ప్రసాదరాజు చేపడుతున్న దీక్షకు ఎమ్మెల్యే రోజా సంఘీభావం తెలిపారు.
నరసాపురం: తుందుర్రు మెగా ఆక్వాపార్క్‌ను సముద్రతీరానికి తరలించాలన్న డిమాండ్‌తో మాజీ ఎమ్మెల్యే ప్రసాదరాజు చేపడుతున్న దీక్ష రెండో రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా వైఎస్‌ఆర్ సీపీ ఎమ్మెల్యే రోజా, రైతు విభాగం అధ్యక్షుడు నాగిరెడ్డి ప్రసాదరాజు దీక్షకు సంఘీభావం తెలిపారు.
శనివారం పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం చేరుకున్న రోజా మాట్లాడుతూ.. చంద్రబాబుకు విలాసాల మీద ఉన్న శ్రద్ధ ప్రజాసమస్యల మీద లేదన్నారు. ఆక్వాపార్క్‌ను సముద్రతీరానికి తరలించకపోతే బాబుకు ప్రజలే బుద్ధి చెబుతారని అన్నారు. మంత్రులు గన్‌మెన్‌లు లేకుండా తుందుర్రుకు వస్తే ప్రజల ఆందోళన తీవ్రత అర్థమౌతుందన్నారు. మొగల్తురు ఘటనలో ఐదుగురు చనిపోతే ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. కోట్ల రూపాయల లంచాలు తీసుకోబట్టే యాజమాన్యానికి కొమ్ముకాస్తున్నారని ఆరోపించారు.