సాక్షి, విశాఖపట్నం: ఏపీలో కొన్ని నియోజకవర్గాల్లో మార్పులు, చేర్పులు చేస్తున్నామన్నారు వైఎస్సార్‌సీపీ రీజనల్ కోఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి. ఏపీలో 175 స్థానాల్లో 175 వైఎస్సార్‌సీపీ గెలవాలన్నదే ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి లక్ష్యమని తెలిపారు.
కాగా, వైవీ సుబ్బారెడ్డి మంగళవారం విశాఖలో మాట్లాడుతూ.. గాజువాకలో సమన్వయకర్తను మార్పు చేయాలని పార్టీ నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని రెండు వారాల క్రితమే ఎమ్మెల్యే నాగిరెడ్డికి తెలియజేశాం. మాకు సీటు ఇచ్చినా, ఇవ్వకపోయినా ముఖ్యమంత్రిగా జగన్ కావాలని నాగిరెడ్డి, దేవన్ రెడ్డి చెప్పారు. మంచి అభ్యర్థికి సీటు ఇవ్వమని నాగిరెడ్డి సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్‌సీపీలో చాలా మార్పులు జరగనున్నాయి. నారా లోకేష్ పాదయాత్ర వల్ల టీడీపీకి ఎటువంటి ఉపయోగం లేదు అంటూ కామెంట్స్ చేశారు.
అంతకుముందు.. వైవీ సుబ్బారెడ్డితో ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి, దేవన్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ సందర్బంగా తనపై జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని తిప్పల దేవన్‌రెడ్డి ఖండించారు. ఈ క్రమంలో దేవన్‌రెడ్డి మాట్లాడుతూ..‘పార్టీకి రాజీనామా చేస్తున్నానని వస్తున్న వార్తలు అవాస్తవం. అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా నేను కట్టుబడి ఉంటాను. నా తండ్రి ఎమ్మెల్యేగా ఉన్న పార్టీకి నేనెందుకు రాజీనామా చేస్తాను?’ అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment