సాక్షి, నరసాపురం రూరల్ : నరసాపురం నుంచి పాలకొల్లు వెళ్లే రోడ్డులో పద్మశ్రీ కాలనీ సమీపంలో గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. రెండు బైక్‌లపై ప్రయాణిస్తున్న యువకులను గుర్తుతెలియని వాహనం ఢీ కొట్టినట్టు పేర్కొంటున్నారు. అయితే ఎదురెదురుగా వస్తున్న రెండు బైక్‌లు ఢీకొన్న తరువాత ప్రమాదం జరిగిందేమో అనే అనుమానం కూడా వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదంలో మరణించిన, గాయపడిన వారంతా ఇంటర్ చదువుతున్న విద్యార్థులే. రోడ్డుపై చెల్లా చెదురుగా పడిఉన్న మృతదేహాలతో ఆ ప్రాంతం రక్తపు మడుగులా మారింది.
చదవండి: (పాఠశాల సమీపంలో ఘర్షణ.. ఏడో తరగతి విద్యార్థి మృతి)
ప్రమాదంలో పోడూరు మండలం జిన్నూరుకు చెందిన చదలవాడ వంశీ, నరసాపురం కనకదుర్గా థియేటర్ ప్రాంతానికి చెందిన చాట్ల ముఖేష్ కుమార్(16), నరసాపురం వనువులమ్మగుడి ప్రాంతానికి చెందిన సమతం సుబ్రహ్మణ్యం(17) అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్ర గాయాలైన పోడూరు మండలం జిన్నూరుకు చెందిన ఇంజమూరి గని, నరసాపురం పెద్దచర్చి ప్రాంతానికి చెందిన లంకాని సాయికుమార్‌లను చికిత్స కోసం పోలీసులు 108 అంబులెన్స్‌లో భీమవరంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. మూడు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం నరసాపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. నరసా పురం సీఐ శ్రీనివాసయాదవ్ పర్యవేక్షణలో రూరల్ ఎస్సై ప్రియకుమార్ కేసు దర్యాప్తు చేస్తున్నారు.
చదవండి: (భార్యపై కోపంతో కారు, 4 బైకులకు నిప్పు పెట్టిన ఐటీ ఉద్యోగి)
Comments
Please login to add a commentAdd a comment