inter students
-
బ్యాటర్‌కు ఉన్నంత ఏకాగ్రత ఉండాలి
న్యూఢిల్లీ: విద్యార్థుల్లో పరీక్షలపై ఉండే భయాలను పోగొడుతూ, వారిలో ఆత్మస్థైర్యాన్ని పెంపొందిస్తూ ఆద్యంతం స్ఫూర్తివంతంగా సాగే ప్రధాని మోదీ ‘పరీక్షా పే చర్చా’కార్యక్రమం సోమవారం ఢిల్లీలో జరిగింది. 8వ ఎడిషన్‌లో భాగంగా ఈసారి కూడా ప్రధాని మోదీతో నేరుగా సంభాషించేందుకు కోట్లాది మంది ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకోగా కేవలం 35 మందికి మాత్రమే నేరుగా మాట్లాడే అవకాశం దక్కింది. ఢిల్లీలోని సుందర్ నర్సరీ వనంలో నిర్వహించిన కార్యక్రమంలో వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన విద్యార్థులనుద్దేశించి మోదీ ప్రసంగించారు. ‘‘పరీక్షల ఒత్తిడిని విద్యార్థులు క్రికెట్ స్టేడియంలో బ్యాటర్‌లాగా ఎదుర్కోవాలి. తర్వాతి బంతికి ఫోర్ కొట్టు, సిక్స్ కొట్టు అంటూ వేలాది మంది ప్రేక్షకులు అరుస్తున్నా, ఈలలు వేస్తున్నా బ్యాటర్‌కు ఇవేం వినిపించవు. ఒక్క బంతి మీద మాత్రమే దృష్టిపెడతాడు. అంతటి ఏకాగ్రతను మీరూ సాధించండి. పరీక్షలు అనే ఒత్తిళ్లకు లొంగకుండా చదువు మీద మాత్రమే మీరు పూర్తిగా ధ్యాస పెట్టాలి. గత పరీక్షల ఫలితాల కంటే మెరుగైన మార్కులు తెచ్చుకుంటానని మీకు మీరే సవాల్ విసురుకోండి. పోషకాహారం తీసుకోండి. ధ్యానంపై దృష్టిపెట్టండి. జ్ఞానం, పరీక్షలు అనేవి భిన్నమైన అంశాలు. పరీక్షలే లోకంగా ఎప్పుడూ బతకొద్దు. సమయాన్ని సమర్థవంతంగా సద్వినియోగం చేసుకోవడం నేర్చుకోవాలి. సమయాన్ని ఎంత ఎక్కువగా సద్వినియోగం చేస్తారో జీవితంలో అంతపైకి ఎదుగుతారు. ప్రతి క్షణాన్ని ఆస్వాదించండి. ఆశావహ దృక్పథాన్ని అలవర్చుకోండి. సానుకూలతతో దేనినైనా సాధించవచ్చు’’అని మోదీ అన్నారు. ‘‘ఇటీవలికాలంలో సమాజంలో ఒక ఆలోచన బలంగా నాటుకుపోయింది. విద్యార్థులు పది, 12వ తరగతుల్లో సరిగా చదవక మార్కులు తక్కువొస్తే ఆ విద్యార్థి జీవితం నాశనమైనట్లేనని తల్లిదండ్రులు ఒక నిశ్చయానికి వచ్చేస్తున్నారు. విద్యార్థులేమీ రోబోట్లు కాదు. విద్య అనేది కేవలం తదుపరి తరగతికి అర్హత సాధించేందుకు ఉద్దేశించిందికాదు. విద్యార్థి సమగ్రాభివృద్ధికి విద్య ఒక సోపానం. తక్కువ గ్రేడ్లు వచి్చనప్పుడు సమాజం నుంచి విద్యార్థులు తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ఇలాంటి ఒత్తిళ్లను పక్కనబెట్టి విద్యార్థులు మిమ్మల్ని మీరు సవాల్‌గా తీసుకుని చదవండి. మంచిగా నిద్రపొండి. అత్యధిక స్కోర్ రాలేదంటే తమ పని అయిపోయిందనే ఆలోచనతో లోయలోకి విద్యార్థులు పడిపోవద్దు’’అని అన్నారు. ఆన్లైన్లో కోట్లాది మంది విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ఈ కార్యక్రమాన్ని వీక్షించారు. -
ఇద్దరు ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్య
పోచారం/నిజాంపేట/ బీబీనగర్/ భానుపురి (సూర్యాపేట): వేర్వేరు కాలేజీల్లో ఇద్దరు ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. మరో ఘట నలో బీఎస్సీ నర్సింగ్ విద్యార్థిని ఆత్మహత్యా యత్నం చేసింది. వివరాలు ఇలా ఉన్నాయి. అన్నోజిగూడ నారాయణ కళాశాలలో...బీబీనగర్ మండలంలోని పెద్దపలుగు తండాకు చెందిన బానోతు తనుష్‌నాయక్ (16) తల్లిదండ్రులు నగరానికి వలస వచ్చి కుషాయిగూడలోని చక్రీపురంలో ఉంటున్నారు. అన్నోజిగూడలోని నారాయణ జూనియర్ కళాశాలలో తనుష్‌ను ఇంటర్ ఫస్టియర్(ఎంపీసీ)లో చేర్పించారు. సోమవారం సాయంత్రం హాస్టల్ బాత్రూమ్లోకి వెళ్లిన తనుష్ ఎంత సేపటికీ బయటకు రాలేదు. దీంతో తోటి విద్యార్థులు, హాస్టల్ సిబ్బంది తలుపులు పగులగొట్టి చూడగా..తనుష్ ఉరేసుకొని వేలాడుతూ కనిపించాడు. వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. దీంతో నేరుగా గాంధీ ఆస్పత్రికి తరలించారు. తనుష్కు ఫిట్స్ వచ్చాయని కళాశాల నిర్వాహకులు చెబుతుండగా..అధ్యాపకుల ఒత్తిడి కారణంగానే ఆత్మహత్య చేసుకొని ఉంటాడని తల్లిదండ్రులు, బంధువులు, విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపించారు. ఎన్ఎస్ఆర్ కళాశాలలో...నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం చిన్నతడం గ్రామానికి చెందిన ప్రజ్ఞారెడ్డి ప్రగతినగర్‌లోని ఎన్ఎస్ఆర్ ఇంపల్స్ ఐఐటీ గల్స్ క్యాంపస్‌లో ఎంపీసీ ద్వితీయ సంవత్సరం చదువుతూ కళాశాలకు చెందిన హాస్టల్లో ఉంటోంది. సోమవారం ఉదయం 9.30 గంటల సమయంలో ప్రజ్ఞారెడ్డి తాను ఉంటున్న హాస్టల్ గదిలో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. అయితే విద్యార్థిని మృతి చెందిన విషయాన్ని దాచి పెట్టిన కళాశాల యాజమాన్యం హుటా హుటిన మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించింది. దీనిపై పలు అనుమానాలు వ్యక్తమవుతు న్నాయి. వేధింపుల కారణంగా ఆత్మహత్య చేసుకుందా లేక ఇతరత్రా కారణాలేమైనా ఉన్నాయా అన్న కోణంలో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కాగా ఎన్ఎస్ఆర్ ఇంపల్స్ ఐఐటీ క్యాంపస్‌కు ఇంటర్ బోర్డు అనుమతి లేదని సమాచారం. ఫీజు చెల్లించాలని ఒత్తిడి చేయడంతో....సూర్యాపేట జిల్లా కోదాడ స్నేహ నర్సింగ్ కళాశాలలో అసోం రాష్ట్రానికి చెందిన నర్గిస్ పర్వీన్ బీఎస్సీ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. కొద్ది రోజులుగా ఫీజు చెల్లించాలని కాలేజీ యాజమాన్యం ఒత్తిడి చేయడంతో బుధవారం రాత్రి కాలేజీ హాస్టల్లో శానిటైజర్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఆమెను సూర్యాపేట ఆస్పత్రిలో చేర్పించగా..కోలుకుంది. మళ్లీ ఫీజు చెల్లించాలని కాలేజీ యాజమాన్యం డిమాండ్ చేయడంతో సోమవారం గ్రీవెన్స్‌డేలో కలెక్టర్‌కు ఫిర్యాదు చేసేందుకు కాలేజీకి చెందిన పలువురు విద్యార్థులతో కలిసి ఆమె సూర్యాపేటలోని కలెక్టరేట్‌కు వచ్చింది. వారంతా కలిసి కలెక్టరేట్లో వినతిపత్రం అందించారు. ఆ తర్వాత కలెక్టరేట్ ఎదుట నిరసన వ్యక్తం చేస్తున్న క్రమంలో బాధిత విద్యార్థిని తన వెంట తెచ్చుకున్న శానిటైజర్ తాగి మళ్లీ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. దీంతో వెంటనే కలెక్టరేట్లో విధులు నిర్వర్తిస్తున్న పోలీస్ సిబ్బంది ఆమెను సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న నర్గిస్ పర్వీన్ కలెక్టర్ తేజస్ నంద్లాల్ పరామర్శించారు. -
సిలబస్ అయ్యేదెప్పుడు? శిక్షణ ఇచ్చేదెప్పుడు?
సాక్షి, హైదరాబాద్: జేఈఈ పరీక్ష జనవరి 22వ తేదీ నుంచి జరుగుతుందంటూ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) షెడ్యూల్ ప్రకటించిన నేపథ్యంలో ఈ ఏడాది ఇంజనీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ ఉమ్మడి ప్రవేశ పరీక్ష (టీజీఈఏపీ సెట్) గతానికంటే నెల రోజుల ముందు ఏప్రిల్‌లోనే నిర్వహించాలని ఉన్నత విద్యా మండలి భావిస్తోంది. దీంతో ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో చదువుతున్న విద్యార్థుల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది. కాలేజీల్లో ఇప్పటికీ 80 శాతం సిలబస్ కూడా పూర్తి కాకపోవడంతో, సిలబస్ పూర్తయ్యేదెప్పుడు? జేఈఈ శిక్షణ పొందేదెప్పుడు? అనే టెన్షన్ మొదలైనట్లు ఇంటర్ బోర్డు వర్గాలే వెల్లడిస్తున్నాయి. కొన్ని కాలేజీల్లో గెస్ట్ లెక్చరర్లను తీసుకోవడం ఆలస్యం కావడం, కొత్త కాలేజీలకు సిబ్బందిని ఇవ్వకపోవడంతో ఇంటర్ సిలబస్ అరకొరగానే పూర్తయింది. దీంతో జాతీయ, రాష్ట్ర స్థాయి పోటీ పరీక్షలకు సిద్ధమవ్వడం ఎలా అనే ఆందోళన విద్యార్థుల్లో కన్పిస్తోంది. ఇంటర్ బోర్డులోనూ ఆందోళన..: ఇంటర్ బోర్డు తాజాగా సేకరించిన వివరాల ప్రకారం.. ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థుల్లో ఎక్కువ మందిలో టెన్షన్ కన్పిస్తోంది. దీంతో దీన్ని దూరం చేసేందుకు అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు బోర్డు సూచించింది. మరోవైపు విద్యార్థుల్లో ఆందోళనకు సంబంధించి వైద్య, విద్యాశాఖ గత ఏడాది ఇచ్చిన నివేదిక బోర్డు అధికారులకు ఆందోళన కల్గిస్తోంది. పరీక్ష ఫెయిల్ అవుతున్న వారిలో 48 శాతం టెన్షన్ కారణంగానే విఫలమవుతున్నట్టు తేల్చారు. వీరిలో 36 శాతం తీవ్రమైన టెన్షన్‌కు లోనవుతున్నారు. 23 శాతం విద్యార్థులు పరీక్షల తేదీ ప్రకటించినప్పటి నుంచే టెన్షన్ పడుతూ, పరీక్ష అనుకున్న విధంగా రాయలేకపోతున్నారని తేలింది. మొదటి పరీక్ష ఏమాత్రం కష్టంగా ఉన్నా, ఆ ప్రభావం రెండో పరీక్షపై పడుతోందని అధ్యయనంలో వెల్లడైంది. రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీలు కలిపి ఏటా సగటున 4 లక్షల మందికి పైగా ఫస్టియర్ పరీక్షలు రాస్తున్నారు. రెండో ఏడాది పరీక్షలు 3.80 లక్షల మందికి పైగా రాస్తుండగా సగటున 40 శాతం మంది ఫెయిల్ అవుతున్నారు. మూడంచెల సన్నద్ధతవిద్యార్థుల్లో టెన్షన్‌ను దూరం చేసే కార్యాచరణ చేపట్టడంతో పాటు, జేఈఈ, ఈఏపీ సెట్‌కు సన్నద్ధం చేయడానికి ఇదే మంచి తరుణమని ఇంటర్ బోర్డు అధికారులు అంటున్నారు. ఇందుకు ప్రణాళికబద్ధమైన కార్యాచరణ అవసరమని సూచిస్తున్నారు. మూడంచెల విధానం ద్వారా మానసిక ఒత్తిడిని దూరం చేయాలని భావిస్తున్న అధికారులు, ఒత్తిడికి గురయ్యే విద్యార్థులను గుర్తించి పరీక్షలపై కౌన్సెలింగ్ ఇచ్చేందుకు నిపుణులను రప్పించే యోచనలో ఉన్నారు. దీని తర్వాత 60 రోజుల పాటు ముఖ్యమైన పాఠ్యాంశాలపై అధ్యాపకులు ప్రత్యేక శిక్షణ ఇస్తారు. ఇక మూడో దశలో పరీక్షలపై భయం పోగొట్టేందుకు ప్రత్యేక పరీక్షలు నిర్వహించాలని భావిస్తున్నారు. కొన్ని జిల్లాలపై ప్రత్యేక ఫోకస్సిలబస్ పూర్తి కాకపోవడం విద్యార్థుల్లో ఆందోళనకు ప్రధాన కారణమని అధ్యయనాల్లో తేలింది. దీనివల్ల పరీక్షల్లో ఏమొస్తుందో? ఎలా రాయాలో? అన్న ఆందోళన పరీక్షల సమయంలో పెరుగుతోందని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఫెయిల్ అవుతున్న 40 శాతం విద్యార్థుల్లో కనీసం 22 శాతం మంది ఈ తరహా ఆందోళన ఎదుర్కొంటున్నారు. దీన్ని పరిగణనలోకి తీసుకుని కొన్ని జిల్లాలపై ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టాలని ఇంటర్ బోర్డు అధికారులు నిర్ణయించారు. ఇంటర్ ఫస్టియర్‌లో 50 శాతం కన్నా తక్కువ ఫలితాలు సాధిస్తున్న జిల్లాల్లో జగిత్యాల, నిర్మల్, యాదాద్రి, జనగాం, కరీంనగర్, సూర్యాపేట, సిద్దిపేట, మేడ్చల్ ఉండగా.. సెకండియర్‌లో మెదక్, నాగర్‌కర్నూల్, వరంగల్, నారాయణపేట, సూర్యాపేట, హైదరాబాద్, పెద్దపల్లి జిల్లాలు ఈ జాబితాలో ఉన్నాయి. ప్రస్తుతం ఆయా జిల్లాలపై ప్రత్యేక ఫోకస్ పెట్టనున్నారు. ప్రైవేటులో ఇప్పటికే రివిజన్ షురూరాష్ట్రంలో జూనియర్ కళాశాలల్లో ఏటా ఫస్టియర్, సెకండియర్ పరీక్షలు రాసే విద్యార్థుల్లో సుమారు మూడు వంతులు ప్రైవేటు కాలేజీల విద్యార్థులే కావడం గమనార్హం. అంటే మొత్తం 7.8 లక్షలకు పైగా విద్యార్థుల్లో సుమారు 6 లక్షల మంది ప్రైవేటు విద్యార్థులే ఉంటున్నారు. కాగా ఈ కాలేజీల్లో ఇప్పటికే ఇంటర్మీడియెట్ సిలబస్ పూర్తయింది. రివిజన్ కూడా చేపట్టారు. దీంతో జేఈఈ ప్రిపరేషన్ దిశగా యాజమాన్యాలు సన్నాహాలు మొదలు పెట్టాయి. బోధనా సిబ్బంది, ప్రత్యేక తరగతుల ఏర్పాట్లు జరుగుతున్నాయి.ఇప్పట్నుంచే తర్ఫీదు ఇవ్వాలివిద్యార్థులకు ఇప్పట్నుంచే పోటీ పరీక్షల దిశగా శిక్షణ ఇవ్వాలి. చాలా కాలేజీల్లో ప్రత్యేక శిక్షణ మొదలైంది. అయితే కొత్త కాలేజీలకు తగిన సిబ్బందిని కేటాయించడం, గెస్ట్ లెక్చరర్లను తీసుకోవడంలో జరిగిన ఆలస్యంతో ప్రైవేటు కాలేజీలతో సమానంగా ప్రభుత్వ కాలేజీలు పోటీ పడలేని పరిస్థితి నెలకొంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని బోర్డు ప్రత్యేక శిక్షణా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. – మాచర్ల రామకృష్ణ గౌడ్ (ప్రభుత్వ లెక్చరర్ల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి) -
ఏడుగురు ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్య
సాక్షి, నెట్వర్క్: ఏడుగురు ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. బుధవారం ఇంటర్మిడియెట్ పరీక్షల ఫలితాలు వెల్లడైన నేపథ్యంలో ఫెయిలైన ఆరుగురు విద్యార్థులు మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడగా, ఫెయిలవుతాననే భయంతో ఇంకొక విద్యార్థిని బలవన్మరణం పొందింది.సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండలం కొల్లూర్‌కు చెందిన సాయితేజ గౌడ్ (17), హైదరాబాద్ అత్తాపూర్‌కు చెందిన హరిణి, మంచిర్యాల జిల్లా తాండూర్ మండలం అచ్చులాపూర్ గ్రామానికి చెందిన మైదం సా త్విక్, మంచిర్యాల జిల్లా దొరగారిపల్లెకు చెందిన గట్టిక తేజస్విని, ఖమ్మం జిల్లా ముదిగొండకు చెందిన వాగదాని వైశాలి, మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం చిలుకోడు గ్రామానికి చెందిన చిప్పా భార్గవి ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు.సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం పతూరు గ్రామానికి చెందిన ఒకేషనల్ ఫస్టియర్ విద్యార్థిని శ్రీజ ఫెయిలైతే అందరి ముందు అవమానం ఎదుర్కోవాల్సి వస్తుందనే భయంతో మంగళవారం రాత్రి పురుగుల మందు సేవించింది. వెంటనే కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందింది. అయితే, పరీక్ష ఫలితాల్లో ఆమె పాసైనట్లు వెల్లడైంది. ఆయా విద్యార్థుల కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. -
టెన్త్, ఇంటర్ విద్యార్థులకు ఏపీఎస్ఆర్టీసీ గుడ్‌న్యూస్
సాక్షి, విజయవాడ: టెన్త్, ఇంటర్ పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు ఏపీఎస్ఆర్టీసీ శుభవార్త తెలిపింది. పరీక్షల సమయంలో విద్యార్ధులకు బాసటగా నిలుస్తూ.. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే అవకాశం కల్పించింది. విద్యార్థులు హాల్‌టికెట్లు చూపించి పరీక్ష కేంద్రాలకు ఉచితంగా ప్రయాణించవచ్చని పేర్కొంది. పల్లె వెలుగు, ఆల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ బస్సుల్లో ఈ ఉచిత ప్రయాణ సదుపాయం కల్పిస్తోంది. కాగా, టెన్త్, ఇంటర్ విద్యార్థులు కలిపి 16 లక్షల మంది(టెన్త్‌లో 6 లక్షలు, ఇంటర్లో 10 లక్షలు) మంది పరీక్షలు రాయబోతున్నారు. 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు 2024 మార్చి 18 నుండి 30 వరకు ఉదయం 9.30 నుండి మధ్యాహ్నం 12.45 వరకు ఉంటాయి. ఇంటర్ పరీక్షలు మార్చి 1వ తేదీ నుంచి 18వ తేదీ వరకు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు జరుగుతాయి. -
అటెన్షన్ ఉంటే..టెన్షన్ ఎందుకు?
సాక్షి, హైదరాబాద్ : పరీక్షల ఫోబియాతోనే ఇంటర్లో విద్యార్థుల ఉత్తీర్ణత శాతం సగానికి తగ్గుతోంది. హైటెన్షన్‌కు గురయ్యే విద్యార్థులు 36 శాతం ఉంటుండగా, పరీక్షల షెడ్యూల్ వచ్చాక టెన్షన్‌కు లోనయ్యేవారు 23 శాతం మంది ఉంటున్నారు. దీనికి సంబంధించి వైద్య, విద్యాశాఖలు రెండేళ్ల అధ్యయనం చేశాయి. మొదటి పరీక్ష కాస్త కష్టంగా ఉన్నా, ఆ ప్రభావం రెండో పరీక్షపై పడుతోందని అధ్యయనంలో వెల్లడైంది. రాష్ట్రంలో ప్రతీ సంవత్సరం ఫస్టియర్ పరీక్షలు 4.09 లక్షల మంది రాస్తున్నారు. సెకండియర్ పరీక్షలు 3.82 లక్షల మంది వరకూ రాస్తున్నారు. వీరిలో సగటున 40 శాతం మంది ఫెయిల్ అవుతున్నారు. దీంతో పరీక్షలు రాసే ప్రభుత్వ జూనియర్ కళాశాలల విద్యార్థుల టెన్షన్ దూరం చేసేందుకు ఇంటర్ బోర్డు ప్రత్యేక ప్రణాళిక రూపొందించింది. ప్రిపరేషన్‌కు ఇదే అదును రెండు నెలల ముందు నుంచే పరీక్షలకు సన్నద్ధమైతే విద్యార్థుల్లో టెన్షన్ ఉండదని ఇంటర్ అధికారులు భావిస్తున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకొని మూడంచెల విధానం ద్వారా మానసిక ఒత్తిడిని దూరం చేయాలనుకుంటున్నారు. ముందుగా విద్యార్థులను మానసికంగా సన్నద్ధం చేస్తారు. ఒత్తిడికి గురయ్యే విద్యార్థులను గుర్తించి పరీక్షలపై కౌన్సెలింగ్ ఇస్తారు. అవసరమైతే కౌన్సెలింగ్ ఇవ్వడానికి నిపుణులను రప్పించే యోచనలో ఉన్నారు. దీని తర్వాత 60 రోజుల పాటు ముఖ్యమైన పాఠ్యాంశాలపై లెక్చరర్లు ప్రత్యేక శిక్షణ ఇస్తారు. ఇందులోనూ విద్యార్థి వెనుకబడి ఉన్న సబ్జెక్టులు, పాఠ్యాంశాలను ఎంపిక చేసుకునే అవకాశాన్ని ప్రిన్సిపల్స్‌కు ఇస్తారు. మూడో దశలో పరీక్షలపై భయం పోగొట్టేందుకు ఈ 60 రోజులూ పరీక్షలు నిర్వహించాలని భావిస్తున్నారు. దీనివల్ల విద్యార్థుల్లో టెన్షన్ దూరం చేయడం తేలికని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే పరీక్షల టైంటేబుల్‌ను బోర్డు విడుదల చేసింది. త్వరలో మానసిక ఒత్తిడి తగ్గించేందుకు తీసుకునే చర్యలపైనా జిల్లా ఇంటర్ అధికారులు టైం టేబుల్ ఇవ్వాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. ఈ జిల్లాలపై ప్రత్యేక దృష్టి సిలబస్ సకాలంలో పూర్తికాకపోవడం కూడా విద్యార్థుల్లో పరీక్షల టెన్షన్‌కు ఓ కారణమని అధ్యయనాల్లో తేలింది. దీనివల్ల పరీక్షల్లో ఏమొస్తుందో? ఎలా రాయాలో? అన్న ఆందోళన పరీక్షల సమయంలో పెరుగుతుందని అధ్యయన నివేదికల సారాంశం. ఫెయిల్ అవుతున్న 40 శాతం విద్యార్థుల్లో కనీసం 22 శాతం మంది ఈ తరహా ఆందోళన ఎదుర్కొంటున్నారు. దీనిని పరిగణనలోనికి తీసుకొని కొన్ని జిల్లాలపై ఇంటర్ అధికారులు శ్రద్ధ పెట్టాలని నిర్ణయించారు. ఇంటర్ ఫస్టియర్‌లో 50 శాతం కన్నా తక్కువ ఫలితాలు కనబరుస్తున్న జగిత్యాల, నిర్మల్, యాదాద్రి, జనగాం, కరీంనగర్, సూర్యాపేట, సిద్దిపేట, మేడ్చల్ వంటి జిల్లాలున్నాయి. సెకండియర్‌లో మెదక్, నాగర్‌కర్నూల్, వరంగల్, నారాయణపేట, సూర్యాపేట, హైదరాబాద్, పెద్దపల్లి జిల్లాలున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. కొన్ని ముఖ్యాంశాలు... ♦ ప్రతీ సంవత్సరం పరీక్షలు రాస్తున్న ఇంటర్ విద్యార్థులు – 7 లక్షలకుపైగా ♦ ఫెయిల్ అవుతున్న వారు – 2.5 లక్షల మంది ♦ పరీక్షల ఫోబియా వెంటాడుతున్న విద్యార్థులు – 1.02 లక్షల మంది ♦ పరీక్ష షెడ్యూల్ ఇవ్వగానే భయపడే వారు – 28 వేల మంది ♦ సిలబస్‌పై టెన్షన్ పడుతున్న విద్యార్థులు – 51 వేల మంది మానసిక ధైర్యం నింపాలి ఈ 60 రోజులూ లెక్చ రర్లది కీలకపాత్ర. పరీక్షల భయం ఉన్న వారిలో ధైర్యం నింపే ప్రయత్నం చేయాలి. వెనుకబడ్డ సబ్జెక్టులపై రివిజన్ చేయించడం ఒక భాగమైతే, వీలైనంత వరకూ పరీక్ష తేలికగా ఉంటుందనే భావన ఏర్పడేలా చూడాలి. దీనివల్ల ఎగ్జామ్ ఫోబియా తగ్గుతుంది. – మాచర్ల రామకృష్ణ గౌడ్, ప్రభుత్వ లెక్చరర్ల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తల్లిదండ్రులదీ కీలకపాత్రే పరీక్షల భయం వెంటాడే విద్యార్థి సైకాలజీని బట్టి అధ్యాపకులు వ్యవహ రించాలి. వారిని ప్రణాళిక బద్ధంగా చదివించే విధా నం అనుసరించాలి. సాధ్యమైనంత వరకూ పరీక్ష వెంటాడుతోందన్న భావనకు దూరం చేయాలి. చదివే ప్రతీ అంశం గుర్తుండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. తల్లిదండ్రులు ర్యాంకులు, మార్కుల కోసం ఒత్తిడి చేయకుండా జాగ్రత్త పడాలి. పరీక్షల పట్ల భయం అనిపిస్తే నిపుణుల చేత కౌన్సెలింగ్ ఇప్పించాలి. – రావులపాటి సతీష్‌బాబు, మానసిక వైద్య నిపుణుడు స్టడీ అవర్స్ పెడుతున్నాం విద్యార్థుల్లో పరీక్షల భయం పోగొట్టేందుకు 60 రోజుల పాటు ప్రత్యేక కార్య క్రమాలు చేపడుతున్నాం. వెనుకబడ్డ విద్యార్థులను గుర్తించి, స్పెషల్ క్లాసులు నిర్వహించమని ఆదేశాలిచ్చాం. టెన్షన్ పడే విద్యార్థులకు కౌన్సెలింగ్ ఇవ్వమని ప్రిన్పిపల్స్కు చెప్పాం. అవసరమైతే టెలీ కౌన్సిలింగ్ కూడా ఇప్పించే ప్రయత్నం చేస్తున్నాం. – జయప్రదాబాయ్,ఇంటర్ పరీక్షల విభాగం అధికారిణి -
విశాఖలో అదృశ్యం.. సికింద్రాబాద్‌లో ప్రత్యక్ష్యం.. పానీపూరి అమ్మేందుకు
సాక్షి, విశాఖపట్నం: గాజువాక శ్రీచైతన్య కళాశాలలో అదృశ్యమైన ముగ్గురు విద్యార్థుల ఆచూకీ లభించింది. విశాఖలో కనిపించకుండా పోయిన ముగ్గురు విద్యార్థులు పవన్, దిలిప్, బాలీలను పోలీసులు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో గుర్తించారు. వీరు ముగ్గురు చదవుకోవడం ఇష్టం లేక హైదరాబాద్ల్ పానీపూరి అమ్ముకొని జీవించేందుకు నగరానికి వచ్చినట్లు పోలీసులు తెలిపారు. కాగా గాజువాక శ్రీ చైతన్య కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సవం చదువుతున్న పవన్, దిలీప్, బాబీ ముగ్గురు విద్యార్థులు ఈనెల 24న అదృశ్యమయ్యారు. కాలేజ్‌కు అనిచెప్పి బయల్దేరి అని చెప్పి బయల్దేరి మళ్లీ ఇంటికి చేరుకోలేదు. దీంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు గాజువాక పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. చివరికి బుధవారం ముగ్గురిని సికింద్రాబాద్ స్టేషన్లో క్షేమంగా గుర్తించారు. విద్యార్థులను తమ తల్లిదండ్రుల వద్దకు చేరుస్తామని పోలీసులు పేర్కొన్నారు. చదవండి: ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. -
ఇంటర్ రెండేళ్ల ఫలితాల్లోనూ అమ్మాయిలదే హవా
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఇంటర్మీడియట్ ఫలితాల్లో మరోసారి బాలికలు సత్తా చాటారు. మొదటి, రెండో సంవత్సరం రెండింటిలోనూ బాలురను మించి ఉత్తీర్ణత శాతాన్ని నమోదు చేశారు. ఫస్టియర్‌లో బాలురు 54.66 శాతం పాసయితే, బాలికలు 68.68% ఉత్తీర్ణులయ్యారు. సెకండియర్‌లో బాలురు 55.60% ఉత్తీర్ణులైతే, బాలికలు 71.57 శాతం పాస్ కావడం గమనార్హం. మంగళవారం మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇంటర్ పరీక్షల ఫలితాలను విడుదల చేశారు. ఇంటర్ రెండేళ్ల పరీక్షలు కలిపి మొత్తంగా 9,48,153 మంది హాజరయ్యారని తెలిపారు. ఫస్టియర్‌లో 61.68 శాతం, సెకండియర్‌లో 63.49 శాతం ఉత్తీర్ణత నమోదైనట్టు వెల్లడించారు. ఫస్టియర్‌లో 1,75,505 మంది, సెకండియర్‌లో 1,91,698 మంది ఏ గ్రేడ్ (75శాతంపైన మార్కులతో)లో ఉత్తీర్ణులైనట్టు వివరించారు. ఫస్టియర్ ఫలితాల్లో మేడ్చల్ (75% పాస్) మొదటి స్థానంలో, రంగారెడ్డి (73% పాస్) ద్వితీయ స్థానంలో నిలిచా యని మంత్రి తెలిపారు. సెకండియర్‌లో ములుగు (85% పాస్) మొదటి స్థానంలో, కొమురం భీం (81 శాతం పాస్) రెండో స్థానంలో నిలిచినట్టు స్పష్టం చేశారు. ఫెయిలైతే ఆందోళన పడొద్దు ఇంటర్ ఫెయిలైన విద్యార్థులు ఎలాంటి ఆందోళనకు గురికావొద్దని, అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ రాసి పాసవ్వాలని మంత్రి సూచించారు. ఎంసెట్‌లో ఈ ఏడాది ఇంటర్ మార్కులకు వెయిటేజీ లేదని, అందువల్ల ఇంటర్ మార్కులు తక్కువ వచ్చినా ఆందోళన పడొద్దని చెప్పారు. నేటి నుంచి రీవెరిఫికేషన్.. ఇంటర్ జవాబు పత్రాల రీవెరిఫికేషన్, రీవాల్యూయేషన్ ప్రక్రియను ఈ నెల 10 నుంచి 16 వరకు చేపడుతున్నామని.. విద్యార్థులు సంబంధిత కాలేజీల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని ఇంటర్ బోర్డ్ కార్యదర్శి నవీన్ మిత్తల్ తెలిపారు. రీవెరిఫికేషన్‌కు రూ.100, రీవ్యాల్యూయేషన్‌కు రూ.600 చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. ఫెయిలైన విద్యార్థులతోపాటు పాసైనా ఇంప్రూవ్మెంట్ కోరుకునే విద్యార్థులు ఈ నెల 16 లోగా ఫీజు చెల్లించాలని సూచించారు. మార్కుల మెమోలు, కలర్ ప్రింట్లను ఇంటర్ బోర్డ్ వెబ్సైట్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చని చెప్పారు. మానసిక ఆందోళనకు గురైన విద్యార్థులు 14416 టోల్ ఫ్రీనంబర్‌కు కాల్ చేసి నిపుణుల ద్వారా కౌన్సిలింగ్ పొందవచ్చని తెలిపారు. వీలైనంత త్వరగా అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫలితాలు వెల్లడిస్తామన్నారు. ఇంటర్ బోర్డ్ అడ్మిషన్ నోటిఫికేషన్ ఇచ్చే వరకు కూడా.. ఏ కాలేజీలోనూ అడ్మిషన్లు చేపట్టడానికి వీల్లేదని స్పష్టం చేశారు. ఎంపీసీలో అత్యధిక ఉత్తీర్ణత.. రెండో స్థానంలో బైపీసీ – హెచ్ఈసీ, సీఈసీ కోర్సుల్లో 50 శాతంలోపే పాస్ ఇంటర్మీడియట్ ఫలితాల్లో రాష్ట్రవ్యాప్తంగా సైన్స్ గ్రూపుల్లోనే అత్యధిక ఉత్తీర్ణత శాతం నమోదైంది. ప్రథమ, ద్వితీయ సంవత్సరం రెండింటిలోనూ ఎంపీసీ (మేథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ) గ్రూపులో ఎక్కువ మంది పాసయ్యారు. తర్వాత స్థానంలో బైపీసీ ఉండగా.. సీఈసీ, హెచ్ఈసీ వంటి సంప్రదాయ గ్రూపుల్లో తక్కువ ఉత్తీర్ణత నమోదైంది. తగ్గిన ఉత్తీర్ణత శాతం – వంద శాతం సిలబస్ కారణమంటున్న నిపుణులు – కోవిడ్‌కు ముందుతో పోలిస్తే ఉత్తీర్ణత ఎక్కువే ఇంటర్లో గత ఏడాదితో పోలిస్తే ఈసారి ఉత్తీర్ణత శాతం తగ్గింది. ప్రథమ, ద్వితీయ సంవత్సరాలు రెండింటి ఫలితాలూ ఇలాగే ఉన్నాయి. కోవిడ్ కారణంగా 2021లో పరీక్షలు నిర్వహించకుండానే అందరినీ పాస్ చేశారు. తర్వాత 2022లోనూ 75శాతం సిలబస్‌తో పరీక్షలు జరిగాయి. ఈ ఏడాది వంద శాతం సిలబస్‌తో పరీక్షలు పెట్టారు. పూర్తి సిలబస్ నేపథ్యంలోనే ఇంటర్ జనరల్ విభాగంలో ఉత్తీర్ణత స్వల్పంగా తగ్గిందని నిపుణులు చెప్తున్నారు. అయితే 2019తో పోలిస్తే మాత్రం పాస్ పర్సంటేజీ ఎక్కువగానే ఉంది. కొన్నేళ్లుగా ఇంటర్ ఉత్తీర్ణత శాతం (శాతాల్లో) ఏడాది ఫస్టియర్ సెకండియర్ 2018–19 60.60 64.94 2019–20 61.07 69.61 2020–21 100 100 2021–22 64.85 68.68 2022–23 62.85 67.27 -
ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్య
కళ్యాణదుర్గం: మున్సిపాలిటీ పరిధికి చెందిన మౌనిక (15) అనే ఇంటర్ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసుల వివరాలమేరకు... ఒంటిమిద్ది గ్రామానికి చెందిన వెంకటరెడ్డి, సునీత దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. పెద్ద కుమార్తె మౌనిక ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్ష ఫలితాల్లో రెండు సబ్జెక్టులు ఫెయిల్ అయింది. దీంతో తీవ్ర మనస్తాపం చెంది గురువారం రాత్రి ఇంట్లో అందరూ నిద్ర పోయాక పురుగుల మందు తాగింది. శుక్రవారం తెల్లవారు జామున అపస్మారక స్థితిలో ఉన్న మౌనికను హుటా హుటిన కళ్యాణదుర్గం ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మౌనిక చనిపోయిందని నిర్ధారించారు. ఎంతో అల్లారు ముద్దుగా పెరిగిన కుమార్తె విగాత జీవిగా పడి ఉండటంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. తాడిపత్రిలో... తాడిపత్రి: రూరల్ పరిధిలోని బిందెల కాలనీలో నాగేంద్ర, లక్ష్మినరసమ్మ దంపతుల రెండో కుమార్తె కావ్య (18) అనుమానాస్పదంగా మృతి చెందింది. ఇంటర్ మొదటి సంవత్సరంలో కావ్య ఫెయిల్ అయింది. శుక్రవారం ఇంట్లో ఎవరూలేని సమయంలో ఫ్యానుకు ఉరేసుకుంది. అయితే ఇంటి తలుపులు మూసివేయకపోవడంతో పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రభుత్వ, ప్రైవేట్ లెక్చరర్లకు ఆన్లైన్ శిక్షణా తరగతులు: ఏపీఎన్ఆర్టీఎస్
విద్యార్థులు మానసిక ఒత్తిడిని అధిగమించడం పై ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల లెక్చరర్లకు APNRTS, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ సంయుక్తంగా NRI డాక్టర్లచే ఆన్ లైన్ తరగతుల నిర్వహణ – ఏపీఎన్ఆర్టీఎస్ అధ్యక్షులు వెంకట్ ఎస్.మేడపాటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రంగ సంస్థ ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ (ఏపీఎన్ఆర్టీఎస్ ) ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రవాసాంధ్రుల సంక్షేమం, భద్రత , అభివృద్దే ధ్యేయంగా ప్రవాసాంధ్రులకు వివిధ ఉచిత సేవలను అందిస్తుంది. అంతేకాకుండా వివిధ దేశాలలో స్థిరపడిన రాష్ట్రానికి చెందిన వారు తమ మాతృభూమికి సేవ చేయడానికి వారధిగా కూడా నిలుస్తోందని ఏపీఎన్ఆర్టీఎస్ సీఈవో ఒక ప్రకటనలో తెలిపారు. ఇంటర్మీడియట్ విద్యార్థులకు త్వరలో పబ్లిక్ పరీక్షలు (ఫైనల్స్) సమీపిస్తున్నసమయంలో విద్యార్థులు అధిక ఒత్తిడికి లోనవుతుంటారు. ఈ నేపథ్యంలో ఏపీ ఎన్ఆర్టీఎస్, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ సంయుక్తంగా “Life Skills – Stress Management” పై శిక్షణను ప్రారంభించింది. ఇందులో విద్యార్థులు ఒత్తిడిని అధిగమించడం, టైమ్ మేనేజ్మెంట్ ఎలా చేసుకోవాలి, అలాగే మానసిక ఆరోగ్యం, జీవన నైపుణ్యాలు మెరుగుపరచుకోవడం గురించి NRI డాక్టర్లచే జూనియర్ కళాశాలల లెక్చరర్లకు వర్చువల్ గా వర్క్‌షాప్‌లను నిర్వహిస్తోంది. ప్రతి జూనియర్ కళాశాల నుండి ఇద్దరు (02) లెక్చరర్లను ఎవరైతే ఇన్‌హౌస్ కౌన్సెలర్లుగా ఉంటారో వారికి ఒత్తిడిని ఎలా అధిగమించాలి అన్న విషయాలపై NRI డాక్టర్లచే ఆన్లైన్ తరగతులు నిర్వహిస్తోంది. వీరు విద్యార్థులకు కౌన్సెలింగ్ చేయడానికి అవలంభించవలసిన పద్ధతులు, ఇతర అవసరమైన మార్గాలపై శిక్షణ ఇవ్వబడుతుంది. ఆయా కళాశాలల లెక్చరర్లు ఈ విషయాలను, విద్యార్థులకు వివరిస్తున్నారని, ఇది జరగబోయే పరీక్షల ప్రేపరేషన్ కు విద్యార్థులకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని వెల్లడించారు. దీనికోసం రాష్ట్రంలోని దాదాపు 3,400 ప్రభుత్వ ,కార్పొరేట్ కళాశాలలోని 6,800 మంది లెక్చరర్లకు ఈ తరగతుల నిర్వహణ తలపెట్టడం జరిగింది. ఇప్పటివరకు 50 శాతం కళాశాలల లెక్చరర్లకు ఈ శిక్షణావకాశం ఇవ్వడం జరిగింది. వచ్చే వారంలో మిగిలిన కళాశాలలోని లెక్చరర్లకు తరగతులు నిర్వహించడం జరుగుతుంది. ఆన్ లైన్ ద్వారా జరిగే ఈ కార్యక్రమం ఫిబ్రవరి 22వ తేదీ వరకు కొనసాగుతుంది. శిక్షణ పొందిన ఆయా కళాశాలల లెక్చరర్లు తమ విద్యార్థులకు ఒత్తిడిని అధిగమించడం, టైమ్ మేనేజ్ చేయడం గురించి వర్చువల్ శిక్షణలో వారు తెలుసుకున్న విషయ పరిజ్ఞానం మరియు మార్గాలను అర్థవంతంగా విద్యార్థులతో పంచుకుంటారు. అమెరికాలోని అల్బామాకు చెందిన సర్టిఫైడ్ చైల్డ్ అండ్ అడోలసెంట్ సైకియాట్రిస్ట్ డాక్టర్. అపర్ణ వుప్ప, SPIF వ్యవస్థాపకుడు శ నెల్సన్ వినోద్ మోసెస్ (మెంటల్ హెల్త్ జర్నలిస్ట్ విభాగంలో అవార్డ్ గ్రహీత) వారి నిర్వహణలో కార్యక్రమం జరుగుతోంది. అలాగే ప్రముఖ యాంకర్, నటి, సామాజిక కార్యకర్త ఝాన్సీ మానసిక ఆరోగ్యం మరియు విద్యార్థులు పరీక్షల సమయంలో దీర్ఘకాలిక ఒత్తిడి ఎదుర్కొని, దానిని అధిగమించే మార్గాల ఆవశ్యకతను తెలియజేస్తున్నారు. ఈ కార్యక్రమం ద్వారా జూనియర్ కళాశాలలలోని విద్యార్థినీ విద్యార్థులందరికి లబ్ది చేకూరుతుంది. ఇప్పటికే ఏపీఎన్ఆర్టీఎస్ ప్రవాసాంధ్రులు వారి స్వగ్రామాలు, పట్టణాలలో పాఠశాలలు, కళాశాలలు లేదా ఆసుపత్రుల అభివృద్ధికి పలు సేవలు అందించడానికి ఏపీఎన్ఆర్టీఎస్ సహకారం అందిస్తోంది. అందులో భాగంగా, ఏపీఎన్ఆర్టీఎస్ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు మరియు విద్యార్థులకు స్వచ్చందంగా ముందు కొస్తున్న NRI శిక్షకులతో ఇంగ్లీష్ కమ్యూనికేషన్ నైపుణ్యాల అభివృద్ధిపై “ప్రశిక్షణ” పేరుతో శిక్షణలను నిర్వహిస్తోందని సీఈవో తెలిపారు. -
ఇంటర్ విద్యార్థుల మధ్య ఘర్షణ
ఖమ్మం సహకారనగర్/ఖమ్మం అర్బన్: ఖమ్మం జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థుల మధ్య తలెత్తిన వివాదం ఘర్షణకు దారితీసింది. శుక్రవారం విద్యార్థుల మధ్య స్వల్ప వివా దం చెలరేగగా.. శనివా రం సీనియర్ విద్యార్థిపై ఇద్దరు జూనియర్ విద్యార్థులు కర్రలతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. దీంతో ఆ విద్యార్థిని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. కాగా, గాయపడిన విద్యార్థి ఓ కార్పొరేటర్ కుమారుడని సమాచారం. అయితే, కళాశాల ఆనుకుని ఉన్న ప్రధాన రహదారి వెంట విద్యార్థులు మాట్లాడుకుంటూనే ఒక్కసారిగా దాడికి దిగడంతో ఏం జరుగుతుందో అర్థం కాక వాహనదారులు ఆందోళనకు గురయ్యారు. ఈ దాడి దృశ్యాలు కళాశాల గేట్ వద్ద ఉన్న సీసీ టీవీ ఫుటేజీలో రికార్డు అయ్యాయి. ఈమేరకు ఖమ్మం అర్బన్ పోలీసులు విచారణ చేస్తున్నారు. ఈ విషయమై ఖమ్మం అర్బన్ సీఐ రామకృష్ణను వివరణ కోరగా ఘటనపై విచారణ చేస్తున్నామని, ఫిర్యాదు అందితే కేసు నమోదు చేయనున్నట్లు తెలిపారు. -
AP Inter Results 2022: ఇంటర్ ఫలితాలు విడుదల.. డైరెక్ట్ లింక్ ఇదే..
సాక్షి అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్షల ఫలితాలు జూన్ 22వ తేదీ (బుధవారం) విడుదలయ్యాయి. విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విజయవాడలో ఫలితాలను విడుదల చేశారు. కాగా, ఇంటర్ జవాబు పత్రాల మూల్యాంకనం వేగంగా పూర్తి చేశారు. మే 6వ తేదీ నుంచి ఫస్టియర్, 7వ తేదీ నుంచి సెకండియర్ పరీక్షలు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహించిన విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ ఇంటర్ ఫలితాలను సాక్షిఎడ్యుకేషన్.కామ్(www.sakshieducation.com)లో చూడొచ్చు. 10.01 లక్షల మంది విద్యార్థులు.. ఈ సారి రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1,456 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం 10.01 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. మే 24వ తేదీ వరకు జరిగిన ఈ పరీక్షలను ఏపీ ఇంటర్ బోర్డు పటిష్ట ఏర్పాట్లతో పూర్తిచేసింది. ఈ సారి పరీక్షలను.. పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో నెలకొన్న ఘటనలను దృష్టిలో పెట్టుకొని ఇంటర్ పరీక్షల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా అధికారులు జాగ్రత్త పడ్డారు. అలాగే పరీక్ష కేంద్రాల్లో అన్ని గదుల్లోనూ, బయట సీసీ కెమెరాలను అమర్చారు. ఈ కెమెరాల ద్వారా పరీక్షల తీరుతెన్నులను రికార్డు చేయడంతోపాటు వాటన్నింటినీ ఇంటర్ బోర్డు కార్యాలయానికి అనుసంధానించారు. ఆన్లైన్ స్ట్రీమింగ్ ద్వారా బోర్డు అధికారులు పరీక్షలు జరుగుతున్న తీరును నిత్యం పరిశీలిస్తారు. జిల్లాల్లో కలెక్టర్ల ఆధ్వర్యంలోని ప్రత్యేక కమిటీలు ఇంటర్ పరీక్షలను పర్యవేక్షించారు. -
ఏపీ ఇంటర్ విద్యార్థులకు అలర్ట్.. అడ్మిషన్ల షెడ్యూల్ ఇదే..
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని అన్ని యాజమాన్యాల్లోని జూనియర్ కాలేజీల్లో 2022–23 విద్యా సంవత్సరం అడ్మిషన్ల షెడ్యూల్‌ను ఇంటర్మీడియట్ బోర్డు శనివారం ప్రకటించింది. జూన్ 20 నుంచి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం దరఖాస్తుల విక్రయం ప్రారంభించాలని పేర్కొంది. జూలై 1 నుంచి తరగతులు చేపట్టాలని సూచించింది. ఇంటర్ మొదటి దశ అడ్మిషన్ల షెడ్యూల్.. దరఖాస్తుల విక్రయం: జూన్ 20 దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ: జూలై 20 అడ్మిషన్లు ప్రారంభం: జూన్ 27 అడ్మిషన్లు పూర్తయ్యేది: జూలై 20 ఫస్టియర్ తరగతులు ప్రారంభం: జూలై 1 చదవండి: ఇదేం దిగజారుడు.. ట్విట్టర్లో ఆ పోస్టులేంటి అయ్యన్న.. -
Ap: విద్యార్థులకు గుడ్ న్యూస్.. 25న హెచ్‌సీఎల్ ‘వాక్ ఇన్ డ్రైవ్’
సాక్షి, అమరావతి: టెక్బీ శిక్షణ కోసం ఏపీ నుంచి ఈ ఏడాది 1,500 మంది ఇంటర్ విద్యార్థులను ఎంపిక చేయనున్నట్లు హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ ప్రకటించింది. ఇందుకోసం ఈనెల 25న విజయవాడలో వాక్ ఇన్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు ఆ సంస్థ వైస్ ప్రెసిడెంట్ సుబ్బరామన్ తెలిపారు. ఈ వివరాలను గురువారం విజయవాడలో ఆయన మీడియాకు వెల్లడించారు. 2021లో మ్యాథమెటిక్స్ లేదా బిజినెస్ మ్యాథమెటిక్స్‌తో 12వ తరగతి(ఇంటర్మీడియట్) పూర్తి చేసినవారు.. అలాగే 2022లో 12వ తరగతికి హాజరవుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. వాక్ ఇన్ డ్రైవ్‌లో ఎంపికైన విద్యార్థులకు 12 నెలల పాటు శిక్షణ అందించడంతో పాటు ఇంటర్న్‌షిప్ చేసే అవకాశం కూడా కల్పిస్తామని చెప్పారు. టెక్బీ శిక్షణ పూర్తి చేసిన వారికి ఏడాదికి రూ.1.70 లక్షల నుంచి రూ.2.20 లక్షల వేతనంతో ఉద్యోగం లభిస్తుందన్నారు. హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ వద్ద పనిచేస్తూనే బిట్స్ పిలానీ, శాస్త్ర, అమిటీ వంటి ప్రతిష్టాత్మక యూనివర్సిటీల్లో అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీని కూడా పూర్తి చేసే అవకాశం కల్పిస్తామని చెప్పారు. అర్హత కలిగిన వారు ఆన్లైన్ కెరీర్ ఆప్టిట్యూడ్ టెస్ట్(హెచ్‌సీఎల్ క్యాట్)కు హాజరవ్వాల్సి ఉంటుందని, ఇందులో ప్రతిభ కనబరిచిన వారిని ఇంటర్వ్యూకు పిలుస్తామని తెలిపారు. ఈ శిక్షణ కార్యక్రమానికి రూ.లక్ష ఫీజు ఉంటుందని, దీనికి పన్నులు అదనమని పేర్కొన్నారు. ఫీజును నెలవారీ వాయిదాల్లో తీర్చే విధంగా రుణ సౌకర్యం కూడా కల్పిస్తామని పేర్కొన్నారు. 2017లో ప్రారంభించిన టెక్బీ కార్యక్రమం ద్వారా ఇప్పటి వరకు 7,000 మంది విద్యార్థులకు ఉపాధి కల్పించినట్లు వెల్లడించారు. మరింత సమాచారం కోసం www.hcltechbee.com వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించారు. -
నరకమే ‘నారాయణ’
నెల్లూరు రూరల్: హాస్టల్లో ఆహారం సరిగా లేదని బయట నుంచి పార్శిళ్లు తెచ్చుకున్న ఇంటర్ విద్యార్థులను నారాయణ జూనియర్ కాలేజీ సిబ్బంది చితకబాదారు. కాళ్లతో తన్ని కర్రలతో కొడుతూ విచక్షణా రహితంగా ప్రవర్తించడంతో ఇద్దరు విద్యార్థులు స్పృహ కోల్పోయారు. నెల్లూరులోని ధనలక్ష్మీపురం నారాయణ కళాశాల హాస్టల్లో ఈ దారుణం వెలుగులోకి రావడంతో కోపోద్రిక్తులైన విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. ఆకలేస్తోందని వేడుకున్నా.. నారాయణ హాస్టల్లో ఎంసెట్ లాంగ్‌టర్మ్ కోచింగ్ తీసుకుంటున్న నెల్లూరు, కావలి, తిరుపతి ప్రాంతాలకు చెందిన కొందరు విద్యార్థులు సోమవారం రాత్రి భోజనం సరిగా లేదని బయట నుంచి ఆహారాన్ని తేవడంతో సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. విద్యార్థుల వద్ద ఆహార పొట్లాలను లాక్కుని పక్కన పడేశారు. ఈ విషయం తెలియడంతో మరికొందరు విద్యార్థులు అక్కడకు చేరుకుని ఉదయం నుంచి ఏమీ తినకపోవడంతో ఆకలిగా ఉన్నందున బయట నుంచి తెప్పించుకున్నామని, పార్శిళ్లు ఇవ్వాలని కోరారు. ఇందుకు నిరాకరించిన సెక్యూరిటీ సిబ్బంది కళాశాల ఉద్యోగులకు సమాచారం ఇచ్చారు. దీంతో అక్కడకు చేరుకున్న నారాయణ సిబ్బంది బయట నుంచి ఆహారం ఎలా తెప్పించుకుంటారంటూ విద్యార్థులపై రెచ్చిపోయారు. కాళ్లతో తన్ని కర్రలతో కొట్టారు. ఈ ఘటనలో ఇద్దరు విద్యార్థులు అక్కడికక్కడే స్పృహ కోల్పోయారు. కొందరు విద్యార్థులు ఫోన్ ద్వారా సమాచారం ఇవ్వడంతో మంగళవారం ఉదయం అక్కడకు చేరుకున్న బాధిత విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. పిల్లలను విచక్షణా రహితంగా చావబాదడం ఏమిటని నిలదీశారు. అనంతరం అక్కడకు చేరుకున్న నారాయణ విద్యాసంస్థల ఉన్నత ఉద్యోగులు తప్పు జరిగిన మాట వాస్తవమేనని అంగీకరించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కానివ్వబోమని బుజ్జగించారు. విషయాన్ని గోప్యంగా ఉంచాలని వేడుకున్నారు. పది రోజుల్లో ఎంసెట్ పరీక్ష ఉన్నందున చేసేదేమీ లేక తల్లిదండ్రులు మెత్తబడ్డారు. దీనిపై నారాయణ విద్యాసంస్థల ఏజీఎం పద్మారెడ్డిని ‘సాక్షి’ వివరణ కోరగా బయట నుంచి ఆహారం తెస్తే ఫుడ్ పాయిజన్ అవుతుందనే ఉద్దేశంతో ఆహార పొట్లాలను పక్కన పెట్టిన మాట వాస్తవమేనన్నారు. విద్యార్థులపై ఎలాంటి దాడి జరగలేదన్నారు. -
ఆధారాలు చూపించు.. లేదా క్షమాపణ చెప్పు
సాక్షి, హైదరాబాద్: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ట్విట్టర్ వేదికగా చేసిన వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. నిరాధార ఆరోపణలు కొనసాగిస్తే .. న్యాయపరంగా చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. గురువారం సంజయ్ ట్విట్టర్లో, ‘మంత్రి కేటీఆర్ నిర్వాకం వల్ల 27 మంది ఇంటర్ విద్యార్థులు మరణిస్తే కనీసం స్పందించని దౌర్భాగ్య ముఖ్యమంత్రి కేసీఆర్..! అని కామెంట్ పెట్టారు. దీనిని తీవ్రంగా పరిగణించిన కేటీఆర్.. బండి సంజయ్‌ను బీఎస్ కుమార్‌గా సంబోధిస్తూ.. ‘చేసిన ఆరోపణలకు ఆధారాలు చూపించు. లేదంటే బహిరంగ క్షమాపణలు చెప్పు’అని ట్వీట్ చేశారు. -
హాల్‌టికెట్లను తప్పుగా ముద్రించినవారిపై ఫిర్యాదు
తాడేపల్లి రూరల్: ఈ నెల 6 నుంచి ప్రారంభం కానున్న ఇంటర్మీడియెట్ పరీక్షల హాల్టికెట్లలో సమయం తప్పుగా ముద్రించిన ఏపీసీఎఫ్ఎస్ఎస్ నిర్వాహకులపై ఇంటర్ పరీక్షల విభాగం అధికారులు సోమవారం రాత్రి గుంటూరు జిల్లా తాడేపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అధికారులు మాట్లాడుతూ.. ఇంటర్ సెకండ్ ఇయర్ హాల్‌టికెట్లపై సమయాన్ని ఉదయం 9 నుంచి 12 గంటల వరకు అని ముద్రించాల్సి ఉండగా.. మధ్యాహ్నం 2.30 నుంచి 5.30 గంటల వరకు అని ముద్రించారని తెలిపారు. ఏపీసీఎఫ్ఎస్ఎస్లో పనిచేస్తున్న శ్రీనివాసరావు, గోపి, ప్రతాప్ ఈ పని చేసినట్లు గుర్తించామని ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రభుత్వంపై దుష్ప్రచారం చేసేందు కే ఇలా చేశారనే అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. ఇప్పటివరకు హాల్‌టికెట్లు డౌన్లోడ్ చేసుకున్న విద్యార్థులను గుర్తించి.. ఆయా కళాశాలలకు సమాచారం ఇస్తామన్నారు. అలాగే పరీక్షల సమయం గురించి విస్తృతంగా ప్రచారం చేస్తామని తెలిపారు. -
ఇంటర్ విద్యార్థులు ఉక్కిరిబిక్కిరి
సాక్షి, అమరావతి: ఒక దాని వెంట మరొక పరీక్షతో ఇంటర్మీడియెట్ విద్యార్థులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. సమాయత్తానికి తగిన సమయం లేదని ఆందోళన చెందుతున్నారు. ఇంటర్, సీబీఎస్ఈ పబ్లిక్ పరీక్షలు, జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్, రాష్ట్రాల్లోని ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశాలకు పరీక్షలు, ప్రైవేటు వర్సిటీల పరీక్షలు వరుసగా విద్యార్థులపై వచ్చి పడుతున్నాయి. మార్చి నుంచి ఆగస్టు వరకు వరుసగా వరుస పరీక్షలకు సిద్ధమవ్వాల్సి ఉంటుంది. రాష్ట్రంలో ఇంటర్మీడియెట్ ప్రాక్టికల్ పరీక్షలు మార్చి 11న ప్రారంభించి మార్చి 31తో ముగించాలనుకున్నారు. కానీ కోర్టు తీర్పు కారణంగా ఇవి వాయిదా పడ్డాయి. ఇంటర్మీడియెట్ థియరీ పరీక్షలు ఏప్రిల్ 8 నుంచి ఏప్రిల్ 28 వరకు జరగాలి. ఐతే జేఈఈ మెయిన్ తొలి విడత పరీక్షలు ఏప్రిల్ 16 నుంచి 21వ తేదీ వరకు జరగనుండడంతో వీటిని వాయిదా వేశారు. జేఈఈ పరీక్షల అనంతరం ఒక్క రోజు కూడా వ్యవధి లేకుండా ఏప్రిల్ 22వ తేదీ నుంచి పబ్లిక్ పరీక్షలు మొదలవుతాయి. సీబీఎస్ఈ పరీక్షలు కూడా ఏప్రిల్ 26 నుంచి ప్రారంభమవుతాయి. జేఈఈ రెండో విడత పరీక్షలు మే 24 నుంచి 29 వరకు జరుగుతాయి. ఇవి ముగిసిన వెంటనే జూన్‌లో రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశానికి ఏపీ ఈఏపీసెట్ జరుగుతుంది. జూలై 3న జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష ఉంది. మెడికల్ కాలేజీల్లో ప్రవేశానికి కీలకమైన నేషనల్ ఎలిజిబులిటీ టెస్టు (నీట్) షెడ్యూల్ ఇంకా వెలువడకున్నా జులై ఆఖరున, లేదా ఆగస్టులో జరుగుతుందని అంచనా. మరోవైపు సెంట్రల్ వర్సిటీలు, బిట్స్ పిలానీ, అమృత వర్సిటీ, వీఐటీ సహా అనేక ప్రతిష్టాత్మక ప్రైవేటు వర్సిటీల ప్రవేశ పరీక్షలు కూడా ఈ సమయంలోనే జరుగుతున్నాయి. ఇలా మార్చి మొదలుకొని ఆగస్టు ఆఖరు వరకు ఇంటర్మీడియెట్ విద్యార్థులు పరీక్షలు రాయాలి. జేఈఈ సిలబస్ య«థాతథం కోవిడ్ కారణంగా 2021–22 విద్యా సంవత్సరంలో కాలేజీలు ఆలస్యంగా ప్రారంభమయ్యాయి. దీంతో సీబీఎస్ఈతోపాటు రాష్ట్రాల ఇంటర్మీడియెట్ బోర్డులు కూడా సిలబస్‌ను కుదించాయి. ఆమేరకు విద్యార్థులు పరీక్షలకు ప్రిపేరవుతున్నారు. అయితే, జేఈఈ మెయిన్ సిలబస్‌ను మాత్రం ఎన్టీఏ తగ్గించలేదు. పూర్తి సిలబస్‌తోనే పరీక్షలుంటాయని స్పష్టం చేసింది. దీంతో విద్యార్థులు ఇప్పుడు పూర్తి సిలబస్‌తో జేఈఈ కోసం ప్రత్యేక కోచింగ్‌లతో నానా అవస్థలూ పడుతున్నారు. జేఈఈ రెండు విడతల పరీక్షల మధ్య ఒక్క నెల కూడా వ్యవధి లేకపోవడం మరీ ఇబ్బందికరంగా మారింది. ఈసారి జేఈఈ మెయిన్ ఆన్లైన్లో జరగడం మరో పెద్ద సమస్యగా మారింది. కాలేజీల్లో, కోచింగ్ సెంటర్లలో ఆన్లైన్ విధానంలో తర్ఫీదు ఇచ్చేందుకు తగినన్ని కంప్యూటర్లు, ఇతర సదుపాయాలు లేవని, దీంతో సరిగా ప్రిపేరవలేకపోతున్నామని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జేఈఈ మెయిన్‌లో ఎ, బి సెక్షన్ల కింద బహుళైచ్ఛిక ప్రశ్నలకు సమాధానాలివ్వాలి. బి సెక్షన్‌లోని న్యూమరికల్ టైప్ ప్రశ్నలకు సరైన సమాధానమిస్తే 4 మార్కులు వస్తాయి. తప్పుడు సమాధానమిస్తే 1 మార్కు కోత పడుతుంది. అసలే ప్రిపరేషన్‌కు సమయం లేక ఇబ్బంది పడుతుంటే, ఇప్పుడు ఈ నెగెటివ్ మార్కుల విధానంతో మరింత నష్టపోతామని విద్యార్థులు వాపోతున్నారు. జేఈఈ పరీక్షలను నాలుగు విడతలుగా నిర్వహించడమో, లేదా కొంత వ్యవధి ఉండేలా వాయిదా వేయడమో చేయాలని సామాజిక మాధ్యమాల ద్వారా ఎన్టీఏను కోరుతున్నారు. -
పదికొచ్చే సరికే ఫుల్స్టాప్..
సాక్షి, హైదరాబాద్: విద్యపై పేదరికం తీవ్ర ప్రభావం చూపుతోంది. గతంలో మాదిరి పిల్లలను స్కూల్‌కే పంపని పరిస్థితులు లేకున్నా... కొద్దిపాటి చదువుతోనే బడి మాన్పించే స్థితిగతులు మాత్రం తెలంగాణలోకనిపిస్తున్నాయి. ప్రభుత్వం బుధవారం విడుదల చేసిన రాష్ట్ర గణాంక సంగ్రహణ (తెలంగాణ స్టేట్ స్టాటిస్టిక్ట్స్ అబ్స్ట్రాక్ట్) నివేదిక ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రోత్సా హం.. అన్ని వర్గాల్లో పెరిగిన అవగాహన, బడుల సంఖ్య పెరగడం వల్ల 6–10 వయసు పిల్లలను ప్రతి ఒక్కరూ పాఠశాలకు పంపుతున్నారు. ఆఖరుకు జనాభా లెక్కల్లో లేని వారు (వలసదారులు, సంచార తెగలు) కూడా ప్రాథమిక బడుల్లో చేరుస్తున్నారు. రాష్ట్రంలో జనాభా లెక్కల ప్రకారం 27,78,000 మంది 6–10 వయసు్కలుంటే, 1–5 తరగతుల్లో చేరే విద్యార్థులు 31,10,154 మంది ఉన్నారు. కానీ 9, 10 తరగతులకొచ్చే సరికి కేవలం 10,92,039 మందే ఉంటున్నారు. ఇంటర్లో విద్యార్థుల సంఖ్య 4.32 లక్షలే ఉంటోంది. టెన్త్‌కొచ్చే సరికి డ్రాపౌట్స్ (స్కూల్ మానేసేవారు) 12.29 శాతం ఉంటోంది. జయశంకర్ జిల్లాలో అత్యధికంగా డ్రాపౌట్స్ (హైసూ్కల్ స్థాయిలో 29.49%) ఉంటున్నారు. చదువు మధ్యలో మానేసే వారు ఎక్కువగా మారుమూల, గ్రామీణ ప్రాంతాల్లోనే ఉంటున్నారు. -
బెదిరించి లొంగదీసుకుని.. గిరిజన బాలికలపై లైంగిక దాడి..
విజయనగరం(కురుపాం): నూతన సంవత్సర శుభవేళ.. స్నేహితులతో కలిసి సరదాగా విహారయాత్రకు వెళ్లిన బాలికలపై ఓ రౌడీషీటర్ కన్నేశాడు. పోలీస్‌నంటూ బెదిరింపులకు దిగి ఇద్దరు బాలికలపై లైంగిక దాడి యత్నానికి తెగబడిన విషాదకర ఘటన కురుపాంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... కురుపాం మండల కేంద్రంలోని గిరిజన సంక్షేమ పోస్ట్‌మెట్రిక్ బాలికల వసతిగృహంలో ఇంటర్ ప్రథమ సంవత్సరం బైపీసీ, హెచ్ఈసీ గ్రూపులు చదువుతున్న ఇద్దరు విద్యార్థినులు.. తమ స్నేహితులతో కలిసి జియ్యమ్మవలస మండలంలోని వట్టిగెడ్డ రిజర్వాయర్‌ను చూసేందుకు శనివారం వెళ్లారు. తిరిగి కాలినడకన వసతిగృహానికి పయనమయ్యారు. సాయంత్రం 3 గంటల సమయంలో చినమేరంగికి చెందిన వెలగాడ రాంబాబు అనే వ్యక్తి విద్యార్థినులు, వారి స్నేహితులను అడ్డగించాడు. తను పోలీసునంటూ బెదిరించాడు. చదవండి: (భార్యతో వివాహేతర సంబంధం.. భర్తకు తెలిసి వేటకొడవలితో..) చెప్పినట్టు వినకపోతే మీ ఫొటోలు సోషల్‌మీడియా, ఫేస్బుక్లో అప్లోడ్ చేస్తానని బెదిరించాడు. ఇద్దరు విద్యార్థులను దూరంగా పంపించేసి... బాలికలను సమీపంలోని పామాయిల్‌తోటకు తీసుకెళ్లాడు. ఒకరి తరువాత ఒకరిపై లైంగికదాడికి ప్రయత్నించాడు. ఈ విషయాన్ని బయటకు చెబితే చంపేస్తానంటూ భయపెట్టాడు. ఘటన అనంతరం కన్నీరు మున్నీరు పెట్టుకుంటూ వసతిగృహానికి చేరుకున్న విద్యార్థినులు విషయాన్ని వసతిగృహ సంక్షేమాధికారిణి మండంగి సీతమ్మకు తెలియజేశారు. ఆమె వెంటనే కురుపాం పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఎల్విన్‌పేట సీఐ తిరుపతిరావు, కురుపాం ఎస్ఐ బి.శివప్రసాద్‌లు వసతిగృహానికి చేరుకున్నారు. చదవండి: (యువతి ప్రేమించిన వాడితో వెళ్లిపోతే.. కుటుంబాన్ని జాతి నుండి వెలివేశారు) బాధితుల నుంచి వివరాలు సేకరించారు. పార్వతీపుపురం డీఎస్పీ సుభాష్‌కు సమాచారం ఇచ్చారు. ఆయన వెంటనే వసతిగృహానికి చేరుకుని బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. ఇద్దరు బాలికలను వైద్య పరీక్షలకు పంపిస్తామని చెప్పారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. నిందితుడు రాంబాబుపై ఇప్పటికే చినమేరంగి పోలీస్‌స్టేషన్‌లో పలు కేసులు నమోదయ్యాయి. రౌడీషీట్ కూడా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. -
ఫెయిలైన విద్యార్థులంతా పాస్..
-
ఇది కరోనా నై‘పుణ్యమే’
సాక్షి, హైదరాబాద్: పిల్లల చదువును కరోనా అల్లకల్లోలం చేసింది. చదవడం, రాయడం వంటి నైపుణ్యాలను దెబ్బతీసింది. తల్లిభాషలోనూ తల్లడిల్లిపోతున్నారు. ఇలాంటి విస్మయం కలిగించే నిజాలెన్నో నేషనల్ ఇండిపెండెన్స్ స్కూల్స్ అలయెన్స్(నిసా), తెలంగాణ రిజిస్టర్డ్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్(ట్రాస్మా) సర్వేలో వెల్లడయ్యాయి. కరోనా తర్వాత క్లాస్‌లకు హాజరవుతున్న 44.6 శాతం విద్యార్థులకు చదవడం కష్టంగా ఉందని, 32.8 శాతం మందిలో ఆత్మవిశ్వాసం లోపించిందని నిసా, ట్రాస్మా సర్వేలో వెలుగుచూశాయి. ఆన్లైన్ విధానంలో నష్టపోయిన విద్యను నేర్చుకునేందుకు 45.1 శాతం మంది తిరిగి ప్రత్యేక క్లాసులు నిర్వహించాలని కోరుతున్నట్టు తేలింది. సర్వే నివేదికను ట్రాస్మా మంగళవారం వెల్లడించింది. కరోనాకాలంలో నెలకొన్న విద్యారంగం నష్టంపై ఈ రెండుసంస్థలు కలసి దేశవ్యాప్తంగా ఇటీవల సర్వే జరిపాయి. అన్నిప్రాంతాల విద్యార్థులు, సంస్థల ప్రతినిధులను కలిశారు. 3–5 తరగతులు, 8వ తరగతి విద్యార్థుల నుంచి కొన్ని ప్రశ్నలకు సమాధానాలు రాబట్టారు. సెల్ఫ్ అసెస్మెంట్ పరీక్షలు కూడా నిర్వహించారు. ఈ క్రమంలో పట్టణప్రాంతాల్లో 30 శాతం, గ్రామీణ ప్రాంతాల్లో 24 శాతం మంది మాతృభాషలో ఇబ్బంది పడుతున్నట్టు తేలింది. 3వ తరగతిలో 28 శాతం, 5వ తరగతిలో 25 శాతం, 8వ తరగతిలో 2 శాతం మందిలో ఈ సమస్య ఉన్నట్టు గుర్తించారు. ఇంటర్నేషనల్ స్కూల్స్‌లో 14 శాతం చదవడం, 17 శాతం రాయడంలో వెనుకబడి ఉన్నట్టు తేలింది. పట్టుతప్పిన చదువు... ►ఆంగ్లభాషలో విద్యార్థుల ప్రమాణాలు 35 శాతం మేర పడిపోయాయి. 3వ తరగతి విద్యార్థులు ఒకటో తరగతి నైపుణ్యాల స్థాయికి తగ్గిపోయారు. పట్టణాల్లో ఆంగ్ల భాషలో చదివే నైపుణ్యం కొరవడింది. 40% మంది 5వ తరగతి విద్యార్థులు ఇంగ్లిష్‌లో అర్థం చేసుకోలేనిస్థితిలో ఉన్నారు. ఐదో తరగతి పట్టణ విద్యార్థులు ఇంగ్లిష్ చదవడంలో ఇబ్బంది పడుతున్నారు. ►44 శాతం విద్యార్థులు గణితంలో సమస్యలు ఎదుర్కొంటున్నారు. 42 శాతం 5వ తరగతి విద్యార్థులు గణితంలో తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారు. గణితంలో ప్రతి ముగ్గురు విద్యార్థులు సమస్యలు ఎదుర్కొంటున్నారు. ►ఆన్లైన్ బోధనలో 83.9 శాతం మంది యూట్యూబ్, దూరదర్శన్, టీ–శాట్‌కు ప్రాధాన్యమిచ్చారు. 12 శాతం మందికి ఇంటర్నెట్ లేకపోవడం వల్ల క్లాసులు వినలేకపోయారు. ఆన్లైన్ బోధనపై గ్రామాల్లో తీవ్ర వ్యతిరేకత కన్పించింది. 44.6 శాతం విద్యార్థులు ప్రస్తుత పరిస్థితుల్లో తరగతిగదుల్లో చదవడం కష్టంగా ఉందని చెబుతున్నారు. ►కరోనా వల్ల 32.8 శాతం మంది ఆత్మ విశ్వాసంతో చదువు కొనసాగించడంలేదు. ఇంటర్ విద్యార్థులకు న్యాయం చేస్తాం: వినోద్‌కుమార్ ఇంటర్ ఫస్టియర్ పరీక్షల్లో ఫెయిలైన విద్యా ర్థుల ఆందోళనను ప్రభుత్వం అర్థం చేసుకుందని, త్వరలోనే సానుకూల నిర్ణయం ప్రకటిస్తుందని రాష్ట్ర ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్ ఆశాభావం వ్యక్తం చేశారు. నేషనల్ ఇండిపెండెన్స్ స్కూల్స్ అలయెన్స్ (నిసా), తెలంగాణ రిజిస్టర్డ్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ (ట్రాస్మా) ఇటీవల కరోనా కాలంలో విద్యా ప్రమాణాలపై నిర్వహించిన సర్వే నివేదికను వినోద్ మంగళవారం హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఆన్లైన్ క్లాసులు నిర్వహించినా గ్రామీణ ప్రాంతాలకు విద్య చేరువ కాలేకపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. కరోనాకాలంలో గత రెండేళ్లుగా విద్యారంగానికి జరిగిన నష్టాన్ని ఉపాధ్యాయులు పూడ్చాలని, బ్రిడ్జ్ కోర్సు అందుబాటులోకి తీసుకొచ్చే అంశాన్ని పరిశీలించాలని సూచించారు. అన్ని స్థాయిల్లోనూ విద్యారంగాన్ని ప్రక్షాళన చేయాలనే ప్రభుత్వం భావిస్తోందని చెప్పారు. ట్రాస్మా సలహాదారు డాక్టర్ ప్రసాదరావు మాట్లాడుతూ 98 శాతం గ్రామీణ విద్యార్థులు ఆన్లైన్ విద్యపై మక్కువ చూపడం లేదన్నారు. కరోనా మూలంగా విద్యార్థులకు ఆంగ్ల భాష మీద పట్టు తగ్గిందని, రాత నైపుణ్యానికి దూరమయ్యారని, ఈ నష్టాన్ని పూడ్చకపోతే భవిష్యత్‌లో విద్యారంగం అనేక సవాళ్లను ఎదుర్కొనే అవకాశం ఉందన్నారు. కార్యక్రమంలో ట్రాస్మా రాష్ట్ర అధ్యక్షుడు యాదగిరి శేఖర్‌రావు, ప్రధాన కార్యదర్శి సాదుల మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు. -
ఈ మెలుకువలు పాటిస్తే ‘ఇంటర్’ యమ ఈజీ
సాక్షి, హైదరాబాద్: ఫలితం గురించి పక్కనపెడితే.. ఇంటర్ పరీక్షల మానసిక ఒత్తిడిని తేలికగా జయించవచ్చని చెబుతున్నారు మానసిక నిపుణులు. ఫస్టియర్ పరీక్షలు మొదలవుతున్న వేళ... విద్యార్థులు మానసిక ఒత్తిడిని జయించేందుకు ప్రత్యేకంగా సైకియాట్రిస్ట్‌లను ఇంటర్ బోర్డు అందుబాటులోకి తెచ్చింది. ఫోన్ల ద్వారా వారిని సంప్రదించే ఏర్పాట్లు చేసింది. గత రెండు రోజులుగా విద్యార్థులు, వారి తల్లిదండ్రుల నుంచి పెద్ద సంఖ్యలో వారికి ఫోన్‌కాల్స్ వస్తున్నాయి. ఇందులో ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల నుంచే ఎక్కువగా ఉంటున్నాయని మానసిక నిపుణులు చెబుతున్నారు. ఆన్లైన్ ద్వారా సరిగా వినలేకపోయామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కార్పొరేట్ కాలేజీల్లో చదివే విద్యార్థులు మాత్రం పోటీ పరీక్షల ఒత్తిడి నేపథ్యంలో ప్రస్తుత ఇంటర్ పరీక్షలపై ఆందోళన చెందుతున్నారు. వాళ్లు ఎదుర్కొంటున్న భయం, ఆందోళనను పారద్రోలేందుకు సైకియాట్రిస్ట్‌లు అనేక సూచనలు చేస్తున్నారు. చదవండి: కొనసాగుతున్న తెలంగాణ ఇంటర్ పరీక్షలు గుర్తున్నది రాస్తే చాలు పాస్ గ్యారెంటీ ‘కరోనా కారణంగా చాలా రోజులుగా మేం పల్లెటూళ్లోనే ఉన్నాం. ఆన్లైన్ క్లాసులు సరిగా వినలేదు. పరీక్షలు రాయగలమా? అనే ఆందోళన వెంటాడుతోంది’అని నిజామాబాద్ జిల్లా మారుమూల పల్లెకు చెందిన గోవింద్ కాల్ చేశాడు. అతని మానసిక స్థితి తెలుసుకునేందుకు సైకియాట్రిస్ట్ కొన్ని ప్రశ్నలు వేశాడు. తను చదివిన చాప్టర్స్‌లో అతను ఎంత పట్టు కలిగి ఉన్నాడో తెలిసిపోయింది. వాస్తవానికి ఇప్పుడా చాప్టర్లు మళ్లీ మననం చేసుకుంటే పాస్ గ్యారెంటీ. ఈ వాస్తవాన్ని చెప్పిన తర్వాత అతని మనసు కుదుటపడింది. తమకు వస్తున్న కాల్స్‌లో ఇలాంటివి చాలా ఉంటున్నాయని ఇంటర్ బోర్డ్ ఏర్పాటు చేసిన సైకియాట్రిస్టులు చెబుతున్నారు. నిజానికి విద్యార్థులు ఆన్లైన్లో నేర్చుకున్న చాప్టర్లనే రివిజన్ చేసుకుంటే పాస్ మార్కులొస్తాయని వారు అంటున్నారు. ఇలా కాకుండా చదువుకొని పాఠాల కోసం హైరానా పడొద్దని సూచిస్తున్నారు. తక్కువ సమయంలో ఎక్కువ స్కోరెలా? ‘పరీక్షలే ఉండవనుకున్నాం. ఇప్పుడు రాయాల్సి వస్తోంది. ఇంత సమయంలో ఎలా?’అనేది సైకియాట్రిస్ట్‌లకు వచ్చే ఫోన్‌కాల్స్‌లో రెండో తరహా ప్రశ్న. ‘చదివిన చాప్టర్లలో ఎక్కువగా గుర్తుండిపోయే ప్రశ్నలపై ప్రధానంగా దృష్టి పెట్టాలి. ఆన్లైన్ క్లాసుల్లో బాగా అర్థమైన వాటిల్లోంచి ప్రశ్నలు ఎంచుకోవాలి. బోర్డు విడుదల చేసిన స్టడీ మెటీరియల్‌తో వీటిని పోల్చి చూసుకోవాలి. ఆ తర్వాత స్నేహితులు, లెక్చరర్లతో సాదాసీదా సంభాషణలో చర్చించిన చాప్టర్లను మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు నెమరు వేసుకోవాలి. సమయం ఉంటే స్నేహితులతో వీటిపై మళ్లీ చర్చించాలి’అని మానసిక నిపుణులు చెబుతున్నారు. వెన్నుతడితే పరీక్షల్లో విజయం తేలికే.. ఇంటర్ పరీక్షను విద్యార్థి చాలా తేలికగా తీసుకునే వాతావరణం తల్లిదండ్రులే కలి్పంచాలన్నది మానసిక నిపుణుల అభిప్రాయం. రోజూ తల్లిదండ్రుల నుంచి 50 కాల్స్ వస్తున్నాయని ఓ సైకియాట్రిస్ట్ తెలిపారు. ఇందులో మధ్యతరగతి ఉద్యోగ వర్గాల వారివే ఎక్కువగా ఉంటున్నాయని చెబుతున్నారు. ‘అనివార్యంగానే ఇంటర్ పరీక్షలు పెడుతున్నట్లు అధికారులే చెప్పారు. దీన్ని జయించే మార్గాలనూ ఇంటర్ బోర్డు విద్యార్థుల ముందుంచింది. వీటిని అనుసరిస్తే చాలనే భావన తల్లిదండ్రులూ కల్పించాలి. పిల్లలు ఒత్తిడికి గురవుతుంటే.. సరైన రీతిలో దాన్ని దూరం చేసే బంధువులు, స్నేహితుల సలహా తీసుకుంటే సరి. ఎక్కువ మార్కులు టార్గెట్‌గా పెట్టకుండా, తెలిసినంత వరకూ రాయమని పిల్లలను ప్రోత్సహిస్తే... ఊహించినదానికన్నా ఎక్కువ మార్కులు తెచ్చుకునే వీలుంటుంది’అని సైకియాట్రిస్టులు వెల్లడిస్తున్నారు. మానసిక నిపుణుల సూచనలు.. ► ప్రతికూల భావజాలంతో పాటు.. సానుకూల వాతావరణాన్ని సమకూర్చుకోవాలి. దీనివల్ల మనిషిలోని గ్రంథుల ద్వారా పాజిటివ్ ఎనర్జీ అందుతుంది. పరీక్ష సమయంలో సులువగా రాసేందుకు వీలు కల్పింస్తుంది. ►పరీక్ష రాసే విద్యారి్థపై ఆక్సిజన్ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ప్రతీ గంటకు ఐదు నిమిషాలు బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయాలి. దీంతో సమృద్ధిగా మెదడుకు ఆక్సిజన్ అందుతుంది. మెదడు ఎప్పటికప్పుడు సరికొత్త శక్తి నింపుకుని పనిచేస్తుంది. చదివేది తేలికగా మెమొరీలోకి వెళ్లే అవకాశం ఉంటుంది. ►రాత్రింబవళ్లు చదివే విధానం అనుసరించకూడదు. కనీసం రాత్రి పూట 6 గంటలకు తగ్గకుండా నిద్రపోవాలి. దీంతో మెదడు విశ్రాంతి తీసుకుంటుంది. మెదడులో ఉండే గదుల్లో వేడి తగ్గడమే కాకుండా, సమాచారం ఆయా గదుల్లో నిక్షిప్తమవుతుంది. మర్నాడు తేలికగా చదివింది గుర్తు చేసుకునే వీలుంటుంది. ►రోజూ కనీసం 5 లీటర్లకు తగ్గకుండా మంచినీళ్లు తాగాలి. దీంతో శరీరం లవణాలను కోల్పోకుండా (డీ హైడ్రేషన్) చూసుకోవచ్చు. ఫలితంగా మెదడు చురుకుగా పనిచేస్తుంది. ఒకేసారి కాకుండా ప్రతీ అరగంటకు కొన్ని నీళ్లు తాగితే మంచి ఫలితం ఉంటుంది. ►పరీక్షకు వెళ్లేప్పుడు అంతకు ముందు రాసిన పరీక్ష గురించి ఎట్టి పరిస్థితుల్లోనూ చర్చించవద్దు. కొంత గ్యాప్ ఇచ్చి.. మరుసటి పరీక్ష మీద దృష్టి పెట్టాలి. దీంతో గతంలో చదివింది మెదడులో స్లీపింగ్ మోడ్‌లోకి వెళ్తుంది. రేపు రాయాల్సిన పరీక్షకు సమాచారం ఆన్ మోడ్‌లో ఉంటుంది. ఆత్మస్థైర్యమే విజయ రహస్యం ఇప్పటివరకూ వందల్లో ఫోన్‌కాల్స్ వచ్చాయి. సమస్య చెప్పేటప్పుడు వాళ్లల్లో ఆందోళన కన్పించేది. కౌన్సెలింగ్ తర్వాత ధైర్యం వచ్చేది. ఇంటర్ పరీక్షలను రాయగల శక్తి ప్రతీ ఒక్కరికీ ఉంది. ఫలితం ఏ విధంగా వస్తుందో.. అనే అనవసర సందేహాన్ని రానివ్వకుండా ఉంటే మంచి మార్కులు ఖాయం. ఇదే విషయాన్ని చెప్పాం. విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో భయాన్ని దూరం చేస్తున్నాం. చాలామంది మంచి మార్కులతో ఉత్తీర్ణులయ్యే వాతావరణమే ఈసారి కని్పస్తోంది. – డాక్టర్ అనుపమ (ఇంటర్ బోర్డ్ ఏర్పాటు చేసిన సైకియాట్రిస్ట్) -
నరసాపురంలో ఘోర రోడ్డు ప్రమాదం
సాక్షి, నరసాపురం రూరల్ : నరసాపురం నుంచి పాలకొల్లు వెళ్లే రోడ్డులో పద్మశ్రీ కాలనీ సమీపంలో గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. రెండు బైక్‌లపై ప్రయాణిస్తున్న యువకులను గుర్తుతెలియని వాహనం ఢీ కొట్టినట్టు పేర్కొంటున్నారు. అయితే ఎదురెదురుగా వస్తున్న రెండు బైక్‌లు ఢీకొన్న తరువాత ప్రమాదం జరిగిందేమో అనే అనుమానం కూడా వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదంలో మరణించిన, గాయపడిన వారంతా ఇంటర్ చదువుతున్న విద్యార్థులే. రోడ్డుపై చెల్లా చెదురుగా పడిఉన్న మృతదేహాలతో ఆ ప్రాంతం రక్తపు మడుగులా మారింది. చదవండి: (పాఠశాల సమీపంలో ఘర్షణ.. ఏడో తరగతి విద్యార్థి మృతి) ప్రమాదంలో పోడూరు మండలం జిన్నూరుకు చెందిన చదలవాడ వంశీ, నరసాపురం కనకదుర్గా థియేటర్ ప్రాంతానికి చెందిన చాట్ల ముఖేష్ కుమార్(16), నరసాపురం వనువులమ్మగుడి ప్రాంతానికి చెందిన సమతం సుబ్రహ్మణ్యం(17) అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్ర గాయాలైన పోడూరు మండలం జిన్నూరుకు చెందిన ఇంజమూరి గని, నరసాపురం పెద్దచర్చి ప్రాంతానికి చెందిన లంకాని సాయికుమార్‌లను చికిత్స కోసం పోలీసులు 108 అంబులెన్స్‌లో భీమవరంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. మూడు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం నరసాపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. నరసా పురం సీఐ శ్రీనివాసయాదవ్ పర్యవేక్షణలో రూరల్ ఎస్సై ప్రియకుమార్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: (భార్యపై కోపంతో కారు, 4 బైకులకు నిప్పు పెట్టిన ఐటీ ఉద్యోగి) -
జూలైలో తెలంగాణ ఇంటర్ పరీక్షలు?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇంటరీ్మడియట్ ద్వితీయ సంవత్సర పరీక్షలు రాసే విద్యార్థులకు రెండు అవకాశాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు పరీక్షలను రెండుసార్లు నిర్వహించనుంది. మొదటి పరీక్షలను జూలైలో నిర్వహించి ఆగస్టులో ఫలితాలు విడుదల చేయాలని నిర్ణయించినట్లు కేంద్రానికి తెలిపింది. ఇటీవల కేంద్ర విద్యా శాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ అన్ని రాష్ట్రాల విద్యా శాఖ మంత్రులు, కార్యదర్శులతో పరీక్షల నిర్వహణపై వర్చువల్ సమీక్ష నిర్వహించారు. రాష్ట్రాల అభిప్రాయాలను రాతపూర్వకంగా తెలియజేయాలని సూచించారు. ఈ నేపథ్యంలో కేంద్ర విద్యా శాఖ సంయుక్త కార్యదర్శి ఎల్ఎస్ చాంగ్సన్‌కు రాష్ట్ర విద్యా శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా కేంద్రానికి లేఖ రాశారు. పరీక్షలను జూలై మధ్యలో నిర్వహిస్తామని అందులో పేర్కొన్నారు. ప్రశ్నపత్రాలు ఇప్పటికే ముద్రించినందున పరీక్ష విధానంలో ఎలాంటి మార్పులు చేయడం లేదని వెల్లడించారు. అయితే ప్రశ్నపత్రంలో ఇచి్చన మొత్తం ప్రశ్నల్లో 50 శాతం ప్రశ్నలకే సమాధానాలు రాసేలా విద్యార్థులకు అవకాశం ఇస్తామన్నారు. ఆ మార్కులను రెట్టింపు చేసి 100 శాతంగా పరిగణనలోకి తీసుకుని ఫలితాలు వెల్లడిస్తామని వివరించారు. పరీక్ష సమయాన్ని 3 గంటల నుంచి 90 నిమిషాలకు కుదిస్తున్నట్లు వెల్లడించారు. రెండు వేరు వేరు సెట్ల ప్రశ్నపత్రాలతో ఉదయం, సాయంత్రం రెండు బ్యాచ్‌లుగా పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు కరోనా, ఇతరత్రా కారణాలతో ఈ పరీక్షలకు హాజరు కాలేని విద్యార్థులకు మూడో సెట్ ప్రశ్నపత్రంతో తర్వాత పరీక్ష నిర్వహిస్తామని చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో వీలైనంత మేర భౌతిక దూరాన్ని పాటిస్తూ పరీక్షల నిర్వహణకు చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. కాగా, ఇంటర్ ద్వితీయ సంవత్సర ఫలితాలు జూలైలో నిర్వహిస్తారని.. పరీక్షల్లో మార్పులు చోటుచేసుకోనున్నాయని ‘సాక్షి’గురువారం కథనం ప్రచురించిన సంగతి తెలిసిందే. ప్రాక్టికల్ పరీక్షలు వాయిదా.. ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలకు సంబంధించి ముందస్తు షెడ్యూల్ ప్రకారం ఈనెల 29 నుంచి వచ్చే నెల 7వ తేదీ వరకు నిర్వహించాల్సిన ప్రాక్టికల్ పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్ తెలిపారు. కరోనా నేపథ్యంలో ఇంటర్ ద్వితీయ సంవత్సర, ఒకేషనల్ ప్రథమ సంవత్సర పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు పేర్కొన్నారు. వీటిపై జూన్ మొదటి వారంలో సమీక్ష నిర్వహిస్తామని వెల్లడించారు. ప్రాక్టికల్ పరీక్షల నిర్వహణ తేదీలను కనీసం 15 రోజుల ముందు చెబుతామని వివరించారు. చదవండి: డబుల్ హ్యాపీ.. కళాకారులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చదవండి: తక్షణమే ‘కోవిడ్’ కారుణ్య నియామకాలు -
Sakshi Webinar: ఇంటర్ విద్యార్థులకు శుభవార్త..
సాక్షి, ఎడ్యుకేషన్: పబ్లిక్ పరీక్షలు ముగియగానే ప్రతీ ఇంటర్ విద్యార్థి మదిలో మెదిలేది.. ఇం టర్ తర్వాత ఏమి చేయాలి? ఏ కోర్సు చేస్తే కెరీర్ బాగుంటుంది..? ఎలాంటి కోర్సును ఎం పిక చేసుకోవాలి? ఏఏ కోర్సు పూర్తి చేస్తే ఎలాంటి ఉద్యోగం వస్తుంది? చదువు తర్వాత ఉద్యోగం రావాలంటే ఏమి చేయాలి? ఇలాం టి ఎన్నో సందేహాలకు సరైన సమాధానాలను ఇచ్చేలా సాక్షి ఎడ్యుకేషన్ ఆ«ధ్వర్యంలో మే 18వ తేదీ ఉదయం 11:30 నుంచి మధ్యాహ్నం 1:00 గంట వరకు వెబినార్ నిర్వహిస్తున్నాము. మీ సందేహాలకు ప్రముఖ సబ్జెక్ట్ నిపుణులు సమాధానాలు చెబుతారు. అలాగే, మీకు ఇంజనీరింగ్, లా, మేనేజ్మెంట్ కోర్సులకు సంబంధించి ఎలాంటి సందేహాలున్నా సబ్జెక్ట్ నిపుణులను అడిగి నివృత్తి చేసుకోవచ్చు. ‘విట్ యూనివర్సిటీ’ సౌజన్యంతో ఈ కార్యక్రమం జరగనుంది. https://www.arenaone.in/webinar/ లింక్ నుంచి రిజిస్ట్రేషన్ చేసుకోండి. మరిన్ని వివరాలకు 040–23322330 నంబర్‌పై సంప్రదించవచ్చు. ఈ వెబినార్‌లో ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి ప్రత్యేక ముఖ్య కార్యదర్శి సతీష్ చంద్ర, ఏపీ ఇంటర్మీడియెట్ బోర్డ్ ప్రత్యేక కమిషనర్ వి.రామకృష్ణ పాల్గొంటారు.విట్ యూనివర్సిటీ ప్రొఫెసర్ బెనర్జీ, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉషా శేషాద్రి విద్యార్థులకు సూచనలు–సలహాలు ఇస్తారు. మరి ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడే రిజిస్ట్రేషన్ చేసుకోండి. మీ బంగారు భవిష్యత్‌కు సరైన బాట వేసుకోండి. ఆల్ ది బెస్ట్.. -
‘కరోనా సోకిన 163 మంది విద్యార్థులకు ప్రత్యేక వైద్యం’
సాక్షి,విజయవాడ : తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి తిరుమల జూనియర్ కాలేజీలో భారీగా వెలుగు చూసిన కరోనా కేసులపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని స్పందించారు. తిరుమల జూనియర్ కాలేజీలోని 163 మంది ఇంటర్ విద్యార్థులకు ఇటీవలె కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిన సంగతి తెలిసిందే. వీరిని రాజమండ్రి తిరుమల జూనియర్ కాలేజీ లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రూమ్స్‌లో వైద్య సదుపాయం కల్పించామని మంత్రి తెలిపారు. కరోనా నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి, డీఎంహెచ్‌వో డాక్టర్ గౌరిశ్వరావుతో మంత్రి ఆళ్లనాని ఫోన్లో మాట్లాడారు. వెంటనే కరోనా నివారణకు ముందోస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. తిరుమల జూనియర్ కాలేజీలో పూర్తి స్థాయిలో సూపర్ శానిటేషన్ చేయాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు మంత్రి ఆళ్లనాని ఆదేశించారు. కాలేజీలో ఇంటర్ విద్యను అభ్యసిస్తున్న ఇతర విద్యార్థులను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన హాస్టల్ కి తరలించి RTPCR పరీక్షలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. 'కాకినాడ, ముమ్ముడివరం, రామచంద్రపురం, రాజమండ్రి, ప్రాంతాల్లో 41పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. తూర్పుగోదావరి జిల్లాలో 50మీటర్లు దూరంలో కంటోన్మెంట్ జోన్స్ ఏర్పాటు చేశాం. కరోనా సోకిన బాధితులకు 24గంటల పాటు ఆరోగ్య సిబ్బంది పర్యవేక్షణ చేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో 35కంటోన్మెంట్ జోన్స్ ఏర్పాటు చేశాం. తిరుమల జూనియర్ కాలేజీ లో 400మంది విద్యార్థులకు కరోనా పరీక్షలు నిర్వహించడం కోసం వైద్య ఆరోగ్య శాఖ అన్ని చర్యలు చేపట్టింది. జిల్లా వ్యాప్తంగా ఎక్కడ కరోనా ప్రభావం లేకుండా అన్ని ముందోస్తు చర్యలు తీసుకుంటున్నాం. అన్ని విద్యా సంస్థల్లో కూడా కరోనా పరీక్షలు నిర్వహించడానికి చర్యలు చేపట్టాం. కరోనా వ్యాక్సిన్ తీసుకోవడానికి ప్రజలు స్వచ్చందంగా ముందుకు రావాలి' అని ఆళ్లనాని తెలిపారు. చదవండి : పెరుగుతున్న కరోనా కేసులు.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం వ్యాక్సినేషన్‌ను వేగవంతం చేయాలి -
ఆన్లైన్ అడ్మిషన్ల నుంచి మినహాయింపులుండవ్
సాక్షి అమరావతి: ఇంటర్మీడియెట్ ఆన్లైన్ అడ్మిషన్ల నుంచి ఏ కాలేజీకీ మినహాయింపు లేదని విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ స్పష్టం చేశారు. కార్పొరేట్ విద్యాసంస్థలు ఇంటర్మీడియెట్ విద్యను గుప్పెట్లో పెట్టుకుని అరాచకాలు చేశాయన్నారు. వీటిని ఎట్టిపరిస్థితుల్లో సహించబోమని, విద్యా వ్యాపారాన్ని ఉక్కుపాదంతో అణచి వేస్తామని హెచ్చరించారు. శనివారం విజయవాడలో మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. ఇంటర్ విద్య సామాన్యులకు అందుబాటులో లేకుండా పోయిందని, రూ.లక్షల్లో ఫీజులు చెల్లించే వారికే అక్కడ విద్య అన్నట్లుగా మారిందని పేర్కొన్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పేదలకు విద్యను అందుబాటులో ఉంచాలన్న లక్ష్యంతో అనేక సంస్కరణలు తీసుకువచ్చారని చెప్పారు. పారదర్శకత, అవినీతి రహితంగా ఉండేలా ఇంటర్మీడియెట్ విద్యను తీర్చిదిద్దుతుంటే కార్పొరేట్ సంస్థలకు రుచించడం లేదని, జీవో–23 తెస్తే అడ్డుకోవాలని చూస్తున్నాయని అన్నారు. ఆన్లైన్ విధానం వల్ల సీట్లు అందుబాటులో ఉండవని, విద్యార్థులు పొరుగు రాష్ట్రాలకు పోతున్నారనే ప్రచారం చేయడం సరికాదన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఎయిడెడ్ కాలేజీలు 647 ఉన్నాయని.. వీటిలో 2,07,040 సీట్లు, 598 కేజీబీవీ, సంక్షేమ శాఖల కాలేజీల్లో 47,840 సీట్లు ఉన్నాయని తెలిపారు. మొత్తంగా ప్రభుత్వ విద్యాసంస్థల్లోనే 2,54,880 సీట్లు ఉన్నట్టు చెప్పారు. ప్రైవేట్ అన్ ఎయిడెడ్ కాలేజీల్లో జనరల్ ఇంటర్ సీట్లు 2,59,400, ఒకేషనల్ కాలేజీల్లో 26,100 సీట్లు ఉన్నాయని వివరించారు. అదనంగా 561 చోట్ల కొత్త కాలేజీల ఏర్పాటుకు నోటిఫికేషన్ ఇచ్చామని, ఇప్పటికే 150 కాలేజీలకు అనుమతిచ్చామని చెప్పారు. వీటిద్వారా 43,400 సీట్లు అందుబాటులోకి వస్తున్నాయన్నారు. టెన్త్ పాసైన వారు 6,31,274 మంది ఉండగా 5,83,780 ఇంటర్ సీట్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. 611 కాలేజీలకు అనుమతులు ఇవ్వడం లేదు రేకుల షెడ్లు, షాపింగ్ కాంప్లెక్సులలో అరకొర వసతులతో సాగే 611 కాలేజీలకు అనుమతులు ఇవ్వడం లేదని మంత్రి చెప్పారు. రూ.లక్షల్లో ఫీజులు కనీస వసతులు కల్పించకుండా ఒక్కో గదిలో 150 నుంచి 200 మందిని ఉంచి పాఠాలు చెప్పడాన్ని కొనసాగించలేమని, అందుకే తరగతికి 40 మంది మాత్రమే ఉండేలా చేస్తున్నామని తెలిపారు. కొన్ని కాలేజీలు లోపాలను సవరించుకునేందుకు సమయం అడిగాయని.. అలాంటి వాటికి అనుమతిస్తున్నామని చెప్పారు. ఆన్లైన్ విధానం వల్ల ప్రతి ప్రైవేట్ కాలేజీలో రిజర్వేషన్లు అమలవుతాయన్నారు. రేపటి నుంచి బడి గంటలు సోమవారం నుంచి బడి గంటలు మోగనున్నాయని.. స్కూళ్లు, కాలేజీలు పునఃప్రారంభం అవుతాయని సురేష్ ప్రకటించారు. కోవిడ్ నిబంధనల్ని పాటిస్తూ అన్ని జాగ్రత్తలతో విద్యాసంస్థలను ప్రారంభించనున్నామని వివరించారు. 2021 విద్యా సంవత్సరాన్ని ఆగస్టుకల్లా పూర్తిచేసేలా షెడ్యూల్ రూపొందించామని, సెలవులను తగ్గిస్తూ ఆయా అంశాల బోధన ఉండేలా చూస్తున్నామని చెప్పారు. స్కూళ్లలో బేస్‌లైన్ పరీక్ష నవంబర్ మొదటి వారం నుంచి, ప్రాజెక్టు ఆధారిత పరీక్షలు నవంబర్ చివరి వారంలో, ఫార్మెటివ్ అసెస్మెంట్–1 డిసెంబర్ చివరి వారం నుంచి, ఫార్మెటివ్ అసెస్మెంట్–2 ఫిబ్రవరి చివరి వారంలో నిర్వహిస్తామని వివరించారు. సమ్మెటివ్ అసెస్మెంట్ ఏప్రిల్ చివరి వారంలో ఉంటుందన్నారు. 180 రోజుల్లో 143 పని దినాలు తరగతి బోధన, మిగిలినవి ఇంటి పని దినాలుగా ఉంటాయని తెలిపారు. -
ఇంటర్ పనిదినాలు...182 రోజులే!
సాక్షి, హైదరాబాద్ : కరోనా కారణంగా విద్యా సంవత్సర ప్రారంభం ఆలస్యం కావడంతో ఆ ప్రభావం ఇంటర్మీడి యట్ తరగతులు, పరీక్షల నిర్వహణపైనా పడింది. సాధార ణంగా ఏటా మార్చి మొదట్లోనే వార్షిక పరీక్షలను ప్రారంభించే ఇంటర్ బోర్డు ఈసారి కరోనాతో పనిదినాలు కోల్పోయిన నేపథ్యంలో 2021 మార్చిలో ఆలస్యంగా వార్షిక పరీక్షలను నిర్వహించేలా షెడ్యూల్‌ను ప్రకటించింది. 2021, మార్చి 24 నుంచి ఏప్రిల్ 12 వరకు వార్షిక పరీక్షలను నిర్వహిస్తామని స్పష్టం చేసింది. ఈ మేరకు అకడమిక్ కేలండర్‌ను విడుదల చేసింది. ఈనెల ఒకటో తేదీ నుంచి ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సర విద్యార్థులకు డిజిటల్ తరగతులు (దూరదర్శన్, టీశాట్ ద్వారా వీడియో పాఠాలు) ప్రారంభమైన నేపథ్యంలో అందుకు అనుగుణంగా కాలేజీల పనిదినాలు, ఏయే నెలలో ఏయే రోజుల్లో కాలేజీలను కొనసాగించే అంశాలతో షెడ్యూల్ జారీ చేసింది. గత మార్చి 21 నుంచి వేసవి సెలవులు ప్రారంభం కాగా అదే సమయంలో కరోనా కారణంగా లాక్‌డౌన్‌తో ఆగస్టు 31 వరకు సెలవులు కొనసాగినట్లు పేర్కొంది. నష్టపోయిన పని దినాలను సర్దుబాటు చేస్తూ సెలవులను కూడా కుదించింది. సాధారణంగా 220 రోజులతో విద్యా సంవత్సరం ఉండనుండగా, ఈసారి 182 రోజుల పనిదినాలతో విద్యా సంవత్సరాన్ని ప్రకటించింది. దసరా, సంక్రాంతి వంటి పండుగ సెలవులు, ఇతరత్రా సెలవు దినాలను కుదించింది. మరోవైపు తాము ప్రవేశాల షెడ్యూల్ జారీ చేసిన తరువాతే కాలేజీలు ఇంటర్ ప్రథమ సంవత్స రంలో ప్రవేశాలు చేపట్టాలని స్పష్టం చేసింది. ప్రవేశాల కోసం ఎలాంటి ప్రకటనలు జారీ చేయడానికి వీల్లేదని వెల్లడించింది. ఈ నిబంధనలను అతి క్రమించిన కాలేజీల గుర్తింపును రద్దు చేస్తామని హెచ్చరించింది. -
హైస్కూళ్లలోనే ఇంటర్
గ్రామీణ విద్యార్థులకు ఉన్నత విద్య చేరువవుతోంది. ప్రతిభతో ‘పది’ గట్టెక్కినా దూరాభారంతో ‘ఇంటర్’ చదువు ఇరుకున పెట్టేది. అందువల్లే ఇంటర్లో చేరినా డ్రాపౌట్స్ సంఖ్య ఎక్కువగా ఉండేది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంత బాలికలు పట్టణాలకు రాకపోకలు సాగించడం ఇబ్బందిగా మారి వారి భవితే మారిపోయేది. ఇవన్నీ గమనించిన వైఎస్సార్ సీపీ ప్రభుత్వం హైస్కూల్లోనే ఇంటర్ విద్య అందించాలని నిర్ణయించింది. ఈ క్రమంలో జిల్లా వ్యాప్తంగా 37 హైస్కూళ్లను అప్‌గ్రేడ్ చేయనుండగా.. గ్రామీణ విద్యార్థులకు మేలు జరుగుతోంది. అనంతపురం విద్య: విద్యార్థుల సంఖ్య అధికంగా ఉన్న ఉన్నత పాఠశాలలను జూనియర్ కళాశాలలుగా అప్‌గ్రేడ్ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ముఖ్యంగా మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాలలను జూనియర్ కళాశాలలుగా అప్‌గ్రేడ్ చేసేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో గత వారంలో విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఇంటర్ బోర్డు ఉన్నతాధికారులతో సమావేశం కూడా నిర్వహించారు. పదో తరగతి ఉత్తీర్ణులైనా ఇంటర్ చదివేందుకు ఎందుకు ఉత్సాహం చూపడం లేదనే అంశం సమావేశంలో చర్చకు రాగా... దూరభారం వల్లే సమస్య తలెత్తుతోందని అందరూ అంగీకరించారు. ఈ నేపథ్యంలో మండల స్థాయిలో జూనియర్ కళాశాలలను ఏర్పాటు చేస్తే ఇంటర్ కోర్సుల్లో అడ్మిషన్లను గణనీయంగా పెంచవచ్చని ఉన్నతాధికారులు భావించారు. ఈ అంశాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకువెళ్లగా...ఆయన కూడా వెంటనే ఆమోదం తెలిపారు. ఈ నేపథ్యంలోనే జిల్లాలోని మండల కేంద్రాల్లో జూనియర్ కళాశాలను ఏర్పాటుకు మార్గం సుగమమైంది. జిల్లాలో అదనంగా 37 జూనియర్ కళాశాలలు జిల్లాలో 63 మండలాలుండగా.. 25 మండలాల్లో మోడల్ పాఠశాలలు ఉన్నాయి. తాజాగా ప్రభుత్వం 37 ఉన్నత పాఠశాలలను జూనియర్ కళాశాలలుగా అప్‌గ్రేడ్ చేయనుంది. కార్పొరేట్ ,ప్రైవేట్ జూనియర్ కళాశాలల్లో ఒక్కో సెక్షన్లో 40 మంది విద్యార్థులకు మాత్రమే అనుమతి ఉంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలల్లోనే ఇంటర్ తరగతులు బోధించడం వల్ల అనేక మంది విద్యార్థులకు ఉన్నత విద్య అందించినట్లు అవుతుందని విద్యావేత్తలు భావిస్తున్నారు. మండలాల్లోనే జూనియర్ కళాశాల ఏర్పాటు గ్రామీణ ప్రాంతాల్లోని బాలికలకు వరంగా మారనుందని అందరూ భావిస్తున్నారు. ఈ అంశాలన్నీ క్షుణ్ణంగా పరిశీలించిన ప్రభుత్వం విద్యార్థుల సంఖ్య అధికంగా ఉన్నత పాఠశాలలను ఇంటర్ తరగతులను బోధించే వీలుగా అప్‌గ్రేడ్ చేయనుంది. జూనియర్ కళాశాలలు ఏర్పాటయ్యే మండలాలివే జిల్లాలోని ఆత్మకూరు, బత్తలపల్లి, బొమ్మనహాల్, బ్రహ్మసముద్రం, బుక్కరాయసముద్రం, చెన్నేకొత్తపల్లి, గాండ్లపెంట, గార్లదిన్నె, గుడిబండ, గుమ్మఘట్ట, హాల్కూర్, కంబదూరు, కణేకల్లు, కుందుర్పి, లేపాక్షి, ముదిగుబ్బ, నల్లచెరువు, నల్లమాడ, నంబులపూల కుంట, ఓడీ చెరువు, పరిగి, పెద్దపప్పూరు, పెద్దవడుగూరు, పుట్లూరు, రామగిరి, రాప్తాడు, రొద్దం, రొళ్ల, శెట్టూరు, శింగనమల, సోమందేపల్లి, తాడిమర్రి, తనకల్లు, వజ్రకరూరు, విడపనకల్లు, యాడికి, యల్లనూరు తదితర మండల కేంద్రాల్లో జూనియర్ కళాశాలలు ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. -
డబ్బులిస్తే.. ‘రాసి’పెడతారు!
సాక్షి, హైదరాబాద్: నగరంలోని టోలిచౌకి సూర్యనగర్ కాలనీలో ఉన్న న్యూ మదీన జూనియర్ కాలేజీ (సెంటర్ కోడ్– 60237) కేంద్రంగా గుట్టుగా సాగుతోన్న మాస్ కాపీయింగ్ వ్యవహారాన్ని పశ్చిమ మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు రట్టు చేశారు. బుధవారం కాలేజీపై దాడిచేసిన ప్రత్యేక బృందం.. కాలేజీ ప్రిన్సిపాల్, ముగ్గురు పరిపాలన విభాగం సిబ్బంది, ఆరుగురు విద్యార్థుల్ని పట్టుకుంది. ఇదీ జరుగుతున్న తంతు.. ఇంటర్ పరీక్షల నిర్వహణకు బోర్డు నుంచి అనుమతి పొందిన కాలేజీల్లో న్యూ మదీన జూనియర్ కాలేజీ ఒకటి. ఇక్కడ పరీక్షలు రాస్తున్న విద్యార్థుల్లో కొందరికి ఆ కాలేజీ ప్రిన్సిపాల్ షోయబ్ తన్వీర్ కచ్చితంగా పాస్ చేయిస్తానంటూ ఎర వేశాడు. ఒక్కో సబ్జెక్టుకు రూ.5 వేల నుంచి రూ.8 వేల వరకు వసూలు చేస్తున్నాడు. ఆయా పరీక్షల ప్రశ్నపత్రాలు స్థానిక పోలీసుస్టేషన్లలో ఉంటాయి. ఓఎంఆర్ షీట్‌తో కూడిన ఆన్సర్ షీట్స్ మాత్రం పరీక్ష కేంద్రానికే చేరతాయి. అక్కడ పరీక్ష రాసే విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఇంటర్మీడియట్ బోర్డ్ వీటిని అందిస్తుంది. వీటిని బోర్డుకు చెందిన ఎగ్జామినర్ పర్యవేక్షణలో ఆయా సెంటర్లకు చెందిన వారు సిద్ధం చేస్తారు. దీన్నే తన్వీర్ అనుకూలంగా మార్చుకున్నాడు. ప్రతి ప్రశ్నపత్రంతోనూ జతచేసి ఉండే ఆన్సర్‌షీట్స్ బుక్‌లెట్‌ను ముందు రోజు రాత్రే వీళ్లు మార్చేస్తున్నారు. ఓఎంఆర్ షీట్‌కు డమ్మీ జవాబుపత్రాన్ని జత చేస్తున్నారు. పరీక్ష రాసేటపుడు విద్యార్థి బుక్లెట్పై ఉండే ఓఎంఆర్ షీట్లో క్వశ్చన్ పేపర్‌తో పాటు ఈ బుక్లెట్ నంబర్ కూడా వేయాలి. మదీన జూనియర్ కాలేజీ ప్రిన్సిపాల్ తమతో ఒప్పందం కుదుర్చుకున్న వారికి ఓఎంఆర్ షీట్స్‌తో డమ్మీ బుక్లెట్స్ ఇస్తున్నాడు. అదే సమయంలో ప్రిన్సిపాల్.. అసలు బుక్‌లెట్స్‌ను కాలేజీ అడ్మినిస్ట్రేటివ్ సిబ్బంది సయ్యద్ కలీముద్దీన్, షబానా బేగం, జాహెదా షరీన్‌కు ఇచ్చి పుస్తకాల్లో చూసి రాయిస్తున్నాడు. ఆయా సబ్జెక్టుల ప్రశ్నపత్రాలూ వీరికి ఇస్తున్నాడు. పరీక్ష ముగిశాక ఈ అసలు బుక్‌లెట్స్‌ను ఒప్పం దం చేసుకున్న విద్యార్థులకు అందించి, వాటిని ఓఎంఆర్ షీట్ కు జతచేయిస్తూ దానిపై ఆ బుక్లెట్ నంబర్ వేయిస్తున్నాడు. అదుపులో పది మంది.. నగర టాస్క్‌ఫోర్స్ పోలీసులు దీనిపై పక్కా సమాచారం అందుకున్నారు. డీసీపీ పి.రాధాకిషన్‌రావు ఆదేశాలతో వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ బి.గట్టుమల్లు నేతృత్వంలోని బృందం న్యూ మదీన కాలేజీపై దాడి చేసింది. ఆ సమయంలో బుక్‌లెట్స్‌లో పరీక్షలు రాస్తున్న ముగ్గురు సిబ్బందితో పాటు ప్రిన్సిపాల్‌ను అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద లభించిన ఆధారాలను బట్టి ఒప్పందం చేసుకున్న విద్యార్థులైన అహ్మద్ నజీర్ (సెయింట్ జోసఫ్ జూనియర్ కాలేజీ–టోలిచౌకి), మహ్మద్ అహ్మద్ హుస్సేన్, మహ్మద్ ఇక్బాల్ అబ్బాస్, ఫిరాజ్ మీర్జా (నియోసిస్ జూనియర్ కాలేజీ), మహ్మద్ రియాన్ నజీర్ (న్యూ రిలయన్స్ జూనియర్ కాలేజీ), నిసార్ అహ్మద్ (నారాయణ జూనియర్ కాలేజీ)ను పట్టుకున్నారు. వీరిలో ఇద్దరు కామర్స్, నలుగురు కెమిస్ట్రీ పరీక్షలు రాయిస్తున్నారని గుర్తించారు. మరో ఇద్దరు విద్యార్థులైన మహ్మద్ అలీఖాన్, అబుబకర్ అబ్దుల్లా బిన్ మహఫూజ్ కోసం గాలిస్తున్నారు. పట్టుబడిన వారిని టాస్క్‌ఫోర్స్ బృందం గోల్కొండ పోలీసులకు అప్పగించింది. ఈ తరహాలో మరికొందరికీ ప్రిన్సిపాల్ పరీక్షలు రాయించినట్లు అనుమానిస్తున్న పోలీసులు ఆ దిశగానూ దర్యాప్తు చేపట్టారు. యాజమాన్యానికి షోకాజ్ నోటీస్ మూకుమ్మడి మాల్ ప్రాక్టీస్ ఘటన నేపథ్యంలో న్యూ మదీన జూనియర్ కాలేజీ యాజమాన్యానికి ఇంటర్ బోర్డు షోకాజ్ నోటీసు జారీ చేసింది. టాస్క్‌ఫోర్స్ పోలీసుల తనిఖీలో మాల్‌ప్రాక్టీస్ వాస్తవమేనని తేలిందని, దీంతో 8 మందిపై మాల్‌ప్రాక్టీస్ కేసులు బుక్ చేశా మంది. యాజమాన్యం తమ తప్పిదాన్ని అంగీకరించిన నేపథ్యంలో కాలేజీ అనుబంధ గుర్తింపును ఎందుకు రద్దు చేయకూడదో మూడు రోజుల్లో వివరణ ఇవ్వాలని యాజమాన్యానికి నోటీసు జారీ చేసినట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్ వెల్లడించారు. -
పరీక్ష రాసేందుకు వస్తుండగా...
సాక్షి, దుబ్బాక : కొద్ది నిమిషాలైతే పరీక్ష హాలులో ఉండాల్సిన విద్యార్థినులు గాయాలపాలై ఆస్పత్రిలో చికిత్సపొందాల్సిన పరిస్థితి ఏర్పడింది. తన చెల్లెళ్లను దుబ్బాకలోని పరీక్ష కేంద్రంలో దింపేందుకు స్కూటీపై తీసుకొస్తుండగా ప్రమాదవశాత్తు అదుపు తప్పి కింద పడిపోవడంతో ముగ్గురు అక్కా చెల్లెళ్లకు తీవ్రగాయాలైయ్యాయి. ఈ ఘటన దుబ్బాక మండలం బోప్పాపూర్ శివారులో శుక్రవారం చోటు చేసుకుంది. బాధిత విద్యారి్థనులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని బోప్పాపూర్‌కు చెందిన నారాయణ కూతుళ్లు అర్చన, అనూష ఇంటర్ సెకండియర్ పరీక్షలు రాస్తున్నారు. అయితే శుక్రవారం తన చెల్లెళ్లను ఇద్దరినీ పెద్ద కూతురు హరిత స్కూటీపై దుబ్బాకలో పరీక్ష కేంద్రంలో దింపేందుకు వస్తుంది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఇంటర్ విద్యార్థినులు అనూష,అర్చన ఈ క్రమంలోనే బోప్పాపూర్ దాటాక మార్గ మధ్యలో విద్యుత్ సబ్‌స్టేషన్ సమీపంలో ఒక్కసారిగా స్కూటీ టైర్ పగలడంతో వారు కింద పడిపోయారు. దీంతో హరితతో పాటు అర్చన, అనూషలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే వారిని దుబ్బాక ప్రభుత్వాస్పత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించి మెరుగైన చికిత్స నిమిత్తం సిద్దిపేటలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పరీక్ష రాయాల్సిన విద్యారి్థనులు ప్రమాదంలో గాయపడటంతో తోటి విద్యార్థులు చలించిపోయారు. గాయపడ్డ తమ స్నేహితులను చూసేందుకు పరీక్ష అయిపోగానే ఆస్పత్రికి వెళ్లారు. గాయపడ్డ విద్యార్థులను బీజేపీ నాయకులు రఘునందన్‌రావు పరామర్శించారు. చికిత్స పొందుతూ యువకుడి మృతి పాపన్నపేట(మెదక్): ట్రాన్స్ఫార్మర్ పట్టుకొని గాయాలైన యువకుడు చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన శుక్రవారం సాయంత్రం చోటు చేసుకుంది. పాపన్నపేట ఏఎస్ఐ నర్సింహులు సమాచారం మేరకు.. మండల పరిధిలోని సీతానగర్ గ్రామానికి చెందిన లంగడి మల్లేశం(31) ఫిబ్రవరి 28న రాత్రి తనకు ఆటో ఇప్పించాలంటూ కుటుంబ సభ్యులతో కొట్లాడి అదే రాత్రి కోపంతో వెళ్లి ట్రాన్స్ఫార్మర్ను పట్టుకొని తీవ్రగాయాలైన విషయం తెలిసిందే. అప్పట్లో అతడిని మెదక్ ఆస్పత్రికి తీసుకెళ్లి అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తరలించగా గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం సాయంత్రం మృతి చెందినట్లు ఎఎస్ఐ నరసింహులు వెల్లడించారు. ఈ విషయమై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన వివరించారు. -
ప్రయివేట్ కాలేజీలకు హైకోర్టు ఆదేశాలు..
సాక్షి, హైదరాబాద్ : పాసైన ఇంటర్ విద్యార్థుల ఒరిజినల్ సర్టిఫికేట్లు వారికి తిరిగి ఇవ్వాల్సిందేనని ప్రయివేట్ కళాశాలలకు తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. కాగా కొన్ని ప్రయివేట్ కాలేజీలు ఒరిజినల్ సర్టిఫికెట్లు ఇవ్వకుండా దగ్గర పెట్టుకోవడాన్ని సవాల్ చేస్తూ నికేశ్ అనే విద్యార్థి న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు విద్యార్థి ఫీజులు చెల్లించినప్పటికీ కళాశాలల యాజమాన్యాలు సర్టిఫికెట్లు దగ్గరుంచుకోవడాన్ని తప్పుబట్టింది. వెంటనే విద్యార్థుల ఒరిజినల్ సర్టిఫికెట్లు ఇవ్వాలని, ఒకవేళ ఫీజులు చెల్లించకపోయినా సర్టిఫికెట్లు విద్యార్థులకు ఇవ్వాల్సిందేనని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ఇంటర్‌కూ..అమ్మఒడి
-
తప్పెవరిది.. శిక్ష ఎవరికి?
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియట్ రీవెరిఫికేషన్లో భారీగా మార్కుల్లో తేడాలు బయటపడ్డాయి. మొదట ఫెయిలైన విద్యార్థులకు ఒక మార్కు నుంచి 49 మార్కుల వరకు పెరిగాయి. ఇక పరీక్షల్లో ఉత్తీర్ణులై, తమకు తక్కువ మార్కులు వచ్చాయంటూ రీవెరిఫికేషన్ కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు గరిష్టంగా 60 మార్కుల వరకు అదనంగా వచ్చాయి. దీంతో ఇంటర్మీడియట్ బోర్డు వైఫల్యాలు బయటపడ్డాయి. గ్లోబరీనా సంస్థ కారణంగా జరిగిన సాంకేతిక తప్పిదాలు, మూల్యాంకనంలో జరిగిన పొరపాట్లు విద్యార్థులను తీవ్ర మానసిక క్షోభకు గురిచేశాయి. సాంకేతిక సమస్యలు, సిబ్బంది తప్పిదాల కారణంగా జరిగిన ఈ తప్పులకు బోర్డు ఎవరిని బాధ్యులను చేస్తుందన్నది ప్రశ్నార్థకంగా మారింది. రీవెరిఫికేషన్‌తో బయటపడిన మరిన్ని వైఫల్యాలు.. రీవెరిఫికేషన్‌తో మారిన మార్కులు ఇంటర్ బోర్డు వైఫల్యాలను బయటపెట్టింది. సాంకేతిక సమస్యలే కాదు.. మూల్యాంకన లోపాలు, లెక్కించడంలో సిబ్బంది చేసిన తప్పులు విద్యార్థుల పాలిట శాపంగా మారాయి. వాస్తవంగా విద్యార్థులు రాసిన జవాబులకు, మెమోల్లో వచ్చిన మార్కులకు పొంతన లేకుండా తప్పిదాలు దొర్లాయి. రీవెరిఫికేషన్ తరువాత తమకు వచ్చిన మార్కులను చూసి విద్యార్థులే ఆశ్చర్యపోతున్నారు. ఇందుకు ఎవరు బాధ్యులన్న అంశాన్ని ఇంటర్మీడియట్ బోర్డు పక్కన పడేసింది. మూల్యాంకనం చేసిన లెక్చరర్లు, మార్కులు లెక్కించిన సిబ్బంది, ఆన్లైన్లో ప్రాసెస్ తప్పులు చేసిన ఏజెన్సీ.. ఎవరిని తప్పు పట్టాలో తెలియని పరిస్థితిలో పడింది. నిబంధనల ప్రకారం చర్యలు చేపట్టే వీలున్నా.. బోర్డు నిబంధనల ప్రకారం పేపర్ వ్యాల్యుయేషన్‌లో తప్పు చేస్తే రూ.500 నుంచి రూ.10 వేల వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. లేదంటే వారి మూల్యాంకనం విధుల నుంచి కనీసం రెండేళ్లపాటు బహిష్కరించవచ్చు. అలా చేస్తే భవిష్యత్‌లో జవాబు పత్రాల మూల్యాంకనంలో ఇబ్బందులు పడాల్సి వస్తుందన్న ఆలోచనల్లో బోర్డు వర్గాలు ఉన్నాయి. ఇక సాంకేతిక తప్పిదాలకు కారణమైన డాటా ప్రాసెస్ చేసిన సంస్థపై చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందా? అన్నది ప్రశ్న. డాటా ప్రాసెస్‌లో పొరపాట్లు చేసిన సంస్థకు మూడేళ్లపాటు పనులను అప్పగించారు. ఇప్పుడు ముగియకుండా వారి టెండరును రద్దు చేసే అవకాశం లేదు. దీంతో ఇప్పుడు ఆ సంస్థపై చర్యలు తీసుకుంటారా? లేదా? అన్నది ప్రశ్నార్థకం. ఇవీ లోపాలకు ఉదాహరణలు.. - ఇంటర్లో ఫెయిలైన వారికి పెరిగిన మార్కులు 1 నుంచి 48 కాగా, ఉత్తీర్ణులై రీవెరిఫికేషన్‌కు దరఖాస్తు చేసిన వారికి గరిష్టంగా పెరిగిన మార్కులు 60. - ఫలితాల్లో ఒక విద్యార్థి మొదట ఫెయిల్ కాగా.. తరువాత వచ్చిన మార్కులు 91. - కామర్స్‌లో ఒక విద్యార్థికి మొదట వచ్చిన మార్కులు 12.. రీవెరిఫికేషన్ తరువాత లభించిన మార్కులు 62. - ఓ విద్యార్థికి సంస్కృతంలో మొదట వచ్చిన మార్కులు 5.. రీవెరిఫికేషన్లో వచ్చిన మార్కులు 50. - ఇంకో విద్యార్థికి తెలుగులో తొలిసారి వచ్చిన మార్కులు 18...తరువాత వచ్చినవి 41 మార్కులు. - ఆంగ్లంలో ఓ విద్యార్థికి 25 మార్కులొస్తే.. రీవెరిఫికేషన్లో లభించిన మార్కులు 43. - ఫెయిలైన విద్యార్థుల్లో ఒకరికి కెమిస్ట్రీలో మొదట వచ్చిన మార్కులు 15.. తరువాత లభించిన మార్కులు 25. -
ఇంప్రూవ్మెంట్ ఉన్నట్టా.. లేనట్టా?
సాక్షి, హైదరాబాద్: ఇంటర్ ఫలితాల రీవెరిఫికేషన్లో ఉత్తీర్ణులైన ద్వితీయ సంవత్సర విద్యార్థులకు ఇంప్రూవ్మెంట్ కోసం పరీక్షలు రాసే అవకాశం ఇస్తుందా? లేదా? అన్న గందరగోళం నెలకొంది. ఇంటర్ ఫలితాల్లో తప్పుల కారణంగా కొంతమంది విద్యార్థులు ఫెయిల్ కాగా, మరికొంత మందికి తక్కువ మార్కులు వచ్చాయి. తక్కువ మార్కులు వచ్చిన విద్యార్థులు రీవెరిఫికేషన్‌కు దరఖాస్తు చేసుకోగా, ఫెయిలైన 3.82 లక్షల మంది జవాబు పత్రాలను బోర్డు రీవెరిఫికేషన్ చేసింది. దీంతో ద్వితీయ సంవత్సర విద్యార్థులు 552 మంది ఉత్తీర్ణులయ్యారు. మరోవైపు కొంతమంది పాసైనా తక్కువ మార్కులు రావడంతో రీవెరిఫికేషన్‌కు దరఖాస్తు చేసుకున్నారు. ఇంకా వారి ఫలితాలను ప్రకటించాల్సి ఉంది. అయితే వారిలో కొందరు ఇంప్రూవ్మెంట్ రాయాలని భావిస్తున్నారు. వారికి ఇప్పుడు బోర్డు అవకాశం ఇస్తుందా? లేదా? అన్నది తేల్చడం లేదు. బోర్డు పొరపాట్ల కారణంగా తాము ఫెయిల్ అయ్యామని, మరికొంత మందికి తక్కువ మార్కులు వచ్చాయని పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో తమకు ఈ నెల 7 నుంచి జరిగే అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల్లో ఇంప్రూవ్మెంట్ రాసుకునే అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. బోర్డు అధికారులు మాత్రం సెకండియర్ విద్యార్థుల్లో ఇంప్రూవ్మెంట్ రాసేవారు అరుదేనని చెబుతున్నారు. ఒకవేళ ఇంప్రూవ్‌మెంట్‌లో ఆ విద్యార్థికి తక్కువ మార్కులు వచ్చినా, ఫెయిలైనా అవే మార్కులు ఉంటాయి. ప్రస్తుతం ఉన్న మార్కులు కోల్పోతారు కాబట్టి సెకండియర్ విద్యార్థులు ఇంప్రూవ్మెంట్ పరీక్షలకు హాజరుకారని చెబుతున్నారు. 585 మందికి అవకాశం.. ఇంటర్ ప్రథమ సంవత్సరం వార్షిక పరీక్షల్లో ఫెయిల్ అయి, రీవెరిఫికేషన్లో ఉత్తీర్ణులైన 585 మంది విద్యార్థులకు ఇంటర్ బోర్డు ఇంప్రూవ్మెంట్ రాసే అవకాశం కల్పించింది. ప్రథమ సంవత్సర విద్యార్థులు ఇంప్రూవ్మెంట్ రాస్తే ఎందులో ఎక్కువ మార్కులు ఉంటే వాటిని పరిగణనలోకి తీసుకుంటారు కాబట్టి వారికి మాత్రం ఈ నెల 7 నుంచి జరిగే అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల్లో అవకాశం కల్పించాలని అధికారులు నిర్ణయించారు. -
రీవెరిఫికేషన్లో 1137మంది విద్యార్ధులు ఉత్తీర్ణత
-
ఇంటర్మీడియట్లో మరో 1,137 మంది పాస్
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియట్ పరీక్ష పేపర్ల రీవెరిఫికేషన్లో 1,137 మంది విద్యార్థుల భవిత మారింది. తొలుత విడుదల చేసిన ఫలితాల్లో వారంతా ఫెయిల్ కాగా, రీవెరిఫికేషన్లో ఉత్తీర్ణులయ్యారు. ఈ విషయాన్ని ఇంటర్మీడియట్ బోర్డు సోమవారం రాత్రి ప్రకటించింది. ఇంటర్మీడియట్ ఫలితాల్లో తప్పుల నేపథ్యంలో హైకోర్టు ఆదేశాల మేరకు పరీక్షల్లో ఫెయిలైన 3,82,116 మంది విద్యార్థులకు చెందిన 9,02,429 జవాబు పత్రాలను రీవెరిఫికేషన్ చేయడానికి బోర్డు చర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే. వార్షిక పరీక్షల్లో ఫెయిలైన 1,137 మంది విద్యార్థులు రీవెరిఫికేషన్లో ఉత్తీర్ణులైనట్టు బోర్డు తెలిపింది. వీరిలో ప్రథమ సంవత్సర విద్యార్థులు 552 మంది ఉండగా, ద్వితీయ సంవత్సర విద్యార్థులు 585 మంది ఉన్నట్లు వెల్లడించింది. 19,788 మంది విద్యార్థుల జవాబు పత్రాలను మినహా మిగతావారి జవాబు పత్రాలను స్కాన్ చేసి వెబ్సైట్లో (http://bie.telangana.gov.in/)అందుబాటులో ఉంచుతామని ప్రకటించింది. ఈ స్కానింగ్ కాపీలను మంగళవారం ఉదయంలోగా వెబ్సైట్లో పెట్టే అవకాశం ఉంది. మిగిలిన 19,788 మంది విద్యార్థుల జవాబు పత్రాలను స్కానింగ్ పూర్తయ్యాక అందుబాటులోకి తెస్తామని వెల్లడించింది. రీవెరిఫికేషన్లో భాగంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పద్ధతిలోనూ జవాబుపత్రాల పరిశీలన జరిపినట్లు పేర్కొంది. ఫలితాల నేపథ్యంలో 23 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకోగా, మరో ముగ్గురు విద్యార్థులు ఆత్మహత్యాయత్నం చేసినట్లు బోర్డు వెల్లడించింది. ఆత్మహత్య చేసుకున్న 23 మందిలో 20 మంది విద్యార్థులు రీవెరిఫికేషన్‌లోనూ ఫెయిలైనట్టు తెలిపింది. మరో ఇద్దరు విద్యార్థులు అంతకుముందే ఉత్తీర్ణులయ్యారని పేర్కొంది. ఒక విద్యార్థి 3 పరీక్షల తర్వాత ఆత్మహత్య చేసుకుందని, ఆమె ఆ మూడు సబ్జెక్టుల్లోనూ పాస్ అయిందని వివరించింది. జూన్ 12 తర్వాత ఫీజు వెనక్కి... ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఫెయిల్ అయి రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ కోసం ఫీజు చెల్లించిన 21,537 విద్యార్థుల ఫీజులను వచ్చే నెల 12వ తేదీ తర్వాత తిరిగి ఇవ్వనున్నట్లు బోర్డు ప్రకటించింది. ఫెయిలైన విద్యార్థుల అందరి జవాబు పత్రాల రీవెరిఫికేషన్, రీకౌంటింగ్‌ను ఉచితంగానే చేపట్టాలని నిర్ణయించిన నేపథ్యంలో వారి ఫీజులను తిరిగి ఇస్తామని పేర్కొంది. మరోవైపు ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల్లో ఉత్తీర్ణులైనా.. తక్కువ మార్కులు వచ్చాయని రీవెరిఫికేషన్, రీకౌంటింగ్‌కు దరఖాస్తు చేసుకున్న వారి ఫలితాలను మూడు రోజుల్లో తమ వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతామని బోర్డు వెల్లడించింది. కాగా, రీవెరిఫికేషన్లో మార్కులు పెరిగి పాస్ అయిన విద్యార్థులే కాకుండా మొదట్లో చాలా తక్కువ మార్కులు వచ్చి రీవెరిఫికేషన్లో మార్కులు పెరిగినా పాస్ కాని విద్యార్థులు వేలల్లో ఉంటారని తల్లిదండ్రులు అంటున్నారు. అలా ఎంతమందికి మార్కులు పెరిగాయో, వారి వివరాలను కూడా బోర్డు వెల్లడించాలని డిమాండ్ చేస్తున్నారు. తద్వారా ఎంతమంది విద్యార్థుల ఫలితాల్లో తప్పులు దొర్లాయో తెలుస్తుందని పేర్కొంటున్నారు. మరోవైపు తాజా ఫలితాల వెల్లడిలోనూ కొంచెం గందరగోళం చోటుచేసుకుంది. ఫలితాల్లో కొంతమంది విద్యార్థుల హాల్‌టికెట్ నంబర్లు రెండుమూడు సార్లు పునరావృతమయ్యాయి. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
టీఆర్ఎస్ ప్రభుత్వానికి చరమగీతం పాడాలి: లక్ష్మణ్
నల్లగొండ టూటౌన్: కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమాలను అణచివేస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వానికి చరమగీతం పాడాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ అన్నారు. ఆదివారం నల్లగొండలోని బీజేపీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆత్మహత్య చేసుకున్న ఇంటర్ విద్యార్థుల కుటుంబాలకు భరోసా కల్పించి, వారి సమస్యలు పరిష్కరించాలని తాను శాంతియుతంగా ఆమరణ నిరాహార దీక్ష చేపడితే పోలీసులతో భగ్నం చేయించడం ఏంటని ప్రశ్నించారు. ప్రజా సమస్యలపై ఉద్యమాలు చేపడితే సీఎం కేసీఆర్ భయపడుతున్నారని విమర్శించారు. విద్యార్థుల సమస్యలపై ఆందోళన చేస్తుంటే ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరించిందని, ఇలాంటి కిరాతక ప్రభుత్వాన్ని ఎప్పుడూ చూడలేదని దుయ్యబట్టారు. విద్యార్థుల ఆత్మహత్యలపై కేసీఆర్ కనీ సం స్పందించడం లేదని, కుటుంబంతో కలిసి విహారయాత్రలు చేస్తున్నారని విమర్శించార -
గ్లోబరీనా సంస్థను నిషేధించాలి: నారాయణ
సాక్షి, న్యూఢిల్లీ: ఇంటర్ పరీక్షల నిర్వహణలో విఫలమైన గ్లోబరీనా సంస్థను తెలంగాణ ప్రభుత్వం నిషేధించాలని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు నారాయణ డిమాండ్ చేశారు. పరీక్షల్లో జరిగిన అవకతవకల కారణంగా విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడంపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు బాధ్యత వహించాలన్నారు. శుక్రవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. ఆత్మహత్యలు చేసుకున్న విద్యార్థుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని, ఈ మొత్తం వ్యవహారంపై ఉన్నత స్థాయి కమిటీతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఇంటర్ బోర్డు మొత్తం కార్పొరేట్ల మయమైందని, ప్రభుత్వ అసమర్థత వల్లే విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆరోపించారు. -
గ్లోబరీనా సంస్థను నిషేధించాలి: నారాయణ
సాక్షి, న్యూఢిల్లీ: ఇంటర్ పరీక్షల నిర్వహణలో విఫలమైన గ్లోబరీనా సంస్థను తెలంగాణ ప్రభుత్వం నిషేధించాలని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు నారాయణ డిమాండ్ చేశారు. పరీక్షల్లో జరిగిన అవకతవకల కారణంగా విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడంపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు బాధ్యత వహించాలన్నారు. శుక్రవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. ఆత్మహత్యలు చేసుకున్న విద్యార్థుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని, ఈ మొత్తం వ్యవహారంపై ఉన్నత స్థాయి కమిటీతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఇంటర్ బోర్డు మొత్తం కార్పొరేట్ల మయమైందని, ప్రభుత్వ అసమర్థత వల్లే విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆరోపించారు. -
న్యాయం జరిగే వరకు పోరాటం
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ నిర్లక్ష్యం, ఇంటర్ బోర్డు వైఫల్యంతో నష్టపోయిన విద్యార్థులకు, ఆత్మహత్యలకు పాల్పడిన 27 మంది విద్యార్థుల కుటుంబాలకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగిస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ పేర్కొన్నారు. రాష్ట్రంలో 27 మంది ఇంటర్ విద్యార్థులు చనిపోయినా కనీసం స్పందించని మంత్రి జగదీశ్‌రెడ్డివే చిల్లర రాజకీయాలని తీవ్రంగా విమర్శించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శుక్రవారం లక్ష్మణ్ మీడియాతో మాట్లాడారు. విద్యార్థులకు న్యాయం చేయడంతోపాటు తప్పులకు కారణమైన గ్లోబరీనా సంస్థను తొలగించడం, ఇంటర్‌బోర్డు కార్యదర్శి అశోక్‌ను, మంత్రి జగదీశ్‌రెడ్డిని తప్పించే వరకు తమ పోరాటం కొనసాగుతుందన్నారు. గ్లోబరీనా సంస్థను ప్రభుత్వం వెనకేసుకొస్తుందని మండిపడ్డారు. రాష్ట్రంలో ఇప్పటికీ 1000కి పైగా గ్రామాలకు బస్సు సౌకర్యం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఇంత తీవ్ర సమస్యలు ఉంటే, రాజు మాత్రం తీర్థయాత్రలకు బయలుదేరి వెళ్లారని సీఎం కేసీఆర్‌ను విమర్శించారు. ఆత్మహత్య చేసుకున్న లాస్య ఇంటికి మంత్రి తలసాని ఇల్లు కూతవేటు దూరమే అయినా ఆయన కనీసం పరామర్శకు కూడా వెళ్లలేకపోవడం శోచనీయమన్నారు. మానవ వనరుల అభివృద్ధి శాఖ నివేదిక ప్రకారం వెనుకబడిన రాష్ట్రాల కన్నా కూడా తెలంగాణ చాలా వెనుకబడి ఉందన్నారు. టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం బీజేపీనే రాష్ట్రంలో టీఆర్ఎస్కు అసలైన ప్రత్యామ్నాయం బీజేపీనే అని లక్ష్మణ్ పేర్కొన్నారు. మే 23 తర్వాత రాష్ట్రంలో రెండు పార్టీల విధానం వస్తుందన్నారు. కేంద్రంలో ఎవరి మద్దతు లేకుండా ఎన్డీయే అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఉగ్రవాదం, నక్సలిజం, నిత్యావసర వస్తువుల ధరలు తగ్గాయని పేర్కొన్నారు. రక్షణ రంగానికి పెద్ద పీట వేశారని, మసూద్ అజహర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ముద్ర వేయించిగలిగిందన్నారు. కేంద్రంలో హంగ్ వస్తుందని, అందులోకి వెళ్లాలని కేసీఆర్ పగటి కలలుకంటున్నారని విమర్శించారు. చంద్రబాబుకు తాను ఓడిపోతానని తెలిసి ఏవేవో మాట్లాడుతున్నారని ఆయనో చచ్చిన పాముతో సమానమన్నారు. విద్యార్థుల మరణాలపై కేంద్ర హోంమంత్రి, రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తామన్నారు. దీనిపై జ్యుడీషియల్ విచారణ లేదా సీబీఐ విచారణ కోరుతామన్నారు. వర్సిటీల్లో సిబ్బంది లేకుండా, 60 శాతం ఖాళీలతో న్యాక్ గుర్తింపు ఎలా వస్తుందని, నిధులు ఎలా వస్తాయని ప్రశ్నించారు. -
నిమ్స్ నుంచి లక్ష్మణ్ డిశ్చార్జ్
సాక్షి, హైదరాబాద్: ఇంటర్ విద్యార్థుల భవిష్యత్ కోసమే నిరాహార దీక్ష చేశానని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. శనివారం నిమ్స్ నుంచి డిశ్చార్జ్ అయిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ‘తెలంగాణ రాష్ట్ర సమితి అధికార మత్తులో ఉంది. నియంతృత్వ ధోరణితో వ్యవహరిస్తోంది. అన్యాయాలపై నిలదీసిన నేతలను అరెస్టు చేస్తోంది. శాంతియుత పద్ధతిలో నిరాహార దీక్ష చేస్తున్న వారిని నిర్బంధించడం ఏ మేరకు సమంజసమో ప్రభుత్వం చెప్పాలి’ అని నిలదీశారు. ఇంటర్మీడియట్ విద్యార్థుల మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని జాతీయస్థాయిలో ఉద్యమించనున్నట్లు ప్రకటించారు. విద్యార్థులకు జరిగిన అన్యాయంపై త్వరలో ఆందోళనలు నిర్వహిస్తామని, బాధిత కుటుంబాలను పరామర్శించి వారికి అండగా నిలుస్తామని తెలిపారు. ఉద్యమాల ద్వారా అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం.. అదే ఉద్యమాలను అణచివేస్తుందని ఆరోపించారు. పిల్లల చావుకు కారణమైన గ్లోబరీనా సంస్థపై చర్యలు తీసుకోకుండా, వారి చర్యలను వెనుకేసుకొస్తుండటం సిగ్గుచేటని లక్ష్మణ్ విమర్శించారు. ఆయన వెంట మల్కాజ్గిరి బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి రాంచందర్‌రావు తదితర నేతలు ఉన్నారు. -
ఇంటర్ ఫలితాల అవకతవకలపై బీజేపీ బంద్‌కు పిలుపు
-
సర్కారు బాధ్యత వహిస్తుందనుకుంటున్నాం
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియెట్ విద్యార్థుల ఆత్మహత్యలకు ప్రభుత్వం బాధ్యత వహిస్తుందని తాము భావిస్తున్నట్లు హైకోర్టు తెలిపింది. ఏ తల్లిదండ్రులకైనా బిడ్డ శవాన్ని మోయడం భరించలేని వేదన కలిగించేదేనని, ఇది వారిని జీవితాంతం వెంటాడుతూనే ఉంటుందంటూ ఆవేదన వ్యక్తం చేసింది. విద్యార్థుల ఆత్మహత్యలను తాము ఏమాత్రం విస్మరించడం లేదని, అయితే ముందు విద్యార్థుల మార్కుల సమస్యను పరిష్కరించి ఆ తరువాత బాధిత కుటుంబాలకు పరిహారం చెల్లించే వ్యవహారాన్ని చూస్తామంది. పరీక్ష ఫెయిల్ అయిన 3 లక్షల మంది విద్యార్థుల పత్రాలను రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్ చేసి ఆ వివరాలను తమ ముందుంచాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను మే 8కి వాయిదా వేసింది. హైకోర్టుకు వేసవి సెలవులు అయినప్పటికీ ఈ కేసును ప్రత్యేకంగా విచారిస్తామంది. ప్రభుత్వం సమర్పించే నివేదికను పరిశీలించి ఎందరు విద్యార్థులు ఉత్తీర్ణులు కాలేదన్న అంశం ఆధారంగా పునర్ మూల్యాంకనంపై మే 15న నిర్ణయం తీసుకుంటామంది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ ఎ. రాజశేఖర్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇంటర్ పరీక్షా పత్రాల మూల్యాంకనం సక్రమంగా చేయకపోవడం వల్ల విద్యార్థులకు తీరని నష్టం జరిగిందని, 16 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారని, ఈ నేపథ్యంలో రీ వాల్యుయేషన్‌కు ఆదేశాలు ఇవ్వడంతోపాటు మృతుల కుటుంబాలకు రూ. 50 లక్షల చొప్పున పరిహారం చెల్లించేలా ఆదేశించాలంటూ బాలల హక్కుల సంఘం అధ్యక్షుడు అచ్యుతరావు హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం మరోసారి విచారణ జరిపింది. అందరివీ పునర్ మూల్యాంకనం చేయాలనడంలో అర్థం లేదు... ప్రభుత్వం కేవలం రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్‌కు మాత్రమే నిర్ణయించిందని పిటిషనర్ తరఫు న్యాయవాది సి. దామోదర్‌రెడ్డి హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. మూల్యాంకనం బాధ్యతలను కాంట్రాక్టర్ లెక్చరర్లకు అప్పగించారని, దీనివల్ల తప్పులు జరిగాయన్నారు. ఈ సమయంలో ధర్మాసనం స్పందిస్తూ రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్‌తో కొన్ని సమస్యలు పరిష్కారమయ్యే అవకాశాలున్నాయని పేర్కొంది. పరీక్ష ఫెయిలైన వారిలో లక్షన్నర మంది పాసయితే అందరి పత్రాలనూ పునర్ మూల్యాంకనం చేయాలని కోరడంలో ఏమాత్రం అర్థం లేదని వ్యాఖ్యానించింది. ప్రభుత్వం చేపడుతున్న రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్‌తో ఎందరు సంతృప్తి చెందుతారో చూద్దామని, ఎవరైతే సంతృప్తి చెందలేదో వారి విషయాన్ని తరువాత పరిశీలిస్తామంది. దామోదర్‌రెడ్డి జోక్యం చేసుకుంటూ జవాబులు రాసినా మార్కులు వేయలేదన్నారు. 8న అయినంత వరకు నివేదిక ఇస్తాం... విద్యార్థుల రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్ ఎప్పుడు చేస్తారని ధర్మాసనం ప్రశ్నించగా మే 8 లేదా 9లోగా పూర్తి చేస్తామని ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) జె. రామచంద్రరావు తెలిపారు. 9న వాటి తాలూకు ఫలితాలను వెల్లడిస్తామన్నారు. ఆ తేదీల్లో హైకోర్టుకు వేసవి సెలవులు ఉంటాయని, అందువల్ల 7వ తేదీలోగా ఈ ప్రక్రియ పూర్తి చేసి 8న ఫలితాలు వెల్లడించేలా చూడాలని ధర్మాసనం తెలిపింది. అది చాలా కష్టసాధ్యమని, అయినంత వరకు కోర్టుకు నివేదిక సమర్పిస్తామని ఏఏజీ చెప్పారు. ఇందుకు ధర్మాసనం అంగీకరిస్తూ విచారణను మే 8కి వాయిదా వేసింది. నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది... ఇంటర్ ఫలితాల్లో స్టాఫ్‌వేర్ లోపం వల్లే సమస్య వచ్చినట్లు ప్రభుత్వం అంగీకరించి రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్‌కు నిర్ణయించినందున ఈ వ్యవహారంలో ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుందని, అందువల్ల ఈ విషయంలో ముందే ఓ నిర్ణయానికి రావడం సరికాదని ధర్మాసనం సూచించింది. విద్యార్థులు, తల్లిదండ్రులు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని తెలిపింది. ఈ సమయంలో దామోదర్‌రెడ్డి మరోసారి జోక్యం చేసుకుంటూ ఆత్మహత్యలు చేసుకున్న విద్యార్థుల పత్రాలను పునర్ మూల్యాంకనం చేయించాలని, వారి మృతికి కారణమైన వారిపై క్రిమినల్ చర్యలకు ఆదేశించాలని కోరారు. అయితే ప్రతి దానికీ పునర్ మూల్యాంకనం పరిష్కారం కాదని ధర్మాసనం తెలిపింది. -
జీవించు జయించు..
జీవితంలో చదువు ఒక భాగమే.. చదువే జీవితం కాదు. మార్కులే ప్రతిభకు గీటురాయి కాదు. పరీక్షల్లో ఫెయిలయ్యామని కుంగిపోయి.. ఇక జీవితమే వ్యర్థం అనుకుని కొందరు విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఇటువంటి అనాలోచిత నిర్ణయాలు తీసుకుంటే .. తమ ప్రాణం కంటే మిన్నగా భావించి మిమ్మల్ని పెంచి పెద్దచేసిన అమ్మానాన్నలకు కన్నీళ్లు మిగిల్చి వెళ్లడమేనా మీ బహుమానం..? చదువుల బాటలో ఎదురయ్యే ఒత్తిళ్లు, ఇబ్బందులను ఆత్మస్థైర్యంతో ఎదుర్కోవాలి. ఒకసారి కాకపోతే.. మరోసారైనా నెగ్గుతామన్న మనోధైర్యంతో ముందడుగు వేయాలి. కొండంత సమస్యనైనా చిరు ఆలోచనతో పరిష్కరించుకోవచ్చు. పరాజయాలనుపట్టించుకోకండి.. అవి సర్వసాధారణంఅవే జీవితానికి మెరుగులు దిద్దేవి. ఓటములు లేని జీవితం ఉండదు– స్వామి వివేకానంద సాక్షి, రంగారెడ్డి జిల్లా: ఎవరి జీవితమూ పూల పాన్పు కాదు. జీవితం అన్నాక ఒడిదుడుకులు, ఆటుపోట్లు, ఎత్తుపల్లాలు, జయాపజయాలు, కష్ట సుఖాలు సహజం. ప్రతి మనిషిని నిత్య జీవితంలో ఏదో ఒక సందర్భంలో ఇవన్నీ పలకరిస్తూనే ఉంటాయి. ఏ కష్టాన్నీ ఎదుర్కోకుండా ఉన్నత స్థాయికి ఎదిగిన వారు ప్రపంచంలోనే లేరన్న విషయాన్ని గ్రహించాలి. చిన్నచిన్న కారణాలకు ప్రాణాలను తీసుకుంటున్న వారు ఒక్క క్షణం ఆలోచించాలి. విఫలమైన వాళ్లంతా ఈ ప్రపంచానికి వీడ్కోలు చెబితే.. ఈ లోకంలో ఎవరూ మిగలరు. నిలబడి గెలిచే అవకాశాలు ఏదో ఒక దశలో ఉంటాయన్న సానుకూల దృక్పథాన్ని అలవరచుకోవాలి. కష్టాలకు ఎదురొడ్డి.. కన్నీళ్లను దిగమింగి జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించిన వారిని ఆదర్శంగా తీసుకోవాలి. వారి జీవితాన్ని చదివితే మనోధైర్యం లభిస్తుంది. కష్టాలను, ప్రతికూల పరిస్థితులను ఎలా ఎదుర్కోవచ్చో తెలుస్తుంది. తొందరపాటు నిర్ణయం తీసుకునే ముందు.. అమ్మానాన్నలు మీపై పెట్టుకున్న కొండంత నమ్మకం గురించి ఆలోచించండి. మీరు ప్రాణాలు తీసుకుంటే.. మీతోపాటే కన్నవారి ప్రాణాలూ తీసుకెళ్లినట్లేనని గుర్తుంచుకోండి. అందరి కృషి అవసరం.. ప్రస్తుతం విద్యారంగంలో వస్తున్న మార్పుల నేపథ్యంలో సమాజంతో సంబంధం లేకుండా విద్యార్థులు ఎదుగుతున్నారు.నాలుగు గోడల మధ్య తిరుగుతూ నిస్పృహతో నిండిపోతున్నారు. ఉదయం లేచింది మొదలు.. రాత్రి నిద్రకు ఉపక్రమించే వరకు పుస్తకాలే చేతబడుతున్నారు. కనీసం అరగంట కూడా విశ్రాంతి దొరకట్లేదు. మార్కులే జీవితమని కొన్ని విద్యాసంస్థలు, కొంత మంది తల్లిదండ్రులు భావిస్తున్నారు. ఇది బాధాకరం. ఈ అంశంపై విస్తృతంగా చర్చ సాగాలి. మేధావులు ఆలోచించాలి. విద్యాసంస్థల్లో సదస్సులు నిర్వహించి విద్యార్థుల్లో మానసిక స్థైర్యాన్ని నింపడానికి అందరూ కృషిచేయాలి. అవసరమైతే వారంలో ఒకసారి మానసిక నిపుణులతో ప్రత్యేక తరగతులు నిర్వహించాలి. చదువుతోపాటు.. జీవితమూ ముఖ్యమేనన్న భావన వారిలో కలిగించాలి. అప్పుడే తొందరపాటు చర్యకు పుల్‌స్టాప్ పెట్టవచ్చు. తల్లిదం్ర డుల గర్భశోకాన్ని దూరం చేయవచ్చు. జీవితం అవకాశాల గని..ఓటమి విజయంతో సమానం పిల్లల్లో అనవసర, అనారోగ్యకర పోటీతత్వాన్ని పెంపొందిస్తున్నాం. ఒక పిల్లవాడికి నచ్చని అంశం మీద.. మరొక పిల్లోడితో పోల్చడం తరచు చూస్తున్నాం. దీన్ని సాధారణంగా సూడో కాంపిటీషన్‌గా పిలుస్తాం. మార్కులు, ర్యాంకులు రాకుంటే జీవితమే వ్యర్థమనే రీతిలో ఇటు తల్లిదండ్రులు, విద్యాసంస్థలు విద్యార్థులను మలుచుతున్నాయి. దీనివల్ల ముఖ్యంగా టీనేజ్ వయసులోని పిల్లలు విపరీతమైన మానసిక ఒత్తిడికి గురవుతుంటారు. ఒత్తిడి సర్వసాధారణం. ఇది దరిచేరకుండా చేయడం కష్టం. నియంత్రించే, అధిగమించే మార్గాలు లేకున్నా.. ఒత్తిడిని తట్టుకునే శక్తిమంతుల్లా పిల్లలను తీర్చిదిద్దాలి. ఇటీవల బాగా పెరిగిపోతున్న విద్యార్థుల బలవర్మరణాలు, ఒత్తిడికి చిత్తువుతున్న ఘటనలు నేర్పుతున్న పాఠమిది. జీవితాన్ని ఒక గేమ్‌లా చూస్తే గెలుపు మార్గాలు పుష్కలం. దాన్నే జీవన్మరణ సమస్యగా భావిస్తే విజయ తీరాలకు చేరే అవకాశాలు క్షీణిస్తాయి. జీవితాన్ని ఎన్నో అవకాశాల గనిగా అందరూ గుర్తించాలి. పరీక్ష అనేది సముద్రంలోని నీటిబొట్టు లాంటిదే తప్ప దశ దిశను నిర్ణయించేది ఏమాత్రం కాదు. కేవలం నా తీరు వల్లే పరీక్షల్లో తప్పాను.. అనే ప్రతికూల దృక్పథాన్ని పిల్లల్లో దూరం చేయాలి. పరీక్ష ఫలితం.. విద్యార్థి చదివిన తీరు, ప్రతిభ, చదివిన వాతావరణం, తల్లిదండ్రుల ప్రభావం, పేపర్లు దిద్దేవారిపైనా ఆధారపడి ఉంటుంది. ఇలాంటి కారణాలను శోధించడం మానేసి ఇతర అవకాశాల కోసం అన్వేషించాలి. ఫెయిల్ అనేది.. ఎప్పుడు మన పొరపాటు కాదని భావించాలి. తొలి అవకాశంలోనే ఎవరూ నెగ్గలేరు. ఓటమితో ఒడిదుడుకులనే తట్టుకునే శక్తి లభిస్తుంది. ఇది విజయంతో సమానమని నేర్పించడం ముఖ్యం. ఓటమి ఎక్కువ అనుభవాలను నేర్పుతుంది. ఇలా సానుకూల దృక్పథాన్ని, పరిణతిని పిల్లల్లో పెంపొందిస్తే ఏదో ఒక దశలో విజయం వరించడం తథ్యం. ప్రతి పిల్లవాడికి సున్నితత్వం ఉంటుంది. ఈ విషయాన్ని సూడో కాంపిటీషన్ సృష్టిస్తున్న విద్యాసంస్థలు, వ్యక్తులు గుర్తుపెట్టుకోవాలి. హేళన చేస్తే, అవమానం చేస్తే.. పిల్లల్లోని ప్రతిభ బయటకు వస్తుందన్న పాతకాలపు ఆలోచన విధానాలను అందరూ మానుకోవాలి. – డాక్టర్ కల్యాణ్ చక్రవర్తి,ప్రముఖ మానసిక వైద్య నిపుణులు తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ♦ ప్రస్తుత సమాజంలో విద్యార్థుల్లో సున్నితత్వం పెరిగింది. వారిని మానసికంగా దృఢంగా మార్చడానికి తల్లిదండ్రులు చొరవ తీసుకోవాలి. ♦ పిల్లలకు సమస్యలు తెలియకుండా పెంచడం సరికాదు. పిల్లలతో కలిసి సమస్యలపై చర్చించాలి. వాటిని ఎలా పరిష్కరించుకున్నామో తెలియజేయాలి. తద్వారా సమస్యలు పరిష్కరించుకోగలమనే నమ్మకం వారిలో కలుగుతుంది. ♦ నోటి వద్దకు అన్నం వచ్చేలా.. ఎలాంటి సమస్యదరిచేరకుండా అన్ని తల్లిదండ్రులే దగ్గరుండిచూసుకోవడం సరికాదు. స్వతహాగా తమపనులను తామే చేసుకునేలా పెంచాలి. చిన్నప్పటి నుంచే కష్టాలనూ ఎదుర్కొనేలా మానసికంగాసిద్ధం చేయాలి. ♦ విద్యార్థులను తోటి విద్యార్థులతో పోల్చి మాట్లాడడం సరికాదు. పలానా వ్యక్తికి ఎక్కువ.. నీకు తక్కువ మార్కులు వచ్చాయని ఏనాడూ మందలించకూడదు. మార్కులకు.. ప్రతిభకు లింకు పెట్టకూడదు. ♦ అందరికీ చదువు అబ్బదు. విద్యార్థులుపెరిగిన నేపథ్యం, పరిసరాల ప్రభావం,ఆసక్తులు తదితర కారణాల వల్లచదువుపై ధ్యాస పెట్టకపోవచ్చు. ♦ కాకపోతే ఏదో అంశంలో ప్రతి ఒక్కరికీ టాలెంట్ ఉంటుంది. దీన్ని తల్లిదండ్రులు గుర్తించి ప్రోత్సహిస్తే ఉన్నత శిఖరాలకు చేరవచ్చు. -
ఆ అధికారులను కఠినంగా శిక్షించాలి..
సాక్షి, హైదరాబాద్: ఇంటర్ ఫలితాల వెల్లడిలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులను కఠినంగా శిక్షించాలని, ఈ అంశంపై ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటనే స్పందించాలని సీపీఐ కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి డిమాండ్ చేశారు. మంచిర్యాల జిల్లాకు చెందిన నవ్యకు సున్నా మార్కులు ప్రకటించి, మరుసటి రోజే 99 మార్కులు వచ్చాయని పేర్కొనడం ఇంటర్ బోర్డు అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమని ఆరోపించారు. బోర్డు తప్పులు ఇంత స్పష్టంగా కనిపిస్తుంటే అవి అపోహలంటూ ప్రభుత్వం పేర్కొనడాన్ని ఆయన తప్పుపట్టారు. విద్యార్థుల జవాబు పత్రాల రీవాల్యువేషన్‌కు తల్లితండ్రుల నుంచి ఫీజులు వసూలు చేయడం బోర్డు దివాళాకోరుతనానికి నిదర్శమని సోమవారం ఒక ప్రకటనలో ధ్వజమెత్తారు. బోర్డు తప్పులకు నైతిక బాధ్యత వహిస్తూ ప్రభుత్వమే రీవాల్యువేషన్ చేపట్టాలని డిమాండ్ చేశారు. సీమాంతర ఉగ్రవాదానికి నిదర్శనం.. శ్రీలంకలో జరిగిన మారణకాండ అత్యంత హృదయ విదారకరమైందని చాడ వెంకట్‌రెడ్డి పేర్కొన్నారు. సీమాంతర ఉగ్రవాదానికి ఈ దాడులు నిదర్శనమని తెలిపారు. ఈ ఉగ్రవాదుల వెనక ఉన్న ఏ దేశాన్ని అయినా ఇతర దేశాలు నిలదీయాలని సీపీఐ అభిప్రాయపడుతోందని వెల్లడించారు. -
గురుకుల విద్యార్థులకు ఎంసెట్‌లో ప్రత్యేక శిక్షణ
విశాఖపట్నం, గూడెంకొత్తవీధి (పాడేరు) : ఇంటర్ చదువుతున్న విద్యార్థులకు ఇంజినీరింగ్, మెడికల్ సీటు పొందేందుకు మూడు జిల్లాల్లోని గురుకుల చెందిన విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నట్లు జీకే వీధి గురుకుల బాలికల కళాశాల ప్రిన్సిపాల్ పద్మకుమారి అన్నారు. ఇంటర్ మొదటి, ద్వి తీయ సంవత్సరాలకు సంబంధించిన విద్యార్థు లకు ఈ శిక్షణ ఇస్తున్నట్లు ఆమె చెప్పారు. ప్రధానంగా మెడికల్, ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ఎంసెట్ పరీక్షకు శిక్షణ ఇస్తున్నామన్నారు. విశాఖ జిల్లా బాలికలకు జీకే వీధిలో, బాలురకు అరకులోయలో ఈ శిక్షణ అందిస్తున్నట్లు ఆమె తెలిపారు. విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల నుంచి కురుపాం, సీతంపేట, పి.కొత్తవలస, భద్రగిరి, అరకులోయ, జీకే వీధి గురుకుల కళాశాలలకు చెందిన బాలికలకు జీకే వీధి, జి.మాడుగుల, కొయ్యూరు, అరకులోయ, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు చెందిన బాలురకు శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. మార్చి 14 నుంచి ఈ నెలాఖరు వరకు ప్రతి కళాశాల నుంచి 100 మంది విద్యార్థులు శిక్షణ తీసుకుంటున్నారని, వీరందరికి వసతి, భోజన సదుపాయాలు కల్పించినట్లు తెలిపారు. ఎంసెట్‌లో మెడికల్, ఇంజినీరింగ్ సీట్లు పొం దేందుకు విద్యాశాఖ కల్పించిన ఈ అవకాశాన్ని విద్యార్ధులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ శిక్షణ ఎంతో అవసరం మెడికల్, ఇంజినీరింగ్ సీట్లు పొందాలంటే గ్రామీణ ప్రాంతాల్లో చదివే పేద విద్యార్థు లకు ఎంతో డబ్బులు ఖర్చుపెట్టి కోచింగ్ తీసుకుంటుంటారు. అయితే విద్యాశాఖ ద్వారా గురుకుల విద్యార్ధులకు శిక్షణ ఇవ్వడం ఎంతో అవసరం. ఇది ఎంతో ఉపయోగపడుతుంది.– అశ్వని, కురుపాం, విజయనగరం జిల్లా -
నేటి నుంచి ఇంటర్ పరీక్షలు
-
ఈసారైనా.. 50 శాతం దాటుతుందా?
విద్యార్థి భవిష్యత్తును మలుపు తిప్పే ఇంటర్ పరీక్షలు 27వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు పూర్తయ్యాయి. జిల్లాలో 29 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇంటర్ మొదటి, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు మొత్తం 15,273 మంది పరీక్షలు రాయనున్నారు. అయితే కొత్తగా జిల్లా ఏర్పాటయ్యి మూడేళ్లు గడుస్తున్నా ఇంత వరకు ఇంటర్లో జిల్లా ఫలితాలు 50 శాతం దాటలేదు. మెరుగైన ఫలితాలు సాధించేందుకు ఈ విద్యాసంవత్సరం ఆరంభం నుంచే అన్ని ప్రభుత్వ కళాశాలల్లో ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహించారు. ప్రతీవారం స్లిప్ టెస్టులు నిర్వహించారు. దీంతో కనీసం ఈ సారైనా ఫలితాలు మెరుగవుతాయా? అనే ఆశలు అందరి మదిలో మెదులుతున్నాయి. పాపన్నపేట(మెదక్): జిల్లాలో 16 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, 7 ఆదర్శ, 2 సాంఘిక సంక్షేమ పాఠశాలలతోపాటు మరో 24 ప్రైవేట్ కళాశాలలు ఉన్నాయి. ఇందులో మొత్తం 15,273 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ఇందుకోసం 29 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరుగనున్నాయి. విద్యార్థులంతా అరగంట ముందే పరీక్ష కేంద్రానికి వెళ్లాల్సి ఉంది. ఒక నిమిషం ఆలస్యమైన విద్యార్థులను పరీక్షలకు అనుమతించారు. ఈ ఏడాది జూన్, జూలైలో జరిగిన లెక్చర్ల బదిలీలు ఆగస్టులో విధుల్లో చేరిన గెస్ట్ లెక్చరర్లు, ఎన్నికల విధులు కొంత వరకు విద్యాసంవత్సరానికి ఆంతరాయం కలిగించాయనే ఆరోపణలున్నాయి. జిల్లా వ్యాప్తంగా గల 29 పరీక్ష కేంద్రాల్లో 26 జంబ్లింగ్ సెంటర్లు, 3 సెల్ఫ్ సెంటర్లను ఏర్పాటు చేశారు. ఇంటర్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు చర్యలు తీసుకున్నారు. జిల్లాలోని అన్ని పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ప్లయింగ్ స్క్వాడ్, డెక్ స్క్వాడ్, సిట్టింగ్ స్క్వాడ్, బోర్డు పరిశీలకులు నిరంతరం పరీక్షలను పర్యవేక్షిస్తుంటారు. ప్రతి ఉదయం 8గంటలకు ఏ సెట్ ప్రశ్నాపత్రం ఇవ్వాలో నిర్ణయిస్తారు. మూడేళ్లుగా.. జిల్లా ఏర్పడిన తరువాత ఇంటర్ ఫలితాలు ఎప్పుడు కూడా 50శాతాన్ని దాటలేదు. 2016–17 ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో మెదక్ జిల్లా 16వ స్థానంలో నిలిచింది. 2017–18లో 49శాతం ఫలితాలతో 18వ స్థానానికి దిగజారింది. ఆదర్శ, గురుకుల కళాశాలల ఫలితాలు మెరుగ్గా ఉన్నప్పటికీ ప్రభుత్వ కళాశాలల ఫలితాలు దిగజారాయి. ఇంటర్ ప్రథమ సంవత్సర ఫలితాలు మెదక్ బాలుర జూనియర్ కళాశాలలో 71 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా కేవలం 7మంది మాత్రమే ఉత్తీర్ణత సాధించడం గమనార్హం. మెరుగైన ఫలితాల కోసం ప్రత్యేక ప్రణాళిక ఈ విద్యా సంవత్సరం మెరుగైన పలితాలు సాధించేందుకు ప్రిన్సిపల్స్ ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహించారు. విద్యార్థులను గ్రూప్‌లుగా విభజించి వెనకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించారు. ప్రతిరోజు స్లిప్‌టెస్ట్‌లు నిర్వహించి ఉత్తీర్ణత శాతం పెంచడానికి చర్యలు తీసుకున్నారు. జూన్, జూలైలో జరిగిన లెక్చరర్ల బదిలీలు, ఆగస్టు చివరి వారంలో ఆలస్యంగా గెస్ట్ లెక్చరర్లు విధుల్లో చేరడం, ఈ ఏడాది జరిగిన ఎన్నికల విధులు ఇంటర్ విద్యకు కొంత ప్రతికూల అంశాలుగా భావించవచ్చు. ఈ ఏడాది మెరుగైన ఫలితాలు సాధిస్తాం.. ఈ ఏడాది ఇంటర్లో ఉత్తమ ఫలితాలు సాధించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నాం. ప్రతి కళాశాలలో ప్రత్యేక తరగతులు, స్లిప్‌టెస్ట్‌లు నిర్వహించి 100శాతం ఉత్తీర్ణత కోసం కృషి చేశాం. గత సంవత్సరం కంటే మెరుగైన ఫలితాలు సాధిస్తాం. –సూర్యప్రకాశ్, నోడల్ అధికారి -
లక్ష్యం 30/30
తూర్పుగోదావరి , రాయవరం (మండపేట): విద్యార్థి దశలో అత్యంత కీలకమైనది ఇంటర్మీడియట్. కోరుకున్న కళాశాలలో, కోర్సులో సీటు దక్కించుకోవాలంటే ఇక్కడ సాధించే మార్కులు అత్యంత కీలకం. ముఖ్యంగా సైన్స్ విద్యార్థులకు ప్రాక్టికల్స్‌కు వేసే మార్కులకు ఎంతో ప్రాధాన్యం ఉంది. ఏ చిన్న తప్పిదం చేసినా మార్కులు కోల్పోయే ప్రమాదముంది. ఆసక్తి చూపితే 30కి 30 మార్కులు సాధించవచ్చని సంబంధిత నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే ప్రయోగ పరీక్షల షెడ్యూల్ ఖరారైంది. ఇక మిగిలింది వారం రోజులు మాత్రమే. ఈ క్రమంలో ప్రాక్టికల్స్‌లో విద్యార్థులకు ఎదురయ్యే ఇబ్బందులు.. వాటిని ఎలా అధిగమించాలి.. ఆయా సబ్జెక్టుల్లో నిపుణులైన అధ్యాపకులు ఇచ్చే సూచనలు.. మెళకువలు విద్యార్థుల కోసం.. ప్రయోగ పరీక్షల షెడ్యూల్.. ‘ప్రయోగ’ పరీక్షలు ప్రతి రోజు ఉదయం 9–12 గంటల వరకు, మధ్యాహ్నం 2–5 గంటల వరకు జరగనున్నాయి. ప్రయోగ పరీక్షల్లో ఎంపీసీ విద్యార్థులకు 60 మార్కులు, బైపీసీ విద్యార్థులకు 120 మార్కులు కేటాయిస్తారు. మంచి మార్కులు సాధించవచ్చు.. భౌతిక శాస్త్రానికి మూడు గంటల సమయానికి 30 మార్కులు కేటాయిస్తారు. మొత్తంగా 20 ప్రయోగాల్లో ఆరు విభాగాల నుంచి 38 ప్రశ్నలుంటాయి. ప్రతి బ్యాచ్‌కు 12 ప్రశ్నల వంతున ఇస్తారు. ప్రయోగ సూత్రానికి రెండు మార్కులు, ప్రయోగ విధానానికి మూడు పట్టికలు, పరిశీలనలు, గ్రాఫ్‌లకు ఎనిమిది, గణనకు నాలుగు, జాగ్రత్తలకు రెండు, ఫలితం, ప్రమాణాలకు రెండు మార్కులు, రికార్డులకు నాలుగు, వైవాకు ఐదు మొత్తంగా 30 మార్కులుంటాయి. గణన అనే శీర్షిక కింద రఫ్‌గా చేసినదంతా రాయాలి. దానికి నాలుగు మార్కులు వస్తాయి. అన్ని ప్రయోగాలకు జాగ్రత్తలు తప్పనిసరిగా రాయాలి. అన్ని ప్రయోగ విలువలు ఒకే ప్రమాణ పద్ధతిలో ఉండేలా చూసుకోవాలి. ప్రమాణాలు ప్రతి విలువకు ఉన్నాయో లేదో చూసుకోవాలి. పట్టికల్లో ప్రమాణాలు ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. అన్ని ప్రశ్నలకు ఒకే శీర్షికలుంటాయి. విద్యుత్ ప్రయోగాలకు సర్క్యూట్ డయాగ్రామ్ (వలయ చిత్రం) తప్పనిసరిగా వేయాలి.– టేకుమూడి రామ్‌కుమార్, ఫిజిక్స్ అధ్యాపకుడు, ప్రభుత్వ జూనియర్ కళాశాల, కాజులూరు సూటిగా సమాధానాలు చెప్పాలి.. వృక్షశాస్త్రం ప్రయోగ పరీక్ష 30 మార్కుల ప్రశ్న పత్రంలో ఐదు విభాగాలు ఉంటాయి. ఒకటో ప్రశ్నకు వృక్ష వర్గీకరణ శాస్త్రంలో మూడు కుటుంబాల్లో ఒక కుటుంబం వస్తుంది. వర్ణణ క్రమపద్ధతిలో, ప్రణాళికాబద్ధంగా రాయాలి. అడిగిన చిత్రపటాలు, లక్షణాలు, బాగా సాధన చేసి తప్పులు లేకుండా రాయాలి. ఇచ్చిన మొక్కను బట్టి పుష్పచిత్రం, సమీకరణం, కుటుంబం గుర్తింపు తప్పనిసరి. రెండో ప్రశ్న వృక్ష అంతర్నిర్మాణ శాస్త్రం నుంచి వస్తుంది. ఇచ్చిన మెటీరియల్‌ను బట్టి స్లైడ్ తయారీని చాలా శ్రద్ధగా, శుభ్రంగా చేయాలి. విస్తరించిన భాగం పటం గీసి, గుర్తింపు రాయడం ముఖ్యం. మూడో ప్రశ్న వృక్ష శరీర ధర్మశాస్త్రం (లైవ్ ప్రయోగాలు) లాటరీ పద్ధతిలో విద్యార్థికి వచ్చిన ప్రయోగానికి అనుగుణంగా పరికరాల అమరిక చేయాలి. ఉద్దేశం, సూత్రం, పరిశీలన ఫలితం మాత్రమే రాయాలి. ఇవి చాలా సులభమైన ప్రశ్నలు. నాలుగో ప్రశ్నకు ఐదు మార్కులు పొందవచ్చు. స్పాటరు లేదా స్లైడును గుర్తించి దాని లక్షణాలు రాయాలి. రికార్డు, హెర్బేరియాలలో హెర్బేరియాను నీట్‌గా తయారు చేసి కవర్లో ఉంచి కవర్‌పై నంబరు వేయాలి. – కట్టు వినుతకుమారి, వృక్షశాస్త్ర అధ్యాపకురాలు, ప్రభుత్వ జూనియర్ కళాశాల, కిర్లంపూడి ఫలితం తప్పనిసరి... రసాయనశాస్త్రం ప్రయోగ పరీక్ష 30 మార్కులకు ఉంటుంది. మూడు గంటల సమయం ఇస్తారు. ఇందులో మూడు విభాగాలు ఉంటాయి. మొదటి విభాగంలో ఇచ్చిన లవణం రంగు భౌతిక స్థితి, జ్వాలా వర్ణ పరీక్ష, వేడి చేయడం తర్వాత ఆనయాన్, కాటయాన్లను గుర్తించడం, వాటి నిర్ధారణ పరీక్షలు ముఖ్యమైనవి. చివరగా ఫలితం తప్పనిసరిగా రాయాలి. ఈ విభాగానికి పది మార్కులుంటాయి. రెండో విభాగంలో ఘన పరిమాణాత్మక విశ్లేషణకు 8 మార్కులు. అందులో మొదటి పది నిమిషాల్లో ప్రయోగ విధానం రాయాలి. బ్యూరెట్ రీడింగులు, ఎటువంటి కొట్టివేతలు లేకుండా పట్టికలు రాసి, లెక్కింపు విధానం, ఫలితం రాయాలి. మూడో విభాగంలో ఎ నుంచి డి వరకు ప్రశ్నల్లో ఒకటి మాత్రమే చేయాలి. ఈ విభాగానికి ఆరు మార్కులు. ‘ఎ’లో ఇచ్చిన కర్బన పదార్ధం నుంచి ప్రమేయ సమూహాన్ని గుర్తించాలి. ‘బి’లో కొల్లాయిడల్ ద్రావణాలను తయారు చేయడం, ‘సి’లో క్రొమోటోగ్రఫీలో కార్బోహైడ్రేట్ల చర్యలు, ప్రొటీన్ల చర్యలు ఉంటాయి. – ఎ.దుర్గాప్రసాద్, రసాయనశాస్త్ర అధ్యాపకుడు,ప్రభుత్వ జూనియర్ కళాశాల, దేవిపట్నం -
ఫీజు చెల్లించిందెందరు?
సాక్షి, హైదరాబాద్: - హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు కాలేజీ తమ వద్ద ఉన్న 450 మంది విద్యార్థుల నుంచి పరీక్ష ఫీజు తీసుకుంది. బోర్డు వెబ్‌సైట్‌లోని కాలేజీ లాగిన్‌కు వెళ్లి మొదటి విడతలో అందులోని 250 మంది విద్యార్థుల జాబితాను సెలెక్ట్ చేసి, ఫీజు చెల్లింపు ఆప్షన్ క్లిక్ చేసి వారి పరీక్ష ఫీజును చెల్లించింది. అయితే ఆ చెల్లింపు పూర్తయ్యాక తమ లాగిన్‌లో ఏయే విద్యార్థుల ఫీజు చెల్లించారు.. ఇంకా ఏయే విద్యార్థుల ఫీజు చెల్లించాలి.. అనే జాబితా వేర్వేరుగా రావాలి. కానీ ఆ వివరాలేవీ రావడం లేదు. దీంతో ఏం చేయాలో అర్థం కాక కాలేజీ యాజమాన్యం తలపట్టుకుంది. - ఫలక్‌నుమా ప్రభుత్వ జూనియర్ కాలేజీ.. విద్యార్థులకు సంబంధించిన రూ. 50 వేల ఫీజు చెల్లించారు. బోర్డు వెబ్సైట్లో రూ. 50 వేలు చెల్లించినట్లు ఉంది. కానీ బోర్డు అకౌంట్‌కు చేరింది రూ. 20 వేలు మాత్రమే. ఇలా తప్పుల తడకగా సమాచారం ఉన్న కాలేజీలు వెయ్యి వరకు ఉన్నట్లు తెలిసింది. - ఇలా రాష్ట్రంలోని లక్షల మంది ఇంటర్మీడియట్ విద్యార్థులు, వారి పరీక్ష ఫీజు చెల్లింపునకు సంబంధించిన వివరాలు గల్లంతయ్యాయి. వచ్చే మార్చిలో పరీక్షలకు హాజరయ్యే దాదాపు 11 లక్షల మంది ఇంటర్మీడియట్ విద్యార్థుల్లో ఇప్పటివరకు ఎంత మంది ఫీజులు చెల్లించారో.. ఎంత మంది చెల్లించలేదోనన్న వివరాలు తెలియక యాజమాన్యాలు తల పట్టుకుంటున్నాయి. పరీక్ష ఫీజులకు సంబంధించిన సాఫ్ట్వేర్ సమస్యతో ఈ గందరగోళం నెలకొంది. ఆమ్యామ్యాలకు అలవాటుపడిన బోర్డు ఉన్నతాధికారులు ఓ ప్రైవేటు సంస్థకు విద్యార్థుల డేటా, రిజల్ట్ ప్రాసెస్ పనులను అప్పగించడమే ఇందుకు కారణమని అధికారులు పేర్కొంటున్నారు. విద్యార్థులు పరీక్ష ఫీజు చెల్లించినట్లు ఆన్లైన్లో లేకపోతే రేపు పరీక్షల సమయంలో వారికి హాల్‌టికెట్లు రావు. దీంతో లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడే అవకాశం ఉందని వాపోతున్నారు. సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్‌ను కాదని, ఓ ప్రైవేటు సంస్థకు డేటా ప్రాసెసింగ్ పనులను అప్పగించినందునే సమస్య తలెత్తిందని పేర్కొంటున్నారు. అంతేకాదు ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని బోర్డు కార్యదర్శికి సూచించినా పట్టించుకోకపోగా, అదే సాఫ్ట్వేర్ సంస్థను వెనకేసుకు వస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పొంచి ఉన్న ప్రమాదాన్ని బోర్డు కార్యదర్శికి చెప్పేందుకు ప్రయత్నించినా పట్టించుకోకపోవడంతో పరీక్షల నియంత్రణాధికారి సెలవుపై వెళ్లిపోయినట్లు తెలిసింది. బోర్డు పరీక్షల విభాగంలో మరికొంత మంది సిబ్బంది కూడా అదే బాట పడుతున్నట్లు సమాచారం. ఆది నుంచీ అక్రమాలు, అడ్డగోలు విధానాలే.. రాష్ట్రంలో ఏటా దాదాపు 11 లక్షల మంది విద్యార్థుల వివరాలు, వారి అడ్మిషన్లు, పరీక్ష ఫీజు చెల్లింపు, హాల్‌టికెట్ల జనరేట్ చేయడం, పరీక్ష ఫలితాల వెల్లడి వంటి వ్యవహారాలను చూడాల్సిన సాఫ్ట్వేర్ సంస్థ నిర్వాకం విద్యార్థుల పాలిట శాపంగా మారింది. భారీగా ముడుపులు పుచ్చుకొని సామర్థ్యంలేని సంస్థకు పనులను అప్పగించి బోర్డు అధికారులు భారీ తప్పిదానికి కారణమయ్యారన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. 11 లక్షల మంది విద్యార్థుల డేటా ప్రాసెస్ చేయాల్సి ఉండగా, కేవలం 3 లక్షల మంది విద్యార్థుల డాటా ప్రాసెస్ చేస్తే చాలన్న నిబంధనను.. సదరు సాఫ్ట్వేర్ సంస్థకు అనుగుణంగా రూపొందించి భారీ తప్పిదం చేశారు. టెక్నికల్ సామర్థ్యాలను పట్టించుకోకుండా మూడేళ్ల కోసం రూ. 4.5 కోట్ల పనులను అప్పగించారు. టెండరు నిబంధనల ప్రకారం.. సదరు సంస్థ తమ పనితీరును నిరూపించుకునేందుకు గత సంవత్సరపు పరీక్షల డేటా ప్రకారం ఫలితాలు ప్రాసెస్ చేయాల్సి ఉంది. కానీ ఆ పనిని కూడా ఆ సంస్థ చేయలేదు. అంతేకాదు ఈ విద్యా సంవత్సరం ప్రవేశాలకు సంబంధించిన విద్యార్థుల సమాచారం సేకరణ పనులను కూడా చేయలేదు. జూన్‌లో ప్రవేశాలు మొదలైనా జూలై వరకు కూడా చేయలేదు. బోర్డు కార్యదర్శి సదరు సంస్థనే వెనకేసుకొచ్చారు. నిర్ణీత గడువులో పని చేయకపోయినా పట్టించుకోలేదు. టెండరు నిబంధనల ప్రకారం కనీసం జరిమానా వేయలేదు. 9 లక్షల మంది ఫీజుపై గందరగోళం... ప్రభుత్వ సంస్థ అయిన సీజీజీ ఆధ్వర్యంలో విద్యార్థుల సమాచారం సేకరించి దాన్ని తాము ఎంపిక చేసి సంస్థకు అప్పగించారు. కనీసం ఆ సేకరించిన సమాచారం ప్రకారమైనా పక్కాగా విద్యార్థుల పరీక్ష ఫీజు చెల్లింపునకు చర్యలు చేపట్టిందా.. అంటే అదీ లేదు. పక్కాగా ప్రోగ్రాంను రూపొ ందించలేదు. దీంతో సెప్టెంబర్ 17వ తేదీ నుంచి బోర్డుకు ఫీజు చెల్లింపు ప్రారంభం కావాల్సి ఉన్నా ప్రారంభానికి నోచుకోలేదు. చివరకు అక్టోబర్ 16న ప్రారంభించారు. ఈ నెల 24తో ముగిసే నాటికి లక్ష మంది విద్యార్థుల ఫీజుల చెల్లింపు వివరాలు కూడా బోర్డుకు అందలేదు. కానీ బోర్డు అధికారులు మాత్రం 2.13 లక్షల మంది విద్యార్థుల ఫీజు వివరాలు వచ్చాయని చెబుతున్నారు. మరి మిగతా 9 లక్షల మంది విద్యార్థుల ఫీజుల వివరాలపై గందరగోళమే నెలకొంది. ఈనెల 31 వరకు గడువు పొడిగించినా ఫలితం లేని పరిస్థితి నెలకొంది. దీంతో ఏ కాలేజీ నుంచి ఎంత మంది విద్యార్థుల ఫీజులు వచ్చాయి అన్నది బోర్డుకే తెలియని గందరగోళం నెలకొంది. అంతేకాదు కాలేజీ యాజమాన్యాలు కూడా తీవ్ర ఆందోళన చెందుతున్నాయి. వారు విద్యార్థుల నుంచి ఫీజులను వసూలు చేశారు కానీ బోర్డుకు ఎంత మంది ఫీజులు చేరాయి.. ఇంకా ఎంత మంది ఫీజులు చెల్లించాలన్న విషయంలో స్పష్టత లేకుండాపోయింది. బోర్డు చుట్టూ ప్రదక్షిణలు బోర్డు వెబ్‌సైట్‌లోని తమ కాలేజీ లాగిన్లోకి వెళితే ఆ వివరాలేవీ రావడం లేదని కొన్ని యాజమాన్యాలు, వస్తున్న వివరాల్లోనూ అనేక తప్పులు ఉన్నాయని మరికొన్ని యాజమాన్యాలు, డబ్బులు చెల్లించినా అప్డేట్ కాలేదని ఇంకొన్ని కాలేజీలు బోర్డు చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నాయి. అయినా బోర్డు అధికారులు కానీ, సెక్రటరీ కానీ కనీసం స్పందించడం లేదని వారు వాపోతున్నారు. చివరకు ఈ గందరగోళం పరిష్కారానికి ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని బోర్డు కార్యదర్శికి విన్నవించినా పట్టించుకోలేదు. దీంతో పరీక్షల నియంత్రణాధికారి సెలవుపై వెళ్లిపోయారు. ఆ విభాగంలోని మరికొందరు అధికారులు అదే బాటపట్టారు. ఈ వ్యవహారంలో బోర్డు కార్యదర్శి నిర్లక్ష్యం కారణంగా లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు అంధకారంగా మారే ప్రమాదం నెలకొందని ఇంటర్ విద్యా జేఏసీ చైర్మన్ డాక్టర్ పి. మధుసూదన్‌రెడ్డి పేర్కొన్నారు. సామర్థ్యంలేని సాఫ్ట్వేర్ సంస్థ ఒప్పందాన్ని రద్దు చేసి, వెంటనే ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. లేకపోతే ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే ప్రమాదం ఉందన్నారు. ఈ విషయంలో గవర్నర్ వెంటనే జోక్యం చేసుకొని సమగ్ర విచారణ జరిపించాలని కోరారు. -
నానీ.. అమ్మ వచ్చింది లేరా?
