జగన్‌ పాలన చూసి ఓర్వలేకే బాబు, పవన్‌ల ఆరోపణలు  | Pothula Sunitha comments over chandrababu naidu | Sakshi
Sakshi News home page

జగన్‌ పాలన చూసి ఓర్వలేకే బాబు, పవన్‌ల ఆరోపణలు 

Published Fri, Apr 26 2024 5:37 AM | Last Updated on Fri, Apr 26 2024 5:37 AM

Pothula Sunitha comments over chandrababu naidu

చంద్రబాబు చెబుతున్న సూపర్‌ సిక్స్‌ పథకాలను ప్రజలు నమ్మడం లేదు. 

వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు పోతుల సునీత  

సాక్షి,అమరావతి :  సీఎం జగన్‌పై చంద్రబాబు తరచూ చేసే విమర్శలకు ఇక స్వస్తి పలకాలని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ, పార్టీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు పోతుల సునీత కోరారు. తాడేపల్లి వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం ఆమె మీడియాతో మాట్లాడారు. ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రకి ప్రజలు బ్రహ్మరథం పట్టారని, ఇది చూశాక అయినా బాబు, ఎర్ర బుక్‌ లోకేశ్‌లో, టీడీపీ నేతల్లో, పావలా కళ్యాణ్‌లో మార్పు రావాలన్నారు.

సీఎం జగన్‌ పాలనలో ఎక్కడా అవినీతికి తావు లేకుండా ఇంటి వద్దకే పథకాలు వచ్చేలా పాలన నడిచిందన్నారు. ఈ పాలనను చూసి ఓర్చుకోలేక చంద్రబాబు, పవన్‌లు ఇలా ఆరోపణలు చేస్తున్నారని దుయ్యబట్టారు. మళ్లీ జగనే సీఎం అవ్వాలని ప్రజలందరూ కోరుకుంటున్నారని, వైఎస్సార్‌సీపీ భారీ మెజారిటీతో మళ్లీ గెలవబోతోందన్నారు. 

ప్రజా విశ్వాసం లేని లోకేశ్, చంద్రబాబులు మంగళగిరి, కుప్పంలో గెలిచే పరిస్థితి లేదన్నారు. చంద్రబాబు చెబుతున్న సూపర్‌ సిక్స్‌ పథకాలను జనం నమ్మకపోవడంతో.. సీఎం జగన్‌పై దూషణలు, అనుచిత వ్యాఖ్యలు, వ్యక్తిగతంగా కించపరచడం వంటివి చేస్తున్నారని మండిపడ్డారు.   

విద్యారంగంపై ఎల్లో మీడియాలో దుర్మార్గపు వార్తలు  
విద్యారంగంపై ఎల్లో మీడియాలో దుర్మార్గపు వార్తలు రాస్తున్నారని వైఎస్సార్‌సీపీ గ్రీ­వెన్స్‌ సెల్‌ చైర్మన్‌ ఎ.నాగ నారాయణమూర్తి మండిపడ్డారు. నాడు–నేడు కింద అభివృద్ధి జరిగిన పాఠశాలలు కనిపించడం లేదా  రామోజీ? అంటూ నిలదీశారు. 

టీడీపీ హ­యాంలో స్కూల్స్‌ మూత వేసినట్టు ఎల్లో మీడియాలోనూ వార్తలు వచ్చాయని, ఆ మే­రకు బాబు జీవోలు కూడా ఇచి్చన విషయాన్ని గుర్తు చేశారు. విద్యా వ్యవస్థలో సీఎం జగన్‌ తెచ్చిన సంస్కరణలపై ఎల్లో మీడియా విషం చిమ్ముతోందన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement