
విలేకరులతో మాట్లాడుతున్న కాపు కార్పొరేషన్ చైర్మన్ సుబ్బారాయుడు
పశ్చిమగోదావరి, నరసాపురం: నరసాపురం అసెంబ్లీ టిక్కెట్ ఎవరికీ కేటాయించలేదని కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు చెప్పారు. నరసాపురం టిక్కెట్‌ను సిట్టింగ్ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడుకు మళ్లీ కేటాయిం చినట్టు మూడురోజుల క్రితం వార్తలు వచ్చాయి. దీంతో కొత్తపల్లి శుక్రవారం రాత్రి ఆయన వర్గీయులతో రుస్తుంబాదలో సమావేశమయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ తమ పార్టీ అధినేత ఇంకా ఎవరికీ టిక్కెట్‌లు కేటాయించలేదన్నారు. జిల్లాల వారీగా సమావేశాలు మాత్రమే ఏర్పాటు చేస్తున్నారని చెప్పారు. టిక్కెట్‌ల కేటాయింపుపై అధికారికంగా ప్రకటన వచ్చే వరకూ అపోహలకు పోవడం మంచిది కాదన్నారు.