
పాదయాత్ర చేస్తున్న పాండురంగ విఠల్ భగవత్, దేవ్‌రామ్ డుమ్రి
బూర్గంపాడు: శేష జీవితం ప్రశాంతంగా గడపాల్సిన ఇద్దరు వృద్ధులు సాహసానికి పూనుకున్నారు. గోదావరి పరీవాహక ప్రాంతంలో పాదయాత్ర చేపట్టారు. మహారాష్ట్రలోని నాసిక్‌కు చెందిన 80 ఏళ్ల పాండురంగ విఠల్ భగవత్, 82 ఏళ్ల కార్బరి దేవ్‌రామ్ డుమ్రి పాదయాత్ర చేస్తున్నారు. శనివారం వీరి పాదయాత్ర తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడుకు చేరుకుంది.
ఈ సందర్భంగా వారు ‘సాక్షి’తో మాట్లాడుతూ గతంలో రెండుసార్లు నాసిక్ నుంచి రాజమండ్రి వరకు గోదావరి అవతలి గట్టున పాదయాత్ర చేశామని, ప్రస్తుతం నాసిక్ నుంచి నరసాపురం వరకు రైలులో వచ్చామని, అక్కడి నుంచి తిరిగి నాసిక్‌కు గోదావరి ఇవతలి గట్టున పాదయాత్ర చేస్తున్నామని వివరించారు. 15 రోజుల కిందట నరసాపురంలో పాదయాత్ర ప్రారంభించామన్నారు. గోదావరి నది పుట్టుక స్థానం నుంచి సముద్రంలో కలిసే వరకు రెండుసార్లు పాదయాత్ర చేశామని చెప్పారు. ఇప్పుడు సముద్రంలో కలిసిన స్థానం నుంచి గోదావరి పుట్టుక స్థానం వరకు పాదయాత్ర చేపట్టామని వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment