మీడియాతో మాట్లాడున్న నాగిరెడ్డి
సాక్షి, విజయవాడ: భారతదేశ రైతు బాంధవుడిగా పేరుగాంచిన మాజీ ప్రధాని చరణ్ సింగ్ పుట్టిన రోజు సందర్భంగా (ఆదివారం) వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర రైతు విభాగ అధ్యక్షడు ఎంవీఎస్ నాగిరెడ్డి దేశ, రాష్ట్ర ప్రజలకు అడ్వాన్స్‌గా జాతీయ రైతు దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. భారతదేశ రైతాంగానికి వ్యవసాయ రంగానికి, గ్రామీణ ప్రజానీకానికి చరణ్ సింగ్ చేసిన విశిష్ట సేవలను గురించి ఆయన మీడియాతో మాట్లాడుతూ... చరణ్ సింగ్ రైతు కుటుంబంలో జన్మించి స్వతహాగా రైతు అయి ఉండి రాజకీయాలలో అత్యున్నత శిఖరాలను అధిరోహించారని అన్నారు. ఎవ్వరీని మోసం చెయ్యని, మోసం చేసే ఆలోచన కూడా లేని వ్యక్తి ఒక్క రైతు మాత్రమేన్నారు.
మన రాష్ట్రంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం రాష్ట్రంలో సకాలంలో వర్షాలు, వాయువేగాలు, ఉష్ట్రోగతలు అనుకూలంగా ఉండి రాష్ట్రంలో వ్యవసాయ ఉత్పత్తుల దిగుబడి గణనీయంగా పెరిగాయని తెలిపారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో ప్రకృతి విధ్వంసకుడుగా చంద్రబాబు మారారు. చంద్రబాబు పాలనలో ప్రకృతి వికృత రూపం దాల్చి వ్యవసాయ ఉత్పత్తులు గణనీయంగా తగ్గిందని అన్నారు. రాబోయే వ్యవసాయ సీజన్ మొదలయ్యే నాటికి జూన్1 నాటికి రాష్ట్రంలో ప్రకృతి ప్రేమికుల ఉండే కొత్త ప్రభుత్వం అధికారంలోకి వస్తుందన్నారు. మళ్లీ 2019 డిసెంబర్ 23 తేదీన జాతీయ రైతు దినోత్సవం సంతోషంగా జరుపుకునేలా దీవించాలని ప్రకృతి పంచశక్తులను, భగవంతుడిని వేడుకున్నట్లు ఆయన చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment