
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చిన నేపథ్యంలో ఓటర్లకు వ్యక్తిగత లబ్ధి కలిగించే రైతుబంధు చెక్కులు, బతుకమ్మ చీరల పంపిణీ, సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ వంటి ప్రభుత్వ కార్యక్రమాలను తక్షణమే నిలుపుదల చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కోరింది. ఈ పథకాల ద్వారా ఓటర్లకు నేరుగా డబ్బులు, కానుకల రూపంలో ప్రయోజనం కలిగిస్తే వారు ప్రభావితమయ్యే అవకాశముందని అభిప్రాయపడింది. ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో ప్రభుత్వం ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను కూడా బదిలీ చేసేందు కు వీల్లేదని ఎన్నికల సంఘం సీనియర్ అధికారి ఒకరు బుధవారం తెలిపారు.
జిల్లాపరి షత్, మండల పరిషత్, మునిసిపల్ పాలక మండళ్ల సర్వసభ్య సమావేశాలు ఏర్పాటు చేసుకోవచ్చని, ఎలాంటి విధానపర నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం లేదని అభిప్రాయపడ్డారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణ చేపట్టడానికి ఆస్కారం లేదని, ఎన్నికల సంఘం అనుమతి తీసుకున్నాకే అసెంబ్లీ సమావేశాలు నిర్వహిం చాల్సి ఉంటుందన్నారు. ఇదిలా ఉండగా, ఎన్నికల్లో ఓటర్లకు డబ్బు, మద్యం పంపిణీని అడ్డుకోవడానికి రాష్ట్ర, జిల్లాల సరిహద్దుల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేయాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఎన్నికల ఫిర్యాదులకోసం ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయనుంది. ఎన్నిక ల పరిశీలకులతో శుక్రవారం ఎన్నికల కమిషన ర్ వి.నాగిరెడ్డి సమావేశం కానున్నారు.
Comments
Please login to add a commentAdd a comment