ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యవసాయంపై తప్పుడు లెక్కలు చెబుతోందని వైఎస్సార్‌సీపీ రైతు విభాగం అధ్యక్షుడు ఎంవీఎస్ నాగిరెడ్డి విమర్శించారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... ఈ ఏడాది రాష్ట్రంలో 14 లక్షల హెక్టార్ల సాగుభూమి బీడుగా మారిందని తెలిపారు. సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పం కరువుతో అల్లాడుతోందని వెల్లడించారు.
రాష్ట్రం కరువు కోరల్లో చిక్కుపోయినా, సీఎం గొప్పలు చెబుతున్నారని దుయ్యబట్టారు. వ్యవసాయ అనుబంధ రంగాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పంటలకు మద్దతుధర రాక రైతులు రోడ్డున పడ్డారని తెలిపారు. చంద్రబాబుకు అసెంబ్లీ సీట్ల పెంపుపై ఉన్న శ్రద్ధ రైతులపై లేదని నాగిరెడ్డి మండిపడ్డారు
రాష్ట్రం కరువు కోరల్లో చిక్కుపోయింది
Published Wed, Jan 31 2018 2:12 PM | Last Updated on Fri, Mar 22 2024 11:06 AM
Advertisement