‘చంద్రబాబు పాలనలో రైతులు ఎప్పుడూ సంతోషంగా లేరు’ | MVS Nagi Reddy Comments On Chandrababu | Sakshi
Sakshi News home page

‘చంద్రబాబు పాలనలో రైతులు ఎప్పుడూ సంతోషంగా లేరు’

Published Wed, Jan 11 2023 3:54 PM | Last Updated on Wed, Jan 11 2023 3:57 PM

MVS Nagi Reddy Comments On Chandrababu - Sakshi

సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు పాలనలో రైతులు ఎప్పుడూ సంతోషంగా లేరని వైఎస్సార్‌సీపీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఎంవీఎస్ నాగిరెడ్డి అన్నారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, చంద్రబాబు, కరువు కవల పిల్లలని ప్రజలు చెబుతారన్నారు. బాబు పాలనలో రాష్ట్రం నుంచి ఇతర ప్రాంతాలకు వలసలు వెళ్లేవారని, వైఎస్సార్‌ అధికారంలోకి వచ్చాక రైతులకు మంచి రోజులు వచ్చాయన్నారు. జగన్ పాలనలో కూడా అంతకుమించి గ్రామాలన్నీ పచ్చగా ఉన్నాయని నాగిరెడ్డి అన్నారు.

ఆహార ధాన్యాలు, పండ్లు ఉత్పత్తి భారీగా పెరిగింది జగన్ పాలనలోనే. భూగర్భ జలాలు సైతం అందుబాటులోకి వచ్చాయి. ప్రాజెక్టులన్నీ ప్రతి ఏటా నిండిపోయాయి. గేట్లు ఎత్తి నీటిని కిందకు వదిలిన పరిస్థితులు జగన్ పాలనలో ఉన్నాయి. చంద్రబాబు పాలనలో ఎప్పుడూ కరవు, కాటకాలే దర్శనమిచ్చాయి. చంద్రబాబు సీఎంగా ఉంటే ఆయన మనుషులు వేల కోట్లు సంపాదిస్తారు. జగన్ సీఎంగా ఉంటే అన్ని వర్గాలూ బాగుపడతాయని నాగిరెడ్డి అన్నారు.
చదవండి: చింతకాయల విజయ్‌కు షాకిచ్చిన చంద్రబాబు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement