Potula sunitha
-
ప్రజలకు భూములివ్వడమే సీఎం జగన్‌కు తెలుసు
సాక్షి, అమరావతి: మహానేత వైఎస్సార్‌కు, సీఎం జగన్‌కి ప్రజలకు భూములివ్వడమే తెలుసని, చంద్రబాబులా భూములు లాక్కోవడం తెలియదని వైఎస్సార్సీపీ నేత, ఎమ్మెల్సీ పోతుల సునీత చెప్పారు. ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్‌పై టీడీపీ దుష్ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. ఆమె శనివారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్సార్ అధికారంలో ఉండగా రాజంపేట – రైల్వే కోడూరు మధ్య వందలాది ఎకరాల సొంత భూమిని అసెంబ్లీ సాక్షిగా ప్రభుత్వానికి రాసిచ్చేశారని తెలిపారు. చంద్రబాబు అమరావతి పేరుతో పేద రైతుల భూములు కొల్లగొట్టారని, గ్రాఫిక్స్ చూపించి వారిని మోసం చేశారని తెలిపారు. చంద్రబాబు రైతుల భూములను చుక్కల భూములంటూ అన్నదాతలకు చుక్కలు చూపించారన్నారు. రైతులు అమ్ముకోకుండా యాక్ట్ తెచ్చారన్నారు. సీఎం జగన్ ఆ భూములను చుక్కల నుంచి విముక్తి కల్పించి, రైతులకు అందజేశారని తెలిపారు. 2014 –19 మధ్య రాష్ట్రవ్యాప్తంగా భూ కుంభకోణానికి పాల్పడిందీ చంద్రబాబు ప్రభుత్వమేనన్నారు. తక్కువ ధరకు భూమి తీసుకుని కోట్ల రూపాయలకు అమ్ముకొన్న ఘనుడు చంద్రబాబేనన్నారు. విశాఖలో 100 ఎకరాల భూమి గీతంకి కట్టబెట్టిందీ బాబేనని తెలిపారు. ఇవన్నీ దాచిపెట్టి సీఎం జగన్ పై అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. పశువులు కూడా ఇంతటి దుర్మార్గానికి ఒడికట్టవని అన్నారు. ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్‌కు ఇంకా రూల్స్ ఫ్రేమ్ కాలేదన్నారు. అప్పుడే సీఎం జగన్ భూములు లాగేసుకొనేందుకే చట్టం తెచ్చారంటూ సిగ్గూ ఎగ్గూ లేకుండా ప్రచారం చేస్తున్నారని అన్నారు. -
జగన్ పాలన చూసి ఓర్వలేకే బాబు, పవన్‌ల ఆరోపణలు
సాక్షి,అమరావతి : సీఎం జగన్‌పై చంద్రబాబు తరచూ చేసే విమర్శలకు ఇక స్వస్తి పలకాలని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ, పార్టీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు పోతుల సునీత కోరారు. తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం ఆమె మీడియాతో మాట్లాడారు. ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రకి ప్రజలు బ్రహ్మరథం పట్టారని, ఇది చూశాక అయినా బాబు, ఎర్ర బుక్ లోకేశ్‌లో, టీడీపీ నేతల్లో, పావలా కళ్యాణ్‌లో మార్పు రావాలన్నారు.సీఎం జగన్ పాలనలో ఎక్కడా అవినీతికి తావు లేకుండా ఇంటి వద్దకే పథకాలు వచ్చేలా పాలన నడిచిందన్నారు. ఈ పాలనను చూసి ఓర్చుకోలేక చంద్రబాబు, పవన్‌లు ఇలా ఆరోపణలు చేస్తున్నారని దుయ్యబట్టారు. మళ్లీ జగనే సీఎం అవ్వాలని ప్రజలందరూ కోరుకుంటున్నారని, వైఎస్సార్సీపీ భారీ మెజారిటీతో మళ్లీ గెలవబోతోందన్నారు. ప్రజా విశ్వాసం లేని లోకేశ్, చంద్రబాబులు మంగళగిరి, కుప్పంలో గెలిచే పరిస్థితి లేదన్నారు. చంద్రబాబు చెబుతున్న సూపర్ సిక్స్ పథకాలను జనం నమ్మకపోవడంతో.. సీఎం జగన్‌పై దూషణలు, అనుచిత వ్యాఖ్యలు, వ్యక్తిగతంగా కించపరచడం వంటివి చేస్తున్నారని మండిపడ్డారు. విద్యారంగంపై ఎల్లో మీడియాలో దుర్మార్గపు వార్తలు విద్యారంగంపై ఎల్లో మీడియాలో దుర్మార్గపు వార్తలు రాస్తున్నారని వైఎస్సార్సీపీ గ్రీవెన్స్ సెల్ చైర్మన్ ఎ.నాగ నారాయణమూర్తి మండిపడ్డారు. నాడు–నేడు కింద అభివృద్ధి జరిగిన పాఠశాలలు కనిపించడం లేదా రామోజీ? అంటూ నిలదీశారు. టీడీపీ హయాంలో స్కూల్స్ మూత వేసినట్టు ఎల్లో మీడియాలోనూ వార్తలు వచ్చాయని, ఆ మేరకు బాబు జీవోలు కూడా ఇచి్చన విషయాన్ని గుర్తు చేశారు. విద్యా వ్యవస్థలో సీఎం జగన్ తెచ్చిన సంస్కరణలపై ఎల్లో మీడియా విషం చిమ్ముతోందన్నారు. -
‘ప్రతీ కుటుంబం తనదేనని భావించిన వ్యక్తి సీఎం జగన్’
సాక్షి, నరసాపురం: పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం మొగల్తూరు సెంటర్లో వైఎస్సార్సీపీ బస్సు యాత్ర ప్రారంభమైంది. మొగల్తూరు నుంచి రామన్నపాలెం, ఎల్బీ చర్ల మీదుగా యాత్ర నరసాపురం చేరుకుంది. సాయంత్రం ఆరు గంటలకు నరసాపురంలోని ప్రకాశం రోడ్డు రామాలయం సెంటర్లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తారు.ఈ కార్యక్రమంలో మంత్రులు, నేతలు పాల్గొన్నారు. మరోవైపు, బస్సు యాత్ర సందర్బంగా ప్రభుత్వ చీఫ్ విప్ ప్రసాద్ రాజు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు సామాజిక సాధికార యాత్రకు శ్రీకారం చుట్టాము. 175 నియోజకవర్గాల్లో యాత్ర జరుగుతుంది. నరసాపురం నియోజకవర్గంలో ఈ యాత్ర మొగల్తూరు నుంచి ప్రారంభిస్తున్నాము. సీఎం జగన్ నాలుగున్నర సంవత్సరాల పాలన, సాధికారత ప్రజలకు వివరించనున్నాము అని తెలిపారు. ప్రతీ సామాజిక వర్గానికి ప్రత్యేక గుర్తింపు.. మంత్రి శ్రీదిరి అప్పలరాజు మాట్లాడుతూ.. సామాజిక సాధికారత యాత్ర నరసాపురం నియోజవర్గంలో ప్రారంభం అవుతుంది. 17 కిలోమీటర్ల మేర యాత్ర సాగి పట్టణంలో బహిరంగ సభ వరకు చేరుకుంటుంది. ప్రతిపక్షాలు యాత్ర ఎందుకు అంటున్నాయి. స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయినా మా గొంతు మా పాత్ర ప్రభుత్వాల్లో లేదే అని ఆవేదన చెందుతున్నారు. సీఎం జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత అన్ని సామాజిక వర్గాలను గుర్తించారు. ప్రతీ సామాజిక వర్గానికి ప్రత్యేక గుర్తింపు ఇచ్చి అండగా నిలిచారు. ప్రతీ సామాజిక వర్గానికి ఒక ప్రతినిధి ఉండాలని వివిధ కార్పొరేషన్ల లోనూ ప్రభుత్వ పదవుల్లోనూ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు సమపాళ్లలో ప్రాతినిధ్యం కల్పించారు. దీనిపై కూడా చంద్రబాబు తొత్తులు విమర్శలు చేస్తున్నారు. చంద్రబాబు కేబినెట్లోకి ఒక్క మైనార్టీకి కూడా తీసుకోలేదు. యనమలకు కౌంటర్.. బీసీలకు సమన్యాయం జరిగిందా అని ఏ రోజైనా యనమల రామకృష్ణుడు అడిగారా?. బీసీలకు ఆత్మగౌరవం కల్పించిన నాయకుడు ముఖ్యమంత్రి జగన్. దళితులు తలెత్తుకుని జీవించేలా.. గిరిజనులు గర్వపడేలా చేసిన నాయకుడు సీఎం జగన్. ఏ పేదవాడు కూడా కష్టాల్లో ఉండకూడదని ప్రతీ కుటుంబం తన కుటుంబంగా భావించిన వ్యక్తి సీఎం జగన్. బహుజన భావజాలంతో పేదలకు సంక్షేమ పాలన అందిస్తున్నారు. గొప్ప భావజాలంతో ఉన్న ఏకైక నాయకుడు ముఖ్యమంత్రి జగన్. జనహోరును తలపించేలా బస్సుయాత్రకు ప్రజల నుండి మంచి స్పందన వస్తోంది. జగనన్న వెంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు.. మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ.. బహిరంగ సభతో ఈ యాత్ర జరగటం సంతోషదాయకం. 53 నెలల పరిపాలన కాలంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు సామాజిక విప్లవకారులుగా మారారు. సమాజంలో ఉన్న అట్టడుగు వర్గాల జీవితాల్లో మార్పు కోసం సీఎం జగన్ కృషి చేశారు. పాదయాత్ర ఒక తపస్సు లాగా చేసిన వ్యక్తి ముఖ్యమంత్రి జగన్. రాష్ట్రంలో ఉన్న మూడు ప్రాంతాల్లో సామాజిక సాధికారత యాత్రకు ఉవ్వెత్తున ప్రజల నుండి స్పందన వస్తోంది. జగనన్న వెంట ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు ఉన్నారు. బీసీల కోసం ఏర్పడ్డ ప్రభుత్వం ఇది. బీసీల కోసం ఇంతలా ఆలోచించిన నాయకుడు భవిష్యత్తులో కూడా రాడు. పదనాలుగేళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు సైతం బీసీల కోసం ఏమీ చేయలేదు. తొమ్మిదేళ్లు బీసీలను అణగదొక్కాడు. 2019లోనే నారాసురుడుని గుడ్‌బై.. కడుపులో బిడ్డ నుంచి పండు ముసలి వరకు పథకాలు చేరుస్తున్న వ్యక్తి సీఎం జగన్. 2019లోనే ప్రజలు నారాసురుడుని వధించారు. నారా భువనేశ్వరి నిజాన్ని గెలిపించండి అంటున్నారు. ఎవరో ఏదో స్క్రిప్ట్ రాసిస్తే అది పట్టుకుని తిరుగుతున్నారు. పశ్చిమగోదావరి జిల్లా దద్దరిల్లెలా మన బిడ్డల భవిష్యత్తు జగన్ ద్వారా సాధ్యమని అందరూ తెలుసుకోవాలి. నాడు సామాజిక న్యాయం ఎండమావి.. నేడు సామాజిక న్యాయం నిండుకుండ. సీఎం జగన్ పాలనలో కొత్త ఒరవడి.. ఎమ్మెల్సీ పోతుల సునీత మాట్లాడుతూ.. కొన్ని దశాబ్దాలుగా ఎంతోమంది సాంఘిక అసమానతలకు గురయ్యారు. మంచి విద్య, వైద్యం, ఉండటానికి ఇల్లు, తిండి లేవు. సీఎం జగన్ పరిపాలన చేపట్టాక నూతన ఒరవడితో సమసమాజస్థాపనకు కృషి చేశారు. విద్య, వైద్యం, వ్యవసాయ రంగంలో సీఎం జగన్ విప్లవాత్మ మార్పులు తీసుకొచ్చారు. ప్రతీ వ్యక్తికి సంక్షేమాన్ని చేరువ చేశారు. చంద్రబాబు ఆయన దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్, ఈనాడు, ఏబీఎన్ పనికట్టుకుని జగనన్న చేసిన మంచిని చూసి ఓర్వలేక పోతున్నారు. 17 మంత్రి పదవులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు కేటాయించారు. నలుగురికి రాజ్యసభ సీట్లు కేటాయించారు. బీసీలను చంద్రబాబు ఓటు బ్యాంకుగానే చూశాడు. భువనేశ్వరి ఆ విషయం తెలియదా? మహిళలకు పెద్దపెట్టవేసిన దమ్ము, ధైర్యం ఉన్న నాయకుడు జగనన్న.. రాష్ట్రంలో 30 లక్షల మంది పేదలకు ఇల్లు ఇచ్చారు. 2024 ఎన్నికల్లో పేదల పక్షాన జగనన్న ఉన్నాడు.. పెత్తందారుల పక్షాన చంద్రబాబు, పవన్, ఎల్లో మీడియా ఉన్నారు. అనేక స్కాములతో అడ్డంగా దొరికిపోయి జైల్లో ఉన్నాడు చంద్రబాబు. నిజం గెలవాలని భువనేశ్వర్ గారు తిరుగుతున్నారు. మీ తండ్రికి వెన్నుపోటు పొడిచింది ఎవరు చంద్రబాబు కాదా?. 19 అవినీతి స్కాముల్లో స్టేలు తెచ్చుకున్న వ్యక్తి చంద్రబాబు కాదా. రెండు ఎకరాల అధిపతి లక్షల కోట్లకు పడలెత్తాడని భువనేశ్వర్ గారికి తెలియదా?. అవినీతి రాజకీయాలకు, మీ వెన్నుపోటు రాజకీయాలకు జగనన్నను గుండెల్లో పెట్టుకున్న అక్క చెల్లెమ్మలు మీకు బుద్ధి చెబుతారు. -
మహిళల అదృశ్యంపై తప్పుడు లెక్కలు
సాక్షి, అమరావతి: మహిళల అదృశ్యంపై తెలుగుదేశం పార్టీ తప్పుడు లెక్కలతో అవాస్తవాలు ప్రచారం చేస్తోందని వైఎస్సార్సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ పోతుల సునీత ధ్వజమెత్తారు. ఆమె శుక్రవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ ‘రాష్ట్రంలో 2019–21 మధ్య 24,557 మిస్సింగ్ కేసుల్లో 23,399 మంది ఆచూకీ లభించింది. వారిని పోలీసులు కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఇంకా ఆచూకీ తేలాల్సింది 1,158 కేసుల్లోనే.. వాస్తవాలిలా ఉంటే.. చంద్రబాబు, లోకేశ్, పవన్ కాకి లెక్కలతో ప్రజల్ని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబు దుశ్శాసన పాలనలో ఎన్నో అఘాయిత్యాలు జరిగాయి. కాల్‌మనీ సెక్స్‌రాకెట్, వనజాక్షి, రిషితేశ్వరి వంటి ఘటనల్ని మహిళలు మరువరు. మహిళలపై వేధింపుల్లో నాడు రాష్ట్రం దేశంలోనే 4వ స్థానంలో, అక్రమ రవాణాలో రెండో స్థానంలో ఉండేది. స్వార్థ రాజకీయాలకు మహిళల్ని అడ్డుపెట్టుకునే నీచుడు చంద్రబాబు. ఆనాడు లక్ష్మీపార్వతిని అడ్డం పెట్టుకుని ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచాడు. ఇటీవల సొంత భార్యను కూడా స్వార్థ రాజకీయానికి వాడుకోవాలని చూసిన దుర్మార్గుడు. బాబు దత్తపుత్రుడైన పవన్ ఉన్మాదంతో ప్రభుత్వంపై దు్రష్పచారం చేస్తున్నాడు’ అని దుయ్యబట్టారు. సీఎం జగనన్న అంటే రాష్ట్ర ప్రజలకు ఒక నమ్మకం, ధైర్యమని సునీత చెప్పారు. -
ఎమ్మెల్సీ అభ్యర్థులకు బీఫామ్స్ అందించిన సీఎం జగన్ (ఫొటోలు)
-
ఏపీ: నామినేషన్ దాఖలు చేసిన ఎమ్మెల్సీ అభ్యర్థులు
సాక్షి, తాడేపల్లి: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా వైఎస్సార్సీపీ అభ్యర్థులు గురువారం నామినేషన్లు దాఖలు చేశారు. ఏడుగురు వైఎస్సార్సీపీ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్లు వేసిన వారిలో పెనుమత్స సురేష్, కోలా గురువులు, ఇజ్రాయిల్, మర్రి రాజశేఖర్, జయమంగళ వెంకట రమణ, పోతుల సునీత, చంద్రగిరి యేసురత్నంలు ఉన్నారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు తొలుత సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకోగా వారికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బీ ఫారమ్స్ అందజేశారు. అనంతరం వారు అసెంబ్లీ కార్యాలయంలో నామినేషన్లు దాఖలు చేశారు. ► నామినేషన్ సందర్భంగా అభ్యర్థులతో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి, మంత్రి అంబటి రాంబాబు, ఎంపీలు అయోధ్య రామిరెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్, లావు శ్రీ కృష్ణ దేవరాయలు, నందిగం సురేష్, ఎమ్మెల్యేలు గోపిరెడ్డి, నంబురి శంకర్ రావు, ఉండవల్లి శ్రీ దేవి, దూలం నాగేశ్వరరావు, ఎమ్మెల్సీలు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, తలసిల రఘురామ్, జంగా కృష్ణ మూర్తిలు ఉన్నారు. -
‘కీచకుల పార్టీగా టీడీపీ.. మహిళలపై అకృత్యాలకు బాబు సమాధానం చెప్పాలి’
తనకల్లు : మహిళలపై టీడీపీ నాయకులు చేస్తున్న అకృత్యాలకు చంద్రబాబు సమాధానం చెప్పాలని వైఎస్సార్సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ పోతుల సునీత డిమాండ్ చేశారు. శ్రీసత్యసాయి జిల్లా తనకల్లు మండలం ఎర్రబల్లిలో టీడీపీ నేత వేధింపులకు బలైన ఇంటర్ విద్యార్థిని సంధ్యారాణి తల్లిదండ్రులను ఎమ్మెల్యే డాక్టర్ సిద్దారెడ్డితో కలిసి ఆదివారం ఆమె పరామర్శించారు. ఈ సందర్భంగా ధైర్యంగా ఉండాలని, ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని సంధ్యారాణి తల్లిదండ్రులు శ్రీనివాసులు, రాధమ్మలకు భరోసా ఇచ్చారు. సంధ్యారాణి బలవన్మరణానికి కారణమైన టీడీపీ నేత రాళ్లపల్లి ఇంతియాజ్‌కు ఆ పార్టీ నాయకులు అండగా నిలవాలని చూడడం దారుణమన్నారు. టీడీపీ పాలనలో రాష్ట్ర వ్యాప్తంగా మహిళలపై జరిగిన దాడులు, వేధింపులను ప్రజలు మరచిపోలేదన్నారు. టీడీపీ కీచకుల పార్టీగా మారిపోయిందని, ఆ పార్టీ నాయకులు మృగాళ్లలా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ కార్యకర్త కుమార్తెను ఆ పార్టీ నాయకుడే కాలయముడిగా మారి ప్రాణాలు తీసుకోవడానికి కారణమయ్యాడని, అలాంటి దుర్మార్గుడిని రక్షించాలని ప్రయత్నించడం ఎంతవరకు సమంజసమని చంద్రబాబును పోతుల సునీత ప్రశ్నించారు. -
‘మందు, మగువ లేకపోతే లోకేష్‌కు నిద్రపట్టదు’
సాక్షి, తాడేపల్లి: టీడీపీ అధినేత నారా చంద్రబాబుపై ఎమ్మెల్సీ పోతుల సునీత ఫైరయ్యారు. ఆయన పేరు నారా చంద్రబాబు కాదు.. సారా చంద్రబాబు అంటూ ఎద్దేవా చేశారు. చంద్రబాబు ఫ్యామిలీనే తాగుబోతు కుటుంబం అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పోతుల సునీత ఆదివారం తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ.. ‘నారా చంద్రబాబు కాదు.. సారా చంద్రబాబు నాయుడు. పైకి పాల వ్యాపారం.. తెర వెనుక సారా పరిశ్రమ. భువనేశ్వరి, బ్రాహ్మణికి మద్యం ద్వారా రోజూ రూ.కోటి ఆదాయం అందుతోంది. బీ-3 బ్రాండ్లు అంటే భువనేశ్వరి, బ్రాహ్మాణి, బాబు అని అర్థం. మగువ, మందు లేనిదే లోకేష్‌కు నిద్రపట్టదు. టోటల్‌గా బాబు కుటుంబమే తాగుబోతు ఫ్యామిలీ. చంద్రబాబు హయంలోనే డిస్టిలరీలు, బ్రూవరీలన్నింటికీ లైసెన్స్‌లు ఇచ్చారు. 240 మద్యం బ్రాండ్లను చంద్రబాబే తీసుకొచ్చారు. ప్రజలను తాగుబోతులుగా మార్చి చంద్రబాబు వేల కోట్లు ఆర్జించారు. చుక్క లేకపోతే చంద్రబాబు, లోకేష్ ఒక్కమాట కూడా మాట్లాడలేరు. వెన్నుపోటు రాజకీయాలకు చంద్రబాబు పెట్టింది పేరు. చంద్రబాబు పాలనంతా దాచుకోవడం, పంచుకోవడం, తినడమే. పులివెందుల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదు. పేద ప్రజల అభివృద్ధే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలన చేస్తున్నారు. మేనిఫెస్టోలో లేని సంక్షేమ పథకాలను సీఎం వైఎస్ జగన్ అమలు చేస్తున్నారు. అవినీతి లేకుండా అర్హతే ప్రామాణికంగా సంక్షేమ పథకాలు అమలుచేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై పచ్చమీడియా తప్పుడు రాతలు మానుకోవాలి’ అని సూచించారు. ఇది కూడా చదవండి: చంద్రబాబుకు చెక్.. జూనియర్ ఎన్టీఆర్ సేవలను వాడుకుంటాము: సోము వీర్రాజు -
వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ అభ్యర్ధి ఖరారు
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో ఖాళీ అయిన స్థానానికి అధికార వైఎస్సార్సీపీ అభ్యర్థిని ఖరారు చేసింది. మాజీ ఎమ్మెల్సీ పోతుల సునీతను అభ్యర్థిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించారు. సీఎం వైఎస్ జగన్ చేతుల మీదుగా ఆమె బీఫామ్ అందుకున్నారు. తన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసినందుకు సోమవారం సీఎంను మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. సునీత వెంట బాలినేని శ్రీనివాసరెడ్డి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, పోతుల సురేష్ ఉన్నారు. కాగా మండలిలో ఖాళీగా ఉన్న ఓ స్థానానికి ఇదివరకే నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే. గతంలో టీడీపీ ఎమ్మెల్సీగా కొనసాగిన సునీత.. ఆ పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు తీరును నిరశిస్తూ రాజీనామా చేశారు. అనంతరం వైఎస్సార్సీపీలో చేరారు. తాజాగా ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఖరారు అయ్యారు. -
అందుకే రాజీనామా చేశా : పోతుల సునీత
సాక్షి, విజయవాడ : ప్రతిపక్ష నేతగా చంద్రబాబు నాయుడు విఫలం అయ్యారని పోతుల సునీత విమర్శించారు. గత 15 నెలలుగా రాష్ట్రంలో టీడీపీ చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసినట్లు ఆమె తెలిపారు. బీసీలని కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలు కోసం మాత్రమే వాడుకున్నారని ధ్వజమెత్తారు. గత 20 సంవత్సరాలుగా టీడీపీలో ఉన్న తానే అనేక అవమానాలకు గురి అయ్యానని పోతుల సునీత తెలిపారు. (చదవండి : టీడీపీకి షాక్: ఎమ్మెల్సీ పదవికి సునీత రాజీనామా) టీడీపీ వైఖరి అంబేడ్కర్ స్ఫూర్తికి తూట్లు పొడుస్తోందని, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా సీఎం వైఎస్ జగన్ పాలన కొనసాగుతోందని ప్రశంసించారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్ని వర్గాలకు మేలు చేస్తున్నారని, అందుకే ఆయనకు మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరే అంశంపై పార్టీ పెద్దలతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని అన్నారు. కాగా పోతుల సునీత తన రాజీనామా లేఖను శాసనమండలి చైర్మన్‌కు పంపించారు. -
ఎంపీ సమక్షంలో తెలుగు తమ్ముళ్ల తన్నులాట!
-
ఎంపీ సమక్షంలో తెలుగు తమ్ముళ్ల తన్నులాట!
