చిలమత్తూరు : అప్పుల బాధతో రైతు మతి చెందిన సంఘటన చిలమత్తూరు బీసీ కాలనీలో ఆదివారం చోటు చేసుకుంది. వివరాలు.. హిందూపురం మండలం కొల్లకుంటకు చెందిన నాగిరెడ్డి (56) తనకున్న ఐదెకరాల పొలంలో వేరుశనగ పంట సాగు చే శాడు. బ్యాంకులు తదితర చోట్ల సుమారు రూ.5 లక్షలు అప్పు చేశాడు. దీంతో అప్పుల బాధ తీర్చేదెలా అని తరచూ మానసిక ఒత్తిడికి గురయ్యే వాడని బంధువులు తెలిపారు.
గతంలో గుండెపోటు రాగా బెంగళూర్ ఆస్పతిలో చికిత్స చేయించుకున్నాడు. సొంత పనుల నిమిత్తం శనివారం చిలమత్తూరుకు వచ్చాడు. తన స్నేహితుడు బాబు ఇంట్లో భోజనం చేసి అక్కడే విశ్రాంతి తీసుకున్నాడు. కాగా ఉదయం మతి చెందినట్లు స్థానికులు గుర్తించారు. మతుడికి భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు.
అప్పుల బాధతో రైతు మృతి
Published Sun, Oct 2 2016 11:54 PM | Last Updated on Tue, Oct 2 2018 5:51 PM
Advertisement