అగ్నిప్రమాదాల సమయంలో ఫైర్ సిబ్బందికి సాయం చేసేలా శిక్షణ
తొలివిడతలో 95 మంది వలంటీర్లకు వరంగల్‌లో ౖట్రెనింగ్ : డీజీ నాగిరెడ్డి
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం తీసుకొ చ్చిన ఆపద మిత్ర పథ కంలో భాగంగా తెలంగాణ అగ్నిమా పకశాఖ ఆధ్వర్యంలోనూ ‘ఆపద మిత్ర’లకు శిక్షణ ఇస్తు న్నట్లు రాష్ట్ర విపత్తు నిర్వహణ, అగ్నిమాపక సేవల విభాగం డైరెక్టర్ జనరల్ (డీజీ) వై.నాగిరెడ్డి తెలిపారు. విపత్తుల వేళ సత్వర స్పందన కోసం స్థానికుల్లో కొందరిని వలంటీర్లుగా గుర్తించి వారికి ‘ఆపద మిత్ర’లుగా శిక్షణ అందిస్తున్నట్లు చెప్పారు. తొలి విడతలో భాగంగా ప్రస్తుతం వరంగల్‌లో 95 మంది వలంటీర్లకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నామని.. వారికి తరగతి గది శిక్షణ పూర్తయిందని పేర్కొన్నారు. త్వరలోనే వారికి క్షేత్రస్థాయి శిక్షణ ప్రారంభిస్తామన్నారు.
అగ్నిప్రమాదాలు సంభవించినప్పుడు తక్షణమే ఎలా స్పందించాలి.. ఎలాంటి చర్యలు తీసుకోవాలి.. చుట్టుపక్కల వారిని ఎలా అప్రమత్తం చేయాలన్న అంశాలపై ‘ఆపద మిత్ర’లు శిక్షణ పొందుతారని తెలిపారు. ఫైర్ సిబ్బంది మంటలార్పే సమయంలో సహాయకులుగా వ్యవహరిస్తారని వివరించారు. సాధారణ సమయాల్లో అగ్నిప్రమాదాల నియంత్రణ, ప్రమాద సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై స్థానికంగా వారి పరిధిలో అవగాహన సైతం కల్పిస్తారన్నారు.
మరోవైపు ఏప్రిల్ 14 నుంచి 20 వరకు రాష్ట్రవ్యాప్తంగా ఫైర్ సర్వీస్ వారంగా నిర్వహించనున్నట్లు నాగిరెడ్డి తెలిపారు. వారంపాటు నిర్వహించనున్న అవగాహన కార్యక్రమాల్లో భాగంగా బస్‌స్టేషన్లు, రైల్వే స్టేషన్లు, ఆసుపత్రులు, రెసిడెన్షియల్ కాంప్లెక్స్‌లు, మల్టీప్లెక్స్‌లు, మాల్స్‌లో అగ్నిప్రమాదాల నియంత్రణ, ప్రమాద సమయాల్లో ఎలా కాపాడుకోవాలన్న అంశాలపై ఫైర్ సిబ్బంది అవగాహన కల్పిస్తారని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment