nagireddy
-
ఎన్కౌంటర్ చేస్తామని బెదిరించారు
కడప అర్బన్: తాము చెప్పినట్టు వినకపోతే ఎన్కౌంటర్ చేస్తామని పోలీసులు బెదిరించారని సోషల్ మీడియా యాక్టివిస్ట్ వర్రా రవీంద్రారెడ్డి మేజిస్ట్రేట్ కు వాంగ్మూలం ఇచ్చారు. ఈ విషయాన్ని రవీంద్రారెడ్డి తరఫు న్యాయవాదులు నాగిరెడ్డి, ఓబులరెడ్డి మీడియాకు మంగళవారం తెలిపారు. న్యాయవాదులు తెలిపిన వివరాల ప్రకారం.. వర్రా రవీంద్రారెడ్డిని ఈ నెల 4న రాత్రి పోలీసులు కడప తాలూకా పోలీసుస్టేషన్‌కు తీసుకెళ్లి 41ఏ నోటీసు ఇచ్చారు. తరువాత తనతో వచి్చన న్యాయవాది హరినాథరెడ్డి, స్నేహితుడు మహేశ్వర్‌రెడ్డిని పోలీసులు ఇబ్బందులకు గురి చేశారు. ఈ నేపథ్యంలోనే వర్రా రవీంద్రారెడ్డి హైదరాబాద్ వెళ్లారు.కాగా.. ఈ కేసు విషయమై జిల్లా ఎస్పీని బదిలీ చేయడంతో పాటు, సీఐని సస్పెండ్ చేశారని తెలిసి అతడు స్వచ్ఛందంగా లొంగిపోయేందుకు స్నేహితులైన వెంకటసుబ్బారెడ్డి, ఉదయ్‌కుమార్‌రెడ్డితో కలిసి కారులో కడప వస్తుండగా.. ఈ నెల 8న కర్నూలు టోల్‌ప్లాజా వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తరువాత ఓ ఇంట్లోకి రవీంద్రారెడ్డిని తీసుకెళ్లి పోలీసులు విచారించారు. ఆ సమయంలో ఎన్కౌంటర్ చేసేందుకు వెనుకాడబోమని పోలీసులు అతడిని బెదిరించారు. తాము చెప్పినట్టుగా వాంగ్మూలం ఇవ్వకపోతే భార్యను, కుమార్తెను అథోగతి పాల్జేస్తామని రవీంద్రారెడ్డిని హెచ్చరించారు. ఎంపీ అవినాష్‌రెడ్డి, అతడి పీఏ రాఘవరెడ్డి ప్రోద్బలంతోనే వైఎస్ విజయమ్మ, వైఎస్ షరి్మల, వైఎస్ సునీతపై పోస్టింగ్‌లు చేశానని ఒప్పుకోవాలంటూ బలవంత పెట్టారు. తాము చెప్పినట్టు వినకపోతే ఎక్కువగా కేసులను పెట్టి జీవితాంతం జైలులో ఉండేలా చూస్తామని కూడా పోలీసులు హెచ్చరించారు. ఆ నేపథ్యంలోనే పోలీసులు థర్డ్ డిగ్రీని ప్రయోగించారు. థర్డ్ డిగ్రీ కారణంగా తన శరీరంపై అయిన గాయాలను మెజిస్ట్రేట్‌కు రవీంద్రారెడ్డి చూపించారు. ఆలస్యంగా వైద్య పరీక్షలు కాగా.. వర్రా రవీంద్రారెడ్డితో పాటు అరెస్టు చేసిన గుర్రంపాటి వెంకట సుబ్బారెడ్డి, గురజాల ఉదయ్‌కుమార్‌రెడ్డిని పోలీసులు సోమవారం రాత్రి 11 గంటల సమయంలో రిమ్స్‌కు వైద్య పరీక్షల కోసం తీసుకెళ్లారు. అనంతరం అర్ధరాత్రి 1:30 గంటల సమయంలో కడపలోని పులివెందుల కోర్టు ఇన్చార్జ్ మెజిస్ట్రేట్ ముందు హాజరు పరిచారు. మేజిస్ట్రేట్ వర్రా రవీంద్రారెడ్డికి 14 రోజుల రిమాండ్ విధించారు.మిగిలిన ఇద్దరు నిందితులకు 41ఏ నోటీసులు అందజేసి బెయిల్ ఇచ్చారు. ఈ క్రమంలోనే వర్రా రవీంద్రారెడ్డిని రిమాండ్ నిమిత్తం కడప కేంద్ర కారాగారంలోకి తీసుకెళ్లిన తరువాత రిమ్స్‌కు తీసుకెళ్లి వైద్య పరీక్షలు చేయించాలని మేజిస్ట్రేట్ ఆదేశించారు. దీంతో మంగళవారం తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో కడప కేంద్ర కారాగారానికి వర్రాను తరలించారు. కాగా అధికారులు మంగళవారం సాయంత్రం వరకు అతడిని వైద్య పరీక్షల కోసం తీసుకెళ్లకపోవడం గమనార్హం. వర్రా రవీంద్రారెడ్డి, సుబ్బారెడ్డి, ఉదయ్‌లను అరెస్ట్ చేశాంసాక్షి, అమరావతి: సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వర్రా రవీంద్రారెడ్డి, సుబ్బారెడ్డి, ఉదయ్ కుమార్‌రెడ్డిలను అరెస్ట్ చేసి సంబంధిత కోర్టు ముందు హాజరుపరిచామని పోలీసులు మంగళవారం హైకోర్టుకు నివేదించారు. ఈ ముగ్గురిలో రవీంద్రారెడ్డికి కోర్టు ఈ నెల 25 వరకు జ్యుడీషియల్ కస్టడీ విధించిందని తెలిపారు. మిగిలిన ఇద్దరి రిమాండ్‌ను కోర్టు తిరస్కరించిందన్నారు. ఈ వివరాలను హైకోర్టు రికార్డ్ చేసింది. ఇదిలావుంటే.. వర్రా రవీంద్రారెడ్డిని పోలీసులు విచారణ సందర్భంగా గాయపరిచిన విషయాన్ని ఆయన తరఫు న్యాయవాది వీఆర్ రెడ్డి కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై రాతపూర్వకంగా అఫిడవిట్ వేయాలని, దానిని పరిశీలించి తగిన ఆదేశాలు ఇస్తామని హైకోర్టు స్పష్టం చేసింది. అలాగే రవీంద్రారెడ్డి నిర్బంధానికి సంబంధించి పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 18కి వాయిదా వేసింది. వర్రా రవీంద్రారెడ్డి అక్రమ నిర్బంధంపై అతని భార్య కళ్యాణి, సుబ్బారెడ్డి, ఉదయభాస్కర్‌రెడ్డి నిర్బంధంపై వారి సంబంధీకులు హైకోర్టులో వేర్వేరుగా హెబియస్ కార్పస్ పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. -
త్వరలో రంగంలోకి ‘ఆపద మిత్ర’లు
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం తీసుకొ చ్చిన ఆపద మిత్ర పథ కంలో భాగంగా తెలంగాణ అగ్నిమా పకశాఖ ఆధ్వర్యంలోనూ ‘ఆపద మిత్ర’లకు శిక్షణ ఇస్తు న్నట్లు రాష్ట్ర విపత్తు నిర్వహణ, అగ్నిమాపక సేవల విభాగం డైరెక్టర్ జనరల్ (డీజీ) వై.నాగిరెడ్డి తెలిపారు. విపత్తుల వేళ సత్వర స్పందన కోసం స్థానికుల్లో కొందరిని వలంటీర్లుగా గుర్తించి వారికి ‘ఆపద మిత్ర’లుగా శిక్షణ అందిస్తున్నట్లు చెప్పారు. తొలి విడతలో భాగంగా ప్రస్తుతం వరంగల్‌లో 95 మంది వలంటీర్లకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నామని.. వారికి తరగతి గది శిక్షణ పూర్తయిందని పేర్కొన్నారు. త్వరలోనే వారికి క్షేత్రస్థాయి శిక్షణ ప్రారంభిస్తామన్నారు. అగ్నిప్రమాదాలు సంభవించినప్పుడు తక్షణమే ఎలా స్పందించాలి.. ఎలాంటి చర్యలు తీసుకోవాలి.. చుట్టుపక్కల వారిని ఎలా అప్రమత్తం చేయాలన్న అంశాలపై ‘ఆపద మిత్ర’లు శిక్షణ పొందుతారని తెలిపారు. ఫైర్ సిబ్బంది మంటలార్పే సమయంలో సహాయకులుగా వ్యవహరిస్తారని వివరించారు. సాధారణ సమయాల్లో అగ్నిప్రమాదాల నియంత్రణ, ప్రమాద సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై స్థానికంగా వారి పరిధిలో అవగాహన సైతం కల్పిస్తారన్నారు. మరోవైపు ఏప్రిల్ 14 నుంచి 20 వరకు రాష్ట్రవ్యాప్తంగా ఫైర్ సర్వీస్ వారంగా నిర్వహించనున్నట్లు నాగిరెడ్డి తెలిపారు. వారంపాటు నిర్వహించనున్న అవగాహన కార్యక్రమాల్లో భాగంగా బస్స్టేషన్లు, రైల్వే స్టేషన్లు, ఆసుపత్రులు, రెసిడెన్షియల్ కాంప్లెక్స్‌లు, మల్టీప్లెక్స్‌లు, మాల్స్‌లో అగ్నిప్రమాదాల నియంత్రణ, ప్రమాద సమయాల్లో ఎలా కాపాడుకోవాలన్న అంశాలపై ఫైర్ సిబ్బంది అవగాహన కల్పిస్తారని చెప్పారు. -
పోలవరం ఆలస్యానికి చంద్రబాబే కారణం: నాగిరెడ్డి
-
‘పోలవరం’ ఆలస్యానికి చంద్రబాబే కారణం!
డా.బీ.ఆర్ అంబేద్కర్ కోనసీమ: పోలవరం ప్రాజెక్టు డయాఫ్రం వాల్ నిర్మాణంలో చంద్రబాబు ప్రభుత్వం చేసిన తప్పుల కారణంగా ప్రాజెక్టు నిర్మాణం ఆలస్యమైందని రాష్ట్ర వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి అన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో గత ప్రభుత్వాల నుంచి ఇప్పటివరకూ జరిగిన విషయాలను తెలియజేస్తూ వైఎస్సార్ సీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి కొవ్వూరి త్రినాథ్‌రెడ్డి రూపొందించిన డాక్యుమెంటరీ సీడీలను రామచంద్రపురంలోని ప్రసన్న విఘ్నేశ్వర ఫంక్షన్ హాల్లో బుధవారం నాగిరెడ్డి, ఎంపీ బోస్ విడుదల చేశారు. ఈ సందర్భంగా నాగిరెడ్డి మాట్లాడుతూ పోలవరం రాష్ట్ర ప్రజల దశాబ్దాల కల అన్నారు. ఎంతో మంది ముఖ్యమంత్రుల తరువాత పోలవరాన్ని నిర్మించాలని తలచి రాష్ట్ర ప్రభుత్వ నిధులతోనే మొదలు పెట్టింది దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అని తెలిపారు. రాష్ట్ర విభజన అనంతరం చంద్రబాబు ప్రభుత్వంలో డయాఫ్రం వాల్‌ను ముందుగా మొదలు పెట్టి, దానికి కావాల్సి నిర్మాణాలు లేకుండానే పనులు చేయడం కారణంగానే డయాఫ్రం దెబ్బతిందని నాగిరెడ్డి స్పష్టం చేశారు. దీనివల్ల ప్రాజెక్టు నిర్మాణం ఆలస్యం అవుతుందనే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం కూడా తెలియజేసిందన్నారు. అయితే చంద్రబాబు మాత్రం తన ప్రభుత్వంలోనే డ్యామ్ మొత్తం పూర్తయ్యిందని ఎంతో ఆర్భాటంగా చెప్పుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఇప్పటి వరకూ అన్ని పనులను శరవేగంగా చేసుకుంటూ ప్రస్తుతం డ్యామ్‌ను పూర్తి చేశారన్నారు. ఈసీఆర్ఎం డ్యామ్ పూర్తయిన వెంటనే లెఫ్ట్, రైట్ కెనాల్స్‌కు నీటిని విడుదల చేసే అవకాశం ఉంటుందని వివరించారు. దివంగత రాజశేఖర్‌రెడ్డి మొదలు పెట్టిన పోలవరం ప్రాజెక్టును ఆయన తనయుడు జగన్మోహన్రెడ్డి పూర్తి చేసి గోదావరి పరివాహక ప్రాంత రైతులకు నీరు ఇవ్వబోతున్నారని స్పష్టం చేశారు. ఎంపీ బోస్ మాట్లాడుతూ గత టీడీపీ ప్రభుత్వమే 78 శాతం పనులను పూర్తి చేసిందని చంద్రబాబు చెప్పుకోవటం హాస్యాస్పదంగా ఉందన్నారు. అబద్ధాలతో ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారన్నారు. 2014లో టీడీపీ ప్రభుత్వం చేసిన తప్పుల కారణంగా నేడు పోలవరం ప్రాజెక్టు ఆలస్యమైందన్నారు. ఈ పనుల్లో కమీషన్లు పొందాలనే ఏకైక సంకల్పంతో చంద్రబాబు పని చేశారన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన మూడు అథారిటీల ద్వారా టీడీపీ హయాంలోనే ప్రాజెక్టు 78 శాతం పూర్తయ్యిందని చెప్పిస్తే, తామే ఒప్పుకుంటామని బోస్ అన్నారు. డాక్యుమెంటరీని తయారు చేసిన త్రినాథ్‌రెడ్డి మాట్లాడుతూ పోలవరం చరిత్ర, దాని నిర్మాణం ఎవరి హయాంలో ఏవిధంగా జరిగిందనే విషయాలను డాక్యుమెంటరీ ద్వారా తెలియజేశామన్నారు. వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి సత్తి వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇవి చదవండి: ఎన్నికలకు యంత్రాంగం సన్నద్ధం! -
తుఫాను నష్టం పై ఎల్లో మీడియా తప్పుడు కథనాలు
-
వైవీ సుబ్బారెడ్డితో ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి, దేవన్ రెడ్డి భేటీ
సాక్షి, విశాఖపట్నం: ఏపీలో కొన్ని నియోజకవర్గాల్లో మార్పులు, చేర్పులు చేస్తున్నామన్నారు వైఎస్సార్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి. ఏపీలో 175 స్థానాల్లో 175 వైఎస్సార్సీపీ గెలవాలన్నదే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి లక్ష్యమని తెలిపారు. కాగా, వైవీ సుబ్బారెడ్డి మంగళవారం విశాఖలో మాట్లాడుతూ.. గాజువాకలో సమన్వయకర్తను మార్పు చేయాలని పార్టీ నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని రెండు వారాల క్రితమే ఎమ్మెల్యే నాగిరెడ్డికి తెలియజేశాం. మాకు సీటు ఇచ్చినా, ఇవ్వకపోయినా ముఖ్యమంత్రిగా జగన్ కావాలని నాగిరెడ్డి, దేవన్ రెడ్డి చెప్పారు. మంచి అభ్యర్థికి సీటు ఇవ్వమని నాగిరెడ్డి సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్సీపీలో చాలా మార్పులు జరగనున్నాయి. నారా లోకేష్ పాదయాత్ర వల్ల టీడీపీకి ఎటువంటి ఉపయోగం లేదు అంటూ కామెంట్స్ చేశారు. అంతకుముందు.. వైవీ సుబ్బారెడ్డితో ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి, దేవన్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ సందర్బంగా తనపై జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని తిప్పల దేవన్‌రెడ్డి ఖండించారు. ఈ క్రమంలో దేవన్‌రెడ్డి మాట్లాడుతూ..‘పార్టీకి రాజీనామా చేస్తున్నానని వస్తున్న వార్తలు అవాస్తవం. అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా నేను కట్టుబడి ఉంటాను. నా తండ్రి ఎమ్మెల్యేగా ఉన్న పార్టీకి నేనెందుకు రాజీనామా చేస్తాను?’ అని అన్నారు. -
చంద్రబాబు ఏరోజైనా మేనిఫెస్టోను అమలు చేసారా ?
-
రాజ్యాంగం చదివిన నాయకులెందరు?
ప్రజల కోసం కాకుండా, పవర్ కోసమే పథకాలు పుట్టుకొస్తున్నాయనేది రాష్ట్ర ఎన్నికల మాజీ కమిషనర్, ఆర్థిక శాఖ మాజీ ముఖ్యకార్యదర్శి వి.నాగిరెడ్డి ఆవేదన. ఎన్నికల ప్రక్రియను ఐదేళ్ల కాంట్రాక్టుగానే పార్టీలు చూస్తున్నాయన్నది ఆయన మాటల్లోని అంతరార్థం. కార్పొరేట్ విధాన రాజకీయాలనే అన్ని పార్టీలూ అనుసరిస్తున్నాయన్నది ఆ పెద్దాయన నిశిత పరిశీలన. సీనియర్ ఐఏఎస్‌గా ఉమ్మడి రాష్ట్రంలో వివిధ హోదాల్లో పనిచేసిన నాగిరెడ్డి తెలంగాణలో ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శిగా..రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్‌గా కీలక బాధ్యతలు నిర్వర్తించారు. తాజా ఎన్నికల నేపథ్యంలో పార్టీలూ, వారిచ్చే జనాకర్షణ పథకాల హామీలు..మారుతున్న రాజకీయ ముఖచిత్రంపై ‘సాక్షి’తో నిర్మొహమాటంగా తన భావాలను పంచుకున్నారు. ఆయన మాటల్లోనే. పునాదుల్లేని పథకాలు తెలంగాణ ఏర్పడ్డ తర్వాత పొలిటికల్ తప్ప... ప్రొసీజర్ కన్పించడం లేదు. బ్యూరోక్రాట్స్ వాస్తవ పరిస్థితిని వివరించే అవకాశం ఉండటం లేదు. సంక్షేమ పథకాలకు పురిట్లోనే పునాది వేయాలి. మనకుండే అవకాశాలు, ప్రజల డిమాండ్, వనరులు... ఇవన్నీ పరిశీలించాకే పథకాన్ని అమలు చేయాలి. కానీ తెలంగాణ లో అలాంటి కసరత్తు లేదు. పాలించే నేత కలలో వచ్చిందే పథకమైతే... దానికి పునాదులెక్కడుంటాయి. అందుకే రాష్ట్రంలో ఏ పథకమైనా పూర్తిస్థాయిలో ముందుకెళ్లడం లేదు. ఇది ప్రజలకు నిరాశ కల్గించే అంశమే కాదు... రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపైనా ప్రభావం చూపుతుంది. స్థానిక సంస్థలకే బాధ్యతలిస్తే...? సంక్షేమ పథకాల అమలు, లబ్ధిదారుల ఎంపికలో స్థానిక సంస్థలను భాగస్వాములను చేయాలి. అప్పుడే మంచి ఫలితాలొస్తాయి. జవాబుదారీతనం పెరుగుతుంది. అధికారులకు ఈ బాధ్యత ఇవ్వడం వల్ల రకరకాల ఒత్తిడులు ఉంటాయి. స్థానిక గ్రామ సర్పంచ్ నేతృత్వంలో లబ్దిదారుల ఎంపిక జరిగితే... ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఇక పథకాల రూపకల్పన, వాటి విధివిధానాలు పల్లె ప్రజల మనోభావాల్లోంచి పుట్టుకురావాలి. దురదృష్టమేంటంటే ... మన నాయకులు ప్రజలకు దగ్గరగా ఉండటం లేదు. వారి అభిరుచి ఏంటో తెలుసుకోవడం లేదు. రైతుకు ఇస్తున్నదేంటి? ఓట్ల రాజకీయంలో రైతు పాత్ర ముఖ్యమైంది. అందుకే రైతుకు పోటీపడి పథకాలు ఇస్తామంటున్నాయి పార్టీలు. నిజాన్ని ఒక్కసారి పరిశీలించండి. మనం రైతుకు ఇస్తున్నదెంత? ఇచ్చేవన్నీ ఉచితాలేనా? కానేకాదు. రైతు ముక్కుపిండి పన్నులు వసూలు చేస్తు న్నాయి ప్రభుత్వాలు. కొన్నేళ్లు వెనక్కి వెళ్దాం. విత్తనం రైతే తన పంటలోది వాడేవాడు. పశు సంపద ద్వారా వచ్చే ఎరువే వాడుకునే వాడు. అరకతో దున్నేవాడు. పురుగుమందుల ముచ్చటే లేదు. ఇక రైతు ట్యాక్స్ చెల్లించాల్సిన పరిస్థితి ఎక్కడ? కానీ ఇప్పుడు విత్తనం. పురుగుమందు, ఎరువులు, ట్రాక్టర్లు అన్నీ మార్కెట్లో కొనాల్సిందే. ప్రతీ చోట రైతు ట్యాక్స్ కట్టాల్సిందే. అంటే ప్రభుత్వానికి చెల్లించే పన్నుల్లో రైతు వాటా సున్నా నుంచి ఎన్నో రెట్లు పెరిగింది? ఇంకా ఉచితాలు ఇచ్చామంటారేంటి? గిట్టుబాటు ధర ఇస్తే సరిపోతుంది. భూముల విలువలు పెరగడం అభివృద్ధా? గ్లోబలైజేషన్ తర్వాత భూమి కూడా ఓ పెట్టుబడి వస్తువైంది. ఇప్పుడు రియల్ ఎస్టేట్ రంగాన్ని కార్పొరేట్ శక్తులు ఎంచుకున్నాయి. అందుకే వాటి విలువ పెరిగింది. ఎకరం రూ. కోటికి అమ్ముడైన రైతు రూ. 50 లక్షలతో వేరొక చోట కొంటున్నాడు. అక్కడి రైతు వేరే చోటుకు ఇలా భూముల అమ్మకాలు సాగుతున్నాయి. అంతే తప్ప అభివృద్ధి వల్లే భూములు పెరిగాయని చెప్పలేం. పల్లెలెందుకు ఖాళీ అవుతున్నాయి? ప్రతీ పల్లెకూ రోడ్లున్నాయి. నీళ్లున్నాయి. కరెంట్ ఉంది. నెట్... డిష్ అన్నీ ఉన్నాయి. పట్టణాలకు సరిసమానంగానే ఉన్నాయి. కానీ పల్లె జనం పట్నం బాట పడుతున్నారు. చదువులు, ఉద్యోగాలు, వ్యాపారాలు అన్నీ పట్టణంతో ముడిపడి ఉన్నాయి. అందుకే అన్నీ ఉన్నా... జనం లేని పల్లెలను మనం చూస్తున్నాం. ఇలా అయితే, మన గ్రామీణ వ్యవస్థ ఏమవుతుంది? దీన్ని పార్టీలూ ఆలోచించాలి. రాజకీయమే తప్ప.. రాజ్యాంగం గురించి తెలుసా? ప్రపంచీకరణ ప్రభావం కావొచ్చు. రాజకీయాలు పూర్తిగా మారిపోయాయి. ఎంతమంది నాయకులు రాజ్యాంగం చదివారు? ఎంతమందికి చట్టాల గురించి తెలుసు? వారు చెప్పిందే చట్టం అనుకుంటున్నారు. ప్రజలకు ఇష్టమొచ్చినట్టుగా వాగ్దానాలిస్తున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తమకెందుకు అంటున్నారు. ఏదైనా పథకం తేవాలంటే అధికారులు అన్ని కోణాల్లో పరిశీలించేవారు. ఇప్పుడా పరిస్థితి లేదు. ఐదు గంటల్లో పథకం రూపురేఖలు వెల్లడించాలనే ఒత్తిడి తెస్తున్నారు. డాక్టర్ వైఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో మినహా... తెలంగాణలో ప్రభుత్వ పథకాలు ప్రకటించిన విధంగా అమలవ్వలేదు. ఉప ఎన్నికలొస్తే ఆ ప్రాంతానికి మాత్రమే హడావిడిగా లబ్దిదారులను ఎంపిక చేస్తారు. ఇంకేదైనా రాజకీయ అవసరం అనుకుంటే ముందుకెళ్తారు. ఇదెక్కడి గవర్నెన్స్. కార్పొరేట్ స్టైల్లో ఉందే! ఇదేం ఎన్నికల నిఘా! ఎన్నికల కోసం ఏర్పాటు చేసిన నిఘా వ్యవస్థ పనితీరు ఆశ్చర్యం కలిగిస్తోంది. రోజు రూ. లక్షల్లో నగదు, నగలు పట్టుకుంటున్నట్టు వార్తలొస్తున్నాయి. ఇదంతా ఎన్నికలకు తరలిస్తున్నదా? ఓ వ్యాపారి నగదు తీసుకెళ్తుంటే పట్టుకోవడం, సాధారణ పౌరుడి వద్ద డబ్బు దొరికిందని చెప్పడం విడ్డూరంగా ఉంది. వీళ్లకు ఎన్నికల్లో డబ్బు పంపిణీకి ఏమైనా సంబంధం ఉందా? ఈ నిఘా వ్యవస్థ ప్రజలను పీడించేలా ఉంది. నేను ఎన్నికల కమిషనర్‌గా ఉన్నప్పుడు దీన్ని ఎంతమాత్రం ఒప్పుకోలేదు. అనుమానం ఉంటే పేరు రాసుకుని అతనికి రాజకీయాలకు సంబంధం ఉందా? అనేది విచారణ చేయమన్నాం. ఇంతమందిని పట్టుకున్నారు సరే. ఇందులో ఏ ఒక్క రాజకీయ నాయకుడైనా ఉన్నాడా? అసలు పంచాల్సిన డబ్బు ఎప్పుడో పల్లెలకు చేరిందనేది నా అనుమానం. అక్కడ వెదకాల్సింది పోయి... అడుగడుగునా సాధారణ పౌరులకు ఇబ్బంది కలిగించడం మంచిది కాదు. - వనం దుర్గాప్రసాద్ -
రైతుల ఆత్మహత్యలపై స్పందన ఏదీ?
పంజగుట్ట: రాష్ట్రంలో సిరులు కురిపిస్తున్న సేద్యం అని బీఆర్ఎస్ ప్రభుత్వం డప్పులు కొట్టుకుంటోందని... అయితే రాష్ట్రం వచ్చిన 9 సంవత్సరాల్లో 7007 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్న విషయాన్ని మాత్రం చెప్పడం లేదని పలువురు వక్తలు ఆరోపించారు. సోషల్ డెమొక్రటిక్ ఫోరమ్ (ఎస్డీఎఫ్) ఆధ్వర్యంలో ఆదివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో “తెలంగాణలో వ్యవసాయం ఎట్లుండాలి?’ అనే అంశంపై రౌండ్‌టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ప్రొఫెసర్ పద్మజాషా అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎస్డీఎఫ్ కన్వీనర్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి నాగిరెడ్డి, కో కన్వినర్లు కన్నెగంటి రవి, పృధ్విరాజ్ యాదవ్, ప్రొఫెసర్ రమ హాజరయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణలో వ్యవసాయం ఎట్లుండాలి పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ పుస్తకాన్ని అన్ని పార్టీల అధ్యక్షులకు ఇచ్చి వారి మేనిఫెస్టోలో పెట్టాలని సూచించనున్నట్లు వారు తెలిపారు. అనంతరం ఆకునూరి మురళి మాట్లాడుతూ... రాష్ట్రంలో 59 లక్షల రైతులు కోటి 45 లక్షల భూమిని సాగుచేస్తున్నారన్నారు. వారికి 3.2 టన్నుల విత్తనాలు అవసరమున్నదని రాష్ట్ర ప్రభుత్వం విత్తన అభివృద్ధి సంస్థ పాత్ర రోజురోజుకూ తగ్గించడంతో నకిలీ విత్తనాలు అమ్మే మోసగాళ్లు పెరిగి పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విత్తనాలకు సంబంధించి సమగ్ర చట్టం విత్తన విధానం తీసుకురావాలని సూచించారు. రైతుల వ్యవహారాలకు సంబంధించి ఎప్పటికప్పుడూ నిర్ణయాలు తీసుకునేందుకు ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల్లో సహకరించేందుకు రాజ్యాంగ బద్ద సంస్థ ఒక వ్యవసాయ కమిషన్ ఏర్పాటు చేయాలని దానికి ప్రతి సంవత్సరం రూ. 100 కోట్ల బడ్జెట్ ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ కమిషన్ అన్ని రకాల పంటలకు గిట్టుబాటు ధర నిర్ణయించడం, విత్తనాలు సరఫరా, నాణ్యమైన విత్తనలు, జన్యుపరంగా మార్పు చేసి ఇవ్వాలన్నారు. క్రిమి సంహారక మందులు కూడా ఏ పంటకు ఏ మేర క్రిమిసంహారక మందులు వాడాలో సూచించాలన్నారు. రైతుబంధు పథకం చిన్న, సన్నకారు రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని, దీన్ని కొనసాగిస్తూనే పది ఎకరాలు పైబడి మాగాణి, వర్షాధార భూములు ఉన్న వారికి ఇవ్వరాదన్నారు. ఆదాయపు పన్ను కట్టే ఏ రైతుకుటుంబానికి, భూ యజమానులకు రైతుబందు ఇవ్వకూడదని, ఇతరదేశాల్లో స్థిరపడి ఉన్న భూ యజమానులకూ ఇవ్వరాదని సూచించారు. దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలతో పోలిస్తే ఎలాంటి పంటల బీమా లేని రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమని అన్నారు. ప్రతి సంవత్సరం కరువుతోనో, అధిక వర్షాలతోనో రైతులు నష్టపోతూనే ఉన్నారని ఏ ఒక్క రైతుకూడా నష్టపోకుండా పటిష్టమైన పంటల బీమా వర్తింపచేయాలన్నారు. రైతులు బాగుపడేందుకు ప్రభుత్వం రూ. 38500 కోట్లు అవసరం అవుతాయని ప్రతి సంవత్సరం అదనంగా రూ. 6400 కోట్లు కేటాయించాలని సూచించారు. సమావేశంలో రంజిత్ కుమార్, ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు. -
కనీస మద్దతు ధర తప్పనిసరి చేయాలి
సాక్షి, విశాఖపట్నం : రైతులు పండించిన పంటలకు కనీస మద్దతు ధర తప్పనిసరి చేయాలని దక్షిణాది రాష్ట్రాల రైతు ప్రతినిధులు, రైతులు, వ్యవసాయ రంగ నిపుణులు కోరారు. వ్యవసాయం లాభసాటి కావడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని.. సేద్యానికి ‘ఉపాధి’ పనులను అనుసంధానం చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. వ్యవసాయం గిట్టుబాటు కావడంలేదని, రైతాంగాన్ని ఆర్థికంగా నిలబెట్టే బాధ్యత కేంద్రానిదేనని వారు స్పష్టంచేశారు. 2024–25 మార్కెటింగ్ సీజన్లో రబీ పంటలకు ధరలు నిర్ణయించేందుకు.. వ్యవసాయ ఖర్చులు, ధరల కమిషన్ (సీఏసీపీ) దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ సమావేశం శుక్రవారం విశాఖపట్నంలోని జరిగింది. ఈ సమావేశానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ, కేంద్రపాలిత ప్రాంతాలైన అండమాన్ నికోబార్, పుదుచ్చేరి, లక్షద్వీప్‌ల నుంచి కూడా రైతులు, వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు నిపుణులు, శాస్త్రవేత్తలు హాజరయ్యారు. మద్దతు, గిట్టుబాటు ధరల మధ్య వ్యత్యాసాన్ని సరిచేయాలి : నాగిరెడ్డి ఏపీ వ్యవసాయ మిషన్ వైస్‌చైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి మాట్లాడుతూ.. వ్యవసాయాన్ని వృత్తిగా నమ్ముకున్న రైతులు పంటలకు గిట్టుబాటు ధరరాక నష్టాల పాలవుతున్నారని, ఉత్పత్తి వ్యయానికనుగుణంగా కనీస మద్దతు, గిట్టుబాటు ధరల మధ్య వ్యత్యాసాన్ని సరిచేసి తగిన ధర లభించేలా కేంద్రానికి సిఫార్సు చేయాలని కోరారు. కనీస మద్దతు ధరను తప్పనిసరి (మ్యాండేటరీ) చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో వ్యవసాయాన్ని లాభసాటిగా ఉన్న ఉద్యాన పంటల వైపు మళ్లించే ప్రయత్నం చేస్తున్నామన్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి రైతుల సంక్షేమం కోసం ఎన్నో చర్యలు తీసుకుంటూ దేశంలో నంబర్–1గా నిలిచారన్నారు. వ్యవసాయ శాఖ ప్రత్యేక కమిషనర్ సీహెచ్ హరికిరణ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఆర్బీకేల ద్వారా రైతులకు అనేకరకాల సేవలందిస్తున్నామని, పంట కాలానికి సాగుకు ఉపయోగపడేలా కేంద్ర సాయం రూ.6 వేలతో కలిపి ఏటా రూ.13,500 ఆర్థిక సాయం చేస్తున్నామని వివరించారు. ఇంకా పెట్టుబడి సాయం, రైతులకు బీమా, ఉచిత పంటల బీమా వర్తింపజేస్తున్నామని, ధరల స్థిరీకరణ నిధితో పాటు విపత్తుల వేళ ఆర్థిక భరోసా కల్పిస్తున్నామని తెలిపారు. రాయలసీమకు చెందిన రైతు వంగల సిద్ధారెడ్డి మాట్లాడుతూ.. ఎంఎస్పీని తప్పనిసరి చేయాలని చాన్నాళ్లుగా కోరుతున్నా కేంద్రం పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తంచేశారు. కొమ్ముశనగలను ప్రజాపంపిణీ వ్యవస్థలో చేర్చాలని కోరారు. కేంద్రానికి నివేదిస్తాం.. రైతులు, రైతు ప్రతినిధుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని కేంద్ర ప్రభుత్వానికి నివేదిస్తామని, పంటలకు తగిన మద్దతు ధర ఇవ్వాలని సిఫార్సు చేస్తామని సీఏసీపీ చైర్మన్ ప్రొఫెసర్ విజయపాల్‌శర్మ తెలిపారు. చిరుధాన్యాలు పండించే రైతుకు మంచి భవిష్యత్తు ఉందన్నారు. సాధారణ పంటలకు బదులు ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులు మళ్లేలా రాష్ట్ర ప్రభుత్వాలు కృషిచేయాలని ఆయన సూచించారు. రైతుల సంక్షేమానికి ఏపీ పెద్దపీట మరోవైపు.. ఏపీ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని తమిళనాడు రైతు పళని ప్రశంసించారు. తెలంగాణ ఉద్యానశాఖ డైరెక్టర్ ఎం.హనుమంతరావు మాట్లాడుతూ.. ఉపాధి హామీ పనులను వ్యవసాయానికి అనుసంధానం చేయడం ద్వారా కూలీల భారం తగ్గి రైతు నిలబడే వీలుంటుందన్నారు. -
ఏడాదిలో రూ.212 కోట్ల ఆస్తులు బుగ్గిపాలు
సాక్షి, హైదరాబాద్: ప్రమాదాల కారణంగా 2022లో రాష్ట్రవ్యాప్తంగా రూ.212.36 కోట్ల విలువైన ఆస్తులు అగ్నికి ఆహుతైనట్టు అగ్నిమాపకశాఖ డీజీ నాగిరెడ్డి తెలిపారు. అదే ఏడాదిలో జరిగిన ప్రమాదాల్లో 45 మంది ప్రాణాలు కోల్పోయినట్టు వెల్లడించారు. 2021, 2022లో రాష్ట్రవ్యాప్తంగా నమోదైన అగ్నిప్రమాదాలు, జరిగిన ప్రాణ, ఆస్తి నష్టం.. ఫైర్ సిబ్బంది కాపాడిన క్షతగాత్రులు, ఆస్తుల వివరాలను బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈనెల 14న ఫైర్ సర్వీసెస్ డేను పురస్కరించుకుని వారం రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా పలు కార్యక్రమాలు చేపట్టనున్నట్టు తెలిపారు. ఈనెల 14 నుంచి 20 వరకు జరిగే కార్యక్రమాల్లో అగ్నిప్రమాదాల నుంచి బయటపడటమెలా అనే విషయమై అవగాహన కల్పించనున్నట్లు నాగిరెడ్డి తెలిపారు. -
'పాతాళభైరవి, మాయాబజార్ లాంటి ఆణిముత్యాలు అందించిన ఘనత ఆయనదే'
భారతీయ చలన చిత్రసీమలో బొమ్మిరెడ్డి నాగిరెడ్డి (బి. నాగిరెడ్డి)ది చెరిగిపోని చరిత్ర. ‘పాతాళభైరవి, మిస్సమ్మ, మాయాబజార్’ వంటి అద్భుత చిత్రాలను నిర్మించిన ఘనత నాగిరెడ్డిది. కళాసేవే కాదు ఆయన ఎందరికో విద్య, వైద్య సేవలు ఉచితంగా అందించారు. సాధారణ రైతు కుటుంబంలో పుట్టి, వ్యాపారవేత్తగా రాణించి, ప్రముఖ నిర్మాతగా, స్టూడియో ఆధిపతిగా అసాధారణ సేవలు అందించిన మానవతావాది. ‘చందమామ’ పత్రికను అసంఖ్యాక భాషల్లో ముద్రించి అటు బాలలకు ఇటు పెద్దలకు కూడా నీతి బోధలు చేసిన ముందు చూపుగల మహా మనిషి. వినోద విజ్ఞానాల కృషీవలుడు, విజయాదిత్యుడు,చందమామ పత్రిక, అద్భుత దృశ్యకావ్యం, మాయాబజార్ల సృష్టికర్త బి.నాగిరెడ్డి వర్థంతి(ఫిబ్రవరి 25) సందర్భంగా ఒకసారి గుర్తుకు తెచ్చుకుందాం. ► నాగిరెడ్డి కడప జిల్లా పులివెందుల నియోజకవర్గం, సింహాద్రిపురం మండలం, ఎద్దులయ్యగారి కొత్తపల్లె (వై.కొత్తపల్లె) గ్రామంలో 1912, డిసెంబర్ 2న రైతు కుటుంబంలో బొమ్మిరెడ్డి నరసింహారెడ్డి, ఎరుకలమ్మ అనే దంపతులకు జన్మించారు. నాగిరెడ్డికి ప్రముఖ దర్శకుడు, పద్మభూషణ్ బీఎన్ రెడ్డి స్వయానా అన్న. ► ఎద్దులయ్యగారి కొత్తపల్లె గ్రామంలోని వీధిబడిలో రామాయణ మహాభారతాలు, భాగవతం లాంటి పురాణగ్రంథాలను మాత్రమే బోధించేవారు. ధర్మబద్ధమైన జీవితం ఎలా గడపాలో ఉపాధ్యాయుడు పిల్లలకు రోజూ చెప్పేవాడు. ప్రాచీన గ్రంథాల్లోని సూక్తులను, సుభాషితాలను పిల్లలచేత కంఠస్థం చేయించేవాడు. ఆ ఉపాధ్యాయుడి వద్ద చదువుకున్న నాగిరెడ్డి పన్నేండేళ్లు వచ్చేసరికే పురాణేతిహాసాలను ఔపోసన పట్టేశారు. అవన్నీ ఆయన ఆలోచనావిధానాన్ని ఎంతగానో ప్రభావితం చేశాయి. ►నిజంగానే తెలుగువారికి తమ సినిమాలతో పున్నమి చంద్రుని వెన్నెల చల్లదనం అందించిన ఘనులు నాగిరెడ్డి- చక్రపాణి. వారిద్దరు వ్యక్తులైనా ఏకప్రాణంగా సాగారు. వారి సినిమాలు కూడా తెలుగువారితో విడదీయరాని బంధం ఉంది. తొలి చిత్రం 'షావుకారు' నుంచి చివరి చిత్రం 'శ్రీరాజేశ్వరి విలాస్ కాఫీక్లబ్' దాకా విలువలకు పెద్ద పీట వేస్తూ సాగారు నాగిరెడ్డి- చక్రపాణి. చక్కన్నది ఆలోచనయితే, నాగిరెడ్డిది ఆచరణగా ఉండేది.. అందుకే విజయావారి చిత్రాల్లో వారిద్దరి అభిరుచి తొణికిసలాడేది. ► 1947లో భారతీయ పత్రికా ప్రపంచంలోనే సంచలనం సృష్టించిన పిల్లల మాసపత్రిక చందమామ ప్రారంభించారు. చందమామను చదవని తెలుగువారుండరు. తెలుగులోనే కాకుండా భారతదేశంలో మరో 12 భాషలకు చందమామ విస్తరించింది. నాగిరెడ్డి గారిని చందమామ రెడ్డి అని పిలిచేవారు. మహిళల కోసం ‘వనిత’ మాసపత్రికను, సినిమాల కోసం ‘విజయచిత్ర’ పత్రికను నడిపారు. ఆసియాలోనే అతి పెద్ద స్టూడియో: 1949-50 ప్రాంతంలో మద్రాసులోని వాహినీ స్డూడియోను కొని విజయా-వాహినీ స్టూడియోగా పేరు మార్చి అత్యంత సుందరంగా తీర్చిదిద్దారు. ఆసియాలోనే అతి పెద్ద స్టూడియో 1970 ప్రాంతంలో స్టూడియోను మూసివేసి విజయా మెడికల్ అండ్ ఎడ్యుకేషన్ ట్రస్టు ఏర్పాటు చేసి తద్వారా విజయా ఆసుపత్రి, విజయా హెల్త్‌కేర్ సెంటర్, విజయా హెల్త్ ఫౌండేషన్ ఏర్పాటు చేశారు. 1950లో విజయా ప్రొడక్షన్స్ పేరుతో చిత్ర నిర్మాణ సంస్థను ప్రారంభించారు. అర్జునుడి రథం మీద రెపరెపలాడే పతాకమే విజయా సంస్థ చిహ్నం. నాగిరెడ్డి పెద్దకూతురి పేరు జయలక్ష్మి. తనంటే ఇంట్లో అందరికీ ప్రాణం.తను పుట్టాకే ఇంట్లో బావిలో తియ్యటి నీళ్లు పడ్డాయి. అప్పటినుంచీ జయ అంటే ఓ సెంటిమెంటు. ఆమె పేరు కలిసొచ్చేలా ‘విజయా ప్రొడక్షన్స్’ అని పెట్టారు. ఈ సంస్థ ద్వారా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో దాదాపు 50 సినిమాలు నిర్మించారు. వీరి తొలిచిత్రం ‘షావుకారు’ తెలుగు సినీ చరిత్రలో ఆణిముత్యాల్లాంటి చలనచిత్రాలను నిర్మించారు. పాతాళభైరవి, మాయాబజార్, మిస్సమ్మ, జగదేకవీరుని కథ, గుండమ్మ కథ లాంటి బాక్సాఫీస్ హిట్ చిత్రాలను నిర్మించారు. ఎన్టీఆర్‌ను, ఎస్వీ రంగారావును, సూర్యకాంతాన్ని, సావిత్రిని, ఓ పద్మనాభాన్ని తెలుగు సినీ రంగానికి అందించింది నాగిరెడ్డి. 1951లో నిర్మించిన పాతాళభైరవి సినిమా జానపద చిత్రాలకు ఓ నిఘంటువు. ‘సాహసం చేయరా డింభకా’ అంటూ నటనలో, నడకలో, వాచకంలో ఎస్వీ రంగారావు కొత్త ఒరవడిని సృష్టించారు. ‘మోసం గురూ’ అంటూ డింగరీ పాత్రలో పద్మనాభం కనిపిస్తాడు. తెలుగుజాతి మరచిపోలేని ‘మాయాబజార్’ 1957లో నిర్మించబడిన మాయాబజార్ సినిమా తెలుగుజాతి మరచిపోలేని మధురమైన అద్భుత దృశ్యకావ్యం. సినిమా పరిశ్రమకు పెద్ద బాలశిక్ష. మాయాబజార్' స్థాయికి - సాంకేతిక నైపుణ్యంలో గానీ, నటనలోగానీ - ఏదీ సరితూగలేదన్నది జగద్విదితం. అందుకు ప్రధాన కారకులు - దర్శకులు కేవీ రెడ్డి, రచయిత పింగళి నాగేంద్రరావు. 'మాయాబజార్' విడుదలై ఇప్పటికీ 60 సంవత్సరాలు దాటుతున్నా అంతే ఆదరణ పొందుతున్న చిత్రం ఇదే. పలు పదవులు చేపట్టిన నాగిరెడ్డి 1980 నుంచి 1983 వరకు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్‌గా ఉన్నారు. వీరి హయాంలోనే తిరుమలలో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నిర్మించబడింది. ఆలిండియా ఫిల్మ్ సమ్మేళన్‌కు రెండు సార్లు అధ్యక్షులు. సౌత్ ఇండియన్ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్‌కు నాలుగు సార్లు అధ్యక్షులు. సాధించిన అవార్డులు: 1987లో నాగిరెడ్డి ప్రతిష్టాత్మకమైన దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును పొందారు. హిందీ చలనచిత్ర సీమలో, అక్కాచెల్లెళ్లు అయిన లతా మంగేష్కర్, ఆశాబౌంస్లే ఈ అవార్డును పొందగా.. తెలుగు సినిమా రంగంలో అన్నదమ్ములైన బీఎన్ రెడ్డి, బి నాగిరెడ్డి ఈ అవార్డును పొందడం గమనార్హం. 1957లో మాయాబజార్, 1962లో గుండమ్మ కథకు ఫిల్మ్ ఫేర్ అవార్డులు పొందారు. 1987లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రఘుపతి వెంకయ్య అవార్డు ప్రదానం చేసింది. శ్రీకృష్ణదేవరాయ, శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయాలు గౌరవ డాక్టరేట్లు ప్రదానం చేశాయి. తమిళనాడులో ‘తలైమామణి’ బిరుదుతో సత్కరించారు. 1965లో కన్నడలో తీసిన ‘మదువెమదినోడు’ సినిమాకు జాతీయ ఫీచర్ ఫిల్మ్ అవార్డు వచ్చింది. పలు భాషల్లో చిత్రాలు: విజయా సంస్థ తమిళంలో పాతాళభైరవి, కళ్యాణం పన్ని పార్ (పెళ్లి చేసి చూడు), చంద్రహారం, మిస్సియమ్మ (మిస్సమ్మ), మాయాబజార్, గుండమ్మ కథ, ఎంగవీట్టు పిళ్లై (రాముడు-భీముడు), హిందీలో పాతాళభైరవి, మిస్ మేరీ (మిస్సమ్మ), రాం ఔర్ శ్యాం (రాముడు-భీముడు), జూలీ; కన్నడ, సింహళీ భాషల్లో కూడా కొన్ని సినిమాలు తీశారు. నాగిరెడ్డి తమిళంలో గుండమ్మ కథ, ఎంగ వీట్టు పిళ్లై సినిమాలకు దర్శకత్వం వహించాడు. ఎంజీఆర్‌తో ప్రత్యేక అనుబంధం: ఎంజీరామచంద్రన్తో నాగిరెడ్డికి ఉన్న ప్రత్యేక అనుబంధం గొప్పది. ఒకసారి నాగిరెడ్డికి జబ్బుచేసి ఆసుపత్రిలో వుంటే ఎంజీఆర్ (అప్పుడు ముఖ్యమంత్రిగా వున్నారు) స్వయంగా వచ్చి పరామర్శించడమే కాకుండా ఫారిన్ మందులు తెప్పిస్తానని చెప్పారు. ఎంజీఆర్ సూచన మేరకే నాగిరెడ్డి విజయా ఆసుపత్రి నిర్మించి దాని పరిపాలనా బాధ్యతల కోసం ఒక ట్రస్టు స్థాపించి దానికి అప్పగించారు. ఫిలిం ఫెడరేషన్ అధ్యక్షునిగా నాగిరెడ్డి నాలుగు సార్లు బాధ్యతలను నిర్వహించారు. ఇందిరా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి, మొరార్జీ దేశాయి, రాజాజీ, కామరాజ నాడార్, నీలం సంజీవరెడ్డి మొదలైన ప్రజానాయకులతో సన్నిహిత సంబంధాలను నెరిపారు. నాగిరెడ్డి అనారోగ్యంతో తన 92వ ఏట 25 ఫిబ్రవరి 2004న మద్రాసులో మరణించారు. -
చంద్రబాబు, కరువు కవల పిల్లలని ప్రజలు చెబుతారు: నాగిరెడ్డి
-
ప్రభుత్వంపై బురదజల్లడమే పచ్చపత్రికల పని
నెల్లూరు (సెంట్రల్)/సాక్షి,అమరావతి: రాష్ట్రంలోని రైతులకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అనేక సంక్షేమ పథకాలను అమలుచేస్తుంటే పచ్చపత్రికలు మాత్రం ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నాయని వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి, అగ్రిమిషన్ వైస్ చైర్మన్ నాగిరెడ్డి మండిపడ్డారు. నెల్లూరులో గురువారం మంత్రి కాకాణి, తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో నాగిరెడ్డి మీడియాతో మాట్లాడారు. వారేమన్నారంటే.. ధాన్యం సగటు ఉత్పత్తి గతంలో కంటే 13 లక్షల నుంచి 14 లక్షల మెట్రిక్ టన్నుల వరకు పెరిగిందని మంత్రి కాకాణి గుర్తుచేశారు. రాష్ట్రంలో రైతులు పండించిన ధాన్యాన్ని మద్దతు ధరకు అమ్ముకుంటున్నారని.. ఎప్పుడైతే బయట మార్కెట్లో మద్దతు ధర లభించదో అప్పుడు రైతులకు గిట్టుబాటు ధర కల్పించి ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని తెలిపారు. ఈ కొనుగోలుకు ఎలాంటి లక్ష్యాలంటూ లేవని, రైతుల నుంచి ఎంత వచ్చినా కొనుగోలు చేస్తామన్నారు. కానీ, కొందరు ధాన్యం కొనడంలేదని అసత్య కథనాలు రాయడం సిగ్గుచేటన్నారు. ఇక నాబార్డు నుంచి రుణాలు పొంది సివిల్ సప్లైస్ కార్పొరేషన్‌ను పీకల్లోతు నష్టాల్లోకి నెట్టింది చంద్రబాబు కాదా?.. రైతులకు చెల్లించాల్సిన నాబార్డు రుణాలను చెల్లించకుండా పసుపు–కుంకుమ పేరుతో నిధులను దారిమళ్లించిన ఘనత చంద్రబాబుది కాదా? అని మంత్రి ప్రశ్నించారు. అప్పటికీ రైతులకు చెల్లించాల్సిన బకాయిలను వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయిన తరువాత రైతులకు చెల్లించారని గుర్తుచేశారు. కానీ, పచ్చపత్రికలు ఇవేమీ తెలుసుకోకుండా అడ్డగోలు వార్తలు రాస్తూ ప్రభుత్వంపై బురదజల్లుతున్నాయని కాకాణి మండిపడ్డారు. ఆహార ధాన్యాల ఉత్పత్తి పెరిగింది : నాగిరెడ్డి ఇక రాష్ట్రంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి గణనీయంగా పెరిగిందని అగ్రిమిషన్ వైస్ చైర్మన్ నాగిరెడ్డి అన్నారు. టీడీపీ ఐదేళ్ల పాలనలో సరాసరి 153.95 లక్షల టన్నుల ఆహార ధాన్యాలు ఉత్పత్తయితే.. గత మూడేళ్లలోనే (ప్రస్తుత ఖరీఫ్ మినహా) 167.24 లక్షల టన్నుల దిగుబడి వచ్చిందన్నారు. పచ్చ పత్రికలకు అభివృద్ధి కనిపించట్లేదని ఆయన మండిపడ్డారు. అలాగే, సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఒక్కపైసా కూడా రైతు నష్టపోకూడదని రవాణా, హమాలీ, గోనె సంచుల ఖర్చులు సైతం అందిస్తుంటే ఎల్లో మీడియా ఓర్వలేకపోతోందన్నారు. ఈ తరుణంలో వాతావరణ పరిస్థితులను సాకుగా చూపించి రైతులను భయభ్రాంతులకు గురిచేసి దళారులకు ధాన్యం విక్రయించేలా పిచ్చిరాతలు రాస్తున్నారని నాగిరెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇకపోతే.. సన్న బియ్యానికి మంచి రేటు ఉండటంతో రైతులు వాటిని బయట మార్కెట్లో విక్రయించుకుంటున్నారన్నారు. -
కలలు కల్లలు.. భార్యా, భర్తల బలవన్మరణం
తిరువూరు రూరల్ (ఎన్టీఆర్ జిల్లా): పని కోసం దుబాయ్ వెళ్లాలని చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో మనస్తాపానికి గురైన భర్త ఆత్మహత్యకు పాల్పడగా.. ఆ విషయం తెలిసి తట్టుకోలేక అతడి భార్య కూడా బలవన్మరణం చెందింది. తల్లిదండ్రుల మృతితో ఇద్దరు పిల్లలు అనాథలుగా మారారు. నిరాశ చెంది.. తిరువూరు మండలంలోని మునుకుళ్ల గ్రామానికి చెందిన గూడూరు నాగిరెడ్డి(38), స్వర్ణకుమారి(34) దంపతులకు ఇద్దరు కుమారులు. నాగిరెడ్డి స్థానికంగా ఓ రెడీమేడ్ వస్త్ర దుకాణంలో పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. సరైన ఆదాయం లేకపోవడంతో నాగిరెడ్డి ఏదైనా పని కోసం దుబాయ్ వెళ్లాలనే ప్రయత్నంలో వీసా కోసం దరఖాస్తు చే శాడు. పలుమార్లు ఇంటర్వ్యూలకు హాజరైనప్పటికీ సాంకేతిక కారణాలతో వీసా పొందలేకపోయాడు. సమయం, డబ్బు వృథా కావడంతో పాటు ఇక తాను విదేశాలకు వెళ్లే అవకాశం లేదని ఆందోళనకు గురైన నాగిరెడ్డి బుధవారం అర్ధరాత్రి సమయంలో కుటుంబ సభ్యులు నిద్రించిన తర్వాత పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చదవండి: (తప్పు మీద తప్పు.. ప్రియురాలి చెంత చేరి.. పోలీసులకు చిక్కి..) భర్త మృతిని తట్టుకోలేక.. గురువారం తెల్లవారుజామున తర్వాత భర్త మృతి విషయం తెలుసుకున్న భార్య స్వర్ణకుమారి తీవ్ర మనస్తాపానికి గురైంది. అంత్యక్రియలు పూర్తి కాకముందే ఆమె కూడా పురుగుమందు తాగింది. అపస్మారక స్థితికి చేరిన స్వర్ణకుమారిని గుంటూరు తరలించగా, అక్కడ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందింది. వీరికి ఇద్దరు కుమారులున్నారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
మంత్రి గంగుల ఉదంతాన్ని పరిశీలిస్తాం..
సాక్షి, హైదరాబాద్ : ఎన్నికల సందర్భంగా ఎవరైనా రహస్య ఓటింగ్‌కు (బ్రీచ్ ఆఫ్ సీక్రసీ) భంగం కలిగించిన పక్షంలో వారు వేసిన ఓటు చెల్లకుండా పోవడంతో పాటు అది నేరం చేసినట్టవుతుందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వి.నాగిరెడ్డి చెప్పారు. కరీంనగర్ కార్పొరేషన్లో ఓటేసిన మంత్రి గంగుల కమలాకర్ ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించి తాను టీఆర్ఎస్ కారు గుర్తుకు ఓటేశానని బహిరంగంగా వెల్లడించిన విషయాన్ని నాగిరెడ్డి దృష్టికి ఒక విలేకరి తెచ్చారు. దీనిపై ఏమైనా చర్యలు తీసుకుంటారా అన్న ప్రశ్నకు నాగిరెడ్డి స్పందిస్తూ.. ఈ అంశంపై తమకు సమాచారం లేదన్నారు. ఇప్పుడు పేర్కొన్నది ఊహాజనితమైన (హైపోతిటికల్) దని, వాస్తవంగా అసలు ఏమి జరిగిందో పరిశీలించాకే నిర్ణయం తీసుకునే అవకాశముందన్నారు. అక్కడ ఏమి జరిగిందనే అంశం గురించి తెలుసుకుంటామన్నారు. నిజాంపేటలోని ఒక పోలింగ్‌బూత్‌లో ఒక యువతి ఓటేసేటప్పటికే దానిపై గుర్తు వేసి ఉందని చెప్పిందని, అయితే అక్కడ రీపోలింగ్ జరుపుతారా అన్న ప్రశ్నకు అలాంటిదేమీ తమ దృష్టికి రానందున అది ఉత్పన్నం కాదన్నారు. అంతేకాకుండా ఏదో జరిగిందనే విధంగా దుష్ప్రచారం చేయడం మంచిది కాదని నాగిరెడ్డి హెచ్చరించారు. మీడియా సమావేశాల్లో అవాస్తవమైన ఇలాంటి అంశాలను లేవదీయడం సరికాదని అన్నారు. సోషల్‌మీడియాలో ఈ ఉదంతం వైరల్ అయినందునే ప్రస్తావిస్తున్నారని ఇతర విలేకరులు పేర్కొనగా ఇది పూర్తిగా ఊహాతీతమైనది, పూర్తిగా తప్పని ఆయన స్పష్టంచేశారు. ఈ ప్రచారానికి బాధ్యులైన వారిపైనా క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిజాంపేటలో అంత సవ్యంగా జరిగినట్టు.. ఎక్కడా దొంగ ఓటు, టెండర్ ఓటు పడినట్టు రిటర్నింగ్ అధికారి నుంచి నివేదిక రాలేదని మున్సిపల్‌శాఖ డైరెక్టర్ శ్రీదేవి స్పష్టం చేశారు. ఆ కార్పొరేషన్ పరిధిలో ఎన్నిక సజావుగా జరిగినట్టుగా జిల్లా కలెక్టర్ నుంచి కూడా తమకు రిపోర్ట్ వచ్చినట్టు ఆమె చెప్పారు. -
120 మున్సిపాలిటీలు, 9 కార్పొరేషన్లకు ఎన్నికలు
సాక్షి, హైదరాబాద్: మున్సిపల్ ఎన్నికలపై నెలకొన్న ప్రతిష్టంభనకు తెర దించుతూ రాష్ట్రంలోని 120 మున్సిపాలిటీలు, 9 కార్పొరేష న్లకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్ఈసీ) నోటిఫికేషన్ జారీచేసింది. మూడు డివిజన్లలోని ఓట్లలో దొర్లిన తప్పుల కారణంగా కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికలకు నోటిఫికేషన్ ఇవ్వలేదు. ఎన్నికల షెడ్యూల్ మార్చాలంటూ దాఖలైన పిటిషన్లను మంగళవారం సాయంత్రం హైకోర్టు కొట్టివేసిన నేపథ్యంలో రాత్రి 8.50 నిమిషాలకు ఎస్ఈసీ కార్యాలయంలో కమిషనర్ వి.నాగిరెడ్డి నోటిఫికేషన్ విడుదల చేశారు. కరీంనగర్ జిల్లా ఓటర్ల ముసాయిదా జాబితా, తుది జాబితాకు వ్యత్యాసాలు ఉన్నందున ఆ కార్పొరేషన్ ఎన్నికలకు నోటిఫికేషన్ ఇవ్వలేదని చెప్పారు. కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలోని వార్డుల్లో పలు కులాల ఓట్లు సరిగా లెక్కించలేదని, దాన్ని సవరిం చాలని హైకోర్టు సూచించిందని పేర్కొన్నారు. ముఖ్యంగా 3వ వార్డుతోపాటు 24, 25 వార్డుల్లో కులాల ఓట్లు సరిగా లేవని పేర్కొందని, ఈ విషయాన్ని మున్సిపల్ శాఖకు తెలియజేశామని వెల్లడించారు. ఆ తప్పొప్పులను మంగళవారం అర్ధరాత్రి 12 గంటల్లోగా సవరించి ఇస్తే, దానికి కూడా కలిపి సవరణ నోటిఫికేషన్ ఇస్తామని నాగిరెడ్డి తెలిపారు. ఒకవేళ ఆలోగా సవరించకుంటే మరోసారి రీషెడ్యూల్ జారీ చేస్తామన్నారు. మేయర్లు, మున్సిపల్ చైర్మన్ల ఎన్నిక తేదీని తర్వాత ప్రకటిస్తామని చెప్పారు. కాగా, వివరాలు రానందున కరీంనగర్ కార్పొరేషన్ నోటిఫికేషన్ ఇవ్వడంలేదని ఎస్ఈసీ కార్యదర్శి అశోక్‌కుమార్ మంగళవారం అర్ధరాత్రి 12.30కి ‘సాక్షి’కి తెలిపారు. ఒకే విడతలో.. బ్యాలెట్ పద్ధతిలో.. 120 మున్సిపాలిటీల్లోని 2,727 వార్డులు, 9 కార్పొరేషన్లలోని 325 డివిజన్లకు ఎన్నికలు నిర్వ హించనున్నారు. బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు జరుపుతున్నట్టు నాగిరెడ్డి తెలిపారు. 14న అభ్యర్థుల తుదిజాబితా ప్రకటించిన తర్వాత జిల్లాల్లో బ్యాలెట్ పత్రాలను ముద్రించడానికి ఆదేశాలిస్తామన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలోని డబీర్‌పుర డివిజన్‌కూ ఈనెల 22నే ఎన్నికలు ఉంటా యని పేర్కొన్నారు. దీనికి కూడా బుధవారం నుంచి నామినేషన్లను స్వీకరిస్తారని, ఈ నెల 12న అభ్యర్థుల ఉపసంహరణ తర్వాత అదే రోజు తుది జాబితా విడుదల చేస్తామని పేర్కొన్నారు. ఫలితాలు 25నే ప్రకటిస్తామని చెప్పారు. -
ఆ జాబితా ఆధారంగానే: నాగిరెడ్డి
సాక్షి, హైదరాబాద్: మున్సిపల్ ఎన్నికలకు నగారా మోగిన నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) కమిషనర్ నాగిరెడ్డి మున్సిపల్ కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మాసబ్ ట్యాంక్‌లోని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కార్యాలయంలో.. ముసాయిదా ఓటర్ల జాబితా తయారీ.. ఎన్నికల ఏర్పాట్లపై చర్చించారు. ఈ సందర్భంగా ఎన్నికలు జరిగే మున్సిపాలిటీల్లో ఎన్నికల కోడ్ ఉల్లంఘన జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అధికారులు రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొన వద్దని.. ప్రభుత్వం తరఫున బ్యానర్లు పెట్టవద్దని సూచనలు చేశారు. అదే విధంగా రాజకీయ పార్టీలు సమావేశాలు పెట్టవద్దని సూచించారు.(మోగిన పుర నగారా.. పూర్తి వివరాలు) ఇక మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ తరువాత అభ్యర్థుల వ్యయం పరిగణనలోకి తీసుకుంటామని... డిపాజిట్ గతంలో ఉన్న విధంగానే ఉంటుందని స్పష్టం చేశారు. ఎన్నికల నేపథ్యంలో ఈనెల 27న కలెక్టర్లు, 28న రాజకీయ పార్టీలతో సమావేశం కానున్నట్లు పేర్కొన్నారు. ఎన్నికల నిర్వహణ సజావుగా సాగేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు నాగిరెడ్డి వెల్లడించారు. ఈ ఎన్నికల్లో 1-1- 2019 ఓటర్ల జాబితాను పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుంది. పోలింగ్ కోసం బ్యాలెట్ బాక్సులు సిద్ధంగా ఉన్నాయని.. ఈమేరకు అధికారులకు శిక్షణ కూడా ఇచ్చినట్లు పేర్కొన్నారు. పోలింగ్ స్టేషనుకు 800 మంది ఓటర్లు ఉంటారని తెలిపారు. -
‘ఆ ఒక్కటి మినహా మూడు జిల్లాలు వెనకబడి ఉన్నాయి’
సాక్షి, విశాఖ : విశాఖ సిటీ మినహాయిస్తే ఉత్తరాంధ్ర మూడు జిల్లాలు ఆర్థికంగా వెనుకబడి ఉన్నాయని అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ తెలిపారు. విశాఖకు రాజధాని వస్తే ఈ మూడు ప్రాంతాలు అభివృద్ధి బాటలో నడుస్తాయని అన్నారు. విశాఖ కేంద్రంగా ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఏర్పాటు చేసే దిశలో కమిటీ నివేదిక రావాలని ఆశిస్తున్నట్లు వెల్లడించారు. ఎమ్మెల్యేగానే కాకుండా ఉత్తరాంధ్ర విశాఖ కేంద్రంగా పరిపాలన రాజధాని రావాలని కోరుకుంటున్నామని తెలిపారు. అమరావతి మాదిరిగా విశాఖలో ఇన్సైడ్ అవుట్ సైడ్ ట్రేడింగ్‌లు జరగవని, ఇక్కడ రాజధాని వస్తే ప్రజల జీవనం మెరుగుపడుతుందని అన్ని వర్గాలు ఆశిస్తున్నాయని గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి పేర్కొన్నారు. -
ఇది రైతు సంక్షేమ ప్రభుత్వం: మంత్రి కురసాల
సాక్షి, అమరావతి : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రైతుల సంక్షేమం కోసం ప్రతి నెల వ్యవసాయ నిపుణులతో చర్చిస్తున్నారని వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు స్పష్టం చేశారు. వ్యవసాయ మిషన్ మూడో సమావేశం నిర్వహించిన సందర్భంగా మంత్రి శనివారం ఇక్కడ మాట్లాడుతూ.. మార్కెట్లపై నిరంతరం నిఘా ఉంచి ధరల నియంత్రణ కోసం ప్రత్యేక సెల్ ఏర్పాటు చేయాలని సీఎం జగన్ ఆదేశించినట్లు తెలిపారు. సరుగుడు, జామాయిల్ రైతులకు సాయం చేసే అంశంపై చర్చ జరగాలని ముఖ్యమంత్రి కోరినట్లు వెల్లడించారు. చిరు ధాన్యాల సాగుకు ప్రోత్సాహం చేపట్టాలని, దాని కోసం మిల్లెట్ బోర్డు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించినట్లు పేర్కొన్నారు. రైతు ఏ దశలోనూ నష్టపోకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవాలని అన్నారు. గతంలో చంద్రబాబు 2000 కోట్లు ఇన్పుట్ సబ్సిడీ బకాయిలు పెట్టారని, ఇప్పుడు వాటిని విడుదల చేసేందుకు చర్యలు చేపడుతున్నామని కన్నబాబు తెలిపారు. టమాట విస్తీర్ణం తగ్గిందని, అంతేగాక ధర విషయంలోనూ హెచ్చు తగ్గులు ఉన్నాయన్నారు. కావున వీటిని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని, దానికోసం ప్రత్యేక చర్యలు చేపట్టాలని సీఎం జగన్ తెలిపారని మంత్రి అన్నారు. ధర పడిపోయినప్పుడు స్పందించడం కంటే ముందు చూపుతో రైతును ఆదుకునే దిశగా ప్రయత్నం చేయాలని, ఇప్పటికే ధరల స్థిరీకరణ నిధి 3000 కోట్లు ఉందని స్పష్టం చేశారు. మినుములు, పెసలు, కందుల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుకు ముందుగానే చర్యలు చేపడతామని మంత్రి పేర్కొన్నారు. వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ నాగిరెడ్డి మాట్లాడుతూ.. వ్యవసాయ మిషన్ మూడో సమావేశం సీఎం జగన్ నిర్వహించారని, రైతులకు మార్కెటింగ్ సదుపాయాలు కల్పించాలన్నదే ఈ సమావేశ ప్రధాన లక్ష్యమని తెలిపారు. టమాట పంట దిగుబడి ఉన్నా.. రైతులు మార్కెటింగ్ లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. త్వరలో రైతు భరోసా పధకం అమలు చేయాలని, దాని కోసం అర్హులైన రైతులు నష్టపోకుండా చూడాలని సీఎం ఆదేశించినట్లు పేర్కొన్నారు. రైతు భరోసా విషయంలో ఎవరనీ ఇబ్బంది పెట్టొద్దని, కౌలుదారులకు భరోసా ఇచ్చేందుకు కృష్ణా డెల్టా ఆధునికీకరణపై చర్చ జరిగిందని తెలిపారు. -
సీఎం జగన్ వ్యవసాయానికి పెద్దపీట వేశారు
సాక్షి, విజయవాడ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. ఏపీ బడ్జెట్లో వ్యవసాయానికి పెద్దపీట వేశారని వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ నాగిరెడ్డి పేర్కొన్నారు. వ్యవసాయానికి 12.66 శాతం కేటాయించారని, ఉచిత విద్యుత్‌కు చేసిన ఖర్చుతో కలిపి వ్యవసాయానికి 13.5 శాతం కేటాయింపులు దాటుతాయని తెలిపారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ రైతుల పంటలకు గిట్టుబాటు ధర కోసం రూ. 3 వేల కోట్లు కేటాయించారు. గత చంద్రబాబు ప్రభుత్వం రైతులకు పూర్తి స్థాయిలో రుణమాఫీ చేస్తామని చెప్పి మాట తప్పారు. చంద్రబాబులాగా వైఎస్ జగన్ మాట తప్పే వ్యక్తి కాదు. దేశంలో ఎక్కడా లేని విధంగా పంటలకు భీమా కడతామని ప్రకటించారు. టీడీపీ అధికారంలో ఉండగా చనిపోయిన రైతులకు పరిహారం అడిగితే.. ‘రైతులకు పరిహారం ఇస్తే మరింత మంది పరిహారం కోసం చనిపోతా’రని చంద్రబాబు మాట్లాడారు. చంద్రబాబు హయాంలో చనిపోయిన రైతులకు వైఎస్ జగన్ పరిహారం ఇవ్వడానికి సిద్ధమయ్యారు. వచ్చే ఏడాది నుంచి ఇవ్వాల్సిన రైతు భరోసాను ఈ ఏడాది నుంచే ఇస్తున్నారు. రైతులకు లక్ష వరకు వడ్డీ లేని రుణాలు ఇవ్వాలని సీఎం నిర్ణయం తీసుకున్నారు. రైతులకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మేలు చేసినట్లే వైఎస్ జగన్ కూడా మేలు చేస్తున్నారు. రైతులకు వైఎస్ జగన్ ప్రభుత్వం అండగా ఉంటుంది. వ్యవసాయానికి పగటి పూట విద్యుత్ ఇవ్వడానికి పెద్ద ఎత్తున నిధులు కేటాయించారు. గత ప్రభుత్వం విత్తన కంపెనీలకు నిధులను ఎగ్గొట్టింద’’ని వెల్లడించారు. -
కేసుల కారణంగా ఎన్నికలు ఆలస్యమయ్యాయి
సాక్షి, హైదరాబాద్ : కేసుల కారణంగా మున్సిపల్ ఎన్నికల నిర్వహణ కొంత ఆలస్యమైందని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నాగిరెడ్డి అన్నారు. సమయం ప్రకారం ఎన్నికలు నిర్వహించాలని కోర్టు సూచించినట్లు తెలిపారు. బుధవారం మున్సిపల్ కార్పోరేషన్ల కమిషనర్లతో ఆయన సమావేశమయ్యారు. ఈ సమావేశంలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణ, ఓటర్ల జాబితా, వార్డుల పునర్విభజనపై చర్చించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ శాఖ డైరెక్టర్ శ్రీదేవి పాల్గొన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నాగిరెడ్డి మాట్లాడుతూ.. కోర్టు.. ప్రభుత్వాన్ని ఎన్నికలకు ఏర్పాట్లు చేయాలని కోరిందన్నారు. 14వ తేదీ నాడు తుది ఓటర్ల జాబితా ప్రకటన ఉంటుందని తెలిపారు. చట్టం ప్రకారం ఎన్నికలు నిర్వహించాలని చెప్పారు. గురువారం మున్సిపల్ అధికారులు మున్సిపాలిటీ స్థాయిలో రాజకీయ పార్టీల నేతలతో సమావేశం నిర్వహించాలని ఆదేశించారు. 12వ తేదీనాడు మళ్లీ అధికారులకు శిక్షణ కార్యక్రమం ఉంటుందన్నారు. ఓటర్ల జాబితాను అందరికి అందుబాటులో ఉంచాలని సూచించారు. 14వ తేదీ నాడు తుది జాబితా విడుదల చెయ్యాలని, ఆ నాడే పోలింగ్ కేంద్రాలను కూడా ఏర్పాటు చేసి లిస్ట్ ఇవ్వాలని ఆదేశించారు. అనంతరం మున్సిపల్ శాఖ డైరెక్టర్ శ్రీదేవి మాట్లాడుతూ.. షెడ్యూల్ ప్రకారమే వార్డుల పునర్విభజన చేసినందుకు, తక్కువ సమయంలో ఎన్నికల ఏర్పాట్లు చేస్తునందుకు ధన్యవాదాలు తెలియజేశారు. ఎక్కడా కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా జాగ్రత్తగా ఓటర్ల జాబితా ఉండాలన్నారు. జిల్లాలోని అన్ని ప్రధాన కార్యాలయాలలో ఓటర్ల జాబితా అందుబాటులో ఉండాలని తెలిపారు. ఎన్నికలను పారదర్శకంగా, శాంతియుతంగా జరిపేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. -
'ఆగస్టులోగా ఎన్నికలను పూర్తి చేయాలి'
సాక్షి, హైదరాబాద్ : మున్సిపల్ ఎన్నికల నిర్వహణ సందర్భంగా మాసబ్ ట్యాంక్‌లోని రాష్ట్ర ఎన్నికల కార్యాలయంలో సీఎస్ ఎస్కే జోషి, డీజీపీ మహేందర్ రెడ్డి, మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ డైరక్టర్ శ్రీదేవి, ఇతర ఉన్నతాధికారులతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్నికల నిర్వహణ, మున్సిపాలిటీ రిజర్వేషన్లు, ఓటర్ల జాబితా తయారీ, శాంతి భద్రత తదితర అంశాలపై చర్చ నిర్వహించారు. జూలై 12న మున్సిపల్ శాఖ రిజర్వేషన్లు ఖరారు చేయనున్న నేపథ్యంలో ఈ నెల చివరి వారంలో ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసి ఆగస్టులోగా పూర్తి చేసేలా అధికారులు కసరత్తు చేయాలని కమిషనర్ పేర్కొన్నారు. మున్సిపల్ ఎన్నికలను ఒకే విడతలో నిర్వహిస్తున్న కారణంగా బ్యాలెట్ పేపర్ విధానాన్ని వీలైనంత తొందరగా పూర్తి చేయాలని నాగిరెడ్డి అధికారులకు స్పష్టం చేశారు. -
‘సీఎం జగన్ నిర్ణయాలు విప్లవాత్మకమైనవి’
సాక్షి, విశాఖపట్నం : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలు విప్లవాత్మకమైనవని పాయకరావు పేట ఎమ్మెల్యే గొల్ల బాబూరావు అన్నారు. అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటూ పాలనలో తనదైన ముద్ర వేసుకున్నారని ప్రశంసించారు. ఆదివారం మద్దిలపాలెం వైఎస్సార్సీపీ నగర పార్టీ కార్యాలయంలో నగర అధ్యక్షుడు వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో బాబూరావుతో పాటు మంత్రులు మోపిదేవి వెంకట రమణ, అవంతి శ్రీనివాసరావు, విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, ప్రభుత్వ విప్ బూడి ముత్యాలనాయుడు, అదీప్ రాజ్, కన్నబాబు రాజు, కన్వీనర్ లు ద్రోణంరాజు శ్రీనివాస్, కేకే రాజు, అక్కరమాని విజయ నిర్మల, మళ్ళ విజయ్ ప్రసాద్, నగర మహిళ అధ్యక్షురాలు గరికిన గౌరీ, జిల్లా పార్లమెంట్ మహిళ అధ్యక్షురాలు పీలా వెంకట లక్ష్మీ తో పాటు అనుబంధ సంఘాల నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాబూరావు మాట్లాడుతూ.. రాష్ట్రంలో సువర్ణ పాలన మొదలైందని, ప్రజలకు మంచి రోజులు వచ్చాయన్నారు. నవరత్నాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ కార్పొరేషన్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని కార్యకర్తలకు సూచించారు. కార్యకర్తలు అభద్రతాభావానికి గురికావొద్దు నియోజకవర్గాలలో ఏ సమస్యలు ఉన్నా తమ దృష్టికి తీసుకొస్తే పరిష్కరిస్తామని పర్యాటక, యుయజన శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్ అలియాస్ అవంతి శ్రీనివాస్ అన్నారు. ప్రతి నియోజకవర్గంలో సమావేశాలు నిర్వహించి సమస్యలు పరిష్కరించే దిశగా కృషి చేస్తామన్నారు. ఏ పార్టీకైనా కార్యకర్తలే రధసారుధులని, కార్యకర్తలు లేనిదే పార్టీ మనుగడ లేదన్నారు. కార్యకర్తలు అభద్రతాభావానికి గురికావొద్దని, వారికి అన్నివిధాల పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఏ పార్టీ ఎమ్మెల్యే అయినా, ఎంపీ అయినా రాజీనామా చేశాకనే వైఎస్సార్సీపీలోకి ఆహ్వానం ఉంటుందన్నారు. అవినీతి రహితంగా పనిచేయాలి జీవీఎంసీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పనిచేయాలని పెందుర్తి ఎమ్మెల్యే అదీప్ రాజులు సూచించారు. నవరత్నాల పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి నాయకుడు, కార్యకర్తపై ఉందన్నారు. అవినీతి రహితంగా పని చేస్తూ ప్రజల మన్ననలు పొందాలని కార్యకర్తలకు సూచించారు. జీవీఎంసీ ఎన్నికలే లక్ష్యంగా పనిచేయాలి గత ఎన్నికల్లో జరిగిన లోపాలను సరిదిద్దుకొని ముందుకు సాగాలని గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి అన్నారు. నవరత్నాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ జీవీఎంసీ ఎన్నికల గెలుపై లక్ష్యంగా పనిచేయాలని కార్యకర్తలకు సూచించారు. అవినీతి రహితంగా పనిచేస్తూ ప్రజల మన్ననలు పొందాలన్నారు. గత ప్రభుత్వం హయంలో ప్రజలు తీవ్ర కష్టాలు పడ్డారని, వారి సమస్యలు తెలుకొని పరిష్కరించే దిశగా ప్రతి కార్యకర్త, నాయకుడు పనిచేయాలని సూచించారు. -
‘రైతుల విషయంలో ప్రభుత్వం విఫలం’
సాక్షి, తూర్పుగోదావరి : రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని వైఎస్సార్సీసీ రైతు విభాగం అధ్యక్షుడు ఎమ్ వీరప్ప ఎస్ నాగిరెడ్డి మండిపడ్డారు. ఆయన గురువారం జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. రైతుకు చట్టబద్దంగా దక్కాల్సిన ధర కూడా ఇవ్వకుండా తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారని ఆగ్రహించారు. ఎకరాకు కౌలు రైతు ముప్పై వేలు నష్టపోయారని, గోదావరి జిల్లాలో ఈసారి వరి అత్యధికంగా పంట దిగుబడి వచ్చినా.. రైతులకు మాత్రం ఏ రకమైన లాభం చేకూరలేదని విమర్శించారు. ప్రభుత్వం అధికారికంగా ప్రకటించిన కరువు మండలాల్లో సైతం ఇన్సూరెన్స్, ఇన్పుట్ సబ్సిడీ గానీ పంపిణీ చేయలేదన్నారు. ఈ సమావేశంలో త్రినాద్ రెడ్డి, దొరయ్య, రాజబాబు పాల్గొన్నారు. -
నన్ను ఎదుర్కోలేకే విష ప్రచారం
విశాఖపట్నం , గాజువాక : పెదగంట్యాడలో చోటుచేసుకున్న అద్దె వివాదంలోకి వైఎస్సార్సీపీని లాగి తనపై దుష్ప్రచారం చేయాలనుకోవడం దుర్మార్గమని ఆ పార్టీ అభ్యర్థి, సమన్వయకర్త తిప్పల నాగిరెడ్డి అన్నారు. జనసేన నాయకులు రాజకీయంగా తనను ఎదుర్కోలేకే ఇలాంటి నీచపు ఆరోపణలకు దిగజారారని మండిపడ్డారు. గాజువాక పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నాగిరెడ్డి మాట్లాడారు. తమ పార్టీ ప్రచారానికి రాలేదని ఒక నిండు గర్భిణిని కొట్టారంటూ ఎల్లోమీడియాలో వార్తలు రాయడం వారి దిగజారుడుతనానికి నిదర్శనమని అన్నారు. ఇలాంటి తప్పుడు వార్తలు రాయడం తోక పత్రికకు కొత్త కాదన్నారు. బాధితురాలు ఎవరో తనకు తెలియదని, ఇంటి యజమాని తమ పార్టీ కాదని పేర్కొన్నారు. ఆయన బీజేసీ సీనియర్ కార్యకర్త అని తెలిపారు. పిట్టా నాగేశ్వరరావు రెడ్డి కులానికి చెందినవాడైతే వైఎస్సార్సీపీ నాయకుడవుతాడా అని ప్రశ్నించారు. గాజువాకలో తన గెలుపు తథ్యమని ప్రజలు చెబుతున్నారని, దీంతో జనసేన నాయకులకు ఏం చేయాలో అర్థంకాక బురద జల్లించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. జనసేన నాయకులు,ఎల్లోమీడియా ఇప్పటికైనా ఇలాంటి నీచ రాజకీయాలు, దిగజారుడు రాతలను మానుకోవాలని హితవు పలికారు. రానున్న ఎన్నికల్లో జనసేన పార్టీకి తగిన విధంగా గుణపాఠం చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. సమావేశంలో గాజువాక ఎన్నికల పరిశీలకుడు సత్తి రామకృష్ణారెడ్డి, నాయకులు మార్టుపూడి పరదేశి, మళ్ల బాపునాయుడు, రాజాన వెంకటరావు, రెడ్డి జగన్నాథం, వెంపాడ అప్పారావు, పల్లా చినతల్లి, కొయ్య భారతి, నక్క వెంకట రమణ, ఎన్నేటి రమణ, నక్క రమణ, రాజాన రామారావు, గండ్రెడ్డి రామునాయుడు, ఏదూరి రాజేష్, సంపంగి ఈశ్వరరావు, కటికల కల్పన, భూపతిరాజు సుజాత, కె.శ్రీదేవి, జి.రోజారాణి, ఎన్.ఎమీమా, ఎం.గంగాభాయి, ధర్మాల శ్రీను, మొల్లి చిన్న, చిత్రాడ వెంకట రమణ, పూర్ణశర్మ, సాపే బ్రహ్మయ్య, వై.మస్తానప్ప, రంబ నారాయణమూర్తి, దాడి నూకరాజు, ప్రగడ వేణుబాబు, బొడ్డ గోవింద్, బోగాది సన్ని, గొంతిన చైతన్య తదితరులు పాల్గొన్నారు. -
గాజువాకలో బేజారైన జనసేన.. వైఎస్సార్సీపీపై విష ప్రచారం
సాక్షి, గాజువాక : విశాఖ జిల్లా గాజువాక ఎన్నికల ప్రచారంలో దారుణంగా వెనుకబడ్డ జనసేన పార్టీ అక్కడ వైఎస్సార్సీపీ అభ్యర్థి నాగిరెడ్డిని ఎదుర్కోలేక ఆయన పార్టీపై బురద జల్లుతూ అడ్డదారులు తొక్కుతోంది. ఇంటి అద్దెను బకాయిపడ్డ ఓ కుటుంబ సమస్యను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ముడిపెట్టి ఆ పార్టీని అప్రదిష్టపాల్జేసేందుకు బరితెగించింది. ఎన్నికల్లో వైఎస్సార్సీపీ తరఫున ప్రచారానికి ఆ కుటుంబంలోని వారు రానన్నారన్న సాకు చెబుతూ ఆ ఇంటి యజమాని ఇల్లు ఖాళీ చేయించడానికి అద్దెకున్న వారిపై దాడిచేసినట్లుగా చిత్రీకరిస్తున్నారు. ఇందులో భాగంగా గతంలో బీజేపీకి పనిచేసిన ఆ ఇంటి యాజమానికి వైఎస్సార్సీపీ నాయకుడనే ముద్రవేసి కుట్ర పన్నారు. ఇదే అదనుగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జేబు సంస్థ అయిన ఏబీఎన్, ఆంధ్రజ్యోతిలు వైఎస్సార్సీపీపై విష ప్రచారానికి పూనుకున్నాయి. విషయం తెలుసుకున్న స్థానికులు ఆ ఇంటి యజమానికి వెన్నుదన్నుగా నిలిచారు. ఊరు ఊరంతా కదిలివచ్చి యజమాని కుటుంబానికి అండగా నిలిచింది. వైఎస్సార్సీపీపై బురదజల్లిన జనసేనను, బురదజల్లిన ఏబీఎన్, ఆంధ్రజ్యోతి తీరును వారు ఎండగట్టారు. ఇదీ సమస్య.. స్థానికుల కథనం ప్రకారం..నెమలిపురి సిద్ధు, నాగమణి దంపతులు విశాఖ జిల్లా గాజువాక నియోజకవర్గంలోని పెదగంట్యాడ నిర్వాసిత కాలనీ నెల్లిముక్కు గ్రామానికి చెందిన పిట్టా నాగేశ్వరరావు ఇంట్లో మూడేళ్ల క్రితం అద్దెకు దిగారు. స్టీల్‌ప్లాంట్‌లో అసంఘటిత కార్మికుడిగా పనిచేస్తున్న సిద్ధు గడిచిన ఎనిమిది నెలలుగా ఇంటి అద్దె సరిగ్గా ఇవ్వడంలేదు. నాగేశ్వరరావు చిన్న కుమారుడికి కొద్ది రోజుల్లో వివాహం.. పెద్ద కోడలికి ఆపరేషన్ చేయాల్సి ఉంది. దీంతో తమకు డబ్బులు అవసరమని, ఇంటి అద్దె ఇవ్వాలని ఇంటి యజమాని కోరారు. తమ కుమారుడికి వివాహం ఉన్నందున ఇల్లు కూడా ఖాళీ చేయాలని చెప్పారు. ఫిబ్రవరి 13న తాము ఆధ్యాత్మిక యాత్రకు కూడా వెళ్లాల్సి ఉన్నందున ఆ ముందురోజే తమకు ఇంటి అద్దె బకాయి రూ.18వేలను చెల్లించాలని కోరారు. కానీ, వారు చెల్లించలేదు. నాగేశ్వరరావు కుటుంబం యాత్రకు వెళ్లి వచ్చిన తరువాత సిద్ధు భార్య రూ.8వేలను మాత్రమే చెల్లించింది. పైగా తాము ఇంటికి ఏసీ పెట్టుకుంటామని ఇంటి యజమానితో వారు చెప్పారు. ఏసీ కొనడానికి బదులు ఇంటి అద్దె చెల్లించాలని, తమకు ఇల్లు కూడా అవసరం కాబట్టి ఖాళీ చేయాలని ఇంటి యజమాని స్పష్టంచేశారు. ఈ నేపథ్యంలో ఈనెల 20న సిద్ధు ఇంటి యజమానిపై గొడవకు వెళ్లాడు. యజమాని భార్య కనకమహాలక్ష్మి గుండెలపై చేయివేసి తోసేశాడు. వెంటనే సిద్ధు భార్య నాగమణి తన భర్తను లాకెళ్తుండగా మెట్లపై జారిపడింది. నాగమణి ఉదంతాన్ని వివరిస్తున్న స్థానికులు జనసేన మద్దతుతో కుట్ర నాటకీయ పరిణామాల మధ్య ఆస్పత్రికలో చేరిన నాగమణిపై స్థానికులు అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు. ఆమె ఆస్పత్రిలో చేరిన వెంటనే జనసేన పార్టీ నాయకుడు శివశంకర్ ఆమెను పరామర్శించారు. మరోవైపు.. వైఎస్సార్సీపీ నాయకుల దౌర్జన్యమంటూ జనసేన పార్టీ సోషల్ మీడియాలో పోస్టింగ్‌లు, ఆ వెంటనే ఆంధ్రజ్యోతి ఏబీఎన్‌లో బ్రేకింగ్ న్యూస్‌లు రావడంతో ఈ ఘటన వెనుక ఎవరున్నారన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. గాజువాకలో వైఎస్సార్సీపీ ప్రభంజనాన్ని అడ్డుకోలేని జనసేన నాయకులు ఈ నీచానికి దిగజారుతున్నారనే చర్చ స్థానికంగా జోరుగా సాగుతోంది. అలాగే, జనసేన పార్టీ నేతల మద్దతుతో ఈ సంఘటన మొత్తాన్ని ఆమె వక్రీకరించిందని, ఏమాత్రం సంబంధంలేని వైఎస్సార్సీపీపై కట్టుకథలు అల్లేందుకు ప్రయత్నిస్తోందని స్థానికులు వివరించారు. తనంతట తాను పడిపోయి ఆ నెపాన్ని ఇంటి యజమానిపై మోపుతోందని ఆరోపించారు. వైఎస్సార్సీపీకి ఎటువంటి సంబంధంలేని ఒక ఉన్నతాధికారిని పార్టీ పేరుతో రోడ్డుపైకి లాగడం వెనుక ఎవరి ప్రోద్బలం ఉందో పోలీసులు నిగ్గు తేల్చాలని వైఎస్సార్సీపీ శ్రేణులు డిమాండ్ చేస్తున్నాయి. నాగేశ్వరరావుకు, వైఎస్సార్సీపీకి సంబంధంలేదు కాగా, పిట్టా నాగేశ్వరరావుకు, వైఎస్సార్సీపీకి ఏమాత్రం సంబంధంలేదు. ఆయన స్టీల్‌ప్లాంట్‌లో ప్రస్తుతం జనరల్ మేనేజర్‌గా పనిచేస్తున్నారు. గతంలో పదోన్నతి రావడానికి ముందు బీజేపీలో పనిచేశారు. అనంతరం ఆయన రాజకీయాల నుంచి నిష్క్రమించారు. ఉచిత యోగా క్లాసులు చెప్పడం, సామాజిక అంశాలపై అందరికీ అవగాహన కల్పిస్తున్నారు. ప్రస్తుతం తన చిన్న కుమారుడి వివాహం ఉన్నందున ఆ పనుల్లో నిమగ్నమయ్యారు. కానీ, నాగేశ్వరరావు తాగి వచ్చి తనను కొట్టాడంటూ నాగమణి ఫిర్యాదు చేయడంపట్ల స్థానికులు మండిపడుతున్నారు. ఆయన చాలా సౌమ్యుడని, మద్యం అలవాటులేదని తెలిపారు. వీధిలో ఎవరు కనిపించినా అమ్మా అనే సంబోధనతో పలకరించి వెళ్లిపోవడం తప్ప మాట్లాడటం కూడా తాము చూడలేదని మీడియా ప్రతినిధులకు గ్రామస్తులు వివరించారు. నేను ఏ పార్టీ వాడినీ కాదు వైఎస్సార్సీపీ ఎన్నికల ప్రచారానికి నేను పిలిచినట్టు, రానన్నందుకు గొడవైనట్టు రాయడం దుర్మార్గం. నేను గతంలో బీజేపీకి కొద్దికాలం పనిచేశాను. ప్రస్తుతం ఏ పార్టీలోనూ లేను. కేవలం నాకు ఇవ్వాల్సిన ఇంటి అద్దెను ఎగ్గొట్టడానికే ఇలాంటి డ్రామాలకు దిగారు. వాళ్లను మా సొంత బిడ్డల్లా చూశాం. డబ్బులు ఎగ్గొట్టడానికి మమ్మల్ని రోడ్డుపైకి లాగారు. – పిట్టా నాగేశ్వరరావు, ఇంటి యజమాని 30 సంవత్సరాలుగా మాకు తెలుసు మేం విజయనగరం జిల్లా పార్వతీపురం నుంచి వచ్చి ఇక్కడే 30 సంవత్సరాలుగా ఉంటున్నాం. పిట్టా నాగేశ్వరరావు కుటుంబం అప్పట్నుంచీ మాకు చాలా బాగా పరిచయం. వాళ్లు చాలా మంచివాళ్లు. ఎవ్వరినీ ఇబ్బంది పెట్టరు. – నెల్లి రాములమ్మ, స్థానికురాలు -
అలుపెరగని యోధుడు నాగిరెడ్డి
విశాఖపట్నం, గాజువాక: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గాజువాక నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి తిప్పల నాగిరెడ్డి ప్రజల్లో అసాధారణ గుర్తింపు కలిగిన నాయకుడు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగిగా ఉన్న ఆయన ప్రజా సేవ కోసం ఉద్యోగాన్ని వదిలేసిన నేత. నియోజకవర్గంలో అన్ని ప్రాంతాల వాసులను పేరుతో పలకరించగల సమర్థుడుగా ఆయణ్ని ప్రజలు అభిమానిస్తుంటారు. నిరంతరం ప్రజల మధ్యే ఉంటూ ప్రతి కుటుంబంలో ఒక సభ్యుడిగా గుర్తింపు తెచ్చుకున్న నాగిరెడ్డి ఏ కాలనీకి వెళ్లినా వందల సంఖ్యలో జనం ఎదురెళ్లి స్వాగతం పలుకుతారు. మహిళలు హారతులు పట్టి ఆప్యాయంగా ఆహ్వానిస్తారు. కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్రెడ్డి రాజీనామా చేసిన మరుక్షణమే నాగిరెడ్డి కూడా ఆయన వెంట నడిచారు. జగన్ మోహన్‌రెడ్డి ఇచ్చిన ప్రతి పిలుపును గాజువాకలో విజయవంతం చేసి ఆయన మన్ననలు పొందారు. ప్రజా సమస్యలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు అరెస్టులను సైతం లెక్క చేయకుండా ధర్నాలు, బంద్‌లు, ర్యాలీలు నిర్వహించి ప్రభుత్వానికి ప్రజల నిరసనను తెలిపారు. ఇదీ నాగిరెడ్డి ప్రస్థానం ♦ 1953 జూన్ 1న జన్మించిన నాగిరెడ్డి ఇంటర్మీడియట్ విద్యాభ్యాసంతో 1976లో గ్రామ మున్సఫ్గా జీవితాన్ని ప్రారంభించారు. ఆ తరువాత గ్రామ పరిపానాధికారి (వీఏవో)గా పదోన్నతి పొంది 1984 వరకు అదే ఉద్యోగంలో కొనసాగారు. ♦ 1976లో ఆయన విశాఖ గ్రామ ఉద్యోగుల సంఘానికి అధ్యక్షుడిగా, వీఏవో సంఘానికి ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. ♦ 1984లో తెలుగుదేశం ప్రభుత్వం వీఏవో వ్యవస్థను రద్దు చేయడంతో ప్రజా జీవితంలోకి వచ్చారు. ♦ 1984 నుంచి 1992 వరకు జిల్లా కాంగ్రెస్ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించారు. ♦ ఆ తరువాత ప్రభుత్వం వీఏవో వ్యవస్థను మళ్లీ పునరుద్ధరించడంతో ఉద్యోగంలో చేరారు. వీఏవో నుంచి వీఆర్వోగా పదోన్నతి పొంది 2005 వరకు పని చేశారు. ♦ అదే సంవత్సరంలో ఉద్యోగానికి రాజీనామా చేసి ప్రత్యక్ష రాజకీయాల్లోకి పునఃప్రవేశించారు. ♦ 2007లో జీవీఎంసీకి జరిగిన ఎన్నికల్లో ఆయన, తన కోడలు ఎమిలి జ్వాల స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసి గెలుపొందారు. పోరాటమే ఊపిరిగా ♦ కాంగ్రెస్ పార్టీలో తన కుటుంబానికి జరిగిన అన్యాయంతో జగన్మోహన్రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేసిన వెంటనే నాగిరెడ్డి కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి తన అనుచరులతో కలిసి రాజీనామా చేసి జగన్‌కు మద్దతుగా నిలుస్తానని ప్రకటించారు. ♦ వెఎస్సార్ కాంగ్రెస్ ఆవిర్భావం నుంచీ గాజువాకలో పార్టీ అభివృద్ధికి కృషి చేస్తున్నారు. ♦ రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విశాఖ కేంద్రంగా రైల్వే జోన్, విభజన హామీల సాధనతోపాటు అంతకుముందు రైతు సమస్యలపైన, ఫీజు రీయంబర్స్మెంట్ పథకం నిర్వీర్యం కావడంపైన, మహిళలకు ప్రభుత్వం రుణాలు మంజూరు చేయకపోవడం, నిరుద్యోగ భృతి, ఆరోగ్యశ్రీలను నిర్వీర్యం చేయడానికి వ్యతిరేకంగా పార్టీ పిలుపు మేరకు బహుముఖంగా పోరాటాలు నిర్వహించారు. ♦ రాష్ట్ర విభజనను నిరసిస్తూ గాజువాకలో సుమారు 95 రోజులు రిలే నిరాహార దీక్షలను, 4 రోజులు ఆమరణ నిరాహార దీక్షలను నిర్వహించారు. ♦ ప్రజల సమస్యలను తెలుసుకోవడం కోసం గడప గడపకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పిలుపులో భాగంగా నియోజకవర్గంలోని ప్రతి ఇంటికీ వెళ్లారు. రావాలి జగన్, కావాలి జగన్ పేరిట ప్రతి ఇంటికీ వెళ్లి జగన్ మోహన్‌రెడ్డి ప్రకటించిన నవరత్నాల పథకాలను ప్రజలకు వివరించారు. స్థానికుల సమస్యలను తెలుసుకున్నారు. ప్రజల సమస్యలు ప్రత్యక్షంగా చూశా నియోజకవర్గంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రత్యక్షంగా చూశాను. ప్రతి ఇంటికీ వెళ్లి వారి ఇబ్బందులు స్వయంగా విన్నాను. రాష్ట్రానికి హోదా లేకపోవడం, యువతకు ఉద్యోగాలు రాకపోవడం, ఆరోగ్యశ్రీ పథకాన్ని నిర్వీర్యం చేసి పేదలకు వైద్యాన్ని దూరం చేయడం, ఫీజు రీయింబర్స్మెంట్ లేకపోవడం, పింఛన్ల మంజూరులో టీడీపీ నాయకుల పెత్తనం వల్ల అర్హులకు రాకపోవడం వంటి సమస్యలతో ప్రజలు ఎంతో వేదన పడుతున్నారు. తమ పిల్లల భవిష్యత్ ఏమవుతుందోనని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. నియంత్రణ లేని నిత్యావసర వస్తువుల ధరలు, స్థానిక సమస్యలతో పేదలు, మధ్య తరగతి ప్రజలు బతకలేని పరిస్థితులను పరిశీలించాను. వృద్ధులు, వికలాంగులు, వితంతు పింఛన్లు ఆగిపోతుండటంతో తాము ఎన్ని అవస్థలు పడుతున్నామో నాతో చెప్పుకొని కన్నీరు కార్చారు. తమ పిల్లల ఫీజు రీయింబర్స్మెంట్ ఆగిపోవడంతో చదివించుకోవడానికి కష్టాలు పడుతున్నవార్నీ చూశాను. వారికి ఒక్కటే భరోసా ఇచ్చాను. జగనన్న వస్తారని, ముఖ్యమంత్రిగా మీ సమస్యలను పరిష్కరిస్తారని చెప్పాను. వైఎస్సార్సీపీకి మద్దతుగా నిలిస్తే వైఎస్ స్వర్ణయుగాన్ని జగనన్న తెచ్చి చూపిస్తారని హామీ ఇచ్చాను. – తిప్పల నాగిరెడ్డి, వైఎస్సార్సీపీ గాజువాక అభ్యర్థి -
అజ్ఞాతవాసా.. అజాతశత్రువా.. మీకు ఎవరు కావాలి?
సాక్షి ప్రతినిధి. విశాఖపట్నం : కామన్‌మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్(సీపీఎఫ్) గుర్తుందా.. అదేనండి 2008లో చిరంజీవి కుమార్తె వివాహ సమయంలో పవన్‌కల్యాణ్ ఆవేశపడి తన లైసెన్స్ రివాల్వర్‌ను జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో అప్పగించి సీపీఎఫ్ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారే.. ఆ సీపీఎప్ఫేనండీ..సదరు సీపీఎఫ్ పేరిట తక్షణమే రూ. 2 కోట్లు డిపాజిట్ చేస్తున్నామనీ.. ఎవరు కష్టంలో ఉన్నా నైతికంగా. ఆర్థికంగా ఆదుకుంటామని తనకు కొట్టిన పిండి అయిన సినిమా డైలాగులు పేల్చారు.పాపం.. ఆ డైలాగులను నమ్మేసిన చాలామంది తమ గోడు చెప్పుకుందామని వెళ్తే.. కనీసం దర్శనభాగ్యం కూడా కల్పించలేదు.అంతెందుకు.. అప్పట్లో రాజకీయ ప్రముఖుడు కె.కేశవరావు కుటుంబంతో తనకు ప్రాణహాని ఉందని.. మీలాంటి పెద్దలు అండగా నిలవాలని ఓ మహిళ ఎన్నిమార్లు విన్నవించినా పట్టించుకోలేదు. దీంతో ఆమె బహిరంగంగానే సీపీఎఫ్పై విమర్శలు గుప్పించారు.కట్ చేస్తే.. అసలు ఆ సీపీఎఫ్ ఏమైంది.. దాని కార్యకలాపాలు సాగుతున్నాయా..?! ఈ ప్రశ్నకు బహుశా పవన్ వీరాభిమానులు కూడా చెప్పలేరేమో.. అసలు అటువంటిదొకటి ఉందన్న విషయం వారికి తెలియకపోయినా ఆశ్చర్యం లేదు.ఒకవేళ తెలిసినవారెవరైనా ఉంటే.. అప్పటి పీఆర్పీలోనో.. ఇప్పటి జనసేనలోనో విలీనం చేసేశారని చెబుతారు.ఇక పీఆర్పీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చిన పవన్‌కల్యాణ్ యువరాజ్యం అధ్యక్షుడిగా టీడీపీ అధినేత చంద్రబాబుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. 2009 ఎన్నికల్లో పీఆర్పీ రైలింజన్ గుర్తుకు ఓటు వేయాలని పిలుపునిచ్చారు.2014 ఎన్నికలకు వచ్చేసరికి.. మనసు మార్చుకొని బాబుతో మిలాఖత్ అయ్యారు. టీడీపీ గుర్తు సైకిల్‌కు ఓటెయ్యాలని ఊరూవాడా తిరిగి ప్రచారం చేశారు.2019.. మళ్లీ ఎన్నికలొచ్చాయి.. బాబుకు కటీఫ్ చెప్పారు. నేరుగా పోటీ చేస్తున్నామంటూ గ్లాసుకు వేయాలని కోరుతున్నారు..ఇలా మూడు ఎన్నికల్లో మూడు గుర్తులు మార్చి.. ఓటర్లను ఏమార్చడంతోపాటు ఎన్నికల తర్వాత కనిపించకుండా పోయిన అజ్ఞాతవాసి ఇప్పుడు ఊరు కాని ఊరు గాజువాక నుంచి పోటీ అంటూ వచ్చారు. ఎన్నికల తర్వాత కన్పించని ఆ అజ్ఞాతవాసి కావాలా.. గాజువాకలోనే పుట్టి పెరిగి అందరితో పెద్దమనిషి అనిపించుకుంటున్న అజాతశత్రువు తిప్పల నాగిరెడ్డి కావాలా?.. ఒక్కసారి పరిశీలిద్దాం రండి. – గరికిపాటి ఉమాకాంత్ నిలకడలేమికి చిరునామా - పవన్‌కల్యాణ్, జనసేన అభ్యర్ధి, గాజువాక ⇔ అసలు గాజువాకతో ఏం సంబంధం. ⇔ నాకు కులమతాలే లేవని బీరాలు పలికి ఇక్కడికెందుకొచ్చినట్టు.. ⇔ పక్కపక్కనే ఉన్న ఉభయగోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాల్లోని ⇔ భీమవరం, గాజువాక.. రెండు స్థానాల్లో ఎందుకు పోటీ చేస్తున్నట్టు? ⇔ భీమవరంపై నమ్మకం లేకనా..? ⇔ సొంత జిల్లా, సొంత నియోజకవర్గం పాలకొల్లులో ⇔ ఏకంగా చిరంజీవికే పరాజయం చూపించిన ‘లెక్క’ భయపెట్టిందా... ⇔ మరి గాజువాక ప్రజలు అంత అమాయకంగా కనిపించారా.. ⇔ ఒకవేళ పొరపాటునో, గ్రహపాటునో రెండింటిలో గెలిస్తే ఏ సెగ్మెంట్ వదిలేస్తారు ⇔ కచ్చితంగా గాజువాకే.. అనుమానం ఏమైనా ఉందా?.. ⇔ పురిటిగడ్డ, సొంత జిల్లా అని సెంటిమెంట్ కబుర్లు చెప్పి ⇔ భీమవరంలోనే బిచాణా వేయడం తథ్యం. ⇔ ఒకవేళ అక్కడ ఓడి ఇక్కడ గెలిస్తే గాజువాకను ఏం చేస్తారు.. ⇔ రూ.కోట్లు ఖర్చు చేసి పెట్టుబడి పెట్టిన నిర్మాతలకే సహకరించకుండా ఏడిపించిన చరిత్ర ఆయనది? ⇔ అలాంటిది ఓటేసిన ప్రజలకేం చేస్తారు? ⇔ పోనీ గెలిచినా.. ఓడినా గాజువాకలోనే ఉంటానని మాట ఇస్తారా.. ⇔ ఆ మాటపై నిలబడతారా.. ఏమాత్రం నిలకడ లేని మనస్తత్వం ఉన్న ఆయన్ను నమ్మేదెలా? ⇔ పీఆర్పీ నుంచీ ఆ కుటుంబాన్నే నమ్ముకుని ఉన్న చింతలపూడి వెంకట్రామయ్యను ⇔ తన పోటీ కోసం గాజువాక నుంచి పెందుర్తికి తరిమేయడం సబబేనా? ⇔ వర్గ దృష్టిలో ’సేఫ్ సెగ్మెంట్’ కోసం నమ్మినోళ్లను కూడా బలి చేసేస్తారా.. నిత్యం ప్రజలతోనే.. తిప్పల నాగిరెడ్డి, వైఎస్సార్సీపీ అభ్యర్థి ⇔ 66 ఏళ్ళ నాగిరెడ్డి వయసురీత్యానే కాదు.. స్థానికులకు మేలు చేసే పెద్ద మనిషిగా పేరుగడించారు. ⇔ రైతు కుటుంబానికి చెందిన ఆయన గాజువాక నియోజకవర్గం పెదగంట్యాడ వెంకన్నపాలెం గ్రామంలోనే పుట్టి పెరిగారు. ⇔ అప్పట్లో ఇంటర్మీడియెట్ వరకు చదువుకున్నారు. ఈ ప్రాంతంలోనే పెరిగి పెద్దయ్యారు. ⇔ గ్రామ పరిపాలనాధికారిగా, గ్రామ కార్యదర్శిగా మూడు దశాబ్దాలకుపైగా పని చేసి ప్రజలకు సేవలందించారు. ⇔ మొదటి నుంచి కాంగ్రెస్‌లో మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి అనుచరుడిగా పేరొందారు. ⇔ 2007 జీవీఎంసీ ఎన్నికల్లో కార్పొరేటర్‌గా ఇండిపెండెంట్‌గా గెలుపొందారు. ఇలా గెలిచిన పదిమంది స్వతంత్రులకు నాయకత్వం వహించారు. ⇔ నాడు వైఎస్ కోరిక మేరకు కాంగ్రెస్‌కు మద్దతిచ్చి జీవీఎంసీ మేయర్ పదవిని కాంగ్రెస్ పరం చేశారు. ⇔ 2009లో గాజువాక నుంచి శాసనసభకు స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేసి 36వేల పైచిలుకు ఓట్లు సాధించారు. ⇔ 2014లో వైఎస్సార్సీపీ అభ్యర్ధిగా పోటీ చేశారు. ⇔ ఐదేళ్లుగా వైఎస్సార్సీపీ జెండా పట్టుకుని ఇంటింటికీ తిరుగుతున్నారు. ⇔ స్థానిక టీడీపీ నేతల అక్రమాలపై అలుపెరుగని పోరాటం చేశారు. ⇔ జననేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి అధికారంలోకి వస్తే రాజన్న రాజ్యం మళ్లీ వస్తుందని భరోసా ఇచ్చారు. ⇔ 2019లో మళ్లీ వైఎస్సార్సీపీ అభ్యర్థిగానే బరిలో నిలిచారు. ⇔ గెలిచినా ఓడినా నిత్యం ప్రజల మధ్యే ఉంటున్న చరిత్ర నాగిరెడ్డిది. ⇔ ఓడినప్పటికీ ప్రజలకు నేనున్నానని భరోసా కల్పించిన ⇔ నాగిరెడ్డిని గెలిపిస్తే గాజువాక ఏరీతిన అభివృద్ధి చెందుతుందో ఆలోచించాలి. – సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం -
‘క్రిమినల్ కేసులున్న పోలీసులకు పోస్టింగులు’
సాక్షి, విజయవాడ : అధికార తెలుగు దేశం పార్టీ ఎన్నికల నిబంధనలను పట్టించుకోవడం లేదని, క్రిమినల్ కేసులు ఉన్న పోలీస్ ఆఫీసర్లకు ఎన్నికల బాధ్యతలు అప్పగించకూడదని వున్నా.. వారికి పోస్టింగులు ఇచ్చారని వైఎస్సార్ సీపీ ఎన్నికల నిబంధనల నిఘా కమిటి సభ్యుడు నాగిరెడ్డి మండిపడ్డారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వ ట్విటర్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కామెంట్స్ ట్యాగ్ చేస్తున్నారని చెప్పారు. అన్నదాత సుఖీభవ కింద ఇప్పటివరకు వెయ్యి మాత్రమే రైతుల ఖాతాలో జమైనా.. 15 వేల రూపాయలు రైతులకు ఇచ్చినట్లు ప్రకటనలు చేస్తున్నారన్నారు. నోటిఫికేషన్ వచ్చిన తరువాత ముగ్గురు ఐపీఎస్‌లకు అడిషనల్ డీజీ పదోన్నతులు ఇచ్చారని తెలిపారు. వీటిపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశామని వెల్లడించారు. ఆ నిర్ణయాలు ఎలా తీసుకుంటారు : గౌతంరెడ్డి ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో ఆర్థికపరమైన నిర్ణయాలు ఎలా తీసుకుంటారని వైఎస్సార్ సీపీ ఎన్నికల నిబంధనల నిఘా కమిటీ సభ్యుడు గౌతంరెడ్డి ప్రశ్నించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వం చేసే ప్రతిపని ఎన్నికల నిబంధనల ప్రకారం జరగాలని డిమాండ్ చేశారు. విజయవాడ నగరంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఫోటోలతో కూడిన భారీ కటౌట్లు పెట్టారని, వెంటనే వాటిపై చర్యలు తీసుకోవాలని కోరారు. -
‘క్రిమినల్ కేసులున్న పోలీసులకు పోస్టింగులు’
-
రైతుబంధుకు బ్రేక్..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చిన నేపథ్యంలో ఓటర్లకు వ్యక్తిగత లబ్ధి కలిగించే రైతుబంధు చెక్కులు, బతుకమ్మ చీరల పంపిణీ, సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ వంటి ప్రభుత్వ కార్యక్రమాలను తక్షణమే నిలుపుదల చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కోరింది. ఈ పథకాల ద్వారా ఓటర్లకు నేరుగా డబ్బులు, కానుకల రూపంలో ప్రయోజనం కలిగిస్తే వారు ప్రభావితమయ్యే అవకాశముందని అభిప్రాయపడింది. ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో ప్రభుత్వం ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను కూడా బదిలీ చేసేందు కు వీల్లేదని ఎన్నికల సంఘం సీనియర్ అధికారి ఒకరు బుధవారం తెలిపారు. జిల్లాపరి షత్, మండల పరిషత్, మునిసిపల్ పాలక మండళ్ల సర్వసభ్య సమావేశాలు ఏర్పాటు చేసుకోవచ్చని, ఎలాంటి విధానపర నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం లేదని అభిప్రాయపడ్డారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణ చేపట్టడానికి ఆస్కారం లేదని, ఎన్నికల సంఘం అనుమతి తీసుకున్నాకే అసెంబ్లీ సమావేశాలు నిర్వహిం చాల్సి ఉంటుందన్నారు. ఇదిలా ఉండగా, ఎన్నికల్లో ఓటర్లకు డబ్బు, మద్యం పంపిణీని అడ్డుకోవడానికి రాష్ట్ర, జిల్లాల సరిహద్దుల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేయాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఎన్నికల ఫిర్యాదులకోసం ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయనుంది. ఎన్నిక ల పరిశీలకులతో శుక్రవారం ఎన్నికల కమిషన ర్ వి.నాగిరెడ్డి సమావేశం కానున్నారు. -
పల్లె సంగ్రామం
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్) : పల్లె సంగ్రామానికి తెర లేచింది. ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న గ్రామపంచాయతీల సమరానికి సమయం వచ్చేసింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల అధికారి నాగిరెడ్డి మంగళవారం పంచాయతీ ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేశారు. దీంతో ఇప్పటికే గ్రామాల్లో ఉన్న ఎన్నికల హడావుడి ఇంకా తీవ్రం కానుంది. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నేపథ్యంలో ఎన్నికల కోడ్ కూడా మంగళవారం సాయంత్రం నుంచి అమల్లోకి వచ్చేసినట్లయింది. జిల్లాలో మొత్తం 721 గ్రామపంచాయతీలు, 6,366 వార్డులు ఉండగా.. మూడు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. 10.. 7.. 8 జిల్లాలోని 25 మండలాలకు గాను 721 గ్రామపంచాయతీలు ఉండగా మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ మేరకు తొలి విడత కృష్ణా, మాగనూర్, మక్తల్, నర్వ, ఊట్కూర్, నారాయణపేట, దామరగిద్ద, ధన్వాడ, మరికల్, కోయిలకొండ మండలాల్లోని 249 పంచాయతీల్లో ఈనెల 21న, రెండో విడతగా మిడ్జిల్, బాలానగర్, రాజాపూర్, జడ్చర్ల, నవాబుపేట, మహబూబ్‌నగర్, హన్వాడ మండలాల్లోని 243 పంచాయతీల్లో ఈనెల 25న ఎన్నికలు జరుగుతాయి. ఇక చివరిదైన మూడో విడతగా అడ్డాకుల, మూసాపేట, భూత్పూర్, సీసీకుంట, దేవరకద్ర, గండీడ్, మద్దూర్, కోస్గి మండలాల్లోని 227 పంచాయతీల్లో 30వ తేదీన ఎన్నికలు నిర్వహిస్తారు. పోలింగ్, లెక్కింపు ఒకే రోజు నిర్ణీత తేదీల్లో పోలింగ్‌ను ఉదయం 7 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిర్వహిస్తారు. ఆ తర్వాత మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమవుతుంది. తొలుత వార్డు సభ్యుల ఓట్లు.. ఆ తర్వాత సర్పంచ్ అభ్యర్థులకు పోలైన ఓట్లను లెక్కిస్తారు. అంటే ప్రతీ ఓటరు ఈ ఎన్నికల్లో రెండు ఓట్లు వేయాల్సి ఉంటుంది. ఇక వార్డుసభ్యులు, సర్పంచ్ ఫలితాలు వెల్లడయ్యాకఉప సర్పంచ్ ఎన్నిక కూడా పూర్తిచేస్తారు. 721 పంచాయతీల్లో ఎన్నికలు జిల్లాలోని మొత్తం 721 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు జరుగనున్నాయి. 721 పంచాయతీల్లో 307 జనరల్‌కు కేటాయించారు. ఇక బీసీలకు 170 స్థానాలు రిజర్వ్ అయ్యాయి. ప్రభుత్వం ఇటీవల పలు తండాలను గ్రామ పంచాయతీలుగా గుర్తించింది. దీంతో జిల్లాలోని 107 తండా పంచాయతీల్లో తొలిసారి ఎన్నికలు జరగనున్నా యి. ఈ పంచాయతీలుగా పూర్తిగా గిరిజనులకే కేటాయించారు. దీంతో మైదాన ప్రాంతాల్లో 30 స్థానాలను ఎస్టీలకు కేటాయించారు. ఎస్సీలకు 107 స్థానాలు రిజర్వ్ చేయగా.. ప్రతీ కేటగిరీలో 50 శాతం స్థానాలకు మహిళలకు దక్కనున్నాయి. కాగా, ఇప్పటికే ఎన్నికల విధుల్లో పాల్గొనే 11,876 మంది ఉద్యోగులను గుర్తించడంతో పా టు బ్యాలెట్ బాక్సులు, పోలింగ్ స్టేషన్ల గుర్తింపు వంటి పనులను అధికారులు పూర్తిచేశారు. 265 కొత్త పంచాయతీల్లో ఎన్నికలు ‘మా ప్రాంతం.. మా పాలన’ నినాదంతో ప్రజలు ఎదురుచూస్తుండగా రాష్ట్రప్రభుత్వం కొద్దినెలల క్రితం కొత్త గ్రామపంచాయతీలను గేర్పాటుచేసింది. ఇందులో భాగంగా జిల్లాలో 265 కొత్త పంచాయతీలు ఏర్పడ్డాయి. ఈ పంచాయతీల్లో తొలిసారి ఎన్నికలు జరగనుండగా ఆశావహులు భారీగా ఉన్నట్లు తెలుస్తోంది. గులాబీ, తెలుగు రంగు బ్యాలెట్లు పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్, వార్డు సభ్యుడిగా పోటీ చేసే ఇద్దరు అభ్యర్థులకు ఓటర్లు వేర్వేరుగా ఓట్లు వేయాల్సి ఉంది. ఇందుకోసం సర్పంచ్ అభ్యర్థులకు గులాబీ రంగు బ్యాలెట్ పేపర్, వార్డు సభ్యుల కోసం తెలుపు రంగు బ్యాలెట్‌ను ముద్రించారు. ఇక సర్పంచ్ బ్యాలెట్లో ముద్రించేందుకు 30 గుర్తులను కేటాయించారు. అలాగే, వార్డు సభ్యుల బ్యాలెట్ కోసం 20 గుర్తులు ఉండగా.. ప్రతీ బ్యాలెట్లో ఈసారి తొలిసారిగా ‘నోటా’ గుర్తు ముద్రించనున్నారు. అభ్యర్థుల్లో ఎవరూ నచ్చకపోతే ‘నోటా’కు ఓటు వేసే అవకాశం ఉంది. సర్పంచ్‌కు ఫీజు, ఖర్చు సర్పంచ్ స్థానానికి పోటీ చేసే అభ్యర్థులు(జనరల్) రూ.2 వేల నామినేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అదే రిజర్వ్డ స్థానాల్లోనైతే రూ.వెయ్యిగా నిర్ధారించారు. ఇక జనరల్ స్థానం నుంచి పోటీ చేసే వార్డు సభ్యులు రూ.500, రిజర్వ్డ్ స్థానాల కోసం రూ.250 మాత్రం చెల్లించాలి. కాగా, సర్పంచ్‌గా పోటీ చేసే(జనరల్) అభ్యర్థుల గరిష్ట వయో పరిమితిని రూ.2 లక్షలుగా, రిజర్వ్డ్ స్థానాల అభ్యర్థులు రూ.1.50లక్షలు, వార్డు సభ్యుల ఖర్చులు వరుసగా రూ.50 వేలు, రూ.30వేలకు మించొద్దు. అమల్లోకి ఎన్నికల కోడ్ రాష్ట్ర ఎన్నికల సంఘం గ్రామపంచాయతీల ఎన్నికల నోటిఫికేషన్‌ను మంగళవారం జారీ చేసింది. దీంతో మంగళవారం సాయంత్రం నుంచి ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చేసింది. ఫలితంగా బుధవారం నుంచి ఎలాంటి పనులకు శంకుస్థాపనలు కానీ ప్రారంభోత్సవాలు కానీ చేయడానికి వీలుండదు. అయితే, ఇప్పటికే ప్రారంభించిన పనులను కొనసాగించవచ్చు. ఎలాంటి అధికారిక కార్యక్రమాలు నిర్వహించొద్దని ఎన్నికల కమిషన్ స్పష్టం చేయగా.. ప్రజాప్రతినిధులు, అధికారులు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనకూడదు. -
‘చంద్రబాబు రైతులను నిలువునా ముంచారు’
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వ్యవసాయ రంగం కుదేలు కావడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనుసరిస్తున్న విధానాలే కారణమని వైఎస్సార్సీపీ రైతు విభాగం అధ్యక్షుడు ఎంవీఎస్ నాగిరెడ్డి విమర్శించారు. ఏపీలో వ్యవసాయ రంగాన్ని వదిలేసిన రైతులు వలస బాట పడుతున్నారన్నారు. రుణమాఫీతో చంద్రబాబు రైతులను నిలువునా ముంచారని, బ్యాంకు నోటీసులతో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు. అసలు వర్షాలతో పంటలు దెబ్బతిన్న రైతులకు చంద్రబాబు ఏం సాయం చేశారో చెప్పాలని నాగిరెడ్డి డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్టం కరువుతో అల్లాడిపోతుందని, వంచనలతో చంద్రబాబు రాష్ట్రాన్ని పాలిస్తున్నారని ఆరోపించారు. రాయలసీమను కరువు జిల్లాలుగా ప్రకటించాలని అధికారులు చెబుతుంటే ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించారు. ఇక పోలవరం సందర్శన పేరిట వేల కోట్ల రూపాయలను చంద్రబాబు ఖర్చు చేస్తున్నారన్నారు. అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్ దుర్భిక్ష ఆంధ్రప్రదేశ్‌గా మారిపోయిందని, ఇప్పటికైనా అన్నం పెట్టే అన్నదాతను ఆదుకోవాలని నాగిరెడ్డి సూచించారు. -
రెయిన్ గన్స్ ఏమయ్యాయి?
సాక్షి, విజయవాడ : రాష్ట్రవ్యాప్తంగా కరువు ఊహించని స్థాయిలో ఉందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎంవీఎస్ నాగిరెడ్డి పేర్కొన్నారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో శుక్రవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. వైఎస్సార్ కడపతో పాటు మరో ఆరు జిల్లాల్లో వర్షపాతం అతి తక్కువగా నమోదైందని తెలిపారు. అయినా కూడా కేబినెట్ భేటీలో కరువుపై చర్చించకపోవడం దారుణమని అన్నారు. వర్షాభావ పరిస్థితులపై అధికారిక లెక్కలున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. లక్షల హెక్టార్లలో పంటలు ఎండిపోతున్నాయి, సాగు తీవ్ర సంక్షోభంలో చిక్కుకుందని ఆవేదన వ్యక్తం చేశారు. పట్టిసీమ నీళ్లు అంటూ గొప్పలు చెబుతున్నా కృష్ణా డెల్టాలో పంటలు ఎండిపోతున్నాయని వెల్లడించారు. దాదాపు 20 లక్షల హెక్టార్ల భూమి బీడుగా మారిందని వివరించారు. ధరల స్థిరీకరణ నిధికి కేటాయింపులు ఏవని నిలదీశారు. స్వామినాథన్ కమిటీ సిఫార్సులు అమలు చేయరా అని ప్రశ్నించారు. రాయలసీమ పూర్తిగా దుర్భిక్షం ఎదుర్కొంటోందని పేర్కొన్నారు. రాయలసీమలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన రెయిన్ గన్స్ ఏమయ్యాయి? నిలదీశారు. చంద్రబాబు రైతులను పూర్తిగా వంచించారని ఆరోపించారు. -
ఏపీ ప్రభుత్వం క్షమాపణలు చెప్పాలి
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అంతా మోసం, దగా అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రైతు విభాగం అధ్యక్షుడు నాగిరెడ్డి విమర్శించారు. వ్యవసాయానికి ఎంతో చేస్తామని చెప్పిన చంద్రబాబు ప్రభుత్వం చివరకు అరకొర కేటాయింపులే చేసిందని మండిపడ్డారు. శుక్రవారం ఆయన పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర రైతాంగం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిందని, లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆఖరి బడ్జెట్లో కూడా కేటాయింపులు చేయకుంటే రైతుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. ఓ పక్క ధాన్యానికి గిట్టుబాటు ధరలు లేకున్నా మరోపక్క, నిత్యవసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్నా చంద్రబాబు ఎందుకు మౌనంగా ఉండిపోయారని నిలదీశారు. ఇప్పటి వరకు ఎంత ధాన్యం కొనుగోలు చేశారని ప్రశ్నించారు. అంసెబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి చంద్రబాబు అన్ని అబద్ధాలే చెప్పారని దుయ్యబట్టారు. పంటల సాగు తగ్గిపోయి రైతుల వలసలు పెరగిపోతుంటే వ్యవసాయ రంగం ఎక్కడ బాగుందని ప్రశ్నించారు. రైతుల ఉసురు పోసుకున్న ప్రభుత్వాలు ఇప్పటి వరకు మనుగడ సాగించలేదని, చంద్రబాబు ప్రభుత్వం కూడా ఎక్కువకాలం ఇక సాగబోదని హెచ్చరించారు. ప్రభుత్వం వెంటనే రైతాంగానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. -
అప్పుల బాధతో రైతు ఆత్మహత్య
శింగనమల: అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండల పరిధిలోని సంజీవపురంలో ఓ రైతు అప్పుల బాధతో ఆత్మహత్యకు పాల్పడిన ఘటన శనివారం చోటు చేసుకుంది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలివీ.. సంజీవపురం గ్రామానికి చెందిన నాగిరెడ్డి(65) వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇతనికి భార్య, ముగ్గురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు సంతానం. అందరికీ పెళ్లిళ్లు చేశారు. నాగిరెడ్డికి 12 ఎకరాల పొలం ఉండగా.. దాదాపు 10 బోర్లు వేయించాడు. ప్రస్తుతం రెండు బోర్లలో మాత్రమే నీరుంది. సాగు, కూతుళ్ల పెళ్లిళ్లకు రూ.10లక్షల వరకు అప్పు చేశాడు. గ్రామంలో అమరావతి ఎక్స్‌ప్రెస్ హైవే రోడ్డు నిర్మాణం సర్వే చేయగా నాగిరెడ్డికి సంబంధించిన 8 ఎకరాలు అందులో పోతోంది. నాగిరెడ్డి పేరిట 5.50 ఎకరాల భూమి ఉండగా.. మిగిలిన 6.50 ఎకరాలు కుమారులకు పంచిచ్చాడు. నాగిరెడ్డికి అనంతపురం ఏడీబీ బ్యాంక్‌లో రూ.లక్ష క్రాప్ లోను, ఇండియన్ బ్యాంక్‌లో రూ.60 వేలు బంగారుపై రుణం ఉంది. ఇతనికి ప్రభుత్వం ప్రకటించిన రుణమాఫీ రూ.19 వేలు వచ్చినట్లు బంధువుల ద్వారా తెలిసింది. భూమి హైవే రోడ్డుకు పోయిందనే బాధ నాగిరెడ్డి బ్యాంకులతో పాటు బయటి వ్యక్తుల వద్ద దాదాపు రూ.10 లక్షల వరకు అప్పు చేశాడు. ఇటీవల ప్రభుత్వం అమరావతి ఎక్స్‌ప్రెస్ రోడ్డు నిర్మాణానికి సర్వే చేపట్టింది. అందులో నాగిరెడ్డి భూమి 12 ఎకరాలలో 8 ఎకరాల వరకు పోతుందని రెవెన్యూ అధికారులు తేల్చి చెప్పారు. ఉన్న భూమి అంతా రోడ్డుకు పోతే.. అప్పులు ఎలా తీర్చాలోనని మదనపడ్డాడు. ఇదే సమయంలో రుణ దాతల నుంచి ఒత్తిళ్లు పెరగడంతో శనివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో క్రిమిసంహారక మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు గమనించి చికిత్స కోసం అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ కోలుకోలేక మరణించాడు. మృతుడి కుటుంబాన్ని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎంపీ అనంత వెంకటరామిరెడ్డి, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు ఆలూరి సాంబశివారెడ్డి పరామర్శించారు. నాగిరెడ్డి కుటుంబాన్ని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. -
'జగనన్న రాకకు.. వర్షం స్వాగతం పలికింది'
నంద్యాల: వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రకృతి ప్రేమికుడని, అదే చంద్రబాబు ప్రకృతి ద్వేషి అని వైఎస్ఆర్సీపీ రైతు విభాగం అధ్యక్షుడు ఎంవీఎస్ నాగిరెడ్డి అన్నారు. అనంతలో చంద్రబాబు పాదం మోపగానే కరువు తిష్టవేసిందని విమర్శించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రైతుల సమస్యలను పట్టించుకోకుండా.. చంద్రబాబు కుటిల రాజకీయాలు చేస్తున్నారని అన్నారు. మహానేత తనయుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నంద్యాల ఎన్నికల ప్రచారానికి రానున్న నేపథ్యంలో వరుణుడు స్వాగతం పలకడం శుభసూచకమని ఆనందం వ్యక్తం చేశారు. జగన్‌కు తిరుగులేదనడానికి ఇదే నిదర్శనమని అన్నారు. గుండ్రేవుల ప్రాజెక్టును చంద్రబాబు పూర్తిగా పక్కనబెట్టారని, హామీలను ఒక్కసారైనా పరిశీలించుకున్నారా? అని ప్రశ్నించారు. కేసీ కెనాల్లో చుక్క నీరు కూడా లేదని చెప్పారు. టీడీపీ ప్రభుత్వానివి మాటలు తప్పా.. చేతలు కనిపించవని అన్నారు. -
రాష్ట్రంలో రైతులు కష్టాల్లో ఉన్నారు
-
‘ఏపీని బజారున పడేసింది టీడీపీనే’
గుంటూరు: మూడేళ్లుగా వ్యవసాయం తీవ్ర సంక్షోభంలో ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతు విభాగం అధ్యక్షుడు నాగిరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని కరువు వెంటాడుతోందని అన్నారు. టీడీపీ అసమర్థ పాలన కారణంగా వ్యవసాయ రంగం తీవ్ర దుర్భక్ష పరిస్థితులు ఎదుర్కొంటోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి జిల్లాలోని పలు మండలాలు తీవ్ర కరువుతో అల్లాడుతున్నాయని వివరించారు. శనివారం ప్రారంభమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్లీనరీలో రైతుల సమస్యలపై నాగిరెడ్డి తీర్మానం ప్రవేశ పెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 'అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో ఉన్న మండలాలలన్నీ కరువు మండలాలుగా ప్రభుత్వమే ప్రకటించింది. ఇన్పుట్ సబ్సిడీ, ఇన్సూరెన్సు చెల్లించకుండా టీడీపీ ప్రభుత్వం మోసం చేసింది. పొలాల్లో పారుతుంది సాగునీరు కాదు.. టీడీపీ అవినీతి. రైతు రుణమాఫీ లేదు. ఎగువన ఉన్న తెలంగాణ ప్రభుత్వం ప్రాజెక్టులు కడుతుంటే ఇక్కడ టీడీపీ ప్రభుత్వం మాత్రం చోద్యం చూస్తోంది. రైతు రుణమాఫీ కాదు కదా .. కనీసం వడ్డీ మాఫీ కూడా కాలేదు. మూడేళ్లతో పోల్చుకుంటే ఖర్చులు తీవ్రంగా పెరిగాయి. కానీ రైతుకు మధ్దతు ధర పెరగలేదు' అని నాగిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. 5వేల కోట్లతో ఇన్పుట్ సబ్సిడీ ఏర్పాటు చేస్తామని చెప్పి ప్రభుత్వం దారుణంగా మోసం చేసిందన్నారు. బేషరతుగా రైతు రుణాలు మాఫీ చేస్తామని చెప్పిన చంద్రబాబు తాను అసలు ఆ మాటే చెప్పలేదని మాట మార్చారని ధ్వజమెత్తారు. బంగారంపై తీసుకున్న రుణాలు మాఫీ చేస్తామని చెప్పి ఇప్పడు ఒక్క పైసా కూడా మాఫీ చేయలేదని తీర్మానం సందర్భంగా గుర్తు చేశారు. రైతులకు సంబంధించి ప్రతి అంశంలో మోసమే చేశారు. రైతాంగ చరిత్రలో ల్యాండ్ పూలింగ్, ల్యాండ్ అక్విజిషన్, ఇనాం భూముల స్వాధీనం, రికార్డుల మార్పు, తుపానుల పేరుతో రికార్డుల మాయంవంటివన్నీ కూడా ప్రభుత్వానికి సంబంధించిన చీకటి అధ్యాయం అని మండిపడ్డారు. అన్నపూర్ణగా పిలవబడే ఆంధ్రప్రదేశ్‌ను బజారున పడేసిన టీడీపీకి బుద్ధిచెప్పి, రాబోయే రోజుల్లో రైతులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. -
‘ఎవరిని మోసం చేయటానికి ఈ గొప్పలు?’
అవనిగడ్డ(కృష్ణా): ఏపీ ప్రభుత్వంపై వైఎస్సార్సీపీ రైతువిభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఎంవీఎస్‌నాగిరెడ్డి మండిపడ్డారు. ఈ ఏడాది దేశంలో ఆహార ధాన్యాలు, పప్పు ధాన్యాల ఉత్పత్తి పెరిగి 8.5 శాతం వృద్ధిరేటు సాధించామని కేంద్రం ప్రకటిస్తే, రాష్ట్రంలో మాత్రం 14 శాతం వృద్ధిరేటు సాధించామని రాష్ట్ర ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటోందని నాగిరెడ్డి విమర్శించారు. పదిలక్షల ఎకరాల్లో సాగు పడిపోయి, పప్పుధాన్యాల ఉత్పత్తి దారుణంగా తగ్గితే 14శాతం వృద్ధి రేటు ఎలా సాధ్యమంటూ ప్రశ్నించారు. అవనిగడ్డలో పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేనివిధంగా రాష్ట్రంలో నెలకొన్న కరువు నెలకొని ఉంటే 14 శాతం వృద్ధిరేటు సాధించామని గొప్పలు చెప్పుకోవడం ఎవరిని మోసగించడానికని ప్రశ్నించారు. మినుము పంట సాగుచేసిన నష్టపోయిన రైతులకు ఇన్సూరెన్స్, ఇన్పుట్ సబ్సిడీలలో ఒకటే ఇస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించడం సిగ్గుచేటన్నారు. ఇన్సూరెన్స్ అనేది కంపెనీలు చెల్లించేవని, ఇన్పుట్ సబ్సిడీ అనేది రైతులు తీవ్రంగా నష్టపోయినపుడు తరువాత పంట వేసుకునేందుకు విత్తనాలు, ఎరువుల కోసం ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ అన్నారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి ఈ విధంగా ప్రకటించలేదన్నారు. తెలంగాణలో సాగును పెంచేందుకు, రైతులను ప్రోత్సహించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నో పథకాలు తీసుకొస్తుంటే, మన ముఖ్యమంత్రి మాత్రం రైతు నోట్లో మట్టికొట్టే కార్యక్రమాలు చేపడుతున్నారని నాగిరెడ్డి ఎద్దేవా చేశారు. మిర్చి, పసుపుకు క్వింటాల్‌కు రూ.1,500 బోనస్ ధర చెల్లిస్తామని, ఇందుకోసం వీఆర్వోలతో ధృవీకరణ పత్రాలు తీసుకురావాలని నిబంధనలు పెట్టడం దారుణమన్నారు. ఈ నిర్ణయం టీడీపీ వాళ్లకు లబ్ధిచేకూరేదిగాను, పెద్ద కుంభకోణానికి దారితీసే చర్యగా ఆయన అభివర్ణించారు. గిట్టుబాటు ధర కల్పించాలని, నష్టపోయిన రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి గుంటూరు మిర్చియార్డులో చేపట్టే రైతు దీక్షకు పెద్ద ఎత్తున తరలి రావాలని రైతులను కోరారు. -
ప్రసాదరాజు దీక్షకు రోజా సంఘీభావం
నరసాపురం: తుందుర్రు మెగా ఆక్వాపార్క్‌ను సముద్రతీరానికి తరలించాలన్న డిమాండ్‌తో మాజీ ఎమ్మెల్యే ప్రసాదరాజు చేపడుతున్న దీక్ష రెండో రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే రోజా, రైతు విభాగం అధ్యక్షుడు నాగిరెడ్డి ప్రసాదరాజు దీక్షకు సంఘీభావం తెలిపారు. శనివారం పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం చేరుకున్న రోజా మాట్లాడుతూ.. చంద్రబాబుకు విలాసాల మీద ఉన్న శ్రద్ధ ప్రజాసమస్యల మీద లేదన్నారు. ఆక్వాపార్క్‌ను సముద్రతీరానికి తరలించకపోతే బాబుకు ప్రజలే బుద్ధి చెబుతారని అన్నారు. మంత్రులు గన్మెన్లు లేకుండా తుందుర్రుకు వస్తే ప్రజల ఆందోళన తీవ్రత అర్థమౌతుందన్నారు. మొగల్తురు ఘటనలో ఐదుగురు చనిపోతే ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. కోట్ల రూపాయల లంచాలు తీసుకోబట్టే యాజమాన్యానికి కొమ్ముకాస్తున్నారని ఆరోపించారు. -
ప్రసాదరాజు దీక్షకు రోజా సంఘీభావం
-
విద్యుదాఘాతానికి టెలిఫోన్ లైన్ మన్ బలి
హిందూపురం అర్బన్ : విద్యుదాఘాతానికి టెలిఫోన్ లైన్ మన్ నాగిరెడ్డి (50) సోమవారం బలయ్యాడు. వివరాలు..మండలంలోని నక్కలపల్లికి చెందిన నాగిరెడ్డి టెలిఫోన్ లైన్ మన్ గా పనిచేస్తున్నాడు. ఉద్యోగరీత్యా హిందూపురంలో స్థిరపడ్డాడు. సోమవారం శాంతీటాకీస్ ఏరియాలో టెలిఫోన్లు లైన్లు మరమ్మతు చేస్తున్నాడు. సమీపంలోని ఇంటిపైకి ఎక్కి కేబుల్‌ను అవతలికి విసిరేందుకు ప్రయత్నిస్తుండగా ప్రమాదవశాత్తు కేబుల్ 33 కేవీ హైటెక్ష¯ŒS తీగలకు తగిలింది. చేతిలోనే కేబుల్ పట్టుకుని ఉండగా అదే సమయంలో విద్యుత్ ప్రసరించింది. విద్యుత్ షాక్‌కు గురై అక్కడే పడిపోయాడు. స్థానికులు గమనించి విద్యుత్ సరఫరాను నిలిపివేయించి, బాధితుడిని చికిత్స కోసం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వైద్యులు పరిశీలించి చూడగా అప్పటికే అతను చనిపోయినట్లు నిర్ధారించారు. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరు అయ్యారు. టెలిఫో¯ŒS ఎక్సేంజ్ కార్యాలయంలో అందరితో సన్నిహితంగా ఉంటూ మంచి వ్యక్తిగా పేరున్న నాగిరెడ్డి మరణించడాన్ని సిబ్బంది జీర్ణించుకోలేకపోతున్నారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. కేసును వన్ టౌన్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
సొమ్ములిస్తేనే రాయితీలిస్తారా ?
ఇలా అయితే రైతు వ్యవసాయం చేయగలడా... వైఎస్సార్సీపీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఎంవీఎస్ నాగిరెడ్డి అమలాపురం : ‘యాంత్రీకరణపై ఇచ్చే రాయితీల కోసం అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులకు రైతులు సొమ్ములివ్వాల్సి వస్తోంది. ఇలా అయితే రైతు వ్యవసాయం చేయగలడా? పైగా టీడీపీకి చెందిన బినామీలు రైతుల పేరుతో యంత్రాలను తీసుకుంటున్నారు. కోనసీమలో పర్యటిస్తే పలుచోట్ల రైతులు ఇదే విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. ఇది చాలా అన్యాయం. ఇంత దిగజారుడుతనం గతంలో ఎప్పుడూ చూడలేదు’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఎం.వి.ఎస్.నాగిరెడ్డి విమర్శించారు. అమలాపురం శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ మామిడికుదురులో తమ మండలానికి పది పవర్టిల్లర్లు వస్తే అవి ఎవరికి చేరాయో తెలియడం లేదని, యాంత్ర పరికరాలకు ఇచ్చే రాయితీల్లో ప్రజాప్రతినిధులు వాటా అడుగుతున్నట్టు రైతులు ఫిర్యాదు చేశారన్నారు. జిల్లాలో రైతులకు పెట్టుబడి రాయితీగా ఒక్క రూపాయి కూడా విడుదల కాలేదన్నారు. సమయానికి సాగునీరు విడుదల చేయకపోవడం, డ్రైనేజీ వ్యవస్థ అధ్వానంగా ఉండడంతో రైతులు సాగు చేయని పరిస్థితి లేనందునే కోనసీమలో 50 వేల ఎకరాల్లో వరి రైతులు ఖరీఫ్ సాగు చేయలేదని నాగిరెడ్డ ఆరోపించారు. పార్టీ సీజీసీ సభ్యుడు కుడుపూడి చిట్టబ్బాయి, పి.గన్నవరం కో ఆర్డినేటర్ కొండేటి చిట్టిబాబు, రైతు విభాగం ఆర్గనైజింగ్ ప్రధాన కార్యదర్శి, ఐదు జిల్లాల ఇ¯ŒSచార్జి కొవ్వూరి త్రినా«ధ్‌రెడ్డి, రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి రెడ్డి రాధాకృష్ణ, రాష్ట్ర జాయింట్ సెక్రటరీ పెంకే వెంకట్రావు, రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు జున్నూరి వెంకటేశ్వరరావు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి మిండగుదిటి మోహన్, రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి కొర్లపాటి కోటబాబు, జిల్లా బీసీసెల్ అధ్యక్షుడు మట్టపర్తి మురళీకృష్ణ, విద్యార్థి విభాగం అధ్యక్షుడు జక్కంపూడి కిరణ్, డీసీసీబీ మాజీ డైరెక్టర్ జున్నూరి బాబి, పట్టణ, ఉప్పలగుప్తం మండల పార్టీ అధ్యక్షులు మట్టపర్తి నాగేంద్ర, బద్రి బాబ్జి, పార్టీ జిల్లా కార్యదర్శి నిమ్మకాయల హనుమంత శ్రీనివాస్, పార్టీ నాయకులు సూదా గణపతి, చిక్కం బాలయ్య, బొక్కా శ్రీను, జంపన బాపిరాజులు పాల్గొన్నారు. -
అప్పుల బాధతో రైతు మృతి
చిలమత్తూరు : అప్పుల బాధతో రైతు మతి చెందిన సంఘటన చిలమత్తూరు బీసీ కాలనీలో ఆదివారం చోటు చేసుకుంది. వివరాలు.. హిందూపురం మండలం కొల్లకుంటకు చెందిన నాగిరెడ్డి (56) తనకున్న ఐదెకరాల పొలంలో వేరుశనగ పంట సాగు చే శాడు. బ్యాంకులు తదితర చోట్ల సుమారు రూ.5 లక్షలు అప్పు చేశాడు. దీంతో అప్పుల బాధ తీర్చేదెలా అని తరచూ మానసిక ఒత్తిడికి గురయ్యే వాడని బంధువులు తెలిపారు. గతంలో గుండెపోటు రాగా బెంగళూర్ ఆస్పతిలో చికిత్స చేయించుకున్నాడు. సొంత పనుల నిమిత్తం శనివారం చిలమత్తూరుకు వచ్చాడు. తన స్నేహితుడు బాబు ఇంట్లో భోజనం చేసి అక్కడే విశ్రాంతి తీసుకున్నాడు. కాగా ఉదయం మతి చెందినట్లు స్థానికులు గుర్తించారు. మతుడికి భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. -
అమ్మాయిల వేషంలో నయీం తిరిగాడు
-
నయీం బెడ్ రూంలో సిట్ సోదాలు
-
ఈ-పాస్‌బుక్ విధానంతో రైతులకు తీవ్రనష్టం
హైదరాబాద్ : పట్టాదారు పాసు పుస్తకాల రద్దు నిర్ణయం సరైంది కాదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతు విభాగం అధ్యక్షుడు ఎంవీఎస్ నాగిరెడ్డి అభిప్రాయపడ్డారు. ఆయన సోమవారమిక్కడ విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ ఈ-పాస్బుక్లంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొత్త విధానాన్ని తీసుకొస్తున్నారని, ఈ విధానంతో రైతులకు తీవ్ర నష్టం జరుగుతుందని అభ్యంతరం వ్యక్తం చేశారు. పాస్ పుస్తకాల స్థానంలో ప్రవేశపెడుతున్న ఈ-పాస్‌బుక్ విధానంతో ఎలాంటి ఫలితం ఉండదన్నారు. రైతులకు తెలియకుండా వారి భూములు మరొకరికి బదలాయించే అవకాశం ఉంటుందని నాగిరెడ్డి పేర్కొన్నారు. అవగాహన లేకుండా జీవోలు జారీ చేయటం సరైన పద్ధతి కాదన్నారు. కనుక తక్షణమే ఈ పాస్‌బుక్ విధానాన్ని ఉపసంహరించుకోవాలని నాగిరెడ్డి డిమాండ్ చేశారు. -
'టీడీపీ నేతలు భయపడుతున్నారు'
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్పడుతున్న అనైతిక రాజకీయ కార్యకాలపాలకు నిరసనగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన 'సేవ్ డెమొక్రసీ' కార్యక్రమం విజయవంతం కావడంతో అధికార పార్టీ నేతలు భయపడుతున్నారని వైఎస్ఆర్ సీపీ రైతు విభాగం అధ్యక్షుడు నాగిరెడ్డి అన్నారు. టీడీపీ నాయకులు వ్యక్తిగత దూషణలతో అడ్డగోలుగా విమర్శిస్తున్నారని, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని నోటికొచ్చినట్టు విమర్శించడం ప్రజాస్వామ్యమా అని ప్రశ్నించారు. పార్టీ ఫిరాయింపులు ఏ రాష్ట్రంలో జరిగినా తప్పేనని నాగిరెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో రైతాంగం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిందని, లక్షలాది మంది రైతులు వలసబాట పట్టారని చెప్పారు. -
ఈసీ నాగిరెడ్డిపై ఎమ్మెల్యే రామచంద్రారెడ్డి ఆగ్రహం
హైదరాబాద్: ఎలక్షన్ కమిషన్ నాగిరెడ్డిపై బీజేపీ ఎమ్మెల్యే రామచంద్రారెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. గులాబీ చొక్కా వేసుకోమంటూ నాగిరెడ్డిపై రామచంద్రారెడ్డి బుధవారం ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఈ సమయంలో కాంగ్రెస్ నేత వి.హనుమంతురావు ఆయనను వారించారు. దాంతో వీహెచ్‌పైనా కూడా రామచంద్రారెడ్డి రుసరుసలాడినట్టు సమాచారం. రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తిని గౌరవించాలని వీహెచ్ ఈ సందర్భంగా సూచించినట్టు తెలిసింది. -
కరెంటుషాక్‌తో ఇద్దరు రైతులు మృతి
పెద్దారవీడు: ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలం గొబ్బూరులో మంగళవారం విషాదం నెలకొంది. పొలంలో పైపులు నేలలో తవ్వి వేస్తుండగా ప్రమాదవశాత్తూ ఎర్త్ వైరు తగిలి ఇద్దరు రైతులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు గొబ్బూరు గ్రామానికి చెందిన దొండపాటి అనిల్(35), వెన్నా నాగిరెడ్డి(40)గా గుర్తించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
వ్యవసాయం సంక్షోభంలో ఉంటే ప్రగల్భాలా?
వైఎస్సార్సీపీ రైతు విభాగం అధ్యక్షుడు నాగిరెడ్డి సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వ్యవసాయ రంగం గత 30 ఏళ్లలో ఎన్నడూ లేనంత సంక్షోభంలో కూరుకుపోయి ఉంటే ముఖ్యమంత్రి చంద్రబాబు దావోస్‌కు వెళ్లి ఇక్కడ వ్యవసాయం గొప్పగా ఉందని ప్రగల్భాలు పలకడం దారుణమని వైఎస్సార్సీపీ రైతు విభాగం అధ్యక్షుడు ఎంవీఎస్ నాగిరెడ్డి ధ్వజమెత్తారు. ఆయన సోమవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో 42.5 లక్షల హెక్టార్లలో పంటలు సాగయితే అందులో 16.5 నుంచి 17 లక్షల హెక్టార్లలో వరి సాగు చేస్తారని తెలిపారు. అలాంటిది ఈ ఏడాది 2 ల క్షల హెక్టార్లలో నీరు లేక సాగు చేయలేదని, మరో 2 లక్షల హెక్టార్లలో పంట ఎండిపోయి పాక్షిక దిగుబడులు వచ్చాయని, ఇంకో 2 లక్షల హెక్టార్లలో పంట తుఫాను వల్ల దెబ్బతిన్నదని పేర్కొన్నారు. సాగునీటి సరఫరాలో టీడీపీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని దుయ్యబట్టారు. రాష్ట్రంలో పంటల సాగులేక రైతులు, వ్యవసాయ కార్మికులు వలసవెళ్తున్నారని నాగిరెడ్డి వివరించారు. రాష్ట్రంలో ఇంత దారుణంగా ఉంటే బ్రహ్మాండంగా ఉందని దావోస్‌లో ముఖ్యమంత్రి ఎలా చెప్పుకుంటారని ప్రశ్నించారు. చంద్రబాబు ఇప్పటికైనా తన ఆలోచనా విధానాన్ని మార్చుకుని రైతులను ఆదుకునేందుకు కృషి చేయాలని ఆయన సూచించారు. -
'బాబు మాటలకు, చేతలకు పొంతన లేదు'
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాటలకు, చేతలకు పొంతన లేదని వైఎస్ఆర్ సీపీ రైతు విభాగం అధ్యక్షుడు నాగిరెడ్డి విమర్శించారు. రైతాంగం పూర్తిగా సంక్షోభంలో మునిగిపోయిన ఈ తరుణంలో.. స్విజ్జర్లాండ్ పర్యటనలో రాష్ట్ర వ్యవసాయం బాగుందని ముఖ్యమంత్రి అబద్ధాలు చెప్పారన్నారు. ఈ విషయంపై చంద్రబాబు ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలని నాగిరెడ్డి హితవు పలికారు. కృష్ణా, గోదావరి డెల్టాలు ఎండిపోయి రైతాంగం తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోందని నాగిరెడ్డి తెలిపారు. రైతాంగం ఎదుర్కోంటున్న సమస్యలపై బాబుకు స్పష్టత లేకపోతే.. టీడీపీకి ఓటేసిన రైతులనైనా అడిగి తెలుసుకోవాలని ఆయన సూచించారు. లక్షలాది మంది రైతులు పొట్ట చేత పట్టుకొని పొరుగురాష్ట్రాలకు వలస వెళ్తున్న విషయాన్ని నాగిరెడ్డి గుర్తు చేశారు. -
'ఎన్నికల్లో ప్రజలు ప్రలోభాలకు గురికావద్దు'
హైదరాబాద్ : ఎన్నికలు అనేవి అవినీతి అరికట్టడానికి తొలిమెట్టు అని తెలంగాణ ఎన్నికల సంఘం కమిషనర్ నాగిరెడ్డి స్పష్టం చేశారు. శనివారం హైదరాబాద్‌లో నాగిరెడ్డి మాట్లాడుతూ... ప్రజల్లో అవినీతిపై చైతన్యరాహిత్యం ఉందని... అందువల్లే ఆ అంశాన్ని ముట్టుకోలేకపోతున్నామన్నారు. ఎన్నికల్లోనే అవినీతి జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు. ప్రలోభాలకు గురికావద్దు అని ప్రజలకు ఈ సందర్భంగా నాగిరెడ్డి హితవుపలికారు. అలాగే ప్రతి ఒక్కరు ఓటుహక్కు వినియోగించుకోవాలని ప్రజలకు నాగిరెడ్డి సూచించారు. -
సంక్షోభంలో గోదావరి డెల్టా!: నాగిరెడ్డి
రాజమండ్రి: వ్యవసాయ రంగాన్ని చంద్రబాబు ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర రైతు నాయకుడు నాగిరెడ్డి మండిపడ్డారు. ఖరీఫ్‌లో దిగుబడి 80లక్షల నుంచి 50లక్షలకు పడిపోయిందని తెలిపారు. 'ప్రభుత్వ తీరుతో గోదావరి డెల్టా సంక్షోభంలో పడుతుంది. పోలవరం రాకుంటే ఖరీఫ్‌లో ఒక్క ఎకరాకు నీరిచ్చే పరిస్థితి లేదు. రైతు సంఘాలతో చంద్రబాబు మాట్లాడలేదు. స్వామినాథన్ కమిటీ సిఫారసులు ఇప్పటి వరకు అమలు చేయలేదు. 2009లో గోదావరి డెల్టాకు దారుణమైన పరిస్థితి ఏర్పడింది. వైఎస్ఆర్ చాకచక్యంగా వ్యవహరించి ఒక్క ఎకరా ఎండిపోకుండా నీరిచ్చారు. అదే విధానాన్ని బాబు ప్రభుత్వం ఎందుకు అమలు చేయడం లేదు' అని నాగిరెడ్డి అన్నారు. -
‘గ్రేటర్’ ఎన్నికలకు వేళాయె..
► నాలుగు రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ ► రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వి.నాగిరెడ్డి వెల్లడి ► ఎన్నికల సంఘం వెబ్‌పోర్టల్ నుంచి ఓటరు స్లిప్‌లు ► రాజకీయ పార్టీలు ప్రత్యేక మేనిఫెస్టోలు రూపొందించుకోవాలి ► ఎన్నికల నిర్వహణకు లక్ష మంది సిబ్బంది ► నేడు రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) ఎన్నికలకు నాలుగు రోజుల్లో నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వి.నాగిరెడ్డి వెల్లడించారు. గ్రేటర్ ఎన్నికలకు తాము సిద్ధంగా ఉన్నామని, అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. ప్రభుత్వం వార్డుల రిజర్వేషన్లు ప్రకటించడమే తరువాయి అని, ఆ తర్వాత ఎన్నికల ప్రక్రియ చకచకా సాగిపోతుందని చెప్పారు. సోమవారం ఆయన ఎన్నికల సాధారణ పరిశీలకులు, వ్యయ పరిశీలకులతో ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం జీహెచ్ఎంసీ కమిషనర్ బి.జనార్దన్‌రెడ్డితో కలసి మీడియాతో మాట్లాడారు. హైకోర్టు ఆదేశాల మేరకు జనవరి నెలాఖరులోగా ఎన్నికలు జరగాల్సి ఉందని, అందుకు అనుగుణంగా అన్ని ఏర్పాట్లు దాదాపుగా పూర్తయ్యాయని నాగిరెడ్డి చెప్పారు. మూడు నెలలుగా ఎన్నికల పనుల్లో నిమగ్నమై ఉన్నామని, నాలుగు రోజుల్లో నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉందని చెప్పారు. నోటిఫికేషన్ నుంచి పోలింగ్‌కు దాదాపు నెల రోజులు సమయం ఉంటుందని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. జనవరిలోగా ఎన్నికలు నిర్వహించలేని పరిస్థితి వస్తే హైకోర్టుకు విషయాన్ని నివేదించాల్సి ఉంటుందన్నారు. పోలింగ్ శాతం పెంపునకు కృషి.. సాధారణ ఎన్నికలు, జిల్లాల్లోని స్థానిక సంస్థల పోలింగ్‌తో పోలిస్తే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోలింగ్ శాతం తక్కువని, ఈసారి దానిని పెంచేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. అందుకుగానూ విస్తృత ప్రచార కార్యక్రమాలతోపాటు ఇతరత్రా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఎన్నికల సంఘం వెబ్‌పోర్టల్ నుంచే ఓటరుస్లిప్‌లు పొందే వెసులు బాటు అందుబాటులోకి తెచ్చామన్నారు. (ఠీఠీఠీ.్టట్ఛఛి.జౌఠి.జీ) వెబ్సైట్ నుంచి వాటిని పొందవచ్చన్నారు. వార్డులు, పోలింగ్ కేంద్రాల వారీగా జాబితాను పోర్టల్‌లో ఉంచామని, జాబితాలో పేరు లేనివారు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. కష్టమనుకోకుండా నగర పౌరులు ఓటేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రత్యేక మేనిఫెస్టో ఉండాలి.. జీహెచ్ఎంసీలో చేపట్టబోయే పనులకు సంబంధించి రాజకీయ పార్టీలు ప్రత్యేక మేనిఫెస్టో రూపొందించుకుంటే మంచిదని నాగిరెడ్డి సూచించారు. తద్వారా ఏం చేయవచ్చో స్పష్టత ఉంటుందన్నారు. ఎన్నికల ప్రక్రియను విజయవంతంగా నిర్వహించేందుకు లక్ష మంది సిబ్బందిని నియమించనున్నట్టు చెప్పారు. ఎన్నికల విధులకు గైర్హాజర య్యే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఓటర్ల జాబితాపై 3,91,369 క్లెయిమ్స్ రాగా, వాటిలో 2,90,942 దరఖాస్తులు ఆమోదించామని జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్‌రెడ్డి తెలిపారు. 46,612 దర ఖాస్తులు తిరస్కరించామని, మరో 54,365 దరఖాస్తులు పరిశీలనలో ఉన్నాయన్నారు. మరోవైపు మంగళవారం రాజకీయ పార్టీల ప్రతినిధులతోనూ సమావేశానికి ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేసింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జీహెచ్ఎంసీకి జరుగుతున్న తొలి ఎన్నికలు కావడంతో ఎన్నికల సంఘం ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లు చేస్తోంది. విలేకరుల సమావేశంలో జీహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్(ఎన్నికలు) సురేంద్రమోహన్, జోనల్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్, ఎన్నికల సంఘం కార్యదర్శి అశోక్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
వ్యవసాయ రంగం పూర్తి సంక్షోభంలో ఉంది
-
రాయలసీమకు అన్యాయం: నాగిరెడ్డి
కర్నూలు: పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి రాయలసీమకు న్యాయం చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత నాగిరెడ్డి డిమాండ్ చేశారు. పట్టిసీమకు అధిక నిధులు కేటాయించి రాయలసీమకు అన్యాయం చేస్తున్నారని చెప్పారు. పట్టిసీమవల్ల రాయలసీమకు ఒరిగేదేమీ లేదని అన్నారు. పట్టిసీమకు ఇచ్చే నిధులు ఇప్పటికే పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులకు ఇస్తే రాయలసీమ సస్యశ్యామలం అవుతుందని నాగిరెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. -
'ఆ మద్దతు ధర ఏ మూలకు సరిపోతుంది'
హైదరాబాద్: రైతులకు ముష్టి వేసినట్లుగా కేంద్ర ప్రభుత్వం మద్దతు ధరలు పెంచిందని వైఎస్సార్సీపీ నేత నాగిరెడ్డి అన్నారు. క్వింటాల్ వరికి పెంచిన రూ.50, వేరు శెనగకు రూ.30, పత్తికి రూ.50 ఏ మూలకు సరిపోతాయని ప్రశ్నించారు. బీజేపీకి భాగస్వామ్య పక్షమైన టీడీపీ మద్దతు ధర పెంచాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఎందుకు కోరడం లేదని ఆయన ప్రశ్నించారు. అనంతపురంలో వేరు శెనగ విత్తనాల పంపిణీ కోసం రైతులు రోడ్లెక్కారని, ఇలాంటి పరిస్థితి ప్రభుత్వ వైఫల్యం వల్లే వచ్చిందని ఆరోపించారు. ఏపీ సర్కార్‌కు విత్తనాలు సరఫరా చేయడం చేతకాక ప్రైవేట్ మార్కెట్లో కొనుక్కోమంటుందని, అది సిగ్గుచేటని విమర్శించారు. -
తెలంగాణ’ఎన్నికల కమీషనర్’తో ఫేస్ టు ఫేస్
-
‘పాస్‌పోర్టు’కు సంప్రదించాల్సిన నంబర్ ఇదే
సాక్షి, హైదరాబాద్: పాస్‌పోర్టు దరఖాస్తుదారుల సహాయార్థం స్పెషల్ బ్రాంచ్ అధికారులు 040-27852606 నంబర్‌ను కేటాయించారు. పాస్‌పోర్టు విచారణలపై అధికారుల దర్యాప్తు తీరుతెన్నులను సోమవారం స్పెషల్ బ్రాంచ్ జాయింట్ పోలీసు కమిషనర్ నాగిరెడ్డి మీడియాకు వెల్లడించారు. -
ఆ విషయం ముఖ్యమంత్రైన మీకు తెలియదా?
-
ప్రపంచానికే పాఠాలు చెప్పినతను ఏడీ..?!
-
ఇది రైతుల్ని మభ్య పెట్టడం కాదా ?
-
పెను సంక్షోభంలో ఏపీ రైతులు
ఆంధ్రప్రదేశ్ రైతులు తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయారని వైఎస్ఆర్సీపీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఎంవీఎస్ నాగిరెడ్డి అన్నారు. ఖరీఫ్ సీజన్ ముగిసిపోతున్నా, ఇప్పటికీ లక్షలాది ఎకరాలు సాగుకు నోచుకోలేదని ఆయన చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో్ ప్రభుత్వం ఏర్పడి నెలలు గడుస్తున్నా ఇంతవరకు రుణమాఫీ జరగలేదని, కనీసం రీషెడ్యూల్ కూడా అవ్వలేదని అన్నారు. రైతులకు మీరు చేసే న్యాయం ఇదేనా అని ఆయన ప్రశ్నించారు. రైతులు పండగ చేసుకుంటున్నారని మంత్రులు అనడం దారుణమని మండిపడ్డారు. ఆత్మవంచన వద్దు.. ఆత్మవిమర్శ చేసుకోవాలని ప్రభుత్వ పెద్దలకు నాగిరెడ్డి సూచించారు. -
పెను సంక్షోభంలో ఏపీ రైతులు
-
''రుణమాఫీ కమిటీ వేసి రైతుల్ని మోసం చేసారు''
-
కేసీఆర్ టీం రెడీ!
తెలంగాణ సీఎస్‌గా రాజీవ్‌శర్మ, డీజీపీగా అనురాగ్ శర్మ.. హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా టీపీ దాస్ * ఐఏఎస్, ఐపీఎస్‌ల కేటాయింపు పూర్తయ్యాకే ఉత్తర్వులు * కొందరి రిలీవింగ్, డెప్యుటేషన్లకు కేంద్రం ఆమోదం తప్పనిసరి *మోడీ ప్రమాణ స్వీకారం తర్వాతే పరిశీలన సాక్షి, హైదరాబాద్: తెలంగాణకు కాబోయే ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తన కార్యాలయ బృందం కూర్పు ను పూర్తి చేశారు. అధికారుల కేటాయింపుకు సంబంధించిన కసరత్తు మాత్రమే మిగిలింది. ప్రత్యేకించి కేం ద్ర సర్వీసు అధికారుల పంపిణీకి ప్రధాని ఆమోదం, కేంద్ర మంత్రిత్వ శాఖల నుంచి కొందరి రిలీవింగ్, డెప్యుటేషన్లకు కేంద్రం ఆమోదం వంటి కసరత్తుకు సమయం పట్టే అవకాశాలున్నాయి. ఇవన్నీ పూర్తయ్యాక అధికారికంగా ఉత్తర్వులు జారీ కానున్నాయి. చురుగ్గా వ్యవహరించిన రాజీవ్‌శర్మ రాష్ట్ర తొలి ప్రధాన కార్యదర్శి(సీఎస్)గా రాజీవ్‌శర్మ నియుక్తులు కానున్నారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన 1982 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన ఈయన మన రాష్ట్ర కేడర్లోనే ఉన్నారు. ప్రస్తుతం కేంద్ర హోం శాఖలో అదనపు కార్యదర్శిగా పనిచేస్తున్నారు. రాష్ట్ర విభజన వ్యవహారాల్లోనూ చురుగ్గా వ్యవహరించారు. సీఎస్‌గా రాజీవ్శర్మకన్నా 1979 బ్యాచ్‌కు చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి చందనాఖన్ పేరు బలంగానే వినిపించినా కేసీఆర్ చివరలో మనసు మార్చుకుని రాజీవ్‌శర్మ వైపే మొగ్గు చూపారు. పైగా ఆమె నియామకానికి కొన్ని సాంకేతిక కారణాలు అడ్డుపడవచ్చునని పలువురు ఐఏఎస్ అధికారులు కేసీఆర్‌కు చెప్పినట్లు తెలిసింది. నాగిరెడ్డి, నర్సింగరావు పేర్లను కూడా పరిశీలించినా.. వారికి ఇప్పుడప్పుడే సీఎస్ కేడర్ వచ్చే అవకాశం లేదని తెలుసుకుని నర్సింగరావును తన కార్యాలయ ముఖ్య కార్యదర్శిగా ఎంపిక చేసుకున్నారు. నాగిరెడ్డికి ఇంకేదైనా మంచి పోస్టు ఇవ్వాలని భావిస్తున్నారు. ఇక రాష్ట్ర తొలి డీజీపీగా అనురాగ్‌శర్మ పేరు ఖరారైంది. ఈయన కూడా 1982 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. 1979 బ్యాచ్‌కు చెందిన టీపీదాస్, అరుణ బహుగుణ పేర్లను కూడా కే సీఆర్ పరిశీలించారు. అయితే ప్రస్తుతం పోలీస్ అకాడమీ డీజీగా ఉన్న అరుణ బహుగుణ డీజీపీ పోస్టుపై పెద్దగా ఆసక్తి కనబర్చలేదని సమాచారం. ఇక టీపీ దాస్ కూడా సీనియరే అయినందున ఆయనను తెలంగాణ హోం ముఖ్యకార్యదర్శిగా కొనసాగిస్తే సరిపోతుందనే అభిప్రాయానికి వచ్చారు. హైదరాబాద్ కమిషనర్‌గా మహేందర్‌రెడ్డి ఉమ్మడి రాజధాని హైదరాబాద్ నగర కమిషనర్‌గా ప్రస్తుతం రాష్ట్ర ఇంటలిజెన్స్ చీఫ్‌గా వ్యవహరిస్తున్న 1986 బ్యాచ్ ఐపీఎస్ ఎం.మహేందర్‌రెడ్డిని ఎంపిక చేసుకున్నారు. ఈయన నియామకంపై ఆంధ్రప్రదేశ్ కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబుకు కూడా పెద్దగా అభ్యంతరాలు ఉండబోవని భావిస్తున్నారు. ఇంటెలిజెన్స్ చీఫ్‌గా ఐజీ శివధర్‌రెడ్డి, యాంటీ నక్సలైట్ వింగ్ ఎస్ఐబీ చీఫ్‌గా సజ్జనార్ సేవలను వినియోగించుకోవాలని కే సీఆర్ నిర్ణయించారు. 1994 బ్యాచ్‌కు చెందిన శివధర్‌రెడ్డి ప్రస్తుతం విశాఖపట్నం సీపీగా ఉన్నారు. కేంద్ర హోం శాఖలోనే పనిచేస్తున్న గోపాల్‌రెడ్డిని కూడా తన బృందంలోకి ఎంపిక చేసుకున్నారు. తన ఓఎస్డీగా రాజశేఖర్‌రెడ్డిని కేసీఆర్ ఇప్పటికే ఖరారు చేసుకున్నారు. అయితే సీఎస్, డీజీపీ పేర్లను మాత్రం గవర్నర్‌కు మౌఖికంగా తెలిపినట్లు తెలిసింది. అధికారిక కసరత్తు బాకీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నడుమ ఐఏఎస్, ఐపీఎస్ తదితర కేంద్ర సర్వీసు అధికారుల పంపిణీని ప్రత్యూష్ సిన్హా కమిటీ ఇంకా పూర్తిచేయలేదు. ఈ కమిటీ ప్రతిపాదనలపై ప్రధాని మోడీ సంతకం చేశాక గానీ కసరత్తు పూర్తయ్యే అవకాశం లేదు. సోమవారం మోడీ ప్రమాణస్వీకారం పూర్తయ్యాకే ఆ ఫైల్ పరిశీలనకు వస్తుంది. పైగా ప్రస్తుతం కేంద్ర హోంశాఖలో పనిచేస్తున్నందున రాజీవ్‌శర్మ, గోపాలరెడ్డిలను కేంద్ర ప్రభుత్వం రిలీవ్ చేయాల్సి ఉంటుంది. సీఎంవో కార్యదర్శిగా ఎంపిక చేసిన గోపాలరెడ్డి మధ్యప్రదేశ్ కేడర్‌లో ఉన్నారు. ఈయన్ని తెలంగాణకు డెప్యుటేషన్‌పై పంపించటానికి కూడా కేంద్ర ఆమోదం తప్పనిసరి. అలాగే ఓఎస్డీగా నియమితులయ్యే రాజశేఖర్‌రెడ్డి ప్రస్తుతం హైదరాబాద్‌లోనే ప్రావిడెంట్ ఫండ్ ప్రాంతీయ కమిషనర్‌గా పనిచేస్తున్నారు. ఈయననూ తెలంగాణ సర్వీస్‌కు డిప్యుటేషన్‌పై కేంద్రం ఆమోదం మేరకే ఇవ్వాల్సి ఉంటుంది. ప్రస్తుతం కోల్ ఇండియా సీఎండీగా ఉన్న నర్సింగరావు ఆ బాధ్యతల నుంచి రిలీవై, తెలంగాణలో చేరటానికి కనీసం నెలకుపైగా సమయం పడుతుందని అధికారవర్గాలు చెబుతున్నాయి. ఈ అధికారిక ప్రక్రియలు పూర్తయ్యాకే వీరి నియామకాలపై ఉత్తర్వులు విడుదలయ్యే అవకాశాలున్నాయి. ఢిల్లీకి కేసీఆర్ త్వరలోనే తెలంగాణ ముఖ్యమంత్రి బాధ్యతలను చేపట్టనున్న టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు ఆదివారం రాత్రి ఢిల్లీ బయలుదేరారు. ఢిల్లీలో ఆయన ప్రధానిగా నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొంటారు. కేసీఆర్‌తో పాటు పలువురు టీఆర్ఎస్ సీనియర్ నేతలు కూడా వెళ్లారు. మోడీతో సోమవారం కేసీఆర్ భేటీ కానున్నారు. తిరిగి మంగళవారం ఉదయం హైదరాబాద్ చేరుకోనున్నారు. అఖిల భారత సర్వీసుల్లోని అధికారుల విభజన, సాగునీటి ప్రాజెక్టులు, విద్యుత్ ప్రాజెక్టులు వంటి వాటిపై సంబంధిత రంగాల ముఖ్యులతో కేసీఆర్ సమావేశమయ్యే అవకాశాలు ఉన్నాయి. హైదరాబాద్ కలెక్టర్‌తో భేటీ: ఇదిలా ఉండగా, కేసీఆర్ ఆదివారం హైదరాబాద్ జిల్లా కలెక్టర్ ముఖేశ్‌కుమార్ మీనాను కలుసుకున్నారు. అరగంటసేపు ఆయనతో పలు అంశాలపై చర్చలు జరిపారు. మరోవైపు, అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన కేసీఆర్‌కు పలు వర్గాల నుంచి అభినందనల పరంపర కొనసాగుతోంది. తెలంగాణ ఉద్యమకారులు, వివిధ శాఖల కార్యదర్శులు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, వ్యాపార సంస్థల అధిపతులు, పారిశ్రామికవేత్తలు, ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగ సంఘాల ప్రతినిధులు, టీఆర్ఎస్ నేతలు, తెలంగాణ జిల్లా ప్రజలతో కేసీఆర్ నివాసం ఆదివారం జనసంద్రాన్ని తలపించింది. పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ముస్లిం, ధార్మిక సంఘాల నేతలు, తెలంగాణలోని పలు జిల్లాలకు చెందిన గ్రామ సర్పంచ్‌లు, పార్టీ తరఫున గెలిచిన జెడ్పీటీసీలు, అభిమానులు కేసీఆర్‌ను కలుసుకుని శుభాకాంక్షలు తెలిపారు. -
'జగన్ ముఖ్యమంత్రి అవ్వడం ఖాయం'
-
వరి ‘మద్దతు’లో దగా...
పంజాబ్, హర్యానాకు మేలు.. ఆంధ్రాకు చేటు పాలకుల నిర్లక్ష్యం రాష్ట్రాల వారీగా ప్రకటించాలని జగన్ డిమాండ్ వైఎస్సార్సీపీ రైతు విభాగం రాష్ట్ర కన్వీనర్ నాగిరెడ్డి సాక్షి, మచిలీపట్నం : పాలకుల నిర్లక్ష్యం కారణంగా వరికి మద్దతు ధర విషయంలో ఆంధ్రప్రదేశ్‌లోని అన్నదాత అడుగడుగునా మోసానికి గురవుతున్నాడని, అందుకే రాష్ట్రాల ప్రాతిపదికగా వ్యవసాయ ఉత్పత్తుల ధరల నిర్ణయం జరగాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్.జగన్మోహన్రెడ్డి డిమాండ్ చేశారని ఆ పార్టీ రైతు విభాగం రాష్ట్ర కన్వీనర్ ఎంవీఎస్ నాగిరెడ్డి అన్నారు. వరి ధాన్యానికి కనీస మద్దతు ధర(ఎమ్మెస్పీ) క్వింటాల్‌కు రూ.50పెంచుతూ కేంద్ర వ్యవసాయ శాఖ ప్రతిపాదించడం వరి రైతును దగా చేయడమేనని నాగిరెడ్డి మండిపడ్డారు. ఎమ్మెస్పీగా 2014-15లో సాధారణ రకం ధాన్నం క్వింటాల్‌కు రూ.1,360 ఏ గ్రేడ్ ధాన్యానికి క్వింటాల్‌కు రూ.1,400 మాత్రమే ధర నిర్ణయించడం మోసం చేయడమేనని నాగిరెడ్డి శుక్రవారం సాక్షితో చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రధానంగా రైతులు వరి, పత్తి పండిస్తారని, అయితే ఈ ఏడాది వరి రైతులకు ముష్టి వేసినట్టు కేవలం రూ.50 మాత్రమే పెంచడం దారుణమన్నారు. ఒక పంట ఉత్పత్తికి ఎంత ఖర్చవుతుంతో పరిశీలించి లాభసాటి ధర ఇవ్వాల్సి ఉందన్నారు. అదేమి పట్టించుకోకుండా కనీస మద్దతు ధర సక్రమంగా ఇవ్వలేని పాలకులు ఉన్నా దండగేనని నాగిరెడ్డి ధ్వజమెత్తారు. ఒక ఉద్యోగికి డీఏ పెంచాలంటే మూడు నెలలుగా మార్కెట్లో పెరిగిన ధరలను పరిగణలోకి తీసుకుంటారని గుర్తుచేశారు. అదే రైతుల విషయంలో కనీస మద్దతు ధర ఇచ్చేందుకు పెరిగిన పెట్టుబడులను ఎందుకు పరిగణలోకి తీసుకోవడంలేదని ప్రశ్నించారు. కనీస మద్దతు ధరతో నాకు సంబంధంలేని, దానికి ఒక శాస్త్రీయ కమిటీ ఉందని గతంలో చెప్పిన ప్రధాని మన్మోహన్ సింగ్ ఆ తరువాత ఆయనే స్వయంగా మద్దతు ధర ఎలా ప్రకటించారన్నారు. రైతుల పెట్టుబడుల భారాన్ని పరిగణనలోకి తీసుకోని పాలకుల తీరును వైఎస్సార్సీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోందని నాగిరెడ్డి చెప్పారు. గిట్టుబాటు ధర కోసం జగన్ పోరాటం చేశారు... మద్దతు ధర రైతుకు గిట్టుబాటుగా ఉండాలనే తమ పార్టీ మొదట్నుంచి పోరాటం చేస్తోందని, ఇందుకోసం తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్. జగన్మోహనరెడ్డి అనేక సందర్భాల్లో పోరాటం చేశారని నాగిరెడ్డి గుర్తు చేశారు. జగన్మోహనరెడ్డి రాజకీయాల్లోకి వచ్చిన తొలినాళ్లలో తుఫాన్లో దెబ్బతిన్న రైతులను ఆదుకోవాలంటూ మొట్ట మొదట 2011 డిసెంబర్లో విజయవాడలో లక్ష్యదీక్ష చేపట్టిన సంగతిని నాగిరెడ్డి ప్రస్తావించారు. జగన్మోహనరెడ్డి పుట్టిన రోజు వేడుకలకు దూరంగా రైతుల కోసం దీక్ష చేశారని అన్నారు. అదే విధంగా 2012 డిసెంబర్లో పుట్టిన రోజున కేంద్ర వ్యవసాయ మంత్రి శరద్‌పవార్‌ను కలిసి ధాన్యం ధర, ఎగుమతులపై చర్చించేందుకు జగన్మోహనరెడ్డి ప్రయత్నిస్తే కొందరు రాజకీయ కుట్రతో అపాయింట్మెంట్ను రద్దు చేయించారని నాగిరెడ్డి అన్నారు. పంజాబ్‌కు మేలు.. ఆంధ్రప్రదేశ్‌కు చేటు కనీస మద్దతు ధర నిర్ణయంలో దేశమంతటా ఒకేలా పరిగణించి అంచనా వేయడంతో పంజాబ్, హర్యానా రాష్ట్రాలకు మేలు కలుగుతుందని, ఆంధ్రప్రదేశ్‌కు చేటు చేస్తున్నారని నాగిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. వాస్తవంగా పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో ఒక క్వింటాల్ ధాన్యం ఉత్పత్తికి కేవలం రూ.4వేలు ఖర్చు అవుతుందని, అదే ఆంధ్రప్రదేశ్‌లో రూ.8వేలు అవుతుందని అన్నారు. ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకోకుండా అక్కడా ఇక్కడా ఇకే ధర ఇస్తామనే పద్ధతి సరికాదని అన్నారు. దీని వల్ల పంజాబ్‌కు తక్కువ పెట్టుబడి కారణంగా ఎక్కువ లాభం వస్తోందని, ఆంధ్రప్రదేశ్‌లో ఉత్పత్తి వ్యయం ఎక్కువగా ఉండటంతో మద్దతు ధర సరిపోక నష్టాల ఊబిలో కూరుకుపోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే రాష్ట్రాల వారీగా మద్దతు ధర ఇవ్వాలని వైఎస్ జగన్మోహనరెడ్డి అనేక పర్యాయాలు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారని నాగిరెడ్డి అన్నారు. వ్యవసాయానికి ఊతమివ్వకుండా సీమాంధ్రను ఎలా అభివృద్ధి చేస్తారని నాగిరెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. -
'సొంత తమ్ముడే చిరంజీవిని నమ్మడం లేదు'
హైదరాబాద్: సొంత తమ్ముడు పవన్ కళ్యాణే కేంద్ర మంత్రి చిరంజీవిని నమ్మడంలేదని, ఇక ప్రజలు ఏం నమ్ముతారు? అని వైఎస్ఆర్ సిపి లీగల్ సెల్ రాష్ట్ర కోఆర్డినేటర్ నాగిరెడ్డి ప్రశ్నించారు. చెన్నైలో తన వియ్యంకుడి ఇంట్లో దొరికిన 70 కోట్ల రూపాయల కేసు ఏమైందో చిరంజీవి చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. చిరంజీవి తన పార్టీని హోల్‌సేల్‌గా అమ్ముకున్నారని విమర్శించారు. టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు హామీలు నకిలీ నోట్లలాంటివని విమర్శించారు. తన పాలన మళ్లీ తెస్తానని చంద్రబాబు చెప్పగలరా? అని నాగిరెడ్డి ప్రశ్నించారు. -
'చంద్రబాబు రైతు వ్యతిరేకి'
-
రెచ్చగొడుతున్న కేసీఆర్: నాగిరెడ్డి
హైదరాబాద్: కేసీఆర్ వ్యాఖ్యలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు నాగిరెడ్డి ఖండించారు. ఇరుప్రాంతాల మధ్య రెచ్చగొట్టే విధంగా కేసీఆర్ మాట్లాడారని అన్నారు. రెచ్చగొట్టే ప్రకటనలు చేసే వారిపై కేంద్రం తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాజకీయ లబ్ధికోసం కేసీఆర్ మాట్లాడుతున్నారని ఆరోపించారు. రాష్ట్రం విడిపోతే ఇలాంటి సమస్యలు వస్తాయని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడో చెప్పారని గుర్తు చేశారు. కొత్తగా వచ్చే సమస్యల గురించి రాష్ట్రపతి దగ్గరకి కూడా వైఎస్సార్ సీపీ తీసుకెళ్లిందని నాగి రెడ్డి తెలిపారు. తెలంగాణ ప్రాంతంలోని సాగునీటి ప్రాజెక్టులు నిండాకే నీళ్లు మిగిలితేనే ఆంధ్ర ప్రాంతంలో ఉన్న పోతిరెడ్డిపాడు, తెలుగుగంగ, పులిచింతల, హంద్రీ-నీవా, గాలేరు-నగరి, వెలుగోడు ప్రాజెక్టులకు నీళ్లు ఇస్తామే గానీ.. లేకపోతే నీళ్లు తీసుకుపోనీయమని కేసీఆర్ నిన్న పేర్కొన్నారు. -
'రెచ్చగొట్టే ప్రకటనలపై చర్యలు తీసుకోవాలి'
-
సమైక్య చాంపియన్ జగనే
వైఎస్సార్సీపీ విద్యార్థి సమైక్య శంఖారావంలో వక్తలు కిరణ్ , చంద్రబాబు నాటకాలాడుతున్నారని విమర్శ సాక్షి, విజయవాడ : రాష్ట్రంలో సమైక్యం కోసం శాయశక్తులా కృషిచేస్తున్నది వైఎస్ జగనేనని... ఆయనే సమైక్య చాంపియన్ అని వైఎస్సార్సీపీ రైతు విభాగం రాష్ట్ర కన్వీనర్ నాగిరెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు సామినేని ఉదయభాను, విజయవాడ నగర అధ్యక్షుడు జలీల్‌ఖాన్ స్పష్టం చేశారు. వైఎస్సార్సీపీ విద్యార్థి సమైక్య శంఖారావం సభ బుధవారం విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగింది. ముందుగా తెలుగుతల్లి విగ్రహానికి పూలమాల వేసి సమైక్య నినాదాలు చేశారు. ఈ సభకు జిల్లా విద్యార్థి జేఏసీ నాయకుడు అంజిరెడ్డి అధ్యక్షత వహించారు. సభలో నాగిరెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి విభజన ముసుగులో సమైక్యం అంటూ ప్రజలను మోసం చేస్తున్నారని, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు విభజన వాదమా? సమైక్యమా? అనే విషయాన్ని ఇప్పటికీ స్పష్టంగా చెప్పలేకపోతున్నారని విమర్శించారు. వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్రెడ్డి ఒక్కరే సమైక్యం కోసం పోరాటం చేస్తున్నారని చెప్పారు. 1969లో చెన్నారెడ్డి తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించినప్పుడు నాటి ప్రధాని ఇందిర ఏమాత్రం పట్టించుకోలేదన్నారు. వేర్పాటువాదాన్ని ఆమె ప్రోత్సహించలేదన్నారు. వైఎస్సార్సీపీ ఏనాడూ విభజన కోరలేదని, కేవలం కన్నతండ్రిలా న్యాయం చేయాలని మాత్రమే సూచించిందని వివరించారు. సమైక్యంగా ఉంటేనే హైదరాబాద్‌లో అవకాశాలు... పార్టీ జిల్లా అధ్యక్షుడు సామినేని ఉదయభాను మాట్లాడుతూ రాష్ట్రం సమైక్యంగా ఉంటేనే హైదరాబాద్‌లో అందరికీ అవకాశాలు దొరుకుతాయని చెప్పారు. సమైక్య రాష్ట్రంలోనే ఎన్నికలు జరగాలని వైఎస్సార్సీపీ కోరుకుంటోందన్నారు. సమైక్యం కోసం జగన్మోహన్రెడ్డి దీక్ష చేసిన విషయాన్ని గుర్తుచేశారు. విద్యార్థులకు భవిష్యత్తు ఇచ్చింది వైఎస్సేనన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంటుతో లక్షలాది మంది విద్యార్థులు లబ్ధి పొందారన్నారు. పార్టీ నగర అధ్యక్షుడు జలీల్‌ఖాన్ మాట్లాడుతూ విభజనకు బీజం వేసింది కాంగ్రెస్ పార్టీయేనని చెప్పారు. చిన్న రాష్ట్రాలుంటే కేంద్రం లెక్కచేయదన్నారు. సమన్వయకర్తలు పి.గౌతంరెడ్డి, పడమటి సురేష్‌బాబు మాట్లాడుతూ విద్యార్థులతోనే రాజకీయాల్లో మార్పులు వస్తాయన్నారు. జగన్మోహన్రెడ్డితో విద్యార్థులు కలిసి రావాలన్నారు. ఎల్కేజీ నుంచి పీజీ వరకు అందరికీ ఉచిత విద్య అందిస్తానని జగన్మోహన్రెడ్డి చెప్పారని గుర్తుచేశారు. నగర మాజీ మేయర్ తాడి శకుంతల, వాణిజ్య విభాగం నాయకుడు కొణిజేటి రమేష్, డాక్టర్ల విభాగం కన్వీనర్ మహబూబ్, నాయకులు కాకర్ల వెంకటరత్నం, రామలింగమూర్తి, ఎం.ఎస్.నారాయణ, నారుమంచి నారాయణ, టి.హేమంతరావు తదితరులు పాల్గొన్నారు. -
'వ్యవసాయ' భేటీకి ఏపీ మంత్రి రాకపోవడం దురుదృష్టకరం
ఢిల్లీ: నగరంలో జరిగిన వ్యవసాయ మంత్రులు భేటీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఆ శాఖకు చెందిన మంత్రి రాకపోవడం దురదృష్టకరమని వైఎస్సార్ సీపీ రైతు సంఘం అధ్యక్షుడు నాగిరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి సమావేశానికి నాగిరెడ్డి హాజరైయ్యారు. అన్ని రాష్ట్రాల మంత్రులు ఈ సమావేశంలో పాల్గొనగా, ఏపీ నుంచి మంత్రి రాకపోవడం సిగ్గుచేటన్నారు. ఇందులో వ్యవసాయానికి సంబంధించి అనేక అంశాలను తాను లేవనెత్తినట్లు పేర్కొన్నారు. వ్యవసాయాంత్రీకరణపై పరిశోధన సంస్థలు ఏర్పాటు చేయడమే కాకుండా, కడియంలో స్థూల పరిశోధన సంస్థలు నిర్మించాలన్నారు. పాల దిగుబడి పెంచేందుకు స్థానిక పశు అభివృద్ధిపై పరిశోధనలు పెంచాలని మండలికి సూచించినట్లు నాగిరెడ్డి తెలిపారు. -
వైస్సాఆర్ సీపీలోకి తాడిపత్రి టిడిపి ఇన్చార్జ్
-
తాడిపత్రి ‘దేశం’లో అయోమయం
తాడిపత్రి, న్యూస్‌లైన్ : తెలుగుదేశం పార్టీ తాడిపత్రి నియోజకవర్గ ఇన్చార్జి పేరం నాగిరెడ్డి బుధవారం ఆ పార్టీకి గుడ్‌బై చెప్పడంతో ప్రస్తుతం ఆ పార్టీ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. నాయకులు, కార్యకర్తల్లో అయోమయం నెలకొంది. తాడిపత్రిలో బుధవారం నిర్వహించిన టీడీపీ కార్యకర్తల సమావేశంలో చంద్రబాబు వైఖరిపై నిరసన వ్యక్తం చేసి, పార్టీకి గుడ్‌బై చెబుతున్నానని ప్రకటించిన కొన్ని గంటల్లోనే ఆయన వైఎస్సార్ సీపీలో చేరారు. పులివెందులలో ఉన్న వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డిని కలిసి ఆయన సమక్షంలో ఆ పార్టీలో చేరారు. ఆయనతోపాటు కుమారుడు పేరం గోకుల్నాథ్రెడ్డి, కోడలు పేరం సరోజమ్మ, పేరం కుటుంబ సభ్యులు, బంధువులు కూడా పార్టీలో చేరారు. వీరి చేరికతో వైఎస్సార్సీపీ తాడిపత్రి నియోజకవర్గంలో మరింత బలోపేతం అవుతుంది. రాజకీయ ప్రస్తానం.. యాడికి మండలం నిట్టూరు గ్రామానికి చెందిన పేరం నాగిరెడ్డి 1983లో తాడిపత్రి లారీ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 1987లో తెలుగుదేశం పార్టీలో చేరారు. తాడిపత్రి పట్టణ అధ్యక్షుడిగా, జిల్లా ఉపాధ్యక్షుడిగా, జిల్లా ప్రధాన కార్యదర్శిగా పని చేశారు. 1989లో ఆర్టీసీ రీజియన్ చైర్మన్‌గా పని చేశారు. 1995లో తాడిపత్రి మున్సిపల్ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. 1989, 1994, 1999, 2009లో తాడిపత్రి అసెంబ్లీ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు. జిల్లాలో సీనియర్ నాయకుడిగా గుర్తింపు పొందిన ఆయన.. నియోజకవర్గంలో పార్టీకి పెద్ద దిక్కుగా ఉంటూ 30 సంవత్సరాల పాటు పార్టీని నడిపించారు. పేరం టీడీపీ నుంచి బయటికి వచ్చి వైఎస్సార్సీపీలో చేరడంతో తాడిపత్రి ‘దేశం’లో అక్కడక్కడ మిగిలిన కార్యకర్తలు సైతం ఆ పార్టీకి గుడ్‌బై చెప్పేందుకు సిద్ధమయ్యారు. -
రెండున్నర కోట్లతో అభివృద్ధి
జక్రాన్‌పల్లి, న్యూస్‌లైన్: ప్రభుత్వ నిధులు, గ్రామ పంచాయతీ భాగస్వామ్యంలో రూ. రెండున్నర కోట్ల రూపాయల నిధులతో జక్రాన్‌పల్లి మండలంలోని బ్రా హ్మణ్పల్లి గ్రామాన్ని అన్ని విధాలా అభివృద్ధి చే స్తామని పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యద ర్శి నాగిరెడ్డి తెలిపారు. పెలైట్ ప్రాజెక్టుగా ఎంపికైన ఈ గ్రామాన్ని ఆయన బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా నిర్వహించిన గ్రా మసభలో ఆయన మాట్లాడుతూ గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలంటే ముందుగా ఐదేళ్ల ప్ర ణాళిక తయారు చేసుకోవాలన్నారు. 22 రకాల ఆదాయ వనరులను సమకూర్చుకోవచ్చన్నా రు. ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్లాలన్నా రు. పంచాయతీరాజ్ కమిషనర్ డి వరప్రసాద్ మాట్లాడుతూ ఈ ప్రాజెక్టు విజయవంతమైతే రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో అమలు చేస్తామన్నారు. గ్రామానికి అవసరాలు ఏమిటి, నిధు లు ఎలా సమకూర్చుకోవాలి, ప్రభుత్వ నిధు లు, వివిధ శాఖల ద్వారా ఏ మేరకు నిధుల వ స్తాయి, పన్నుల ద్వారా ఎంత ఆదాయం ఉం టుంది? అనే అంశాలను అధ్యయనం చేశారు. రూపేణ ఎన్ని నిధుల వస్తాయి అనే అంశాలపై అధికారులు అధ్యయనం చేశారు. ఐదేళ్లలో ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దవచ్చు జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న మాట్లాడుతూ ప్రభుత్వ గ్రాంట్లతోపాటు, పన్నుల ద్వారా వచ్చే ఆదాయంతో ఐదేళ్లలో గ్రామాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దవచ్చన్నారు. ఈ ప్రాజెక్టును అధికారులు, గ్రామస్తులు సమన్వయంతో కృషి చేసి విజయవంతం చేయాలన్నారు. గ్రామంలో సమస్యలన్నింటిని పరిష్కరించి, అభివృద్ధి పనులు చేపట్టా లంటే రూ.2కోట్ల 51లక్షల 25వేల నిధులు అవసరమవుతాయని అధికారులు గుర్తించారు. వివిధ శాఖల ద్వారా రూ. ఒక కోటి 51 లక్షల 55వేలు నిధులు వస్తాయన్నారు. రూ.32.75లక్షలు ప్రభుత్వం నుంచి వస్తాయన్నారు. ఇంకా రూ.24.95లక్షలు గ్రామ పంచాయతీయే సమకూర్చుకోవాలన్నారు. సుమారు రెండున్నర కోట్ల నిధులతో విడత లవారీగా అభివృద్ధి పనులు చేపట్టడానికి ఐదేళ్ల ప్రణాళికను తయారు చేశారు. తమ గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవడానికి పది శాతం నిధులు సమకూర్చడానికి తమకు అభ్యంతరం లేదని గ్రామస్థులు అధికారులకు విన్నవించారు. సర్పంచ్ గాండ్ల భూమిక అధ్యక్షత వహించిన ఈ సమావేశంలో ఉపసర్పంచ్ గాండ్ల శేఖర్, జడ్పీ సీఈఓ రాజారాం, డీపీఓ సురేష్‌బాబు, ఎంపీడీఓ పీవీ శ్రీనివాస్, తహశీల్దార్ అనిల్‌కుమార్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.