హైదరాబాద్: ఆంధ్రప‍్రదేశ్ రాష్ట్రంలో వ్యవసాయ రంగం కుదేలు కావడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనుసరిస్తున్న విధానాలే కారణమని వైఎస్సార్‌సీపీ రైతు విభాగం అధ్యక్షుడు ఎంవీఎస్ నాగిరెడ్డి విమర్శించారు. ఏపీలో వ్యవసాయ రంగాన్ని వదిలేసిన రైతులు వలస బాట పడుతున్నారన్నారు. రుణమాఫీతో చంద్రబాబు రైతులను నిలువునా ముంచారని, బ్యాంకు నోటీసులతో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు. అసలు వర్షాలతో పంటలు దెబ్బతిన్న రైతులకు చంద‍్రబాబు ఏం సాయం చేశారో చెప్పాలని నాగిరెడ్డి డిమాండ్ చేశారు.
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్టం కరువుతో అల్లాడిపోతుందని, వంచనలతో చంద్రబాబు రాష్ట్రాన్ని పాలిస్తున్నారని ఆరోపించారు. రాయలసీమను కరువు జిల్లాలుగా ప్రకటించాలని అధికారులు చెబుతుంటే ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించారు. ఇక పోలవరం సందర్శన పేరిట వేల కోట్ల రూపాయలను చంద్రబాబు ఖర్చు చేస్తున్నారన్నారు. అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్ దుర్భిక్ష ఆంధ్రప్రదేశ్‌గా మారిపోయిందని, ఇప్పటికైనా అన్నం పెట్టే అన్నదాతను ఆదుకోవాలని నాగిరెడ్డి సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment