
రెచ్చగొడుతున్న కేసీఆర్: నాగిరెడ్డి
హైదరాబాద్: కేసీఆర్ వ్యాఖ్యలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు నాగిరెడ్డి ఖండించారు. ఇరుప్రాంతాల మధ్య రెచ్చగొట్టే విధంగా కేసీఆర్ మాట్లాడారని అన్నారు. రెచ్చగొట్టే ప్రకటనలు చేసే వారిపై కేంద్రం తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాజకీయ లబ్ధికోసం కేసీఆర్ మాట్లాడుతున్నారని ఆరోపించారు. రాష్ట్రం విడిపోతే ఇలాంటి సమస్యలు వస్తాయని వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఎప్పుడో చెప్పారని గుర్తు చేశారు. కొత్తగా వచ్చే సమస్యల గురించి రాష్ట్రపతి దగ్గరకి కూడా వైఎస్సార్ సీపీ తీసుకెళ్లిందని నాగి రెడ్డి తెలిపారు.
తెలంగాణ ప్రాంతంలోని సాగునీటి ప్రాజెక్టులు నిండాకే నీళ్లు మిగిలితేనే ఆంధ్ర ప్రాంతంలో ఉన్న పోతిరెడ్డిపాడు, తెలుగుగంగ, పులిచింతల, హంద్రీ-నీవా, గాలేరు-నగరి, వెలుగోడు ప్రాజెక్టులకు నీళ్లు ఇస్తామే గానీ.. లేకపోతే నీళ్లు తీసుకుపోనీయమని కేసీఆర్ నిన్న పేర్కొన్నారు.