assembly ticket
-
విశాఖ భీమిలి జనసేనలో టికెట్ల రచ్చ
-
వేడెక్కిన రాజకీయం
తాండూరు: ఈసారి అధికార బీఆర్ఎస్ను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు కాంగ్రెస్, బీజేపీ ప్రత్యేక కార్యాచరణను రూపొందించుకున్నాయి. ఇందులో భాగంగా ఇరు పార్టీల నాయకులు జోరుగా క్షేత్రస్థాయి పర్యటనలు చేస్తున్నారు. నిత్యం ప్రజల్లో ఉంటూ సమస్యలపై పోరాటం చేస్తున్నారు. ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను తమకు అనుకూలంగా మలుచుకునేందుకు అన్నివిధాలా ప్రయత్నిస్తున్నారు. జిల్లాలోని మిగిలిన అసెంబ్లీ సెగ్మెంట్లతో పోలిస్తే తాండూరులో పరిస్థితి ఎప్పుడూ కొంత భిన్నంగా ఉంటుంది. ఇటీవలికాలంలో నాయకులు పార్టీలు మారడం సర్వసాధారణమైంది. జిల్లా నేతలు మొదలుకుని గ్రామస్థాయి కార్యకర్తల వరకు కండువాలు మార్చేస్తున్నారు. అయితే అధికార పార్టీ టికెట్ ఎవరికి వస్తుందోననే టెన్షన్ అందరిలోనూ కనిపిస్తోంది. టికెట్ రాని వారు పార్టీ మారే అవకాశం లేకపోలేదనే చర్చ సాగుతోంది. కాంగ్రెస్‌కు కంచుకోట తాండూరు అసెంబ్లీ స్థానం గతం నుంచి కాంగ్రెస్‌కు కంచుకోట. ఈ విషయం దేశ రాజధాని ఢిల్లీలో ఉండే ఆ పార్టీ పెద్దల వరకూ తెలుసు. నియోజకవర్గంలో ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో పదిసార్లు కాంగ్రెస్, మూడు సార్లు టీడీపీ, ఒకసారి టీఆర్ఎస్ అభ్యర్థులు గెలుపొందారు. 2018 ముందస్తు ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ గాలి వీచినా తాండూరులో హస్తం పార్టీయే జయకేతనం ఎగురవేసింది. వర్గపోరుతోనూ పెరిగిన బలం గడిచిన మూడేళ్లలో ఇక్కడ బీఆర్ఎస్ అత్యంత శక్తిమంతంగా ఎదిగింది. తాండూరు ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి ఎవరికి వారే తమ కేడర్‌ను పెంచుకున్నప్పటికీ సంస్థాగతంగా పార్టీ మాత్రం బలపడింది. రెండు నెలలుగా రోహిత్‌రెడ్డి జనంలోనే ఉంటున్నారు. ప్రతీ మండలంలో పార్టీ ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించి కేడర్, ప్రజల దృష్టిని ఆకర్షించారు. మరోవైపు ఇటీవలే తాండూరులో నిర్వహించిన గృహ ప్రవేశ వేడుకకు వేలాది మంది బంధుమిత్రులు, అభిమానులు కార్యకర్తలతో బలగం చూపించుకున్నారు. ఈ కార్యక్రమాలకు ఎమ్మెల్సీ వర్గం దూరంగా ఉంది. ఇదిలా ఉండగా ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి సైతం నిత్యం క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. శుభ, అశుభ కార్యాల్లో పాల్గొంటూ నేనున్నానని కేడర్‌కు ధైర్యం అందిస్తున్నారు. పీఎమ్మార్ పేరుతో టోర్నమెంట్లు ఏర్పాటు చేసి కొడుకు రినీష్రెడ్డిని రంగంలోకి దింపారు. తనయుడి ద్వారా యువతను ఆకట్టుకునే పనిలో ఉన్నారు. అయితే వికారాబాద్‌కు చెందిన ఉద్యమకారుడు, బీసీ కమిషన్ సభ్యుడు శుభప్రద్ పటేల్ సైతం తాండూరుపై దృష్టిసారించారు. పట్టణంలో సొంత కార్యాలయం ఏర్పాటు చేసుకుని పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఒక్క చాన్స్ ప్లీజ్.. తాండూరు నియోజకవర్గంలో మహరాజుల కుటుంబానికి దశాబ్దాలుగా మంచి పేరుంది. ఏడు పర్యాయాలు ఈ ఇంటికి చెందిన అభ్యర్థులే ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఈఒక్కసారి తనకు అవకాశం కల్పించాలని కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జ్, పీసీసీ మెంబర్ రమేశ్‌మహరాజ్ ప్రజలను అభ్యర్థిస్తున్నారు. పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ.. ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ఎండగట్టే ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీ, కాంగ్రెస్ పార్టీని ఆదరించాలని కోరుతున్నారు. అయితే రానున్న రోజుల్లో రాజకీయ సమీకరణాలు మారే అవకాశం లేకపోలేదని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. చాపకింద నీరులా కమలం ప్రభుత్వం వైఫల్యాలపై గొంతెత్తుతున్న కమలనాథులు జనంలోని వ్యతిరేకతను క్యాష్ చేసుకోవాలని చూస్తున్నారు. తాండూరు అసెంబ్లీ టికెట్ కోసం ముగ్గురు నేతలు పోటీ పడుతున్నారు. వీరిలో పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి యు.రమేష్‌కుమార్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మురళీకృష్ణగౌడ్, మాజీ మంత్రి చందుమహరాజ్ తనయుడు నరేశ్మహరాజ్ టికెట్ ఆశిస్తున్నారు. అధిష్టానం ఎవరికి అవకాశం కల్పించినా సమష్టిగా పనిచేసి గెలవాలనే దిశగా సాగుతున్నారు. ఎలాంటి హడావుడి లేకుండా పార్టీ కార్యక్రమాలను నిర్వహిస్తూ చాపకింద నీరులా క్షేత్రస్థాయిలో కేడర్‌ను బలోపేతం చేసుకుంటున్నారు. దేశంలో ఎలాంటి స్కాంలకు అవకాశం లేకుండా పారదర్శకమైన పాలన అందిస్తున్న మోదీ సర్కారుకు మద్దతు పలకాలని కోరుతున్నారు. తాండూరులో రాజకీయం వేడెక్కుతోంది. ఎలక్షన్ కమిషన్ ఈనెల 2న ఎన్నికల షెడ్యూల్‌ను ఖరారు చేసింది. వచ్చే ఏడాది జనవరి 16లోపు ఎన్నికల ప్రక్రియను పూర్తి చేసేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో అన్ని పార్టీలు అలర్టయ్యాయి. దీంతో ఎక్కడ చూసినా రాజకీయ సందడి కనిపిస్తోంది.ఏ నోట విన్నా పొలిటికల్ చర్చ వినిపిస్తోంది. మరోవైపు ప్రధాన పార్టీలన్నీ ప్రచార పర్వం మొదలుపెట్టాయి. -
‘గులాబీ’కి చికాకు తెప్పిస్తున్నారా?.. బీఆర్ఎస్ ప్లాన్ ఏంటి?
ఉమ్మడి నల్గొండ జిల్లాను మరోసారి స్వీప్ చేయడానికి బీఆర్ఎస్ నాయకత్వం వేస్తున్న ప్లాన్ ఏంటి? అధినేత ఆదేశాల మేరకు ఎమ్మెల్యేలు పొరపాట్లు సరిచేసుకుంటున్నారా? తప్పులు దిద్దుకోనివారి పరిస్థితి ఏంటి? టిక్కెట్ కోసం కొట్టుకుంటున్నవారిని ఎలా దారికి తెస్తారు? గులాబీ పార్టీకి చికాకు తెప్పిస్తున్న నియోజకవర్గం ఎక్కడుంది? అది కాంగ్రెస్‌కు కంచుకోట నల్గొండ జిల్లాను కాంగ్రెస్‌కు కంచుకోట అని చెబుతారు. ఇక్కడి నుంచి ఇద్దరు ఎంపీలు కూడా ప్రస్తుతం కాంగ్రెస్‌కు చెందినవారే ఉన్నారు. కాని ఒక్కరంటే ఒక్కరు కూడా హస్తం పార్టీ ఎమ్మెల్యే ఈ జిల్లాలో లేరు. జిల్లా మొత్తం గులాబీ పార్టీ ఎమ్మెల్యేలే. మునుగోడు గెలుచుకోవడం ద్వారా నల్గొండ జిల్లాను గులాబీ సేన క్లీన్ స్వీప్ చేసేసినట్లయింది. రానున్న ఎన్నికల్లో కూడా మొత్తం 12 అసెంబ్లీ సీట్లు గెలుచుకుని జిల్లాలో తమదే తిరుగులేని ఆధిపత్యం అని చాటుకోవడానికి గులాబీ పార్టీ నాయకత్వం వ్యూహాలు రచిస్తోంది. అయితే కొన్ని నియోజకవర్గాల్లో నాయకుల మధ్య కొనసాగుతున్న ఆధిపత్య పోరు పార్టీకి చికాకు తెప్పిస్తోంది. ఉమ్మడి జిల్లాలోని ఎస్టీ రిజర్వుడు నియోజకవర్గం దేవరకొండలో నేతల మధ్య ఆధిపత్యపోరు తారాస్థాయికి చేరినట్లు సమాచారం. సిటింగ్ ఎమ్మెల్యే రవీంద్రకుమార్, వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ ఆశిస్తున్న దేవేందర్ నాయక్ మధ్య సీటు పోరు కొంతకాలంగా సాగుతోంది. పార్టీ ఫిరాయించి వచ్చిన రవీంద్రకుమార్‌కు కాకుండా తొలినుంచీ ఉద్యమంలో ఉన్న తనకు టిక్కెట్ ఇవ్వాలని మాజీ మున్సిపల్ చైర్మన్ అయిన దేవేందర్ నాయక్ గట్టిగా పట్టుబడుతున్నట్లు చెబుతున్నారు. ఇటీవల నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనాల సందర్భంగా ఇద్దరి మధ్య ఆధిపత్యపోరు మరోసారి బయట పడినట్లు తెలుస్తోంది. ఆత్మీయ సమ్మేళనాలు జరుగుతన్న సమయంలోనే దేవేందర్ నాయక్ తన వర్గంతో కలిసి తీర్థయాత్రలకు వెళ్లారట. అప్పట్లో ఇది తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అసమ్మతి వెనుక ఓ సీనియర్ నేత మరోవైపు నియోజకవర్గంలో ఏం జరుగుతుందో కేడర్‌కు కూడా అర్థంకాక తలలు పట్టుకున్నారట. ఇదే విషయం అధినేత దృష్టికి కూడా వెళ్లినట్లు ప్రచారం సాగుతోంది. అయితే ఎమ్మెల్యే రవీంద్రకుమార్ తీరు పట్ల నియోజకవర్గంలోని నేతలంతా తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని టాక్ నడుస్తోంది. పార్టీ గాని, ప్రభుత్వం కాని నిర్వహిస్తున్న కార్యక్రమాలకు తమకు కనీసం సమాచారం కూడా ఇవ్వడంలేదని గులాబీ పార్టీ నేతలు ఎమ్మెల్యే పట్ల గుర్రుగా ఉన్నారు. ఎమ్మెల్యేను వ్యతిరేకించే నేతలంతా ఒక వర్గంగా ఏర్పడి వచ్చే ఎన్నికల్లో రవీంద్ర కుమార్‌కు టికెట్ ఇస్తే సహకరించేది లేదని తేల్చి చెప్పేశారట. ఈ అసమ్మతి వెనుక జిల్లాకు చెందిన ఓ సీనియర్ నేత ఉన్నారనే ప్రచారం కూడా సాగుతోంది. రవీంద్ర కుమార్ మాజీ గురువు అయిన ఆ నేత....తనను కాదని మరో పవర్ సెంటర్లో చేరిపోయిన తన మాజీ శిష్యుడిపై ప్రతీకారం తీర్చుకోవాలన్న కసితో ఉన్నారనే ప్రచారం సైతం సాగుతోంది. ఆ సీనియర్ నేతకు దేవరకొండపై మంచి పట్టు ఉండటంతోపాటు తన వైరివర్గంలో చేరిన ఎమ్మెల్యేకు ఎలా అయినా చెక్ పెట్టాలని వ్యూహాలు పన్నుతున్నారట. ఇదే సమయంలో టికెట్ ఆశిస్తున్న దేవేందర్ నాయక్‌ను తన వైపు తిప్పుకున్నారట. ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో దేవరకొండలో జరుగుతున్న వ్యవహారాలు పార్టీ నాయకత్వానికి చికాకు కలిగిస్తున్నట్లు సమాచారం. ఇద్దరు నేతల మధ్య టిక్కెట్ పోరు ఎక్కడికి దారితీస్తుందో అన్న ఆందోళన కార్యకర్తల్లో వ్యక్తం అవుతోంది. చదవండి: బెజవాడ రాజకీయాలు.. కేశినేని నాని దారెటు? -
అసెంబ్లీ టిక్కెట్ ఎవరికీ ఖరారు కాలేదు
పశ్చిమగోదావరి, నరసాపురం: నరసాపురం అసెంబ్లీ టిక్కెట్ ఎవరికీ కేటాయించలేదని కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు చెప్పారు. నరసాపురం టిక్కెట్‌ను సిట్టింగ్ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడుకు మళ్లీ కేటాయిం చినట్టు మూడురోజుల క్రితం వార్తలు వచ్చాయి. దీంతో కొత్తపల్లి శుక్రవారం రాత్రి ఆయన వర్గీయులతో రుస్తుంబాదలో సమావేశమయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ తమ పార్టీ అధినేత ఇంకా ఎవరికీ టిక్కెట్లు కేటాయించలేదన్నారు. జిల్లాల వారీగా సమావేశాలు మాత్రమే ఏర్పాటు చేస్తున్నారని చెప్పారు. టిక్కెట్ల కేటాయింపుపై అధికారికంగా ప్రకటన వచ్చే వరకూ అపోహలకు పోవడం మంచిది కాదన్నారు. -
రెండోసారి పోటీ హుళక్కే!
అమలాపురం అసెంబ్లీ టికెట్ విషయంలో టీడీపీలో చరిత్ర పునరావృతం అవుతుందా? అమలాపురం (పాత అల్లవరం నియోజకవర్గంలో) టీడీపీ సిటింగ్ ఎమ్మెల్యేకు.. ఆ తరువాత టికెట్ దక్కదన్న సెంటిమెంట్ నిజం కానుందా? అంటే అవునంటున్నాయి టీడీపీ వర్గాలు. సిటింగ్ ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావుకు వచ్చే ఎన్నికల్లో పార్టీ టికెట్ దక్కించుకునే అవకాశాలు లేవంటున్నారు. దివంగత లోక్‌సభ స్పీకర్ జీఎంసీ బాలయోగి కుమారుడు గంటి హరీష్, పార్టీలో మరో సీనియర్ నాయకుడు పరమట శ్యామ్ రూపంలో ఆనందరావుకు టికెట్ విషయంలో అడ్డంకి ఏర్పడనుంది. తూర్పుగోదావరి , అమలాపురం: రూ.కోట్లతో అభివృద్ధి చేశానని గొప్పలకు చెప్పుకుంటున్న అమలాపురం ఎమ్మెల్యే ఆనందరావుకు గెలుపు అవకాశాలు లేవంటూ టీడీపీ సొంత సర్వే నివేదికలు చెబుతున్నాయి. గత ఎన్నికల్లో పార్టీకి దన్నుగా ఉన్న ఒక ప్రధాన సామాజిక వర్గం ఎమ్మెల్యే తీరుపై గుర్రుగా ఉండి పార్టీకి దూరంగా ఉంది. కొంతమంది పార్టీ కూడా మారుతున్నారు. ఇవి కూడా ఆయన టికెట్ పొందడానికి ప్రధాన అవరోధంగా ఉన్నాయంటున్నారు. దీంతో పార్టీ అధిష్టానం కొత్త అభ్యర్థుల అన్వేషణలో పడిందని కొన్ని నెలలుగా ప్రచారం సాగుతోంది. దివంగత లోక్‌సభ స్పీకర్ జీఎంసీ బాలయోగి వారసుడు హరీష్ అయితే బాగుంటుందనే ప్రచారం టీడీపీ వర్గాల్లో జోరుగా సాగుతోంది. పార్టీ సీనియర్ నాయకుడు, గత ఎన్నికల్లో పార్టీ టికెట్‌ను త్రుటిలో చేజార్చుకున్న పరమట శ్యామ్ పేరును మరో ప్రత్యామ్నాయంగా సూచిస్తున్నారు. అయితే బాలయోగి వారసుడు రాజకీయాల్లోకి వచ్చే అవకాశం లేదని, తిరిగి సిటింగ్ ఎమ్మెల్యే ఆనందరావుదే టికెట్ అంటూ ఆయన వర్గం ప్రచారం చేస్తోంది. ఈ నేపథ్యంలో, సంక్రాంతి సందర్భంగా బాలయోగి అభిమానుల పేరుతో హరీష్ ఫ్లెక్సీలను అమలాపురం పట్టణంతోపాటు పలుచోట్ల ఏర్పాటు చేయడం చర్చనీయాంశమైంది. హరీష్ రాజకీయాల్లోకి వస్తాడన్న ప్రచారం జోరందుకుంది. హరీష్ రాకను ఉప ముఖ్యమంత్రి రాజప్ప వర్గం అంతర్గతంగా స్వాగతిస్తున్నట్టు ఆ పార్టీ వర్గాలు అంటున్నాయి. రాజకీయ గురువు బాలయోగి తనయుడిని రంగంలోకి తీసుకురావడం ద్వారా ఆయన రుణం తీర్చుకోవడంతో పాటు సొంత నియోజకవర్గంలో బలమైన పోటీదారుడిని రంగంలో నిలపాలన్న పార్టీ అధిష్టానం యోచనకు మార్గం ఏర్పడుతుందని రాజప్ప వర్గీయులు అంటున్నారు. అయితే హరీష్‌ను లోక్‌సభకు పంపుతారనే ప్రచారం కూడా సాగుతోంది. మార్పు కోరుకుంటున్న రాజప్ప? అమలాపురం నియోజకవర్గంలో ఈసారి అభ్యర్థిని మార్చాలని ఉపముఖ్యమంత్రి చినరాజప్ప భావిస్తున్నారనే ప్రచారం పెద్ద ఎత్తున సాగుతోంది. పార్టీపరంగా ఎమ్మెల్యే అయిన వ్యక్తికి రెండోసారి అవకాశం ఇచ్చేందుకు రాజప్ప అంగీకరించరనే సెంటిమెంట్ కూడా ఉంది. 1999 ఎన్నికల్లో అల్ల వరం సిటింగ్ ఎమ్మెల్యే ఏజేవీబీ మహేశ్వరావును కాదని చిల్లా జగదీశ్వరికి టికెట్ ఇప్పించారు. 2004 ఎన్నికల్లో ఆమెను కాదని పండు స్వరూపరాణిని నిలబెట్టారు. తాజాగా సిటింగ్ ఎమ్మెల్యేకు మొండిచేయి చూపుతారన్న ప్రచారం సాగుతోంది. శిష్యుడిగా భావించి ఆనందరావుకు టికెట్ ఇచ్చే విషయంలో రాజప్పతో ఇటీవల ఏర్పడిన అధిప్యత పోరే కారణమని అంటున్నారు. ఈ నియోజకవర్గంలో రాజప్ప వర్గం పెత్తనం ఎమ్మెల్యే వర్గానికి మింగుడ పడడం లేదు. ఎమ్మెల్యే వర్గంలో కీలకంగా ఉన్న మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గునిశెట్టి చినబాబు రెండోసారి చైర్మన్ పదవి ఇవ్వలేదని రాజప్పపై అసంతృప్తితో ఉన్నారు. బహిరంగంగానే విమర్శలు గుప్పిస్తున్న ఆయను ఎమ్మెల్యే వారించకపోవడంపై రాజప్ప గుర్రుగా ఉన్నట్టు సమాచారం. ఇటీవల వివాదంలో చిక్కుకున్న సోదరుడు జగ్గయ్యనాయుడిని ఎమ్మెల్యే వెనకేసుకు రాకపోవడం కూడా రాజప్ప వర్గం అసంతృప్తి ఉందంటున్నారు. అమలాపురం అసెంబ్లీ టికెట్ ఎవరికి ఖరారవుతుం దన్న విషయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. -
అమ్మ కోసం కార్తీక్‌రెడ్డి సీటు త్యాగం!
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: నాడు కుమారుడు ఎంపీగా పోటీ చేసేందుకు పెద్ద మనస్సు చేసుకొని పోటీకి దూరమైన అమ్మ.. నేడు తల్లి బరిలోకి దిగేందుకు వీలుగా తన సీటును త్యాగం చేసిన కుమారుడు. ఇలా మాజీ హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆమె తనయుడు కార్తీక్రెడ్డిలు జిల్లా రాజకీయాల్లో తమదైన ముద్ర వేశారు. గత సార్వత్రిక ఎన్నికల్లో ఒక కుటుంబానికి ఒకే టిక్కెట్ నినాదంతో కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్లగా.. కార్తీక్‌కు చేవెళ్ల ఎంపీగా పోటీకి లైన్‌క్లియర్ చేసేందుకు సబిత తన మహేశ్వరం సీటును త్యాగం చేశారు. ఇప్పుడు మహేశ్వరం సెగ్మెంట్‌ను సబితకు కేటాయించగా.. కూటమి పొత్తులో భాగంగా రాజేంద్రనగర్ స్థానాన్ని టీడీపీకి కేటాయించడంతో కార్తీక్‌కు సీటు త్యాగం తప్పలేదు. పాత కథ పునరావృతం 2014 ఎన్నికల్లో రాజకీయ అరంగేట్రం చేసిన పట్లోళ్ల కార్తీక్‌రెడ్డి చేవెళ్ల లోక్‌సభ స్థానం నుంచి పోటీచేయాలని నిర్ణయించుకున్నారు. అప్పటికే మహేశ్వరం శాసనసభ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయన తల్లి సబితా ఇంద్రారెడ్డి రాష్ట్ర హోంశాఖ మంత్రిగా కూడా వ్యవహరిస్తున్నారు. అయితే, కుటుంబానికి ఒకే టికెట్ అనే నిబంధనను కాంగ్రెస్ పార్టీ తెర మీదకు తేవడంతో తనయుడి రాజకీయ భవిష్యత్తు కోసం మహేశ్వరం సిట్టింగ్ స్థానాన్ని త్యజించారు. ఈ నేపథ్యంలోనే చేవెళ్ల పార్లమెంట్ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసే అవకాశం కార్తీక్‌కు లభించింది. ఎన్నికల్లో తొలిసారి బరిలో దిగిన కార్తీక్‌కు పరాభవం ఎదురైంది. దీంతో కొద్ధిరోజుల క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్న సబిత.. ఈ సారి పాత స్థానమైన మహేశ్వరం నుంచి, కార్తీక్ రాజేంద్రనగర్ నుంచి పోటీ చేయడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీలోనూ పెద్దగా పోటీ లేకపోవడంతో ఈ రెండు స్థానాల టికెట్లు తమకు ఖాయమని భావించారు. అయితే, అనూహ్యంగా ఈ సారి కూడా ‘ఫ్యామిలీకి ఒకే టికెట్’ షరతును వర్తింపజేయాలని హైకమాండ్ నిర్ణయించడంతో కార్తీక్ నీరుగారారు. అయితే, ఈ నిబంధన కార్యరూపం దాల్చదని చివరి నిమిషం వరకు ఢిల్లీ స్థాయిలో లాబీయింగ్ నెరిపారు. సొంత పార్టీని ఒప్పించడానికి సతమతమవుతున్న ఆయనకు మిత్రపక్షం రూపంలో చుక్కెదురైంది. సీట్ల సర్దుబాటులో భాగంగా టీడీపీ ఈ స్థానాన్ని ఎగురేసుకుపోవడంతో ఆయనకు నిరాశే మిగిలింది. దీంతో కుంగిపోయిన ఆయన స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగుతానని చెప్పడమేగాకుండా.. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే, మహేశ్వరంలో అమ్మ పోటీ చేస్తుండడంతో తన రాజీనామా ప్రభావం ఆమెపై పడకూడదని భావించారు. రాజీనామా నిర్ణయంపై వెనుకడుగువేశారు. దీంతో నాడు కార్తీక్ కోసం తల్లి సీటును త్యాగం చేయగా.. ఈ సారి తల్లి కోసం తనయుడు సీటును త్యజించడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. -
పట్నంలో హై‘డ్రామా’
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ఇబ్రహీంపట్నం టికెట్‌పై ఇంకా హైడ్రామా కొనసాగుతోంది. చివరి నిమిషంలో టీడీపీ నేత సామ రంగారెడ్డి బీ–ఫారానికి నోచుకోకపోవడం సస్పెన్స్‌ని తలపిస్తోంది. మహాకూటమి పొత్తులో భాగంగా ఈ స్థానం టీడీపీకి దక్కడం.. అభ్యర్థిగా ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు సామ పేరును ప్రకటించిన విషయం తెలిసిందే. తనకు ఇష్టం లేకపోయినా పార్టీ నిర్ణయాన్ని గౌరవించి పట్నం నుంచి పోటీ చేస్తానని సామ పేర్కొన్నారు. అయితే ఆదివారం ఎన్టీఆర్ భవన్లో బీ–ఫారాల అందజేత కార్యక్రమానికి హాజరైన సామ రంగారెడ్డికి చుక్కెదురైంది. పార్టీ బీ–ఫారం ఇవ్వకపోవడంతో ఆయన నిర్ఘాంతపోయారు. మధ్యాహ్నం 2.30 నుంచి రాత్రి 7.30 గంటల వరకు అక్కడే ఉన్నసామ రంగారెడ్డి చివరకు ఖాళీచేతులతో వెనుదిరిగారు. రాజేంద్రనగర్ టీడీపీ అభ్యర్థి గణేష్‌గుప్తాకు పార్టీ బీఫాం అందజేసింది. బీ–ఫారాలు అందుకున్న 12 మంది నేతలతో ఆ పార్టీ ప్రతిజ్ఞ చేయించింది. ప్రతిజ్ఞ చేసిన వారిలో సామ సైతం ఉన్నారు. సాంకేతిక కారణాలను సాకుగా చూపుతూ ఆయనకు బీ–ఫారం అందజేయలేదని.. ఆయన సన్నిహితులు చెబుతున్నా వ్యూహాత్మకంగానే పక్కన బెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. మరోపక్క టీడీపీ సీనియర్ నేత, స్థానికుడు రొక్కం భీంరెడ్డి సైతం ఈ స్థానంపై కన్నేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆయన ఏపీ సీఎం చంద్రబాబుతో మంతనాలు మొదలు పెట్టడం చర్చనీయాంశంగా మారింది. ఆదివారం ఆయన అమరావతికి వెళ్లి బాబుని కలిశారు. 37 ఏళ్లుగా పార్టీని నమ్ముకుని ఉన్నానని, ఇబ్రహీంపట్నం సీటును తనకే కేటాయించాలని కోరినట్లు సమాచారం. అంతేగాక ఇబ్రహీంపట్నం స్థానానికి సామ రంగారెడ్డి పేరు ఖరారు చేయడంపై కాంగ్రెస్ కాస్త విముఖంగా ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈయన స్థానికేతరుడని, ఈ నియోజకవర్గంలో పెద్దగా పట్టులేదని భావిస్తోంది. వీటన్నింటినీ బేరీజు వేసుకున్న కాంగ్రెస్.. ఎన్నికల్లో సామ గెలుపు అంత సులువుకాదనే పునరాలోచనలో పడినట్లు సమాచారం. దీంతో ఈ స్థానం తమకే కావాలని టీడీపీ అధిష్టానంపై కాంగ్రెస్ పార్టీ ఒత్తిడి తెస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనికితోడు ఈ స్థానంపై కాంగ్రెస్ నేత మల్రెడ్డి రంగారెడ్డి సైతం ఆశలు వదులుకోకపోవడం మరింత బాలాన్ని చేకూర్చుతోంది. పార్టీ తనకే బీ–ఫారం ఇస్తుందని ధీమా వ్యక్తం చేయడంతోపాటు సోమవారం నామినేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఇబ్రహీంపట్నం సెగ్మెంట్ అంశం రాష్ట్ర స్థాయిలో చర్చనీయాంశమైంది -
నేనేం తప్పు చేశా!
సాక్షి, సిద్దిపేట: ‘నా నాలుగు దశాబ్దాల రాజకీయ జీవితంలో ఏనాడూ ప్రజాభిప్రాయాలకు వ్యతిరేకంగా పని చేయలేదు. ప్రజల పక్షాన ఉంటూ వారి సమస్యలను పరిష్కరించడమే ధ్యేయంగా పని చేస్తున్నా. దానికి గుర్తింపుగా నాలుగు పర్యాయాలు నన్ను ఎమ్మెల్యేగా ఈ ప్రాంత ప్రజలు గెలిపించారు. టీడీపీ ప్రభుత్వంలో.. కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా, అంచనాల కమిటీ చైర్మన్‌గా ఉన్నత పదవులను చేపట్టాను. ప్రజలకు చేరువయ్యాను. నా సేవలను గుర్తించి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పిలిచి మరీ పార్టీ టికెట్ ఇచ్చారు. ఆయన ఆశీస్సులతో మరోసారి ఈ ప్రాంత ఎమ్మెల్యేగా గెలుపొందాను. ఇంతటి ప్రజాదరణ ఉన్న నేను ఏం తప్పు చేశానని నాకు ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వలేదు’ అని మాజీ మంత్రి చెరుకు ముత్యంరెడ్డి గద్గద స్వరంతో అంటూ కంటతడి పెట్టారు. దొమ్మాట, దుబ్బాక నియోజకవర్గాలకు 3 పర్యాయాలు టీడీపీ నుంచి, 2009లో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ద్వారా మొత్తం నాలుగు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలుపొందారు. అప్పట్లో రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రిగా, అంచనాల కమిటీ చైర్మన్, టీటీడీ బోర్డు సభ్యుడిగా పలు పదవులను అలంకరించారు. 2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట రామలింగారెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. అప్పటి నుండి ఇప్పటివరకు ప్రతిపక్ష నాయకుడిగా నియోజకవర్గంలో పనిచేస్తూ పార్టీ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకున్నారు. ఈ ఎన్నికల్లో పార్టీ తనకే టికెట్ ఇస్తుందని భావించి భంగపడ్డారు. మహాకూటమి పొత్తుల్లో భాగంగా దుబ్బాక స్థానాన్ని టీజేఎస్‌కు అప్పగించారు. దీనిపై కలత చెందిన ఆయన ఆదివారం కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తీరుపై అసహనం వ్యక్తం చేశారు. మహనీయులు స్థాపించిన కాంగ్రెస్ పార్టీలో నైతిక విలువలు లేకుండా పోతున్నాయని తొగుటలోని తన నివాసంలో ఆవేదన వ్యక్తం చేశారు. ఆయనను ఓదార్చేందుకు వచ్చిన మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు, మాజీ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి ఎదుట తన బాధను వ్యక్తం చేస్తూ కంటతడి పెట్టారు. విభిన్న ధ్రువాలు ఒక్కటవుతున్నాయి.. గతంలో తెలుగుదేశం పార్టీలో సీఎం కేసీఆర్, ముత్యంరెడ్డిలు ఎమ్మెల్యేలుగా కలిసి పనిచేశారు. ఒకే జిల్లాతో పాటు ఒకే రెవెన్యూ డివిజన్ పరిధిలో ఉన్న దొమ్మాట, సిద్దిపేటలలో ఎమ్మెల్యేలుగా ఉ న్న ఇరువురిలో ఒక్కరికే మంత్రి పదవి ఇవ్వాలన్న సమీకరణాలతో ముత్యంరెడ్డికి పౌరసరఫరాల శాఖ మంత్రి పదవి ఇచ్చారు. దీంతో అప్పట్లో కేసీఆర్‌కు మంత్రి పదవి దక్కలేదు. ఆ సమయంలో వీరిరువురికి మధ్య విభేదాలు తలెత్తాయి. అనంతరం కేసీఆర్ తెలంగాణ నినాదంతో టీఆర్ఎస్ పార్టీని స్థాపించారు. నాడు ఒకే పార్టీలో విరోధులుగా ఉన్న కేసీఆర్, ముత్యంరెడ్డిలు ఇప్పుడు తిరి గి మిత్రులుగా మారనున్నారు. ఇదిలా ఉంటే మూడేళ్ల క్రితం అనారోగ్యంతో బాధపడిన ముత్య ంరెడ్డికి కేసీఆర్ చికిత్స కోసం సాయం అందించారు. రాజకీయపరంగా శత్రువులుగా ఉన్నా సాయం అడిగిన వెంటనే కేసీఆర్ ఏమాత్రం ఆలోచించకుండా అందించడంతోపాటు ఇప్పుడు కాం గ్రెస్ టికెట్ దక్కక నిరాశతో ఉన్న సమయంలోనూ ఆయన్ను టీఆర్ఎస్లోకి ఆహ్వానించి పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే ఆయనను హరీశ్‌రావు, రామలింగారెడ్డిలు కలిసి విషయాన్ని వెల్లడించారు. ఎప్పుడు కూటమి ఏర్పడినా ‘ముత్యం’కు మొండిచేయి.. సార్వత్రిక ఎన్నికల సమయంలో ఎప్పుడు కూట మి ఏర్పడినా మాజీ మంత్రి ముత్యంరెడ్డికి మా త్రం మొండిచేయి చూపుతూ వచ్చారు. 2009 సాధారణ ఎన్నికల సమయంలో టీఆర్ఎస్, టీడీపీ, సీపీఐ, సీపీఎంలు మహాకూటమిగా ఏర్పడ్డాయి. ఆ సమయంలో దుబ్బాక స్థానం కూటమి నుంచి టీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న సోలిపేట రామలింగారెడ్డికి దక్కింది. దీంతో టీడీపీలో ఉన్న ముత్యంరెడ్డికి చుక్కెదురైంది. కాగా అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి.. ముత్యంరెడ్డిని పార్టీలో చేర్చుకుని కాంగ్రెస్ టికెట్ ఇవ్వడంతో ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందారు. కాగా ప్రస్తుత ఎన్నికల్లోనూ కాంగ్రెస్, టీజేఎస్, సీపీఐలు మహాకూటమిగా ఏర్పడడంతో దుబ్బాక టికెట్ ముత్యంరెడ్డికి కాకుండా టీజేఎస్‌కు కేటాయించడంతో మరోసారి ఆయనకు కూటమిలో ఎదురుదెబ్బ తగిలినట్టయింది. -
అసంతృప్తులకు గాలం
మెదక్ అసెంబ్లీ స్థానం నుంచి టీజేఎస్ పోటీ చేస్తుందని ప్రకటించడంతో కాంగ్రెస్ ఆశావహుల్లో ఆందోళన మొదలైంది. ఇన్నాళ్లు కన్న కలలపై నీళ్లు చల్లినట్లయింది. టీజేఎస్ పోటీ చేస్తుందని తెలియడంతో టీఆర్ఎస్ కార్యకర్తల్లో ఉత్సాహం రెట్టింపైంది. కాంగ్రెస్ అధిష్టానం ఈ స్థానాన్ని టీజేఎస్‌కు ఇవ్వడంపై ఆశావహులు గుర్రుగా ఉన్నారు. బీజేపీ నుంచి కూడా స్థానికేతరుడికి టికెట్ ఇవ్వనున్నారనే ప్రచారంతో స్థానిక నాయకుల్లో కూడా ఆందోళన వ్యక్తం అవుతోంది. ఈ గందరగోళ పరిస్థితిలో టీఆర్ఎస్ అసంతృప్తులను తమ పార్టీలోకి చేర్చుకునేందుకు పావులు కదుపుతున్నారు. టికెట్ దక్కని నేతలు కూడా కండువాలు మార్చేందుకు సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. సాక్షి, మెదక్ : మెదక్ అసెంబ్లీ స్థానం నుంచి తెలంగాణ జన సమితి పోటీ చేస్తుందని తెలియడంతో టీఆర్ఎస్ నాయకుల్లో ఉత్సాహం పెరిగింది. మొదటి నుంచి కాంగ్రెస్ అభ్యర్థి పోటీలో ఉంటారని టీఆర్ఎస్ భావించింది. దీంతో ఇక్కడి నుంచి టికెట్ ఆశించిన కాంగ్రెస్ పార్టీ ఆశావహుల్లో నైరాశ్యం అలముకుంది. శ్రేణులు సైతం మెదక్ సీటును వదులుకోవడంపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నాయి. పార్టీ తీరును బాహాటంగానే వారందరూ తప్పుబడుతున్నారు. అయితే తాజాగా టీజేఎస్ పేరు తెరపైకి రావడంతో కాంగ్రెస్‌లోని అసంతృప్తులను తమ వైపు తిప్పుకునేందుకు టీఆర్ఎస్ దృష్టి సారించింది. ఆశావహులతో పాటు అసంతృప్తితో ఉన్న ద్వితీయశ్రేణి నాయకులను పార్టీలో చేర్చుకునే పనిలో నిమగ్నమయ్యారు. టీఆర్ఎస్ నేత దేవేందర్‌రెడ్డి స్వయంగా కాంగ్రెస్‌లోని అసంతృప్త నేతలతో మాట్లాడుతున్నట్లు తెలుస్తోంది. తమ పార్టీలో చేరి మద్దతు ఇస్తే వారికి న్యాయం చేస్తామని కాంగ్రెస్ నేతలకు నచ్చచెబుతున్నట్లు సమాచారం. పలువురు నేతలు టీఆర్ఎస్లో చేరేందుకు సముఖంగా ఉన్నట్లు కూడా తెలుస్తోంది. కాంగ్రెస్ అభ్యర్థి బరిలో ఉండరని తెలియడంతో కాంగ్రెస్ నాయకులు సైతం పార్టీలు మారేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఎమ్మెల్యే టికెట్ ఆశించిన నేతలు కాంగ్రెస్ అధిష్టానంపై గుర్రుగా ఉన్నారు. వీరిని టీఆర్ఎస్లో చేర్చుకోవాలని టీఆర్ఎస్ అభ్యర్థి పద్మాదేవేందర్‌రెడ్డి పావులు కదుపుతున్నారు. అసంతృప్త నేతలతో ఆమె కూడా టచ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ఈనెల 19వ తర్వాత చేరికలపై స్పష్టత ఇస్తామని వారు చెప్పినట్లు సమాచారం. కాగా బీజేపీ నేతలు సైతం పార్టీ తీరుతో కొంత అసంతృప్తితో ఉన్నారు. స్థానికులకు కాకుండా మెదక్ టికెట్ ఇతరులకు అప్పగించే యోచనలో బీజేపీ అధిష్టానం ఉంది. దీన్ని పసిగట్టిన కొంత మంది బీజేపీ నాయకులు పార్టీ తీరుపై అధిష్టానంపై కోపంగా ఉన్నారు. పార్టీ తీరు నచ్చని బీజేపీ జిల్లా నాయకుడు సుభాష్‌రెడ్డి బుధవారం టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్న విషయం తెలిసిందే. ఆయన బాటలోనే మెదక్ నియోకజవర్గంలోని పలువురు బీజేపీ నాయకులు టీఆర్ఎస్లో చేరేందుకు సిద్ధం అవుతున్నట్లు సమాచారం. -
వీడని ‘ సీటు’ముడి
ఒక పక్క సోమవారం నుంచి నామినేషన్ల దాఖలు పర్వం ప్రారంభమైంది. ఇంకా మెదక్ నియోజవర్గ టికెట్‌పై కూటమిలో చిక్కుముడి వీడటం లేదు. కాంగ్రెస్, టీజేఎస్ ఈ టికెట్ తమదంటే తమదని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యను తొలగించడానికి స్నేహ పూర్వక పోటీ చేద్దామనే కొత్త ప్రతిపాదనను కాంగ్రెస్ పార్టీ, టీజేఎస్ ముందు ఉంచినట్లు తెలుస్తోంది. దీంతో కాంగ్రెస్ ఆశావహులు నామినేషన్‌కు ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు సమాచారం. టీజేఎస్ నాయకులు మాత్రం ఈ ప్రతిపాదనపై ఆసక్తి లేదన్నట్లు చెబుతున్నారు. దీంతో ఎవరికి ఈ టికెట్ వస్తుం దోనని ప్రజలు ఆసక్తిగా గమనిస్తున్నారు. సాక్షి, మెదక్: ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైనా మెదక్ నియోజకవర్గ కాంగ్రెస్ టికెట్‌పై ప్రతిష్టంభన తొలగడంలేదు. ఈ టికెట్ కోసం మొదటి నుంచి పట్టుబడుతున్న టీజేఎస్ సైతం మెట్టు దిగడం లేదు. దీంతో మధ్యేమార్గంగా మెదక్ అసెంబ్లీ నుంచి స్నేహ పూర్వక పోటీచేద్దామని కాంగ్రెస్ ప్రతిపాదిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై ఇరు పార్టీలు చర్చలు సాగిస్తున్నట్లు సమాచారం. పొత్తులో భాగంగా కాంగ్రెస్ పార్టీ టీజేఎస్‌కు ఎనిమిది అసెంబ్లీ స్థానాలు ఇవ్వనుంది. టీజేఎస్‌కు కేటాయించిన 8 స్థానాల్లో మెదక్ అసెంబ్లీ స్థానాన్ని కావాలని వారు కోరుతున్నారు. అయితే మెదక్ అసెంబ్లీ పరిధిలో కాంగ్రెస్ పార్టీకి బలమైన కేడర్ ఉండటం, ఇటీవల నిర్వహించిన వేర్వేరు సర్వేల్లో కాంగ్రెస్‌కు సానుకూల ఫలితాలు వచ్చినట్లు తెలుస్తోంది. సర్వే ఫలితాలను దృష్టిలో ఉంచుకుని మెదక్ సీటు తమకు వదిలేయాని కాంగ్రెస్ పార్టీ టీజేఎస్‌ను కోరుతున్నట్లు సమాచారం. దీనికితోడు మెదక్ టికెట్‌పై కాంగ్రెస్ నేతలు భారీగా ఆశలు పెట్టుకున్న విషయం తెలిసిందే. మాజీ ఎమ్మెల్యే శశిధర్‌రెడ్డితోపాటు కాంగ్రెస్ నాయకులు బట్టి జగపతి, సుప్రభాతరావు, బాలకృష్ణ తదితరులు పోటీచేసేందుకు ఆసక్తిగా ఉన్నారు. అయితే పొత్తులో భాగంగా మెదక్ స్థానం టీజేఎస్‌కు కేటాయిస్తున్నట్లు ప్రచారం సాగుతుండటంతో ఆశావహులంతా మాజీ ఎంపీ విజయశాంతిని ఆశ్రయించారు. మెదక్ సీటు ఎట్టిపరిస్థితుల్లో కాంగ్రెస్‌కు దక్కేలా చూడాలని, తమలో ఎవరికి టికెట్ ఇప్పించినా కలిసికట్టుగా పనిచేసి పార్టీ గెలుపుకోసం కృషి చేస్తామని వారు విజయశాంతిపై వత్తిడి తీసుకువస్తున్నారు. దీంతో విజయశాంతి చొరవ తీసుకుని స్నేహ పూర్వక పోటీ అంశాన్ని తెరపైకి తీసుకువచ్చినట్లు తెలుస్తోంది. 14న నామినేషన్.. మెదక్ నియోజకవర్గంలో కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉన్నందున కాంగ్రెస్, టీజేఎస్ స్నేహ పూర్వకపోటీ చేసేలా చూడాలని అధిష్టానం నేతలకు చెప్పినట్లు తెలుస్తోంది. స్నేహ పూర్వక పోటీ అంశంపై హైదరాబాద్‌లో కాంగ్రెస్ నేతలు, టీజేఎస్ నేతలు సోమవారం చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. స్నేహపూర్వక పోటీ అంశం తెరపైకి రావడంతో కాంగ్రెస్ నేతల్లో మెదక్ టికెట్‌పై మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి. టీజేఎస్ ఈ పోటీకి అంగీకరిస్తే బరిలో దిగేందుకు ఆశావహులు ఎవరికివారే సిద్ధం అవుతున్నారు. మాజీ ఎమ్మెల్యే శశిధర్‌రెడ్డి ఏకంగా ఈనెల 14న కాంగ్రెస్ పార్టీ నుంచి నామినేషన్ వేయనున్నట్లు ప్రకటించారు. సోమవారం మెదక్‌లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, మద్దతుదారులతో సమావేశమైన ఆయన 14న నామినేషన్ వేయనున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ బీ ఫామ్ తనకే దక్కుతుందని ధీమా సైతం వ్యక్తం చేశారు. మెదక్‌లో కాంగ్రెస్, టీజేఎస్ మధ్య స్నేహ పూర్వక పోటీ దిశగా అడుగులు పడుతున్నాయని, తాను స్వతంత్ర అభ్యర్థిగా కాకుండా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలో ఉండటం ఖామయని చెప్పారు. కాగా టీజేఎస్ జిల్లా అధ్యక్షుడు జనార్దన్‌రెడ్డి మాత్రం స్నేహపూర్వక పోటీ ఉండే అవకాశం లేదని చెబుతున్నారు. స్నేహపూర్వక పోటీ ప్రతిపాదనను కాంగ్రెస్ తీసుకువచ్చిందని, అయితే తమ పార్టీ ఆసక్తిచూపడం లేదన్నారు. -
హవ్వ.. నవ్విపోదురుగాక..!
సాక్షి ప్రతినిధి, కడప: ‘పిల్లి పాలు తాగుతూ కళ్లు మూసుకుంటుందంట.. అచ్చం అలానే తెలుగుదేశం పార్టీ వ్యవహరిస్తోంది. టీడీపీ సభ్యత్వమే లేని వ్యక్తికి అసెంబ్లీ టికెట్ కట్టబెట్టడం ఒక ఎత్తయితే.. పార్టీ నిర్ణయాన్ని అతిక్రమించారంటూ ఆపై సస్పెండ్ చేయడం మరో ఎత్తు. వెరసి సరికొత్త కపటనాటకాన్ని తెలుగుదేశం పార్టీ తెరపైకి తెచ్చింది. కడప అసెంబ్లీ టీడీపీ అభ్యర్థి దుర్గాప్రసాద్ వ్యవహారం అందుకు నిదర్శనంగా నిలుస్తోంది. కడప నగరంలో పారిశ్రామికవేత్తగా దుర్గా మల్లికార్జున రావుకు పేరుంది. రాజకీయాలకు అతీతంగా, వివాదస్పద కార్యక్రమాలకు దూరంగా మెలిగేవారు. అయితే అనూహ్యంగా ఈమారు ఎన్నికల్లో కడప తెరపైకి వచ్చారు. అందుకు కారణం తెలుగుదేశం పార్టీ తెరవెనుక హామీలు, ప్రోత్సాహాలేనని పలువురు పేర్కొంటున్నారు. దుర్గా ప్రసాద్ పేరు ఇప్పటి వరకూ అతి కొద్దిమందికి మాత్రమే తెలుసు. సన్ఆఫ్ దుర్గా మల్లికార్జునరావు అని చెబితే తప్పా జనానికి తెలియని వ్యక్తి. ఏనాడూ రాజకీయ కార్యక్రమాల్లో తిరిగిన వ్యక్తి కాదు. ఏరాజకీయ పార్టీ సభ్యత్వం తీసుకోలేదు.. అలాంటి వ్యక్తి ఏకంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా కడప అసెంబ్లీకి నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్తోపాటే టీడీపీ బీఫారాన్ని కూడా రిటర్నింగ్ ఆఫీసర్‌కు అందించారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఎన్నికల బరిలో ఇప్పటికీ కొనసాగుతున్నారు. తెరపైకి వచ్చిన సరికొత్త నాటకం... తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ ఎన్నికల పొత్తు కుదుర్చుకున్నాయి. అందులో భాగంగా సీమాంధ్రలో 13 అసెంబ్లీ, 4పార్లమెంటు స్థానాలను బీజేపీకి కేటాయించారు. ఆమేరకు కడప అసెంబ్లీ, రాజంపేట పార్లమెంటు స్థానాలను బీజేపీకి కేటాయించారు. కడప బీజేపీ అభ్యర్థి అల్లపురెడ్డి హరినాథరెడ్డి బలహీనుడంటూ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా దుర్గా ప్రసాద్చే నామినేషన్ దాఖలు చే యించారు. అప్పటి వరకూ రాజకీయాల వాసనే పట్టని దుర్గా ప్రసాద్ ఒక్కమారుగా అభ్యర్థిగా తెరపైకి రావడం వెనుక తెలుగుదేశం పార్టీ నేతల ప్రోత్సహమే కారణంగా విశ్లేషకులు పేర్కొంటున్నారు. పొత్తు ఉన్న చోట పోటీ చేయించడం అన్యాయమని వెంటనే నామినేషన్‌ను ఉపసంహరించుకోవాలని బీజేపీ అగ్రనేతల ద్వారా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుపై అల్లపురెడ్డి హరినాథరెడ్డి తీవ్రస్థాయిలో ఒత్తిడి తెచ్చారు. అప్పట్లో ఏమాత్రం స్పందించని చంద్రబాబు ప్రస్తుతం సరికొత్తగా బీజేపీకి కేటాయించిన సీట్లలో పోటీలో ఉన్న టీడీపీ అభ్యర్థులను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు శనివారం ప్రకటించారు. ప్రస్తుతం సస్పెన్షన్ నాటకాన్ని రక్తికట్టిస్తుండటంపై తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పొత్తులోనూ కరువైన చిత్తశుద్ధి.... బీజేపీ, టీడీపీ పొత్తులో సైతం చంద్రబాబు తన సహజ దోరణి వీడలేదని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. బీజేపీకి కేటాయించిన స్థానంలో టీడీపీ అభ్యర్థిగా పార్టీలో ఉన్న నాయకుడు పోటీ చేసి ఉంటే అదోరకంగా భావించే అవకాశం ఉంది. ఇంతకాలం కష్టపడ్డ మమ్మల్ని విస్మరిస్తారా.. అన్న ప్రశ్న తలెత్తడంతో టీడీపీ నేతలు పోటీ చేశారనే భావన రావచ్చు. అయితే రాజకీయాలకు దూరంగా ఉన్న దుర్గా ప్రసాద్‌కు నామినేషన్ వేయమని ఏకంగా బీఫారం సహా చేతిలో పెట్టింది టీడీపీనే అన్న విషయం మరుగునపర్చారు. బీజేపీ అభ్యర్థించినా నిమ్మకునీరెత్తినట్లుగా వ్యవహరించి ప్రస్తుతం సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. దుర్గా ప్రసాద్ సస్పెండ్ చేస్తే ఇప్పుడేమైనా టీ డీపీ అభ్యర్థి కాకుండా పోతారా.. ఎన్నికల్లో సైకిల్ గుర్తు దక్కకుండా పోతుందా..ఇవేవి కానప్పడు సరికొత్త కపటనాటకం కాక మరేమిటని భారతీయ జనతా పార్టీ నాయకులు నిలదీస్తున్నారు. సీమాంధ్రలో బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీ ఎన్నికల ప్రచారానికి రానున్న నేపధ్యంలోనే ఈ నాటకానికి బీజం పడిందని వారు పేర్కొంటున్నారు. ప్రస్తుతం టీడీపీ నేతల కొత్త పల్లవికి కారణం కూడా అదేనని తెలుపుతున్నారు. సభ్యత్వం సైతం లేని వ్యక్తిచే నామినేషన్ వేయించడం, బీఫారం అందించడం, ఇప్పుడు సస్పెండ్ అనడంపై ప్రజానీకం నవ్విపోతారనే ఇంగితం సైతం లేదని టీడీపీ సీనియర్ నాయకుడు ఒకరు పేర్కొనడం గమనార్హం. -
భగ్గుమన్న తమ్ముళ్లు
ప్రొద్దుటూరు, న్యూస్‌లైన్: పార్టీలోకి కొత్తగా వచ్చిన మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డికి ప్రొద్దుటూరు అసెంబ్లీ టికెట్‌ను కేటాయించడంపై తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్యే మల్లేల లింగారెడ్డి ఇంటి వద్ద శుక్రవారం ఉదయం పార్టీ ప్రచార సామగ్రిని దగ్ధం చేసి నిరసన వ్యక్తం చేశారు. ప్రొద్దుటూరు అసెంబ్లీ టికెట్‌పై కొద్ది రోజులుగా నాన్చుతూ వచ్చిన చంద్రబాబు నాయుడు 5వ విడత జాబితాలో వరదరాజులరెడ్డికి టికెట్ కేటాయిస్తూ శుక్రవారం ఉదయమే నిర్ణయం తీసుకున్నారు. టీవీల్లో వార్తలు ప్రసారం కావడం ద్వారా విషయం తెలుసుకున్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఉదయాన్నే లింగారెడ్డి ఇంటి వద్దకు చేరుకున్నారు. ఇదే విషయంపై చంద్రబాబుతో అమీతుమీ తేల్చుకునేందుకు గురువారం రాత్రి హైదరాబాద్‌కు లింగారెడ్డి వెళ్లారు. ఆయన హైదరాబాద్‌లో ఉండగానే వరదకు టికెట్ కేటాయించారు. దీంతో కార్యకర్తలు మండిపడ్డారు. జిల్లా అధ్యక్షునిగా ఉన్న లింగారెడ్డికి టికెట్ కేటాయించకపోవడం ఏమిటంటూ తీవ్ర ఆగ్రహంతో కార్యకర్తలు లింగారెడ్డి నివాస గృహం కింద ఉన్న పార్టీ కార్యాలయంలోని జెండాలు, టోపీలు, కండువాలు, పోస్టర్లతోపాటు సైకిల్‌కు కూడా నిప్పంటించారు. పోలీసులు వచ్చి వారించినా వారి ఆగ్రహం చల్లారలేదు. తొలి నుంచి లింగారెడ్డి పార్టీకి వెన్నుదన్నుగా నిలిచాడని, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో కూడా పార్టీని వీడకుండా కష్టపడి పనిచేశారన్నారు. అలాంటి నేతను కాదని కొత్తగా పార్టీలోకి వచ్చిన వరదరాజులరెడ్డికి టికెట్ కేటాయించడం ఏమిటని తెలుగుతమ్ముళ్లు ప్రశ్నించారు. కంటతడి పెట్టిన తనయుడు తెలుగుదేశం పార్టీ టికెట్ తన తండ్రికి కాకుండా వరదరాజులరెడ్డికి కేటాయించడంపై మల్లేల లింగారెడ్డి తనయుడు హర్షవర్ధన్‌రెడ్డి కంటతడిపెట్టారు. మెడిసిన్ చదువుతున్న హర్షవర్ధన్‌రెడ్డి గడిచిన మున్సిపల్, జెడ్పీటీసీ ఎన్నికల్లో పార్టీకి అండగా నిలిచి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంత కాలం పార్టీ కోసం పనిచేసినందుకు ఇదేనా గుర్తింపు అని అన్నారు. కష్టకాలంలో పార్టీకి అండగా నిలిచి మా కుటుంబం ఎంతో సేవ చేసిందన్నారు. ఇంత కాలం పార్టీ కోసం పనిచేసిన లింగారెడ్డికి అన్యాయం జరిగిందంటూ పల్లా లక్ష్మిదేవి అనే కార్యకర్త బోరున విలపించారు. నాయకులు ఓదార్చినా ఆమె ఏడుపును ఆపలేకపోయారు. -
ఎడవెల్లికి షాక్
పాపం ఎడవెల్లి.. బుధవారం ఆయన పరిస్థితి చూసిన ఎవరైనా ఈ మాట అనకుండా మానరు. పార్టీ టికెట్ ప్రకటించి, తీరా నామినేషన్ వేసేందుకు వెళ్లాక బీఫారం మరొకరికి కేటాయిం చడంతో ఎడవెల్లి విజయేందర్‌రెడ్డి బిత్తరపోయారు. గతంలో కాంగ్రెస్, ఇప్పుడు బీజేపీలో ఆయన భంగపాటుకు గురయ్యారు. కరీంనగర్ అర్బన్, న్యూస్‌లైన్ : కరీంనగర్‌కు చెందిన ప్రముఖ పిల్లల వైద్యనిపుణులు ఎడవెల్లి విజయేందర్‌రెడ్డి 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ ఆశచూపడంతో కరీంనగర్లో సోనియాగాంధీ ఎన్నికల బహిరంగ సభ, పార్టీ ఇతర కార్యక్రమాలను సొంత ఖర్చులతో విజయవంతం చేశారు. కాంగ్రెస్ కరీంనగర్ అసెంబ్లీ టికెట్ ఖాయమనుకుంటున్న దశలో పార్టీ సీనియర్ నేత ఎమ్మెస్సార్‌కు టికెట్ కేటాయించారు. అప్పు డు విజయేందర్‌రెడ్డిని బుజ్జగించిన వైఎస్ రాజశేఖరరెడ్డి పార్టీలో పదవి అప్పగించారు. అప్పటినుంచాలా రోజులు కాంగ్రెస్‌లోనే కొనసాగిన ఆయన ఇటీవలి పరిణామాలతో బీజేపీవైపు మొగ్గు చూపారు. కరీంనగర్ అసెంబ్లీ టికెట్ ఇస్తామని నమ్మబలకడంతో గతేడాది నవంబర్‌లో కిషన్‌రెడ్డి సమక్షంలో భారీ బహిరంగ సభలో విజయేందర్‌రెడ్డి బీజేపీలో చేరారు. గ్రూపు రాజకీయాలతో సతమతమవుతున్న పార్టీని ఆయన ఒక్కతాటిపైకి తెచ్చారు. టికెట్ ఖాయమనుకుంటున్న దశ లో... ఆయనకు మొండిచెయ్యి చూపారు. పార్టీ పనులకు ఉపయోగించుకుని తీరా టికె ట్ సమయంలో చేతులెత్తేశారు. కరీంనగర్ టికెట్ మరొకరికి కేటాయించి హుస్నాబాద్నుంచి విజయేందర్‌రెడ్డిని పోటీ చేయమని సూచించారు. ఈ మేరకు అక్కడినుంచి నామినేషన్ వేసేందుకు వెళ్లగా తీరా బీఫామ్ మరొకరికి ఇచ్చారు. కోరుకున్న చోట టికెట్ ఇవ్వకుండా... పార్టీ చెప్పిన చోట బీ ఫామ్ ఇవ్వకుండా చేయడంతో ఆయన తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. క్రమశిక్షణకు మారుపేరైన బీజేపీలో టికెట్ల కేటాయింపు ఇంత గందరగోళంగా జరగడంపై తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. పార్టీ కోసం పనిచేస్తున్న వారిని కాదని వలసవాదులకు పట్టం కట్టడాన్ని కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు. విజ యేందర్‌రెడ్డి తండ్రి జగ్గారెడ్డి ఆర్ఎస్ఎస్, బీజేపీలో సీనియర్ నాయకులుగా సేవలందించారు. కరీంనగర్లో ఆ పార్టీని బలమైన శక్తిగా ఎదిగేలా చేశారనే పేరు ఆయనకు ఉం ది. పార్టీటికెట్ ఇస్తామని సాక్షాత్తూ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి స్వయంగా ప్రకటించడంతో విజయేందర్‌రెడ్డి పార్టీని భుజస్కందాలపై వేసుకుని నడించారు. పార్టీకి జిల్లా కేంద్రంలో కార్యాలయం లేకపోవడంతో తన ఇంటినే పార్టీ కార్యాలయ నిర్వహణకు అప్పగించారు. ఇటీవల కార్పొరేషన్ ఎన్నికల్లో అభ్యర్థుల విజయానికి ప్రచారం నిర్వహించారు. తీరా సమయానికి పార్టీ మొండిచేయి చూపుతోందనే అనుమానం రావడంతో కార్యకర్తలంతా వెళ్లి రెండు రోజుల క్రితం హైదరాబాద్‌లో ఆందోళన నిర్వహించారు. అయినా పార్టీ కరుణించకపోవడంతో డాక్టర్ తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. పార్టీ కోసం కష్టపడ్డా గుర్తింపు దక్కకపోవడం... టికెట్ కేటాయించినట్లు చెప్పి తీరా బీఫామ్ ఇవ్వకపోవడాన్ని ఆయన జీర్ణించుకోలేకపోతున్నారు. చివరకు కరీంనగర్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేశారు. -
చిత్తూరు ‘దేశం’లో ముసలం
ఎమ్మెల్యే టికెట్టు డీకే.సత్యప్రభకే జంగాలపల్లికి చేయిచ్చిన చంద్రబాబు అసంతృప్తిలో జంగాలపల్లి వర్గం సాక్షి,చిత్తూరు: చిత్తూరు అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీలో ము సలం ప్రారంభమైంది. పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు టికెట్టు ప్రకటించేవరకు ఎవరికీ గ్యారెంటీ లేదన్నట్లుగా పరిస్థితి తయారైంది. చిత్తూరు అసెంబ్లీ టికెట్టు ఆశిస్తున్న పార్టీ జిల్లా అధ్యక్షుడు జంగాలపల్లి శ్రీనివా సులుకే బాబు చేయిచ్చారు. ఎన్నికలకు ముందు పార్టీలో చేరిన డీకే.ఆదికేశవులు భార్య డీకే.సత్యప్రభకు చిత్తూరు అసెంబ్లీ టిక్కెట్టు ఖరారు చేసేందుకు చంద్రబాబు సుముఖంగా ఉన్నట్లు సమాచారం. జంగాలపల్లి శ్రీనివాసులు(జేఎంసీ) ప్రారంభంలో టీడీపీలో ఉండి ఆ తరువాత చిరంజీవి ప్రజారాజ్యం పెట్టాక అందులోకి వెళ్లారు. తిరిగి పార్టీలోకి వచ్చాక, ఆయనకు జిల్లా టీడీపీ నాయకత్వ బాధ్యతలను చంద్రబాబు అప్పగించారు. దీనితో జిల్లా అధ్యక్షుడుగా ఉన్న తనకు అసెంబ్లీ సీటుకు ఢోకాలేదని భావించారు జంగాలపల్లి. చిత్తూరు తెలుగుదేశంలోని కొంతమంది నాయకుల ప్రోద్బలంతోనే ఆదికేశవులు నాయుడు భార్య డీకే. సత్యప్రభ, కుమారుడు డీకే.శ్రీనివాస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ క్రమంలో జంగాపల్లిని సైడ్ చేసి, వీరి కుటుంబానికే ఎమ్మెల్యే టికెట్టు ఇవ్వాలనేది ఎన్టీఆర్ ట్రస్టు భవన్లో జరిగిన నిర్ణయంగా పార్టీ నాయకులు చెబుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న జంగాలపల్లి చంద్రబాబును కలిసి టికెట్టు విషయం ప్రస్తావించగా సరైన హామీ లభించనట్టు తెలిసింది. భవిష్యత్‌లో మంచి పదవి ఇస్తానని హామీ ఇచ్చినట్టు సమాచారం. ఇదే నిజమైతే ఇప్పటి వరకు జిల్లా పార్టీ భారం మోసిన జంగాలపల్లికి చంద్రబాబు చేయిచ్చినట్లే. అందరూ కలిసి పని చేయాలని పార్టీ అధినేత చెప్పినా చిత్తూరు నియోజకవర్గంలో తెలుగుదేశం నాయకులు కలిసి పనిచేసే పరిస్థితి కనపడడం లేదు. జంగాలపల్లికి అసెంబ్లీ టికెట్టు ఇవ్వకుండా చేయాలని చంద్రబాబు సామాజికవర్గానికి చెందిన ఒకరిద్దరు నాయకులు మొదటి నుంచీ పావులు కదుపుతూ వచ్చారు. ఈ క్రమంలో అనూహ్యంగా డీకే.ఆదికేశవులు భార్య డీకే.సత్యప్రభ, కుమారుడు డీకే.శ్రీనివాస్‌ను తెరపైకి తెచ్చారు. ఇందులో గుడిపాల మండలంలోని ఒక సామాజికవర్గానికి చెందిన నాయకుల పాత్ర కూడా కీలకంగా ఉందని తెలుగుతమ్ముళ్లు చెబుతున్నారు. తొలి నుంచి తమ నాయకుడికే అసెంబ్లీ టికెట్టు వస్తుందని నమ్ముకున్నాం, ఇప్పుడు చంద్రబాబు రిక్తహస్తం చూపించడం సరికాదని జంగాలపల్లె అనుచరవర్గం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రభావం అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి గెలుపుపై చూపించనుంది. -
‘తమ్ముళ్ల’కు గోతులు కొరకరాని కొయ్యలా టీజీ
