్బులు పంచుతూ దొరికిపోయారని.. దీంతో పోలీసు యూనిఫార్మ్‌పై ఉన్న గౌరవం పోయిందని నాగిరెడ్డి విమర్శించారు. అంతేకాకుండా బ్యాలెట్లన్నీ తమకే అప్పచెప్పాలని అంటున్నట్లు వార్తలు వస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయం గురించి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. ఏ వ్యవస్థ అయినా తన చెప్పు చేతల్లో నడవాలని చంద్రబాబు భావిస్తారని.. ఎన్నికల సంఘం అంటే కూడా ఆయనకు లెక్కేలేదని విమర్శించారు. అందుకే ఈసీ ఆదేశాలను బేఖాతరు చేశారని.. అయితే ఈ విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పు ఆయన ప్రభుత్వానికి చెంపపెట్టు అని పేర్కొన్నారు. ఇకనైనా చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని గౌరవించాలని హితవు పలికారు.(చదవండి : ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురు) -
‘ఐదేళ్ల పాలనలో మీరు చేసిందేమిటి’
సాక్షి, విజయవాడ : చంద్రబాబు నాయుడు ఈ ఐదేళ్లలో చేసిందేమిటని వైస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఎమ్వీఎస్ నాగిరెడ్డి ప్రశ్నించారు. చంద్రబాబు గత 9ఏళ్లలో ఏ రోజైనా ఇరిగేషన్ ప్రాజెక్ట్‌లపై దృష్టి పెట్టారా అని ధ్వజమెత్తారు. వైఎస్సార్ హయాంలో మొదలుపెట్టిన 54 ప్రాజెక్ట్స్‌లో ఎన్ని పూర్తి చేశారో చెప్పాలన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రాజెక్ట్‌లు పూర్తి చేస్తుంటే మీరు ఎందుకు మౌనంగా ఉన్నారంటూ చంద్రబాబును విమర్శించారు. ఈ ఐదేళ్లపాలనలో మీరుచేసిందేమిటని.. రాయలసీమలో ఒక్క ప్రాజెక్ట్ అయినా పూర్తి చేశారా అంటూ మండిపడ్డారు. రాయలసీమకు నీళ్లు ఇస్తున్నామంటూ హడావిడి చేస్తున్న బాబు.. అధికారికంగా ఎన్ని ఇచ్చారో చెప్పగలరా అంటూ సవాల్ విసిరారు. -
‘ఐదేళ్ల పాలనలో మీరు చేసిందేమిటి’
-
పవన్ కల్యాణ్‌పై ఎంవీఎస్ ఫిర్యాదు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రధానాధికారి గోపాల కృష్ణ ద్వివేదీని వైఎస్సార్సీపీ రైతు విభాగం అధ్యక్షులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంవీఎస్ నాగిరెడ్డి కలిశారు. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ కోడ్ ఉల్లంఘనకు పాల్పడుతున్నారంటూ పవన్ కల్యాణ్‌పై ఫిర్యాదు చేశారు. రెండు మూడు రోజులుగా నియమావళికి విరుద్ధమైన పదాలు వాడుతూ విద్వేషాలు రెచ్చగొడుతున్న పవన్ కల్యాణ్‌పై చర్యలు తీసుకోవాలని ఈసీకి విజ్ఞప్తి చేశారు. హెరిటేజ్ ఫార్మర్స్ వెల్ఫేర్ ట్రస్టు ముసుగులో రాష్ట్ర వ్యాప్తంగా డబ్బు పంపిణీ జరుగుతుందని చెప్పారు. ఆ విషయాన్ని కూడా ట్రస్ట్ అధికారిక ట్విట్టర్లో పోస్టు చేసిందని తెలిపారు. ఆ ఆధారాలను ఎంవీఎస్ నాగిరెడ్డి, ఎన్నికల ప్రధానాధికారికి సమర్పించారు. అలాగే వైఎస్సార్సీపీపై సోషల్ మీడియాలో చేస్తోన్న అసత్య ప్రచారాన్ని కూడా ఈసీ దృష్టికి తీసుకెళ్లినట్లు నాగిరెడ్డి తెలిపారు. -
‘ఇదంతా ప్రజలను వంచించడమే’
-
‘ఇదంతా ప్రజలను వంచించడమే’
విజయవాడ: గత కొంతకాలంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శంకుస్థాపనల పేరుతో చేస్తున్న హడావిడి అంతా ప్రజలను వంచించడానికేనని వైఎస్సార్సీపీ రైతు విభాగం అధ్యక్షుడు ఎంవీఎస్ నాగిరెడ్డి మండిపడ్డారు. గతంలో కూడా చంద్రబాబు ఇలాగే హడావిడి చేశారనే సంగతిని ఆయన గుర్తు చేశారు. వారంలో ఎన్నికల షెడ్యూల్ వస్తున్న కారణంగానే చంద్రబాబు తెగ హైరానా పడిపోతున్నారని విమర్శించారు. కర్నూల్ జిల్లాలో శంకుస్థాపన చేసిన నాలుగు ప్రాజెక్టులకు ఎలాంటి అనుమతులు లేవని ఈ సందర్భంగా నాగిరెడ్డి పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టులపై కర్ణాటక ప్రభుత్వం అభ్యంతరం పెడితే అవి ఆగిపోతాయన్నారు. ప్రజలనుఏ మభ్యపెట్టడానికే చంద్రబాబు హడావిడి చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో కరవు విలయతాండవం చేస్తుందని, రైతాంగం అంతా సంక్షోభంలో ఉందన్నారు. అన్నపూర్ణలాంటి రాష్ట్రం చంద్రబాబు పాలనలో దుర్భిక్షంగా మారిందన్నారు. ఇంతటి దుర్భిక పాలనా అంటూ నాగిరెడ్డి ప్రశ్నించారు. రాష్ట్ర చరిత్రలో ఇంతటి దుర్మార్గపు పాలన చూడలేన్నాడు. 2018 నాటికి పూర్తి చేస్తామన్న పోలవరం హామీ ఏమైంది.. ధరల స్థిరీకరణ నిధి ఏమైందని నిలదీశారు. చంద్రబాబు పాలనపై రైతులు అంతా ఒక్కసారి ఆలోచించుకోవాలని నాగిరెడ్డి విన్నవించారు.