'ఆగస్టులోగా ఎన్నికలను పూర్తి చేయాలి' | State Election Commissioner Nagireddy Held Meeting With Top Officials | Sakshi
Sakshi News home page

'ఆగస్టులోగా ఎన్నికలను పూర్తి చేయాలి'

Published Sat, Jul 6 2019 3:31 PM | Last Updated on Sat, Jul 6 2019 3:34 PM

State Election Commissioner Nagireddy Held  Meeting With Top Officials - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : మున్సిపల్‌ ఎన్నికల నిర్వహణ సందర్భంగా మాసబ్‌ ట్యాంక్‌లోని రాష్ట్ర ఎన్నికల కార్యాలయంలో సీఎస్‌ ఎస్కే జోషి, డీజీపీ మహేందర్‌ రెడ్డి, మున్సిపల్‌ అడ్మినిస్ట్రేటివ్‌ డైరక్టర్‌ శ్రీదేవి, ఇతర ఉన్నతాధికారులతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నాగిరెడ్డి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్నికల నిర్వహణ, మున్సిపాలిటీ రిజర్వేషన్లు, ఓటర్ల జాబితా తయారీ, శాంతి భద్రత తదితర అంశాలపై చర్చ నిర్వహించారు.

జూలై 12న మున్సిపల్‌ శాఖ రిజర్వేషన్లు ఖరారు చేయనున్న నేపథ్యంలో ఈ నెల చివరి వారంలో ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసి ఆగస్టులోగా పూర్తి చేసేలా అధికారులు కసరత్తు చేయాలని కమిషనర్‌ పేర్కొన్నారు. మున్సిపల్‌ ఎన్నికలను ఒకే విడతలో నిర్వహిస్తున్న కారణంగా బ్యాలెట్‌ పేపర్‌ విధానాన్ని వీలైనంత తొందరగా పూర్తి చేయాలని నాగిరెడ్డి అధికారులకు స్పష్టం చేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement