
సాక్షి, పశ్చిమగోదావరి: టీడీపీని తెలుగు బూతుల పార్టీగా, జనసేనను రౌడీసేనగా మార్చేశారని మార్చేశారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం బహిరంగ సభలో సీఎం మాట్లాడుతూ.. గత ఎన్నికల్లో చంద్రబాబుకు ప్రజలు బైబై చెప్పారు. అన్ని ఎన్నికల్లో మన ప్రభుత్వాన్ని ఆశీర్వదించారు. చివరికి కుప్పంలో కూడా వైఎస్సార్‌సీపీనే గెలిపించారని సీఎం గుర్తు చేశారు.
‘‘టీడీపీని చిత్తుగా ఓడించి మరోసారి బైబై బాబు అని చెప్పారు. వాళ్ల పాలన చూసి ప్రజలు ఇదే కర్మరా బాబు అనుకుని ఉంటారు. అందుకే 2019లో వారికి ప్రజలు బైబై చెప్పారు’’ అని సీఎం అన్నారు. వెన్నుపోటుకు గురైన ఎన్టీఆర్ కూడా ఇలాంటి మనిషికి తన ఇంట్లో, తన పార్టీ కేబినెట్‌లో స్థానం ఇచ్చినందుకు ఇదేం ఖర్మరా బాబు అనుకుని ఉంటారని సీఎం ఎద్దేవా చేశారు.
ఏ మంచీ చేయని తనకు ఎవరైనా ఎందుకు ఓటు వేస్తారని బాబు చెప్పడు. చంద్రబాబు, దత్తపుత్రుడు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5ను నమ్మొద్దు. మీకు మంచి జరిగిందా లేదా అనేది కొలమానంగా తీసుకోవాలన్నారు. ‘‘మంచి జరిగితే మాకు అండగా, తోడుగా నిలబడండి’’ అని సీఎం అన్నారు.
(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
చదవండి: నరసాపురం చరిత్రలో ఇదే మొదటిసారి
Comments
Please login to add a commentAdd a comment