చీరాల : వికలాంగులకు సర్టిఫికెట్ల పంపిణీ కార్యక్రమంలో పచ్చ తమ్ముళ్ల మధ్య వివాదం చోటుచేసుకుంది. ఎంపీ మాల్యాద్రి సమక్షంలో రెండు వర్గాలకు చెందిన తెలుగు తమ్ముళ్లు తున్నులాటకు దిగారు. ఈ ఘటన ప్రకాశం జిల్లా చీరాల మున్సిపల్ హైస్కూల్ గ్రాండ్లో బుధవారం జరిగింది. బాపట్ల ఎంపీ మాల్యాద్రి సమక్షంలోనే చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్, పోతుల సునీత వర్గీయుల మధ్య వివాదం చెలరేగడం గమనార్హం. ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ వారం రోజుల కిందటే టీడీపీలో చేరిన విషయం విదితమే. అయితే ఆమంచి చేరికను పోతుల సునీత వర్గీయులు వ్యతిరేకించినప్పటికీ, రాజకీయ ప్రయోజనాల దృష్ట్యా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆమంచిని పార్టీలోకి చేర్చుకున్నారు. దీంతో రెండు వర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా పరిస్థితులు తయారయ్యాయి. బుధవారం ఓ కార్యక్రమానికి హాజరైన సందర్భంగా ఎమ్మెల్యేని వేదికపైకి ఆహ్వానించగా, దీన్ని సునీత వర్గం వ్యతిరేకించింది. దీంతో పరిస్థితి అదుపుతప్పి, ఇరువర్గీయుల కార్యకర్తలు బాహాబాహీకి దిగారు. అంతటితో ఆగకుండా ఒకవర్గంపై మరోవర్గం వారు కుర్చీలు విసురుకుని కార్యక్రమాన్ని రసాభాసగా మార్చేశారు. ఇరువర్గాల కార్యకర్తలకు గాయాలయినట్లు తెలుస్తోంది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు కార్యకర్తలను చెదరగొట్టి గొడవ సద్దుమణిగేలా చేశారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించినిట్లు పోలీసులు తెలిపారు. పోతుల సునీత, ఆమంచి వర్గాల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. -
‘ఆమంచి’పై సీబీఐ విచారణ కోరుతాం
చీరాల, న్యూస్‌లైన్ : చీరాల నియోజకవర్గం కేంద్రంగా ఆమంచి కృష్ణమోహన్ చేస్తున్న అక్రమాలపై టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే సీబీఐ ద్వారా విచారణ కోరుతామని ఆ పార్టీ అసెంబ్లీ అభ్యర్థి పోతుల సునీత భర్త సురేష్ పేర్కొన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో ఆమంచి అక్రమాలకు పాల్పడి నెగ్గారని.. చీరాల్లో రీపోలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేస్తూ సోమవారం టీడీపీ ఆధ్వర్యంలో పట్టణ బంద్ నిర్వహించారు. పోతుల సురేష్ ఆధ్వర్యంలో టీడీపీ కార్యకర్తలు, నాయకులు పట్టణంలో ర్యాలీ నిర్వహించి బస్టాండ్ వద్ద బైఠాయించి ఆమంచికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సురేష్ మాట్లాడుతూ ఆమంచి అక్రమాలకు సంబంధించి తమ వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయని చెప్పారు. మున్సిపల్ ఎన్నికల్లో తన ప్యానల్ ఓటమి చెందితే సార్వత్రిక ఎన్నికల్లో తాను గెలిచినా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ఆమంచి విలేకరుల సమావేశంలో చెప్పి ఇప్పుడెందుకు మౌనంగా ఉన్నారని ఎద్దేవా చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో ఆయన ప్యానల్‌కు ఆరు కౌన్సిలర్ సీట్లు మాత్రమే దక్కాయని, ఆమంచి మాట మీద నిలబడే వ్యక్తే అయితే వెంటనే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పార్టీ నుంచి తీసుకున్న డబ్బుకు లెక్కచెప్పలేకే తాము ఇదంతా చేస్తున్నట్లు ఆమంచి అనడం తన అవివేకానికి నిదర్శనమన్నారు. అడవుల్లో ఉన్నా.. జనజీవనంలో ఉన్నా పేద ప్రజల కోసం పట్టుదలతో పనిచేస్తామని, ఆమంచిలా నీచరాజకీయాలకు పాల్పడమన్నారు.