సాక్షి ప్రతినిధి, కర్నూలు: కాంగ్రెస్ పార్టీపై విభజన ముద్ర పడటంతో ప్రజాదరణ కలిగిన వైఎస్ఆర్సీపీలో చోటు లేక టీడీపీలో రాజకీయ ఆశ్రయం పొందిన నేతలు పట్టు కోసం పావులు కదుపుతున్నారు. ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంతో సంతృప్తి చెందక.. పక్క నియోజకవర్గాల్లోనూ పెత్తనం చెలాయించేందుకు సిద్ధమవుతున్నారు. ఆయా అసెంబ్లీ టిక్కెట్ల కేటాయింపులో చక్రం తిప్పడం ద్వారా కింగ్‌మేకర్ ముద్ర వేయించుకునేందుకు తాపత్రయ పడుతున్నారు. వీరి తీరుతో ఇప్పటి వరకు పార్టీనే నమ్ముకుని పనిచేస్తున్న తెలుగుతమ్ముళ్లు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. మాజీ మంత్రి టి.జి.వెంకటేష్ ఇటీవల కాంగ్రెస్‌ను వీడి టీడీపీలో చేరడం తెలిసిందే. ఈయన కర్నూలు అసెంబ్లీ నుంచి పోటీకి సిద్ధమవుతున్నారు. అయితే డోన్, ఆదోని స్థానాలకు అభ్యర్థుల విషయంలోనూ ఆయన చక్రం తిప్పుతున్నారు. ఆదోని నుంచి కుమారుడు టీజీ భరత్‌ను పోటీ చేయించేందుకు మంతనాలు సాగిస్తున్నట్లు తెలిసింది. ఈ విషయాన్ని ఇప్పటికే పార్టీ అధినేత చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకెళ్లి టిక్కెట్ ఇస్తే గెలుపు బాధ్యత తానే తీసుకుంటానని భరోసా ఇచ్చినట్లు చర్చ జరుగుతోంది. అదేవిధంగా అనంతపురం జిల్లాకు చెందిన ఎమ్మెల్యే మధుసూదన్‌గుప్తకు డోన్ టిక్కెట్ కోసం కూడా టీజీ ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు సమాచారం. భరత్, గుప్తలకు సీట్లిస్తే ఆయా స్థానాల్లో ఖర్చుతో పాటు కర్నూలు పార్లమెంట్ వ్యయంలోనూ పాల్పంచుకుంటామనే తన రహస్య ఎజెండాను టీజీ అధినేత ఎదుట ఉంచినట్లు పార్టీ వర్గాలు కోడై కూస్తున్నాయి. ఆ మేరకు అధినేత సమాలోచన చేస్తున్నారని వినికిడి. ఈ విషయం బయటకు పొక్కడంతో తమ్ముళ్లు జీర్ణించుకోలేకపోతున్నారు. డోన్ నుంచే పోటీ చేస్తానని సిట్టింగ్ ఎమ్మెల్యే, పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు కేఈ కృష్ణమూర్తి ప్రకటించగా.. ఆదోనిలో సిట్టింగ్ ఎమ్మెల్యే మీనాక్షినాయుడు మరోసారి పోటీకి ఉవ్విళ్లూరుతున్నారు. వీరిరువురూ ప్రచారాన్ని కూడా ముమ్మరం చేశారు. వీరిరువురూ క్షేత్ర స్థాయిలో పర్యటిస్తుండగానే టీజీ వారికి గోతులు తవ్వుతుండటం పార్టీలో చర్చనీయాంశమైంది. టీజీకి అడ్డుకట్ట వేయకపోతే పార్టీకి అంతా తానే అన్నట్లుగా తయారవుతారని తమ్ముళ్లు అభిప్రాయపడుతున్నారు. ఆ మేరకు ఆయనకు చెక్ పెట్టేందుకు తమ్ముళ్లు అధినేత వద్ద ‘పంచాయితీ’ పెట్టనున్నట్లు తెలిసింది. -
టీడీపీలో బిగుసుకుంటున్న సీటు ముడి!
సాక్షి ప్రతినిధి, విజయనగరం : లోక్‌సభకు పోటీచేయాలని సిట్టింగ్ ఎమ్మెల్యే పూసపాటి అశోక్ గజపతిరాజును చంద్రబాబు ఆదేశించడంతో విజయనగరం అసెంబ్లీ టిక్కెట్‌పై ద్వితీ య శ్రేణి నాయకుల కన్ను పడింది. వేగుల ద్వారా పరిణామాలను ముందే తెలుసుకున్న మీసాల గీత వ్యూహాత్మకంగా రాయబారాన్ని పంపారు. అశోక్ గజపతిరాజుకు తెలియకుండా బాబుతో మంతనాలు సాగించారు. ఎమ్మెల్యే టిక్కెట్ ఇస్తానంటే టీడీపీలో చేరుతానని సంప్రదింపులు చేశారు. ఆ మేరకు కుదిరిన ఒప్పం దంతో కాంగ్రెస్‌కు రాజీనామా చేసి టీడీపీ కండువా వేసుకున్నారు. దీంతో టీడీపీ నాయకులు కంగుతిన్నా రు. నిన్నటి వరకు అనేక ఇబ్బందులు పెట్టిన నాయకురాల్ని పార్టీలో ఎలా చేర్చుకుంటారని, ఆమెకు టిక్కెట్ ఇస్తే తాము పనిచేయమని కరాఖండీగా చెప్పేశారు. అసెంబ్లీకి ఇక్కడ నుంచి అశోక్ గజపతిరాజే పోటీ చేయాలని, ఒకవేళ కాదూకూడదంటే పార్టీలో దీర్ఘకాలికంగా పనిచేస్తున్న నాయకులకు ప్రాధాన్యం ఇవ్వాలని ద్వితీయశ్రేణి నేతలు కోరుతున్నారు. ఈ క్రమంలోనే ప్రసాదుల రామకృష్ణ, కర్రోతు నర్సింగరావు టిక్కెట్ రేసులోకి వచ్చారు. టికెట్ కోసం అధిష్టానానికి దరఖాస్తు చేసుకున్నారు. ఇంతలో సిటీ కేబుల్ ఎండీ శ్రీనివాసరావు కూడా పార్టీలో చేరారు. తాను కూడా ఎమ్మెల్యే రేసులో ఉన్నానంటూ పరోక్ష సంకేతాలు పంపించారు. అందరూ అడుగుతుంటే తానెందుకు మౌనంగా ఉండాలని మాజీ కౌన్సిలర్ డాక్టర్ వి.ఎస్.ప్రసాద్ కూడా రేసులోకి వచ్చినట్టు తెలిసింది. గీత తీరుతో ఇరకాటం మీసాల గీత టీడీపీలోకి చేరిన దగ్గరి నుంచే తనదైన ముద్ర వేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. పార్టీలో చేరినప్పుడు అశోక్ గజపతిరాజు ఫొటో లేకుండా వేసిన పలు ప్లెక్సీలు పట్టణంలో దర్శనమిచ్చాయి. గమనించి న టీడీపీ నేతలు వెంటనే జోక్యం చేసుకోవడంతో ఆయా ప్లెక్సీలపై అశోక్ బొమ్మ కన్పించేలా తాత్కాలిక ఏర్పాట్లు చేశారు. ఆ తర్వాత ప్రచార సభలు, పార్టీ కార్యక్రమాల్లో కూడా తన వ్యక్తిగత డబ్బా కొట్టుకోవడా న్ని టీడీపీ నాయకులు తట్టుకోలేకపోతున్నారు. మున్సిపల్ చైర్‌పర్సన్‌గా తానున్న హయాంలోనే పట్టణంలో అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని, మిగతా వారీ హయాంలో అంతగా జరగలేదన్నట్టుగా మాట్లాడటాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ముఖ్యంగా టీడీపీ పాలకవర్గం హయాంలో ఏమీ జరగలేదనే సంకేతాలు బయటికొస్తుండడంతో అభద్రతాభావానికి లోనైన టీడీపీ నేత లు మీసాల గీతపై మరింత అక్కసుకు లోనయ్యారు. తమకు ఇష్టం లేకపోయినా పార్టీలోకి తీసుకొచ్చారని, ఇప్పుడామె ఏకుమేకై కూర్చొన్నారని క్యాడర్ భావిస్తోంది. ఇప్పుడే ఇలా ఉంటే ఎమ్మెల్యే టిక్కెట్ ఇస్తే ఇంకెంత ముదిరిపోతారోనన్న భయం టీడీపీ నాయకులకు పట్టుకుంది. ఇదంతా పార్టీ జిల్లా నాయకత్వం దృష్టికి రావడంతో మేల్కొన్నట్టు తెలిసింది. మీసాల గీతపై తీవ్ర వ్యతిరేకత ఉండటం, మిగతా ఆశావహుల్లో అంత సీన్ లేకపోవడంతో పునరాలోచనలో పడినట్టు తెలుస్తోంది. అంతర్గత పోరు మధ్య ఒకరికి టిక్కెట్ ఇస్తే చేటేనని, అదే పొత్తు పార్టీ బీజేపీకి ఇచ్చేస్తే ఏ ఇబ్బందులుండవనే ఆలోచనకొచ్చినట్టు తెలిసింది. బీజేపీ కూడా పొత్తులో భాగంగా జిల్లా నుంచి ఒక టిక్కెట్ ఆశిస్తుండడం, అందులో విజయనగరమైతే మరింత బాగుంటుందనే అభిప్రాయంతో మనసులో మాట అధిష్టానానికి చెప్పినట్టు తెలిసింది. దీంతో విజయనగరం తమకు కేటాయించాలని బీజేపీ అదిష్టానం డిమాండ్ చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. -
నువ్వా- నేనా?
తిరుపతి దేశం నేతల్లో విభేదాలు కడుపులో కత్తులు పెట్టుకుని పైకి కౌగిలించుకుంటున్న నాయకులు సాక్షి, తిరుపతి: తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీలో కుమ్ములాటలు తీవ్రమయ్యాయి. టికెట్టు తనకే అని చదలవాడ కృష్ణమూర్తి ధీమాగా ప్రకటిస్తున్నారు. భూకబ్జాదారులకు టికెట్టు వచ్చే ప్రసక్తే లేదని పరోక్షంగా వెంకటరమణను విమర్శిస్తున్నారు. వెంకటరమణ మాత్రం బయటపడకుండా తన ప్రయత్నాలు తాను చేస్తున్నారు. మరోవైపు తనకు సేవారంగంలో మంచి గుర్తింపు ఉందని, కొత్తవాడినైన తనకు టికెట్టు ఇవ్వాలని డాక్టర్ హరిప్రసాద్ కోరుతున్నారు. బాబు ఎవరికీ హామీ ఇవ్వకుండా ఉండేసరికి ఎవరికి వారు వేర్వేరుగా ప్రచారం చేసుకుంటున్నారు. విషయమేంటంటే ఒకరి తరువాత ఒకరుగా పార్టీలో చేరిన నాయకుల మధ్య సఖ్యత లేకపోగా అప్పటికే పార్టీ జెండాలు భుజాన వేసుకున్న శ్రేణులతో వీరికి అసలు పొసగడం లేదు. ఈ నాయకులంతా ఒకే సామాజికవర్గానికి చెందిన వారు కావడంతో ఒకరి గుట్టు ఒకరికి ఏదో రకంగా చేరిపోతోంది. దీంతో ఆయా నాయకులు కడుపులో కత్తులు పెట్టుకుని కౌగిలించుకునే పరిస్థితి ఉంది. నియోజకవర్గ పార్టీ ఇన్చార్జిగా వ్యవహరిస్తూ అభ్యర్థిగా ఎన్నికల ప్రచారం చేసుకుంటున్న చదలవాడ కృష్ణమూర్తి, పీఆర్పీ మాజీ నేత ఊకా విజయకుమార్, కాంగ్రెస్ నుంచి టీడీపీ గొడుగు కిందకు చేరిన మాజీ ఎమ్మెల్యే వెంకటరమణ, డాక్టర్ హరిప్రసాద్ తదితరులు ఎవరికి వారు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అందరూ టికెట్టు ఆశిస్తున్న వారే కావడం గమనార్హం. వీరంతా పూర్వపు పరిచయాలను ఉపయోగించుకుని ఒకరి శిబిరం గురించి మరొకరు ఆరా తీస్తున్నారు. కొందరు కార్యకర్తలకు ఇదే పనిగా మారింది. పగలంతా ఒక నేతతో ఉంటూ రాత్రికి మరో నేత దగ్గరకు వెళ్లి అక్కడి విషయాలు పూసగుచ్చినట్టు వివరిస్తున్నట్టు తెలిసింది. ఇటువంటి కోవర్టులను అందరు నాయకులు ప్రోత్సహిస్తున్నారు. ఫలితంగా పరస్పర ఆరోపణలకు కూడా దిగుతున్నారు. మాజీ ఎమ్మెల్యే వెంకటరమణను భూకబ్జా కోరుగా చదలవాడ కృష్ణమూర్తి అభివర్ణించారు. ఆయన అనుచరులతో కూడా వెంకటరమణపై ఆరోపణలు చేయించారు. దీంతో తిరుపతి టీడీపీలోని లుకలుకలు బయటపడుతున్నాయి. కొత్తగా పార్టీలో చేరిన వారు ఎవరి ఇష్టానుసారం వాళ్లు కార్యక్రమాలు నిర్వహిస్తే సహించేది లేదంటూ హెచ్చరికలు చేసుకునే పరిస్థితి ఏర్పడింది. ఎవరికి టికెట్టు ఇచ్చినా మిగిలిన వారు పనిచేస్తారనే నమ్మకం పార్టీ శ్రేణుల్లో లేదు. టీటీడీ వేదపండితులతో సుజనాచౌదరికి ఆశీర్వాదం కాంగ్రెస్ పార్టీ నుంచి ఇటీవల టీడీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే ఎం.వెంకటరమణ అసెంబ్లీ టికెట్టు కోసం పడరానిపాట్లు పడుతున్నారు. ఉగాది పర్వదినం రోజున తిరుపతి నుంచి వెంటబెట్టుకుని వెళ్లిన టీటీడీ వేదపండితులతో రాజ్యసభ సభ్యులు సుజనాచౌదరికి ఆశీర్వాదాలు అందజేసినట్టు తెలిసింది. జిల్లాలో అసెంబ్లీ టిక్కెట్ల వ్యవహారాల బాధ్యతలు చూస్తున్న సుజనాచౌదరిని మచ్చిక చేసుకునేందుకు మాజీ ఎమ్మెల్యే వేసిన ఎత్తుగడగా చదలవాడ వర్గీయులు విమర్శిస్తున్నారు. కాగా ఊకా విజయకుమార్, డాక్టర్ హరిప్రసాద్‌లను తన వైపు తిప్పుకునేందుకు వెంకటరమణ విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. చదలవాడకు వ్యతిరేకంగా అందరిని ఒకతాటిపైకి తీసుకురావడం ద్వారా తనకు ఎదురులేకుండా చేసుకునేందుకు వెంకటరమణ పావులు కదుపుతున్నారు. మొత్తానికి తిరుపతి టీడీపీలో జరుగుతున్న పరిణామాలు ఇతర పార్టీల వారికి వినోదంగా మారాయి. -
కాంగ్రెస్‌లో ‘ఖమ్మం’ లొల్లి!
ఖమ్మం, న్యూస్‌లైన్: ఖమ్మం అసెంబ్లీ టి కెట్ కోసం కాంగ్రెస్ పార్టీలో లొల్లి తారస్థాయికి చేరింది. రాజ్యసభ సభ్యురాలు రేణుకాచౌదరి, మాజీమంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి వర్గీయుల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. టికెట్ ఆశిస్తున్నవారితోపాటు వారి మద్దతుదారులు కూడా హస్తినలో చేరి ఎవరికి వారు ఎత్తులుపైఎత్తులు వేస్తున్నారు. ఏవర్గానికి ఆవర్గమే తమతమ అభ్యర్థులకు ఉన్న అర్హతలు, ఎదుటివారి బలహీనతలు ఢిల్లీ పెద్దలముందు ఏకరువు పెడుతున్నారు. బయటకు మాకే సీటు ఖాయం అంటూ ఎవరికి వారే చెప్పుకుంటున్నారు. కాగా, ఇంత రభస నడుమ తెరమీదకు వచ్చిన మరో అంశంపై కూడా ఇప్పుడు పార్టీవర్గాల్లో చర్చజరుగుతోంది. విభేదాలతో తలనొప్పి తెస్తున్న జిల్లాకాంగ్రెస్‌లో ఇరువర్గాలు సూచిస్తున్న ఎవరికీ ఇవ్వకుండా ఖమ్మం అసెంబ్లీనుంచి కొత్త అభ్యర్థిని బరిలో దింపాలని తెలంగాణ పీసీసీ భావిస్తున్నట్లు జరుగుతున్న ప్రచారం హాట్‌టాపిక్‌గా మారింది. పార్టీలు మారేవారికి టికెట్ ఇస్తే పలుచన అవుతాం.. సంవత్సరాల తరబడి పార్టీని నమ్ముకున్న వారిని వదిలిపెట్టి నిన్న మొన్న పార్టీలో చేరిన వారికి టికెట్ ఇస్తే ప్రజల మధ్య పలుచన అవుతామని రాంరెడ్డి వర్గీయులు అధిష్టానం ముందు అభిప్రాయం వ్యక్తం చేసినట్లు తెలిసింది. రేణుకాచౌదరి మద్దతు తెలుపుతున్న పువ్వాడ అజయ్‌కుమార్ పార్టీలు మారి ఇటీవలే కాంగ్రెస్‌లో చేరారని, ఇప్పుడు టికెట్ ఆశించడం ఎంత వరకు సబబని మంత్రి అనుచరులు ప్రశ్నిస్తున్నారు. పొత్తుల్లో భాగంగా ఖమ్మం పార్లమెంట్ సీపీఐకి ఇస్తే ఆ పార్టీ నుంచి పువ్వాడ నాగేశ్వరరావు పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని, అదే జరిగితే ఎమ్మెల్యేగా కుమారుడు, ఎంపీగా తండ్రి బరిలో దిగితే పార్టీని నమ్ముకుని పనిచేసిన వారి పరిస్థితి ఏమిటని అంటున్నారు. పార్టీని వెన్నంటి ఉండి, కార్యకర్తలకు అందుబాటులో ఉంటున్న ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మానుకొండ రాధాకిషోర్‌కు అవకాశం ఇవ్వాలని రాంరెడ్డి అధిష్టానానికి చెప్పినట్లు తెలిసింది. ఇలా ఉండగా... ఏది ఏమైనా నా అభ్యర్థిగా పువ్వాడ అజయ్‌కుమార్‌కు టికెట్ ఇవ్వాల్సిందే అని రేణుకాచౌదరి అధిష్టానం వద్ద పట్టుపడుతున్నట్లు సమాచారం. అయితే.. తెలంగాణ ఉద్యమాన్ని ఇన్స్టంట్ కాఫీతో పోల్చిన రేణుకాచౌదరిపై ఆగ్రహంతో ఉన్న టీపీసీసీ నాయకులు తెలంగాణలో టికెట్ల కేటాయింపుపై ఆమె పెత్తనం ఏమిటని అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్లు సమాచారం. కాగా, ఖమ్మంలో మైనార్టీ ఓట్లు గెలుపు ఓటములను ప్రభావితం చేస్తాయని, గతంలో ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచిన అనుభం తనకుందని మాజీ ఎమ్మెల్యే యూనస్ సుల్తాన్ కూడా టికెట్‌కోసం తన అనుచరులతో తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. మధ్యే మార్గం వైపు టీపీసీసీ చూపు తమ అనుచరుడికే టికెట్ ఇవ్వాలని రేణుకాచౌదరి, కాదు తమ సన్నిహితుడు మానుకొండకే టిక్కెట్ ఇవ్వాలని రాంరెడ్డి... ఇరువురూ పట్టుపట్టడంతో వీరెవరూ కాకుండా మధ్యే మార్గంగా మరొకరికి టికెట్ ఇస్తే బాగుంటుందని టీపీసీసీ అధిష్టానం ముందు విజ్ఞప్తి చేసినట్లు తెలిసింది. ఒక వర్గం వారికి టికెట్ ఇస్తే మరొకరు పార్టీ నుంచి వెళ్ళిపోయే ప్రమాదం ఉందని, అలా కాకుండా మరొకరి పేరును పరిశీలిస్తే బాగుం టుందనే అభిప్రాయానికి వచ్చినట్లు తెలిసింది. ఖమ్మం పార్లమెంటు టిక్కెట్ కోసం పోటీ పడిన గ్రానైట్ పరిశ్రమల యజమాని వద్దిరాజు రవి చంద్రకు అసెంబ్లీ టికెట్ ఇస్తే బాగుంటుందని టీపీసీసీ వర్కింగ్ కమిటీ చైర్మన్ ఉత్తమ్ కుమార్‌రెడ్డి సూచించినట్లు సమాచారం. లేదంటే పొత్తులో భాగంగా కొత్తగూడెం స్థానాన్ని సీపీఐకి ఇవ్వాల్సి వస్తే, ఖమ్మంలో బీసీ వర్గానికే చెందిన సీనియర్ నేత వనమా వెంకటేశ్వరరావు పేరును ఆయన ప్రతిపాదిస్తున్నట్లు సమాచారం. దీంతో ఇరు వర్గాల వారికి కాకుండా బీసీ వర్గానికి చెందిన రవిచంద్ర లేదా వనమా వెంకటేశ్వరరావుకు ఇస్తే బాగుంటుందని, బీసీలకు కూడా న్యాయం చేసినట్లు అవుతుందనే అభిప్రాయంలో ఏఐసీసీ వర్గాలు భావిస్తున్నట్లు సమాచారం. ఈపరిస్థితులలో టికెట్ ఎవరికి వస్తుందో....తర్వాత ఆ ప్రభావం పార్టీలో ఎలా ఉంటుందో అన్న చర్చ జోరుగా సాగుతోంది. -
టీడీపీలో వలసల చిచ్చు
భీమవరం అర్బన్, న్యూస్‌లైన్ : భీమవరం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలో వర్గపోరు తారాస్థాయికి చేరుకుంది. టీడీపీలో ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు) చేరడం.. ఆయనకే అసెంబ్లీ టికెట్ ఖరారు చేస్తారనే ప్రచారం ఊపందుకున్న నేపథ్యంలో పార్టీ శ్రేణులు రగిలిపోతున్నట్టు సమాచారం. మూడు దశాబ్దాలుగా పార్టీని అంటిపెట్టుకుని ఉన్న మెంటే పార్థసారథి భీమవరం టికెట్ ఆశిస్తున్నారు. ఇటీవల ముని సిపల్ చైర్మన్ అభ్యర్థిగా మెంటేను పోటీ చేయమని పార్టీ పెద్దలు ఒత్తిడి చేసినా ఆయన అంగీకరించకపోవడమే ఇందుకు నిదర్శనం. ఈ నేపథ్యంలో మునిసిపల్ ఎన్నికలు జరుగుతుండటంతో అంజిబాబుకు టికెట్ ఇచ్చే విష యం బహిర్గతం కాకుండా అధిష్టానం నానా తంటాలు పడుతోందట. అంజిబాబుకు ఇప్పుడే టికెట్ కేటాయిస్తే మునిసిపల్ ఎన్నికల్లో విజయావకాశాలు దెబ్బతింటాయని నేతలు భావిస్తున్నారని సమాచారం. ఇదిలా ఉండగా మునిసిపల్ ఎన్నికల్లో టీడీపీను గెలిపించి అసెంబ్లీ టికెట్ పొం దాలనే యోచనలో మెంటే చెమటోడుస్తున్నారు. అయితే మునిసిపల్ ఫలితాలు వెలువడిన వెంటనే మెంటేను పక్కనపెట్టి అంజిబాబును తెరపైకి తీసుకొచ్చేందుకు దాదాపు రంగం సిద్ధమైందని ఆ పార్టీ నేతలే గుసగుసలాడుకుంటున్నారు. సీతమ్మ చెప్పుచేతల్లోనే.. టీడీపీ జిల్లా అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి చెప్పుచేతల్లోనే అభ్యర్థుల ఎంపిక చేస్తారని.. మునిసిపల్ అభ్యర్థులను ఇలానే ఎంపిక చేశారని పార్టీ కేడర్ అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. మెంటేకు సీతారామలక్ష్మికి ఇటీవల విభేదాలు భగ్గుమన్న నేపథ్యంలో అంజిబాబుకు భీమవరం టికెట్ ఇచ్చే విషయంలో కూడా ఆమె ప్రముఖ పాత్ర వహిస్తున్నట్టు సమాచారం. మెంటే మాత్రం అసెంబ్లీ టికెట్ తనకే ఇస్తారనే నమ్మకంతో ఉన్నారు. ఏది ఏమైనా మునిసిపల్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలయ్యేంత వరకూ అంజిబాబు టికెట్ వ్యవహారం గోప్యంగా ఉంచనున్నారని తెలిసింది. లేకపోతే ఆయా ఎన్నికల్లో పరాభవం తప్పదనే గుబులు పార్టీ పెద్దలకు పట్టుకుందట. సుదీర్ఘకాలం టీడీపీ జెండా మోసిన మెంటే పార్థసారథి ఇప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటారో వేచిచూడాలి మరి. -
అసంతృప్తిలో తెలుగు తమ్ముళ్లు
కొరిటెపాడు(గుంటూరు),న్యూస్‌లైన్ తెలుగు తమ్ముళ్లు అసంతృప్తితో రగులుతున్నారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం అసెంబ్లీ టికెట్ కేటాయింపులో పార్టీని నమ్ముకున్న వారిని కాదనడంపై మండిపడుతున్నారు. కొత్తగా పార్టీలో చేరే వ్యాపారవేత్తకు టికెట్ కేటాయించాలనుకుంటున్న అధినేత వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాక రానున్నరెండు రోజుల్లో సమావేశమై రాజకీయంగా ఓ నిర్ణయం తీసుకోనున్నుట్టు సమాచారం. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీలో పోగు పడిన అంతర్గత కలహాలు కొద్ది రోజులుగా బయటపడుతున్నాయి. సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీకి ప్రజాదరణ లేకపోవడంతో ఆ పార్టీ నాయకులు సైకిల్ ఎక్కుతున్నారు. ఇదే టీడీపీ కొంప ముంచుతోంది. కొత్త వారిని చూసుకుని పార్టీని నమ్ముకుని పని చేస్తున్నవారిని పక్కన పెట్టడంతో వారిలో అసంతృప్తికి కారణమైంది.దీంతో పెద్ద ఎత్తున పార్టీ నాయకులు, కార్యకర్తలు రెండు, మూడురోజుల్లో సమావేశమై పార్టీకి, పదవులకు రాజీనామాలు చేయనున్నట్లు సమాచారం. పశ్చిమ నియోజకవర్గంపై కొరవడిన స్పష్టత గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీ చేసే అభ్యర్థుల విషయంలో తెలుగుదేశం పార్టీలో ఇప్పటి వరకు స్పష్టత లేదు. టికెట్ ఆశిస్తూ వచ్చిన వారికి చుక్కలు కనపడుతున్నాయి. తొలి నుంచి మాజీ కార్పొరేటర్లు యాగంటి దుర్గారావు, మద్దిరాల మ్యానీలతో పాటు వ్యాపారవేత్త కోవెలముడి రవీంద్ర, సీనియర్ నాయకులు మన్నవ సుబ్బారావు, దాసరి రాజా మాస్టారు, పాటిబండ్ల విజయ్‌లు పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తూ వచ్చారు. ఇదిలావుంటే, గత ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ తరఫున పోటీ చేసి ఓడిపోయిన ప్రముఖ వ్యాపారవేత్త తులసి రామచంద్రప్రభు సోమవారం చంద్రబాబును కలవడం, టికెట్ ఆయనకే ఇస్తున్నారన్న ప్రచారం జరగడంతో తెలుగుదేశం పార్టీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి. కష్టకాలంలో పార్టీకి కాపుకాసిన తమను కాదని తులసికి టికెట్ ఎలా ఇస్తారంటూ ప్రశ్నిస్తున్నారు. పార్టీలో మైనార్టీలకు, క్రిస్టియన్లకు న్యాయం జరగడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీసీలుగా ఉన్న తమకు బీసీ కోటాలో కానీ ఎస్సీ కోటాలో కాని టికెట్ కేటాయించడం లేదని మ్యానీ ఆరోపిస్తుండగా పశ్చిమ నియోజకవర్గం ఇన్చార్జిగా పార్టీ జెండాను మోసిన తనకు టికెట్ కేటాయించకపోవడం ఏంటని యాగంటి ప్రశ్నిస్తున్నారు. దీనిపై రెండు, మూడు రోజు ల్లో తన అనుచరులతో ప్రత్యేక సమావేశం నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. ఇదే సమయంలో టీడీపీకి రాజీనామా చేయాలంటూ యాగంటి దుర్గారావు, మద్దిరాల మ్యానీలపై ఆ పార్టీ కార్యకర్తలు తీవ్ర ఒత్తిడి తీసుకువస్తున్నారు. అలాగే కోవెలమూడి రవీంద్ర ఇప్పటి వరకు పార్టీ కోసం ఎంతో డబ్బు ఖర్చు చేశారని ఆయన అనుచరులు చెబుతున్నారు. పార్టీ అభివృద్ధికి కృషి చేసినా తమను పరిగణలోకి తీసుకోకపోవడంపై మండి పడుతున్నారు. పార్టీలో ఎంతో కాలంగా పనిచేస్తున్న మన్నవ సుబ్బారావు సైతం అసహనంగా ఉన్నారు. ఆయన స్వయంగా చంద్రబాబును కలిసి టికెట్ కోరినా ఎలాంటి హామీ రాక పోవడంతో తీవ్ర నిరాశకు గురయ్యారు. మరోవైపు పార్టీలో తొలి నుంచి పనిచేసిన కాపులకు అన్యాయం జరుగుతుందని ఆ వర్గం నాయకులు భావిస్తున్నారు. ఎమ్మెల్సీ టికెట్ విషయంలో అన్యాయం జరిగిందని, ఇప్పుడు ఎమ్మెల్యే టికెట్ సైతం కేటాయించకపోవడంతో పార్టీకి రాజీనామా చేయాలని కార్యకర్తలు దాసరి రాజా మాస్టారుపై ఒత్తిడి తీసుకువస్తున్నారు. రెండురోజుల్లో వీరంతా సమావేశమై ఓ నిర్ణయానికి రానున్నట్టు సమాచారం. -
అయ్యయో.. జేబులు ఖాళీ ఆయెనే..!
రాజకీయ చదరంగంలో ఒక్కో నిచ్చెన ఎక్కాలంటే సేవే మార్గమనుకున్నారు. 2014 ఎన్నికల రణరంగంలోకి దూకేందుకు పక్కాప్లాన్‌తో ఏడాది నుంచి చేతికి ఎముకే లేదన్నట్టు అడగని వారికి.. అడిగిన వారికి లేదనకుండా శక్తి మేర సమర్పించుకున్నారు. పేదోళ్లు కన్పిస్తే చాలు గుండెలు కరిగించుకున్నారు. ఇలా ఇన్నాళ్లూ బిజీబిజీగా గడిపిన నేతలు ఎన్నికలు సమీపిస్తున్న వేళ టికెట్ లభించే అవకాశం లే దన్న నిర్ధారణతో తెరమరుగయ్యారు. సాక్షి, అనంతపురం : జిల్లాలో తెలుగుదేశం పార్టీ నుంచి పార్లమెంట్, అసెంబ్లీ టికెట్ ఆశించిన కొందరు నాయకులు 2014 ఎన్నికలే లక్ష్యంగా ఏడాదిగా సేవా కార్యక్రమాల్లో నిమగ్నమైపోయారు. నియోజకవర్గాల్లో తరచూ పర్యటిస్తూ పార్టీ, సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. ఉన్న డబ్బుంతా విదిలించుకున్నారు. సేవలతో ఓటర్లను ప్రసన్నం చేసుకోవడంతో విజయం సాధించినా.. పార్టీ అధినేత దృష్టిలో మాత్రం పడినట్లు లేరు. ఎన్నికల్లో టికెట్ రాదని తెలిసి పోయిన డబ్బులు లెక్కలేసుకుంటూ.. కక్కలేక.. మింగలేక లోలోన మదనపడిపోతున్నారు. రాయదుర్గం నియోజకవర్గంలో ఓ టీడీపీ నేత పార్టీ టికెట్ ఆశించి ఏడాది నుంచి విస్త్రృతంగా పర్యటించారు. పార్టీ కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు అంటూ లెక్కకు మించి ఖర్చు చేసుకున్నారు. ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ సదరు నాయకుడికి పార్టీ నుంచి సానుకూల స్పందన రాలేదు. ఏడాది వరకు నియోజకవర్గంలో రోజుకు రెండు మూడు గ్రామాలను చుట్టేసి.. ఎక్కడ ఎవరు పిలిచినా అనుచరులతో కలసి వాలిపోయినా నేత.. తన లక్ష్యం నెరవెరేలా లేదని గ్రహించి సేవలకు రాం..రాం...చెప్పారు. హిందూపురం మాజీ ఎమ్మెల్యేగా ఉన్న ఓ నాయకుడు 2014 అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా టికెట్టు తెచ్చుకోవాలని ఉబలాటపడ్డారు. గతంలో పార్టీ అధినేత చంద్రబాబునాయుడు హిందూపురం నుంచి పాదయాత్ర మొదలు పెట్టడంతో.. ఇదే అదునుగా భావించి చేతికి ఎముకలేదన్నట్లుగా అధినేత పాదయాత్ర కార్యక్రమానికి అవసరమైన ఏర్పాట్లన్నీ సొంత ఖర్చులతోనే చేశారు. ఆసాంతం జనంలో తిరుగుతూ వచ్చే ఎన్నికల్లో తానే అభ్యర్థినంటూ కలరింగు కూడా ఇచ్చుకున్నారు. అయితే ఈ నాయకుడికి టికెట్టు రాదని ఇటీవల తేలిపోవడంతో నిండామునిగానన్న ఆవేదనలో ఉన్నారు. కళ్యాణదుర్గం నియోజకవర్గానికి చెందిన ఓ నాయకుడు రియల్ఎస్టేట్ వ్యాపారంలో బాగా గడించారు. దీనికి తోడు కాంట్రాక్టు పనులు చేసి అనతికాలంలోనే కోట్లు సంపాదించారు. ఎలాగైనా ఈసారి ఎన్నికల్లో కళ్యాణదుర్గం ఎమ్మెల్యే టికెట్టు తెచ్చుకోవాలన్న లక్ష్యంతో టీడీపీలోని పెద్దలతో పరిచయాలు పెట్టుకుని..పలుమార్లు హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయం చుట్టూ తిరిగారు. పార్టీలోని రెండు పెద్ద తలకాయలు ఇచ్చిన హామీ మేరకు..నియోజకవర్గంలో విస్త్రృతంగా పర్యటించారు. గుడులు..గోపురాలకు ఇతోదిక విరాళాలు అందజేశారు. యువతకు క్రికెట్ కిట్లు, పండుటాకులకు ఖర్చులకు డబ్బులు ఇస్తూ వచ్చారు. ఇదే క్రమంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు కూడా రావడంతో అయిన కాటికి ఖర్చు చేసి పార్టీ మద్దతుదారులను గెలిపించుకున్నారు. తీరా చూస్తే..ఈ నాయకునికి కాకుండా మరో నాయకునికి అధిష్టానం టికెట్టు ఖరారు చేయనున్నట్లు తెలుసుకుని కంగుతిన్నారు. తనకు హామీ ఇచ్చిన పెద్ద తలకాయలు సైతం తామేమి చేయలేమని చేతులెత్తేయడంతో ఏమి చేయాలో పాలుపోక చేసిన ఖర్చుల చిట్టాను చూసుకుంటూ ఉండిపోతున్నారు. పస్తుతం మునిసిపల్ ఎన్నికలు సమీపిస్తుండడంతో ‘ఈ ఎన్నికల్లో నేను తలదూర్చను బాబూ’ అంటూ పరుగులెత్తుకుంటున్నారు. ఇదే నియోజకవర్గానికి చెందిన మరో నాయకుడిది ఇదే పరిస్థితి. 2009లో పార్టీ టికెట్టు ఆశించి భంగపడ్డ ఈ నాయకుడు..ఈ సారి ఎలాగైనా టికెట్టు సాధించుకోవాలని నియోజకవర్గంలో తనదైన శైలిలలోనే పార్టీ కార్యక్రమాలు చేస్తూ పోయారు. ప్రసుత్తం ఈయనకు కూడా టికెట్టు వచ్చే పరిస్థితి లేదు. అనంతపురంలో తొలి నుంచి ఒకరు నియోజకవర్గ బాధ్యులుగా వ్యవహరిస్తూ వచ్చారు. నియోజకవర్గంలో ఏ శుభకార్యానికి ఆహ్వానం అందినా రెక్కలు కట్టుకుని వాలిపోయేవారు. పార్టీ పిలుపునిచ్చే ఏ కార్యక్రమాన్ని అయినా తానే అంతా అయి చూసుకునేవారు. ఇప్పుడు ఆయనను కాదని మరొకరి పేరు అధినేత పరిశీలిస్తున్నట్లు తెలుసుకున్న ఆయన మునిసిపల్ ఎన్నికలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. మరో నాయకుడు తొలి నుంచి అనంతపురం, పుట్టపర్తి నియోజకవర్గాల్లో ఏదో ఒక చోట టికెట్టు దక్కించుకోవాలన్న లక్ష్యంతో తెగ ఖర్చు చేస్తూ వచ్చారు. ఎన్టీఆర్ ట్రస్టుభవన్కు కూడా విరాళాలు అందజేశారు. అధినేత చంద్రబాబు నాయుడు చేతుల మీదుగానే ఓ ట్రస్టును ఏర్పాటు చేసి.. ఆ ట్రస్టు ద్వారా పేదలకు చీరలు, దుప్పట్లు పంపిణీ చేస్తూ వచ్చారు. ఇంత చేసినా టికెట్టు దక్కదన్న విషయం తెలుసుకున్న ఆ నాయకుడు సైకిల్ దిగి.. మరో చెట్టుచాటున చేరారు.