narasapuram
-
అల్లికవా.. రంగవల్లివా!
నరసాపురం: నరసాపురం లేసులకు భౌగోళిక గుర్తింపు (జియోగ్రాఫికల్ ఐడెంటిఫికేషన్–జీఐ) లభించింది. కేంద్ర జౌళి శాఖ సిఫార్సుల మేరకు నరసాపురం మండలం సీతారామపురంలోని లేసు పార్కుకు కేంద్ర ప్రభుత్వం భౌగోళిక గుర్తింపు ఇచ్చింది. ఫ్రాన్స్ వేదికగా పారిస్‌లో జరుగుతున్న ఒలింపిక్స్‌కు హాజరయ్యే క్రీడాకారులకు బహూకరించేందుకు పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం లేసు ఉత్పత్తులు ఎంపికై ప్రపంచం దృష్టిని ఆకర్షించాయి. నాలుగు నెలల క్రితం ఈ ఘనత సాధించగా.. తాజాగా కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోని జౌళి శాఖ సిఫార్సుల మేరకు మన కేంద్ర ప్రభుత్వం నరసాపురం మండలం సీతారామపురంలోని లేసు పార్కుకు భౌగోళిక గుర్తింపు లభించింది. 1930–35 కాలంలో లండన్ వీధుల్లో నరసాపురం లేసు ఉత్పత్తుల అమ్మకాలు జరిగేవి. మళ్లీ ఇన్నాళ్లకు నరసాపురం లేసు అల్లికలు తమ ప్రాముఖ్యతను నిలుపుకొని ముందుకెళ్లడం విశేషం.కష్టమంతా మహిళలదేకళా నైపుణ్యంతో విశ్వ ఖ్యాతిని ఆర్జించిన లేసు పరిశ్రమలో కష్టం మొత్తం మహిళలదే. కనీస అక్షర జ్ఞానం కూడా లేని మహిళలదే కీలక పాత్ర. లేసు అల్లికల్లో శ్రమించే మహిళలకు కష్టానికి తగ్గ ఫలితం దక్కేది కాదు. వారు అల్లే లేసులు ఏ దేశాలకు వెళుతున్నాయో, వాటి రేటు అక్కడ ఎంత ఉంటుందో కూడా వీరికి తెలియదు. కమీషన్‌దారులు కేజీ దారంతో అల్లితే ఇంత అని కూలీ చెల్తిస్తారు. కేజీ దారం అల్లడానికి ఒక మహిళ రోజుకు ఐదారు గంటలు పనిచేస్తే 15 రోజుల సమయం పడుతుంది. కేజీ దారం అల్లడానికి రూ.200 నుంచి డిజైన్‌ను బట్టి రూ.500 వరకు చెల్లిస్తారు. అంటే నెలకు రూ.1,500 నుంచి రూ.2,000 వరకు మాత్రమే అల్లేవారికి దక్కుతాయి. నరసాపురం, రాజోలు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎనిమిదేళ్ల బాలికల నుంచి 80 ఏళ్ల వృద్ధుల వరకు గిన్నెలో దారం తోడుకుని లేసు కుట్టుకుంటూ ఇప్పటికీ కనిపిస్తారు. లేసు అల్లే మహిళల్లో మార్కెట్ నైపుణ్యాలు పెంచడం, అధునాతన డిజైన్లలో శిక్షణ ఇవ్వడం ద్వారా వారికి మేలు జరుగుతుందని గుర్తించిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి నరసాపురంలో 2005లో లేస్ పార్కు, ఇంటర్నేషనల్ లేస్ ట్రేడ్ సెంటర్ నెలకొల్పారు. డీఆర్డీఏ ఆధ్వర్యంలో లేసు నిర్వహణ సాగేలా చర్యలు తీసుకున్నారు. లేసు పార్కు ప్రారంభమైన తరువాతే నరసాపురంలో ఇంటర్నేషనల్ లేస్ ట్రేడ్ సెంటర్ ప్రారంభమైంది. దీంతో లేసులు అల్లే మహిళలకు ఆర్థికంగా గిట్టుబాటు అవుతోంది. వైఎస్సార్ నెలకొల్పిన లేసు పార్కుకు ఇప్పుడు భౌగోళిక గుర్తింపు రావడం విశేషం. ఇదీ నరసాపురం లేసు చరిత్రసుమారు 200 సంవత్సరాల క్రితం స్వీడన్ మిషనరీ సంస్థలు ఇక్కడకు వచ్చి, స్థానిక మహిళలతో పరిచయాలు పెంచుకోవడంలో భాగంగా లేసు అల్లికలను పరిచయం చేశాయి. తరువాత కాలంలో ఇది పెద్ద పరిశ్రమగా మారింది. అమెరికా సహా యూరప్ దేశాల్లో నరసాపురం ప్రాంత లేసు అల్లికలనే వినియోగిస్తారు. దిండ్లు, సోఫా సెట్, డైనింగ్ టేబుల్స్, డోర్ కర్టెన్స్‌పై వీటిని వాడతారు. విదేశీయులు ధరించే దుస్తులుగా కూడా లేసు అల్లికలకు ప్రాధాన్యం ఉంది. యూరప్ దేశాల్లో లేసు గార్మెంట్స్ అంటే ఎనలేని క్రేజ్. అనేక అబ్బురపరిచే డిజైన్లలో వీటిని తయారు చేస్తారు. అమెరికా, బ్రిటన్, హాలెండ్, జపాన్, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, స్వీడన్, జర్మనీ తదితర దేశాలకు లేసు అల్లికలు ఎగుమతి అవుతున్నాయి. ఇది అరుదైన ఘనత లేసు పార్కుకు భౌగోళిక గుర్తింపు దక్కడం అరుదైన ఘనత. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో లేసు పార్కుకు మరింత గుర్తింపు లభిస్తుంది. లేసు పార్కు వైభవం, నరసాపురం లేసు ఉత్పత్తుల ప్రాధాన్యత రోజురోజుకూ పెరుగుతున్నాయి. లేసు పరిశ్రమ అభివృద్ధికి ఇవి మంచి రోజులు. మాపై బాధ్యత మరింత పెరిగింది. – ఎంఎస్ఎస్ వేణుగోపాల్, డీఆర్డీఏ పీడీ -
సైబర్ నేరగాళ్లే ఎంపీడీవో ఉసురు తీశారు!
నరసాపురం: పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం ఎంపీడీవో ఎం.వెంకటరమణ అదృశ్యం, ఆత్మహత్య ఘటన వ్యవహారం కీలక మలుపు తిరిగింది. రాజస్థాన్‌కు చెందిన సైబర్ నేరగాళ్ల వేధింపుల కారణంగానే ఎంపీడీవో ఆత్మహత్య చేసుకున్నారని పోలీసుల విచారణలో తేలినట్లు సమాచారం. ఎంపీడీవో వెంకటరమణ అదృశ్యం, ఆత్మహత్యపై కృష్ణా జిల్లా పెనమలూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఈ కేసు విచారణ కోసం ప్రత్యేక పోలీసు బృందాలను నియమించారు. వెంకటరమణ సెల్‌ఫోన్ కాల్ డేటా, బ్యాంక్ లావాదేవీలను పోలీసులు క్షుణ్ణంగా పరిశీలించారు. వాటి ఆధారంగా రాజస్థాన్‌లోని బర్కత్పూర్కు చెందిన సైబర్‌ముఠా వలలో ఎంపీడీవో చిక్కుకున్నట్లు గుర్తించారని తెలిసింది. సుమారు 30మంది ఉన్న ఈ సైబర్ నేరస్తుల ముఠా ఓ యువతి న్యూడ్ వీడియోను ఆధారంగా చేసుకుని ఎంపీడీవోను ఇరుకునపెట్టినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చినట్లు సమాచారం. ఆయనను బెదిరించి పలుమార్లు డబ్బులు వసూలు చేసినట్లు కూడా గుర్తించారని తెలిసింది. మరింత డబ్బులు కావాలని సైబర్ ముఠా ఒత్తిడి చేయడంతో బయటకు చెప్పుకోలేక ఎంపీడీవో తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్మ చేసుకుని ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఈ మేరకు రాజస్థాన్‌లోని బర్కత్పూర్కు చెందిన సైబర్‌ముఠా సభ్యుడిని ప్రత్యేక పోలీసు బృందం అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది. ఇదిలా ఉండగా, ఎంపీడీవో అదృశ్యమైన తర్వాత ఈ వ్యవహారం రాజకీయ రంగు పులుముకుంది. నరసాపురంలోని మాధవాయిపాలెం ఫెర్రీ కాంట్రాక్టర్ సీహెచ్ రెడ్డప్ప ధవేజీ ప్రభుత్వానికి రేవు నిర్వహణకు సంబంధించిన లీజు డబ్బులు బకాయి ఉండటంతోనే ఎంపీడీవో కనిపించకుండాపోయారని కూటమి నేతలు ఆరోపణలు చేశారు. కాంట్రాక్టర్ ధవేజీ మాజీ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు అనుచరుడని, లీజు డబ్బులు చెల్లించకుండా ప్రసాదరాజు ఒత్తిడి తెచ్చారని విమర్శించారు. అందువల్లే ఒత్తిడికి గురైన ఎంపీడీవో ఆత్మహత్య చేసుకున్నారని ఆరోపించారు. ఈ క్రమంలో ఎంపీడీవో తన కుటుంబ సభ్యులకు వాట్సాప్‌లో పెట్టిన సూసైడ్ నోట్ కథనాన్ని తెరపైకి తెచ్చారు. అయితే, ఎంపీడీవో ఆత్మహత్యకు, ఫెర్రీ వ్యవహారానికి సంబంధం లేదని పోలీసుల విచారణలో తేలినట్లు సమాచారం. -
కౌన్సిలర్ నుంచి కేబినేట్లోకి
సాక్షి, భీమవరం: ఆయన పేరు భూపతిరాజు శ్రీని వాసవర్మ అయినా.. ప్రజలకు తెలిసింది బీజేపీ వర్మగానే. ఎంపీ అభ్యర్థిగా తన పేరును పార్టీ ప్రకటించినా.. సీటు మార్పు కోసం మిత్రపక్ష నేతల పైరవీలతో బీ ఫాం ఆయన చేతికందే వరకు ఉత్కంఠభరితంగానే సాగింది. అవాంతరాలు అధిగమించి నరసాపురం ఎంపీగా గెలుపొందడమే కాదు.. తొలి విజయంతోనే కేంద్రంలో అమాత్య పదవిని అందుకున్నారు నరసాపురం ఎంపీ భూపతిరాజు శ్రీనివాసవర్మ. ఎగువ మధ్యతరగతి కుటుంబానికి చెందిన శ్రీనివాసవర్మ స్వాతంత్య్ర సమరయోధుడు భూపతిరాజు బాపిరాజు మనువడు. 1991లో బీజేవైఎం జిల్లా అధ్యక్షుడిగా తన రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. తర్వాత 1995లో బీజేపీ భీమవరం పట్టణ అధ్యక్షుడిగా, 1997లో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా కార్యదర్శిగా, 1999లో నరసాపురం పార్లమెంట్ కన్వీనర్‌గా, 2001లో పార్టీ జాతీయ కౌన్సిల్ సభ్యుడిగా, 2010 నుంచి పదేళ్ల పాటు జిల్లా అధ్యక్షుడిగా, 2020 నుంచి రాష్ట్ర కార్యదర్శిగా పదవులు నిర్వర్తించారు. అధికారంతో నిమిత్తం లేకుండా అధిష్టానం ఆదేశాలను పాటిస్తూ పార్టీ కార్యక్రమాల్లో చురుకైనపాత్ర పోషిస్తూ వచ్చారు. గతంలో నరసాపురం నుంచి బీజేపీ అభ్యర్థులుగా పోటీచేసిన యూవీ కృష్ణంరాజు, గోకరాజు గంగరాజుల విజయంలో కీలకంగా వ్యవహరించారు. 2014 మున్సిపల్ ఎన్నికల ద్వారా ప్రజాక్షేత్రంలోకి అడుగుపెట్టిన ఆయన భీమవరం నాలుగో వార్డు నుంచి కౌన్సిలర్‌గా గెలుపొందారు. మున్సిపాలిటీ ప్యానెల్ చైర్మన్‌గా సేవలందించారు. పార్టీలతో నిమిత్తం లేకుండా అందరితోను కలుపుగోలుతనంగా ఉంటారని పేరొందారు. పార్టీ కార్యాలయం నిర్మాణం కోసం తన సొంత స్థలాన్ని ఇచ్చారు.సీటు సాధించుకున్నారునరసాపురం ఎంపీ సీటు విషయమై మొదట్లో పెద్ద హైడ్రామానే నడిచింది. ఎంపీ అభ్యర్థిగా తాను పోటీలో ఉండాలని సిట్టింగ్ ఎంపీ రఘురామకృష్ణంరాజు భావించారు. బీజేపీ తమ అభ్యర్థిగా శ్రీనివాసవర్మ పేరును ప్రకటించింది. సీటు మార్పు కోసం రఘురామకృష్ణంరాజు ప్రయత్నాలు చేసినట్టు పెద్ద ప్రచారం జరిగింది. ఈ పరిస్థితుల్లో శ్రీనివాసవర్మే తమ అభ్యర్థి అని.. సీటు మార్పు ప్రచారాన్ని బీజేపీ నాయకులు మీడియా ద్వారా ఖండించాల్సి వచ్చింది. పైస్థాయిలో ఉన్న పలుకుబడితో తనకు వ్యతిరేకంగా జరుగుతున్న ప్రయత్నాలకు శ్రీనివాసవర్మ తెరదించారు. పార్టీ నుంచి బీఫాం అందుకుని నామినేషన్ దాఖలు చేశారు. ఎన్నికల్లో 2.76 లక్షల ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు. ఎంపీగా తొలి విజయంతోనే శ్రీనివాసవర్మను కేంద్ర మంత్రి పదవి వరించింది. కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కుశాఖ సహాయ మంత్రిగా శ్రీనివాసవర్మకు కేబినేట్లో చోటు దక్కడం విశేషం. -
తొలి ఫలితం కొవ్వూరు, నరసాపురం
సాక్షి, అమరావతి: వచ్చే జూన్ 4న కొన్ని నియోజకవర్గాల అభ్యర్థుల భవితవ్యం ఓట్ల లెక్కింపు మొదలైన కొన్ని గంటల్లోనే తేలిపోనుండగా.. మరికొన్ని నియోజకవర్గాల తుది ఫలితం కోసం రాత్రి వరకు వేచిచూడాల్సి ఉంటుంది. పోలైన ఓట్లు, కౌంటింగ్ హాళ్లలో ఏర్పాటు చేసిన టేబుళ్ల ఆధారంగా ఎన్నికల సంఘం నియోజకవర్గాల వారీగా ఓట్ల లెక్కింపునకు అవసరమైన రౌండ్లను నిర్ధారించింది.దీని ప్రకారం.. రాష్ట్రంలో అన్నింటికంటే ముందుగా తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు (ఎస్సీ), పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం అసెంబ్లీ నియోజకవర్గాల తుది ఫలితాలు మధ్యాహ్నంలోపే ప్రకటించే అవకాశముందని ఎన్నికల సంఘ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ రెండు నియోజకవర్గాల్లో కేవలం 13 రౌండ్లలోనే లెక్కింపు పూర్తికానుంది. ఇదే సమయంలో రంపచోడవరం (ఎస్టీ), చంద్రగిరి నియోజకవర్గాల్లో అత్యధికంగా 29 రౌండ్ల లెక్కింపు జరుగుతుంది. ఆ తర్వాత పాణ్యం, భీమిలి నియోజకవర్గాల్లో 25 రౌండ్ల లెక్కింపు జరుగుతుంది. ఈ రెండు నియోజకవర్గాల్లో తుది ఫలితాల వెల్లడికి రాత్రి 7 గంటల వరకు వేచిచూడాల్సి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. 111 చోట్ల 20, అంత కంటే తక్కువ రౌండ్లలోనే పూర్తి రాష్ట్రంలోని మొత్తం 175 నియోజకవర్గాల్లో అత్యధికంగా 111 నియోజకవర్గాల్లో 20కంటే తక్కువ రౌండ్లలోనే లెక్కింపు పూర్తికానుంది. ఈ నియోజకవర్గాల ఫలితాలను మధ్యాహ్నం 2 గంటల్లోగా పూర్తిచేయాలని అధికారులు లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. దీని ప్రకారం.. కౌంటింగ్ హాళ్లల్లో తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. 60 నియోజకవర్గాల్లో 21 నుంచి 25 రౌండ్ల వరకు ఓట్ల లెక్కింపు జరగనుంది. ఈ నియోజకవర్గాల ఫలితాలను సాయంత్రంలోగా వెల్లడిస్తారు. ఎటువంటి గందరగోళం లేకుండా అందరి అనుమతితోనే సువిధ యాప్‌లో అప్లోడ్ చేసిన తర్వాతే ఫలితాలను ప్రకటించనున్నట్లు ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు. ఓట్ల లెక్కింపు పూర్తయిన వెంటనే లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ప్రకటనకు సంబంధించిన ఫారం–21సీ, 21ఈలను అదేరోజు ఫ్లైట్‌లో కేంద్ర ఎన్నికల సంఘానికి పంపాల్సి ఉంటుంది. -
జనసేన నాయకుడి దౌర్జన్యం
నరసాపురం: ఎన్నికల ఫలితాలు వెలువడక ముందే నరసాపురంలో జనసేన నాయకులు రెచ్చిపోతున్నారు. మొగల్తూరు మండలం కేపీపాలెం బీచ్ సమీపంలో ఆటోలో వెళుతున్న ఓ కుటుంబంపై జనసేన అభ్యర్థి బొమ్మిడి నాయకర్ అనుచరుడు బళ్ల బాబి ఆదివారం సాయంత్రం 6 గంటల సమయంలో దాడి చేశాడు. ఓ మహిళను, మరో ఇద్దరిని తీవ్రంగా గాయపరిచాడు. వివరాలిలా ఉన్నాయి.. లక్ష్మణేశ్వరం గ్రామానికి చెందిన కడలి శ్రీనివాస్ ఇంటికి ఆచంట వేమవరానికి చెందిన బొక్కా శ్రీనివాస్ అతని భార్య లక్ష్మి మరికొందరు బంధువులు వచ్చారు. వీరంతా కలిసి ఆటోలో పేరుపాలెం బీచ్‌కు వెళ్లారు. అదే ఆటోలో తిరిగి వస్తుండగా తూర్పుతాళ్లు గ్రామానికి చెందిన జనసేన చోటా నాయకుడు బళ్ల బాబి, అతడి స్నేహితులు మరో ముగ్గురు కారులో వస్తున్నారు. కారుకు ఆటో సైడ్ ఇవ్వలేదనే కోపంతో ఆటోను వెంబడించి కేపీపాలెం గ్రామం వద్ద ఆపారు. అసలు విషయం పక్కన పెట్టిన అసలు మీరు ఎవరు? మొన్న ఎన్నికల్లో జనసేనకు ఓటు వేశారా? వైఎస్సార్సీపీకి ఓటు వేశారా అంటూ బాబి వారిని నిలదీశాడు. మీరు బీసీల్లా ఉన్నారు.. మీరు వైఎస్సార్సీపీకి ఓటు వేసి ఉంటారంటూ వారిపై బాబి, అతడి స్నేహితులు దాడి చేసి అక్కడి నుంచి జారుకున్నారు. దీంతో లక్ష్మితో పాటు బొక్కా శ్రీనివాస్, కడలి శ్రీనుకు గాయాలయ్యాయి. వారిని స్థానికులు నరసాపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. నరసాపురం డీఎస్పీ జి.శ్రీనివాస్ ఆస్పత్రికి వెళ్లి బాధితులను పరామర్శించారు. అయితే కేసులో పోలీసులు జనసేన నేత బళ్ల బాబీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ బాధితుల బంధువులు ఆందోళన చేశారు. బాబీని కొంతసేపు ఆస్పత్రిలోని ప్రత్యేక గదిలో ఉంచిన పోలీసులు అతడిని రూరల్ స్టేషన్‌కు తరలించారని, కేసు నుంచి తప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని బాధితుల బంధువులు ఆరోపిస్తున్నారు. -
ఇది క్లాస్ వార్..దద్దరిల్లిన నరసాపురం
-
అవ్వా, తాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్ రియాక్షన్..
-
జరుగుతున్నది క్యాస్ట్ వార్ కాదు.. క్లాస్ వార్: సీఎం జగన్
సాక్షి, నరసాపురం: చంద్రబాబు 14 ఏళ్లు సీఎంగా ఉండి ఒక్క మంచి పనైనా చేశారా అని ప్రశ్నించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అలాగే, చంద్రబాబు పేరు చెబితే ఒక్క మంచి పథకమైనా గుర్తుకు వస్తుందా?. రాష్ట్రంలో జరుగుతున్నది కులాల మధ్య యుద్ధం కాదు.. క్లాస్ వార్ అని అన్నారు. కాగా, ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం జగన్ నరసాపురంలో రోడ్ షో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ముఖ్యమంత్రి జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ కామెంట్స్..పథకాల కొనసాగింపును నిర్ణయించబోయే ఎన్నికలు. చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపే. చంద్రబాబుకు ఓటేస్తే చంద్రముఖిని తలుపు తట్టి లేపడమే. 14 ఏళ్లు సీఎంగా ఉండి చంద్రబాబు ఒక్క మంచి పని అయినా చేశారా?. టీడీపీ పాలనలో ఏనాడైనా ఇలాంటి పథకాలు అమలు చేశాడా?. చంద్రబాబు మూడు సార్లు ముఖ్యమంత్రిగా పని చేశానని చెప్పుకుంటారు. చంద్రబాబును నమ్మడమంటే కొండ చిలువ నోట్లు తలపెట్టినట్టే. మరో పది రోజల్లో కురుక్షేత్ర యుద్ధం జరుగబోతుంది. ఈ ఎన్నికలు రాబోయే ఐదేళ్ల మీ ఇంటి భవిష్యత్ పథకాల కొనసాగింపును నిర్ణయించబోయే ఎన్నికలు. మీ బిడ్డ పాలనలో అవ్వాతాతలకు ఇంటికే రూ.3వేల పెన్షన్. బాబు పాలనలో ఇంటికే పెన్షన్ వచ్చే పరిస్థితి ఏనాడైనా కనబడిందా?. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం, బైజూస్ కంటెంట్. ఇంగ్లీష్ మీడియంతో అడుగులు సీబీఎస్సీ నుంచి ఐబీ వరకు కనపడుతుంది. ఆరో తరగతి నుంచే క్లాస్‌రూమ్‌లో డిజిటల్ బోధన అందుతోంది. ప్రభుత్వ స్కూల్స్ విద్యార్ధులకు బైలింగువల్ టెక్ట్స్ బుక్స్. రాష్ట్రంలో ఉన్న 93 శాతం పిల్లలకు పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్. జగనన్న విద్యాదీనెన, వసతి దీవెన మీ బిడ్డ పాలనలోనే వచ్చింది. ప్రభుత్వ కాలేజీల్లో అంతర్జాతీయ విద్యా కోర్సులు తెచ్చాం. మీ బిడ్డ జగన్.. అక్కాచెల్లెమ్మలకు తోడుగా నిలబడ్డాడు. అక్కాచెల్లెమ్మలను దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దాం. ఆసరా, సున్నావడ్డీ, చేయూతతో అక్కాచెల్లెమ్మలను ఆదుకున్నాం. అక్కాచెల్లెమ్మల కోసం కాపు నేస్తం, ఈబీసీ నేస్తం తీసుకొచ్చాం. 31లక్షల ఇళ్లపట్టాలు అక్కాచెల్లెమ్మలకు ఇచ్చాం. రైతులకు పగటిపూటే తొమ్మిది గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్నాం. సకాలంలో ఇన్పుట్ సబ్సిబీ అందిస్తున్నాం. విత్తనం నుంచి పంట కొనుగోలు వరకు రైతన్నకు తోడుగా నిలిచాం. ప్రతీ రంగంలోనూ విప్లవం తీసుకువచ్చాం. పేదవాడి వైద్యం కోసం రూ.25లక్షల వరకు ఆరోగ్యశ్రీని విస్తరించాం. పేషంట్ విశ్రాంతి సమయంలోనూ ఆర్థిక సాయం అందించాం. ఆరోగ్య ఆసరా, ఆరోగ్య సురక్ష, ఫ్యామిలీ డాక్టర్, విలేజ్ క్లినిక్‌ల ద్వారా పేదవాడిని ఆదుకున్నాం. నాడు-నేడుతో ప్రభుత్వ ఆసుపత్రుల రూపురేఖలు మార్చాం. జగనన్న తోడు, జగనన్న చేదోడు ద్వారా చిరు వ్యాపారులకు సాయం అందించాం. గ్రామ సచివాలయాల ద్వారా గ్రామ స్వరాజ్యం తెచ్చాం. రూ.2లక్షల 70వేల కోట్లు నేరుగా పేదల ఖాతాల్లో వేశాం. రెండు లక్షల 31వేల ఉద్యోగాలిచ్చాం. చంద్రబాబు పేరు చెబితే ఒక్క పథకమైనా గుర్తుకొస్తుందా?. రైతు రుణమాఫీ చేస్తానన్నాడు.. చేశాడా?. రూ.87వేల కోట్ల రుణాలు మాఫీ అన్నాడు.. చేశాడా?.డ్వాక్రా రుణాలు రద్దు చేస్తానన్నాడు.. చేశాడా?. రాష్ట్రంలో జరుగుతున్నది కులాల మధ్య యుద్ధం కాదు.. క్లాస్ వార్. మళ్లీ ఇదే కూటమి కొత్త కొత్త మోసాలతో వస్తోంది. ఇంటింటికి కేజీ బంగారం, బెంజ్ కారు ఇస్తారంట.. నమ్ముతారా?. వాలంటీర్ల సేవలు కొనసాగాలంటే రెండు బటన్లు ఫ్యాన్ గుర్తుకే నొక్కాలి. పేదవాడి భవిష్యత్ కోసం రెండు బటన్లు ఫ్యాన్ గుర్తుకే నొక్కాలి. 175కు 175 అసెంబ్లీ, 25కు 25 ఎంపీ సీట్లు గెలవాల్సిందే. మంచి చేసిన ఫ్యాన్ ఇంట్లోనే ఉండాలి. చెడు చేసిన సైకిల్ ఇంటి బయటే ఉండాలి. తాగేసిన టీ గ్లాస్ సింక్‌లోనే ఉండాలి అని కామెంట్స్ చేశారు. -
నరసాపురం జనసంద్రం
-
ఎంపీ సీటు గెలిచి సీఎం జగన్ కు కనుక ఇస్తా
-
బరిలో ఉంటా.. తగ్గేదే లే!
సాక్షి, భీమవరం: రానున్న ఎన్నికల్లో తాను పోటీలో ఉంటానని పశ్చిమగోదావరి జిల్లా ఉండి మాజీ ఎమ్మెల్యే, టీడీపీ అసమ్మతి నేత వేటుకూరి శివరామరాజు స్పష్టం చేశారు. ఏ పార్టీ నుంచి పోటీచేసేది రెండు రోజుల్లో వెల్లడిస్తానని తెలిపారు. పార్టీనే అంటిపెట్టుకుని ఉన్న తన పట్ల చంద్రబాబు తీరు కలచివేసిందన్నారు. టీడీపీ అధిష్టానం తీరుతో కలతచెందిన శివరామరాజు మంగళవారం భీమవరంలోని తన కార్యాలయం వద్ద టీడీపీ, జనసేన ఫ్లెక్సీలను తొలగించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా బుధవారం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. టీడీపీ నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన తాను నియోజకవర్గ అభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేశానని.. అధిష్టానం ఆదేశాల మేరకు గత ఎన్నికల్లో నరసాపురం ఎంపీ స్థానం నుంచి పోటీ చేసి పరాజయం చెందానన్నారు. ఉండి నుంచి అధిష్టానం టికెట్ ఇవ్వకపోవడం దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు. టీడీపీ కోసం ఎంతో కష్టపడి పనిచేశానని, అభ్యర్థి ఎంపిక విషయంలో తనతో సంప్రదించకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం తీవ్ర ఆవేదనకు గురిచేసిందన్నారు. పదిహేను రోజులుగా పార్టీ నాయకత్వం కనీసం పట్టించుకుకోలేదన్నారు. అనుచరుల కోరిక మేరకు వచ్చే ఎన్నికల్లో పోటీలో నిలవాలని నిర్ణయించుకున్నానని చెప్పారు. -
రఘురామా.. ప్లీజ్ గెటవుట్!
వైఎస్సార్సీపీ ప్రభంజనంలో గెలిచి తెలుగుదేశం పల్లకి మోస్తోన్న రఘురామ కృష్ణం రాజుకు తన అసలు విలువ ఏంటో ఇపుడు తెలిసొచ్చింది. హస్తినలో కేంద్రమంత్రి అమిత్‌షా నివాసంలోకి వెళ్లాలనుకున్న రఘురామకు ఘోర పరాభవం ఎదురైంది. చంద్రబాబు నాయుడికి చాకిరీ చేసిన రఘురామ.. ఈ అవమానంతో రఘురామ రాజు కుత కుత ఉడికిపోయారు. ఇంత దారుణమా అని రగిలిపోయారు. జగన్ మోహన్ రెడ్డి మేనియాతో 2019లో ఫ్యాన్ ప్రభంజనలో నరసాపురం లోక్ సభ స్థానం నుండి గెలిచి ఎంపీ అనిపించుకున్నారు రఘురామ. ఆ తర్వాత తన గొంతెమ్మ కోరికలు చట్టవిరుద్ధ వ్యాపకాలకు సహకరించడం లేదని జగన్‌కు దూరం జరిగారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడితో చేరి కుట్ర రాజకీయాలు చేశారు. నిత్యం ఎల్లో మీడియాలో కూర్చుని ప్రభుత్వంపైనా ముఖ్యమంత్రిపైనా అసభ్య పదజాలంతో విష ప్రచారం చేశారు. అయిదేళ్లుగా వైఎస్సార్సీపీ పార్టీ ద్వారా వచ్చిన పదవి అనుభవిస్తూ చంద్రబాబు నాయుడి దగ్గర టిప్పులు తీసుకుంటూ రాజకీయ భిక్ష పెట్టిన జగన్‌ను విమర్శిస్తూ క్షుద్ర రాజకీయాలు చేస్తున్నారు రఘురామ. అపుడు ఆయన వైఎస్సార్సీపీ ఎంపీ హోదాలో పార్లమెంటులో కానీ.. బయట కానీ బీజేపీ అగ్రనేతలను కలవగలిగారు. ఆ వాపునే ఆయన బలుపు అనుకున్నారు. తన అసలు బలం ఏంటో ఈ రోజు తెలిసొచ్చింది రఘురామ కృష్ణం రాజుకు. ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్ని పొత్తులు పెట్టుకున్నా వైఎస్సార్సీపీని ఓడించడం మాట దేవుడెరుగు గట్టి పోటీని కూడా ఇచ్చే పరిస్థితి లేకపోవడంతో టీడీపీ అధినేత చంద్రబాబు-జనసేన నాయకుడు పవన్ కల్యాణ్ లు బిజెపి పొత్తుకోసం మూడు రోజులుగా అమిత్‌షా ఇంటి ముందుపడిగాపులు పడుతున్న సంగతి తెలిసిందే. సర్లే అని అమిత్‌షా చంద్రబాబు, పవన్ లను తన నివాసంలోకి పిలిచారు. వారితో పాటే షా నివాసంలోకి దూరి వెళ్లిపోదామనుకున్న రఘురామ వారి వెనకాలే వెళ్లారు. బాబు, పవన్ లను లోనికి పంపించిన సెక్యూరిటీ సిబ్బంది రఘురామను మాత్రం ఆగక్కడ అని ఆపేశారు. తాను రఘురామ కృష్ణం రాజుని అని తన గురించి తాను చెప్పుకున్న భద్రతా సిబ్బంది లోనికి పంపలేదు. అక్కడే నిలబడ్డంతో సార్ ప్లీజ్ గెటవుట్ అని చాలా మర్యాదగా అక్కడి నుంచి వెళ్లిపొమ్మన్నారు. దీంతో రఘురామ ముక్కు ఎగ పీల్చుకుని కుమిలిపోయారు. చేసేదేమీ లేక నిస్సహాయంగా మిగిలిపోయారు. ఇంత కాలం తనకు అపాయింట్ మెంట్లు ఇచ్చిన బీజేపీ నేతలు.. ఇపుడు తనకి పూచిక పుల్లంత విలువ కూడా ఇవ్వకపోవడం ఎందుకో రఘురామకు నెమ్మదిగా బోధపడ్డం మొదలైంది. తానిపుడు వైఎస్సార్సీపీ లేను కాబట్టే బీజేపీ నేతలు తనని పురుగుని చూసినట్లు చూస్తున్నారని అర్ధమైంది. ఇంత కాలం చంద్రబాబు కోసం చెత్త రాజకీయాలు చేసినా కనీసం చంద్రబాబు అయినా తనని షా నివాసంలోకి తీసుకుపోతారేమోనని రఘురామ అనుకున్నారు. కనీసం షా ఇంట్లోకి వెళ్లిన తర్వాత అయినా సెక్యూరిటీకి ఫోన్ చేయించి తనని లోపలికి రమ్మనమని పిలుస్తారని అనుకున్నారు. అయితే అలాంటివేవీ జరక్కపోవడంతో రఘురామకు బాగా కాలింది. ఈ అవమానాన్ని ఎవరికీ చెప్పుకోలేక తనలో తానే దిగమింగుకుని కదిలారు రఘురామ. రఘురామకు దీన్ని మించిన షాక్ మునుముందు తగులుతుందని టీడీపీ నేతలు అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో నరసాపురం లోక్ సభ స్థానం నుంచే తాను పోటీ చేస్తానని రఘురామ చెప్పుకున్నారు. టీడీపీ,జనసేన, బీజేపీల్లో ఏదో ఒక పార్టీ తరపున చేస్తానన్నారు. అయితే ప్రస్తుత వాతావరణం చూస్తోంటే రఘురామకు ఏ పార్టీ కూడా టికెట్ ఇచ్చే పరిస్థితి కనపడ్డం లేదని హస్తిన వర్గాలు అంటున్నాయి. అంటే 2024 ఎన్నికల తర్వాత రఘురామ ఇంటి ముందు మాజీ ఎంపీ అనే బోర్డే సెటిల్ అయిపోవడం ఖాయమంటున్నారు రాజకీయ పండితులు. :::సీఎన్ఎస్ యాజులు, సీనియర్ జర్నలిస్టు -
మొగల్తూరు నుంచి ఢిల్లీ వరకు 'రెబెల్'గా సాగిన కృష్ణంరాజు జీవితం
కృష్ణంరాజు పేరులోనే కాదు గుణంలోనూ రాజే.. రౌద్రానికి రారాజుగా అభిమానులకు మనసున్న మారాజుగా తెలుగు ప్రజల గుండెల్లో ఎప్పుడూ ఆయన పేరు చిరస్మరణీయం. ఆరడుగుల దాటిన ఎత్తు… మొహంలో కొట్టొచ్చినట్టు కనిపించే గాంభీర్యం.. రౌద్రంతో నిండిన చురకత్తుల్లాంటి ఆ చూపులు... ఆయన ఎదురుగా ఉంటే ఇంత పెద్దాయనతో మాట్లాడగలమా.. అసలు నిలబడగలమా అనే ఆలోచన రావడం సహజం... కానీ కొంత సమయం తర్వాత ఆయన్ను తరచి చూస్తే సుతిమెత్తని మనసుతో పాటు ఆప్యాయంగా ప్రేమతో పలకరించే మాటలు వింటారు.. ఆపై వచ్చిన వారిని గౌరవించే పెద్దరికాన్ని ఆయనలో చూస్తారు. మొగల్తూరు ముద్దుబిడ్డగా వెండితెరపై రారాజుగా వెలిగిన రెబల్‌స్టార్ మనల్ని వదిలి వెళ్లి ఏడాది దాటింది.. ఆయన పేరు ఒక చరిత్ర ఎప్పటికీ వెలుగులోనే ఉంటుంది. నేడు ఆయన జయంతి.. కృష్ణంరాజు పుట్టిన రోజు సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆయన ఫ్యాన్స్ పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. కుటుంబ నేపథ్యం 183 సినిమాల్లో హీరోగా, విలన్‌గా మెప్పించిన కృష్ణంరాజు పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో జన్మించారు. ఉప్పలపాటి నారాయణ మూర్తిరాజు లక్ష్మీదేవమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు, ఆరుగురు కుమార్తెలు. వారిలో కృష్ణంరాజు మూడో సంతానం. 1940 జనవరి 20న మొగల్తూరులో ఆయన జన్మించారు. ఆయన బాల్యంతో పాటు విద్యాభ్యాసం అంతా కూడా మొగల్తూరు, నరసాపురం, హైదరాబాద్‌లో జరిగింది. రోడ్డు ప్రమాదంలో మొదటి భార్య మృతితో 1996లో శ్యామలాదేవిని ఆయన రెండో వివాహం చేసకున్నారు. ఈ దంపతులకు ముగ్గురు కుమార్తెలు వారి పేర్లు ప్రసీద, ప్రకీర్తి, ప్రదీప్తిగా ఉన్నాయి. ప్రసీద ‘రాధేశ్యామ్’తో నిర్మాతగా పరిచయం అయ్యారు. రెండో కుమార్తె ప్రకీర్తి సినీ ప్రొడక్షన్ డిజైన్ రంగంలో పనిచేస్తున్నారు. హీరోగా ఎంట్రీ ఎలా జరిగిందంటే సంపన్న కుటుంబంలో పుట్టిన కృష్ణంరాజు హైదరాబాద్ బద్రుకా కళాశాలలో కామర్స్ నుంచి పట్టా పొందారు. అప్పటికే శాసనసభ్యునిగా ఉన్న చింతలపాటి వరప్రసాద మూర్తిరాజు హైదరాబాద్‌లో ఉన్నారు. కృష్ణంరాజుకు ఆయన పినతండ్రి కావడంతో ఆయన వద్దే కొంత కాలం ఉన్నారు. ఆయన ఆరంభించిన ‘ఆంధ్రరత్న’ పత్రిక నిర్వహణతో పాటు ఆయన సినీ సౌండ్ స్టూడియో నిర్వహణ కూడా కృష్ణంరాజు చూస్తుండేవారు. ఆ స్టూడియోలు 'బావమరదళ్లు' సినిమా నిర్మాణం జరిగింది. ఆ చిత్రాన్ని నిర్మించిన పద్మనాభరావు ప్రోత్సాహంతో 1963లో కృష్ణంరాజు మద్రాసు చేరుకున్నారు. తాను తీయబోయే సినిమాలో ఛాన్స్ ఇస్తానని కృష్ణంరాజుకు మాట ఇచ్చి స్క్రీన్ టెస్టు నిర్వహించాడు. ఆపై నటనలొ కొన్ని మెలుకవలు నేర్చుకుని 1965 ఆగస్టు 6న సొంత చిత్రం 'చిలకా గోరింకా'లో నటించారు. అందులో సీనియర్ నటి కృష్ణకుమారి సరసన కృష్ణంరాజు హీరోగా పరిచయం అయ్యారు. నర్సాపురం నుంచి భారీ మెజారిటీతో గెలుపు కృష్ణంరాజు 1991లో కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లో వచ్చినప్పటికీ 1996లో బీజేపీలో చేరారు. 1998 కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. 1999 మధ్యంతర ఎన్నికలలో నర్సాపురం పార్లమెంట్ స్థానం నుంచి లక్షా 50 వేలపైగా ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఆ సమయంలో అటల్ బిహారీ వాజ్‌పేయి టీమ్‌లో ఆయన కేంద్ర మంత్రిగా ఉన్నారు. పరిశ్రమలు, విదేశీ వ్యవహారాలు, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రిగా ఆయన సొంత రాష్ట్రం అయిన ఏపీకి ఎనలేని సేవ చేశారు. కృష్ణంరాజుకు నర్సాపురం, మొగల్తూరు అంటే ఎంతో మమకారం ఉండేది. ఆ ప్రాంత ప్రజల కష్ట సుఖాల్లో ఆయన పాలు పంచుకునేవారు. నర్సాపురం నియోజకవర్గంలోని ప్రతి పల్లెకు కేంద్ర గ్రామీణ సడక్ యోజన పేరుతో సిమెంట్ రోడ్లు నిర్మించారు. అప్పటి వరకు ఏ గ్రామంలోను సిమెంట్ రోడ్లు ఉండేవి కావు. అలా ఆయన ఎనలేని సేవలు అక్కడి ప్రజలకు అందించారు. కానీ 2004 ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగానే బరిలోకి దిగినప్పటికీ ఆయన ఓటమి చెందారు. తిరిగి ఆయన చిరంజీవి కోరికమేరకు 2009లో ప్రజారాజ్యంలో చేరి, రాజమహేంద్రవరం పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి చెందారు. ఆ తర్వాత ప్రజారాజ్యం కాంగ్రెస్‌లో విలీనం కావడంతో ఆయన తిరిగి బీజేపీలో చేరారు. సతీమణితో అనుబంధం తన అర్ధాంగి అయని శ్యామలాదేవి గురించి ఒక ఇంటర్వ్యూలో కృష్ణంరాజు ఇలా అన్నారు. 'నా మొదటి భార్యను కోల్పోవడం నా జీవితంలో అత్యంత విషాద సంఘటన. కానీ ఆ తర్వాత శ్యామల నా జీవితంలోకి అడుగుపెట్టింది. నా జీవితంలో ఎన్నో వెలుగులు నింపింది. ఆమె రాకతో నా జీవితమే మారిపోయింది. నాకు అన్నీ తానైంది. మాకు ముగ్గురు పిల్లలు. వాళ్లతో పాటు నన్నూ ఓ పిల్లాడిలా భావించి నాకేం కావాలో చూసుకుంటుంది. నాకు అనారోగ్యం వస్తే తనూ నిద్ర కూడా పోదు. ఎప్పుడూ ప్రతి క్షణం నా వెంటే ఉండేది. శ్యామల నాకు దేవుడు ఇచ్చిన వరం.' అంటూ తన అర్ధాంగి గురించి గొప్పగా చెప్పారు కృష్ణంరాజు. తన సినీ వారసుడిగా ప్రభాస్ కృష్ణంరాజు, ప్రభాస్‌ల అనుబంధం తండ్రీకొడుకుల లాంటిది. కృష్ణంరాజు తమ్ముడు, నిర్మాత ఉప్పలపాటి సూర్య నారాయణరాజు కుమారుడే ప్రభాస్. చిన్నతనం నుంచే ప్రభాస్ ఎక్కువగా కృష్ణంరాజు వద్దే ఉండే వాడు. తన పెదనాన్న అడుగుజాడల్లో నటుడిగా మారాడు. 2010లో ప్రభాస్ తండ్రి మరణించిన తర్వాత ప్రభాస్‌కు ఒక తండ్రిలా వెన్నంటి కృష్ణంరాజు నిలబడ్డారు. ప్రభాస్ జీవితంలో ఎత్తుపల్లాల మధ్య ఒక గురువులా ఆయన ఉన్నారు. దీంతో ప్రభాస్‌కు ఆయనంటే విపరీతమైన గౌరవం. కానీ ప్రభాస్ విషయంలో చివరి కోరిక కృష్ణంరాజుకు తీరలేదు. రాధేశ్యామ్ సినిమా సమయంలో ప్రభాస్ పెళ్లి గురించి మాట్లాడుతూ.. "అతను వీలైనంత త్వరగా పెళ్లి చేసుకోవడం నాకు చాలా ఇష్టం. నేను అతని కొడుకు లేదా కుమార్తెతో ఆడాలనుకుంటున్నాను.' అని ఆయన అన్నారు. ఆయన కోరుకున్నట్లే జీవితాన్ని ముగించారు అనారోగ్యంతో 2022 సెప్టెంబర్ 11న కృష్ణంరాజు కన్నుమూశారు. మరణం గురించి ఒక ఇంటర్వ్యూలో ఇలా చెప్పారు. గతంలో ఒక ఇంటర్వ్యూలో ఆయనకు ఒక ప్రశ్న ఎదురైంది. 'మీరు జీవితంలో ఇంకా ఏమైనా సాధించాల్సినవి ఉన్నాయా...? దానికి ఆయన నుంచి వచ్చిన జవాబు ఇదే 'జీవిత చరమాంకంలో ఉన్నప్పుడు.. ఓ పచ్చని చెట్టు కింద కూర్చుని, గుండె మీద చేయి వేసుకుని… దేవుడా, నాకిచ్చిన ఈ మానవ జన్మలో నేనెవరికీ ద్రోహం చేయలేదు, నావల్ల ఎవరికీ బాధ కలగలేదనే భావనతో హాయిగా కన్నుమూయాలి.' అని చెప్పారు. అదే రీతిలో ఆయన జీవితం ముగిసింది. నేడు మెగా వైద్య శిబిరం కృష్ణంరాజు జయంతి సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు మొగల్తూరు అబ్యాస్ కళాశాలలో నేడు మెగా ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటుచేశారు. కృష్ణంరాజు సతీమణి శ్యామలాదేవి వారి పిల్లలు గత రెండు రోజులుగా మొగల్తూరులోనే ఉంటున్నారు. దేశ, విదేశాలకు చెందిన 30 మంది ప్రముఖ వైద్యులతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కృష్ణంరాజు జీవితంలో ఇవన్నీ ఆసక్తి కలిగిస్తాయి ► కృష్ణంరాజు కెరీర్లో 'భక్తకన్నప్ప' మైలురాయిలాంటి సినిమా. ఈ చిత్రాన్ని ప్రభాస్ హీరోగా మళ్లీ రీమేక్ చేయాలని కృష్ణంరాజు అనుకున్నారు. అందుకు అనుగుణంగా స్క్రిప్ట్ కూడా తయారు చేశారు. ఈ సినిమాను తన సొంత బ్యానర్‌పై తానే దర్శకత్వం వహించాలని కూడా ఆయన ఆశపడ్డారు. కానీ, ప్రభాస్ వేరే ప్రాజెక్టులతో బిజీ అయిపోవడంతో పాటు పాన్ ఇండియా స్టార్‌గా మారడంతో 'భక్తకన్నప్ప' పట్టాలెక్కలేదు ► కృష్ణంరాజుకు 'మన ఊరి పాండవులు' చిత్రం కూడా చాలా ఇష్టం. దాన్ని రీమేక్ చేసే అవకాశం వస్తే, ప్రభాస్‌ను పెట్టి తీయాలనుకున్నారు ► 1984 సమయంలో కృష్ణంరాజు హీరోగా నటించిన 'భారతంలో శంఖారావం' వందరోజుల వేడుక ప్లాన్ చేశారు. అదే సమయంలో తుపాను వల్ల చాలామంది రోడ్డున పడ్డారు. దీంతో ఆ వేడుక కోసం అయ్యే ఖర్చు నిర్మాత నుంచి రూ.70 వేలు ఆపై తన నుంచి రూ. 1,30,000 కలిపి వరద బాధితుల సహాయార్థం విరాళం ఇచ్చారు ► కటకటాల రుద్రయ్య, రంగూన్ రౌడీ తదితర చిత్రాలు కృష్ణంరాజుని రెబల్‌స్టార్‌గా మార్చేశాయి ► ‘గోపీకృష్ణా మూవీస్’ అనే సంస్థను నెలకొల్పి ఆయన నిర్మాతగా మారారు. ఆ బ్యానర్లో వచ్చిన తొలి చిత్రం ‘కృష్ణవేణి’. ఆ తర్వాత ఆ బ్యానర్‌పై తాండ్ర పాపారాయుడు, బొబ్బిలి బ్రహ్మన్న, భక్త కన్నప్ప, బిల్లా తదితర ఎన్నో హిట్ చిత్రాలు వచ్చాయి ► తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలను నిర్మించిన కృష్ణంరాజు హిందీలోనూ ఓ సినిమా నిర్మించారు. అదే ‘ధర్మాధికారి’. దిలీప్ కుమార్, జితేంద్ర, శ్రీదేవి, రోహిణీ హట్టంగడి ప్రధాన పాత్రల్లో నటించారు. దీన్ని కె.రాఘవేంద్రరావు తెరకెక్కించారు ► కృష్ణ.. కృష్ణంరాజులు ఇద్దరూ కలిసి అత్యధికంగా 17కి పైగా చిత్రాల్లో నటించారు ► కృష్ణంరాజు అభిమాన నటుడు అక్కినేని నాగేశ్వరరావు. ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన రోజుల్లో నటుడిగా ఆయన్ని వెన్నుతట్టి ప్రోత్సహించిన అగ్రతారల్లో ఏయన్నార్ ఒకరు ► కృష్ణంరాజు, ప్రభాస్ ఇద్దరూ కలిసి బిల్లా చిత్రంలో మొదటిసారి నటించారు. ఆ తర్వాత రెబల్, రాధేశ్యామ్ చిత్రాల్లో కనిపించారు - సాక్షి, వెబ్‌డెస్క్ ప్రత్యేకం -
టీడీపీ, జనసేన మధ్య బిగుస్తున్న ‘సీటు’ముడి
సాక్షి ప్రతినిధి, ఏలూరు: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం నియోజకవర్గంలో టీడీపీ, జనసేన మధ్య పడిన ‘సీటు’ముడి రోజురోజుకూ బిగుసుకుపోతోంది. రెండు పార్టీల మధ్య రాజకీయ కాక తారస్థాయికి చేరగా.. ఇరుపార్టీల నేతల మధ్య సిగపట్లు పెరిగాయి. ఉభయ పార్టీలు సోషల్ మీడియా వేదికగా పరస్పర మాటల యుద్ధంతో రచ్చకెక్కుతున్నారు. నరసాపురం టికెట్ తమదంటే.. తమదంటూ అనుకూల సమీకరణాలు చెప్పుకుంటూ హడావుడి చేస్తున్నాయి. జనసేన అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్ టీడీపీతో దోస్తీ ప్రకటించిన నాటినుంచి నియోజకవర్గంలో రెండు పార్టీలూ కలిసికట్టుగా నిర్వహించిన కార్యక్రమాలు లేకపోగా.. తాజా పరిణామాలు ఆ పార్టీల మధ్య మరింత దూరం పెంచుతోంది. జనసేన నుంచి ఒకరు, టీడీపీ నుంచి నలుగురు టికెట్లు ఆశిస్తూ వర్గాలుగా విడిపోయి హంగామా సృష్టిస్తున్నారు. దీంతో తెలుగుదేశం పార్టీ నాలుగు వర్గాలుగా చీలిపోయింది. తాజా పరిణామాలతో టీడీపీ కార్యక్రమాలకు జన సైనికులు దూరం జరగ్గా.. జన సైనికులతో అంతకంటే ఎక్కువగా టీడీపీ దూరం పాటిస్తోంది. మింగుడు పడని రాజకీయం రాష్ట్రంలోనే అతి చిన్న అసెంబ్లీ నియోజకవర్గాల్లో నరసాపురం ఒకటి. రాజకీయ పరంగా ప్రతిపక్షాలకు ఆదినుంచీ కొరుకుడుపడని విధంగానే ఉంటోంది. ఇప్పుడు కూడా సీటు విషయంలో గందరగోళం నెలకొని టీడీపీ, జనసేన పార్టీలకు మింగుడుపడటం లేదు. రెండు పార్టీలకు కనీస స్థాయిలో కూడా బలమైన ఇన్చార్జిలు లేకపోవడం, ఆశావహులు ఎక్కువగా ఉండటం, కుల సమీకరణాలు కీలక ప్రాధాన్యంగా మారడంతో నియోజకవర్గంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. 1983 నుంచి 2004 వరకు నరసాపురంలో టీడీపీ గెలుపొందుతూ వచ్చింది. 2009లో ముదునూరి ప్రసాదరాజు గెలుపొందారు. మళ్లీ 2019లో వైఎస్ జగన్ ప్రభంజనంలో ఘన విజయం సాధించి ప్రభుత్వ చీఫ్ విప్‌గా కొనసాగుతున్నారు. పూర్తిగా పాజిటివ్ పాలిటిక్స్‌తో అర్థరహిత విమర్శలకు పోకుండా నియోజకవర్గంలో గడచిన నాలుగేళ్ల 9 నెలల కాలంలో పెద్దఎత్తున అభివృద్ధి పనులు నిర్వహించారు. మొదటినుంచీ ఆయన జనంలో బలంగా తిరుగుతున్నారు. ప్రసాదరాజు అన్నివర్గాలనూ కలుపుకుపోతూ నానాటికీ బలపడుతుండటంతో టీడీపీ, జనసేన శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి. గత ఎన్నికల్లో రెండో స్థానం వచ్చినా.. 2019 ఎన్నికల్లో జనసేన ఈ నియోజకవర్గంలో టీడీపీ కంటే ఎక్కువ ఓట్లు సాధించి రెండో స్థానంలో నిలిచింది. ఆ ఎన్నికల్లో టీడీపీని మూడో స్థానంలోకి నెట్టి దాదాపు 35 ఏళ్ల టీడీపీ రాజకీయ ప్రస్థానానికి జనసేన గండి కొట్టింది. నాటినుంచి నేటివరకు నియోజకవర్గంలో టీడీపీ కోలుకోలేని స్థితిలోకి వెళ్లిపోయింది. జనసేన అభ్యర్థి బొమ్మిడి నాయకర్ 49,120 ఓట్లు సాధించగా.. టీడీపీ దారుణంగా పతనమై 27,059 ఓట్లకు పరిమితమైంది. ఈ నేపథ్యంలో పొత్తు లేకుండానే అత్యధిక ఓట్లు సాధించాం కాబట్టి పొత్తుల్లో పవన్ కల్యాణ్ కంటే ముందు నరసాపురం సీటును జనసేన పార్టీకే ప్రకటిస్తారని జనసేన కార్యకర్తలు నాయకులు సోషల్ మీడియాతోపాటు బహిరంగంగానూ బలంగా వాణి వినిపిస్తున్నారు. నియోజకవర్గంలో టీడీపీ పనైపోయిందంటూ జనసేన కార్యకర్తలు టీడీపీ నిర్వహించే కార్యక్రమాలకు, సమన్వయ కమిటీ కార్యక్రమాలకు, చంద్రబాబు పర్యటనలకు పూర్తిగా దూరంగా ఉంటున్నారు. టీడీపీ సైతం జనసేనతో ఇదే దూరం పాటిస్తోంది. టీడీపీలో టికెట్ లొల్లి టీడీపీలో టికెట్ లొల్లి తారాస్థాయికి చేరడంతో గందరగోళం నెలకొంది. నలుగురు అభ్యర్థులు టీడీపీ టికెట్ కోసం ప్రయత్నిస్తూ ఉన్న కొద్దిపాటి కేడర్‌ను చెల్లాచెదురు చేస్తున్నారు. 2014లో ఎమ్మెల్యేగా గెలుపొంది.. 2019లో ఓడిపోయిన బండారు మాధవనాయుడును టీడీపీ ఇన్చార్జిగా తొలగించి అత్యంత మొక్కుబడి నాయకుడైన పొత్తూరు రామరాజును ఇన్చార్జిగా నియమించింది. అప్పటి నుంచి మాజీ ఎమ్మెల్యే, టీడీపీ ఇన్చార్జి వేర్వేరుగా అడపాదడపా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కాగా.. టీడీపీ సీటు ఆశిస్తూ ఎన్ఆర్ఐ కొవ్వలి యతిరాజ రామ్మోహన్నాయుడు కొద్ది నెలలుగా నియోజకవర్గంలో హంగామా చేస్తున్నారు. నరసాపురం సీటు జనసేనకు కేటాయించడం లేదని.. టీడీపీకి చెందిన ముగ్గురికీ కాకుండా తనకే వస్తుందంటూ సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేసుకుంటున్నారు. నియోజకవర్గంలో సొంత అజెండాతో ప్రతిచోటా ఇదే విషయాన్ని చెబుతున్నారు. ఇక అపార అనుభవం ఉండి.. అన్ని రాజకీయ పార్టీలూ తిరిగి వచ్చిన మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు టీడీపీ టికెట్ కోసం విపరీతంగా లాబీయింగ్ చేస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు కూడా చంద్రబాబు తనకే సీటిస్తానని చెప్పారంటూ హడావుడి చేస్తూ నియోజకవర్గంలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. జనసేనలోనూ గందరగోళమే మరోవైపు అభ్యర్థి ఎవరనే విషయంలో జనసేన పార్టీలోనూ గందరగోళం నెలకొంది. గత ఎన్నికల్లో పోటీ చేసిన బొమ్మిడి నాయకర్‌కు ఈసారి ఆ పార్టీ నుంచి సీటొస్తుందో లేదో తెలియని సందిగ్ధ పరిస్థితి నెలకొంది. టీడీపీ సీటు కోసం ప్రయత్నిస్తున్న మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు జనసేన పార్టీ టికెట్ కోసం కూడా కరీ్చప్ వేశారు. మెగాస్టార్ చిరంజీవి ద్వారా నరసాపురం జనసేన సీటు సాధించే ప్రయత్నాల్లో ఉన్నారు. మరోవైపు ఆక్వా వ్యాపారి చాగంటి మురళీకృష్ణ కూడా జనసేన టికెట్‌పై కన్నేశారు. -
నర్సాపురంలో ఫిషరీస్ యూనివర్సిటీ ఏర్పాటు
-
బడుగులకు ఆత్మగౌరవం విలువ చూపించిన జగన్
నరసాపురం: సమాజంలో బడుగు వర్గాలకు అత్మగౌరవం కల్పించి, ఆ విలువ చూపించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మాత్రమేనని మంత్రి సీదిరి అప్పలరాజు చెప్పారు. సీఎం వైఎస్ జగన్ విప్లవాత్మక నిర్ణయాలతో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు సమాజంలో రాజసంతో జీవించే స్థితికి తెచ్చారని తెలిపారు. వైఎస్సార్సీపీ చేపట్టిన సామాజిక సాధికారత బస్సు యాత్రలో భాగంగా శుక్రవారం పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం పట్టణంలో జరిగిన బహిరంగ సభలో మంత్రి మాట్లాడారు. చంద్రబాబు పాలనలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ఎన్నో అన్యాయాలకు, అవమానాలకు గురయ్యారని మంత్రి అప్పలరాజు చెప్పారు. అడుగడుగునా ఆయన ప్రదర్శించిన కుల అహంకారాన్ని, అధికార మదాన్ని వెనుకబడిన కులాలవారు, దళితులు ఎప్పటికీ మరచిపోలేరని అన్నారు. సీఎం వైఎస్ జగన్ అన్ని కులాలు, అన్ని వర్గాలను ఒకేలా చూస్తున్నారని, అనేక కార్యక్రమాలతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల అభ్యున్నతికి పాటు పడుతున్నారని చెప్పారు. ఓ మత్స్యకారుడిని మంత్రిని చేశారని, మరో మత్స్యకారుడు మోపిదేవి వెంకటరమణను పార్లమెంటుకు పంపారని తెలిపారు. ఆలయాల పాలక మండలిలో నాయీ బ్రాహ్మణుడిని డైరెక్టర్‌గా పెట్టాలని నిబంధన పెట్టి ఆ సామాజికవర్గం గౌరవం పెంచారన్నారు. ఇది నిజమైన సామాజిక సాధికారత అని చెప్పారు. అన్ని జిల్లాల్లో హార్బర్లు నిర్మిస్తున్నారని చెప్పారు. టీడీపీ హయాంలో కాపులే నష్టపోయారు: మంత్రి వేణుగోపాలకృష్ణ చంద్రబాబు హయాంలో కాపులే ఎక్కువగా నష్టపోయారని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ చెప్పారు. ఇప్పుడు కాపులు పవన్ భ్రమలో పడి ఇంకా నష్టపోవడానికి సిద్ధంగా లేరన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ఆర్థికంగా బలోపేతం కావడానికి, సమాజంలో ముందడుగు వేయడానికి సీఎం జగన్ అనేక కార్యక్రమాలు చేపట్టారని తెలిపారు. బడుగుల పిల్లలు ఉన్నత చదువులు చదవడానికి ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని మరింత మెరుగుపరిచారని చెప్పారు. ఓ కల్లుగీత కార్మికుడి కొడుకు చెట్టు ఎక్కకుండా, విదేశాల్లో ఉద్యోగం కోసం విమానం ఎక్కుతున్నాడంటే కారణం వైఎస్ కుటుంబమేనని తెలిపారు. అదే చంద్రబాబు ఫీజు రీయింబర్స్మెంట్ మొత్తాన్ని సగానికి తగ్గించారని, ఆయన కులం వారి కాలేజీల్లో ఫీజులు అడ్డగోలుగా పెంచుకోవడానికి అనుమతులిచ్చారని చెప్పారు. దళితులు, బీసీలపై జగన్‌ది నిజమైన చిత్తశుద్ధి: పినిపే మంత్రి పినిపే విశ్వరూప్ మాట్లాడుతూ దళితులు, బీసీలు, మైనార్టీల అభివృద్ధి విషయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ది నిజమైన చిత్తశుద్ధి అని చెప్పారు. కేబినెట్లో, నామినేటెడ్ పోస్టుల్లో దళితులు, బీసీలకు ప్రాధాన్యత ఇచ్చారని, ఈ ప్రాధాన్యం చంద్రబాబు పాలనలో కనిపించలేదని అన్నారు. అభివృద్ధి, సంక్షేమం కొనసాగాలంటే మళ్లీ జగన్ ముఖ్యమంత్రి కావాలని చెప్పారు. అవినీతి లేని పాలన: మోపిదేవి సచివాలయ వ్యవస్థ, వలంటీర్ల ద్వారా కులాలు, మతాలు, పార్టీలకు అతీతంగా, అవినీతి అన్నది లేకుండా ప్రభుత్వ పథకాలను అందిస్తూ సీఎం వైఎస్ జగన్ జనరంజక పాలన అందిస్తున్నారని రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ అన్నారు. బీసీలు వెనుకబడిన వర్గాలు కాదని, సమాజానికి వెన్నెముక లాంటివారని చెప్పడమే కాకుండా, బీసీలు రాజకీయంగా, ఆర్థికంగా ఎదిగేందుకు కృషి చేస్తున్న సీఎం జగన్ అని తెలిపారు. మళ్లీ జగన్ ముఖ్యమంత్రి కాకపోతే చంద్రబాబు పాలన నాటి రోజులు తప్పవని చెప్పారు. నీ పిల్లలను మొగల్తూరులో తెలుగు మీడియం చదివించు పవన్ : పేర్ని నాని సీఎం వైఎస్ జగన్ పేదలు, బడుగు వర్గాల కోసం ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెడితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెగ బాధపడిపోయారని, ఆయన పిల్లలను సొంతూరు మొగల్తూరులో తెలుగు మీడియం స్కూల్లో చదివించవచ్చు కదా అని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. బీసీల అభ్యున్నతికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేపట్టిన చర్యలు మరెవరూ చేపట్టలేరని అన్నారు. ప్రతిపక్షాలు ఎన్ని కుయుక్తులు పన్నినా వచ్చే ఎన్నికల్లో మళ్లీ వైఎస్సార్సీపీ విజయం ఖాయమన్నారు. ఆశలు నిజం చేసిన నాయకుడు జగన్ : ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి ఉన్నతంగా జీవించాలన్న అట్టడుగు వర్గాల కలలను నిజం చేస్తున్న సీఎం వైఎస్ జగన్ అని ప్రభుత్వ చీఫ్ విప్, స్థానిక ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు చెప్పారు. నరసాపురం నియోజకవర్గంలో రూ.5 వేల కోట్ల అభివృద్ధి పనులను ప్రారంభించామని, రూ.1,500 కోట్లు సంక్షేమానికి ఖర్చు చేశామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు, ఎమ్మెల్సీలు పోతుల సునీత, వంక రవీంద్రనాథ్, డీసీసీబీ చైర్మన్ పీవీఎల్ నర్సింహరాజు, క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ పాతపాటి శ్రీనివాసరాజు, జిల్లా మహిళా అధ్యక్షురాలు గూడూరి ఉమాబాల తదితరులు పాల్గొన్నారు. -
YSRCP Bus Yatra: ఆ ఘనత సీఎం జగన్‌దే
నరసాపురం(పశ్చిమగోదావరి జిల్లా): రాష్ట్రంలో ప్రతీ సామాజికి వర్గానికి సముచిత న్యాయం అందించిన ఘనత సీఎం జగన్‌దేనన్నారు మాజీ మంత్రి పేర్ని నాని. వైఎస్సార్సీపీ సామాజిక సాధికారిత రెండో రోజు బస్సు యాత్రలో భాగంగా నరసాపురంలో పేర్ని నాని ప్రసంగించారు. ‘ప్రతీ సామాజిక వర్గం నుంచి ఓ వ్యక్తి ముఖ్యమంత్రి పక్కన కూర్చుంటున్నారు అంటే అది సీఎం జగన్ ఇచ్చిన రాజ్యాధికారమే. గత ముఖ్యమంత్రి చంద్రబాబు అందర్నీ ఓటు బ్యాంకుగా వాడుకున్నారు. 2014 నుంచి 2019 వరకూ అన్ని మంత్రి పదవుల్లో ఎక్కవ మంది చంద్రబాబు సామాజిక వర్గీయులే ఉండేవారు. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. మన ప్రభుత్వంలో అన్ని సామాజిక వర్గీయులకు సముచిత స్థానం కల్పించారు సీఎం జగన్. నామినేటెడ్ పదవులను కూడా అన్ని కులాలకు ఇస్తున్నారు. పవన్ లాంటి వ్యక్తులు సినిమాల్లో డాన్స్ రాదు గానీ రాజకీయాల్లోకి వచ్చి డ్యాన్స్‌లు కడుతున్నారు. వైఎస్సార్సీపీని గద్దె దించడమే తన లక్ష్యమని అంటాడు పవన్. మరి జగన్ మళ్లీ సీఎం కావాలో వద్దో అన్ని సామాజిక వర్గీయులు ఆలోచించుకోవాలి. రాజకీయాల్లో డాన్స్ మాస్టర్ పవన్ లాంటి వారు పిల్లలకు ఇంగ్లీష్ మీడియం ఎందుకని అడుగుతున్నారు మరి వారి పిల్లలు ఎక్కడ చదువుతున్నారు?, పవన్ పిల్లల్ని మొగల్తూరు బడిలో ఎందుకు వేయలేదు? మీ పిల్లకు ఒక న్యాయం పేదలకు న్యాయమా?, చంద్రబాబు రాష్ట్రంలో అందరికి ఇల్లు ఇస్తామని చెప్పి మోసం చేసాడు’ అని ధ్వజమెత్తారు. ఇక ఈ ప్రభుత్వంలో ప్రతీ పేదవాడికి సొంతింటి కల నెరవేర్చిన ఘనత జగన్‌ది’ అని కొనియాడారు పేర్ని నాని. పవన్ కాపులను కూడా మోసం చేశాడు మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ.. రాష్ట్రంలో చంద్రబాబు ముఖ్యమంత్రి అవ్వడానికి మోసం చేయని సామాజిక వర్గం లేదు. అబద్ధం ఆడితే వచ్చే అధికారం నాకు వద్దు అని చెప్పిన వ్యక్తి జగన్. ఆయన చేసేవే చెప్తాడు, అందుకే ప్రజలంతా ఆయన్ను అభిమానిస్తారు. చంద్రబాబు లాంటి వ్యక్తులకు పవన్ కళ్యాణ్ లాంటి వారు అండగా ఉండటమే కాకుండా కాపులను కూడా మోసం చేశాడు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సముచితం న్యాయం కల్పించిన వ్యక్తులు వైఎస్సార్.. ప్రస్తుతం సీఎం జగన్. ఈరోజు ఏ సామాజిక వర్గీయులు కూడా ఎవరి దగ్గరా చేయి చాచకుండా చేసిన ప్రభుత్వం వైఎస్సార్సీపీ ప్రభుత్వం. ఆరోగ్యశ్రీని చంద్రబాబు నిర్వీర్యం చేసాడు. ఫీజ్ రీయింబర్స్మెంట్ పథకానికి కూడా చంద్రబాబు స్వస్తి పలికాడు. పేదరికం బీసీల పాలిట రాక్షసిలా ఉండేది. అలాంటి రాక్షసిని అంతం చేసిన ఘనత సీఎం జగన్‌ది. బీసీల్లో పది మందిని చట్ట సభలకు పంపించిన ఘనత కూడా సీఎం జగన్‌దే. తొక్క తీస్తా.. తోలు తీస్తా.. ఫినిష్ చేస్తా అన్నాడు మంత్రి సీదిరి అప్పలరాజు మాట్లాడుతూ.. ‘తొక్క తెస్తా తోలు తీస్తా.. ఫినిష్ చేస్తా అన్నాడు. నువ్వు ఏంట్రా మమ్మల్లి ఫినిష్ చేసేది.. నీ పాపం పండింది. అందుకే జైల్లో ఉన్నావ్. నాయి బ్రాహ్మానులను తోక కత్తి రిస్తా అన్నాడు.. వారు చంద్రబాబు తోకే కత్తిరించారు.బీసీ జడ్జీలుగా పనికి రారన్న వ్యక్తి చంద్రబాబు. చంద్రబాబు సామాజిక వర్గం వారే జడ్జీలుగా పనికి వస్తారా....?, బీసీ బ్యాక్ బోన్ అని నమ్మిన వ్యక్తి సీఎం జగన్. పేదలకు సంక్షేమ పాలన అందినప్పుడే నిజమైన సాధికారత అని నమ్మిన వ్యక్తి సీఎం జగన్. గతంలో సంక్షేమ పథకాలు అందాలంటే జన్మభూమి కమిటీలు ఆ పిండా కూడు కమిటీల వద్ద ఆత్మాభిమానం చంపు కావాల్సి వచ్చేది. నేడు సీఎం జగన్ సచివాలయం, వాలంటీర్ వ్యవస్థ తెచ్చి పేదల గడపకు పాలన చేర్చారు. మన నాయకుడు సీఎం అయితే అన్ని పథకాలు అమలు అవుతాయి.. మోస పూరిత చంద్రబాబు కావాలో హామీలు నిరవెర్చే సీఎం జగన్ కావాలో ఆలోచించండి. 14 ఏళ్ల చంద్రబాబు పాలనలో ఒక్క హార్బర్‌కి శంకుస్థాపన చేశాడా....? పవన్ కళ్యాణ్ ఎందుకు అడగలేదు’ అని మండిపడ్డారు. చంద్రబాబు ఎక్కడా అబివృద్ధి గురించి పట్టించుకోలేదు మంత్రి పినిపే విశ్వరూప్ మాట్లాడుతూ.. ‘ఏపీలో గతంలో ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు రాష్ట్రంలో ఎక్కడా అభివృద్ధి గురించి పట్టించుకోలేదు. జాబ్ రావాలంటే బాబు రావాలి అన్నారు. ఆయన కొడుక్కి తప్ప ఎవరికి జాబ్ రాలేదు. సీఎంగా జగన్ ప్రమాణస్వీకారం చేసిన వెంటనే ఒకే ఒక్క నోటిఫికేషన్‌తో లక్షా 40 వేల ఉద్యోగాలు ఇచ్చిన ఘనత జగన్‌ది. చంద్రబాబు 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసి ఎక్కడా రుణ మాఫీ చేయలేదు. సీఎం జగన్ మూడు విడతల్లో దాదాపు 20 వేల కోట్ల రూపాయల మహిళా రుణాల రుణమాఫీ చేసిన ఘనత జగన్‌ది. చంద్రబాబు 2 సార్లు ముఖ్యమంత్రి చేశారు గానీ ఎక్కడా పింఛన్లను పెంచలేకపోయాడు. కానీ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక 33 లక్షలు ఉన్న పింఛన్లు 2 వేలు పెంచి పింఛన్ల సంఖ్య 64 లక్షలకు పెరిగింది. ఈ పింఛన్ వచ్చే జనవరి నుంచి 3 వేలు కానుంది’ అని స్పష్టం చేశారు. అన్ని రంగాల్లోనూ సముచితం స్థానం ఎంపీ మోపిదేవి మాట్లాడుతూ.. ‘బడుగు బలహీన వర్గాలకు అన్ని రంగాల్లోనూ సముచిత కల్పించారు. సీఎం జగన్ నాయకత్వంలో అందరికీ సామాజిక న్యాయం లభించింది. సీఎం జగన్ రెండు లక్షల నలభై వేల కోట్లు పేదలకు అందించారు’ అని తెలిపారు. -
‘ప్రతీ కుటుంబం తనదేనని భావించిన వ్యక్తి సీఎం జగన్’
సాక్షి, నరసాపురం: పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం మొగల్తూరు సెంటర్లో వైఎస్సార్సీపీ బస్సు యాత్ర ప్రారంభమైంది. మొగల్తూరు నుంచి రామన్నపాలెం, ఎల్బీ చర్ల మీదుగా యాత్ర నరసాపురం చేరుకుంది. సాయంత్రం ఆరు గంటలకు నరసాపురంలోని ప్రకాశం రోడ్డు రామాలయం సెంటర్లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తారు.ఈ కార్యక్రమంలో మంత్రులు, నేతలు పాల్గొన్నారు. మరోవైపు, బస్సు యాత్ర సందర్బంగా ప్రభుత్వ చీఫ్ విప్ ప్రసాద్ రాజు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు సామాజిక సాధికార యాత్రకు శ్రీకారం చుట్టాము. 175 నియోజకవర్గాల్లో యాత్ర జరుగుతుంది. నరసాపురం నియోజకవర్గంలో ఈ యాత్ర మొగల్తూరు నుంచి ప్రారంభిస్తున్నాము. సీఎం జగన్ నాలుగున్నర సంవత్సరాల పాలన, సాధికారత ప్రజలకు వివరించనున్నాము అని తెలిపారు. ప్రతీ సామాజిక వర్గానికి ప్రత్యేక గుర్తింపు.. మంత్రి శ్రీదిరి అప్పలరాజు మాట్లాడుతూ.. సామాజిక సాధికారత యాత్ర నరసాపురం నియోజవర్గంలో ప్రారంభం అవుతుంది. 17 కిలోమీటర్ల మేర యాత్ర సాగి పట్టణంలో బహిరంగ సభ వరకు చేరుకుంటుంది. ప్రతిపక్షాలు యాత్ర ఎందుకు అంటున్నాయి. స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయినా మా గొంతు మా పాత్ర ప్రభుత్వాల్లో లేదే అని ఆవేదన చెందుతున్నారు. సీఎం జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత అన్ని సామాజిక వర్గాలను గుర్తించారు. ప్రతీ సామాజిక వర్గానికి ప్రత్యేక గుర్తింపు ఇచ్చి అండగా నిలిచారు. ప్రతీ సామాజిక వర్గానికి ఒక ప్రతినిధి ఉండాలని వివిధ కార్పొరేషన్ల లోనూ ప్రభుత్వ పదవుల్లోనూ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు సమపాళ్లలో ప్రాతినిధ్యం కల్పించారు. దీనిపై కూడా చంద్రబాబు తొత్తులు విమర్శలు చేస్తున్నారు. చంద్రబాబు కేబినెట్లోకి ఒక్క మైనార్టీకి కూడా తీసుకోలేదు. యనమలకు కౌంటర్.. బీసీలకు సమన్యాయం జరిగిందా అని ఏ రోజైనా యనమల రామకృష్ణుడు అడిగారా?. బీసీలకు ఆత్మగౌరవం కల్పించిన నాయకుడు ముఖ్యమంత్రి జగన్. దళితులు తలెత్తుకుని జీవించేలా.. గిరిజనులు గర్వపడేలా చేసిన నాయకుడు సీఎం జగన్. ఏ పేదవాడు కూడా కష్టాల్లో ఉండకూడదని ప్రతీ కుటుంబం తన కుటుంబంగా భావించిన వ్యక్తి సీఎం జగన్. బహుజన భావజాలంతో పేదలకు సంక్షేమ పాలన అందిస్తున్నారు. గొప్ప భావజాలంతో ఉన్న ఏకైక నాయకుడు ముఖ్యమంత్రి జగన్. జనహోరును తలపించేలా బస్సుయాత్రకు ప్రజల నుండి మంచి స్పందన వస్తోంది. జగనన్న వెంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు.. మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ.. బహిరంగ సభతో ఈ యాత్ర జరగటం సంతోషదాయకం. 53 నెలల పరిపాలన కాలంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు సామాజిక విప్లవకారులుగా మారారు. సమాజంలో ఉన్న అట్టడుగు వర్గాల జీవితాల్లో మార్పు కోసం సీఎం జగన్ కృషి చేశారు. పాదయాత్ర ఒక తపస్సు లాగా చేసిన వ్యక్తి ముఖ్యమంత్రి జగన్. రాష్ట్రంలో ఉన్న మూడు ప్రాంతాల్లో సామాజిక సాధికారత యాత్రకు ఉవ్వెత్తున ప్రజల నుండి స్పందన వస్తోంది. జగనన్న వెంట ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు ఉన్నారు. బీసీల కోసం ఏర్పడ్డ ప్రభుత్వం ఇది. బీసీల కోసం ఇంతలా ఆలోచించిన నాయకుడు భవిష్యత్తులో కూడా రాడు. పదనాలుగేళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు సైతం బీసీల కోసం ఏమీ చేయలేదు. తొమ్మిదేళ్లు బీసీలను అణగదొక్కాడు. 2019లోనే నారాసురుడుని గుడ్‌బై.. కడుపులో బిడ్డ నుంచి పండు ముసలి వరకు పథకాలు చేరుస్తున్న వ్యక్తి సీఎం జగన్. 2019లోనే ప్రజలు నారాసురుడుని వధించారు. నారా భువనేశ్వరి నిజాన్ని గెలిపించండి అంటున్నారు. ఎవరో ఏదో స్క్రిప్ట్ రాసిస్తే అది పట్టుకుని తిరుగుతున్నారు. పశ్చిమగోదావరి జిల్లా దద్దరిల్లెలా మన బిడ్డల భవిష్యత్తు జగన్ ద్వారా సాధ్యమని అందరూ తెలుసుకోవాలి. నాడు సామాజిక న్యాయం ఎండమావి.. నేడు సామాజిక న్యాయం నిండుకుండ. సీఎం జగన్ పాలనలో కొత్త ఒరవడి.. ఎమ్మెల్సీ పోతుల సునీత మాట్లాడుతూ.. కొన్ని దశాబ్దాలుగా ఎంతోమంది సాంఘిక అసమానతలకు గురయ్యారు. మంచి విద్య, వైద్యం, ఉండటానికి ఇల్లు, తిండి లేవు. సీఎం జగన్ పరిపాలన చేపట్టాక నూతన ఒరవడితో సమసమాజస్థాపనకు కృషి చేశారు. విద్య, వైద్యం, వ్యవసాయ రంగంలో సీఎం జగన్ విప్లవాత్మ మార్పులు తీసుకొచ్చారు. ప్రతీ వ్యక్తికి సంక్షేమాన్ని చేరువ చేశారు. చంద్రబాబు ఆయన దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్, ఈనాడు, ఏబీఎన్ పనికట్టుకుని జగనన్న చేసిన మంచిని చూసి ఓర్వలేక పోతున్నారు. 17 మంత్రి పదవులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు కేటాయించారు. నలుగురికి రాజ్యసభ సీట్లు కేటాయించారు. బీసీలను చంద్రబాబు ఓటు బ్యాంకుగానే చూశాడు. భువనేశ్వరి ఆ విషయం తెలియదా? మహిళలకు పెద్దపెట్టవేసిన దమ్ము, ధైర్యం ఉన్న నాయకుడు జగనన్న.. రాష్ట్రంలో 30 లక్షల మంది పేదలకు ఇల్లు ఇచ్చారు. 2024 ఎన్నికల్లో పేదల పక్షాన జగనన్న ఉన్నాడు.. పెత్తందారుల పక్షాన చంద్రబాబు, పవన్, ఎల్లో మీడియా ఉన్నారు. అనేక స్కాములతో అడ్డంగా దొరికిపోయి జైల్లో ఉన్నాడు చంద్రబాబు. నిజం గెలవాలని భువనేశ్వర్ గారు తిరుగుతున్నారు. మీ తండ్రికి వెన్నుపోటు పొడిచింది ఎవరు చంద్రబాబు కాదా?. 19 అవినీతి స్కాముల్లో స్టేలు తెచ్చుకున్న వ్యక్తి చంద్రబాబు కాదా. రెండు ఎకరాల అధిపతి లక్షల కోట్లకు పడలెత్తాడని భువనేశ్వర్ గారికి తెలియదా?. అవినీతి రాజకీయాలకు, మీ వెన్నుపోటు రాజకీయాలకు జగనన్నను గుండెల్లో పెట్టుకున్న అక్క చెల్లెమ్మలు మీకు బుద్ధి చెబుతారు. -
వడివడిగా ఆక్వా యూనివర్సిటీ నిర్మాణ పనులు
-
జగనన్న ప్రభుత్వం చొరవతో మహిళలు వ్యాపారవేత్తలుగా ఎదుగుతున్నారు..!
-
ఏపీలో తొలి ఆక్వా వర్సిటీ
సాక్షి ప్రతినిధి, ఏలూరు: ఆక్వా కల్చర్ సుస్థిర అభివృద్ధి కోసం రాష్ట్రంలో మొట్టమొదటి ఆక్వా యూనివర్సిటీని నరసాపురంలో నెలకొల్పుతున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. ఇది దేశంలో మూడో ఆక్వా యూనివర్సిటీ కానుందని చెప్పారు. ఫిషరీస్ పాలిటెక్నిక్ డిప్లొమా నుంచి పీహెచ్డీ వరకు ఇక్కడ అందుబాటులోకి తెచ్చి ఆక్వా కల్చర్‌లో మానవ వనరుల కొరత తీరుస్తామన్నారు. సోమవారం పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం నియోజకవర్గంలో రూ.3,300 కోట్ల విలువైన 15 అభివృద్ధి పనులకు సీఎం జగన్ శంకుస్థాపనలు చేశారు. అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడారు. ఆ వివరాలివీ.. నరసాపురం చరిత్రలో తొలిసారిగా.. పవిత్ర కార్తీక మాసంలో చివరి సోమవారం రోజు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నాం. ఒకేరోజు సుమారు రూ.3,300 కోట్ల నిధులతో 15 అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించాం. ఇన్ని శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయడం నరసాపురం చరిత్రలో బహుశా మునుపెన్నడూ జరిగిన దాఖలాలు లేవు. నరసాపురం, నియోజకవర్గం రూపురేఖలు మార్చేందుకు ప్రభుత్వం చేపట్టిన చర్యలు, అభివృద్ధి కార్యక్రమాలను మీ ముందుంచుతున్నా. ఫిషరీస్ యూనివర్సిటీ ఇక్కడ ఆక్వా కల్చర్ ప్రధానమని మనందరికీ తెలుసు. మెరైన్ ప్రొడక్షన్, ఎక్స్‌పోర్ట్స్‌లో మన రాష్ట్రం దేశంలోనే ప్రథమ స్థానంలో ఉంది. ఆక్వా కల్చర్‌కు సంబంధించిన స్కిల్, పరిజ్ఞానం పిల్లలకు అందుబాటులోకి వస్తే మెరుగైన ఉద్యోగాలు, మెరుగైన జీతాలు లభిస్తాయి. ప్రపంచంలో ఎక్కడ అవసరమున్నా మన వారి నైపుణ్యాన్ని వినియోగించేలా గొప్ప చదువు అందించేందుకు ఇవాళ నాంది పలుకుతున్నాం. ఆక్వా కల్చర్ సుస్థిర అభివృద్ధి కోసం ఫిషరీస్ పాలిటెక్నిక్ డిప్లొమా హోల్డర్స్, బ్యాచిలర్ ఆఫ్ ఫిషరీస్ సైన్స్ డిగ్రీ హోల్డర్లు, మాస్టర్ ఆఫ్ ఫిషరీస్ సైన్స్ పీజీ, డిగ్రీ హోల్డర్లతో ఆక్వా కల్చర్‌లో మానవ వనరుల కొరత తీర్చేందుకు ఆక్వా విశ్వ విద్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నాం. ఇప్పటివరకు దేశంలో తమిళనాడు, కేరళలలో మాత్రమే ఇవి ఉండగా మూడో వర్సిటీ మన రాష్ట్రంలో ఏర్పాటవుతోంది. రూ.332 కోట్లతో ఈ యూనివర్సిటీని నరసాపురంలో నెలకొల్పుతున్నాం. ఇప్పటికే టెండర్ల ప్రక్రియ కూడా పూర్తై పనులు ప్రారంభించడానికి శ్రీకారం చుట్టాం. మత్స్యకారులకు మేలు చేస్తూ.. ముమ్మిడివరంలో ఓఎన్జీసీ కార్యకలాపాల వల్ల ప్రభావితమైన 23,458 మంది మత్స్యకార కుటుంబాలకు ఇక్కడి నుంచే బటన్ నొక్కి రూ.108 కోట్లు విడుదల చేశాం. కాకినాడ, కోనసీమ జిల్లాల్లో ఓఎన్జీసీ కార్యకలాపాల వల్ల నష్టపోయిన మత్స్యకారులకు మంచి చేసేందుకు గత ప్రభుత్వం ఏనాడూ ముందుకు రాలేదు. ఇప్పుడు మన ప్రభుత్వ హయాంలో వారందరికీ మేలు చేసేలా చర్యలు చేపట్టాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అగ్రకులాల్లోని పేదలంతా కూడా జగనన్న ప్రభుత్వమంటే మన ప్రభుత్వమనేలా ప్రతి అడుగూ వేస్తున్నాం. ఉప్పుటేరుపై రూ.188 కోట్లతో.. నరసాపురంలోనే ఉప్పుటేరుపై మోళ్లపర్రు వద్ద రెగ్యులేటర్ నిర్మించాలని ఈ ప్రాంత ప్రజలు ఎప్పటి నుంచో కోరుతున్నారు. వారి కోరికను నెరవేరుస్తూ ఈరోజు శంకుస్థాపన చేశాం. ఉప్పునీరు కొల్లేరులోకి రాకుండా రైతులకు మంచినీరు ఇంకా మెరుగ్గా అందేలా, కొల్లేరులో ఐదో కాంటూరు వరకు మంచినీరు నిల్వ ఉండేలా ఉప్పుటేరుపై రూ.188 కోట్లతో రెగ్యులేటర్ కమ్ బ్రిడ్జి లాక్ నిర్మాణానికి శ్రీకారం చుట్టాం. వంద పడకలతో ఏరియా ఆసుపత్రికి కొత్త భవనం నరసాపురంలో రూ.1,300 కోట్లతో ఏరియా ఆసుపత్రికి కొత్త భవనాన్ని నిర్మించి జాతికి అంకితం చేస్తూ ప్రారంభించాం. ఈ ఆసుపత్రిని 100 పడకల స్థాయికి పెంచడంతో పాటు మరో రూ.66 లక్షల విలువైన వైద్య పరికరాలను అందించి ఆక్సిజన్ ప్లాంట్, జనరేటర్ కూడా అందుబాటులోకి తెచ్చాం. రూ.1,400 కోట్లతో వాటర్ గ్రిడ్ ఇక్కడ ఒకపక్క గోదావరి మరోపక్క సముద్రతీర ప్రాంతం ఉన్నా తాగడానికి గుక్కెడు నీళ్లు లేని దుస్థితిని నా పాదయాత్ర సమయంలో చూశా. బోరు వేస్తే ఉప్పునీరు వస్తోందని, ఆక్వా కల్చర్ సాగుతో ఉపరితల జలాలు కలుషితమవుతున్న నేపథ్యంలో తాగునీరు లేకుంటే ఎలా బతకాలన్న ఈ ప్రాంత ప్రజల ఆవేదనను తొలగిస్తూ ఈరోజు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో రూ.1,400 కోట్లతో రక్షిత మంచినీటి సరఫరా వాటర్ గ్రిడ్ పథకానికి శంకుస్థాపన చేశాం. విజ్జేశ్వరం వద్ద గోదావరి నీటిని ర్యాపిడ్ శాండ్ ఫిల్టర్ల ద్వారా అక్కడే శుద్ధి చేసి పైప్‌లైన్ ద్వారా సరఫరా చేస్తాం. ఈ పథకం ద్వారా తూర్పు, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లోని నిడదవోలు, తణుకు, ఆచంట, పాలకొల్లు, నరసాపురం, భీమవరం, ఉండి, ఉంగుటూరు, ఏలూరు, తాడేపల్లిగూడెం నియోజకవర్గాల ప్రజలతో పాటు కృష్ణా జిల్లాలోని కృత్తివెన్ను, బంటుమిల్లి, పెడన, గుడ్లవల్లేరు మండలాల ప్రజలకు సురక్షిత తాగునీరు సరఫరా అవుతుంది. మొత్తం 26 మండలాల్లో 1,178 గ్రామాలకు చెందిన సుమారు 18.50 లక్షలమంది ప్రజలకు దీనిద్వారా మేలు జరుగుతుంది. 2,240 ఎకరాలకు సాగునీరు, తాగునీరు నరసాపురంలో రూ.87 కోట్లతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఫేజ్ 1కి శంకుస్థాపన చేశాం. మరో రూ.26 కోట్లతో వశిష్ట వారధి, బుడ్డిగవాని రేవు ఏటిగట్టు పటిష్టం చేయడంతోపాటు రూ.7.83 కోట్లతో శేషావతారం పంట కాలువ అభివృద్ధి, టైల్ డ్యామ్ నిర్మాణం, సీసీ లైనింగ్ పనులకు కూడా శ్రీకారం చుట్టాం. మొగల్తూరు పంట కాలువ అభివృద్ధి పనులను రూ.24 కోట్లతో చేపట్టాం. 2,240 ఎకరాలకు సాగునీరు, వాటి పరిధిలోని గ్రామాలకు తాగునీరు అందుతుంది. కాజ, ఈస్ట్ కొక్కిలేరు, ముస్కేపాలెం, మడుగు తూముల స్లూయిజ్‌ల పునర్నిర్మాణ పనులకు రూ.9 కోట్లతో శంకుస్థాపన చేశాం. ఒక్క నరసాపురం అభివృద్ధి పనుల గురించి చెప్పేందుకే ఇంత సమయం పట్టిందంటే ప్రజలకు ఎంత మంచి జరుగుతుందో ఆలోచించండి. పాలకొల్లు మెడికల్ కాలేజీ.. పాలకొల్లులో రూ.500 కోట్లతో మెడికల్ కాలేజీ పనులు ప్రారంభమయ్యాయి. వశిష్ట బ్రిడ్జి నిర్మాణానికి అడుగులు వేగంగా పడుతున్నాయి. కోర్టుల్లో వేసిన కేసులను పరిష్కరించి కేంద్రాన్ని ఒప్పించాం. జనవరిలో బ్రిడ్జి నిర్మాణానికి టెండర్లు పిలుస్తాం. హాజరైన మంత్రులు, ప్రజా ప్రతినిధులు.. ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ, మంత్రులు కారుమూరి వెంకట నాగేశ్వరరావు, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, దాడిశెట్టి రాజా, తానేటి వనిత, సీదిరి అప్పలరాజు, అంబటి రాంబాబు, శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషేన్‌రాజు, ఎంపీలు పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, మార్గాని భరత్, చింతా అనురాధ, ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రూ.3500 కోట్లతో 9 హార్బర్లు ఆరు వేల మంది మత్స్యకారులకు మేలు చేసేలా నరసాపురం ప్రాంతంలోని బియ్యపుతిప్ప వద్ద ఫిషింగ్ హార్బర్ నిర్మాణానికి శంకుస్థాపన చేశాం. రూ.430 కోట్ల వ్యయంతో ఫిషింగ్ హార్బర్ నిర్మాణం కానుంది. హార్బర్లో 640 మీటర్ల బెర్తు, 2,400 మీటర్ల బ్రేక్ వాటర్ నిడివి ఉండేలా బియ్యపుతిప్ప ఫిషింగ్ హార్బర్‌ను నిర్మిస్తున్నాం. ప్లాట్‌ఫామ్స్, వేలం కోసం హాల్స్, డ్రైయింగ్ యార్డ్స్, బోట్ పార్కింగ్ ఏరియా, మత్స్యకారులకు విశ్రాంతి గదులు, కోల్డ్ స్టోరేజీలు తదితర సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయి. మన రాష్ట్ర మత్స్యకారులు గుజరాత్ సహా ఇతర రాష్ట్రాలకు వెళ్లి బతకాల్సిన అవసరం రాకుండా ఇక్కడే తలెత్తుకుని జీవించేలా తొమ్మిది ఫిషింగ్ హార్బర్లను రూ.3,500 కోట్లతో ఏర్పాటు చేస్తున్నాం. అగ్రికల్చర్ కంపెనీ భూములపై రైతులకు హక్కులు నరసాపురంలో అగ్రికల్చర్ కంపెనీ భూములపై పూర్తి హక్కులను రైతులకు ఈ రోజు నుంచి కల్పిస్తున్నాం. 1921లో బ్రిటీష్ ప్రభుత్వం దర్భరేవులో 1,754 ఎకరాల భూమిని నరసాపురం అగ్రికల్చర్ కంపెనీకి 99 ఏళ్ల పాటు లీజుకు ఇచ్చింది. ఆనాటి నుంచి 1,623 మంది రైతులు సాగు చేస్తున్నప్పటికీ ఆ భూములపై వారికి ఎలాంటి హక్కులూ లేకపోవడంతో ప్రయోజనాలు అందని పరిస్థితి నెలకొంది. ఎన్నికల్లో నాడు ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ వారికి రిజిస్ట్రేషన్ చేసి పట్టాలను అందిస్తున్నాం. రైతుల కష్టాలకు శాశ్వత పరిష్కారం చూపించాం. ఎకరానికి కేవలం రూ.100తో రైతులకు రిజిస్ట్రేషన్ చేసి వారికి హక్కులు కల్పించాం. నీటి ఎద్దడిని శాశ్వతంగా నివారించేలా.. నరసాపురంలో శాశ్వతంగా నీటి ఎద్దడి నివారణ, రక్షిత మంచి నీటి సరఫరా కోసం ఫిల్టరేషన్ ప్లాంట్, సర్వీస్ రిజర్వాయర్లు, వాటర్ సప్లై పైప్‌లైన్ పనులకు నేడు శంకుస్థాపన చేశాం. రూ.62 కోట్ల వ్యయంతో మంచినీటి సరఫరా ప్రాజెక్టు చేçపట్టాం. రూ.4 కోట్లతో నరసాపురం బస్‌స్టేషన్ అభివృద్ధి, కొత్త ప్లాట్‌ఫాంలు నిర్మించి నేడు వాటిని ప్రారంభించాం. బ్రిటీషర్ల కాలంలో నిర్మించిన ట్రెజరీ ఆఫీస్ బిల్డింగ్ నూతన భవనానికి శంకుస్థాపన చేశాం. పారిశ్రామిక, వ్యవసాయ, ఆక్వా రంగానికి మెరుగైన విద్యుత్ అవసరాల కోసం 220/132/33 కేవీ సబ్‌స్టేషన్ నిర్మాణానికి రూ.132 కోట్లు మంజూరు చేసి శంకుస్థాపన చేశాం. దీనివల్ల నరసాపురం, మొగల్తూరు, పాలకొల్లు, యలమంచిలి మండలాల్లో నాణ్యమైన విద్యుత్ సరఫరా అవుతుంది. పారదర్శకంగా రూ.1,76,516 కోట్లు.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నిరుపేద ఓసీల అభివృద్ధికి కట్టుబడిన మన ప్రభుత్వ పాలనలో ఎలాంటి లంచాలు, అవినీతికి తావు లేకుండా బటన్ నొక్కి నేరుగా అక్కచెల్లెమ్మల ఖాతాల్లో మూడేళ్ల ఐదు నెలల వ్యవధిలో రూ.1,76,516 కోట్లు జమ చేశాం. మేనిఫెస్టోను ఒక భగవద్గీతగా, బైబిల్‌గా, ఖురాన్‌గా భావించి 98 శాతం హామీలను నెరవేర్చాం. మేనిఫెస్టోలో చెప్పనివి కూడా అమలు చేస్తున్నాం. వైద్యం, ఆరోగ్యం, ఇళ్ల నిర్మాణాలు, ఇళ్ల స్థలాలు, విద్య, వ్యవసాయం, మహిళా సాధికారత.. ఇలా ఏ రంగం చూసినా పారదర్శకంగా పరిపాలన అందిస్తున్నాం. చంద్రబాబు 45 ఏళ్ల రాజకీయ చరిత్రలో ఎన్నడూ చేయనివిధంగా గత పాలకుల ఊహకు కూడా అందని విధంగా దేవుడి దయతో అన్ని వర్గాలకు అండగా, తోడుగా మీ బిడ్డ నిలబడ్డాడు. -
బూతుల పార్టీ.. రౌడీ ‘సేన’
టీడీపీ అంటే.. తెలుగు బూతుల పార్టీగా మార్చేశారు. దత్తపుత్రుడి పార్టీని రౌడీసేనగా మార్చారు. వీరి పాలన రుచి చూసిన రాష్ట్ర ప్రజలంతా ‘ఇదేం ఖర్మరా బాబూ..’ అనుకోబట్టే, వారు చేసిన మోసాలను గుర్తించే 2019లోనే దత్తపుత్రుడిని, సొంత పుత్రుడిని అన్నిచోట్లా ఓడించి బైబై చెప్పారు. – సీఎం వైఎస్ జగన్ సాక్షి ప్రతినిధి, ఏలూరు: సొంత నియోజక వర్గమైన కుప్పం ప్రజలకు కూడా తన పాలనలో మంచి చేయని టీడీపీ చంద్రబాబు, ఆయన దత్తపుత్రుడు తామేం చేశారో చెప్పుకోలేక ఈమధ్య నోటికి ఎక్కువగా పని చెబుతున్నారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విమర్శించారు. అధికార భగ్న ప్రేమికుడు ఇటీవల రాష్ట్ర ప్రజలను బెదిరించేలా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబు తీరు చూస్తుంటే.. సెల్‌ఫోన్ టవర్ నుంచి దూకేస్తామని, రైలు కింద పడతామని, పురుగుల మందు తాగుతామని బెదిరించే వారిలా ఉందని వ్యాఖ్యానించారు. సోమవారం పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో నిర్వహించిన మత్స్యకార దినోత్సవం, వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనల కార్యక్రమాల్లో సీఎం వైఎస్ జగన్ పాల్గొన్నారు. నరసాపురం నియోజకవర్గంలో రూ.3,300 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన అనంతరం జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు. సీఎం జగన్ ప్రసంగం వివరాలివీ.. నరసాపురం సభకు భారీ ఎత్తున హాజరైన జనసందోహంలో ఓ భాగం భయం, నిస్పృహతోనే.. ఈమధ్య చంద్రబాబు తాను రాజకీయాల్లో ఉండాలంటే అసెంబ్లీకి వెళ్లాలని, వచ్చే ఎన్నికల్లో తనను ప్రజలు గెలిపించాలని, లేదంటే తనకు అవే చివరి ఎన్నికలవుతాయని ప్రజల్ని బెదిరిస్తున్నారు. కుప్పంలోనూ గెలవలేననే భయం, నిస్పృహ ఆయనలో కనిపిస్తోంది. ఏ మంచీ చేయని తమకు ఎవరైనా ఓటు ఎందుకు వేస్తారని, ఎందుకు ఓటు వేయాలనిగానీ చంద్రబాబు, దత్త పుత్రుడు చెప్పరు. ఎందుకంటే వారు చెప్పడానికీ ఏమీ లేదు. ఇలాంటి రాజకీయ నాయకులు నాలుగు పేపర్లు, నాలుగు టీవీలు ఒక ఈనాడు, ఒక ఆంధ్రజ్యోతి, ఒక టీవీ 5 లాంటి వారితో దోచుకో, పంచుకో, తినుకో అనే ఒప్పందం చేసుకుంటారు. ఇదే పెద్ద మనిషి అధికారంలో ఉంటే దోచుకున్నది వీరందరితో పంచుకుని తింటారు. అందువల్లే వారంతా ఆ పెద్ద మనిషి చంద్రబాబు గురించి ఏమీ మాట్లాడరు, చూపించరు, రాయరు. చివరికి ప్రశ్నిస్తాననేవారు కూడా నోరెత్తరు. ఇలాంటి వారందరినీ చూసినపుడు ఇదేం ఖర్మరా బాబూ.. ఈ రాష్ట్ర రాజకీయాలు ఇలా ఉన్నాయనిపిస్తుంది. బాబూ.. ఇదేం ఖర్మరా! ప్రజలు కుప్పం స్థానిక సంస్థల ఎన్నికల్లో సైతం టీడీపీని చిత్తుగా ఓడించి మరోసారి బైబై బాబూ అని చెప్పారు. అందుకే చంద్రబాబు ఇదేం ఖర్మరా బాబూ అని తల పట్టుకుని కూర్చుంటే.. ఆయన పుత్రుడు, దత్త పుత్రుడు ఇదేం ఖర్మరా బాబూ అనుకుంటున్నారు. 1995లో చంద్రబాబు చేతిలో వెన్నుపోటుకు గురైన ఎన్టీఆర్ కూడా ఇలాంటి మనిషికి తన ఇంట్లో, పార్టీలో, కేబినెట్లో స్థానం కల్పించినందుకు ఇదేం ఖర్మరా బాబూ అని అనుకునే ఉంటారు. వీళ్ల ధోరణి చూసి ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా ప్రజలంతా ఇదేం ఖర్మ బాబూ అనుకుంటున్నారు. ప్రతి ఇంటికీ మంచి జరిగిందా లేదా? మీ అందరికీ ఒకటే చెబుతున్నా.. ఒకే ఒక్కటి కొలమానంగా తీసుకోండి. ఇవాళ ప్రతి కుటుంబంలోనూ మంచి జరిగిందా లేదా? అన్నది కొలమానంగా చూడండి. మంచి జరిగితే మీ అన్నగా, తమ్ముడిగా, బిడ్డగా నాకు అండగా నిలబడండి. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ–5, దత్తప్రుతుడిని నమ్మొద్దు. మా మేనిఫెస్టోలో చెప్పినవి 98 శాతం నెరవేర్చాం. మన ప్రభుత్వ హయాంలో చేసిన అభివృద్ధితో ప్రజలంతా ప్రతి ఉప ఎన్నికలోనూ, స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ అండగా నిలబడి ఆశీర్వదించారు. అక్కున చేర్చుకున్నారు.. మత్స్యకారుల జీవితాల్లోకి ఇన్నాళ్లూ ఏ నాయకుడూ తొంగి చూసిన పరిస్థితి లేదు. మత్స్యకారుల తోలు తీస్తాం.. ఫినిష్ చేస్తాం అని గత సీఎం బెదిరిస్తే, సాదరంగా అక్కున చేర్చుకుని ప్రోత్సహిస్తున్న ముఖ్యమంత్రిని ఇవాళ చూస్తున్నాం. ప్రతి హామీనీ నెరవేర్చిన సీఎం మన ముందున్నారు. మత్స్యకార భరోసా, డీజిల్ సబ్సిడీ, ఎక్స్‌గ్రేషియా అందిస్తూ వలస వెళ్లకుండా తొమ్మిది హార్బర్లు మంజూరు చేసిన ప్రభుత్వమిది. ఇప్పటికే నెల్లూరులో జువ్వలదిన్నె, బాపట్లలో నిజాంపట్నం, మచిలీ పట్నం, ఉప్పాడలో హార్బర్ నిర్మాణాలు ప్రారంభమయ్యాయి. ఈ రోజు బియ్యపుతిప్ప హార్బర్ నిర్మాణం ప్రారంభమవుతోంది. కేంద్రం సహకారం అందించకుంటే పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో చేద్దామని సీఎం చెప్పారు. ఆక్వా రంగంలో ఒడిదుడుకులు అన్ని రాష్ట్రాల్లోనూ ఉన్నాయి. జిల్లాలో ఆక్వా యూనివర్సిటీ మత్స్యకారుల జీవితాల్లో గొప్ప మార్పు తెస్తుంది. – సీదిరి అప్పలరాజు, పశు సంవర్ధక, మత్స్యశాఖ మంత్రి మాట ప్రకారం.. పాదయాత్ర సమయంలో నరసాపురం నియోజకవర్గానికి ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చే దిశగా ముఖ్యమంత్రి అడుగులు వేశారు. జిల్లా కేంద్రం చేయాలని కోరినప్పుడు నరసాపురం నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ముందు వరుసలో నిలబెడతామని సీఎం హామీ ఇచ్చారు. మాట ప్రకారం చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రూ.3,300 కోట్ల ప్రాజెక్టులకు నరసాపురం నియోజకవర్గంలో శంకుస్థాపనలు నిర్వహించారు. నరసాపురం నియోజకవర్గ ప్రజలు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలియచేస్తున్నారు. – ముదునూరి ప్రసాదరాజు, ప్రభుత్వ చీఫ్ విప్ -
చంద్రబాబుకు భయం మొదలైంది: సీఎం జగన్
సాక్షి, పశ్చిమగోదావరి: టీడీపీని తెలుగు బూతుల పార్టీగా, జనసేనను రౌడీసేనగా మార్చేశారని మార్చేశారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం బహిరంగ సభలో సీఎం మాట్లాడుతూ.. గత ఎన్నికల్లో చంద్రబాబుకు ప్రజలు బైబై చెప్పారు. అన్ని ఎన్నికల్లో మన ప్రభుత్వాన్ని ఆశీర్వదించారు. చివరికి కుప్పంలో కూడా వైఎస్సార్సీపీనే గెలిపించారని సీఎం గుర్తు చేశారు. ‘‘టీడీపీని చిత్తుగా ఓడించి మరోసారి బైబై బాబు అని చెప్పారు. వాళ్ల పాలన చూసి ప్రజలు ఇదే కర్మరా బాబు అనుకుని ఉంటారు. అందుకే 2019లో వారికి ప్రజలు బైబై చెప్పారు’’ అని సీఎం అన్నారు. వెన్నుపోటుకు గురైన ఎన్టీఆర్ కూడా ఇలాంటి మనిషికి తన ఇంట్లో, తన పార్టీ కేబినెట్లో స్థానం ఇచ్చినందుకు ఇదేం ఖర్మరా బాబు అనుకుని ఉంటారని సీఎం ఎద్దేవా చేశారు. ఏ మంచీ చేయని తనకు ఎవరైనా ఎందుకు ఓటు వేస్తారని బాబు చెప్పడు. చంద్రబాబు, దత్తపుత్రుడు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5ను నమ్మొద్దు. మీకు మంచి జరిగిందా లేదా అనేది కొలమానంగా తీసుకోవాలన్నారు. ‘‘మంచి జరిగితే మాకు అండగా, తోడుగా నిలబడండి’’ అని సీఎం అన్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) చదవండి: నరసాపురం చరిత్రలో ఇదే మొదటిసారి -
CM YS Jagan: నరసాపురం చరిత్రలో ఇదే మొదటిసారి
సాక్షి, పశ్చిమగోదావరి జిల్లా: నరసాపురంలో ఒకేసారి ఇన్ని శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు ఎన్నడూ జరగలేదని, దేవుడి దయతో నర్సాపురంలో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. రూ.3,300 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశామని సీఎం అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో పలు అభివృద్ధి పనులకు సోమవారం ఆయన శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా బహిరంగ సభలో సీఎం మాట్లాడుతూ, ఒకేరోజు ఇన్ని ప్రారంభోత్సవాలు చేయడం నర్సాపురం చరిత్రలో ఇదే మొదటిసారి అని సీఎం జగన్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ ఆక్వా యూనివర్శిటీకి శంకుస్థాపన చేశాం. నరసాపురం ఆక్వా రంగానికి ప్రత్యేక గుర్తింపు ఉందని సీఎం అన్నారు. ‘‘నర్సాపురం రూపురేఖలు మార్చేందుకు మన ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఫిషరీస్ యూనివర్శిటీతో నర్సాపురం రూపురేఖలు మారతాయి. ఆక్వారంగం నర్సాపురానికి ఎంత ప్రధానమైందో తెలుసు. ఫిషరీస్ వర్శిటీలు తమిళనాడు, కేరళలో మాత్రమే ఉన్నాయి. ఆక్వా కల్చర్ సుస్థిర అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం. దేశంలో 3వ ఫిషరీష్ యూనివర్శిటీ ఏపీలో రాబోతుంది. రూ.332 కోట్ల వ్యయంతో ఫిషరీష్ యూనివర్శిటీ ఏర్పాటు చేస్తున్నాం’’ అని సీఎం జగన్ అన్నారు. ‘‘ముమ్మిడివరంలో వేట కోల్పోయినవారికి అండగా నిలుస్తున్నాం. వేట కోల్పోయిన వారికి రెండో దఫా పరిహారం అందిస్తున్నాం. ఈ ప్రభుత్వం మీది.. మీకు అండగా ఉంటుంది. జగనన్న ప్రభుత్వం అంటే మన ప్రభుత్వం అనుకునేలా పాలన చేస్తున్నాం. ఎన్నికలప్పుడు చెప్పిన హామీలను నెరవేరుస్తున్నాం. నేను విన్నాను.. నేను.. ఉన్నాను.. అని చెప్పి హామీని నెరవేరుస్తున్నాం. నర్సాపురంలో దశాబ్దాల కాలంగా ఉన్న సమస్యలను పరిష్కరిస్తున్నాం’’ అని సీఎం అన్నారు. ఇంటింటికీ అభివృద్ధి, మనిషి మనిషికీ అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్నామని సీఎం జగన్ తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఓసీల్లోని పేదలకు సంక్షేమ పథకాల్లో భాగంగా రూ.1, 76, 516 కోట్లు అవినీతి లేకుండా నేరుగా జమ చేశామని సీఎం జగన్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకున్నామని, మ్యానిఫెస్టోలో లేని హామీలను కూడా నెరవేరుస్తున్నామన్నారు. గత పాలకుల ఊహకు అందని విధంగా సంక్షేమ పాలన అందిస్తున్నామన్నారు సీఎం జగన్. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) చదవండి: చంద్రబాబుకు భయం మొదలైంది: సీఎం జగన్ -
కాసేపట్లో నరసాపురం చేరుకోనున్న సీఎం వైఎస్ జగన్
-
Narasapuram Tour: పలు అభివృద్ధి పనులకు సీఎం జగన్ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు
Time: 01:16 PM టీడీపీని తెలుగు బూతుల పార్టీగా మార్చేశారు: సీఎం జగన్ టీడీపీని తెలుగు బూతుల పార్టీగా మార్చేశారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. జనసేనను రౌడీసేనగా మార్చేశారన్నారు. గత ఎన్నికల్లో చంద్రబాబుకు ప్రజలు బైబై చెప్పారు. అన్ని ఎన్నికల్లో మన ప్రభుత్వాన్ని ఆశీర్వదించారు. చివరికి కుప్పంలో కూడా వైఎస్సార్సీపీనే గెలిపించారని సీఎం అన్నారు. Time: 12:46 PM నరసాపురంలో ఒకేసారి ఇన్ని శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు ఎన్నడూ జరగలేదు. ఆంధ్రప్రదేశ్ ఆక్వా యూనివర్శిటీకి శంకుస్థాపన చేశాం. నరసాపురం ఆక్వా రంగానికి ప్రత్యేక గుర్తింపు ఉందని సీఎం అన్నారు. Time: 12:42 PM నర్సాపురం చరిత్రలో ఇదే మొదటిసారి: సీఎం జగన్ దేవుడి దయతో నర్సాపురంలో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం. రూ.3,300 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశామని సీఎం జగన్ అన్నారు. ఒకే రోజు ఇన్ని ప్రారంభోత్సవాలు చేయడం నర్సాపురం చరిత్రలో ఇదే మొదటిసారి అని సీఎం పేర్కొన్నారు. Time: 12:34 PM గత ప్రభుత్వం మత్స్యకారులను పట్టించుకోలేదు: మంత్రి అప్పలరాజు మత్స్యకారులకు సీఎం జగన్ అండగా నిలిచారని మత్స్యశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు. మత్స్యకారుల జీవితాల్లో సీఎం వెలుగులు నింపారన్నారు. గత ప్రభుత్వం మత్స్యకారులను పట్టించుకోలేదని మంత్రి అన్నారు. Time: 12:25 PM దశాబ్దాల కాలంగా ఉన్న సమస్యలు పరిష్కారం: ప్రసాదరాజు మత్స్యకారులకు అండగా నిలిచిన సీఎం జగన్‌కు ఏపీ ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి ప్రసాదరాజు కృతజ్ఞతలు తెలిపారు. సీఎం జగన్ రాకతో నర్సాపురం రూపురేఖలు మారబోతున్నాయన్నారు. దశాబ్దాల కాలంగా ఉన్న సమస్యలు పరిష్కారం కానున్నాయన్నారు. గత ప్రభుత్వం మాటలకే పరిమితమైందని ప్రసాదరాజు అన్నారు. Time: 12:13 PM పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు ఆంధ్రప్రదేశ్ ఆక్వా యూనివర్శిటీ, బియ్యపుతిప్ప ఫిషింగ్ హార్బర్, జిల్లా రక్షితనీటి సరఫరా ప్రాజెక్ట్, ఉప్పు టేరు నదిపై మూలపర్రు రెగ్యులేటర్ పనులకు సీఎం శంకుస్థాపన చేశారు. అనంతరం నరసాపురం ప్రాంతీయ వైద్యశాల నూతన భవనాన్ని సీఎం జగన్ ప్రారంభించారు. నరసాపురం పురపాలక సంఘం మంచినీటి అభివృద్ధి పథకాన్ని సీఎం ప్రారంభించారు. Time: 12:05 PM పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో సీఎం వైఎస్ జగన్ పర్యటిస్తున్నారు. పలు అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేశారు. రూ.3,300 కోట్ల అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. Time: 11:59 AM మత్స్యకార కుటుంబాలకు పరిహారం ఇచ్చిన ఘనత సీఎం జగన్‌కే దక్కుతుందని ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ అన్నారు. 23 వేల మంది మత్స్యకారులకు రూ. 107 కోట్ల పరిహారం అందిస్తున్నారన్నారు. గత ప్రభుత్వం మత్స్యకారులను ఓటు బ్యాంకుగానే వాడుకుందన్నారు. Time: 11:05 AM సీఎం వైఎస్ జగన్ నరసాపురం చేరుకున్నారు. ముఖ్యమంత్రికి మంత్రులు, ఎమ్మెల్యేలు స్వాగతం పలికారు. కాసేపట్లో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. అనంతరం బహిరంగ సభలో ప్రసంగిస్తారు. Time: 10:35 AM ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం బయల్దేరారు. పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. సాక్షి, పశ్చిమగోదావరి జిల్లా: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్ ఆక్వా విశ్వవిద్యాలయానికి, బియ్యపుతిప్ప ఫిషింగ్ హార్బర్‌కు, రూ.1,400 కోట్లతో జిల్లా రక్షిత నీటి సరఫరా ప్రాజెక్టులకు శంకుస్థాపన, నరసాపురం ప్రాంతీయ వైద్యశాల నూతన భవనానికి ప్రారంభోత్సవం చేయనున్నారు. అనంతరం బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ఇవీ ప్రారంభోత్సవాలు ♦నరసాపురం పట్టణం మధ్యలో ఉన్న ప్రాంతీయ వైద్యశాల ఇటీవలే 100 పడకల స్థాయికి అప్‌గ్రేడ్ అయింది. అందువల్ల చుట్టుపక్కల గ్రామాలలో నివసించే 2 లక్షల మందికి వైద్య సదుపాయాలు, సేవలు అందిస్తోంది. ఇప్పుడు అదే ఆస్పత్రిలో నూతనంగా మాతా శిశు సంరక్షణ విభాగం ఏర్పాటు చేశారు. రూ.13 కోట్లతో ఈ భవనాన్ని నిర్మించారు. ♦నరసాపురం పట్టణంలో మంచి నీటి ఎద్దడి నివారణకు రూ.61.81 కోట్లతో నీటి సరఫరా అభివృద్ధి పథకం చేపట్టి పూర్తి చేశారు. ఈ పథకం వల్ల రాబోయే 30 ఏళ్ల వరకు నరసాపురం పట్టణానికి మంచి నీటి సరఫరాకు ఎటువంటి సమస్యా ఉండదు. ఇంకా శంకుస్థాపనలు ఇలా.. ♦రూ.4 కోట్ల వ్యయంతో నరసాపురం బస్‌స్టేషన్ పునరుద్ధరణ పనులు. ♦రూ.1.08 కోట్ల అంచనాతో నరసాపురం డివిజినల్ ఉప ఖజానా కార్యాలయం కొత్త భవన నిర్మాణం. ♦రుస్తుంబాద గ్రామంలో రూ.132.81 కోట్లతో 220/ 132/ 33 కె.వి సబ్‌స్టేషన్ నిర్మాణ పనులు. ♦నరసాపురం పురపాలక సంఘం పరిధిలో రూ.237 కోట్లతో అండర్ గ్రౌండ్ డ్రైనేజి నిర్మాణం. రూ.87 కోట్లతో మొదటి ఫేజ్ పనులు. ♦రూ.26.32 కోట్లతో వశిష్ఠ వారధి – బుడ్డిగవాని రేవు ఏటి గట్టు పటిష్టం. ♦రూ.7.83 కోట్ల అంచనా వ్యయంతో చివరి గ్రామాలకు సాగు, తాగునీటి సౌకర్యాలు కల్పించేందుకు శేషావతారం పంట కాలువ అభివృద్ధిలో భాగంగా ఛానల్ డీ సిల్టింగ్, టెయిల్ డ్యామ్ నిర్మాణం, సీసీ లైనింగ్ పనులు. ♦రూ.24.01 కోట్లతో మొగల్తూరు వియర్ పంట కాలువ నిర్మాణం. ♦రూ.8.83 కోట్లతో కాజ, ఈస్ట్ కొక్కిలేరు, ముస్కేపాలెం అవుట్‌ఫాల్ నాలుగు స్లూయీస్‌ల పునః నిర్మాణం. సీఎం జగన్ పర్యటన ఇలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సోమవారం ఉదయం 10 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి 10.50 గంటలకు నరసాపురం చేరుకుంటారు. 11.15 – 12.50 మధ్య వివిధ అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్ధాపనలు చేస్తారు. అనంతరం బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ఆ తర్వాత తిరిగి తాడేపల్లికి యలుదేరుతారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
ఆక్వా వర్సిటీ... ఫిషింగ్ హార్బర్
సాక్షి, అమరావతి: సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఆంధ్రప్రదేశ్ ఆక్వా విశ్వవిద్యాలయానికి, బియ్యపుతిప్ప ఫిషింగ్ హార్బర్‌కు, రూ.1,400 కోట్లతో జిల్లా రక్షిత నీటి సరఫరా ప్రాజెక్టులకు శంకుస్థాపన, నరసాపురం ప్రాంతీయ వైద్యశాల నూతన భవనానికి ప్రారంభోత్సవం చేశారు. అనంతరం బహిరంగ సభను ఉద్దేశించి ప్రసంగించారు. ఇప్పటి వరకు తమిళనాడు, కేరళలో మాత్రమే ఈ వర్సిటీలు ఉన్నాయి. ఆక్వా వర్సిటీ కోసం నరసాపురం పరిసర ప్రాంతాల్లోని సరిపల్లి, లిఖితపూడి గ్రామాల మధ్య 40 ఎకరాల భూమిని ఇప్పటికే కేటాయించారు. భవన నిర్మాణ పనుల కోసం రూ.332 కోట్ల అంచనా వ్యయంతో డీపీఆర్ ఆమోదించారు. మొదటి దశలో పరిపాలన భవనంతో పాటు విద్యార్థులకు వసతి గృహాలు, విశ్వవిద్యాలయం నిర్మాణానికి రూ.100 కోట్లు మంజూరు చేశారు. 2022–23 బడ్జెట్లో విశ్వవిద్యాలయ నిర్మాణ పనులకు రూ.40 కోట్లు కేటాయించారు. రెండవ దశ పనుల్లో భాగంగా నరసాపురం మండలం బియ్యపుతిప్ప గ్రామంలో 350 ఎకరాలలో రూ.222 కోట్ల అంచనా వ్యయంతో విశ్వవిద్యాలయ సముద్రతీర ప్రాంగణం, పరిశోధన కేంద్రం నిర్మాణాలు చేపట్టనున్నారు. ఈ విశ్వవిద్యాలయం ఏర్పాటు ద్వారా మత్స్యకారులు, ఆక్వా రైతులు ఎక్కువగా ప్రయోజనం పొందనున్నారు. వృత్తిపరంగా అర్హత కలిగిన మానవ వనరుల లభ్యత కారణంగా ఆక్వా రంగంలో నష్టాలను చాలా వరకు తగ్గించవచ్చు. తద్వారా దాదాపు సంవత్సరానికి రూ.4,000 నుంచి 5,000 కోట్ల ఆర్థిక ప్రయోజనం ఆక్వా రైతులకు చేకూరుతుంది. అవసరమైన సంఖ్యలో ఫిషరీస్ డిప్లొమా, బీఎఫ్ఎస్సీ, ఎంఎఫ్ఎస్సీ, పీహెచ్డీ అర్హత గల అభ్యర్థులను తయారు చేయడానికి ఆక్వా యూనివర్సిటీ ఆధ్వర్యంలో మరిన్ని కొత్త మత్స్య కళాశాలలు, మత్స్య పాలిటెక్నిక్ కళాశాలలు ప్రారంభించే ప్రతిపాదనలు కూడా ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయి. ప్రారంభానికి సిద్దంగా ఉన్న 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి 6,000 మంది మత్స్యకారులకు లబ్ధి బియ్యపుతిప్ప వద్ద 150 ఎకరాల విస్తీర్ణంలో రూ.429.43 కోట్ల అంచనాతో ఫిషింగ్ హార్బర్ నిర్మించేందుకు ప్రభుత్వం ఇప్పటికే జీవో జారీ చేసింది. ఈ హార్బర్ నిర్మాణం ద్వారా మత్స్యకారులు అత్యంత సామర్థ్యం గల మోటారు బోట్లలో సముద్రంలో ఎక్కువ దూరం వేటకు వెళ్లేందుకు వీలుంటుంది. మార్కెటింగ్ సౌకర్యాలను పెంపొందించడం ద్వారా మత్స్య పరిశ్రమ అభివృద్ధికి అవసరమైన అన్ని ఏర్పాట్లను ప్రభుత్వం పూర్తి చేసింది. ఈ హార్బర్ నిర్మించే ప్రదేశం నరసాపురం పట్టణానికి 14 కి.మీ. దూరంలో ఉంది. దీనివల్ల నరసాపురం, మొగల్తూరు మండలాలకు చెందిన 6,000 మంది మత్స్యకారులు లబ్ధి పొందనున్నారు. కొల్లేటికి సముద్రపు నీటి నుంచి రక్ష సముద్రపు నీరు కొల్లేరు సరస్సులోకి చొరబడకుండా నిరోధించడానికి, కొల్లేరులో 5వ కాంటూర్ వరకు మంచి నీరు నిలువ ఉండే విధంగా ఉప్పుటేరు నదిపై కిలోమీటరు 57.950 వద్ద మొల్లపర్రు విలేజ్ లిమిట్స్‌లో రూ. 188.40 కోట్ల అంచనా వ్యయంతో రెగ్యులేటర్ కమ్ బ్రిడ్జ్ కమ్ లాక్ నిర్మాణం కొరకు రూపొందించిన ప్రణాళికను ప్రభుత్వం ఆమోదించింది. దీంతో ముఖ్యమంత్రి జగన్ నేడు దీనికి శంకుస్థాపన చేయనున్నారు. సురక్షిత తాగునీరివ్వడమే లక్ష్యంగా.. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో ఆక్వాకల్చర్ వల్ల, తీర ప్రాంతంలో ఉప్పు నీటి సాంద్రత వల్ల ఏర్పడిన తీవ్ర తాగునీటి ఎద్దడి సమస్యలను శాశ్వతంగా పరిష్కరించడానికి ప్రభుత్వం రూ.1,400 కోట్లతో రక్షిత నీటిసరఫరా ప్రాజెక్ట్‌ను మంజూరు చేసింది. విజ్జేశ్వరం జలాశయం నుండి గోదావరి నీటిని రాపిడ్ శాండ్ ఫిల్టర్ల ద్వారా శుద్ధి చేసి, పైప్ లైన్ల ద్వారా సరఫరా చేస్తుంది. ఈ పథకం ద్వారా నూతన జిల్లాలు పశ్చిమ గోదావరి, ఏలూరు, తూర్పు గోదావరిలోని నిడుదవోలు, తణుకు, ఆచంట, పాలకొల్లు, నరసాపురం, భీమవరం, ఉండి, ఉంగుటూరు, ఏలూరు (పార్ట్), తాడేపల్లిగూడెం(పార్ట్) నియోజకవర్గాల ప్రజలకు, కృష్ణా జిల్లాలోని కృత్తివెన్ను, బంటుమిల్లి, పెడన, గుడ్లవల్లేరు మండలాల ప్రజలకు సురక్షిత తాగునీరు సరఫరా చేయొచ్చు. ఈ పథకానికి నేడు సీఎం శంకుస్థాపన చేయనున్నారు. అగ్రికల్చర్ కంపెనీ భూ అనుభవదారులకు హక్కులు నరసాపురం మండలం నందలి వేములదీవి ఉప గ్రామమైన దర్బరేవు గ్రామంలో నాటి బ్రిటీష్ ప్రభుత్వం 1921లో 1,754 ఎకరాల భూమిని నరసాపురం అగ్రికల్చర్ కంపెనీ లిమిటెడ్‌కు 99 సంవత్సరాలు లీజుకు ఇచ్చింది. ఆ రోజు నుంచి 1,623 మంది రైతులు ఆ భూమి స్వాధీన అనుభవంలో ఉండి వ్యవసాయం చేసుకుంటున్నారు. కానీ రైతులకు ఎటువంటి భూ యాజమాన్య హక్కులు కానీ, రెవెన్యూ రికార్డు పరమైన హక్కులు కానీ లేవు. అందువల్ల ఆ భూమిని అమ్మడానికి లేదా బ్యాంకులలో తనఖా పెట్టి రుణం పొందడానికి అర్హత లేదు. అయితే వైఎస్ జగన్ ప్రభుత్వం జీవో జారీ చేసి, ఎకరాకు రూ.100 ధర నిర్ణయించి, ఆ 1,623 మంది రైతులకు భూ యాజమాన్య, రెవెన్యూ రికార్డు పరమైన సర్వహక్కులు కల్పించింది. దీంతో రైతులు వారి వారసులు నిరభ్యంతరంగా స్వాధీనములో ఉండి ఆ భూములను అనుభవించుకోవచ్చు. అవసరాల నిమిత్తం అమ్ముకోవచ్చు. తనఖా పెట్టి ఋణాలు కూడా పొందవచ్చు. ఇందుకు సంబంధించిన హక్కు పత్రాలను సీఎం జగన్ నేడు రైతులకు అందజేయనున్నారు. ఇవీ ప్రారంభోత్సవాలు ► నరసాపురం పట్టణం మధ్యలో ఉన్న ప్రాంతీయ వైద్యశాల ఇటీవలే 100 పడకల స్థాయికి అప్‌గ్రేడ్ అయింది. అందువల్ల చుట్టుపక్కల గ్రామాలలో నివసించే 2 లక్షల మందికి వైద్య సదుపాయాలు, సేవలు అందిస్తోంది. ఇప్పుడు అదే ఆస్పత్రిలో నూతనంగా మాతా శిశు సంరక్షణ విభాగం ఏర్పాటు చేశారు. రూ.13 కోట్లతో ఈ భవనాన్ని నిర్మించారు. ► నరసాపురం పట్టణంలో మంచి నీటి ఎద్దడి నివారణకు రూ.61.81 కోట్లతో నీటి సరఫరా అభివృద్ధి పథకం చేపట్టి పూర్తి చేశారు. ఈ పథకం వల్ల రాబోయే 30 ఏళ్ల వరకు నరసాపురం పట్టణానికి మంచి నీటి సరఫరాకు ఎటువంటి సమస్యా ఉండదు. ఇంకా శంకుస్థాపనలు ఇలా.. ► రూ.4 కోట్ల వ్యయంతో నరసాపురం బస్‌స్టేషన్ పునరుద్ధరణ పనులు. ► రూ.1.08 కోట్ల అంచనాతో నరసాపురం డివిజినల్ ఉప ఖజానా కార్యాలయం కొత్త భవన నిర్మాణం. ► రుస్తుంబాద గ్రామంలో రూ.132.81 కోట్లతో 220/ 132/ 33 కె.వి సబ్‌స్టేషన్ నిర్మాణ పనులు. ► నరసాపురం పురపాలక సంఘం పరిధిలో రూ.237 కోట్లతో అండర్ గ్రౌండ్ డ్రైనేజి నిర్మాణం. రూ.87 కోట్లతో మొదటి ఫేజ్ పనులు. ► రూ.26.32 కోట్లతో వశిష్ఠ వారధి – బుడ్డిగవాని రేవు ఏటి గట్టు పటిష్టం. ► రూ.7.83 కోట్ల అంచనా వ్యయంతో చివరి గ్రామాలకు సాగు, తాగునీటి సౌకర్యాలు కల్పించేందుకు శేషావతారం పంట కాలువ అభివృద్ధిలో భాగంగా ఛానల్ డీ సిల్టింగ్, టెయిల్ డ్యామ్ నిర్మాణం, సీసీ లైనింగ్ పనులు. ► రూ.24.01 కోట్లతో మొగల్తూరు వియర్ పంట కాలువ నిర్మాణం. ► రూ.8.83 కోట్లతో కాజ, ఈస్ట్ కొక్కిలేరు, ముస్కేపాలెం అవుట్‌ఫాల్ నాలుగు స్లూయీస్‌ల పునః నిర్మాణం. -
సీఎం జగన్ నరసాపురం పర్యటన షెడ్యూల్ ఇదే..
తాడేపల్లి : సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి రేపు(సోమవారం) పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో పర్యటించనున్నారు. నరసాపురంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. ఈమేరకు రేపటి సీఎం జగన్ నరసాపురం పర్యటన షెడ్యూల్ ఇలా ఉంది. ఉదయం 10 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి ఉదయం 10.50 గంటలకు సీఎం జగన్ నరసాపురం చేరుకోనున్నారు. ఉదయం గం. 11:15ని.ల నుంచి గం. 12.50ని.లవరకు వివిధ అభివృద్ది కార్యక్రమాల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. అనంతరం బహిరంగ సభలో సీఎం జగన్ పాల్గొనున్నారు. అనంతరం మధ్యాహ్నం గం. 1.15ని.లకు బయలుదేరి 2.00 గంటలకు తాడేపల్లి చేరుకోనున్నారు సీఎం జగన్. -
నరసాపురం నవశకం.. ఉమ్మడి పశ్చిమలో సరికొత్త రికార్డు
సాక్షిప్రతినిధి, ఏలూరు: ఫిషింగ్ హార్బర్.. ఆక్వా యూనివర్సిటీ.. ఉప్పుటేరుపై రెగ్యులేటర్ నిర్మాణం.. ఇలా ఒకటి కాదు రెండు కాదు ఒకేసారి 12 అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు జరుగనున్నాయి. రికార్డు స్థాయిలో రూ.3,300 కోట్లకుపైగా వ్యయంతో నిర్వహించే పనులకు అన్ని అనుమతులు పూర్తయ్యాయి. అది కూడా మొత్తం ఒకే నియోజకవర్గంలో జరిగే పనులు కావడం విశేషం. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో గతంలో ఎన్నడూలేని విధంగా నరసాపురం నియోజకవర్గంలో రూ.3,300 కోట్ల వ్యయంతో చేపట్టనున్న పనులకు ఈనెల 21న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి నరసాపురం వస్తున్న ఆయనకు స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ చీఫ్‌విప్ ముదునూరి ప్రసాదరాజు అపూర్వ స్వాగతం పలికేందుకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. బ్రిటిష్ హయాంలోనే వెలుగు వెలిగి తర్వాత పాలకుల నిర్లక్ష్యంతో వెనుకబడిన చారిత్రక నేపథ్యం ఉన్న పట్టణం నరసాపురం. ఇన్నేళ్ల తర్వాత పూర్వవైభవాన్ని తెచ్చేలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలో ప్రభుత్వ చీఫ్‌విప్ ముదునూరి ప్రసాదరాజు హయాంలో వేల కోట్ల అభివృద్ధి పనులకు ఒకే రోజు బీజం పడనుంది. పక్కా జీఓలు, సాంకేతిక, ఆర్థికశాఖ అనుమతులతో పనులకు శ్రీకారం చుట్టడం జిల్లా చరిత్రలోనే ప్రథమం. రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పిన పలువురు ఉద్దండులైన నేతల నిలయం నరసాపురం. అయినా వశిష్ట వంతెన, హార్బర్ వంటి దీర్ఘకాల ప్రాజెక్ట్‌లకు మోక్షం కలగలేదు. 19 కిలోమీటర్ల మేర సముద్ర తీరం, అపార మత్స్యసంపద ఉన్న ఈ ప్రాంత అభివృద్ధిపై ఏ నాయకుడు గతంలో దృష్టి పెట్టిన దాఖలాలు లేవు. ఎన్నికల వాగ్దానాలతో సరిపెట్టడం తప్ప. అయితే జగన్ ప్రభుత్వం నవ చరిత్రకు, తీర ప్రాంత సమగ్ర అభివృద్ధికి ముందడుగు వేసింది. అభివృద్ధి పనులు రుస్తుంబాధలో రూ.13 కోట్లతో 50 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా అధునాతన వసతులతో నిర్మించారు. దీనిని సీఎం జగన్ ప్రారంభిస్తారు. రూ.4.80 కోట్లతో నరసాపురంలో పునర్మించిన బస్టాండ్ ప్రారంభోత్సవం. 2 వేల మంది రైతులకు ఉపయోగడేలా 1921 నుంచి ఉన్న దర్భరేవు కంపెనీ భూముల సమస్యను కొత్త జీవోతో తీర్చి తరతరాల నుంచి అనుభవిస్తున్న రైతులకు పట్టాల పంపిణీ. బ్రిటిష్ హయాం నుంచి సమస్యగా ఉన్న మొగల్తూరు మండలం కాళీపట్నం జమిందారీ భూముల పంపిణీ. శంకుస్థాపనలు ఇలా.. రూ.1,400 కోట్లతో వాటర్ గ్రిడ్ ప్రాజెక్టుకు శంకుస్థాపన. గోదావరి ఏటిగట్లు పటిష్టం, స్లూయిజ్ పనులకు రూ.35 కోట్లు మంజూరు. రూ.429.43 కోట్లతో బియ్యపుతిప్ప, వేములదీవి వద్ద ఫిషింగ్‌హార్బర్, కార్గోపోర్టు నిర్మాణం. రూ.332 కోట్లతో సరిపల్లిలో దేశంలోనే నాల్గో ఆక్వా యూనివర్సిటీ ఏర్పాటు, వచ్చే విద్యాసంవత్సరం నుంచి తరగతుల నిర్వహణ. రూ.133 కోట్లతో నరసాపురంలోని రుస్తుంబాధలో 10 ఎకరాల స్థలంలో 220 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్ నిర్మాణం. పట్టణంలో రూ.220 కోట్లతో అండర్‌గ్రౌండ్ డ్రైనే జీ వ్యవస్థ నిర్మాణంలో భాగంగా మొదటి ఫేజ్‌లో ప్రభుత్వం విడుదల చేసిన రూ.87 కోట్లతో చేపట్టే పనులు ప్రారంభం. రూ.61.81 కోట్లతో మున్సిపల్ వాటర్ ప్రాజెక్టు. రూ.180.50 కోట్లతో మొగల్తూరు మండలం మోళ్లపర్రులో ఉప్పుటేరుపై రెగ్యులేటర్ నిర్మాణం. రూ.70 కోట్లతో కోతకు గురవుతున్న గోదావరి ఏటిగట్లు పటిష్ట పరిచే పనులు. రూ.31 కోట్లతో శేషావతారం వియర్ఛానల్ అభివృద్ధి పనులు. రూ.490 కోట్లతో నిర్మించనున్న గోదావరి జిల్లాల వాసుల చిరకాల కల వశిష్ట వారధిపై ప్రకటన. నియోజకవర్గంలో రూ.75 కోట్లతో 9 ప్రధాన రహదారుల నిర్మాణం, మరమ్మతులకు శంకుస్థాపన. రూ.8.80 కోట్లతో స్లూయిజ్ గేట్ల మరమ్మతులు, ఇతర పనులు. రూ.26.32 కోట్లతో నరసాపురంలో వశిష్ట రైట్ బ్యాంక్ నుంచి బుడ్డిగవానిరేవు వరకు రహదారి నిర్మాణ పనులు. ముమ్మర ఏర్పాట్లు నరసాపురం: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం నరసాపురంలో పర్యటించనున్న నేపథ్యంలో ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. హెలీప్యాడ్, 25వ వార్డులో సభావేదిక వద్ద పనులు దాదాపు పూర్తయ్యాయి. చినమామిడిపల్లిలో హెలీప్యాడ్ నుంచి స్టీమర్‌రోడ్డు మీదుగా సభాస్థలికి ముఖ్యమంత్రి ప్రయాణించే మార్గాన్ని సుందరంగా తీర్చిదిద్దారు. అవసరమైన చోట్ల బారికేడ్లు ఏర్పాటుచేశారు. సీఎం పర్యటన ఏర్పాట్లను శనివారం ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ, ప్రభుత్వ చీఫ్‌విప్ ముదునూరి ప్రసాదరాజు, కలెక్టర్ పి.ప్రశాంతి, జిల్లా ఎస్పీ రవిప్రకాష్ పరిశీలించారు. సభా వేదిక వద్ద తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు సూచనలు చేశారు. పర్యటనలో ఎలాంటి లోపాలు తలెత్తకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ పెండ్ర వీరన్న ఉన్నారు. నూతన అధ్యాయం నరసాపురం చరిత్రలో నూతన అధ్యాయానికి సోమవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శ్రీకారం చుడుతున్నారు. రాష్ట్రంలో ఏ నియోజకవర్గానికీ దక్కని అవకాశం మాకు దక్కింది. రూ.3,300 కోట్ల విలువైన పనులు ఏకకాలంలో శంకుస్థాపనలు చేస్తున్నారు. ప్రజల చిరకాలవాంఛగా ఉన్న వశిష్ట వారధి నిర్మాణం ప్రకటనతో సహా పలు కీలక పనులకు నాంది పలకనున్నారు. – ముదునూరి ప్రసాదరాజు, ప్రభుత్వ చీఫ్ విప్ ఇక్కడ కూడా చదవండి: సీఎం జగన్ నరసాపురం పర్యటన షెడ్యూల్ ఇదే.. -
CM Jagan: సీఎం జగన్ నరసాపురం పర్యటన ఖరారు
సాక్షి, పశ్చిమగోదావరి(నరసాపురం): ఈ నెల 21న నరసాపురంలో జరగనున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటనకు ఏర్పాట్లు వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్ పి.ప్రశాంతి అధికారులను ఆదేశించారు. గురువారం పట్టణంలో జరుగుతున్న సీఎం పర్యటన ఏర్పాట్లను కలెక్టర్ పరిశీలించారు. ముఖ్యమంత్రి ప్రారంభించనున్న బస్టాండ్, 100 పడకల ఆసుపత్రి పనులు పరిశీలించారు. చిన్నచిన్న పెండింగ్ పనులు ఉంటే రెండురోజుల్లో పూర్తి చేసుకోవాలని చెప్పారు. చినమామాడిపల్లి వద్ద నిర్మించిన హెలీప్యాడ్‌ను, 25 వార్డు వీవర్స్‌కాలనీ వద్ద ముఖ్యమంత్రి బహిరంగ సభ వేదికను పరిశీలించారు. వేదిక పనులు వేగంగా పూర్తి చేయాలని చెప్పారు. బహిరంగసభ వద్ద పార్కింగ్ విషయంలో ప్రణాళికా బద్ధంగా చర్యలు చేపట్టాలని పోలీసు అధికారులను ఆదేశించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఇప్పటికే పలుమార్లు వాయిదా పడ్డ సీఎం పర్యటన 21న ఖరారు అయ్యిందని చెప్పారు. ఆ రోజు ప్రపంచ మత్స్యకార దినోత్సవం కావడంతో నరసాపురంలో జరిగే వేడుకల్లో సీఎం పాల్గొంటారని చెప్పారు. ఆక్వా యూనివర్సిటీ, బియ్యపుతిప్ప ఫిషింగ్ హార్బర్, వాటర్ గ్రిడ్ ప్రాజెక్ట్, అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ ప్రాజెక్ట్ పనులకు సీఎం శంకుస్థాపన చేస్తారని చెప్పారు. బస్టాండ్, ఆసుపత్రి వంటి పూర్తయిన పనులను ప్రారంభిస్తారని వివరించారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ముఖ్యమంత్రి పర్యటనలో ఎలాంటి లోపాలు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. నరసాపురం సబ్‌కలెక్టర్ ఎం.సూర్యతేజ తదితరులు పాల్గొన్నారు. చదవండి: (రౌడీలకు రౌడీని, గూండాలకు గూండాను.. బట్టలిప్పించికొట్టిస్తా: చంద్రబాబు) -
CM Jagan: నరసాపురం పర్యటనకు సీఎం జగన్
సాక్షి, పశ్చిమగోదావరి: నరసాపురంలో ఈనెల 18న జరుగనున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటన ఏర్పాట్లను వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్ పి.ప్రశాంతి ఆదేశించారు. సోమవారం ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లపై మున్సిపల్ కౌన్సిల్ హాల్లో అధికారులతో ఆమె సమావేశం నిర్వహించారు. ముఖ్యమంత్రి ఆక్వా యూనివర్సిటీ, బియ్యపుతిప్ప ఫిషింగ్‌హార్బర్, కాళీపట్నం రెగ్యులేటర్ల నిర్మాణం, వాటర్‌గ్రిడ్ ప్రాజెక్ట్, సబ్‌స్టేషన్ నిర్మాణం వంటి ప్రాజెక్టులకు శంకుస్థాపన, బస్టాండ్, 100 పడకల ఆస్పత్రి ప్రారంభోత్సాలు చేస్తారన్నారు. ఈ మేరకు ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలన్నారు. పట్టణంలోని 25వ వార్డు వీవర్స్‌కాలనీలో బహిరంగసభ నిర్వహించే ప్రాంతంలో ఏర్పాట్లను వెంటనే పూర్తిచేయా లని ఆదేశించారు. చినమామిడిపల్లి లేఅవుట్ వద్ద హెలీప్యాడ్ పనులు పూర్తి చేయాలన్నారు. ముఖ్యమంత్రి రోడ్డు మార్గం మీదుగా వెళ్లే ప్రాంతాలను సుందరంగా తీర్చిదిద్దాలన్నారు. సీఎం పర్యటన ఏర్పాట్లలో ఉన్న సిబ్బందికి పాస్‌లు జారీ చేయాలని, అవసరమైన చోట్ల వైద్య శిబిరాలు ఏర్పాటుచేయాలని సూచించారు. అనంతరం ఆమె సీఎం పర్యటించనున్న ప్రాంతాలు బస్టాండ్, ప్రభుత్వాస్పత్రి, సభావేదిక స్థలాన్ని పరిశీలించారు. జాయింట్ కలెక్టర్ మురళి, నరసాపురం సబ్‌కలెక్టర్ ఎం.సూర్యతేజ ఆమె వెంట ఉన్నారు. చదవండి: (CM Jagan: రేపు హైదరాబాద్‌కు సీఎం జగన్) 92 అర్జీల స్వీకరణ : నరసాపురం మున్సిపల్ కార్యా లయంలో కలెక్టర్ పి.ప్రశాంతి ఆధ్వర్యంలో జిల్లాస్థాయి స్పందన కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లాలోని పలు ప్రాంతాలకు చెందిన 92 మంది అర్జీలు అందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అర్జీలను తక్షణం పరిష్కరించి బాధితులకు న్యాయం చేయాలని అధికారులను ఆదేశించారు. ఫిర్యాదుల పరిష్కార అంశానికి అధిక ప్రాధాన్యమివ్వాలని, స్పందన దరఖాస్తుల పరిష్కారంపై ఎప్పటికప్పుడు నివేదిక ఇవ్వాలని సూచించారు. వృద్ధుల వద్దకు నేరుగా వెళ్లి కలెక్టర్ వినతులు స్వీకరించారు. చదవండి: (విశాఖ నార్త్ నియోజకవర్గ పార్టీ శ్రేణులతో సీఎం జగన్ భేటీ) -
Krishnam Raju: సంస్థాన వారసుడు.. మొగల్తూరు మొనగాడు
బాబులుగాడి దెబ్బ గోల్కొండ అబ్బ వంటి డైలాగులతో రెబల్‌స్టార్‌గా సినీ జగత్తులో తనదైన ముద్ర వేసిన కృష్ణంరాజు మృతితో గోదావరి జిల్లాల్లో విషాదఛాయలు అలముకున్నాయి. మొగల్తూరు రాజ సంస్థాన వారసుడిగా రాచరికపు ఆచారాలు, సంప్రదాయాలను ముందుండి పాటించడంతో పాటు సొంత ప్రాంత అభివృద్ధికి ఆయన విశేష కృషిచేశారు. నరసాపురం ఎంపీగా, కేంద్ర మంత్రిగా గ్రామాల్లో రహదారులు, వంతెనలు, మౌలిక వసతుల కల్పనకు నిధులు మంజూరు చేశారు. సహాయం చేయడంలో మనసున్న మా‘రాజు’గా నిలిచారు. సాక్షి, నరసాపురం/మొగల్తూరు: మొగల్తూరుకోట సంస్థానంలో 1940 జనవరి 20న ఉప్పలపాటి వీరవెంకట సత్యనారాయణరాజు, లక్ష్మీదేవి దంపతులకు పెద్ద కుమారుడిగా కృష్ణంరాజు జన్మించారు. తండ్రి సత్యనారాయణరాజు కోటలోని వ్యవహారాలు, పొలాల బాధ్యతలు చూసే వారు. వాస్తవానికి కృష్ణంరాజు వంశీయులది తూర్పుగోదావరి జిల్లా జి.ఎర్రంపాలెం కాగా తండ్రి చిన్నతనంలోనే మొగల్తూరు వచ్చారు. కృష్ణంరాజు బాల్యం మొగల్తూరులోనే గడిచింది. ఐదో తరగతి వరకు స్థానికంగా, ఎస్ఎస్ఎల్సీ నరసాపురంలోని టేలర్ స్కూల్లో చదివారు. డిగ్రీ హైదరాబాద్‌లో పూర్తిచేశారు. 1969లో కోట సంస్థానాదీశులు కలిదిండి లక్ష్మీ కాంతరాజ బహుద్దూర్ (గాంధీబాబు) కు మార్తె సీతాదేవిని వివాహమాడగా అల్లుడు హోదా లో సంస్థాన వారసుడు అయ్యారు. 1995లో కారు ప్రమాదంలో సీతాదేవి మృతి చెందగా 1996లో శ్యామలాదేవిని వివాహం చేసుకున్నారు. వీరికి ముగ్గురు కుమార్తెలు. శ్యామలాదేవికి కూడా మొగల్తూరు సంస్థానాదీశులతో బంధుత్వం ఉంది. ఓడి.. గెలిచిన నాయకుడిగా.. స్వాతంత్య్ర ఉద్యమ కాలం నుంచి కాంగ్రెస్ కుటుంబ నేపథ్యం గల కృష్ణంరాజు అదే పార్టీ నుంచి రాజకీయ అరంగేట్రం చేశారు. 1991లో కాంగ్రెస్ పార్టీ నుంచి నరసాపురం లోక్‌సభ స్థానానికి పోటీచేసి ఓటమి పాలయ్యారు. 1998లో బీజేపీలో చేరి కాకినాడ లోక్‌సభ స్థానంలో ఎంపీగా గెలుపొందారు. 1999లో మధ్యంతర ఎన్నికలు రావడంతో నరసాపురం నుంచి పోటీచేసి లక్షన్నర మెజార్టీతో గెలుపొందారు. ఆనాటి వాజ్‌పేయి ప్రభుత్వంలో కేంద్ర విదేశీ వ్యవహారాలు, గ్రామీణాభివృద్ధి సహాయ మంత్రిగా, రక్షణ శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. 2009లో చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పారీ్టలో చేరినా కొంతకాలానికి మళ్లీ బీజేపీ గూటికి వచ్చారు. సొంతూరిపై మమకారం కృష్ణంరాజు మొదటి నుంచీ సొంతూరుపై మమకారం చూపారు. మొగల్తూరు నుంచి భీమవరం మండలం వెంప గ్రామానికి రోడ్డు నిర్మాణం కోసం ఆనాటి ముఖ్యమంత్రి జనార్దనరెడ్డితో మాట్లాడి రూ.80 లక్షలు మంజూరు చేయించారు. కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలో స్వజలధార పథకంలో జిల్లాలో పలు గ్రామాలకు లక్షలాది నిధులు మంజూరు చేయించారు. 214 జాతీయ రహదారిని 216 ఏగా మారి్పంచి నరసాపురం, మొగల్తూరు మండలాలను కలుపుతూ ఒంగోలు వరకూ రోడ్డును విస్తరింపజేశారు. ఆయన తరచూ సొంతూరుకు వచ్చి చిన్ననాటి స్నేహితులను కలిసేవారు. మొగల్తూరు వస్తే సొంతింటిలోనే బస చేసేవారు. గోదావరి ముద్దు బిడ్డగా.. రాచరికపు ఆచారాలు, సంస్కృతి, సంప్రదాయాలను పాటించడంలో ముందుండే కృష్ణంరాజు కుటుంబంలో ఏ కార్యక్రమమైనా సొంతింటిలోనే జరిపించేవారు. గోదావరిపై మక్కువతో ఆయన నటించిన చిత్రాల్లో గోదావరి పాటలను ఉండేలా చూసేవారు. గోదావరి పుష్కరాలకు సతీసమేతంగా హాజరయ్యేవారు. నరసాపురం వశిష్ట గోదావరి, మొగల్తూరులోని సముద్ర తీర ప్రాంతాల్లో పలు సినిమా షూటింగ్‌లు చేశారు. సొంతింట్లో 4 నెలల విశ్రాంతి బంగారుతల్లి సినిమా షూటింగ్ నరసాపురం, మొగల్తూరు ప్రాంతాల్లో జరుగుతున్న సమయంలో ఆయన గాయంతో కాలు విరిగి నాలుగు నెలలపాటు మొగ ల్తూరులోని నివాసంలోనే విశ్రాంతి తీసుకున్నారు. మొగల్తూరు మొనగాళ్లుగా.. మొగల్తూరు ప్రాంతానికి చెందిన కృష్ణంరాజు, చిరంజీవి సినీ పరిశ్రమలో అగ్రహీరోలుగా వెలుగొందడాన్ని ఈ ప్రాంతవాసులు గొప్పగా చెప్పుకునేవారు. కృష్ణంరాజు రైతుగా వ్యవసాయం కూడా చేశారు. రెబల్ పాత్రలతో రెబల్‌స్టార్‌గా పేరుపొందారు. స్వచ్ఛందంగా దుకాణాల మూసివేత మొగల్తూరులో వ్యాపారులు ఆదివారం స్వచ్ఛందంగా దుకాణాలు మూసివేసి కృష్ణంరాజు మృతికి సంతాపం తెలిపారు. మొగల్తూరు అందే బాపన్న జూనియర్ కళాశాల, కోట్ల రంగారావు డిగ్రీ కళాశాలలకు సోమవారం సెలవు ప్రకటించినట్టు యాజమాన్యాలు తెలిపాయి. ఏజెన్సీతో ప్రత్యేక అనుబంధం బుట్టాయగూడెం: కృష్ణంరాజుకు పశి్చమ ఏజెన్సీతో ప్రత్యేక అనుబంధం ఉంది. దర్శకుడు బాపూ దర్శకత్వంలో 1976లో విడుదలైన భక్త కన్నప్ప సినిమాలోని పలు సన్నివేశాలను బుట్టాయగూడెం సమీపంలోని ఇప్పలపాడు, దొరమామి డి, అలివేరు, పట్టిసీమ ప్రాంతాల్లో చిత్రీకరించారు. దాదాపు నెల పాటు షూ టింగ్ జరగ్గా.. కరాటం కృష్ణమూర్తి, చంద్రయ్య ఇంటి వద్ద కృష్ణంరాజు బసచేశారు. ఇప్పలపాడు గ్రామం పక్కన ప్రత్యేక సెట్టింగ్స్‌తో గిరిజన గూడేన్ని ఏర్పాటుచేశారు. ప్రధాన సన్నివేశాలన్నీ ఇక్కడే చిత్రీకరించారు. షూటింగ్ విరా మ సమయంలో ఇప్పలపాడులోని వీధుల్లో కృష్ణంరాజు సాధారణ వ్యక్తిగా తిరుగుతూ అందరినీ పలకరించేవారని అప్పటి షూటింగ్‌ను తిలకించిన గిరిజనులు అంటున్నారు. మొక్కజొన్న పొత్తులను ఇష్టంగా తినేవారని చెబుతున్నా రు. అలనాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటున్నారు. -
నరసపురం వద్ద ప్రమాదకరంగా గోదావరి ఉధృతి
-
ప్రభుత్వంపై కావాలనే తప్పుడు ప్రచారం: మంత్రి సీదిరి అప్పలరాజు
-
ఈ ఏడాది నుంచే ఫిషరీష్ వర్సిటీలో తరగతులు
నరసాపురం(పశ్చిమ గోదావరి జిల్లా): నరసాపురంలో త్వరలో ఏర్పాటు కానున్న ఫిషరీస్ యూనివర్సిటీ భవన నిర్మాణాలు పూర్తిచేయడానికి ఏడాది సమయం పట్టే అవకాశం ఉండడంతో.. ఆ లోపుగా.. రాబోయే విద్యాసంవత్సరం (2022–2023) నుంచే ఆయా కోర్సుల తరగతులు నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో తాత్కాలిక అద్దె భవనాల పరిశీలన కోసం నరసాపురం ఫిషరీష్ యూనివర్సిటీ ప్రత్యేక అధికారి ఓ.సుధాకర్ నేతృత్వంలోని ప్రతినిధుల బృందం సోమవారం నరసాపురంలో పర్యటించింది. పట్టణంలోని పీచుపాలెం, పాతనవరసపురం ప్రాంతాల్లో ఖాళీగా ఉన్న రెండు ఇంజనీరింగ్ కళాశాలలను ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజుతో కలిసి పరిశీలించారు. రూ.100 కోట్లతో టెండర్లు.. భవనాల పరిశీలన అనంతరం ఎమ్మెల్యే ప్రసాదరాజు తన నివాసంలో అధికారుల బృందంతో సమావేశం నిర్వహించారు. వర్సిటీ కోసం ముందుగా మంజూరైన రూ.100 కోట్లతో అకడమిక్ బ్లాక్, అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్, బాయ్స్, గరల్స్ హాస్టల్ బ్లాకులను సరిపల్లిలో నిర్మించాల్సి ఉందన్నారు. అన్ని అనుమతులు మంజూరైన దృష్ట్యా వెంటనే టెండర్లు పిలవాలని అధికారులకు చెప్పారు. తెలుగు రాష్ట్రాల్లోనే మొదటిదిగా, దేశంలో మూడోదిగా నిర్మితమవుతున్న ఫిషరీస్ యూనివర్సిటీ దేశానికే తలమానికంగా నిలవాలన్నారు. (చదవండి: తొలి ఫిషరీస్ విశ్వవిద్యాలయం ఏర్పాటుకు ముందడుగు) -
మత్స్యానికి మహర్దశ
నరసాపురం: మత్స్య పరిశ్రమ అభివృద్ధి దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో ఏర్పాటు చేస్తున్న రాష్ట్రంలో తొలి ఫిషరీస్ యూనివర్సిటీకి నిధులు మంజూరు చేసింది. ఆక్వా పరిశ్రమ అభివృద్ధికి ఎంతో కీలకమైన ఈ విశ్వవిద్యాలయానికి తొలి విడతగా రూ.100 కోట్లు మంజూరు చేసింది. నరసాపురం మండలం తీరగ్రామం వేములదీవి ప్రాంతంలో 400 ఎకరాల్లో వర్సిటీ నిర్మాణం చేపడతారు. పరిపాలన భవనాన్ని 40 ఎకరాల్లో సమీపంలోని సరిపల్లి గ్రామంలో నిర్మిస్తారు. వీటికి స్థల సేకరణ కూడా పూర్తయింది. విశ్వవిద్యాలయం నిర్మాణం, కోర్సుల నిర్వహణ, ప్రయోగాలు తదితర అంశాలకు ఐదేళ్లలో రూ.400 కోట్ల వరకూ ఖర్చుచేస్తారని అధికారులు తెలిపారు. ఈ విశ్వవిద్యాలయం ద్వారా ఆక్వా రంగానికి నిపుణుల కొరత తీరుతుంది. పెద్ద ఎత్తున పరిశోధనలకు, ఆక్వా రంగం అభివృద్ధికి వర్సిటీ దోహదం చేస్తుందని అధికారులు చెబుతున్నారు. దీని ద్వారా ప్రత్యక్షంగా 90 వేల మంది ఆక్వా రైతులు, పరోక్షంగా 8 లక్షల మంది ప్రజలు లబ్ధిపొందుతారని అంచనా. మత్స్య శాఖకు సంబంధించిన అన్ని కోర్సుల బోధన ఈ వర్సిటీ ద్వారానే సాగుతుంది. ఆక్వా రంగానికి జగన్ సర్కారు దన్ను మత్స్య సంపద, ఆక్వా ఎగుమతుల్లో రాష్ట్రానికి ప్రత్యేక స్థానం ఉంది. ఇక్కడి నుంచి దేశ, విదేశాలకు భారీగా ఆక్వా ఎగుమతులు జరుగుతాయి. ఆదాయం భారీగా సమకూరుతుంది. అయితే ఈ రంగం అభివృద్ధిపై గత ప్రభుత్వాలు దృష్టి పెట్టలేదు. దీంతో పూర్తిస్థాయిలో ఆదాయం రావడంలేదు. నిపుణులు, హార్బర్, ఇతర మౌలిక వసతులు ఉంటే ఎగుమతులు మరో 40 శాతం పెరుగుతాయని అధికారులు చెబుతున్నారు. నిపుణులు లేక ప్రయోగాలు, కొత్త ఆవిష్కరణలు లేవు. వైరస్లు సోకకుండా, లాభదాయకంగా ఆక్వా సాగు చేయడం లాంటి ప్రయోజనాలు రైతులు కోల్పోతున్నారు. ఆక్వా నిపుణుల కొరత కారణంగా రాష్ట్రం ఏటా రూ.25 వేల కోట్ల అదనపు ఆదాయం కోల్పోతోందని అంచనా. గత ప్రభుత్వాల తప్పిదాలను వైఎస్ జగన్మోహన్రెడ్డి సర్కారు తొలి నాళ్లలోనే గుర్తించింది. భారీగా ఆదాయం వచ్చే ఆక్వా, మత్స్య ఎగుమతుల అభివృద్ధిపై దృష్టిపెట్టింది. రాష్ట్రంలో మత్స్యకారుల జీవన ప్రమాణాలు, మత్స్య ఉత్పత్తులను పెంచే చర్యలు చేపట్టింది. మత్స్యకారుల వలసలను నివారించడానికి రూ.3,200 కోట్లతో రాష్ట్రంలో మేజర్ ఫిషింగ్ హార్బర్లు, మినీ ఫిషింగ్ ల్యాండింగ్ సెంటర్ ఏర్పాటు చేయాలని సీఎం వైఎస్ జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా నరసాపురం మండలం బియ్యపుతిప్పలో 600 ఎకరాల్లో రూ.350 కోట్లతో హార్బర్ నిర్మించనున్నారు. ఆక్వా చెరువులకు నిబంధనలు సరళతరం చేయడం, సబ్సిడీపై విద్యుత్ అందించడం లాంటి చర్యలు జగన్ ప్రభుత్వం చేపట్టింది. ఇప్పుడు విశ్వవిద్యాలయం ఏర్పాటుకు చకచకా చర్యలు చేపడుతోంది. ఆక్వా, మత్స్య ఉత్పత్తులకు మహర్దశ జిల్లాలో ఫిషరీస్ యూనివర్సిటీకి తొలివిడతగా రూ.100 కోట్లు మంజూరు చేయడం హర్షణీయం. ఇది ఆక్వా, మత్స్య రంగాల్లో నూతన విప్లవం. ఆక్వా రంగ నిపుణులను తయారు చేసుకుని, సాగులో నైపుణ్యాలను పెంచుకుంటే నష్టాలు తగ్గుతాయి. ప్రభుత్వం జిల్లాలో ఆక్వా, మత్స్య రంగాల అభివృద్ధికి పరితపిస్తోంది. అందుకే బియ్యపుతిప్పలో హార్బర్ కట్టబోతున్నారు. –ముదునూరి ప్రసాదరాజు, ఎమ్మెల్యే -
అల్లుళ్లకు 365 రకాల వంటలతో ఆతిథ్యం
నరసాపురం: గోదారోళ్లు అంటేనే మర్యాదలకు మారుపేరు. సంక్రాంతి సందర్భంగా శని, ఆదివారాల్లో పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో రెండు కుటుంబాలు 365 రకాల వంటలతో కొత్త, కాబోయే అల్లుళ్లకు విందు భోజనం పెట్టారు. రైస్‌మిల్లర్ ఆచంట గోవింద్, నాగమణి దంపతుల కుమార్తె అత్యం మాధవి, అల్లుడు జ్యువెలరీ వ్యాపారి వెంకటేశ్వరరావు భీమవరంలో నివాసం ఉంటారు. వీరి ఏకైక కుమార్తె కుందవికి ఇటీవల తణుకుకి చెందిన ఎన్నారై తుబ్బలపల్లి సాయికృష్ణతో వివాహం నిశ్చయమైంది. పెళ్లికి ముందే పెద్ద పండుగ రావడంతో సాయికృష్ణను ఆహ్వానించి 365 రకాల ఐటమ్స్ కొసరి కొసరి వడ్డించారు. రైస్, లెమన్‌రైస్, పులిహోర, దద్దోజనం, క్షీరాన్నం, బిర్యానీ ఇలా అన్నంలోనే 30 రకాలు, 50 రకాల స్వీట్లు, 20 రకాల హాట్స్, 100 రకాల పిండి వంటలు, 35 రకాల కూల్‌డ్రింక్స్, 35 రకాల బిస్కెట్స్, 30 రకాల ఐస్‌క్రీమ్స్, 15 రకాల కేక్‌లు తదితరాలు కలిపి మొత్తం 365 రకాలున్నాయి. ఇదే తరహాలో మరో కుటుంబం నాన్‌వెజ్ ఐటమ్స్‌తో అల్లుడికి విందు భోజనం పెట్టారు. కొత్త అల్లుడు వినయ్‌కుమార్‌కు 365 రకాల వంటలను వడ్డిస్తున్న దృశ్యం కొబ్బరి ఎగుమతుల వ్యాపారి మానే నాగేశ్వరరావు, అనంతలక్ష్మిల కుమార్తె యశోదసాయి, అల్లుడు వినయ్‌కుమార్‌కు 365 రకాల ఐటమ్స్ సిద్ధం చేసి భోజనం పెట్టారు. సొర, కొరమీను, వంజరం, కట్టెపరిగె, పండుగప్ప, సందువా తదితర రకాల చేపల కూరలు వడ్డించారు. చింతకాయ, పచ్చిరొయ్యలు, చింతచిగురు రొయ్యలు, చింతాకు, చిన్నచేపలు తదితర వంటలు వండారు. -
ఐదేళ్ల క్రితం రెండో పెళ్లి: ఏమైందోఏమో రోడ్డుపై నిర్జీవంగా..
పెడన: మండలంలోని నందమూరు పంచాయతీ సత్యనారాయణపురంలో ఓ మహిళ హత్యకు గురైంది. భర్తే ఆమెను హత్య చేశాడని మృతురాలి కుమార్తెలు ఆరోపిస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు... పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం వేములదీవికి చెందిన పేరం లక్ష్మి(37) మొదటి భర్తకు విడాకులు ఇచ్చి సుమారు ఐదేళ్ల కిందట పెడన మండలం నందమూరు పంచాయతీ సత్యనారాయణపురం గ్రామానికి వచ్చి ఇక్కడ ఉంటోంది. నందమూరు గ్రామానికి చెందిన లారీ డ్రైవర్ పరసా సూరిబాబు తన భార్యకు విడాకులు ఇచ్చి లక్ష్మిని రెండో పెళ్లి చేసుకున్నాడు. లక్ష్మికి మొదటి వివాహంలో పుట్టిన సంతానంలో ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. సూరిబాబు వారితో కలిసి సత్యనారాయణపురంలోనే ఉంటున్నాడు. నాలుగేళ్ల కిందట లక్ష్మి పెద్దకుమార్తెకు వివాహం చేశారు. ఇటీవల తరుచుగా సూరిబాబు, లక్ష్మిల మధ్య గొడవలు జరుగుతున్నాయి. రెండు రోజుల కిందట సూరిబాబు లక్ష్మితో గొడవపడి ఆమెను గాయపరచడంతో ప్రభుత్వాసుపత్రికి వెళ్లి చికిత్స పొందింది. అనంతరం భర్తపై కేసు పెట్టింది. ఈ కేసు విషయంలో శుక్రవారం ఉదయం కూడా పెద్దల సమక్షంలో పంచాయతీ జరిగినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో శుక్రవారం మధ్యాహ్నం నందమూరు నుంచి కాకర్లమూడి వెళ్లే డొంక మార్గంలో మహిళ మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో సీఐ ఎన్.కొండయ్య, ఎస్ఐ మురళి, తమ సిబ్బందితో సంఘటన స్థలానికి వెళ్లి మృతదేహం లక్ష్మిదిగా గుర్తించారు. ఉదయం పంచాయతీ జరిగిన అనంతరం సూరిబాబు, లక్ష్మి కలసి వెళ్లారని లక్ష్మి కుమార్తెలు లావణ్య, శ్రీదుర్గ చెబుతున్నారు. సూరిబాబే తమ తల్లిని హత్య చేశాడని వారు ఆరోపిస్తున్నారు. మృతురాలి కుమార్తెలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీఐ కొండయ్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: గుజరాత్ చెడ్డీ గ్యాంగ్ అరెస్ట్: వీళ్ల అరాచకాలు ఒక్కొక్కటిగా.. -
పండుటాకుల పాదయాత్ర
బూర్గంపాడు: శేష జీవితం ప్రశాంతంగా గడపాల్సిన ఇద్దరు వృద్ధులు సాహసానికి పూనుకున్నారు. గోదావరి పరీవాహక ప్రాంతంలో పాదయాత్ర చేపట్టారు. మహారాష్ట్రలోని నాసిక్‌కు చెందిన 80 ఏళ్ల పాండురంగ విఠల్ భగవత్, 82 ఏళ్ల కార్బరి దేవ్రామ్ డుమ్రి పాదయాత్ర చేస్తున్నారు. శనివారం వీరి పాదయాత్ర తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడుకు చేరుకుంది. ఈ సందర్భంగా వారు ‘సాక్షి’తో మాట్లాడుతూ గతంలో రెండుసార్లు నాసిక్ నుంచి రాజమండ్రి వరకు గోదావరి అవతలి గట్టున పాదయాత్ర చేశామని, ప్రస్తుతం నాసిక్ నుంచి నరసాపురం వరకు రైలులో వచ్చామని, అక్కడి నుంచి తిరిగి నాసిక్‌కు గోదావరి ఇవతలి గట్టున పాదయాత్ర చేస్తున్నామని వివరించారు. 15 రోజుల కిందట నరసాపురంలో పాదయాత్ర ప్రారంభించామన్నారు. గోదావరి నది పుట్టుక స్థానం నుంచి సముద్రంలో కలిసే వరకు రెండుసార్లు పాదయాత్ర చేశామని చెప్పారు. ఇప్పుడు సముద్రంలో కలిసిన స్థానం నుంచి గోదావరి పుట్టుక స్థానం వరకు పాదయాత్ర చేపట్టామని వెల్లడించారు. -
పసిడికి పెట్టింది పేరు.. నరసాపురం గోల్డ్ మార్కెట్
సాక్షి, నరసాపురం (ప.గో): అరబ్ దేశాల్లో తయారయ్యే బంగారు ఆభరణాల డిజైన్లు రోజుల వ్యవధిలోనే పసిడి ప్రియుల కోసం అక్కడి గోల్డ్ మార్కెట్లో రెడీగా ఉంటాయి. జ్యూయలరీ అయినా, గోల్డ్ బిస్కట్లయినా అక్కడి నుంచే రాష్ట్రంలోని చాలా షాపులకు సరఫరా అవుతుంటాయి. అందుకే నరసాపురం గోల్డ్ మార్కెట్ రాష్ట్రంలో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. మన జిల్లాలో గోల్డ్ మార్కెట్‌ను శాసిస్తున్న ఈ పట్టణం తెలుగు రాష్ట్రాల్లోనే నాణ్యమైన బంగారం బిజినెస్‌కు పెట్టిందిపేరు.. శతాబ్దం పైనుంచే మేలిమి బంగారాన్ని వినియోగదారులకు అందిస్తున్న ఇక్కడి మార్కెట్ ఉభయ గోదావరి జిల్లాల్లో హోల్‌సేల్ వ్యాపారానికి పేరుపడింది. అందుకే కార్పొరేట్ సంస్థలు రాజ్యమేలుతున్న ప్రస్తుత తరుణంలో బంగారం మార్కెట్లో ఇక్కడి వర్తకులు సత్తా చాటుతున్నారు. 1920లలో బంగారం వ్యాపారానికి పునాది దాదాపు 100 సంవత్సరాల ముందు నుంచే నరసాపురం బంగారం వ్యాపారానికి ప్రఖ్యాతి గాంచింది. 1920 ప్రాంతంలో ఇక్కడ పసిడి మార్కెట్‌ను ప్రారంభించారు. రాజస్థాన్‌కు చెందిన కొన్ని జైన్ కుటుంబాలు బ్రిటిష్ హయాంలో ఇక్కడ స్థిరపడ్డారు. మొదట తాకట్టు వ్యాపారం ప్రారంభించిన జైన్లు తరువాత కాలంలో బంగారం వ్యాపారం ప్రారంభించారు. మొదట్లో చిన్నగా ప్రారంభమైన వ్యాపారం తరువాత కాలంలో భారీగా విస్తరించింది. ప్రస్తుతం జిల్లాలో దాదాపు 400 వరకూ జ్యూయలరీ షాపులు ఉండగా ఒక్క నరసాపురంలోనే 150 వరకూ షాపులు ఉన్నాయి. రిటైల్ వ్యాపారమే కాదు.. ఇక్కడి నుంచి ఉభయగోదావరి జిల్లాల్లోని అన్ని షాపులకు హోల్‌సేల్‌గా బంగారం సప్లయ్ చేస్తున్నారు. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లోని పలు జ్యూయలరీ షాపులకు కూడా ఇక్కడి హోల్‌సేల్ వ్యాపారులు బంగారం, వెండి సప్లయ్ చేస్తారు. ఇందులో బిస్కెట్ల నుంచి ఆభరణాల వరకూ అన్నీ ఉంటాయి. పలు కార్పొ రేట్ షాపులకు కూడా ఇక్కడి డీలర్లు సప్లయ్ చేస్తుంటారు. నరసాపురం కేంద్రంగా రోజుకు రూ.3 నుంచి రూ.5 కోట్ల వరకూ వ్యాపారం సాగుతుంది. పెళ్లిళ్లు, పండుగల సీజన్లలో వ్యాపారం రోజుకు మరో రూ.2 నుంచి రూ.3 కోట్లు అదనంగా ఉంటుంది. 1980 నుంచి రెడీమేడ్ ఆభరణాల హవా బ్రిటిష్ వారి హయాంలో గోల్డ్ కంట్రోల్ యాక్ట్ అమల్లో ఉండేది. బంగారు బిస్కెట్ల అమ్మకాలకు కొందరికే అనుమతి ఉండేది. ఆ సమయంలో ఉమ్మడి ఆంధ్రాలోని అన్ని ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున బంగారం కొనుగోళ్లకు నరసాపురం వచ్చేవారని చెబుతారు. ముఖ్యంగా జల రవాణా సౌలభ్యం ఉండటంతో వేరే రాష్ట్రాల వ్యాపారులు అక్రమంగా ఇక్కడకు బంగారం తరలించి అమ్మకాలు చేసేవారని ప్రచారం ఉంది. ఆ సమయంలోనే నరసాపురం బంగారం వ్యాపారానికి పేరుపడింది. 1980 నుంచి రెడీమేడ్ ఆభరణాల హవా ప్రారంభమైంది. ఆ అవకాశాన్ని కూడా ఇక్కడి వ్యాపారులు అందిపుచ్చుకున్నారు. దుబాయ్, సింగపూర్, ముంబై, కోల్‌కతా, చెన్నై, అమృత్సర్ ఇలా దేశ, విదేశాల్లో తయారయ్యే అధునాతన డిజైన్లు రోజుల వ్యవధిలోనే ఇక్కడి వ్యాపారులు తయారుచేసేవారు. 30 మంది వరకూ హోల్‌సేల్ వ్యాపారులు.. నరసాపురంలో 30మంది వరకూ హోల్‌సేల్ వ్యాపా రులు ఉన్నారు. వీరికి నరసాపురం కేంద్రంగా ముంబై, చెన్నై, కోల్‌కతాలో అనుబంధ కార్యాలయాలు ఉంటాయి. రెండు రాష్ట్రాల్లోని జ్యూయలరీ షాపుల నుంచి వచ్చే ఆర్డర్ల మేరకు బంగారం, వెండి తెప్పిస్తారు. వెండి ఆభరణాల తయారీకి దేశంలో తమిళనాడులోని సేలం ప్రసిద్ది. తరువాత స్థానంలో నరసాపురం ఉండటం మరో విశేషం. మన రాష్ట్రంలో వెండి హోల్‌సేల్ వ్యాపారం నరసాపురం నుంచే పెద్దస్థాయిలో జరుగుతుంది. గోల్డ్ ఎగ్జిబిషన్లో నరసాపురం స్టాల్స్ ప్రతీఏటా జులై–నవంబర్ మాసాల మధ్యలో ముంబైలో ఇంటర్నేషనల్ గోల్డ్ ఎగ్జిబిషన్ జరుగుతుంది. గల్ఫ్ దేశాలతో పాటు లాటిన్ అమెరికా, జర్మనీ నుంచి కూడా కస్టమర్లు ఇక్కడకు వస్తారు. ఈ ఎగ్జిబిషన్లో నరసాపురం వ్యాపారుల స్టాల్స్‌కు మంచి క్రేజ్. దీంతో నరసాపురం పసిడి ఖ్యాతి ప్రపంచ గుర్తింపు పొందింది. జిల్లా ప్రజలతో జైన్లు మమేకం బంగారం వ్యాపారం కోసం గణేష్మల్, శాంతలాల్, జోట్మల్ నట్మల్, గులాబ్‌చంద్ కుటుంబాలు వచ్చాయి. ప్రస్తుతం నరసాపురంలో 94 జైన్ కుంటుంబాలు ఉన్నాయి. జిల్లాలోని మరికొన్ని పట్టణాలకు కూడా వీరి వ్యాపారం విస్తరించింది. బంగారంతో పాటు ఇతర వ్యాపారాల్లో కూడా వీరు స్థిరపడ్డారు. ఎన్నో ఏళ్ల కష్టం దాగిఉంది నరసాపురం పేరు చెబితే ఇప్పుడు బంగారం పేరు గుర్తుకువస్తుంది. ఓ వ్యాపారం ద్వారా ఊరికి పేరు రావడం గొప్ప విషయం. దీని వెనుక కొన్ని జైన్ కుటుంబాల సంవత్సరాల కష్టం దాగిఉంది. వేరే రాష్ట్రం నుంచి వచ్చినా కూడా ఇక్కడి ప్రజలతో వారు ఏర్పర్చుకున్న బంధం, సేవా దృక్పథం ఈ ఉన్నతికి కారణం. భవిష్యత్‌లో కూడా ఇది కొనసాగాలి – సీహెచ్ రెడ్డప్ప ధవేజీ, వ్యాఖ్యాత, నరసాపురం అన్ని డిజైన్లూ దొరుకుతాయి ఏ మోడల్ ఆభరణం కావాలన్నా ఇక్కడ దొరుకుతుంది. అందుకే దూరప్రాంతాల్లో ఉన్న చుట్టాలు కూడా ఎప్పుడైనా బంగారం కొనాలనుకుంటే ఇక్కడకు వచ్చి మా ఇళ్లలో ఉండి కొనుక్కుని వెళతారు. ఫోన్లు చేసి బంగారం రేటు ఎంతుందో కనుక్కోమంటారు. ఈ ప్రాంతంలోని అందరి ఇళ్లలోనూ ఇవే అనుభవాలు. బంగారానికి మా ఊరు పెట్టిందిపేరు. – మేకల కాశీఅన్నపూర్ణ, గృహిణి, నరసాపురం మా పెద్దల కృషే కారణం నరసాపురం బంగారం వ్యాపారానికి పేరు రావడానికి కారణం మా పెద్దలు చేసిన కృషే. 1980లో రెడీ మేడ్ ఆభరణాల రాకతో వ్యాపారం బాగా పెరిగింది. దుబాయ్‌లో జరిగే ఇంటర్నేషనల్ గోల్డ్ ఎగ్జిబిషన్‌కు చాలాసార్లు వెళ్లాను. మా ఆభరణాలకు అక్కడ మంచి పేరుంది. – వినోద్‌కుమార్‌జైన్, నరసాపురం బులియన్ మర్చంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు -
నరసాపురంలో ఘోర రోడ్డు ప్రమాదం
సాక్షి, నరసాపురం రూరల్ : నరసాపురం నుంచి పాలకొల్లు వెళ్లే రోడ్డులో పద్మశ్రీ కాలనీ సమీపంలో గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. రెండు బైక్‌లపై ప్రయాణిస్తున్న యువకులను గుర్తుతెలియని వాహనం ఢీ కొట్టినట్టు పేర్కొంటున్నారు. అయితే ఎదురెదురుగా వస్తున్న రెండు బైక్‌లు ఢీకొన్న తరువాత ప్రమాదం జరిగిందేమో అనే అనుమానం కూడా వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదంలో మరణించిన, గాయపడిన వారంతా ఇంటర్ చదువుతున్న విద్యార్థులే. రోడ్డుపై చెల్లా చెదురుగా పడిఉన్న మృతదేహాలతో ఆ ప్రాంతం రక్తపు మడుగులా మారింది. చదవండి: (పాఠశాల సమీపంలో ఘర్షణ.. ఏడో తరగతి విద్యార్థి మృతి) ప్రమాదంలో పోడూరు మండలం జిన్నూరుకు చెందిన చదలవాడ వంశీ, నరసాపురం కనకదుర్గా థియేటర్ ప్రాంతానికి చెందిన చాట్ల ముఖేష్ కుమార్(16), నరసాపురం వనువులమ్మగుడి ప్రాంతానికి చెందిన సమతం సుబ్రహ్మణ్యం(17) అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్ర గాయాలైన పోడూరు మండలం జిన్నూరుకు చెందిన ఇంజమూరి గని, నరసాపురం పెద్దచర్చి ప్రాంతానికి చెందిన లంకాని సాయికుమార్‌లను చికిత్స కోసం పోలీసులు 108 అంబులెన్స్‌లో భీమవరంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. మూడు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం నరసాపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. నరసా పురం సీఐ శ్రీనివాసయాదవ్ పర్యవేక్షణలో రూరల్ ఎస్సై ప్రియకుమార్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: (భార్యపై కోపంతో కారు, 4 బైకులకు నిప్పు పెట్టిన ఐటీ ఉద్యోగి) -
రఘురామకృష్ణరాజుకు వ్యతిరేకంగా భారీ ర్యాలీ
సాక్షి, ఏలూరు: ఎంపీ కనుమూరు రఘురామకృష్ణరాజుకు వ్యతిరేకంగా నరసాపురంలో భారీ ర్యాలీ చేపట్టనున్నట్లు ఏపీ బహుజన ఐక్య వేదిక వెల్లడించింది. రెండేళ్లుగా నియోజకవర్గ ప్రజలను, అభివృద్ధిని పట్టించుకోని రఘురామను ఎంపీ పదవి నుంచి వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేసింది. ఓట్లేసి ఎన్నుకున్న ఎంపీ తమను మోసం చేశాడంటూ నియోజకవర్గ ప్రజలు రఘురామకృష్ణరాజుపై పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు ఎంపీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఇదిలా ఉంటే, దళితులపై అనుచిత వ్యాఖ్యలు చేశాడంటూ రఘురామకృష్ణరాజుపై ఇవాళ ఉదయం గరగపర్రు గ్రామ దళితుల పోలీసులకు ఫిర్యాదు చేశారు. రఘురామకృష్ణరాజును ఎంపీ పదవి నుంచి బర్తరఫ్ చేయాలని నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. రఘురామకృష్ణరాజు దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన తెలిపారు. చదవండి: రఘురామకృష్ణరాజును డిస్క్వాలిఫై చేయండి -
ఏపీ: సరికొత్త రాజకీయ చరిత్ర
సాక్షి, అమరావతి: పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం అసెంబ్లీ నియోజకవర్గం సీతారామపురం సౌత్ గ్రామంలోకి వెళ్లి పెండ్ర వీరన్న ఉండేది ఎక్కడా? అని ఎవరైనా అడితే శివారున పూరిల్లు (తాటాకు గుడిసె) చూపిస్తారు. ఇందేంటి కార్పొరేషన్ చైర్మన్ తాటాకు ఇంట్లో అని ఆశ్చర్యపోవడం మనవంతు అవుతుంది. అదే విషయాన్ని ఆయన్ను ప్రశ్నిస్తే.. ఇది వైఎస్ జగనన్న తీసుకొచ్చిన సామాజికవ విప్లవం అని గర్వంగా చెబుతున్నాడు. అత్యంత వెనుకబడిన వర్గాలైన సంచార జాతులకు చెందిన మందుల (బీసీ–ఎ) కులంలో పుట్టిన తాను పూరి పాకలో నివాసం ఉంటూ కుటుంబాన్ని పోషించుకోవడమే కష్టమైన జీవనం గడిపేవాడు వీరన్న. పదో తరగతి మాత్రమే చదవినప్పటికీ సామాజిక చైతన్యం అలవర్చుకుని తమ జాతి మెరుగైన జీవనం కోసం అనేక కార్యక్రమాలు చేపట్టాడు. దుర్భరమైన జీవనం గడిపే మందుల కులస్తులను ఎస్టీ జాబితాలో చేర్చాలనే పోరాటానికి నాయకత్వం వహించేలా 2011 డిసెంబర్ 12న మందుల కులస్తుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. తమ లాంటి వారి బతుకుల్లో వెలుగు నింపుతారనే ఆశయంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన పాదయాత్రలో కలిసి తమ జాతి సమస్యలను వివరించానని ఆయన గుర్తు చేశారు. ఇచ్చిన మాట ప్రకారం వైఎస్ జగన్ తనను అత్యంత వెనుకబడిన వర్గాల (సంచార జాతులు)కు కార్పొరేషన్ చైర్మన్ చేశారని గర్వంగా చెప్పారు. పూరి గడిసెలో జీవనం సాగిస్తూ అట్టడుగు వర్గాల కష్టాలను స్వయంగా చూసిన తాను అయితేనే అత్యంత వెనుకబడిన వర్గాలకు అండదండగా ఉంటాననే నమ్మకంతో వైఎస్ జగన్ ఈ పదవి ఇచ్చారని, తనకే కాదు.. ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా వెనుకబడిన అనేక మందిని గుర్తించి ముఖ్యమంత్రి జగన్ అవకాశం కల్పించి సామాజిక విప్లవానికి నాంది పలికారని పెండ్ర వీరన్న గర్వంగా చెబుతున్నారు. సామాజిక చైతన్య వీచికలుగా బీసీ కార్పొరేషన్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కొత్త చరిత్రను సృష్టిస్తూ రాష్ట్రంలో 139 బీసీ కులాలకు గతేడాది అక్టోబర్‌లో 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు. వాటిలో చాలా కులాల పేర్లు చాలా మందికి తెలియదు. చాలా కులాలకు ఇంతకు ముందెన్నడూ ఇలాంటి గుర్తింపే లేదు. అటువంటిది వాటికి ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేసి వాటికి ఒక చైర్మన్, 12 మంది డైరెక్టర్లను నియమించి రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు ప్రాధాన్యత ఇవ్వడం ఒక రికార్డు. దాదాపు 56 కార్పొరేషన్ ఛైర్మన్లు, 672 డైరెక్టర్ పదవుల్లో 50 శాతం మహిళలకే కట్టబెట్టి మరో రికార్డును నెలకొల్పడం విశేషం. చదవండి: ట్విట్టర్ ట్రెండింగ్‌లో సీఎం జగన్ రెండేళ్ల పాలన సేవలన్నీ అక్కడే... ఊరికో ఆలయం -
వలంటీరుతో ఓడిస్తాం.. దమ్ముంటే రాజీనామా చెయ్యండి
తణుకు అర్బన్: నరసాపురం ఎంపీ పదవికి రాజీనామా చేసి పోటీకి దిగితే మీపై వలంటీరును పోటీకి పెట్టి విజయం సాధిస్తామని తణుకు ఎమ్మెల్యే కారుమూరి వెంకట నాగేశ్వరరావు ఎంపీ కనుమూరి రఘురామకృష్ణరాజుకు సవాల్ విసిరారు. పశ్చిమగోదావరి జిల్లా తణుకులో శనివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ► అధికార పార్టీ ఎంపీగా ఉంటూ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న మీరు ఎన్నికలకు దిగితే ఒక వలంటీరును మీపై పోటీకి దింపి గెలిపించే సత్తా మాకుంది. సీఎం జగన్ బొమ్మతో గెలిచి ఆయనకే మతాన్ని అంటగట్టేలా మాట్లాడుతున్న మీరు దమ్ముంటే రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్లాలి. ► కరోనా వైరస్‌కు ముందే నియోజకవర్గాన్ని విడిచి ఢిల్లీ, హైదరాబాద్‌లో ఉంటున్న మిమ్మల్ని నరసాపురం పార్లమెంట్ పరిధిలోని ప్రజలు మరిచిపోయారు. తణుకు నియోజకవర్గంలోనే పీఎం రిలీఫ్ ఫండ్స్ సుమారుగా రూ.8 లక్షలు వరకు వచ్చి ఉన్నా ఆ నిధులను వినియోగించే పరిస్థితిలో మీరు లేరు. ► అన్ని మతాలకు సమన్యాయం చేసేలా అర్చకులు, ఫాదర్స్, ఇమామ్‌లకు సంక్షేమం అందిస్తున్న సీఎం వైఎస్ జగన్‌ని ఉద్దేశించి మతం రంగు అంటించేలా మాట్లాడడమే కాకుండా కరోనా సమయంలో వినాయక చవితి మండపాలు పెట్టుకోనివ్వలేదని కనుమూరి ఆరోపించడం ఎంతవరకు సమంజసం? 18 నెలల పాలనలోనే బెస్ట్ సీఎంగా నిలిచిన వ్యక్తికి మతం రంగు అంటించి మత విద్వేషాలు రెచ్చగొట్టేలా రఘురామ ఉన్మాదిలా మాట్లాడుతున్నారు. చంద్రబాబు చేతిలో ఎంపీ కనుమూరి కీలుబొమ్మగా మారారు. -
‘రూ. 80 కోట్లతో నియోజకవర్గ అభివృద్ధి పనులు’
సాక్షి, పశ్చిమగోదావరి : వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన 5 నెలల్లోనే నియోజకవర్గం అభివృద్ధి పథంలో ముందుకు వెళుతుందని నరసాపురం ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు పేర్కొన్నారు. ఇప్పటికే మేనిఫెస్టోలో ఇచ్చిన హమీలన్నీ నెరవేర్చిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిదేనని ప్రశంసించారు. సుమారు రూ. 80 కోట్లతో నరసాపురం నియెజకవర్గం అభివృద్ధి పనులు ప్రారంభించినట్లు తెలిపారు. నియోజకవర్గ చిరకాల వాంఛ అయిన నర్సాపురం వశిష్ఠ వారధి.. అలాగే బియ్యపుతిప్పలోని మినీ హార్బర్, విజ్జేశ్వరం నుంచి నరసాపురం వరకు మంచినీటి పైపులైన్లకు జనవరిలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శంకుస్థాపన చేయనున్నట్లు వెల్లడించారు. స్థానికంగా ఇల్లులేని 7841 మందిని గుర్తించామని, ఉగాది నాటికి వారందరికీ ఇల్లు కట్టిస్తామని తెలిపారు. ఇసుక విషయంపై ప్రతిపక్షాలు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు విమర్శించారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల, అధిక వరదల వల్ల ఇసుక తవ్వడం ఆలస్యమైందే తప్ప ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆటంకం లేదని వివరణ ఇచ్చారు. -
కుమార్తెలపై తండ్రి కర్కశత్వం
నరసాపురం: గల్ఫ్‌లో ఉన్న భార్య తన జల్సాలకు డబ్బులు పంపించడంలేదని ఆగ్రహించి, తన ఇద్దరు కుమార్తెలను బెల్టుతో ఇష్టానుసారం కొడుతూ వీడియోలు తీసి భార్యకు పంపించి బ్లాక్ మెయిల్ చేశాడో కర్కోటకుడు. ఆ వీడియో వైరల్ కావడంతో పోలీసులు అతణ్ని కటకటాల వెనక్కి పంపారు. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం మండలం పెదసారవ గ్రామానికి చెందిన ఉల్లంపర్తి ఏలీజా పెయింటింగ్ పని చేస్తుండేవాడు. భార్య మహాలక్ష్మి ఏడాది క్రితం ఉపాధి కోసం కువైట్ వెళ్లింది. వీరికి ఇద్దరు కుమార్తెలు. కీర్తి (9) నాలుగో తరగతి చదువుతుండగా, మరియమ్మ (6) ఒకటో తరగతి విద్యార్థిని. మహాలక్ష్మి ప్రతీనెలా తన సంపాదనను భర్తకు పంపేది. ఆ సొమ్ముతో ఏలీషా 24 గంటలూ తాగుతూ జల్సాలు చేసేవాడు. విషయం తెలుసుకున్న మహాలక్ష్మి భర్తకు డబ్బులు పంపడం మానేసింది. ఆగ్రహించిన ఏలీజా కుమార్తెలిద్దరిని స్కూల్‌కు పంపడం ఆపేశాడు. బెల్టు, సెల్ ఛార్జర్ వైరుతో ఇస్టానుసారం కొట్టేవాడు. పిల్లలను కొడుతున్న దృశ్యాలను వీడియోతీసి, భార్యకు పంపించి, డబ్బులు పంపకపోతే వారు శవాలుగా మారతారని బెదిరించాడు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీనిపై నరసాపురం పోలీసులు కేసు నమోదు చేసి, ఏలీషాను అదుపులోకి తీసుకున్నారు. ఏలీషా సోదరి లక్ష్మి కూడా సహకరించి, వీడియో తీసినట్టుగా పిల్లలు చెప్పడంతో ఆమెపై కూడా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. రాష్ట్ర శిశు సంక్షేమశాఖ మంత్రి తానేటి వనిత ఘటనపై స్పందించి నరసాపురం డీఎస్పీ కార్యాలయానికి చేరుకుని పిల్లలతో మాట్లాడారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని పోలీసులను ఆదేశించారు. పిల్లల సంరక్షణను ప్రభుత్వం తీసుకుంటుందని ప్రకటించారు. -
అల్లికళ తప్పుతోంది!
సాక్షి ప్రతినిధి, ఏలూరు: పై లేసులను చూశారా.. ఎంత అందంగా ఉండి మనస్సును ఆకట్టుకుంటోందో.. దీని వెనుక గాలిలో గమ్మత్తుగా చేతులు తిప్పే మహిళల అద్భుత ప్రతిభ దాగి ఉంది. తదేకంగా దృష్టి కేంద్రీకరించి రూపొందించే ఈ కళాత్మక లేసు అల్లికలకు పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం ఎంతో ప్రసిద్ధి. కాగా ఉభయ గోదావరి జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో రూపొందించే అల్లికలకు విదేశాల్లో మంచి డిమాండ్ ఉంది. అయితే క్రమంగా చాలామంది.. ముఖ్యంగా ఈ తరంవారు ఈ కళకు దూరమవుతున్నారు. పనికి తగ్గ ఫలితం దక్కకపోవడం వారిని నిరుత్సాహపరుస్తోంది. నరసాపురం తరువాత దేశంలో ఉత్తరప్రదేశ్‌లోని కొన్ని గ్రామాల్లో మాత్రమే పరిమితంగా లేసు పరిశ్రమ ఉంది. ఇదే పరిస్థితి కొనసాగితే అరుదైన లేసు అల్లికల కళ పూర్తిగా అంతరించిపోయే ప్రమాదం ఉంది. బామ్మల వారసత్వంగా.. రెండు జిల్లాల్లోని 250 గ్రామాల్లో సుమారు 95 వేల మంది మహిళలు లేసు అల్లికలు చేస్తున్నట్టు అంచనా. గత 50 ఏళ్లుగా తమ బామ్మల వారసత్వంగా ఈ అరుదైన కళను కొనసాగిస్తున్నారు. దాదాపు 2,000 కుటుంబాలు ప్రత్యక్షంగా లేసు పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్నాయి. వీరిలో లేసు అల్లే మహిళల నుంచి ఆర్డర్లు తీసుకునే కమీషన్‌దారులు కూడా ఉన్నారు. ఇక అంతర్జాతీయ లేసు ఎగుమతిదారులు నరసాపురం ప్రాంతంలో 50 మంది దాకా ఉన్నారు. లేసు పార్కును ప్రారంభించిన వైఎస్సార్ కేంద్ర జౌళిశాఖ నేతృత్వంలో కేంద్ర హస్త కళల అభివృద్ధి సంస్థ ద్వారా 2005లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి నరసాపురం మండలం సీతారామపురంలో లేసు పార్కును ఏర్పాటు చేయించారు. ఆయన స్వయంగా ఈ పార్కును ప్రారంభించారు. ప్రస్తుతం లేసుపార్కుకు అనుసంధానంగా 50 సొసైటీలు, 29,000 మంది సభ్యులు ఉన్నారు. మహిళల్లో మార్కెట్ స్కిల్స్ పెంచడం, అధునాతన డిజైన్ల తయారీకి శిక్షణ ఇవ్వడం, ఉత్పత్తులను నేరుగా అమ్ముకునే సామర్థ్యాన్ని పెంచడానికి లేసుపార్కు ఏర్పాటు చేశారు. వైఎస్ రాజశేఖరరెడ్డి మరణం తర్వాత అధికారంలోకి వచ్చిన పాలకులు ఈ పార్కును నిర్లక్ష్యం చేయడంతో ఆశించిన లక్ష్యం పూర్తిగా నెరవేరలేదు. చైనా నుంచి గట్టిపోటీ ఎదురవుతుండడంతో నరసాపురం లేసు పరిశ్రమ తీవ్ర సంక్షోభంలో చిక్కుకుంది. చైనాలో యంత్రాలపై లెక్కకు మించిన డిజైన్లు, నాణ్యతతో కూడిన అల్లికలను ఉత్పత్తి చేస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో చైనా ఇచ్చినంత తక్కువ ధరకు నరసాపురం ఎగుమతి దారులు అల్లికలను ఇవ్వలేకపోతున్నారు. కుంగదీస్తున్న పన్నుల మోత లేసు పరిశ్రమ హస్తకళలకు సంబంధించింది కావడంతో గతంలో ఎలాంటి సుంకాలు ఉండేవి కావు. ఇప్పుడు లేసు ఎగుమతులపై 5 శాతం జీఎస్టీ విధించారు. పైగా ఎగుమతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రోత్సాహం లేదు. పదేళ్ల క్రితం వరకు ప్రతిఏటా రూ.300 కోట్ల విలువైన లేసు ఉత్పత్తులు నరసాపురం నుంచి ఎగుమతి అయ్యేవి. ప్రస్తుతం ఏటా కేవలం రూ.100 నుంచి రూ.150 కోట్ల మేర వ్యాపారం సాగుతోంది. 2006లో ఒక్క లేసు పార్కు ద్వారానే రూ.100 కోట్ల వ్యాపారం సాగింది. ప్రస్తుతం అది రూ.50 కోట్లకు పడిపోయింది. లేసు పరిశ్రమను ప్రభుత్వం ఆదుకోవాలని మహిళలు, ఎగుమతి దారులు కోరుతున్నారు. శ్రమకు తగ్గ వేతనం దక్కేలా చూడాలి నేను చిన్నప్పటి నుంచి లేసు అల్లికలు కుడుతున్నాను. లేసు కుట్టడం చాలా కష్టమైన పని. కంటి చూపును ఒకేచోట కేంద్రీకరించాలి. దాంతో కళ్ల జబ్బులు వస్తాయి. మా శ్రమకు తగ్గ వేతనం దక్కేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. లేదంటే ముందుముందు ఎవరూ లేసు అల్లికలు కుట్టరు. ఇప్పటి పిల్లలు ఈ వృత్తిలోకి రావడం లేదు. – చిలుకూరి అంజలి, శిరగాలపల్లి, యలమంచిలి మండలం కేవలం వ్యాపారం మాత్రమే కాదు లేసుపార్కు కేవలం వ్యాపారం కోసమే పెట్టింది కాదు. మారుతున్న ఫ్యాషన్లకు అనుగుణంగా మహిళలకు ఇక్కడ శిక్షణ ఇస్తాం. వారిలో నైపుణ్యాలు పెంచేందుకు కృషి చేస్తున్నాం. అల్లికలు సాగించే మహిళలే నేరుగా ఎగుమతులు చేసుకునే విధంగా ప్రయత్నం చేస్తున్నాం. మన లేసు పరిశ్రమకు చైనా నుంచి పోటీ ఎదురవుతోంది. – జక్కంపూడి నాయుడు, లేసుపార్కు మేనేజర్ -
ఎర్రమల్లెలు వాడిపోయాయి....
నరసాపురం: ఎర్రమల్లెలు వాడిపోయాయి.. గలగలా వాక్ప్రవాహం ఆగిపోయింది.. ‘అదికాదు అబ్బాయి’ అంటూ ఆప్యాయంగా మాట్లాడే కంఠం మూగబోయింది.. సినీరచయిత, సీపీఐ సీనియర్ నేత మంచిగంటి రామారావు(87) శనివారం సాయంత్రం నరసాపురం పట్టణం చినమామిడిపల్లిలోని ఆయన నివాసంలో అనారోగ్యంతో మృతి చెందారు. ఆయనకు భార్య, ముగ్గురు కుమారులు. ఒక కుమారుడు నారాయణరావు జర్నలిస్ట్‌గా పనిచేస్తూ మూడేళ్ల క్రితం మృతి చెందారు. ఎంజీఆర్‌గా సుపరిచితుడైన రామారావు ప్రజానాట్యమండలిలో చురుగ్గా పనిచేస్తూ సినీరంగంవైపు మళ్లారు. పలు విప్లవ సినిమాలకు కథలు, మాటలు అందించారు. ప్రజానాట్య మండలి ఏర్పడిన తొలినాళ్లలోనే అందులో చేరి విశేష సేవలు అందించారు. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా ప్రజానాట్యమండలి తరఫున పలు ప్రదర్శనలు ఇచ్చారు. తన 21వ ఏట నుంచే సీపీఐలో చేరి పలు ప్రజాసమస్యలపై పనిచేశారు. ఆయన తొలితరం కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తల్లో ఒకరు. 1950 నుంచి సీపీఐలో క్రియాశీల కార్యకర్తగా పనిచేశారు. రాష్ట్ర ప్రజానాట్యమండలి ఉపాధ్యక్షుడిగా, జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు. ప్రస్తుతం ప్రజానాట్యమండలి జిల్లా గౌరవ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ముఖ్యంగా మాదాల రంగారావుకు పేరు తెచ్చిన ఎర్రమల్లెలు, యువతరం కదిలింది చిత్రాలకు కథా సహకారం అందించడమే కాకుండా మాటలు అందించారు. ధవళ సత్యం దర్శకత్వం వహించిన అనేక చిత్రాలకు మాటలు అందించారు. ఆయన మృతిపై నరసాపురం ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు, మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు, సీపీఐ రాష్ట్ర కమటి సభ్యుడు నెక్కంటి సుబ్బారావు, సీపీఐ జిల్లా కార్యదర్శి డేగా ప్రభాకర్ సంతాపం తెలిపారు. ఆదివారం రామారావు భౌతిక కాయానికి అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. ఎర్ర సినిమా చిరునామా.. ఎంజీఆర్ నర్సాపురం కాలువ.. పొడవునా దుమ్ము రేగే కంకర రోడ్డు... సైకిల్ హ్యాండల్కి ఒక పక్క తెల్లని సత్తు క్యారియర్.. మరో పక్క ఎర్రని జెండా... ఇదీ దశాబ్దాల క్రితం దృశ్యం. ఆ కష్టజీవికి అటుపక్క, ఇటుపక్క నిలబడి కాపుకాచిన కలం వీరుడు ఎంజీ రామారావు! వృత్తి రెవెన్యూ విభాగం.. ప్రవృత్తి సాంస్కృతిక రంగం. అందరూ బాబాయ్ అని పిలిచే ఆత్మీయుడు. తాను నమ్మిన సిద్ధాంతం కోసం తుదికంటా నిలిచిన కమ్యూనిష్టాగరిస్టుడు. నాకు తెలిసి వెండి తెరపై ఎర్ర జెండా ఎగురవేసిన వారిలో ఒకడు. మా భూమి నాటకంలా ఈయన రాసిన ఎర్రమట్టి నాటకం తెలుగునాట ప్రజానాట్యమండలి ఆధ్వర్యంలో గ్రామగ్రామాన ప్రదర్శించారు. కథ, నాటకం– కళ ఏదైనా ఆర్ట్‌ఫామ్ ఉండాలనేది ఎంజీఆర్ ఎప్పుడూ చెప్పేమాట. ఆయన రాసిన ఇరుసు, సత్యంవధ, జ్వాలాశిఖలు, యుగసంధి నాటకాలు పరిషత్ వేదికలపై బహుమతులు అందుకున్నాయి. చేతిలో డైరీ.. గలగలా వాక్ప్రవాహం.. ‘అదికాదు అబ్బాయి’ అని చెప్పే మాటలు వినడానికి తాడేపల్లిగూడెం వస్తే చాలు ఆయన చుట్టూ గుమిగూడేవారం. కుర్రకారు ఆయన ఫ్యాన్స్. కబుర్ల మధ్య కాలం కరిగిపోయేది. మా నాటకాల బ్యాచ్ ఇంతే అబ్బాయి అని ముక్తాయించి నర్సాపురం మొదటి బస్సుకు బయల్దేరేవారు. ఇప్పుడు.. మరెప్పటికీ తిరిగిరాని లోకానికి వెళ్లిపోయారు. –ఎస్.గుర్నాథ్ -
నరసాపురానికి ఈవో రఘురామ్ మృతదేహం
సాక్షి, పశ్చిమగోదావరి : తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరులో ఆదివారం జరిగిన టూరిజం బోటు ప్రమాదంలో మృతి చెందిన అమరేశ్వరస్వామి దేవస్థానం ఆలయ ఈవో వలవల రఘురామ్ పార్ధీవ దేహాన్ని ఆయన నరసాపురం తరలించారు. ఆయన పార్థీవదేహానికి ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు నివాళులర్పించారు. ఈవో ఉద్యోగాన్ని రఘురామ్ భార్యకు వచ్చేలా చూస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. వలవల రఘురాం భార్య నాగజ్యోతి, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మృతదేహాన్ని ఇంటికి తీసుకొచ్చేవరకు రఘురామ్ మృతి చెందిన విషయం ఇంట్లో వాళ్లకి తెలియనివ్వలేదు. చిన్న ప్రమాదం జరిగిందని, రఘురాం వచ్చేస్తారని నాగజ్యోతికి బంధువులు నచ్చచెబుతూ వచ్చారు. టీవీ చూడకుండా, పేపర్లు కూడా ఆమె కంట పడకుండా జాగ్రత్త తీసుకున్నారు. రఘురామ్ తల్లికి గుండె సంబంధిత జబ్బు ఉండడంతో ఆమెకు కూడా ఈ విషయాన్ని తెలియనివ్వలేదు. ఇంట్లో రఘురామ్ మృతదేహాన్ని చూసి నాగజ్యోతి కన్నీరుమున్నీరయ్యారు. -
గల్లంతైన వారి కోసం నిలువెల్లా కనులై..
సాక్షి, నరసాపురం(పశ్చిమగోదావరి): బోటు ప్రమాదంలో నరసాపురానికి చెందిన ముగ్గురు గల్లంతుకావడంతో ఈ ప్రాంతం విషాదంలో మునిగిపోయింది. ఘోరం జరిగి రెండురోజులు గడుస్తున్నా ఇంకా వారి ఆచూకీ లభ్యం కాకపోవడంతో బంధువులు, స్నేహితులు ఆందోళన చెందుతున్నారు. నిలువెల్లా కనులై క్షణక్షణం ఉత్కంఠగా నిరీక్షిస్తున్నారు. ప్రమాదంలో గల్లంతైన అమరేశ్వరస్వామి దేవస్థానం ఆలయ ఈఓ వలవల రఘురామ్, గన్నాబత్తుల ఫణికుమార్(బాలు), చెట్లపల్లి గంగాధర్ నివాసాల వద్ద విషాద వాతావరణం నెలకొంది. ప్రమాదంలో బయటపడ్డ మండల గంగాధర్ కూడా రాజమండ్రిలోనే ఉన్నారు. మహిళలకు చెప్పకుండా..! జరిగింది ఘోర ప్రమాదమని గల్లంతైన వ్యక్తుల బంధువుల్లో పురుషులకు మాత్రమే తెలుసు. ఇక వారు సజీవులుగా వస్తారనే నమ్మకం కూడా వారికి లేదు. అయితే గల్లంతైన వ్యక్తుల భార్యాపిల్లలకు, తల్లులకు ఈ విషయం తెలి యదు. ఏదో చిన్న ప్రమాదం జరిగిందని ఆసుపత్రిలో ఉన్నారని పురుషులు ధైర్యం చెబుతున్నారు. పలకరింపులకు ఇళ్లకు జనం వస్తున్నా.. విషయం బయటే చెప్పి లోపల ఏమీ మాట్లాడొద్దని బతి మాలుకోవడం చూపరుల హృదయాలు కలచివేస్తోంది. కారణం గల్లంతైన ముగ్గురూ 40 ఏళ్ల లోపు వయసువారే. చిన్నచిన్న పిల్లలు, తమపై ఆధారపడ్డ తల్లిదండ్రులు ఉన్నవారు. పైగా ఇందులో కొందరు గుండె సంబంధ వ్యాధులతో బాధపడుతున్న వారు. దీంతో గల్లంతైన వారి నివాసాల వద్ద మాటల్లో చెప్పలేని దయనీయ పరిస్థితి నెలకొంది. పేపర్లు కంటపడకుండా జాగ్రత్త వలవల రఘురాం భార్య నాగజ్యోతి, ఇద్దరు పిల్లలు వేడంగి (పుట్టిల్లు)లో ఉన్నారు. చిన్న ప్రమాదం జరిగిందని, రఘురాం వచ్చేస్తారని నాగజ్యోతికి బంధువులు నచ్చచెబుతున్నారు. టీవీ చూడకుండా, పేపర్లు కూడా ఆమె కంట పడకుండా జాగ్రత్త తీసుకుంటున్నారు. ఇక పట్టణంలోని ఇంట్లో రఘురాం తల్లి ఉంది. ఆమె గుండె సంబంధిత జబ్బుతో బాధపడుతోంది. చుట్టాలు, స్నేహితులు ఇళ్లకు రావడంతో ఆమెకు కంగారు పట్టుకుంది. ఏం జరిగింది.. రఘు ఎక్కడ అంటూ మాటమాటకు ఆరాతీస్తోంది. ఆమెను ఓ గదిలో పెట్టి అత్తారింటికి వెళ్లాడు అంటూ చెబుతున్నామని రఘురామ్ స్నేహితుడు చెప్పారు. తల్లికి తెలీనివ్వకుండా.. చెట్లపల్లి గంగాధర్ ఇంటివద్ద పరిస్థితి మరీ దయనీయం. గంగాధర్‌కు తండ్రిలేడు. బంధువర్గం కూడా పెద్దగా లేదు. వృద్ధురాలైన తల్లి వరలక్ష్మి ఇంటివద్దనే ఉంది. కొడుకు రెండు రోజులుగా ఇంటికి ఎందుకు రాలేదో కూడా ఆమెకు ఇప్పటికీ తెలియదు. చిన్న ప్రమాదమని చెప్పారు. సోదరికి మాత్రం విషయం తెలిసింది. తల్లికి చెప్పకుండా ఆమె గుండెలవిసేలా రోధిస్తోంది. ఆశగా నిరీక్షిస్తున్న ఫణికుమార్ భార్య పట్టణంలో ప్రముఖ న్యాయవాది గన్నాబత్తుల వల్లభరావు కుమారుడు ఫణికుమార్ ప్రమాదంలో గల్లంతయ్యాడు. ఇతనికి భార్య, 7 ఏళ్ల కుమారుడు ఉన్నారు. భార్యకు విషయం తెలియదు. చిన్న ప్రమాదమని చెప్పడంతో ఆమె ఆశగా ఎదురుచూస్తోంది. తండ్రి వల్లభరావు కూడా తన కొడుకుకు ఏమీ కాదని వచ్చేస్తాడని విలపిస్తూ నిరీక్షిస్తున్నాడు. రాజమండ్రిలో పడిగాపులు గల్లంతైన వారి సమీప బంధువులు, స్నేహితులు కొంతమంది ప్రమాదం వార్త తెలిసిన వెంటనే రాజమండ్రి ప్రభుత్వాస్పత్రికి చేరుకున్నారు. రాత్రంతా అక్కడే ఉన్నారు. గాలింపు చర్యలు ముమ్మరంగా సాగుతుండటంతో తమవారి జాడ తెలుస్తుందని అక్కడే పడిగాపులు కాస్తున్నారు. చదవండి : గాలింపు కొనసాగుతోంది: ఏపీఎస్డీఎమ్ఏ -
సుబ్బారాయుడికి పుత్రవియోగం
సాక్షి, నరసాపురం (పశ్చిమ గోదావరి): మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ నేత కొత్తపల్లి సుబ్బారాయుడు కుటుంబంలో విషాదం నెలకొంది. ఆయన చిన్న కుమారుడు నారాయణరాయుడు (35) మృతి చెందారు. చంటిబాబుగా ముద్దుగా పిలుచుకునే నారాయణనాయుడు చిన్నప్పటి నుంచి మానసికంగా ఎదుగుదల లేకపోవడంతో చికిత్స పొందుతున్నారు. ఆదివారం మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో వీల్‌చైర్‌లోనే కుప్పకూలిపోవడంతో ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే మృతిచెందినట్టు వైద్యులు నిర్ధారించారు. దీంతో చంటిబాబు భౌతికకాయాన్ని రుస్తుంబాదలోని కొత్తపల్లి నివాసానికి తరలించారు. కుమారుడి భౌతికకాయం వద్ద సుబ్బారాయుడు దంపతులు బోరున విలపించడం అందరినీ కలిచివేసింది. కుమారుడు చంటిబాబుపై సుబ్బారాయుడుకు అమితమైన ప్రేమ అని చెప్పుకుంటారు. సుబ్బారాయుడు సతీమణి 35 ఏళ్లుగా చంటిబాబు సంరక్షణ కోసం పూర్తి సమయాన్ని కేటాయించి శ్రమించారు. ఈ నేపథ్యంలో చంటిబాబు మృతి ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. విషయం తెలియడంతో కొత్తపల్లిని ఓదార్చడానికి నియోజకవర్గం నలుమూలల నుంచి పెద్ద ఎత్తున జనం రుస్తుంబాద చేరుకున్నారు. శాసనమండలి చైర్మన్ ఎండీ షరీఫ్, ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు, రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, జక్కంపూడి విజయలక్ష్మి, మాజీ మంత్రి పితాని సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యేలు బండారు మాధవనాయుడు, కొత్తపల్లి జానకిరామ్, వైఎస్సార్ సీపీ కేంద్రపాలకమండలి సభ్యుడు పీడీ రాజు తదితర ప్రముఖలు చంటిబాబు భౌతికకాయానికి నివాళులర్పించారు. పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. -
వారధి కోసం కదిలారు మా‘రాజులు’
సాక్షి, నరసాపురం: ఉభయగోదావరి జిల్లాలను కలుపుతూ నరసాపురం వశిష్ట గోదావరిపై వంతెన నిర్మించాలనేది దశాబ్దాల డిమాండ్. అయితే గత టీడీపీ ప్రభుత్వం అదిగో వంతెన, ఇదిగో వంతెన అంటూ హైడ్రామా నడిపింది. ఇందుకు భిన్నంగా అధికారంలోకి వచ్చిన 50 రోజుల్లోనే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వంతెన అంశంలో వడివడిగా అడుగులు వేస్తోంది. వశిష్ట వంతెన నిర్మాణం విషయంలో కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడాలని నరసాపురం ఎంపీ కనుమూరి రఘురామకృష్ణంరాజు, ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు నిర్ణయించారు. దీంతో కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి నితిన్‌గట్కరీని ఢిల్లీలో సోమవారం కలవడానికి ఎంపీ, ఎమ్మెల్యే హుటాహుటీన బయలుదేరి వెళ్లారు. దీంతో వంతెన విషయంలో ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మొదటి నుంచి వశిష్ట వంతెన విషయంలో ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు కృతనిశ్చయంతో ఉన్నారు. కచ్చితంగా ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ద్వారా వంతెన నిర్మించి తీరతానని ఇప్పటికే పలుమార్లు ప్రకటించారు. ఎంపీ రఘురామకృష్ణంరాజు కూడా ఇప్పటికే లోక్‌సభలో వంతెన అంశాన్ని ప్రస్తావించి రెండు జిల్లాల ప్రజల ఇబ్బందులను ప్రధాని ఎదురుగా లోక్‌సభలో వివరించారు. ఇప్పుడు ఇద్దరు నేతలు ఢిల్లీ బయలుదేరి వెళ్లడంతో వంతెన ఆశలు మళ్లీ చిగురిస్తున్నాయి. ఉభయగోదావరి జిల్లాలను కలుపుతూ నరసాపురంలో వంతెన నిర్మించాలనే డిమాండ్ బ్రిటీష్ కాలం నుంచీ ఉంది. గోదావరి జిల్లా వాసుల దశాబ్దాల కోరిక. రాష్ట్రంలో ఏ ప్రాజెక్ట్ విషయంలోనూ లేని విధంగా నాలుగుసార్లు శంకుస్థాపనలు జరిగాయి. ఐదుగురు ముఖ్యమంత్రులు వంతెనపై దృష్టిపెట్టారు. స్వయంగా ప్రకటనలు చేశారు. ముఖ్యమంత్రుల వద్ద నలిగిన వంతెన ఫైలు వశిష్ట వంతెన అనేది దశాబ్దాల పోరాటం. బహుశా రాష్ట్రంలో ఏ ప్రాజెక్ట్‌కు ఇన్నిసార్లు శంకుస్థాపనలు, సర్వేలు జరగలేదు. బ్రిటీష్ హయాంలోనే ఇక్కడ వంతెన నిర్మించాలని యోచించారు. బ్రిటీష్ పాలన మరికొంతకాలం ఉంటే కచ్చితంగా వారి హయాంలోనే ఇక్కడ వంతెన నిర్మాణం జరిగేదని స్థానికంగా ఉండే పెద్దలు చెప్పుకుంటారు. కాగా నీలం సంజీవరెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా మొదటిసారి వంతెన ప్రతిపాదన తెరమీదకు వచ్చింది. ఇక ఎన్టీ రామారావు హయాంలో వంతెనకు బీజం పడింది. 1986లో ఎన్టీఆర్ వశిష్ట వంతెనకు నరసాపురంలోనూ, తూర్పుగోదావరి జిల్లాలోనూ రెండు చోట్లా శంకుస్థాపనలు చేశారు. అయితే సాంకేతిక ఇబ్బందులు ఉన్నాయంటూ నరసాపురంలో నిర్మించాల్సిన వంతెనను చించినాడలో నిర్మించారు. రాజకీయ వత్తిళ్లతోనే ఇది జరిగిందనేది ఇప్పటికీ ప్రాచుర్యంలో ఉన్న పెద్దచర్చ. అయితే అప్పటిలో వంతెన తరలించవద్దంటూ పెద్ద ఉద్యమమే సాగింది. ఇక అప్పటి నుంచీ నరసాపురం వెంతెన కథ సాగుతూనే ఉంది. రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డిలు ముఖ్యమంత్రులుగా ఉన్న సమయంలో కూడా వంతెన నిర్మాణ ప్రయత్నాలు జరిగాయి. ఈ ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా వంతెన నిర్మాణంపై ప్రకటనలు చేశారు. కిరణ్‌కుమార్‌రెడ్డి స్వయంగా అసెంబ్లీలో కూడా వంతెన అంశాన్ని ప్రస్తావించారు, కానీ ఉపయోగం లేకుండా పోయింది. ఇక గత ఐదేళ్లలో అయితే వంతెన విషయంలో టీడీపీ నేతలు పెద్ద డ్రామానే నడిపారు. వంతెన మంజూరు అయిపోయిందంటూ పలుమార్లు స్వీట్లు పంచుకుని, బాణసంచా కాల్చి హడావిడి చేశారు. వైఎస్ హయాంలో రూ.94 కోట్లతో టెండర్లు.. వశిష్ట వంతెన విషయంలో వైఎస్ రాజశేఖరరెడ్డి మాత్రమే చొరవ చూపారు. ఆయన పాదయాత్ర సమయంలో తీరంలో పర్యటించినప్పుడు, వంతెన అవసరాన్ని స్థానికుల ద్వారా తెలుసుకున్నారు. దీంతో ఆయన రెండోసారి అధికారంలోకి రాగానే వంతెన నిర్మాణంపై దృష్టిపెట్టారు. 2008 ఏప్రిల్ 15వ తేదీన వశిష్ట వంతెనకు తూర్పుగోదావరి జిల్లా సఖినేటిపల్లిలో శంకుస్థాపన చేశారు. అక్కడితో సరిపెట్టకుండా రూ.94 కోట్లతో టెండర్ పిలిచి నిర్మాణ పనులను సత్యంకు అనుబంధ సంస్థగా ఉన్న మైటాస్ కంపెనీకి అప్పగించారు. ప్రాథమికంగా సర్వేలు అన్నీ పూర్తయ్యాయి, ఇక వంతెన పనులు ప్రారంభమవుతాయనగా సత్యం సంస్థ సంక్షోభంలోకి వెళ్లడంతో పనులు నిలిచిపోయాయి. అయితే వేరే కంపెనీకి అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ నిర్మాణ బాధ్యతలు అప్పగించారు. అంతలో ఆయన మృతిచెందారు. అయితే మైటాస్ వద్ద సబ్‌కాంట్రాక్ట్ తీసుకున్న వేరే కంపెనీ పనులు చేపట్టడానికి ముందుకు వచ్చినా కూడా, తరువాత వచ్చిన ముఖ్యమంత్రులు శ్రద్ధ చూపించలేదు. కచ్చితంగా నిర్మించి తీరుతాం. వంతెన కట్టాలి.. లేదంటే కుదరదని చెప్పాలి. అంతేగాని ప్రజలను మోసం చేయడం మంచిది కాదు. గతంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి శంకుస్థాపన చేసిన వెంటనే టెండర్ పిలిపించి పనులు మైటాస్ సంస్థకు అప్పగించారు. ఆయన బతికుంటే ఎప్పుడో బ్రిడ్జి పూర్తయ్యేది. కానీ ఐదేళ్ల పాటు టీడీపీ ప్రభుత్వం వంతెన వచ్చేసిందంటూ హడావిడి చేసింది. స్వీట్లు పంచుకున్నారు. ఇది మోసం చేయడం కాదా. మా హయాంలో ఇలాంటి మోసాలు ఉండవు. కచ్చితంగా వంతెన నిర్మాణం జరిపి తీరుతాం. – ముదునూరి ప్రసాదరాజు, ఎమ్మెల్యే, నరసాపురం -
నరసాపురం కోడలికి కేంద్రమంత్రి పదవి
నరసాపురం: ప్రధాని నరేంద్ర మోదీ క్యాబినెట్లో నిర్మలా సీతారామన్‌కు మళ్లీ చోటుదక్కింది. ప్రధాని మోదీతోపాటుగా గురువారం రాత్రి ఆమె కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో నరసాపురం కోడలికి అరుదైన గౌరవం దక్కినట్టయ్యింది. మోదీ సర్కార్‌లో 2017లో కేంద్ర రక్షణశాఖ మంత్రిగా ఆమె బాధ్యతలు తీసుకున్నారు. దేశ రక్షణశాఖను నిర్వహించిన తొలి మహిళాగా ఖ్యాతికెక్కారు. నిర్మలాసీతారామన్. ఆ శాఖ బాధ్యతలను ఏడాదిన్నరపాటు నిష్కళంకంగా.. సమర్థంగా నిర్వహిస్తూ మోదీ ప్రశంసలు అందుకున్నారు. ముఖ్యంగా రాఫెల్ కుంభకోణం అంటూ ప్రతిపక్షనేత రాహూల్‌గాంధీ తీవ్రస్థాయిలో బీజేపీ సర్కారుపై విరుచుకుపడ్డ సందర్భంలో నిర్మలాసీతారామన్ పార్లమెంటులో మోదీకి వెన్నుదన్నుగా తన వాణిని వినిపించారు. ఇక కాశ్మీర్లో పాకిస్తాన్ ఉగ్రవాదులు మన జవానులను మట్టుపెట్టిన తరువాత, పాకిస్తాన్‌లోని ఉగ్రవాద శిబిరాలపై దాడులు నేపథ్యంలో నిర్మలాసీతారామన్ పనితీరుపై ప్రశంసలు వచ్చాయి. దీనివల్లే ఆమెకు కేంద్రమంతివర్గంలో మరోమారు చోటు దక్కింది. ఈసారి కూడా కీలకమైన శాఖను ఆమెకు అప్పగించే అవకాశం ఉంది. నరసాపురం కోడలు.. నిర్మలా సీతారామన్ నరసాపురం కోడలు. ఆమె 1986లో నరసాపురం పట్టణానికి చెందిన రాజకీయ నేపథ్యం గల పరకాల ప్రభాకర్‌ను పెళ్లి చేసుకున్నారు. వీరికివాగ్మయి అనే కుమార్తె ఉన్నారు. 1959లో తమిళనాడులోని మధురైలో జన్మించిన నిర్మలాసీతారామన్ వివాహం అనంతరం చాలాకాలం నరసాపురంలోనే నివాసం ఉన్నారు. పరకాల ప్రభాకర్ తండ్రి శేషావతారం నరసాపురం నియోజకవర్గం నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఉమ్మడి ఏపీలో పలు మంత్రిత్వశాఖలు నిర్వహిం చారు. ప్రభాకర్ తల్లి కాళికాంబ కూడా ఒకసారి ఎమ్మెల్యేగా పనిచేశారు. 2014–19 మధ్య మోదీ సర్కారులో మొదట ఏపీ నుంచి రాజ్యసభ సభ్యురాలిగా ప్రాతినిధ్యం వహించిన నిర్మలాసీతారామన్ స్వతంత్ర హోదాగల కేంద్ర వాణిజ్య పన్నులు, పరిశ్రమల శాఖను నిర్వహించారు. ఆ సమయంలోనే నరసాపురంలోని తీరగ్రామాలైన తూర్పుతాళ్లు, వేములదీవి పంచాయతీలను దత్తత తీసుకున్నారు. దాదాపు రూ.20 కోట్లతో ఈ గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. తరువాత ఆమె రాజ్యసభ సభ్యత్వం కర్ణాటకకు మారింది. అనంతరం కీలకమైన దేశ రక్షణశాఖ మంత్రిగా మోదీ ఆమెకు పదోన్నతి ఇచ్చారు. -
బిక్కుబిక్కుమంటూ గోదావరిలోనే..
సాక్షి, నరసాపురం: పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం పట్టణం మాధవాయిపాలెం రేవు వద్ద గోదావరి నదిలో గురువారం రాత్రి పంటు నిలిచిపోయింది. పంటులో ఆయిల్ అయిపోవడంతో చిమ్మచీకటిలో గోదావరి మధ్యలో పంటు నిలిచిపోయింది. ఆ సమయంలో పంటుపై 93 మంది ప్రయాణికులు, రెండు కార్లు ఉన్నాయి. సముద్రపు పోటు కారణంగా పంటు అదుపుతప్పి లాకురేవు వైపు వెళ్లిపోయింది. చివరకు అక్కడ మత్స్యకారులు కట్టిన వలకట్ల వద్ద నిలిచింది. రాత్రి 8 గంటల సమయంలో పట్టణంలోని మాధవాయిపాలెం రేవు నుంచి తూర్పుగోదావరి జిల్లా సఖినేటిపల్లి రేవుకు పంటు బయల్దేరింది. అయితే, ఆయిల్ లేని కారణంగా గోదావరి మధ్యలోకి వెళ్లగానే పంటు నిలిచిపోయింది. సముద్ర పోటుతో పంటు వేరే మార్గంలోకి వెళ్లి పోతుండటంతో ప్రయాణికులు హాహాకారాలు చేశారు. రెండున్నర గంటలు గోదావరిలోనే.. పంటు మధ్యలో నిలిచిపోవడంతో అందులో ఉన్న మహిళలు రక్షించండంటూ పెద్దగా అరిచారు. బంధువులకు సెల్ఫోన్లో సమాచారం ఇవ్వడంతో వారు కూడా పెద్దసంఖ్యలో రేవు వద్దకు చేరుకున్నారు. నరసాపురం ఆర్డీవో ఏఎన్ సలీంఖాన్, డీఎస్పీ కె.నాగేశ్వరరావు అక్కడికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. ప్రయాణికులతో ఫోన్లో మాట్లాడారు. రాత్రి 10.15 గంటలకు ఆయిల్‌ను వేరే పడవలో తీసుకెళ్లి పంటును అవతల గట్టుకు చేర్చారు. దీంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ఇదిలా ఉంటే.. రేవు నిర్వహణపై చాలా కాలంగా విమర్శలు వస్తున్నాయి. తరచూ ఇలాగే జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడంలేదని వాపోతున్నారు. అసలు ఆయిల్ సమస్య కాదని, ఫిట్‌గా లేని పంటును ఉపయోగించారనే వార్తలు కూడా వస్తున్నాయి. పంటులో లైఫ్ జాకెట్లు ఏమీలేవు. పంటులో 50 మందికి మించి ఎక్కించడానికి అనుమతిలేదు. కానీ, పరిమితికి మించి 90 మందికి పైగా జనాన్ని, 2 కార్లను అదీ రాత్రివేళ అనుమతించారు. ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటం అడుతున్న రేవు నిర్వాహకులపై మరి ఈ ఘటనతోనైనా చర్యలు తీసుకుంటారా? లేదా అనేది చూడాలి. -
గోదావరి మధ్యలో నిలిచిన పంటు
-
‘అసలు నాగబాబు పోటీయే కాదు’
సాక్షి, పశ్చిమగోదావరి : నరసాపురం వైఎస్సార్సీపీ ఎంపీ అభ్యర్థి రఘురామ కృష్ణంరాజుకు జనసేన అభ్యర్థి నాగబాబు పోటీయే కాదన ప్రముఖ సీనీ రచయిత చిన్ని కృష్ణ అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 120 సీట్లకు పైగా గెలిచి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారని ధీమా వ్యక్తం చేశారు. అభిమాన హీరోల సినిమాలు 10 సార్లు చూడండి కానీ ఓటు మాత్రం వైఎస్సార్ సీపీకే వేయమని ప్రజలను కోరారు. గతంలో చిరంజీవికి లక్షల మంది ఓట్లు వేస్తే ఏం జరిగిందో అందరికి తెలుసన్నారు. అదే కుటుంబం నుంచి మళ్లీ ఇద్దరు వచ్చి ఓట్లు అడిగితే ప్రజలు నమ్ముతారా అని ప్రశ్నించారు. భీమవరంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఓటమి ఖాయమన్నారు. అక్కడ వైఎస్సార్సీసీ అభ్యర్థి శ్రీనివాస్ ఘన విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు. -
నర్సాపురం పార్లమెంటు: అన్ని స్థానాలనూ గెలుస్తాం!
-
నర్సాపురం పార్లమెంటు: అన్ని స్థానాలనూ గెలుస్తాం!
సాక్షి, పశ్చిమగోదావరి: తణుకులో వైఎస్సార్సీపీ కార్యాలయాన్ని నర్సాపురం ఎంపీ అభ్యర్థి రఘురామకృష్ణంరాజు, తణుకు అసెంబ్లీ అభ్యర్థి కారుమూరి నాగేశ్వరరావు ప్రారంభించారు. నర్సాపురం పార్లమెంట్ పరిధిలోని అన్ని అసెంబ్లీ స్థానాలను వైఎస్సార్సీపీ గెలుస్తుందని రఘురామ కృష్ణంరాజు ధీమా వ్యక్తం చేశారు. జగన్మోహనరెడ్డిని ఎదుర్కోవడం కోసం అన్ని పార్టీలు చీకట్లో ఒప్పందం కుదుర్చుకున్నాయని రఘురామ కృష్ణంరాజు మండిపడ్డారు. ఎవరు కలిసినా.. ఎవరెన్ని కుట్రలు చేసినా వైఎస్సార్సీపీ విజయాన్ని అడ్డుకోలేరని ఆయన అన్నారు. ఐదేళ్లపాటు అధికారాన్ని అడ్డంపెట్టుకుని టీడీపీ నేతలు అరాచకాలు చేశారని.. మరి కొద్ది రోజుల్లో రాష్ట్ర ప్రజలకు మంచి రోజులు రాబోతున్నాయని కారుమూరి నాగేశ్వరరావు అన్నారు. ఈ సందర్భంగా వందలాది మంది టీడీపీ కార్యకర్తలు వైఎస్సార్సీపీలో చేరారు. జోరుగా ప్రచారం.. నెల్లూరు: నెల్లూరు సిటీలో వైఎస్సార్సీపీ అభ్యర్థి అనిల్ కుమార్ జోరుగా ఎన్నికల ప్రచారం కొనసాగిస్తున్నారు. శెట్టిగుంటరోడ్డు, మైపాడు సెంటర్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. నవరత్నాలను వివరిస్తూ ప్రచారం ముందుకు కొనసాగించారు. టీడీపీ అభ్యర్థి నారాయణ.. కోట్లాది రూపాయలు వెదజల్లి గెలుపొందాలని యత్నిస్తున్నారని అనిల్‌కుమార్ యాదవ్ విమర్శించారు. నెల్లూరు వాసులకు సేవ చేసే అవకాశం తనకు ఇవ్వాలని, ఇందుకు ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. 41 అసెంబ్లీ, ఏడు లోక్ సభ స్థానాలను బీసీలకు కేటాయించి మాటపై నిలబడిన నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అని గుర్తు చేశారు . ఉరవకొండలో నిర్వహించిన బీసీ గర్జన సభ ఐదేళ్లలో బీసీలను పట్టించుకోని చంద్రబాబు... ఎన్నికల ముందు కల్లబొల్లి మాటలతో కపట ప్రేమ చూపిస్తున్నారని అనంతపురం జిల్లా ఉరవకొండ సిట్టింగ్ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వర్‌రెడ్డి, అనంతపురం పార్లమెంట్ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి తలారి రంగయ్య అన్నారు. అనంతపురం జిల్లాలో రెండు పార్లమెంట్ సీట్లను బీసీలకు ఇస్తే జేసీ సోదరులు జడుసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఉరవకొండలో నిర్వహించిన బీసీ గర్జన సభలో వై.విశ్వేశ్వర్‌రెడ్డి, తలారి రంగయ్య పాల్గొన్నారు. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తున్న వైఎస్ జగన్మోహన్రెడ్డికి అందరూ అండగా ఉండాలని వారు కోరారు. -
అసెంబ్లీ టిక్కెట్ ఎవరికీ ఖరారు కాలేదు
పశ్చిమగోదావరి, నరసాపురం: నరసాపురం అసెంబ్లీ టిక్కెట్ ఎవరికీ కేటాయించలేదని కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు చెప్పారు. నరసాపురం టిక్కెట్‌ను సిట్టింగ్ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడుకు మళ్లీ కేటాయిం చినట్టు మూడురోజుల క్రితం వార్తలు వచ్చాయి. దీంతో కొత్తపల్లి శుక్రవారం రాత్రి ఆయన వర్గీయులతో రుస్తుంబాదలో సమావేశమయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ తమ పార్టీ అధినేత ఇంకా ఎవరికీ టిక్కెట్లు కేటాయించలేదన్నారు. జిల్లాల వారీగా సమావేశాలు మాత్రమే ఏర్పాటు చేస్తున్నారని చెప్పారు. టిక్కెట్ల కేటాయింపుపై అధికారికంగా ప్రకటన వచ్చే వరకూ అపోహలకు పోవడం మంచిది కాదన్నారు. -
గ్రామస్తులపై చేయిచేసుకున్న టీడీపీ ఎమ్మెల్యే
-
గ్రామస్తులపై చేయిచేసుకున్న నరసాపురం ఎమ్మెల్యే
సాక్షి, నరసాపురం : టీడీపీ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు రౌడీలా ప్రవర్తించారు. గ్రామ పంచాయతీ భవనాన్ని తరలించొద్దంటూ వేడుకున్నా వినకుండా వారిపై చేయిచేసుకున్నారు. ఈ సంఘటన నరసాపురం మండలంలోని సరిపల్లిగ్రామంలో ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. వివరాలు.. సరిపల్లి గ్రామంలోని పంచాయతీ భవన వివాదం కోర్టు పరిధిలో ఉంది. దానిని ప్రారంభించేందుకు ఎమ్మెల్యే బండారు అక్కడకు చేరుకున్నారు. అయితే, వివాదంలో ఉన్న భవనాన్ని ప్రారంభించేందుకు వీలులేదని స్థానికులు అడ్డుచెప్పారు. దీంతో కోపంతో ఊగిపోయిన మాధవనాయుడు గ్రామస్తులపై చేయిచేసుకున్నారు. మెడలు పట్టుకుని వారిని అక్కడ నుంచి గెంటేసి పంచాయతీ భవనాన్ని ప్రారంభించారు. ఎమ్మెల్యే తీరుతో సరిపల్లిలో ఉద్రికత్తత తీవ్ర స్థాయికి చేరింది. మాధవనాయుడు రౌడీల ప్రవర్తించారని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
పట్టించుకుంటే ఒట్టు.. ప్రజలకు గ్రహపాటు!
పశ్చిమగోదావరి, నరసాపురం: నరసాపురం సబ్‌కలెక్టర్ కార్యాల యం.. ఐఏఎస్ అధికారి పాలన.. నిత్యం అక్కడకు పలు సమస్యలతో వచ్చే జనం.. 12 మండలాలున్న డివిజన్‌కు ప్రధాన కార్యాలయం.. నిత్యం సమీక్షలు, సమావేశాలు. సోమవారం వచ్చిందంటే మీకోసం కార్యక్రమం వద్ద అర్జీదా రుల హడావుడి.. ఇదంతా గతం.. ప్రస్తుతం పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. తొమ్మిది నెలలు నుంచి పట్టించుకునే నాథుడు లేకుండా సబ్‌కలెక్టర్ కార్యాలయం తయారయ్యింది. అక్కడకు వెళ్లిన వారికి కనీసం సమాధానం చెప్పేందుకు కూ డా ఎవరూ లేని పరిస్థితి ఎదురవుతుంది. మొత్తం సబ్‌కలెక్టర్ కార్యాలయంలో ప్రస్తుతం డెప్యూటీ తహసీల్దార్ ర్యాంకులో ఉన్న నరేష్కుమార్ ఇన్చార్జి ఏఓగా పనిచేస్తున్నారు. కనీసం తహసీల్దార్ స్థాయి అధికారి కూడా కార్యాలయంలో లేకపోవడంతో డివిజన్లో పరిపాలన పూర్తిగా కుంటుపడింది. సబ్‌కలెక్టర్ కార్యాలయం ఇంత దౌర్భాగ్య పరిస్థితిని ఎదుర్కొన్న సందర్భంగా గతంలో ఎప్పుడూ లేదని చెబుతున్నారు. జిల్లాలో కీలకమైన ఈ రెవెన్యూ డివిజన్లో సబ్‌కలెక్టర్‌తో సహా పలు పోస్టులు ఖాళీఅయ్యాయి. సోమవారం మీకోసం కార్యక్రమంలో ఫిర్యాదులు తీసుకోవడానికి కనీసం తహసీల్దార్ స్థాయి అధికారి కూడా అందుబాటులో లేరు. దీంతో సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో తెలియక జనం అవస్థలు పడుతున్నారు. చివరకు సమస్యలు పరిష్కారం కాకపోవడంతో మీకోసం కార్యక్రమంలో ఫిర్యాదులు ఇవ్వకుండా కూడా జనం వెనుదిరుగుతున్నారు. సబ్‌కలెక్టర్ సుమిత్‌కుమార్ గాంధీ గతేడాది మే 6న బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో ఇక్కడ ఎవరినీ నియమించలేదు. కొవ్వూరు ఆర్డీఓను ఇన్చార్జ్గా నియమించినా కూడా ఆయన ఇక్కడ కార్యాలయం మెట్లెక్కిన సందర్భాలు తక్కువే. కార్యాలయ ఏఓ పీఎన్ఎస్ లక్ష్మి, కేఆర్సీ తహసీల్దార్ గొంతియ్య కూడా బదిలీ అయ్యారు. భర్తీ ఎప్పటికో..! సబ్‌కలెక్టర్ పోస్టుపై రాజకీయ ముసురు అల్లుకుంది. ఇక్కడ ఐఏఎస్‌ను నియమించడంపై డెల్టాలోని కొందరు ఎమ్మెల్యేలు అభ్యతరం చెప్పినట్టు సమాచారం.అప్పటి నుంచి పోస్టును ఖాళీగా పెట్టారు. పోనీ పూర్తిస్థాయి ఆర్డీఓను కూడా నియమించలేదు. ఓవైపు ఎన్నికల సమీపిస్తున్నాయి. సబ్‌కలెక్టర్ లేకపోవడంతో ఇప్పటికే డివిజన్లో ఓటరు జాబితాల తయారీ తప్పుల తడకగా మారింది. పర్యవేక్షణ లేకపోవడంతో రెవెన్యూ శాఖలోకింద స్థాయి సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ఎన్నికలనోటిఫికేషన్‌కు కూడా సమయం దగ్గరపడుతుంది. మరి ప్రభుత్వం సబ్‌కలెక్టర్ పోస్టును ఎప్పటికి భర్తీ చేస్తారో చూడాలి మరి. -
అడ్రస్ లేని సోలార్ సిటీ
పశ్చిమగోదావరి, నరసాపురం: నరసాపురం పట్టణం ఇక సోలార్ సిటీ.. విజయవాడ తరువాత రాష్ట్రంలోనే రోల్ మోడల్‌గా నరసాపురంలో అని చెప్పారు. సాక్షాత్తు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటన చేసి రెండేళ్లు పూర్తయింది. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి ప్రాథమికంగా ఏ అంశమూ ముందుకు కదల్లేదు. దీంతో పట్టణ వాసులు నిరాశ చెందారు. ఇక ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చే అవకాశంలేదు. అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత తీరప్రాంత అభివృద్ధిపై అంతకాదు ఇంతంటూ చేసిన హడావుడిలో సోలార్‌సిటీ అంశం కూడా తెరమరుగైపోయింది. 2016లో కేంద్ర ప్రభుత్వం దేశంలో 47 పట్టణాలను సోలార్ సిటీలుగా అభివృద్ధి చేయడానికి నిర్ణయించింది. మన రాష్ట్రానికి సంబంధించి మొదటిగా విజయవాడను ఎంపిక చేశారు.ఐతే కేంద్ర మంత్రి సీతారామన్ సొంత పట్టణం కావడం, మరోవైపు రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి చైర్మన్‌గా కొనసాగుతున్న జస్టిస్ గ్రంధి భవానీ ప్రసాద్ కూడా ఈ ప్రాంతం వారే కావడంతో నరసాపురం పట్టణాన్ని కూడా సోలార్ సిటీగా ఎంపిక చేశారు. ప్రకటనకు రెండేళ్లు కేంద్ర మంత్రి నిర్మిలా సీతారామన్ నరసాపురం పట్టణాన్ని సోలార్ సిటీగా ఎంపిక చేసినట్టు 2016 జనవరి 3న ప్రటించారు. మరుసటి నెల ఫిబ్రవరిలో డీటేల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (డీపీఆర్) కోసం మునిసిపాలిటీకి రూ.50 లక్షలు మంజూరు చేస్తున్నామని ప్రకటనవచ్చింది. దీంతో వెనువెంటనే పట్టణాన్ని సోలార్‌సిటీగా అభివృద్ధి చేయడానికి కౌన్సిల్ తీర్మానించింది. సీతారామన్ ఆదేశాలతో హుటాహుటిన నాటి నెట్‌క్యాఫ్ ఎండీ (హైదరాబాద్) కమలాకరబాబు వచ్చి, మునిసిపల్ కార్యాలయంలో సమావేశం కూడా నిర్వహించారు. రాష్ట్రంలో విజయవాడతో పాటుగా నరసాపురం కూడా సోలార్‌సిటీగా రూపాంతరం చెందుతుందని పట్టణ వాసులు సంతోషించారు. ఐతే నేటికీ ఒక పైసా కూడా నిధులు విడుదల చేయలేదు. నెట్‌క్యాఫ్ వద్దే ఫైల్ పెండింగ్‌లో ఉంది. విజయవాడలో మాత్రం సోలార్‌సిటీ పనులు చురుగ్గా సాగుతున్నాయి. ఈ ప్రాజెక్ట్ జాప్యాన్ని సీతారామన్ దృష్టికి తీసుకెళ్లడంలో స్థానిక ఎమ్మెల్యే, మునిసిపల్ చైర్పర్సన్లు శ్రద్ధ పెట్టకపోవడం వల్లే అవకాశం చేజారిందనే విమర్శలు ఉన్నాయి. తరువాత పట్టించుకోలేదు సోలార్ సిటీ డీపీఆర్ కోసం రూ.50 లక్షలు మంజూరు చేశామన్నారు. కానీ నిధులు ఫైసా విడుదల కాలేదు. నెట్‌క్యాఫ్ అధికారులతో అనేక సార్లు మాట్లాడాం. రేపు మాపన్నారు. కేంద్ర మంత్రి దృష్టికి కూడా తీసుకెళ్లాలని ప్రయత్నించాము వీలు కాలేదు. ఫైల్ నెట్‌క్యాఫ్ వద్దే పెండింగ్‌లో ఉంది. – పి.రత్నమాల, మునిసిపల్ చైర్పర్సన్ -
పత్తాలేని మెరైన్ పోలీస్‌స్టేషన్
పశ్చిమగోదావరి, నరసాపురం: జిల్లాలోని తీర ప్రాంతంలో మెరైన్ పోలీస్‌స్టేషన్ ఏర్పాటు అంశం పత్తా లేకుండా పోయింది. నరసాపురం తీరంలో మెరైన్ పోలీస్‌స్టేషన్ ఏర్పాటుపై కొన్ని సంవత్సరాల నుంచి హడావిడి జరుగుతుంది. మళ్లీ విషయం మరుగున పడిపోవడం పరిపాటిగా మారింది. ఆరేడేళ్లుగా ఇదే తంతు. అయితే కొంతకాలం క్రితం అంతర్వేదిలో మెరైన్ పోలీస్‌స్టేషన్ ఏర్పాటు చేయడంతో ఇక ఇక్కడ అలాంటి ప్రతిపాదనలు ఉండవని భావించారు. అయితే జిల్లాలో తీరప్రాంత గ్రామాలు ఎక్కువగా ఉండటంతో మళ్లీ ఈ అంశం తెరమీదకు వచ్చింది. త్వరలో మెరైన్ పోలీస్‌స్టేషన్ ఏర్పాటు అంటూ రెండేళ్ల నుంచి హడావిడి జరుగుతుంది. కచ్చితంగా ఇక్కడ మెరైన్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు జరుగుతుందని అటు పోలీస్, ఇటు రెవెన్యూశాఖలు చెబుతున్నాయి. కొన్నేళ్ల క్రితం ముంబైలో సముద్ర మార్గం ద్వారా కసబ్‌తో సహా పలువురు తీవ్రవాదులు నగరంలోకి ప్రవేశించి మారణహోమం సృష్టించారు. సరిగ్గా అప్పుడే కేంద్రం మన రాష్ట్రంలోని తీర ప్రాంత జిల్లాల్లో రక్షణ చర్యలపై దృష్టిపెట్టింది. ఇందులో భాగంగా నరసాపురం తీరప్రాంతంలో మెరైన్ పోలీస్‌స్టేషన్ ఏర్పాటు ప్రతిపాదన చేశారు. అనుకున్నది ఇక్కడ.. అయ్యింది అక్కడ నరసాపురంలో మెరైన్ పోలీస్‌స్టేషన్ ఏర్పాటుకు 2012లో దాదాపుగా రంగం సిద్ధం చేశారు. జిల్లా కలెక్టర్, ఎస్పీలతో కూడిన ప్రతినిధి బృందం నరసాపురం తీరగ్రామాల్లో పర్యటించింది. నరసాపురం మండలం చినమైనవానిలంక, మొగల్తూరు మండలం పేరుపాలెం ప్రాంతాలు పరిశీలించారు. చినమైనవానిలంకలో ఓ ప్రాంతాన్ని స్టేషన్ ఏర్పాటుకు అనువుగా గుర్తించారు. ముందుగా మన జిల్లాలోని తీరప్రాంతంలోనే మెరైన్ పోలీస్‌స్టేషన్ ఏర్పాటు చేస్తామన్నారు. ఏం జరిగిందో తెలియదు కానీ అనూహ్యంగా ముందు ప్రతిపాదనలో లేని తూర్పుగోదావరి జిల్లా అంతర్వేదిలో మాత్రం 2013లోనే మెరైన్ పోలీస్ స్టేషన్‌ను ఏర్పాటు చేసేశారు. ఇక్కడ మాత్రం అప్పటినుంచి పెండింగ్ పెట్టారు. తరువాత కాలంలో రాష్ట్ర విభజన జరగడంతో ఇక మొత్తం ఈ అంశం తెరవెనక్కు వెళ్లింది. ఎన్నో ఉపయోగాలు జిల్లాలో 19 కిలోమీటర్ల మేర తీరప్రాంతం ఉంది. తరచూ ప్రకృతి విపత్తులకు గురి కావడం వంటి ఇబ్బందుల రీత్యా ఇక్కడ మెరైన్ పోలీస్‌స్టేషన్ అత్యంత అవసరమని గతంలో జరిగిన సర్వేలు నిర్ధారించాయి. మెరైన్ పోలీస్‌స్టేషన్ అందుబాటులో ఉంటే కేవలం తీరప్రాంత భద్రత, రక్షణ అనే కాకుండా ఇతర ఉపయోగాలుంటాయి. ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు తీరప్రాంత ప్రజలను అప్రమత్తం చేయడం, వారికి ప్రాణహాని కలగకుండా రక్షించడం మెరైన్ స్టేషన్ సిబ్బంది చేస్తుంటారు. బోట్లు, విపత్తు రక్షణ సామాగ్రి వారి వద్ద అందుబాటులో ఉండటం ఉపయోగంగా ఉంటుంది. సునామీ సమయంలోనూ, ప్రకృతి విపత్తుల సమయంలో జరిగిన ప్రమాదాల్లో అనేకమంది ఈ ప్రాంతంలో ప్రాణాలు కోల్పోయారు. ఇక్కడ మెరైన్ పోలీస్‌స్టేషన్ అవసరాన్ని గుర్తించిన జిల్లా పోలీస్‌శాఖ అనేకసార్లు మెరైన్ పోలీస్‌స్టేషన్ అంశాన్ని కేంద్రం దృష్టిలో పెట్టింది. ఇంతకుముందు ఎస్పీగా పనిచేసిన భాస్కర్‌భూషణ్ ఈ అంశంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఆయన కూడా స్థల పరిశీలన చేసి వెళ్లారు. అయితే ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడంతో పనిమాత్రం జరగడంలేదు. స్థలం అందుబాటులో ఉంది తీరంలో మెరైన్ పోలీస్‌స్టేషన్ ఏర్పాటుకు స్థల సమస్య అయితే లేదు. స్థలం కావాలంటే సేకరించి ఇవ్వొచ్చు. గతంలో గుర్తించామని చెబు తున్న చినమైనవానిలంకలో కూడా ప్రభుత్వ భూములు ఉన్నాయి. ప్రతిపాదన వస్తే మాత్రం భూమి సేకరించి ఇస్తాం. చినలంకలో కాకపోయినా ఇంకెక్కడైనా ఇవ్వవచ్చు.– జి.సూర్యనారాయణరెడ్డి, తహసీల్దార్ -
కేసు ఒక స్టేషన్లో.. పంచనామా మరో చోట
పీఎం లంక, ఎల్బీ చర్ల నరసాపురం మండలంలోని గ్రామాలు. ఈ గ్రామాల్లో ఏదైనా సమస్య ఎదురై పోలీస్‌స్టేషన్‌కి వెళ్లాలంటేనరసాపురం రూరల్ పోలీస్‌స్టేషన్‌కి కాకుండా 18 కిలోమీటర్ల దూరంలోని మొగల్తూరు పోలీస్‌స్టేషన్‌కి వెళ్లాల్సి ఉంది. పశ్చిమగోదావరి,నరసాపురం: ఏదైనా సమస్య ఎదురైతే సొంత మండలంలోని పోలీస్‌స్టేషన్ కాకుండా దూరంగా ఉన్న వేరే మండలంలోని పోలీస్‌స్టేషన్‌కి ఆయా గ్రామాల ప్రజలు వెళ్లాల్సి వస్తోంది. ఇదీ నరసాపురం పోలీస్ సబ్‌డివిజన్‌లో పరిస్థితి. సబ్ డివిజన్ పరిధిలోని పోలీస్స్టేషన్ల పరిధిల్లో మార్పులు చేపట్టకపోవడంతో ప్రజలే కాకుండా, పోలీసులు, రెవెన్యూ సిబ్బంది ఇబ్బందులెదుర్కొంటున్నారు. ఎన్నో ఏళ్ల నుంచి ఈ సమస్య ఉన్నా కూడా పోలీస్‌శాఖ పట్టించుకోకపోవడం విశేషం. సబ్ డివిజన్లో 19 పోలీస్స్టేషన్లు నరసాపురం సబ్ డివిజన్ పరిధిలో ఆరు సర్కిల్ కార్యాలయాలు పనిచేస్తున్నాయి. వీటి పరిధిలో మొత్తం 19 పోలీస్ స్టేషన్లున్నాయి. నరసాపురం పట్టణం, రూరల్, మొగల్తూరు, పాలకొల్లు, పాలకొల్లు రూరల్, ఆచంట, పోడూరు, యలమంచిలి, వీరవాసరం, పెనుగొండ, ఇరగవరం, పెనుమంట్ర, భీమవరం 1 టౌన్, భీమవరం 2 టౌన్, భీమవరం రూరల్, ఆకివీడు, ఉండి, కాళ్ల, పాలకోడేరు పోలీస్ స్టేషన్లు పనిచేస్తున్నాయి. ప్రధాన సమస్య ఏమిటంటే నరసాపురం రూరల్, మొగల్తూరు, పాలకొల్లు రూరల్, భీమవరం రూరల్ ప్రాంతాల పోలీస్ స్టేషన్ల పరిధి స్టేషన్లు ఏర్పాటు చేసిన నాటి నుంచి పాలనా పరమైన ఇబ్బందులతో పోలీస్ సిబ్బంది సతమతమవుతున్నారు. దీంతో పాటు ఫిర్యాదుదారులు అనేక అవస్థలు పడుతున్నారు. నరసాపురం రూరల్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని మత్స్యపురి, తుందుర్రు గ్రామాలు నరసాపురం మండల పరిధిలోకి రావు. తుందుర్రు భీమవరం మండల పరిధిలో ఉండగా, మత్స్యపురి గ్రామం వీరవాసరం మండలంలోనిది. అలాగే నరసాపురం రూరల్ మండలంలోని ఎల్బీ చర్ల, పసలదీవి, తూర్పుతాళ్లు, పెదమైనవానిలంక గ్రామాలు ప్రస్తుతం మొగల్తూరు పోలీస్‌స్టేషన్ పరిధిలో ఉన్నాయి. దీనివల్ల పలు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అలాగే భీమవరం మండలానికి చెందిన వెంప గ్రామం ప్రస్తుతం మొగల్తూరు పోలీస్‌స్టేషన్ పరిధిలో ఉంది. దీనివల్ల అటు పోలీస్ సిబ్బంది, ఇటు కక్షిదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలాగే తణుకు మండలానికి చెందిన రెండు గ్రామాలు ఇరగవరం పోలీస్‌స్టేషన్ పరిధిలోకి వచ్చాయి. పాలకొల్లు మండలానికి చెందిన అడవిపాలెం పోడూరు పోలీస్‌స్టేషన్ పరిధిలో ఉంది. అమలుకు నోచుకోని ప్రభుత్వ నిర్ణయం ఏ మండలంలోని గ్రామాలు ఆయా మండలాల పోలీస్స్టేషన్ల పరిధిలోనే ఉండేలా చర్యలు చేపట్టాలని 2008లో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే ప్రభుత్వం ఆలోచన ఇంతవరకూ అమలు కాలేదు. ఈలోపు రాష్ట్ర విభజన కూడా జరిగిపోయింది. అలాగే గతంలో డీఎస్పీలుగా పని చేసిన అనేకమంది అధికారులు ఇక్కడ పడుతున్న ఇబ్బందులను, స్టేషన్ల పరిధిల్లో మార్పులు చేయాల్సిన అవసరాన్ని వివరిస్తూ ఉన్నతాధి కారులకు లేఖలు రాశారు. కానీ ప్రయోజనం లేకపోయింది. దీంతో ఈ పోలీస్స్టేషన్ల పరిధిలో నేరాలు జరిగితే కేసు నమోదు చేసిన పోలీసులు తదుపరి విచారణకు, శవ పంచనామాకు మరో మండలానికి చెందిన రెవెన్యూ అధికారులపై ఆధారపడాల్సి వస్తోంది. దీంతో పాటు ఫిర్యాదుదారులు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాక సంబంధిత కీలక రెవెన్యూ పత్రాలను ఆయా మండల కేంద్రాలకు వెళ్లి తిరిగి తమ ప్రాంత పోలీస్‌స్టేషన్ అధికారులకు అందించాల్సి వస్తోంది. ప్రతి నియోజక వర్గానికి ఓ సర్కిల్ కార్యాలయం ఉండేలా స్టేషన్లను పునర్ వ్యవస్థీకరించాలని నాలుగేళ్ల క్రితం పోలీస్‌శాఖ నిర్ణయించింది. అయితే ప్రభుత్వం నుంచి ఆమోదం రాకపోవడంతో ఫైల్ పెండింగ్‌లోనే ఉంది. ఇప్పటికైనా స్టేషన్ పరిధిల్లో మార్పులు అంశాన్ని పరిశీలించాలని పలువురు కోరుతున్నారు. -
ఇదే శ్రీగౌతమి హత్యలో డీల్
సాక్షి, నరసాపురం(పశ్చిమగోదావరి జిల్లా): రోజులు గడుస్తున్న కొద్దీ శ్రీగౌతమి హత్యకేసులో ఎన్నో మలుపులు, మరెన్నో కొత్త నిజాలు బయటకు వస్తున్నాయి. హత్యకు అసలు కిరాయి ఎంత అనేది అంతుచిక్కడం లేదు. అయితే ఈ విషయంలో పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో స్పష్టత వచ్చినట్టు తెలుస్తోంది. పని చేసిపెట్టండి, విషయాలు అన్నీ చక్కబడ్డ తర్వాత ‘మీ ఇద్దరి లైఫ్‌లు ఊహించని రీతిలో సెటిల్ చేస్తాం..’ ఇదే శ్రీగౌతమి హత్యకేసులో సజ్జా బుజ్జి అండ్ కో కిరాయి హంతకులకు ఇచ్చిన హామీ అని తెలుస్తోంది. అంతేకాదు హత్యకు ఒప్పందం చేసుకున్న తర్వాత కిరాయి హంతకులకు రూ.లక్షల్లో ఖర్చు పెట్టారు. విశ్వశనీయ సమాచారం మేరకు పోలీసులు ఇప్పటివరకూ ఈ కేసులో ఛేదించిన అంశాలివి. కేసును మొదట్లో 15 రోజుల్లోనే క్లోజ్‌చేసి అపప్రద మూటకట్టుకున్న పశ్చిమ పోలీసులు ఈసారి సీబీసీఐడీ వెనుక ఉండటంతో ఆచితూచి ముందుకెళుతున్నారు. పోలీసు ఉన్నతాధికారులు రోజూ కేసు పురోగతిని సమీక్షిస్తున్నట్టు తెలిసింది. ఇన్విస్టిగేషన్ అధికారిగా ఉన్న పాలకొల్లు రూరల్ సీఐ బుధవారం నరసాపురం వచ్చి పలు ప్రాం తాల్లో దర్యాప్తు చేశారు. కెనరా బ్యాంకు, ఓ బ్యూటీపార్లర్‌తో పాటుగా పావని ఇంటికి కూడా వెళ్లి వివరాలు సేకరించారు. ఈ కేసుపై మరో పోలీస్ బృందం పనిచేస్తుంది. సజ్జా బుజ్జి ఇటీవల విపరీతంగా ఆస్తులు కొనుగోలు చేసిన పెరవలి మండలం కానూరు, నరసాపురం, దర్భరేవు, నవరసపురం ప్రాంతాల్లో పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. ముందుగానే రూ.15 లక్షల వరకూ ఖర్చు.. హత్యకు రూ.1.70 లక్షలతో కారు కొనిపెట్టడమే కాకుండా హత్యకు ముందు రూ.15 లక్షల వరకూ కిరాయి హంతకులకు సజ్జా బుజ్జి, బొల్లంపల్లి రమేష్ ముట్టచెప్పారు. నరసాపురం కెనరా బ్యాంకులోని బుజ్జి ఖాతా నుంచి రూ.10 లక్షలు, బొల్లంపల్లి రమేష్ ఖాతా నుంచి రూ.5 లక్షలు వెళ్లినట్టుగా పోలీసులు గుర్తించినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలోనే పాలకొల్లు రూరల్ సీఐ రజనీకుమార్ నరసాపురం కెనరా బ్యాంకుకు వచ్చి వివరాలు సేకరించారు. అసలు నవంబర్ నెలలో హత్యకు స్కెచ్‌వేసి, జనవరిలో సంక్రాంతి సమయంలో అమలుచేయాలని ముందుగానే అనుకుని పక్కాగా ప్లాన్‌ను అమలు చేశారు. నవంబర్ నెల నుంచే లక్షల్లో సొమ్ములు ఖర్చుపెడుతుండటంతో కిరాయి హంతకులకు పూర్తిగా ధీమా వచ్చింది. ఈ హత్యలతో తమ జీవితాలు కచ్చితంగా సెటిల్ అయిపోతాయని భావించి శ్రీగౌతమిని యాక్సిడెంట్ మాటున హత్య చేశారు. ఇక ఈ కేసులో వైజాగ్‌కు చెందిన కిరాయి హంతకులు పాకాల సందీప్, కడియం దుర్గాప్రసాద్‌తో పాటుగా బొల్లంపల్లి రమేష్ కారు డ్రైవర్ కవురు లక్ష్మణ్ పరారీలోనే ఉన్నారు. వీరు ముగ్గురూ చిక్కితే కేసులో మరిన్ని కొత్త విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఎవరా ఎమ్మెల్యే? ఎవరీ బడా వ్యక్తులు ఈ కేసులో సజ్జా బుజ్జి అండ్ కోను రక్షించడానికి శతవిధాలా ప్రయత్నాలు సాగించిన కొందరి వ్యక్తుల పేర్లుపై చర్చ జోరుగా సాగుతోంది. శ్రీగౌతమి హత్య తర్వాత పావని పోరాటం చేయడం మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. అయితే కేసు నుంచి వైదొలిగేందుకు లక్షలు ఇప్పిస్తామంటూ తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఓ అధికార పార్టీ ఎమ్మెల్యే, బుజ్జి సామాజిక వర్గానికి చెందిన స్థానికులైన ఇద్దరు బడా వ్యక్తులు పావనిపై విపరీతమైన ఒత్తిడి తెచ్చినట్టుగా తెలు స్తోంది. వారు ఎవరై ఉంటారనే దానిపైనా జోరుగా చర్చ సాగుతోంది. పావని వీరి గురించి ఇప్పటికే పోలీసుల దర్యాప్తులో వెల్లడించినట్టు సమాచారం. అయితే సీబీసీఐడీ వెనుకుండటంతో కేసును తప్పనిసరి పరిస్థితుల్లో ముందుకు తీసుకెళుతున్న పోలీసులు ఈ బడాబాబుల విషయాలను వెలుగులోకి తెస్తారా? లేదా అనేది మరో ప్రశ్న. ఇక పోలీసులు తలుచుకుంటే ఏమైనా చేయగలరనేది శ్రీ గౌతమి కేసుతో మరోసారి రుజువయ్యినట్టయ్యింది. ఈ విషయం ఇప్పటికే శ్రీగౌతమి హత్యకేసులో రోజురోజుకూ తెరమీదకు వస్తున్న కొత్త అంశాలను పరిగణనలోకి తీసుకుంటే మొదట్లో ఎంత దారుణంగా పోలీసులు కేసును క్లోజ్ చేశారో అర్థమవుతుంది. శ్రీ గౌతమి, బుజ్జి కాల్‌డేటాలు గాని, నిందితుడి బుజ్జి బ్యాంకు అకౌంట్లను కూడా పరిశీలించకుండానే అప్పట్లో కేసు మూసేశారు. అంటే పోలీసులపై ఎంతమేర ఒత్తిళ్లు పనిచేసి ఉంటాయి, ఏ స్థాయి వ్యక్తుల సిఫార్సులు ఉండి ఉంటాయనేది మరోసారి హాట్ టాఫిక్‌గా మారింది. -
2200 కి.మీ. మైలురాయి దాటిన వైఎస్ జగన్
-
మరో మార్క్ దాటనున్న ప్రజాసంకల్పయాత్ర
-
భవిష్యత్తు మనదే
నరసాపురం: పార్టీ పటిష్టతే లక్ష్యం.. బూత్ కన్వీనర్ల పనితీరును మెరుగుపరిస్తే భవిష్యత్తు మనదే అని వైఎస్సార్ సీపీ ఎంపీ, ఆ పార్టీ ఉభయగోదావరి జిల్లాల పరిశీలకుడు వై.వి.సుబ్బారెడ్డి పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఆదివారం నరసాపురం పార్టీ కార్యాలయంలో ఆయన నరసాపురం పార్లమెంటరీ జిల్లా పరిధిలోని పార్టీ కో–ఆర్డినేటర్లతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. విభజన హామీలపై నాలుగేళ్లు నోరువిప్పని తెలుగుదేశం ప్రభుత్వం ఇప్పుడు పార్లమెంటు సాక్షిగా డ్రామాలు ఆడుతోందని, ప్రజలను మోసం చేసేందుకు మరోమారు యత్నిస్తోందని, ఆ పార్టీ కుట్రలను తిప్పికొట్టాలని నాయకులకు సూచించారు. నియోజకవర్గాల వారీగా విడివిడిగా ఆయన సమీక్షించారు. పార్టీ పటిష్టతపై చర్చించారు. సూచనలు, సలహాలు ఇచ్చారు. రచ్చబండ, పల్లెనిద్ర, గడపగడపకూ వైఎస్సార్ కార్యక్రమాల నిర్వహణపై సమీక్షించారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకూ సుదీర్ఘంగా జరిగిన సమీక్షలో స్థానికంగా ఉన్న ఇబ్బందులపైనా ఆరా తీశారు. నియోజకవర్గాలవారీగా దీర్ఘకాలంగా ఉన్న ప్రజా సమస్యలు, ఈ నాలుగేళ్లలో ప్రభుత్వం ఆయా సమస్యల విషయంలో వ్యవహరించిన తీరును అడిగి తెలుసుకున్నారు. భవిష్యత్ వైఎస్సార్ సీపీ దేనని ఈ దిశగా కార్యకర్తలను మరింత ఉత్సాహపరచాల్సిన బాధ్యత పార్టీ నాయకత్వంపై ఉందని సూచించారు. బూత్ కమిటీల పనితీరు కీలకం.. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా బూత్ కమిటీల నియామకాలు పూర్తయ్యాయని సుబ్బారెడ్డి తెలిపారు. బూత్ కమిటీల పనితీరు పార్టీకి కీలకమని స్పష్టం చేశారు. నియోజకవర్గాల వారీగా ఈనెల 18 నుంచి బూత్ కమిటీల కన్వీనర్లకు శిక్షణ తరగతులు నిర్వహించాల్సి ఉందన్నారు. కేంద్ర బడ్జెట్ తరహా పరిణామాలు, చంద్రబాబు అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ప్రజల్లో ఎండగట్టాలని సూచించారు. కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి జరిగిన అన్యాయం చూసిన తర్వాత టీడీపీ బండారం బయటపడిందని, ఆ పార్టీ వ్యవహారన్ని ప్రజలు నిశితంగా గమనిస్తున్నారని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ ద్వంద్వ నీతిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని, రచ్చబండ, పల్లెనిద్ర కార్యక్రమాలను దీనికి వేదికగా చేసుకోవాలని చెప్పారు. ముఖ్యంగా నియోజకవర్గాల వారీగా స్థానిక సమస్యలపై ప్రజలతో కలిసి పోరాటాలు చేయాలన్నారు. ఎన్నికలు ఏక్షణంలో జరిగినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని సూచించారు. ఈ సమావేశంలో పార్టీ నరసాపురం పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు, రాజమండ్రి పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు కొయ్యే మోషేన్‌రాజు, నరసాపురం పార్లమెంటు నియోజకవర్గ కో–ఆర్డినేటర్ వంక రవీంద్ర, అసెంబ్లీ నియోజకవర్గాల కో–ఆర్డినేటర్లు గుణ్ణం నాగబాబు(పాలకొల్లు), గ్రంధి శ్రీనివాస్(భీమవరం), కవురు శ్రీనివాస్( ఆచంట),ï ³వీఎల్ నర్సింహరాజు( ఉండి), కొట్టు సత్యనారాయణ(తాడేపల్లిగూడెం), పుప్పాల వాసుబాబు(ఉంగుటూరు), ఎం.ఈశ్వరి(ఏలూరు), అల్లూరి కృష్ణంరాజు(రాజోలు), పార్టీ పరిశీలకుడు చెల్లబోయిన వేణుగోపాల్, మాజీ ఎమ్మెల్సీ మేకా శేషుబాబు, నరసాపురం పార్లమెంటరీ యూత్ విభాగం జిల్లా అధ్యక్షుడు మంతెన యోగేంద్రవర్మ(బాబు), జిల్లా ఎస్సీసెల్ అధ్యక్షుడు మానుకొండ ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు. -
పెనుభూతమైన అనుమానం
నరసాపురం రూరల్ : నరసాపురం రూరల్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని రుస్తుం బాద పంచాయతీ మండావారిగరువులో భార్యపై అనుమానంతో భర్త ఆమెను హత్య చేశాడు. శనివారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగినట్టు నరసాపురం సీఐ ఎం.సుబ్బారావు తెలిపారు. మల్లుల వెంకటేశ్వరరావు భార్య మహాలక్ష్మి (29)పై భర్త అనుమానం పెంచుకున్నాడు. వేరే వ్యక్తితో లైంగిక సంబంధం ఉందనే ఆరోపణలతో రెండు, మూడు సార్లు ఆమెను కొట్టినట్టు కూడా కుటుంబ సభ్యులు తెలిపారన్నారు. విడాకులు ఇవ్వాలని ఆమెపై ఒత్తిడి తేగా ఆమె ఒప్పుకోకపోవడంతో శనివారం తెల్లవారుజామున ఇనుపరాడ్డుతో ఆమె తలపైనా, ముఖం పైనా దాడి చేశాడు. ఆమె 11 ఏళ్ల కుమారుడు అడ్డం రాగా అతడిని పక్కకు తోసేసినట్టు సీఐ తెలిపారు. ఆమె మృతి చెందిందని నిర్ధారించుకున్న అనంతరం రూరల్ పోలీస్‌స్టేషన్‌కు వచ్చి వెంకటేశ్వరరావు స్వయంగా లొంగిపోయినట్టు నరసాపురం టౌన్ ఎస్సై చంద్రశేఖర్ తెలిపారు. మహాలక్ష్మి మృతి చెందిందని తెలుసుకున్న కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరయ్యారు. మృతురాలికి 13 ఏళ్ల కుమార్తె కల్యాణి, 11 ఏళ్ల రాజేష్ (కుమారుడు) ఉన్నారు. మృతదేహానికి నరసాపురం ప్రభుత్వాసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. నిందితుడిని కోర్టుకు హాజరుపర్చనున్నట్టు సీఐ తెలిపారు. పట్టణ ఎస్సై చంద్రశేఖర్, రూరల్ ఎస్సై చెన్నం ఆంజనేయులు, ఏఎస్సైలు శ్రీనివాస్, అడపా సత్యనారాయణ, రైటర్ భాస్కరరావు ఘటనాస్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
తెలుగోడు.. మెదడు నాడిని పట్టేశాడు!
నరసాపురం: పశ్చిమగోదావరి జిల్లా, నరసాపురం కుర్రోడు మేడిది జాన్ విలియమ్ కేరీ అద్భుత పరిశోధన చేశాడు. మెదడులోని నాడుల్లో అసంబద్ధంగా కలిగే చలనాలను గుర్తించే ఎలక్ట్రానిక్ పరికరాన్ని తయారు చేశాడు. ఇతను చేసిన పరిశోధనలకుగాను గుంటూరు విజ్ఞాన్ విశ్వవిద్యాలయం నుంచి పీహెచ్డీ లభించింది. పలువురు ప్రముఖులు నుంచి ప్రశంసలు అందుకున్న విలియమ్.. తాను రూపొందించిన పరికరానికి పేటెంట్ కోసం దరఖాస్తు కూడా చేశాడు. వివరాల్లోకి వెళ్తే.. ఎంటెక్ చదివిన విలియమ్ పీహెచ్డీ పరిశోధనలో అరుదైన అంశాన్ని ఎంచుకున్నాడు. మూర్చ, పక్షవాతం, తలనొప్పి, కోమాలోకి వెళ్లడం లాంటి సందర్భాల్లో రోగికి సహజంగా ఎంఆర్ఐ, ఎలక్ట్రోయన్సీ ఫెలోగ్రామ్(ఈఈజీ) లాంటి స్కానింగ్ పరీక్షలు నిర్వహిస్తారు. ఈ సమయంలో మెదడులోని నాడుల్లో అసంబద్ధంగా చలనాలను గుర్తిస్తారు. అయితే ఈ చలనాలను కొన్ని సందర్భాల్లో వైద్యులు వేరే విధంగా అర్థం చేసుకోవడం, ఈ కదలికలు ఎందుకు వస్తున్నాయో అర్థంకాక, అవికూడా రోగానికి సంబంధించిన లక్షణాలుగా పొరపాటుపడే ప్రమాదముందని విలియమ్ చెప్పాడు. పరీక్ష సమయంలో నాడుల కదలికలు సహజంగానే ఉంటాయని, వాటిని అంతగా పట్టించుకోనవసరం లేదని విలియమ్ ప్రయోగాత్మకంగా నిరూపించాడు. ఈ కదలికలను గుర్తించడానికి ఓ పరికరాన్ని తయారు చేశాడు. పరికరం పని చేస్తుందిలా...: కేవలం రూ. 3 వేలు మాత్రమే ఖర్చయ్యే ఈ పరికరాన్ని ఈఈజీ మిషన్‌కు అనుసంధానం చేయ డం ద్వారా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని విలియమ్ చెబుతున్నాడు. పరికరం రూపొందించిన విధానం, పనిచేసే పద్ధతి గురిం చి విలియమ్ వివరిస్తూ... ‘సాధారణంగా మెదడు పనితీరును తెలుసుకునేందుకు ఈఈజీ పరీక్ష నిర్వహిస్తారు. ఈ సందర్భంలో రోగి కనురెప్పలు మూసి తెరిచినా, కనుగుడ్లు పక్కకు కదిపినా కూడా మెదడులోని నాడుల్లో చలనాలు కలుగుతాయి. అవి రోగం తాలూకా చలనాలా? లేక సాధారణ చలనాలా? అనేది తెలుసుకోవడం కోసం డాక్టర్లు మళ్లీ పరీక్షలు నిర్వహిస్తారు. ఇది వైద్యులకు, రోగులకూ కూడా ఇబ్బందే. కొన్ని సందర్బాల్లో వైద్యులు పొరపాటుపడి ట్రీట్మెంట్ కూడా చేస్తారు. మెదడులో కలిగే ఈ చలనాలను గుర్తించడానికే ఈ ఆటోమేటిక్ ఐబ్లింక్ డిటెక్టర్ యూజింగ్ మైరియో పరికరాన్ని రూపొందించాను. ఈ పరికరాన్ని ఈఈజీ మిషన్‌కు జతచేస్తే, రోగానికి సంబంధం లేకుండా మెదడులో కలిగే చలనాలను పరీక్ష సమయంలోనే గుర్తించి తెలియజేస్తుంది. దీంతో వైద్యుడికి పదేపదే పరీక్ష చేసే అవసరం ఉండదు. లాబ్ వ్యూసాప్ట్వేర్ కోడ్‌ను డెవలప్‌చేసి, మైరియో ప్రాసెసర్ ద్వారా ఈ పరికరం తయారు చేశాను. బయో పొటెన్షియల్ యాంప్లిఫైర్లు, ఎలక్ట్రోడ్స్ను ఉపయోగించి సింపుల్‌గా పరికరం తయారు చేశాను. పరికరం తయారీకి రూ.3 వేలు మించి ఖర్చు అవ్వదని, కానీ ఉపయోగం మాత్రం ఎక్కువగా ఉంటుంద’న్నాడు. -
పీతల పెంపకానికి డిమాండ్
నరసాపురం రూరల్: అంతర్జాతీయంగా పీతల పెంపకానికి మంచి డిమాండ్ ఉందని మత్స్యశాఖ డెప్యూటీ డైరెక్టర్ డాక్టర్ ఫణిప్రకాష్ అన్నారు. మండలంలోని తూర్పుతాళ్లు చామకూరిపాలెం ప్రాథమిక పాఠశాల వద్ద మంగళవారం రెండో అవగాహనా సదస్సులో ఆయన మాట్లాడారు. ఇప్పటికే బంగ్లాదేశ్, ఇండియా, థాయ్‌లాండ్, ఫిలిప్పైన్స్ తదితర దేశాల్లో పీతల సాగు ప్రాచుర్యం పొందిందన్నారు. మండపీత (సిల్లా సెర్రేట్రా) పెరుగుదల రుచి, మార్కెట్ ధర అధికంగా ఉండడం వల్ల పెంపకానికి రైతులు ఆసక్తి కనబరుస్తున్నారని తెలిపారు. రొయ్యల సాగుకు ప్రత్యామ్నాయంగా పీతల సాగుకు తీరప్రాంత గ్రామాలు అనుకూలమన్నారు. తక్కువ పెట్టుబడి ఎక్కువ శ్రమ లేకుండా లాభాలు ఆర్జించవచ్చని వివరించారు. రాష్ట్రంలో పీతల హేచరీని గుంటూరు జిల్లా సూర్యలంకలో ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. నీటి నాణ్యత, పీతలు సాగు విధానాన్ని రిటైర్డ్ డెప్యూటీ డైరెక్టర్ డాక్టర్ రామ్మోహనరావు, ఎంపెడా ఏడీ పట్నాయక్ తదితరులు వివరించారు. జిల్లాలో 400 హెక్టార్లలో పీతలు, పండుగప్ప సాగవుతున్నట్టు చెప్పారు. సదస్సులో ఎంపీటీసీ పుచ్చకాయల తిరుపతమ్మ, మత్సశాఖ సహాయ సంచాలకులు ఎ.అప్పలరాజు, రమణకుమార్, అభివృద్ది అధికారులు ఎల్ఎన్ఎన్ రాజు, వి.సత్యనారాయణ, ఏడీ ఏడుకొండలు, ప్రతిభ, ఎంపీఈఏలు, పలువురు రైతులు పాల్గొన్నారు. -
పీతల సాగుతో అధిక లాభాలు
నరసాపురం రూరల్: పీతలు, పండుగప్ప సాగులో ఆధునిక పద్ధతులు అవలబించడం ద్వారా అధిగ దిగుబడి సాధించి లాభాలు పొందవచ్చని మత్స్యశాఖ సంయుక్త సంచాలకులు డాక్టర్ అంజలి అన్నారు. మండలంలోని తూర్పుతాళ్లు చామకూరిపాలెం ప్రాథమిక పాఠశాల వద్ద సోమవారం జాతీయ మత్స్య అభివృద్ధి సంస్థ సహకారంతో ఏర్పాటుచేసిన మూడు రోజుల సదస్సును ఆమె ప్రారంభించారు. తీరప్రాంత గ్రామాల్లో వా తావరణం పీతలు, పండుగప్పల సాగుకు అనుకూలమన్నారు. ఇప్పటి వరకూ రైతులు చేప, వనామీ, టైగర్, రొయ్యల సాగుపైనే ఎక్కువగా దృష్టి సారించారని, పీతలను బాక్సుల్లో ఉంచి సాగుచేయడం ద్వారా తక్కువ ఖర్చుతో పాటు అధిక లాభాలను ఆర్జించవచ్చని వివరించారు. మూస పద్ధతిలో కాకుండా మత్స్యశాఖ అధికారులు, శాస్త్రవేత్తల సలహాలు, సూచనల మేరకు సాగు చేయాలన్నారు. నరసాపురం మండలంలో ఇప్పటికే చంద్రన్న రైతు క్షేత్రంలో భాగంగా పండుగొప్ప, పీతల రైతు ప్రదర్శనా క్షేత్రాలు ఏర్పాటు చేశామని తెలిపారు. సర్పంచ్ చామకూరి సుబ్బలక్ష్మీరామ్మొహనరావు అధ్యక్షతన జరిగిన సభలో ఎంపీటీసీ పుచ్చకాయల తిరుపతమ్మ, మత్సశాఖ ఉపసంచాలకులు డాక్టర్ ఫణి ప్రకాష్, మత్సశాఖ సహాయ సంచాలకులు ఎ.అప్పలరాజు, రమణకుమార్, అభివృద్ధి అధికారులు ఎల్ఎన్ఎన్ రాజు, వి.సత్యనారాయణ, ఏడీ ఏడుకొండలు, ప్రతిభ, ఎంపీఈఏలు, రైతులు పాల్గొన్నారు. -
హవాలాపై సీబీ‘ఐ’
నరసాపురం : విశాఖ నుంచి వచ్చిన సీబీఐ అధికారుల బృందం గురువారం నరసాపురంలో దాడులు జరిపింది. పట్టణంలో పేరుమోసిన బంగారం వ్యాపారి దుకాణం, ఇంట్లో ఏకకాలంలో సోదాలు నిర్వహిం చింది. వేకువజాము నుంచి రాత్రి 7 గంటల వరకు తనిఖీలు కొనసాగాయి. దాడుల విషయాన్ని సీబీఐ అధికారులు గోప్యంగా ఉంచారు. సీబీఐ డీఎస్పీ, మరో 9మంది సిబ్బంది వేకువజామునే నరసాపురం చేరుకుని, వాహనాలను గోదావరి గట్టు సమీపంలో పార్కింగ్ చేశారు. ఉదయం 5 గంటల సమయంలో కాలినడకన అతని ఇంటికి చేరుకున్నారు. కొందరు ఇంట్లో, మరికొందరు అతడి జ్యూయలరీ షాపులో సోదాలు చేశారు. స్థానిక పోలీసులను కూడా లోపలికి అనుమతించలేదు. సోదాలు పూర్తయిన తర్వాత గాని ఇక్కడకు వచ్చింది సీబీఐ అధికారులన్న విషయం తెలియలేదు. హవాలా కేసులో భాగంగానే.. ఇటీవల విశాఖలో వెలుగు చూసిన రూ.1,300 కోట్ల హవాలా కుంభకోణానికి సంబంధించిన కేసులో భాగంగానే సీబీఐ అధికారులు సోదాలు చేసినట్టు తెలిసింది. హవాలా కేసుకు సంబంధించి వడ్డి మహేష్, అతని స్నేహితుడు శ్రీనివాస్‌ను ఇటీవల విశాఖ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం విదితమే. తరువాత ఈ కేసును సీఐడీకి అప్పగించారు. ఇదే కేసులో మరో ఇద్దరిని సీఐడీ అదుపులోకి తీసుకుంది. ఈ కేసులో మొత్తం 9 మంది నిందితులు ఉన్నట్టు దర్యాప్తులో తేల్చారు. అదుపులో ఉన్న నిందితులను విచారిస్తున్న సందర్భంగా వారిచి్చన సమాచారంతో నరసాపురంలో కూడా దాడులు చేసినట్టు సమాచారం. ఈ కేసులో రూ.650 కోట్ల మేర హవాలా లావాదేవీలు సాగి నట్టు ముందుగా విశాఖ పోలీసులు తేల్చారు. అయితే ఈ మొత్తం రూ.1,300 కోట్ల మేర ఉన్నట్టు వార్తలు వచ్చాయి. సీబీసీఐడీ పర్యవేక్షిస్తున్న ఈ కుంభకోణం కేసు వ్యవహారం రూ.వందల కోట్లలో ఉండటంతో సీబీఐ అధి కారులు రంగప్రవేశం చేసినట్టు భావిస్తున్నారు. సోదాల సందర్భంగా కీలక వివరాలు సేకరించిన అధికారులు కొన్ని డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. సోదాలు నిర్వహించిన సీబీఐ అధికారులు వారు ఏ కేసుకు సంబంధించి వచ్చారు, ఎవరెవరిని విచారించారనే విషయాలు వెల్లడించ లేదు. మొత్తానికి వందలాది కోట్ల రూపాయల హవాలా కేసు వ్యవహారం విశాఖ నుంచి నరసాపురం చేరింది. సీబీఐ దాడులు పట్టణంలో సంచలనం రేకెత్తించాయి. ముఖ్యంగా బులియన్ వ్యాపారులు హడలిపోయారు. -
కరెంట్ కాటుకు ఒకరి బలి
బెళుగుప్ప (ఉరవకొండ) : బెళుగుప్ప మండలం నరసాపురంలో కరెంట్ కాటుకు హనుమంతరాయుడు(45) అనే వ్యక్తి బలయ్యారు. ఏఎస్ఐ విజయనాయక్ కథనం మేరకు.. కొత్తగా కడుతున్న ఇంటికి మోటార్ సాయంతో నీరు పెడుతుండగా విద్యుదాఘాతానికి గురై, స్పృహతప్పి పడిపోయినట్లు వివరించారు. కుటుంబ సభ్యులు గమనించి వెంటనే కళ్యాణదుర్గం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే అతను మృతి చెందినట్లు పరీక్షించిన వైద్యులు నిర్ధారించారు. మృతదేహాన్ని పోస్టుమాస్టం నిమిత్తం తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది. -
తిరునక్షత్ర ఉత్సవ శోభ
నరసాపురం రూరల్ : నరసాపురం పట్టణంలోని శ్రీ ఆదికేశవ ఎంబేరు మన్నార్‌స్వామి దేవస్థానం తిరునక్షత్ర ఉత్సవ శోభతో కాంతులీనుతోంది. భక్తిపారవశ్యం ఉప్పొంగుతోంది. 22 నుంచి ప్రారంభమైన రామనుజ సహస్రాబ్ది తిరునక్షత్ర ఉత్సవాలకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. రామానుజ సహస్రాబ్ది జయంత్యుత్సవం నేపథ్యంలో ఈ ఉత్సవాలను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారు. నిత్యం స్వామికి తిరుమంజనం, లీలా విభూతి ఉత్సవం, పల్లకిలో అగ్రహార ఉత్సవాలు వైభవంగా జరిపిస్తున్నారు. మద్రాసు సమీపంలోని పెరంబదూరులో విరాజిల్లే ఆదికేశవ భాష్యకార స్వామివార్ల ఆలయం తరువాత దేశంలో అంతటి ప్రాశస్త్యం గల ఆలయం ఇదే. సుమారు 230 ఏళ్ల క్రితం ఈ ప్రాంతానికి చెందిన పుప్పాల రమణప్ప నాయుడు ప్రోద్బలంతో అక్కడి సంప్రదాయం ప్రకారం..ఈ ఆలయాన్ని నిర్మించినట్టు అర్చకులు చెబుతున్నారు. ఉత్సవాల్లో భాగంగా మంగళవారం రాజాధిరాజ వాహనంలో స్వామి తిరువీధుల్లో ఊరేగారు. రామానుజాచార్యులు సుందరంగా ముస్తాబయ్యారు. కోలాట ప్రదర్శన ఆకట్టుకుంది. ఆలయ కార్యనిర్వహణఅధికారి అరుణ్‌కుమార్, సిబ్బంది బి.శ్రీనివాసరెడ్డి, బి.సుబ్బారావు, కె.వెంకన్న, ఎస్.నాగేశ్వరరావు, ఎం.నాగబాబులతో కలిసి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. -
ఎవరో.. ఏమిటో..!
నరసాపురం: నరసాపురం రైల్వేస్టేషన్లో దాదాపు 40 ఏళ్ల వయసున్న గుర్తుతెలియని వ్యక్తి అపస్మారక స్థితిలో పడి ఉండటాన్ని రైల్వే పోలీసులు గుర్తించారు. ఉదయం 10 గంటల సమయంలో ప్లాట్‌ఫారంపై పడి ఉన్న వ్యక్తిని గమనించిన రైల్వే కానిస్టేబుల్ వై.మనోహర్ విషయాన్ని ఏఎస్సై బి.రమణ దృష్టికి తీసుకువెళ్లారు. 108 ద్వారా అతడిని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అతని ఆచూకీ తెలియరాలేదు. వివరాలు తెలిసిన వారు సెల్ 94406 97655 నంబర్లో సంప్రదించాలని ఏఎస్సై రమణ కోరారు. -
మృతదేహంతో రాస్తారోకో
నరసాపురం: నరసాపురంలో శ్రీ చైతన్య టెక్నో స్కూల్ బస్ ఢీకొని అనిల్‌కుమార్ అనే యువకుడు మృతిచెందగా బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ మంగళవారం పట్టణంలోని 216 జాతీయ రహదారిపై దళిత సంఘాల నాయకులు, సీపీఎం నేతలు రాస్తారోకో చేశారు. నాయకులను పోలీసులు అరెస్ట్ చేయడంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. వివరాలిలా ఉన్నాయి.. గతనెల 22న జరిగిన ప్రమాదంలో అనిల్‌కుమార్ తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందిన విషయం తెలిసిందే. మృతుని కుటుంబానికి న్యాయం చేయాలంటూ దళిత, సీపీఎం నాయకులు పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని నేరుగా పాఠశాల భవనం వద్దకు తీసుకువచ్చి ఆందోళన చేశారు. మధ్యాహ్నం వరకూ ఆందోళన చేసినా ఎవరూ స్పందించకపోవడంతో మృతదేహాన్ని నరసాపురం–పాలకొల్లు మార్గంలో 216 జాతీయ రహదారిపైకి తీసుకువచ్చి రాస్తారోకో చేపట్టారు. బాధిత కుటుంబానికి రూ.25 లక్షలు పరిహారమివ్వాలని డిమాండ్ చేశారు. రాస్తారోకోతో వాహనాలు భారీగా నిలిచిపోవడంతో పోలీసులు రంగంలోకి దిగారు. సీపీఎం నేత కవురు పెద్దిరాజు, దళిత సంఘాల నేతలు వంగలపూడి యేషయా, ముసూడి రత్నం, కారుమంచి జీవరత్నం తదితరులను బలవంతంగా జీప్ ఎక్కించి పోలీస్‌స్టేషన్ కు తరలించారు. కొద్దిసేపటికి టీడీపీ నాయకులు రంగంలోకి దిగి మృతుల బంధువులతో చర్చలు జరిపారు. చర్చలు సఫలం కావడంతో మృతదేహాన్ని తరలించారు. -
పతాక స్థాయికి పోరాటం
నరసాపురం : ఏడాదిన్నరగా ఉధృతంగా సాగుతున్న గోదావరి మెగా ఆక్వా ఫుడ్ పార్క్ వ్యతిరేక ఉద్యమం పతాక స్థాయికి చేరింది. ఆక్వా పార్క్‌ను జనావాసాలు లేని సముద్ర తీరానికి తరలించాలంటూ ప్రజలు సాగిస్తున్న ఉద్యమాన్ని అణచివేసేందుకు పోలీసుల సాయంతో ప్రభుత్వం దమనకాండకు దిగుతున్న విషయం విదితమే. సర్కారు తీరు, ఆక్వా పార్క్ యాజమాన్యం అనుసరిస్తున్న మొండివైఖరి, నిత్యం ముట్టడిస్తున్న పోలీసు బలగాల నడుమ 40 గ్రామాల ప్రజలు సుమారు ఏడాది కాలంగా కంటిమీద కునుకులేకుండా గడుపుతున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు సాగిస్తున్న అరాచకాలతో వణికిపోతున్నారు. తమ జీవనాన్ని కాపాడుకునేందుకు.. భవిష్యత్ తరాలను కాలుష్యం బారినుంచి రక్షించుకునేందుకు అక్కడి ప్రజలు అన్నిటినీ భరిస్తూ ఆందోళనలు చేసూ్తనే ఉన్నారు. ఎప్పుడూ రోడ్డెక్కని మహిళలు లాఠీదెబ్బలు సైతం తిన్నారు. జైళ్లకు సైతం వెళ్లారు. పొరుగునే ఉన్న మొగల్తూరు నల్లంవారి తోటలోని ఆనంద ఆక్వా ప్లాంట్‌లో విషవాయువులు వెలువడి ఐదుగురు యువకులు మరణించటంతో వణికిపోయారు. ఆక్వా పార్క్ నిర్మా ణం పూర్తయితే ఇంతకంటే తీవ్రమైన దుర్ఘటనలు చోటుచేసుకుంటాయనే ఆందోళన వారిని వెన్నాడుతోంది. ఇప్పటికే అక్కడి ప్రజల పక్షాన పోరాడుతున్న వైఎస్సార్ సీపీ ఉద్యమ తీవ్రతను పెంచింది. పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు చేపట్టిన రెండు రోజుల నిరాహార దీక్షతో పోరాటం మరింత వేడెక్కింది. నరసాపురం, మొగల్తూరు, భీమవరం, పాలకొల్లు, వీరవాసం మండలాల పరిధిలోని గొంతేరు డ్రెయిన్ పరీవాహక ప్రాంతా ల్లోని దాదాపు 40 గ్రామాల ప్రజలు తరలివచ్చి ముదునూరి దీక్షకు సంఘీభావం తెలిపారు. ఆక్వా పార్క్ నిర్మాణం పూర్తయితే గొంతేరు డ్రెయిన్ కాలుష్య కాసారమవుతుందని గగ్గోలు పెట్టారు. పంటలు నాశనమైపోతాయని రైతులు, ఉపాధి కరువవుతుందని మత్స్యకారులు, ఆరోగ్యాలు పాడవుతాయని కన్నీటి పర్యంతమయ్యారు. ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు మిన్నంటాయి. ఇకనైనా ప్రభుత్వం కళ్లు తెరవకుంటే సత్తా చూపుతామని, తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. ముదునూరి చేపట్టిన దీక్ష శనివారం సాయంత్రం ముగిసింది. ఈ పోరాటం అంతం కాదని, మరింత తీవ్రంగా ఆరంభమవుతుందని దీక్ష అనంతరం ప్రసాదరాజు ప్రకటించారు. నిప్పులు చెరిగిన రోజా ఆక్వా పార్క్ విషయంలో చంద్రబాబు తీరు, ప్రజలపై సాగి స్తున్న దమనకాండపై వైఎస్సార్ సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు, నగరి ఎమ్మెల్యే రోజా నిప్పులు చెరిగారు. చంద్రబాబు లంచాలు తీసుకున్నారు కాబట్టే ఆక్వా పార్క్ యాజమాన్యానికి కొమ్ము కాస్తున్నారని ధ్వజమెత్తారు. ‘మహిళా దినోత్సవం రోజునే మహిళలను కొట్టిస్తావా చంద్రబాబూ.. 15మంది ఎమ్మెల్యేలను గెలిపించిన జిల్లాకు నీవిచ్చే బహుమతి ఇదేనా’ అని నిలదీశారు. ఆక్వా పార్క్‌ను తుందుర్రు ప్రాంతం నుంచి జనావాసాలు లేని సముద్ర తీరానికి తరలించాలి్సందేనని డిమాండ్ చేశారు. మొగల్తూరు నల్లంవారి తోటలో ఇదే యాజమాన్యం నిర్వహిస్తున్న 10 టన్నుల సామర్థ్యం గల ఆక్వా ప్లాంట్‌లో విషవాయువులు వెలువడి ఐదుగురు ప్రాణాలు కోల్పోయారని.. తుందుర్రులో ఆక్వా పార్క్ నిర్మించి ఇంకెంతమంది ప్రాణాలు పొట్టన పెట్టుకుంటారని నిలదీశారు. మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ప్రకటించి ప్రభుత్వం చేతులు దలుపుకుంటే సరిపోతుందా అని ప్రశ్నిం చారు. యాజమాన్యంపై చర్యల తోపాటు ఫ్యాక్టరీ లైసెన్స్‌లు రద్దు చేయడం, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టడం ప్రభుత్వ కనీస బాధ్యత అన్నారు. మేధా పాట్కర్ రాకతో.. ప్రముఖ పర్యావరణవేత్త, నర్మదా బచావో ఉద్యమ నిర్మాత మేధా పాట్కర్ శనివారం రాత్రి కంసాలి బేతపూడి, తుందుర్రు గ్రామాల్లో పర్యటిం చారు. ఆక్వా పార్క్ నిర్మాణానికి వ్యతి రేకంగా పోరాడుతున్న ప్రజలతో భేటీ అయ్యారు. తుందుర్రు, కంసాలి బేతపూడి తదితర గ్రామాల్లో ప్రభుత్వం సాగిస్తున్న దమనకాండ గురించి తెలుసుకున్న ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. తుందుర్రులో అరాచకాలు, పర్యావరణ ముప్పునకు రాష్ట్ర ప్రభుత్వమే బీజాలు వేసే ప్రయత్నాలపై జాతీయ స్థాయిలో చర్చ పెడతానని ప్రకటించారు. మొత్తంగా ఈ పరిణా మాల నడుమ ఆక్వా పార్క్ ఉద్యమంలో వేడి మరింత రాజుకుంది. -
ప్రసాదరాజు దీక్షకు రోజా సంఘీభావం
నరసాపురం: తుందుర్రు మెగా ఆక్వాపార్క్‌ను సముద్రతీరానికి తరలించాలన్న డిమాండ్‌తో మాజీ ఎమ్మెల్యే ప్రసాదరాజు చేపడుతున్న దీక్ష రెండో రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే రోజా, రైతు విభాగం అధ్యక్షుడు నాగిరెడ్డి ప్రసాదరాజు దీక్షకు సంఘీభావం తెలిపారు. శనివారం పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం చేరుకున్న రోజా మాట్లాడుతూ.. చంద్రబాబుకు విలాసాల మీద ఉన్న శ్రద్ధ ప్రజాసమస్యల మీద లేదన్నారు. ఆక్వాపార్క్‌ను సముద్రతీరానికి తరలించకపోతే బాబుకు ప్రజలే బుద్ధి చెబుతారని అన్నారు. మంత్రులు గన్మెన్లు లేకుండా తుందుర్రుకు వస్తే ప్రజల ఆందోళన తీవ్రత అర్థమౌతుందన్నారు. మొగల్తురు ఘటనలో ఐదుగురు చనిపోతే ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. కోట్ల రూపాయల లంచాలు తీసుకోబట్టే యాజమాన్యానికి కొమ్ముకాస్తున్నారని ఆరోపించారు.