చంద్రబాబు నాయుడు ఈ ఐదేళ్లలో చేసిందేమిటని వైస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఎమ్‌వీఎస్ నాగిరెడ్డి ప్రశ్నించారు. చంద్రబాబు గత 9ఏళ్లలో ఏ రోజైనా ఇరిగేషన్ ప్రాజెక్ట్‌లపై దృష్టి పెట్టారా అని ధ్వజమెత్తారు. వైఎస్సార్ హయాంలో మొదలుపెట్టిన 54 ప్రాజెక్ట్స్‌లో ఎన్ని పూర్తి చేశారో చెప్పాలన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రాజెక్ట్‌లు పూర్తి చేస్తుంటే మీరు ఎందుకు మౌనంగా ఉన్నారంటూ చంద్రబాబును విమర్శించారు.