సాక్షి, నరసాపురం: పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం మొగల్తూరు సెంటర్‌లో వైఎస్సార్‌సీపీ బస్సు యాత్ర ప్రారంభమైంది. మొగల్తూరు నుంచి రామన్నపాలెం, ఎల్‌బీ చర్ల మీదుగా యాత్ర నరసాపురం చేరుకుంది. సాయంత్రం ఆరు గంటలకు నరసాపురంలోని ప్రకాశం రోడ్డు రామాలయం సెంటర్‌లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తారు.ఈ కార్యక్రమంలో మంత్రులు, నేతలు పాల్గొన్నారు.
మరోవైపు, బస్సు యాత్ర సందర్బంగా ప్రభుత్వ చీఫ్ విప్ ప్రసాద్ రాజు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు సామాజిక సాధికార యాత్రకు శ్రీకారం చుట్టాము. 175 నియోజకవర్గాల్లో యాత్ర జరుగుతుంది. నరసాపురం నియోజకవర్గంలో ఈ యాత్ర మొగల్తూరు నుంచి ప్రారంభిస్తున్నాము. సీఎం జగన్ నాలుగున్నర సంవత్సరాల పాలన, సాధికారత ప్రజలకు వివరించనున్నాము అని తెలిపారు.
ప్రతీ సామాజిక వర్గానికి ప్రత్యేక గుర్తింపు..
మంత్రి శ్రీదిరి అప్పలరాజు మాట్లాడుతూ.. సామాజిక సాధికారత యాత్ర నరసాపురం నియోజవర్గంలో ప్రారంభం అవుతుంది. 17 కిలోమీటర్ల మేర యాత్ర సాగి పట్టణంలో బహిరంగ సభ వరకు చేరుకుంటుంది. ప్రతిపక్షాలు యాత్ర ఎందుకు అంటున్నాయి. స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయినా మా గొంతు మా పాత్ర ప్రభుత్వాల్లో లేదే అని ఆవేదన చెందుతున్నారు. సీఎం జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత అన్ని సామాజిక వర్గాలను గుర్తించారు. ప్రతీ సామాజిక వర్గానికి ప్రత్యేక గుర్తింపు ఇచ్చి అండగా నిలిచారు. ప్రతీ సామాజిక వర్గానికి ఒక ప్రతినిధి ఉండాలని వివిధ కార్పొరేషన్ల లోనూ ప్రభుత్వ పదవుల్లోనూ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు సమపాళ్లలో ప్రాతినిధ్యం కల్పించారు. దీనిపై కూడా చంద్రబాబు తొత్తులు విమర్శలు చేస్తున్నారు. చంద్రబాబు కేబినెట్‌లోకి ఒక్క మైనార్టీకి కూడా తీసుకోలేదు.
యనమలకు కౌంటర్..
బీసీలకు సమన్యాయం జరిగిందా అని ఏ రోజైనా యనమల రామకృష్ణుడు అడిగారా?. బీసీలకు ఆత్మగౌరవం కల్పించిన నాయకుడు ముఖ్యమంత్రి జగన్. దళితులు తలెత్తుకుని జీవించేలా.. గిరిజనులు గర్వపడేలా చేసిన నాయకుడు సీఎం జగన్. ఏ పేదవాడు కూడా కష్టాల్లో ఉండకూడదని ప్రతీ కుటుంబం తన కుటుంబంగా భావించిన వ్యక్తి సీఎం జగన్. బహుజన భావజాలంతో పేదలకు సంక్షేమ పాలన అందిస్తున్నారు. గొప్ప భావజాలంతో ఉన్న ఏకైక నాయకుడు ముఖ్యమంత్రి జగన్. జనహోరును తలపించేలా బస్సుయాత్రకు ప్రజల నుండి మంచి స్పందన వస్తోంది.
జగనన్న వెంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు..
మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ.. బహిరంగ సభతో ఈ యాత్ర జరగటం సంతోషదాయకం. 53 నెలల పరిపాలన కాలంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు సామాజిక విప్లవకారులుగా మారారు. సమాజంలో ఉన్న అట్టడుగు వర్గాల జీవితాల్లో మార్పు కోసం సీఎం జగన్ కృషి చేశారు. పాదయాత్ర ఒక తపస్సు లాగా చేసిన వ్యక్తి ముఖ్యమంత్రి జగన్. రాష్ట్రంలో ఉన్న మూడు ప్రాంతాల్లో సామాజిక సాధికారత యాత్రకు ఉవ్వెత్తున ప్రజల నుండి స్పందన వస్తోంది. జగనన్న వెంట ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు ఉన్నారు. బీసీల కోసం ఏర్పడ్డ ప్రభుత్వం ఇది. బీసీల కోసం ఇంతలా ఆలోచించిన నాయకుడు భవిష్యత్తులో కూడా రాడు. పదనాలుగేళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు సైతం బీసీల కోసం ఏమీ చేయలేదు. తొమ్మిదేళ్లు బీసీలను అణగదొక్కాడు.
2019లోనే నారాసురుడుని గుడ్‌బై..
కడుపులో బిడ్డ నుంచి పండు ముసలి వరకు పథకాలు చేరుస్తున్న వ్యక్తి సీఎం జగన్. 2019లోనే ప్రజలు నారాసురుడుని వధించారు. నారా భువనేశ్వరి నిజాన్ని గెలిపించండి అంటున్నారు. ఎవరో ఏదో స్క్రిప్ట్ రాసిస్తే అది పట్టుకుని తిరుగుతున్నారు. పశ్చిమగోదావరి జిల్లా దద్దరిల్లెలా మన బిడ్డల భవిష్యత్తు జగన్ ద్వారా సాధ్యమని అందరూ తెలుసుకోవాలి. నాడు సామాజిక న్యాయం ఎండమావి.. నేడు సామాజిక న్యాయం నిండుకుండ.
సీఎం జగన్ పాలనలో కొత్త ఒరవడి..
ఎమ్మెల్సీ పోతుల సునీత మాట్లాడుతూ.. కొన్ని దశాబ్దాలుగా ఎంతోమంది సాంఘిక అసమానతలకు గురయ్యారు. మంచి విద్య, వైద్యం, ఉండటానికి ఇల్లు, తిండి లేవు. సీఎం జగన్ పరిపాలన చేపట్టాక నూతన ఒరవడితో సమసమాజస్థాపనకు కృషి చేశారు. విద్య, వైద్యం, వ్యవసాయ రంగంలో సీఎం జగన్ విప్లవాత్మ మార్పులు తీసుకొచ్చారు. ప్రతీ వ్యక్తికి సంక్షేమాన్ని చేరువ చేశారు. చంద్రబాబు ఆయన దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్, ఈనాడు, ఏబీఎన్ పనికట్టుకుని జగనన్న చేసిన మంచిని చూసి ఓర్వలేక పోతున్నారు. 17 మంత్రి పదవులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు కేటాయించారు. నలుగురికి రాజ్యసభ సీట్లు కేటాయించారు. బీసీలను చంద్రబాబు ఓటు బ్యాంకుగానే చూశాడు.
భువనేశ్వరి ఆ విషయం తెలియదా?
మహిళలకు పెద్దపెట్టవేసిన దమ్ము, ధైర్యం ఉన్న నాయకుడు జగనన్న.. రాష్ట్రంలో 30 లక్షల మంది పేదలకు ఇల్లు ఇచ్చారు. 2024 ఎన్నికల్లో పేదల పక్షాన జగనన్న ఉన్నాడు.. పెత్తందారుల పక్షాన చంద్రబాబు, పవన్, ఎల్లో మీడియా ఉన్నారు. అనేక స్కాములతో అడ్డంగా దొరికిపోయి జైల్లో ఉన్నాడు చంద్రబాబు. నిజం గెలవాలని భువనేశ్వర్ గారు తిరుగుతున్నారు. మీ తండ్రికి వెన్నుపోటు పొడిచింది ఎవరు చంద్రబాబు కాదా?. 19 అవినీతి స్కాముల్లో స్టేలు తెచ్చుకున్న వ్యక్తి చంద్రబాబు కాదా. రెండు ఎకరాల అధిపతి లక్షల కోట్లకు పడలెత్తాడని భువనేశ్వర్ గారికి తెలియదా?. అవినీతి రాజకీయాలకు, మీ వెన్నుపోటు రాజకీయాలకు జగనన్నను గుండెల్లో పెట్టుకున్న అక్క చెల్లెమ్మలు మీకు బుద్ధి చెబుతారు.
Comments
Please login to add a commentAdd a comment