కొండపి (ప్రకాశం): సమయం రాత్రి 7.30 గంటలు.. కొండపి నుంచి రయ్..మంటూ బైక్‌పై ఇద్దరు యువకులు కట్టావారిపాలెం వైపు దూసుకెళ్తున్నారు. కట్టావారిపాలెం డిగ్రీ కళాశాలకు కూతవేటు దూరంలో ఎదురుగా వచ్చిన చెక్కులు ట్రాక్టర్ డోర్లు తగిలి ఇద్దరూ కింద పడిపోయారు. రక్తమోడుతున్న ఇద్దరు యువకులను కొండపి ఎస్ఐ తన మొబైల్ వాహనంలో మెరుపు వేగంతో స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తీసుకెళ్లారు. స్ట్రక్చర్‌పై పడుకోబెట్టగా ఓ యువకుడు అప్పటికే విగత జీవిగా మారాడు. తీవ్ర గాయాలతో ఉన్న మరో యువకుడిని 108 అంబులెన్స్‌లో ఒంగోలు తరలించారు. ఈ సంఘటన కొండపి సమీపంలో సోమవారం రాత్రి జరిగింది. ఎస్ఐ చంద్రశేఖర్ కథనం ప్రకారం.. కొండపి పంచాయతీ కట్టావారిపాలెం గ్రామానికి చెందిన తన్నీరు అనిల్ (19), తన్నీరు మహేష్ (17)లు అక్క చెల్లెళ్ల పిల్లలు. వరుసకు అన్నదమ్ములు. బైకుపై కొండపి వచ్చి రాత్రి 7.30 సమయంలో తిరిగి కట్టావారిపాలెం బయల్దేరారు. గ్రామానికి సమీపంలో ఇలవర నుంచి చెక్కులు లోడుతొ డోర్లు తీసుకుని వస్తున్న ట్రాక్టర్ తగిలింది. అనిల్ తల, శరీరానికి గాయాలయ్యాయి. మహేష్ కుడి చేయితో పాటు తలకు తీవ్ర గాయమైంది. సమాచారం అందుకున్న ఎస్ఐ చంద్రశేఖర్ తన వాహనంలో క్షతగాత్రులను స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఈ క్రమంలో తన్నీరు అనిల్ మృతి చెందగా మహేష్‌కు మెరుగైన వైద్యం కోసం 108లో ఒంగోలు తరలించారు. దిక్కులు పిక్కటిల్లేలా బంధువుల రోదన యువకుల ప్రమాదవార్త తెలుసుకున్న మృతుడు తల్లి, అక్క, ఇతర బంధువులు వైద్యశాలకు తరలివచ్చారు. దిక్కులు పిక్కటిల్లేలా రోదించారు. అనిల్ అక్క తమ్ముడి శవాన్ని పట్టుకుని నాని.. ఇటు చూడరా ఒక్కసారి.. అమ్మ వచ్చింది.. లేవరా..అంటూ రోదించడం చూపరులకు కన్నీరు తెప్పించింది. మాలకొండయ్య, శేషమ్మ దంపతులకు అనిలఒక్కడే కుమారుడు. మృతుడి కంటే ముందు ముగ్గురు అక్కలు ఉన్నారు. తీవ్ర గాయాలపాలైన మహేష్‌కు ఇద్దరు అక్కలు ఉన్నారు. వడ్డెర కాలనీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కొలుపులని వచ్చి..కానరాని లోకాలకు కట్టావారిపాలెం గ్రామానికి చెందిన అనిల్ హైదరాబాద్‌లో ఇంటర్ చదువుతున్నాడు. మహేష్ అక్కడే బేల్దారి పనులు చేస్తున్నాడు. గ్రామంలో అంకమ్మ కొలుపులు ఉండటంతో వచ్చారు. వడ్డెర కాలనీలో కొలుపులతో నెలకొన్న సందడి యువకులకు జరిగిన ప్రమాదంతో ఆవిరైంది. వైద్యశాలలో డ్యూటీ డాక్టర్లు అందుబాటులో లేకపోవడంతో క్షతగాతుడిని ఒంగోలు రిమ్స్‌కు తీసుకెళ్లాల్సి వచ్చింది. -
ఇంటర్‌కూ ఆధార్ లింకు
కోస్గి (కొడంగల్) : ప్రభుత్వం విద్యారంగంలో విద్యార్థుల పేరుతో చేస్తున్న అక్రమాలకు అడ్డుకట్ట వేసి.. నాణ్యమైన విద్య అందించాలనే లక్ష్యంతో ఆన్లైన్ విధానాన్ని అమలుచేస్తుంది. రాష్ట్ర ప్రభు త్వ నిర్ణయంతో ఇప్పటికే ప్రమాణాలు పాటించని ఎన్నో ప్రైవేట్ కళాశాలలు మూతపడ్డాయి. ఇప్పటికే డిగ్రీలో ఆన్లైన్లో అడ్మిషన్ల ప్రక్రియను ప్రారంభించిన ప్రభుత్వం ఈ ఏడాది నుంచి ఇంటర్‌లోనూ విద్యార్థుల ఆధార్ లింకు చేస్తూ ఆన్లైన్ విధానంలోనే అడ్మిషన్లు చేపట్టాలని ఆదేశాలు జా రీచేసింది. ఇంటర్ విద్యకు ప్రభుత్వం ఆధార్‌ను లింకు చేయడంతో ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల్లో బోగస్ విద్యార్థులకు చెక్ పెట్టడానికి ఈ నిర్ణయం తీసుకుంది. ఇంటర్లో అడ్మిషన్ కావాలంటే ఆధా ర్ను తప్పనిసరిగా విద్యార్థి సమర్పించాలని ఉత్తర్వులు సైతం జారీ చేసింది. ఈ విద్యా సంవత్స రం నుంచే అమలు చేయాలని కళాశాలలకు స్పష్టమైన ఆదేశాలిచ్చింది. ఇకపై జూనియర్ కళాశాల ల్లో నేరుగా ప్రవేశాలు కల్పించే పద్ధతికి స్వస్తి చెప్పి ఆన్లైన్ విధానాన్ని ఇంటర్ బోర్డు ప్రవేశపెట్టింది. పక్కాగా విద్యార్థుల లెక్క ప్రభుత్వ ఆన్లైన్ విధానంతో ఇక నుంచి విద్యార్థుల లెక్క పక్కాగా ఉండబోతోంది. కోస్గి మండల కేంద్రంలో రెండు ప్రైవేట్, ఒక ప్రభుత్వ జూనియర్ కళాశాలలతోపాటు ఒక పారామెడికల్ ఒకేషనల్ కళాశాల, ప్రైవేట్ ఐటీఐతోపాటు గుండుమాల్‌లో మోడల్ పాఠశాలలో ఇంటర్ విద్య కొనసాగుతుంది. మండలంలో ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల్లో నాలుగు వేలకుపైగా విద్యార్థులు ఇంటర్, ఐటీఐ, పారామెడికల్ కోర్సుల్లో చదువుతున్నారు. వీరందరికీ ప్రభుత్వం ప్రతి సంవత్సరం స్కాలర్షిప్లు అందిస్తుంది. ఆధార్ అనుసంధానంతో ఏ కళాశాలలో ఎంత మంది విద్యార్థులు ఉన్నారనేది స్పష్టంగా తెలుస్తోంది. దీంతో ఒక కళాశాలలో చేరిన విద్యార్థి పేరు మరో కళాశాలలో నమోదు చేయలేరు. దీంతో ప్రభుత్వం అందించే స్కాలర్షిప్ నిధుల దుర్వినియోగానికి అడ్డుకట్ట పడనుంది. నిరాకరిస్తున్న ప్రైవేట్ కళాశాలలు ఇంటర్లో ఈ ఏడాది నుంచి అమలు చేయనున్న ఆన్లైన్ విధానాన్ని ప్రైవేట్ కళాశాలు నిరాకరిస్తున్నాయి. ప్రభుత్వం అందించిన ఉత్తర్వులను అమలు చేయకుండా ప్రైవేట్ కళాశాలల యూనియన్ ఆధ్వర్యంలో ఉమ్మడిగా ఉత్తర్వులను రద్దు చేయించాలని నిర్ణయించినట్లు ఓ ప్రైవేట్ కళాశాల నిర్వాహకుడు తెలిపారు. ఇప్పటికే గ్రామాల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించే కళాశాలల యాజమాన్యాలు ఈ ఏడాది ఆన్లైన్ విధానం ఉత్తర్వులు అందడంతో ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. ప్రస్తుతానికి ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మాత్రమే అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. పారదర్శకత పెరుగుతుంది ఇంటర్లో సైతం ఆన్లైన్ విధానం అమలు చేసి ఆధార్‌ను లింకు చేస్తే విద్యారంగంలో పారదర్శకత మరింత పెరుగుతుం ది. ప్రైవేట్, కార్పొరేట్ కళాశాలల అక్రమాలకు అడ్డుకట్ట పడి ప్రభుత్వం అందించే నిధులు అర్హులైన పేద విద్యార్థులకు అందుతాయి. ప్రభుత్వ కళాశాలల్లో మెరుగైన వసతులు కల్పించి, సరిపడా బోధనా సిబ్బందిని నియమిస్తే ప్రైవేట్, కార్పొరేట్ కళాశాలలకు అడ్డుకట్ట వేయవచ్చు. – బద్రినాథ్, ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, కోస్గి -
ఇంటర్ విద్యార్థులకూ మధ్యాహ్న భోజనం
సత్తెనపల్లి: ఇంటర్మీడియెట్ విద్యార్థులకు ఈ విద్యా సంవత్సరం నుంచే మధ్యాహ్న భోజన పథకం అమలు చేయడానికి ఇంటర్ బోర్డు నిర్ణయించింది. మధ్యాహ్న భోజన పథకం అమలు చేయడానికి విద్యార్థుల వివరాలు, నిర్వహణ చర్యలతో ప్రతిపాదనలు పంపించాలని ఇంటర్మీడియెట్ విద్య కమిషనర్ ఉదయలక్ష్మి నుంచి ఆర్జేడీ, ఆర్జేడీ నుంచి కళాశాలల ప్రిన్సిపాళ్లకు ఉత్తర్వులు అందాయి. డ్రాపౌట్స్ తగ్గించేందుకే.. ప్రాథమిక పాఠశాల నుంచి పదో తరగతి వరకు మథ్యాహ్న భోజన పథకం అమలవు తోంది. తద్వారా పదో తరగతి వరకు విద్యార్థులు డ్రాపౌట్లు (చదువు మానేస్తున్న వారు) ఎక్కువగా ఉండటం లేదు. పదో తరగతి నుంచి ఇంటర్మీడియెట్ నడుమ డ్రాపౌట్లు ఎక్కువగా ఉంటున్నాయి. దీన్ని నివారించేందుకు ఇంటర్మీడియెట్ బోర్డు ఈ ఏడాది నుంచి మధ్యాహ్న భోజనం అమలకు శ్రీకారం చుట్టింది. అన్నీ అనుకూలిస్తే జూలై మొదటి వారం నుంచి మధ్యాహ్న భోజనం పథకం అమలవుతుందని అధికారులు చెబుతున్నారు. కళాశాలల్లో నిరుపేదలే..... ఇంటర్మీడియెట్ కళాశాలల్లో చదువుకునే విద్యార్థులు అంతా నిరుపేద కుటుంబాలకు చెందిన వారే. తల్లిదండ్రుల ఆర్థిక స్తోమత అంతంత మాత్రమే. కూలి పనులకు, వ్యవసాయ పనులకు వెళ్లే కుటుంబాల విద్యార్థులు అత్యధిక సంఖ్యలో చేరుతున్నారు. పనులకు వెళ్లే కుటుంబాలు ఉదయం వెళితే సాయంత్రానికి తిరిగి వస్తారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు భోజనం వండి క్యారియర్లలో సర్ది పంపే పరిస్థితులు ఉండవు. దీంతో విద్యార్థులు అర్థాకలితో చదువుకునే పరిస్థితులు జిల్లాలో ఉన్నాయి. కళాశాలలకు వెళ్లిన విద్యార్థులు ఆకలికి తాళలేక మధ్యాహ్నం తర్వాత ఇంటి బాట పడుతున్నారు. సాయంత్రం వరకూ కళాశాలలో ఉన్నా ఆకలికి అధ్యాపకులు చెప్పే పాఠాలు విద్యార్థుల బోధపడటంలేదు. మరో వైపు పౌష్టికాహారం లోపం తలెత్తుతోంది. మధ్యాహ్న భోజనం పథకం అమలైతే విద్యార్థులకు అర్ధాకలి నుంచి బయట పడటంతో పాటు పౌíష్టికాహారం లోపాన్ని అధిగమించొచ్చని ఇంటర్మీడియెట్ బోర్డు ఇంటర్ విద్యార్థులకూ మధ్యాహ్న భోజన పథకం అమలు చేయడానికి ముందు కు వచ్చింది. పాఠశాలల తరహాలో... జిల్లాలో ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలవుతోంది. ఆరు రోజులు పౌíష్టికాహారంతో కూడిన భోజనాన్ని వంట ఏజెన్సీల ద్వారా విద్యార్థులకు వడ్డిస్తున్నారు. వారంలో మూడు రోజులు కోడి గుడ్లను విద్యార్థులకు అందిస్తున్నారు. వంట ఏజెన్సీల ద్వారా మధ్యాహ్న భోజన పథకం ఎలా అమలవుతోంది? అమలులో లోపాలున్నాయా? అనే విషయాల పై పర్యవేక్షణ చేయాలని ఇంటర్ కళాశాలల కమిషనర్ నుంచి జిల్లా అధికారులకు ఆదేశాలు జరీ చేశారు. పౌష్టికాహారంతో కూడిన భోజనం ఇంటర్మీడియెట్ విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని ఇంటర్ బోర్డు నిర్ణయించింది. రోజూ పౌష్టికాహారంతో కూడిన భోజనం వడ్డించడంతో పాటు మజ్జిగ, అరటి పండు, గుడ్లను విద్యార్థులకు అందిస్తారు. తద్వారా హాజరు శాతం రోజూ పెరగడంతో పాటు కళాశాల ప్రవేశాలు పెరుగుతాయని ప్రిన్సిపాళ్లు భావిస్తున్నారు. జిల్లాలో ప్రభుత్వ ఇంటర్ కళాశాలలు 22, 23 ఎయిడెడ్ కళాశాలలు ఉన్నాయి.వీటి పరిధిలో ఈ ఏడాది ఇప్పటి వరకు మొదటి సంవత్సరం విద్యార్థులు 5,239 మంది ప్రవేశాలు పొందారు. మరో 1,500 మంది వరకుప్రవేశాలు పొందే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం ద్వితీయ సంవత్సరం 5,340 మంది విద్యార్థులు చదువుతున్నారు. జూలై నుంచి అమలు జిల్లాలో ప్రాథమిక, ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన పధకం ఎలా అమల వుతోంది. వంట ఏజెన్సీలు భోజనాన్ని విద్యార్థులకు ఏ విధంగా వండి వడ్డిస్తున్నారు తదితర వాటి పై కసరత్తు జరుగుతోంది. జులై నుంచి ఇంటర్ కాలేజీల్లోనూ మధ్యాహ్న భోజనం పథకం అమలులోకి వస్తుంది.–జెడ్.ఎస్.రామచంద్రరావు,ఆర్ఐఓ, గుంటూరు -
ఇంటర్ విద్యార్థులకు ట్రాఫిక్ పరీక్ష
నెల్లూరు (టౌన్): ఇంటర్మీడియట్ వి ద్యార్థులకు నెల్లూరు నగరంలో ‘ట్రాఫి క్ పరీక్ష’ తప్పడం లేదు. ఉదయం 9 గంటలకు పరీక్ష ప్రారంభవుతున్న నేపథ్యంలో విద్యార్థులు తమ తల్లిదండ్రులతో కలిసి ఉదయం 7.30 నుంచే పరీక్ష కేంద్రాలకు బయలు దేరుతున్నారు. గురువారం నగరంలో చాలా కల్యాణ మండపాల్లో పెళ్లిళ్లు జరుగుతుండటంతో కారులు, బస్సులు, ఇతర వాహనాలతో నగర రోడ్లు రద్దీగా మారాయి. దీంతో మినీబైపాస్ పూర్తిగా ట్రాఫిక్‌తో స్తంభించింది. స్థానిక మాగుంట లేవుట్ నుంచి ఆత్మకూరు బస్టాండ్ ఫ్లైఓవర్ బ్రిడ్జి వరకు పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. ఈ ట్రాఫిక్ దిగ్భంధనంలో వందలాది మంది విద్యార్థులు చిక్కుకున్నారు. ఓ వైపు పరీక్ష సమయం దగ్గర పడుతుండటం, మరోవైపు ట్రాఫిక్ ఒక అడుగు ముందుకు కదలకపోవడంతో విద్యార్థులు తమ తమ పరీక్ష కేంద్రాలకు చేరుకునేందుకు ఆందోళన పడ్డారు. పరీక్ష కేంద్రాలకు నిమిషం ఆలస్యమైన విద్యార్థులను అనుమతించకపోవడంతో విద్యార్ధులతో తల్లిదండ్రులు గుండెలు గుప్పెట్లో పెట్టుకుని ప్రత్యామ్నాయం కోసం పాకులాడారు. దీనికి తోడు నగరంలోని ప్రతి రోడ్డులో అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ పనులతో గుంతలు తవ్వేయడంతో ప్రత్యామ్నాయ మార్గాలు కూడా ముసుకుని పోవడంతో వారి వ్యథ వర్ణణాతీతంగా మా రింది. నగరంలో ట్రాఫిక్ పరిస్థితిని అంచనా వేసి క్రమబద్ధీకరించాల్సిన పోలీసులు ఎక్కడా కనిపించలేదు. దీంతో రెండు కిలోమీటర్ల ప్రయాణానికి గంటల సమయం పట్టింది. దీనికి తోడు ట్రాఫిక్ కంట్రోల్ కోసమంటూ నగరంతో పాటు మినీబైపాస్ పొడవునా సర్కిళ్లలో అడ్డంగా డివైడర్ రాళ్లు పెట్టి దూరంగా వచ్చి మలుపు తిరిగే విధంగా ఏర్పాట్లు చేశారు. వాహనాలు అడ్డదిడ్డంగా వస్తుండటంతో ట్రాఫిక్ ఎక్కువైంది. ఈ పరిస్థితుల్లో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు నడుచుకుంటూ చిన్న వీధుల్లో నుంచి పరీక్ష కేంద్రాలకు హాజరయ్యారు. శుక్రవారం రోజు పరీక్ష సమయానికి ట్రాఫిక్‌ను సరిదిద్దుతారో లేక గాలికి వదులుతారోనన్న అనుమానాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు. ఇంటర్ పరీక్షకు750 మంది విద్యార్థులు గైర్హాజరు ఇంటర్ ద్వితీయ సంవత్సరానికి సంబంధించిన పరీక్షలు గురువారం ప్రారంభమయ్యాయి. తొలిరోజు తెలుగు, ఉర్దూ, సంస్కృతం, హిందీ పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షలకు జిల్లా వ్యాప్తంగా జనరల్‌కు సంబంధించి 26,894 మంది విద్యార్థులు హాజరుకావాల్సి ఉండగా, 26,177 మంది హాజరయ్యారు. 717 మంది గైర్హాజరయ్యారు. ఒకేషనల్‌కు సంబంధించి 1,216 మందికి 1,183 మంది హాజరు కాగా 33 మంది గైర్హాజరయ్యారు. ఆర్ఐఓ 3 కేంద్రాలను పరిశీలించగా ఫ్లయింగ్, సిటింగ్ స్క్వాడ్ అధికారులు 53 కేంద్రాలను తనిఖీ చేశారు. ఉర్దూ, సంస్కృతం పేపర్లలోఅచ్చు తప్పులు ద్వితీయ సంవత్సరానికి సంబంధించి ఉర్దూ ప్రశ్నపత్రంలో రెండు అచ్చు తప్పులు వచ్చాయి. సంస్కృతంలో ఒక అచ్చు తప్పు వచ్చింది. దీనిని వెంటనే సరిదిద్దిన అధికారులు డిపార్ట్మెంట్ అధికారులను సంప్రదించి వాక్యాలను సరిచేశారు. సరైన వెలుతురు లేక ఇబ్బందులు కొన్ని ఇంటర్ పరీక్ష కేంద్రాల్లో వెలుతురు లేక విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. కార్పొరేట్ కళాశాలల్లో ఈ సమస్య ఎక్కువగా ఉందని విద్యార్థులు చెబుతున్నారు. భవనాలకు సరిపడా కిటికీలు లేకపోవడం కారణంగా కనిపిస్తుంది. లైట్లను ఏర్పాటు చేయాల్సి ఉన్నా అధికారులు పట్టించుకోని పరిస్థితి ఉంది. వెలుతురుతోపాటు చాలా పరీక్ష కేంద్రాల్లో ఫ్యాన్లు లేవు. అప్పుడే ఎండలు వేసవికాలాన్ని తలపిస్తున్నాయి. ఉష్ణోగ్రత పెరగడంతో సరైన గాలి రాక విద్యార్థులు నరకయాతన పడ్డారు. -
ఇంటర్ విద్యార్థులకు హాల్‌టిక్కెట్లు నిరాకరణ
ఏలూరు టౌన్ : బుధవారం నుంచి ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు ప్రారంభమవుతున్న పరిస్థితుల్లో సీఆర్ఆర్ కళాశాల యాజమాన్యం వివిధ కారణాలతో విద్యార్థులకు హాల్‌టిక్కెట్లు మంజూరు చేసేందుకు నిరాకరించటంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. హాల్‌టిక్కెట్లు ఏ కారణాలతోనైనా ఆపితే కఠిన చర్యలు తప్పవని ఇంటర్మీడియట్ బోర్డు ఉన్నతాధికారులు హెచ్చరించినా యాజమాన్యాలు పట్టించుకోవటంలేదు. మంగళవారం ఉదయం కళాశాలకు వెళ్ళిన విద్యార్థులు హాల్ టిక్కెట్లు ఇవ్వాలని కోరగా, ఇవ్వమంటూ యాజమాన్యం తెగేసి చెప్పింది. విద్యార్థులకు మద్దతుగా ఏబీవీపీ నాయకులు శ్రీకాంత్‌తోపాటు మరికొందరు విద్యార్థి నాయకులు కళాశాల వద్ద బైఠాయించారు. ఉదయం నుంచీ సాయంత్రం వరకూ కళాశాల వద్ద బైఠాయించినా సమాధానం చెప్పకపోవటంతో ప్రధాన రహదారిపై రాస్తారోకో చేపట్టారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారటంతో త్రీటౌన్ పోలీసులు రంగంలోకి దిగారు. విద్యార్థులు ఆందోళన విరమించాలని హెచ్చరించారు. విద్యార్థులు ఆందోళన విరమించేదిలేదని, తమకు న్యాయం చేయాలని కోరారు. త్రీటౌన్ పోలీసులు పరిస్థితిని అదుపుచేసేందుకు విద్యార్థి సంఘం నాయకులను రోడ్డుపై ఈడ్చుకుంటూ వెళ్ళి అరెస్టులు చేశారు. విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలా సీఆర్ఆర్ కళాశాల విద్యార్థులు చేపడుతోన్న ఆందోళనకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షులు బొద్దాని శ్రీనివాస్ మద్దతు తెలిపారు. విద్యార్థులు కళాశాల వద్దే రాత్రి 9.30 గంటలైనా ఆందోళన చేస్తున్నా యాజమాన్యం పట్టించుకోకుండా కఠినంగా వ్యవహరించటం దారుణమని బొద్దాని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడితే సహించేదిలేదని, విద్యార్థులకు న్యాయం జరిగే వరకూ ఆందోళన కొనసాగిస్తామని తెలిపారు. పోలీసులు యాజమాన్యానికి వత్తాసు పలుకుతూ విద్యార్థులను, ఏబీవీపీ నేతలను అరెస్టులు చేయటం దారుణమన్నారు. దీనిపై వెంటనే ఉన్నతాధికారులు స్పందించి విద్యార్థులకు హాల్‌టిక్కెట్లు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యార్థులకు అండగా వైఎస్సార్సీపీ యువజన నాయకులు పసుపులేటి శేషు, దినేష్, యల్లపు మోజెస్ తదితరులు ఉన్నారు. -
టైమ్‌కి వెళ్లినా.. ఎగ్జామ్‌కు నో ఎంట్రీ!
సాక్షి, హైదరాబాద్/ అమరావతి : తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్మీడియెట్ ఫస్టియర్ పబ్లిక్ పరీక్షలు బుధవారం ప్రారంభం కాగా... కానీ కొన్ని పరీక్ష కేంద్రాల్లో రూమ్ వెతుక్కోవడంలో అలస్యమైనందుకు ఎగ్జామ్ రాసేందుకు విద్యార్థులను అనుమతించలేదు. సూర్యాపేట జిల్లా కోదాడలో వాగ్దేవి కాలేజీ ఇంటర్ విద్యార్థినిని ఒక్క నిమిషం ఆలస్యం నిబంధనతో సిబ్బంది బయటకు గెంటేశారు. దీంతో విద్యార్థి సంఘాల ఆందోళన చేపట్టగా పోలీసులు నచ్చజెప్పే యత్నం చేశారు. బాధిత విద్యార్థిని రమాదేవి మాట్లాడుతూ.. నిర్ణీత సమయానికే ఎగ్జామ్ సెంటర్‌కు వెళ్లిన తాను రూమ్ వెతుక్కోవడంలో అలస్యమైనందుకు బయటకు పంపారని చెప్పింది. పరీక్ష రాసేందుకు అనుమతించాలని వేడుకున్నా సిబ్బంది తన మాట వినలేదని వాపోయింది. కాగా, ఏపీలో మొత్తం 1,423 కేంద్రాల్లో, తెలంగాణలో 1,294 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించారు. అయితే నిమిషం నిబంధన కొన్ని పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులకు చిక్కులు పెట్టి పరీక్ష రాయకుండా అడ్డుకుంది. ఉదయం 8.45 నుంచి పరీక్షా కేంద్రాల్లోకి విద్యార్థులకు అనుమతించారు. 15 నిమిషాల గ్రేస్ పీరియడ్‌తో ఉదయం 9 గంటల వరకు పరీక్ష కేంద్రాల్లోకి చేరుకున్న విద్యార్థులను పరీక్ష రాసేందుకు అనుమతించినట్లు సిబ్బంది చెబుతున్నారు. -
ఇంటర్ విద్యార్థులకు వరం ‘డిస్క్’
సాక్షి, హైదరాబాద్: డిజిటల్ టెక్నాలజీలను అందిపుచ్చుకోవడంలో తెలంగాణ దేశంలో మొదటి స్థానంలో ఉందని ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి పేర్కొన్నారు. ప్రభుత్వ కళాశాలల్లో చదివే ఇంటర్ విద్యార్థుల కోసం దేశంలోనే తొలిసారిగా డిజిటల్ అప్లికేషన్‌ను అందుబాటులోకి తెచ్చామని తెలిపారు. పాఠ్యపుస్తకాలతో పాటు వీడియో క్లాసులు, మోడల్ ప్రశ్నపత్రాలు, పోటీ పరీక్షలకు అవసరమైన సమాచారం మొత్తం పొందుపరిచిన ఈ–డిజిటల్ స్టడీ కిట్ (డిస్క్)ను ఉచితంగా అందజేస్తున్నామని చెప్పారు. ఐటీ కంపెనీ క్లౌడ్జ్, ఇంటర్ బోర్డు సంయుక్తంగా సిద్ధం చేసిన డిస్క్‌ను శుక్రవారం హైదరాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆవిష్కరించారు. డెస్క్‌టాప్, ట్యాబ్లెట్, స్మార్ట్ఫోన్లలో అందుబాటులో ఉంటుందని తెలిపారు. ప్రైవేట్ కాలేజీల విద్యార్థులు రూ.325 చెల్లించి దీన్ని వినియోగించుకోవచ్చని పేర్కొన్నారు. సబ్జెక్ట్ నిపుణులు కలసి రూపొందించడం వల్ల సిలబస్ ప్రామాణికంగా ఉంటుందని చెప్పారు. డిస్క్‌లోని పాఠాలు, సమాచారాన్ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలని, పాఠాలు వీలైనంత సరళమైన భాషలో ఉండేలా చూడాలని సూచించారు. క్లౌడ్జ్ ప్రతినిధి సుమంత్ మాట్లాడుతూ ఇంటర్ విద్యార్థుల కోసం ప్రత్యేకంగా డిస్క్‌ను రూపొందించామని, సైన్స్, ఆర్ట్స్, కామర్స్ సబ్జెక్టులన్నింటి సమాచారం ఉంటుందని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్ స్పీడ్ తక్కువగా ఉన్నా ఈ యాప్‌ను సులువుగా డౌన్లోడ్ చేసుకోవచ్చని, డౌన్లోడ్ చేసుకున్నాక నెట్ లేకపోయినా పనిచేస్తుందని వివరించారు. డిజిటల్ తెలంగాణ ఆవిష్కరణలో భాగంగా ఏడాది కింద డిస్క్ తయారీ కోసం క్లౌడ్జ్తో ఒప్పందం కుదుర్చుకున్నామని ఇంటర్ బోర్డు కమిషనర్ అశోక్ పేర్కొన్నారు. కార్యక్రమంలో క్లౌడ్జ్ ప్రతినిధి శ్యామల వెంకటరెడ్డి పాల్గొన్నారు. డిస్క్‌లో ఏముంటాయి? - ఇంటర్‌లోని దాదాపు అన్ని సబ్జెక్టుల పాఠ్యపుస్తకాలు - బహుళ ఐచ్ఛిక ప్రశ్నలు, సమాధానాలు - ఒక్కో అంశానికి సంబంధించిన సినాప్సిస్, కాన్సెప్ట్‌ల వివరణ - ముఖ్యమైన 5,000 వీడియో పాఠాలు - ఇంటర్ బోర్డు పాత ప్రశ్న పత్రాలు.. - ఎంసెట్, జేఈఈ, నీట్, సీఏ–సీపీటీలకు అవసరమైన సమాచారం - సందేహాల నివృత్తికి అందుబాటులో నిపుణుల బృందం - విద్యార్థి సన్నద్ధతను ఎప్పటికప్పుడు తెలుసుకునే ఏర్పాట్లు డిస్క్ ప్రత్యేకతలు.. - ఇంటర్నెట్ లేకపోయినా సమాచారం అందుబాటులో ఉంటుంది. - డెస్క్‌టాప్‌తో పాటు స్మార్ట్‌ఫోన్, ట్యాబ్లెట్లలోనూ లభిస్తుంది. - ‘డెస్క్ తెలంగాణ’అని టైప్ చేసి ఆండ్రాయిడ్ ఫోన్ అయితే గూగుల్ ప్లేస్టోర్ నుంచి యాపిల్ ఐఫోన్ అయితే యాపిల్ స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. -
ఇంటర్ విద్యార్థుల నిర్బంధం
సాక్షి, పెందుర్తి: విశాఖపట్నం జిల్లాలోని పెందుర్తిలో అదో ప్రైవేటు జూనియర్ కళాశాల.. కళాశాల యాజమాన్యానికి, భవన యజమానికి ఆర్థిక వివాదాలు తలెత్తాయి. దీంతో విద్యార్థులు తాము చదువుకున్న తరగతి గదిలోనే బందీలుగా ఉండాల్సి వచ్చింది. బాధిత విద్యార్థులు, కళాశాల యాజమాన్యం కథనం ప్రకారం.. స్థానికంగా ఉన్న ఎల్ఐసీ భవనం సమీపంలో ఓ భవంతిలో రెండు అంతస్తుల్లో జూనియర్ కళాశాలను నిర్వహిస్తున్నారు. కొద్దిరోజులుగా కళాశాల యాజమాన్యం, భవన యజమాని కె.శ్రీనివాసరావు మధ్య వివాదం నడుస్తోంది. బుధవారం ఉదయం ఇరు వర్గాల మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో భవన యజమాని అనుచరులు విద్యార్థులను తరగతి గదుల నుంచి బయటకు పంపేశారు. కొంతమంది విద్యార్థులను గదుల్లో ఉంచి తాళాలు వేసి వెళ్లిపోయారు. దీంతో విద్యార్థులు ఏమి జరిగిందో తెలియక భయాందోళనకు గురయ్యారు. కొన్ని గంటలపాటు విద్యార్థులు బందీలుగా ఉండిపోయారు. చివరకు తోటి విద్యార్థులు తాళాలు పగలకొట్టి వారిని రక్షించారు. ఈ ఘటనపై కళాశాల యాజమాన్యం, విద్యార్థులు పెందుర్తి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మరోవైపు తాము విద్యార్థులను బంధించలేదని, కళాశాల యాజమాన్యమే తాము తాళాలు వేసిన తర్వాత అడ్డదారిలో గదుల్లోకి పంపిందని భవన యజమాని చెబుతున్నారు. తీవ్ర ఆందోళనకు గురయ్యాం ఉదయం యధావిధిగా కళాశాలకు వచ్చాం. తరగతి గదిలో పాఠాలు వింటున్న సమయంలో కొందరు వ్యక్తులు ప్రాంగణంలోకి వచ్చారు. మా పక్క గదిలో ఉన్నవారిని బయటకు పంపారు. మమ్మల్ని మాత్రం లోపల ఉంచి గదికి తాళం వేశారు. ఏం జరిగిందో తెలియక తీవ్ర ఆందోళనకు గురయ్యాం. –సిహెచ్ జయకిషోర్, బాధిత విద్యార్థి అద్దె సక్రమంగా చెల్లిస్తున్నాం మేం భవనం అద్దెకు తీసుకున్నప్పుడే అగ్రిమెంట్ రాసుకున్నాం. అద్దె కూడా గత నెల వరకు పూర్తిగా చెల్లించాం. భవన యజమాని దురుద్దేశంతో మమ్మల్ని ఖాళీ చేయమంటున్నారు. దానికి మేం నిరాకరించడంతో విద్యార్థులను బంధించారు. వారికి ఏదైనా ఆపద తలెత్తితే బాధ్యత ఎవరిది? – పి.సురేశ్, కళాశాల ప్రిన్సిపాల్ -
ఇంటర్ విద్యార్థుల ‘ఉపకార’ యాతన
► ఈ–పాస్ వెబ్సైట్లో కనిపించని జూనియర్ కాలేజీల వివరాలు ► ప్రవేశాల ప్రక్రియ ముగిశాకే లింకు ఇస్తామంటున్న అధికారులు సాక్షి, హైదరాబాద్: పోస్టుమెట్రిక్ విద్యార్థుల ఉపకార వేతనాల దరఖాస్తుకు చిక్కులు తప్పడం లేదు. ఈ ఏడాది ముందస్తుగా దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభించినప్పటికీ సాంకేతిక సమస్యలు విద్యార్థులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. 2017–18 విద్యాసంవత్సరానికి దరఖాస్తుల స్వీకరణ జూన్ 20న ప్రారంభం కాగా.. ఈ నెల 30తో గడువు ముగియనుంది. అయితే ఇప్పటివరకు ఇంటర్మీడియెట్ విద్యార్థులు ఒక్కరు కూడా ఆన్లైన్లో దరఖాస్తు సమర్పించలేదు. వెబ్సైట్లో సమాచార లోపంతో ఈ పరిస్థితి తలెత్తింది. దీంతో దరఖాస్తులకు తుది గడువు సమీపిస్తుండటంతో విద్యార్థుల్లో ఆందోళన తీవ్రమవుతోంది. ఈ–పాస్‌తో అనుసంధానం చేయకపోవడంతో.. ఈ–పాస్ వెబ్సైట్లో కాలేజీల సమాచారాన్ని సంబంధిత బోర్డులు/యూనివర్సిటీలు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా జూనియర్ కాలేజీల సమాచారాన్ని ఈ–పాస్ వెబ్సైట్లో ఇంటర్మీడియెట్ బోర్డు నమోదు చేయాలి. ఇందుకు బోర్డు వెబ్‌సైట్‌ను ఈ– పాస్‌తో అనుసంధానం చేయాలి. ప్రస్తుతం కోర్సుల్లో ప్రవేశాలు కొనసాగుతుండటంతో ఈ– పాస్ వెబ్‌సైట్‌తో ఇంటర్మీడియెట్ వెబ్‌సైట్‌ను అధికారులు అనుసంధానం చేయలేదు. దీంతో ఉపకారవేతనాల దరఖాస్తులో బీఐఈ(బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియెట్ ఎడ్యుకేషన్) ఆప్షన్ కనిపించడం లేదు. కాలేజీల సమాచారం లేకపోవడంతో ఆయా విద్యార్థులు దరఖాస్తును సమర్పించలేక పోతున్నారు. ఈ క్రమంలో పలువురు విద్యా ర్థులు సంక్షేమ శాఖలకు ఫిర్యాదు చేశారు. ప్రవే శాల ప్రక్రియ ముగియగానే, వచ్చే వారంలో బోర్డు లింకును అనుసంధానం చేయనున్నట్లు అధికారులు చెబుతున్నారు. -
దడ!
ఇంటర్ విద్యార్థులకు అగ్ని పరీక్షలా ‘నిమిషం’ పదో తరగతి విద్యార్థులను భయపెడుతున్న 5 నిమిషాలు.. క్షేత్రస్థాయి సమస్యలు పట్టించుకోరా..? కనీస సౌకర్యాలే లేనప్పుడు కఠిన నిబంధనలేల! ఆందోళనలో విద్యార్థులు ఒక్క నిమిషం..60 సెకన్లు.. రెప్పపాటులో కాలగర్భంలో కలిసిపోయే సెకన్..గట్టిగా నిట్టూర్చినా నిమిషం హరీమంటుంది. పరీక్షా సమయంలో నిమిషం అగ్ని పరీక్ష పెడుతోంది. విద్యార్థులకు కన్నీళ్లు పెట్టిస్తోంది.. పరుగులు పెట్టిస్తోంది. చదివింది మర్చిపోయేంత దడ పుట్టిస్తోంది. రవాణా సదుపాయాలుండవు.. బస్సులున్న చోటా అవి వేళకు రావు. తండ్రో, సోదరుడో బైక్‌పై డ్రాప్ చేయబోతే ఏదో సమస్య. నడక తప్ప గత్యంతరం లేని విద్యార్థులెందరో.. ఎలా రావాలి? నిమిషమే అగ్ని పరీక్ష పెడుతోందంటే విచిత్రంగా పదో తరగతి విద్యార్థులకు ఐదు నిమిషాల నిబంధనపెట్టి వారికీ దడ పుట్టిస్తున్నారు. అసలే పల్లెటూళ్లు.. పక్క గ్రామాల నుంచి రావాలంటే ఎప్పుడో వచ్చే బస్సు.. రోడ్లే లేని ఊళ్లలోని విద్యార్థులకు పొలం గట్లే గతి..ఏమిటీ అర్థం లేని నిబంధనలు.. కనీస ఆలోచన లేని అధికారుల తీరు విద్యార్థుల గుండెల్లో దడ పుట్టిస్తోన్న వైనంపై ప్రత్యేక కథనం.. పాపన్నపేట: ఒక్కో విద్యార్థిది ఒక్కో పరిస్థితి. కానీ ఇంటర్, ఎస్సెస్సీ బోర్డులు ఒక్క నిమిషం, 5 నిమిషాలు దాటితే పరీక్షకు అనుమతించ బోమనే కఠిన నిబంధనలు విధించి తమ జీవితాలతో ఆటలాడు కుంటున్నట్లుగా ఉందని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే జిల్లాలోని నర్సాపూర్ జూనియర్ కళాశాలలో ఒక్క నిమిషం నిబంధన ముగ్గురు విద్యార్థులను పరీక్షలు రాయకుండా చేసింది. ఈ నెల 17 నుంచి పదో తరగతి పరీక్షలు ఈ నెల 17 నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 9.30 నుంచి 12.15 వరకు కొనసాగుతాయి. జిల్లాలో మొత్తం 67 కేంద్రాల్లో జరిగే పరీక్షలకు 10,924 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. ఇందులో 21 కేంద్రాల్లో మాత్రమే డ్యూయల్ డెస్క్‌లు ఉండగా, 9 కేంద్రాల్లో ఒక్క డెస్కు కూడా లేనట్లు సమాచారం. మిగతా వాటిలో బెంచీలు, కుర్చీలు సమకూర్చి పరీక్షలు రాయిస్తున్నారు. ఇంకా కొన్ని కేంద్రాల్లో బయట నుంచి బెంచీలు, కుర్చీలు తీసుకొచ్చేందుకు సిద్ధమవుతున్నారు. కొన్ని కేంద్రాల్లో ఫ్యాన్లు, వెలుతురు, టాయిలెట్లు సరిగా లేకపోగా, మరికొన్ని కేంద్రాల్లో కూర్చోవడానికి అనుకూలంగా లేని లాంగ్, బెంచీలు, కుర్చీలపైనే నడుముల నొప్పి వస్తున్నా విద్యార్థులు పరీక్షలు రాయాల్సి ఉంటుంది. రవాణా సౌకర్యాలు లేనప్పుడు సమయానికెలా రావాలి? జిల్లాలో చాలా గ్రామాలకు బస్సు సౌకర్యాలు లేవు. చాలా మంది విద్యార్థులు ఆటోలు.. అవి లేకుంటే నడుచుకుంటూ పాఠశాలకు వస్తుంటారు. పల్లెటూళ్ల నుంచి వచ్చే ఆటోల డ్రైవర్లు సామర్థ్యాని కనుగుణంగా ప్రయాణికులు నిండితేగాని ఆటోను నడపరు. కొంత మంది విద్యార్థులు పొలాల గట్లపై.. వాగులు వంకలు దాటుతూ బడికి రావాల్సి ఉంటుంది. ఎండాకాలం కావడంతో భానుడి భగభగలు అప్పుడే ప్రారంభమయ్యాయి. జంబ్లింగ్ విధానం ప్రవేశపెట్టాక పరీక్ష కేంద్రాలను చదివే బడిలో కాకుండా పొరుగు బడుల్లో నిర్వహిస్తున్నారు. అక్కడకు బస్సు సౌకర్యాలు కూడా లేవు. ఇవన్నీ సమస్యలు పట్టించుకోకుండా 5 నిమిషాల నిబంధన విధించడం సరికాదని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు వాపోతున్నారు. కాపీయింగ్‌కు నిమిషం నిబంధనలకు సంబంధమేమిటి? మాస్ కాపీయింగ్‌కు, నిమిషం నిబంధనకు సంబంధం లేదని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయ వర్గాలు అంటున్నాయి. మాస్ కాపీయింగ్, మాల్‌ప్రాక్టీస్‌ను అరికట్టేందుకు నిమిషం నిబంధన విధించినట్లు ఇంటర్ బోర్టు ప్రకటించడం హాస్యాస్పదం, అమానవీయం అంటున్నారు. కాపీయింగ్‌కి నిమిషం నిమింధనకు పొంతనలేనిదని పేర్కొంటున్నారు. రెండు నిమిషాలు ఆలస్యమైతే రెండు మార్కులు పోతాయనే నెపంతో పూర్తి పరీక్ష రాయకుండా చేయడమేమిటని ప్రశ్నిస్తున్నారు. ఇంటి వద్ద మగవాళ్లే లేరు.. ఎలా రావాలి మాది పాపన్నపేటకు 5 కి.మీ. దూరంలోని రామతీర్థం. బస్సు సౌకర్యం లేకపోవడంతో ఆటోలో.. ఒక్కోసారి నడిచి వస్తుంటాను. ఇప్పుడు పరీక్ష కోసం పాపన్నపేట వరకు నడిచి వచ్చి అక్కడి నుంచి 5 కి.మీ. దూరం బస్సులో ప్రయాణించి, మరో 2 కి.మీ. నడిస్తే గాని కుర్తివాడలో ఉన్న పరీక్ష కేంద్రాన్ని చేరుకోలేం. మా నాన్న జనవరిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. ఇద్దరు అక్కలు.. కనీసం బైక్‌పై వెళదామంటే మగవారే లేరు. – ఎస్. వనజ, రామతీర్థం పొలం గట్లపై 5 కి.మీ. నడవాలి మాది పాపన్నపేటకు 5 కి.మీ దూరంలోని ముద్దాపూర్. మా గ్రామానికి బస్సు సౌకర్యం లేదు. రోజు 5 కి.మీ. ఓ వాగు దాటి పొలం గట్లపై నుంచి పాపన్నపేటకు వచ్చి చదువుకుంటాం. ఇప్పుడు కాలినడకన పాపన్నపేటకు వచ్చి, అక్కడి నుంచి 5 కి.మీ బస్సులో ప్రయాణించి, మరో 2 కి.మీ నడిచి 9.30కల్లా కుర్తివాడ పరీక్ష కేంద్రానికి 5 నిమిషాలు ఆలస్యం కాకుండా వెళ్లాలంటే సాధ్యమేనా? ఎంత ప్రయత్నించినా ఒక్క రోజైనా ఆలస్యం కాదా? 5 నిమిషాల కోసం మా జీవితాన్నే నాశనం చేస్తారా. – పి.శ్వేత. ముద్దాపూర్ సుప్రియది మరో వ్యథ ‘పాపన్నపేట మండలం కొత్తపల్లి ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్న ఘనపురం సుప్రియది మరో వ్యథ. ఈ అమ్మాయిని అన్నారం గ్రామానికి చెందిన వాళ్ల చిన్నాన్న దత్తత తెచ్చుకున్నాడు. ప్రతి రోజు 5 కి.మీ దూరం ప్రయాణించి పాఠశాలకు వచ్చేది. కానీ ఇటీవల దత్తత తెచ్చుకున్న వాళ్ల చిన్నాన్న చనిపోవడంతో ఇంట్లో గొడవలు ఆరంభమై సుప్రియ కామారెడ్డి జిల్లాలోని తన స్వగ్రామమైన కన్నారెడ్డి నుంచి పాఠశాలకు వస్తోంది.అయితే ఆమె పదో తరగతి పరీక్షలు రాయాలంటే కన్నారెడ్డి నుంచి 3 కి.మీ. దూరం కాలినడకన వచచి 50 కి.మీ దూరం బస్సులో ప్రయాణిస్తే గాని పరీక్ష రాయాల్సిన యూసుఫ్‌పేటకు చేరుకోలేని పరిస్థితి’. ఈ అమ్మాయి భవిష్యత్తుకు అగ్ని పరీక్ష పెట్టింది ఎస్సెస్సీ బోర్డు. -
టెన్త్ విద్యార్థి దారుణ హత్య
బెంగళూరులో ఇంటర్ విద్యార్థుల ఘాతుకం యలహంక (కర్ణాటక): బెంగళూరులో 10వ తరగతి, ఇంటర్మీడియట్ విద్యార్థుల మధ్య గొడవ హత్యకు దారితీసింది. యలహంకలో సోమవారం ఉదయం ఈ దారుణం చోటుచేసుకుంది. యలహంకలో ప్రభుత్వ పాఠశాల, కళాశాలలు ఒకే ఆవరణలో ఉన్నాయి. టెన్త్ విద్యార్థి హర్షరాజ్ (15), అతని ఇద్దరు మిత్రుల్ని ఇంటర్ (పీయూసీ) విద్యార్థి స్వస్తిక్, అతని బృందం మాట్లాడాలంటూ.. దగ్గర్లోని బార్ సందు లోకి తీసుకెళ్లారు. అక్కడ వారి మధ్య గొడవ చెలరేగడంతో ఇంటర్ విద్యార్థులు హర్షరాజ్ గుండెల్లో కత్తితో పొడిచారు. దీంతో విద్యార్థి అక్క డే ప్రాణాలొదిలాడు. మరో ఇద్దరు విద్యా ర్థులకు కూడా కత్తి గా యాలయ్యాయి. దీన్ని కొందరు స్థానికులు గమనించి ఇంటర్ విద్యార్థుల పైకి రాళ్లు విసరడంతో ఒకరికి గాయాలయ్యాయి. పోలీసులు ఒకరిని అదుపులోకి తీసుకు ని, మరో ముగ్గురి కోసం గాలిస్తున్నారు. ప్రేమ వ్యవహారమే హత్యకు కారణమని పలువురు చెబుతున్నారు. -
సెల్ఫీ సరదాకు రెండు ప్రాణాలు బలి!
ఘట్కేసర్: సెల్ఫీ సరదా ఇద్దరు విద్యార్థుల ప్రాణాలు బలి తీసుకుంది. హైదరాబాద్ తార్నాకకు చెందిన ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న అవినాశ్, పీడీఎస్ చరణ్, భరత్, వంశీలు గణతంత్ర దినోత్సవం కావడంతో కళాశాలకు సెలవు ఇచ్చారని బయటకు వెళ్లారు. మధ్యాహ్నం సమయంలో విద్యార్థులు వరంగల్ జాతీయ రహదారి ఘట్ కేసర్ సమీపంలో ఉన్న సత్యాపాల్ క్రషర్ లో ఉన్న నీటి గుంత వద్ద కొద్ది సమయం గడిపారు. అక్కడ అవినాశ్, పీడీఎస్ చరణ్‌లు సెల్ఫీ తీసుకుంటుండగా ప్రమాదవశాత్తు నీటి గుంతలో పడిపోయారు. వారిని తోటి విద్యార్థులు రక్షించే లోగానే మృతిచెందారు. విషయాన్ని మృతుల కుటుంబ సభ్యులకు చెప్పడంతో వారు ప్రమాద స్థలికి చేరుకుని కన్నీటి పర్యంతమయ్యారు. -
టు ఇన్ వన్
ఈ ఫొటోలో కన్పిస్తున్న వారు ఓపెన్ టెన్త్, ఇంటర్ విద్యార్థులు.. ఏంటీ ఓకే తరగతి గదిలో టెన్త్, ఇంటర్ అని అలోచిస్తున్నారా..! మీ ఆలోచన నిజమే.. వీరు వేరువేరు తరగతులైనా ఒకే గదిలో కూర్చోబెట్టి అందరికీ ఒకే పాఠం చెబుతున్నారు ఇక్కడి ఉపాధ్యాయులు.. ఇది ఉమ్మడి నల్లగొండ జిల్లా ఓపెన్‌స్కూల్ విధానం అమలు తీరుకు నిదర్శనం. మిర్యాలగూడ : బడికి వెళ్లకుండా నేరుగా పదో తరగతి, ఇంటర్మీడియట్ చదివేందుకు ప్రభుత్వం ఓపెన్ స్కూల్ పేరుతో చేపట్టిన కార్యక్రమం అస్తవ్యస్తంగా మారింది. కేవలం సెలవు రోజుల్లో మాత్రమే నిర్వహించే ఈ తరగతులు అడపాదడపా జరుగుతున్నాయి. విద్యార్థులు వచ్చినా బోధించడానికి ఉపాధ్యాయులు రావడంలేదు. ఒక వేళ వచ్చినా టెన్త్, ఇంటర్ విద్యార్థులను ఒకే గదిలో ఉంచి పాఠాలు బోధిస్తున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఓపెన్ స్కూల్స్ కార్యక్రమంలో భాగంగా 2016–17 విద్యా సంవత్సరంలో పదో తరగతికి 74 కేంద్రాలు, ఇంటర్మీడియట్‌కు 69 కేంద్రాలు ఉన్నాయి. కాగా పదో తరగతిలో 3200 మంది , ఇంటర్లో 2400 మంది అడ్మిషన్లు పొందారు. వీరికి 2016 సెప్టెంబర్ మొదటి వారంలో తరగతులు ప్రారంభమయ్యాయి. ఓపెన్ స్కూల్లో అడ్మిషన్లు పొందిన వారికి సెలవు రోజుల్లో మాత్రమే విద్యాబోధన చేస్తారు. ఏడాదికి 30 రోజుల పాటు తరగతులు నిర్వహించాల్సి ఉంది. కాగా విద్యార్థులు కనీసం 24 రోజుల పాటు తరగతులకు హాజరుకావాల్సి ఉంది. ఇందులో పాఠాలు బోధించే రెగ్యులర్ ఉపాధ్యాయుడికి మాత్రం టెన్త్‌కు ఒక తరగతికి 60 రూపాయలు, ఇంటర్‌కు 120 రూపాయలు చెలిస్తున్నారు. కాగా విద్యార్థులు హాజరు కావడంలేదు. అదే సాకుతో ఉపాధ్యాయులు కూడా తరగతులు నిర్వహించడం లేదు. ఒక వేళ విద్యార్థులు వచ్చినా ఒకే తరగతి గదిలో బోధిస్తున్నారు. నేటికీ అందని పాఠ్యపుస్తకాలు ఓపెన్ స్కూల్లో చదివే పదో తరగతి, ఇంటర్మీడియట్ విద్యార్థులకు ప్రభుత్వం పాఠ్యపుస్తకాలు అందించాల్సి ఉంది. అడ్మిషన్ల సమయంలో పదో తరగతి విద్యార్థులు 800 రూపాయలు, ఇంటర్మీడియట్ విద్యార్థులు 1100 రూపాయలు చెల్లించారు. కానీ వీరికి ఇప్పటి వరకు పాఠ్యపుస్తకాలు అందించలేదు. ఉపాధ్యాయులు చెప్పే పాఠాలు అర్థం కాక నానా ఇబ్బందులు పడుతున్నారు. కొంత మంది విద్యార్థులు గత ఏడాదిలో పూర్తి చేసిన వారి వద్ద ఉన్న పాత పుస్తకాలు తీసుకుని చదువులు కొనసాగిస్తున్నారు. సమీపిస్తున్న పరీక్షలు ఓపెన్ స్కూల్ విద్యార్థులకు కూడా సాధారణ పరీక్షల సమయంలోనే ఎగ్జామ్స్ నిర్వహిస్తారు. పదో తరగతి, ఇంటర్మీడియట్ విద్యార్థులకు కూడా మార్చి మాసంలోనే పరీక్షలు నిర్వహిస్తారు. పరీక్షలు సమీపిస్తున్నప్పటికీ ఇప్పటి వరకు పాఠ్యపుస్తకాలు లేకపోవడం వల్ల ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఏడాది ఓపెన్ స్కూల్ విద్యార్థులకు కూడా సీసీ కెమెరాల నిఘాలో పరీక్షలు నిర్వహించే అవకాశం ఉన్నందున ఇప్పటి వరకు పాఠ్యపుస్తకాలు అందక పరీక్షలు ఎలా రాయాలని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ఉపాధ్యాయులు రావడం లేదు బకల్వాడ పాఠశాలలో ఓపెన్ టెన్త్ చదువుతున్నాను. నాలుగు వారాలుగా ఉపాధ్యాయులు బోధించడం లేదు. పాఠశాలకు వచ్చి ఖాళీగా వెళ్తున్నాము. ఉపాధ్యాయులు వస్తే ఇంటర్, టెన్త్ వారికి కలిపి ఒకే తరగతిలో కూర్చోబెట్టి బోధిస్తున్నారు. టెన్త్ ఇంటర్‌కు అవసరం లేకున్నా కూర్చోవాల్సి వస్తోంది. – చాంద్‌పాష, విద్యార్థి, ఓపెన్ టెన్త్, మిర్యాలగూడ పరీక్షలు సమీపించాయి పరీక్షలు మరో రెండు మాసాల్లో జరగనున్నాయి. ఇప్పటి వరకు పాఠ్యపుస్తకాలు ఇవ్వలేదు. ఉపాధ్యాయులను అడిగితే పుస్తకాలు రాలేదని చెబుతున్నారు. పరీక్షల్లో ఎలా రాయాలో అర్థం కావడం లేదు. ఇప్పటి వరకు పుస్తకాలు ఇవ్వకపోవడం వల్ల ఏమి చదవాలో అర్థం కావడం లేదు. – మౌనిక, విద్యార్థిని, ఓపెన్ ఇంటర్, మిర్యాలగూడ పాఠ్యపుస్తకాలు ఇవ్వలేదు పరీక్షలు సమీపిస్తున్నప్పటికీ ఇప్పటి వరకు పాఠ్యపుస్తకాలు ఇవ్వలేదు. గత ఏడాదిలో పూర్తి చేసిన వారి వద్ద నుంచి పుస్తకాలు తెచ్చుకొని చదువుతున్నాము. అవి కూడా పూర్తిగా లేవు. పుస్తకాలు లేకుండా పరీక్షలు ఎలా రాయాలో అర్థం కావడం లేదు. ఉపాధ్యాయులను పాఠ్యపుస్తకాల గురించి అడిగినా రాలేదనే సమాధానం చెబుతున్నారు. – ఇందిరాప్రియదర్శిని, విద్యార్థిని, ఓపెన్ టెన్త్, మిర్యాలగూడ -
ఇంటర్ విద్యార్థుల ప్రేమపెళ్లి
సోమందేపల్లి (పెనుకొండ) : సోమందేపల్లి మండల కేంద్రానికి చెందిన ఇద్దరు ఇంటర్మీడియట్ విద్యార్థినీ విద్యార్థులు ఐదు రోజుల కిందట ఇంటి నుంచి పారిపోయి మైసూరులో ప్రేమ పెళ్లి చేసుకున్నారు. సోమవారం స్వస్థలానికి తిరిగి వచ్చి పోలీసులను ఆశ్రయించారు. వీరిద్దరూ మైనర్లు కావడంతో తల్లిదండ్రులకు పోలీసులు కబురు పంపారు. అయితే వీరిని ఇళ్లకు తీసుకెళ్లడానికి వారు నిరాకరించారు. దీంతో పోలీసులు అబ్బాయిపై ఐపీసీ 366ఏ సెక్షన్ కింద కేసు నమోదు చేసి, కోర్టులో హాజరుపరచగా మెజిస్ట్రేట్ రిమాండ్‌కు ఆదేశించారు. బాలికను అనంతపురంలోని బాలికల సంరక్షణ కేంద్రానికి పంపించారు. -
ఇంటర్ విద్యకు కాంట్రాక్టు సెగ
► 16 రోజులుగా విధులు బహిష్కరించిన కాంట్రాక్టు లెక్చరర్లు ► దగ్గర పడుతున్న పరీక్షలు విద్యార్థుల్లో ఆందోళన నర్సీపట్నం/పాడేరు: కాంట్రాక్టు లెక్చరర్ల సమ్మె ప్రభావం ఇం టర్ విద్యార్థులపై పడింది. పదేళ్ల క్రితం కాంట్రాక్టు ప్రాతిపదికన విధుల్లో చేరిన లెక్చరర్లు అప్పటి నుంచి నేటికీ అదే విధానంలో కొనసాగుతున్నారు. తమను పర్మినెంట్ చేయాలని గతంలో పలుమార్లు వీరంతా ఆందోâýæన చేపట్టిన సమయంలో నేతలు ఇచ్చిన హామీలు ఇంతవరకూ అమలు కాలేదు. చివర కు తాడో పేడో తేల్చుకోవాలని భావించిన లెక్చరర్లు ఎట్టకేలకు ఈ నెల 2 నుంచి సమ్మె నోటీసు ఇచ్చి విధులు బహిష్కరించా రు. 16 రోజులుగా వివి ధ రూపాల్లో నిరసనలు తెలియజేస్తున్నా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ప్రభుత్వ కళాశాలల్లో ఇటువంటి పరిస్థితి నెల కొన్న నేపథ్యంలో తరగతులు అన్నీ దాదాపుగా నిలిచిపోయాయి. ఫిబ్రవరి 3 నుంచి ప్రాక్టికల్స్ పరీక్షలు, మార్చి 1 నుంచి థియరీ పబ్లిక్ పరీక్షలు జరగనున్నా యి. ఈ దశలో లెక్చరర్లంతా సమ్మె చేపట్టడంతో ఏం చేయాలో పాలుపోక విద్యార్థులు తలలు పట్టుకుంటున్నారు. కనీసం విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నప్పటికీ ఆ దిశగా చర్యలు చేపడుతున్నట్లు లేదు. స్తంభించిన తరగతులు జిల్లాలో ప్రభుత్వ కళాశాలలు 36 ఉన్నాయి. ఈ కళాశాలల్లో 18 వేల మంది విద్యార్థుల వరకు చదువుతున్నారు. 138 ప్రభుత్వ లెక్చరర్లు, 305 కాంట్రాక్టు లెక్చరర్లు పని చేస్తూ విద్యాబోధన కొనసాగిస్తున్నారు. కొ న్ని కళాశాలల్లో ప్రిన్సిపాల్ మినహా మిగిలిన వారంతా కాంట్రాక్టు లెక్చరర్లతోనే కొనసాగిస్తున్నారు. కళాశాల ల కు రాకుండా ఆందోâýæన కార్యక్రమాలు చేపడుతున్నారు. తాడోపేడో తేల్చుకుంటాం గతంలో ఇచ్చిన హామీ మేరకు కాంట్రాక్టు లెక్చరర్లందర్నీ పర్మినెం ట్ చేసి, జీతాలు పెంచాలి. దీనిపై అప్పటికే ఆందోâýæనలు చేయడంతో ప్రభుత్వం ఈ హామీ ఇచ్చింది. దీన్ని తక్షణమే పరిష్కరిం చని పక్షంలో విధుల్లో చేరే ప్రసక్తి లేదు. –శర్మ, కాంట్రాక్టు లెక్చరర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు విద్యాబోధన కుంటుపడుతోంది కాంట్రాక్టు లెక్చరర్ల సంఖ్య ఎక్కువగా ఉండటం వల్ల తరగతుల నిర్వహణ కష్టంగా ఉంది. ఇదే పరిస్థితి కొనసాగితే దీని ప్రభావం విద్యాబోధనపై పడే అవకాశం ఉంది. దీన్ని పరిగణనలోకి తీసుకుని తక్షణమే వీరి సమస్యలను పరిష్కరించాలి. –జి. చిన్నారావు, జిల్లా అధ్యక్షుడు, ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ల అసోసియేషన్ -
ఇంటర్ ఫీజు 21 దాకా కట్టొచ్చు
పరీక్ష ఫీజుల చెల్లింపుపైనా పెద్ద నోట్ల రద్దు ప్రభావం సాక్షి, హైదరాబాద్: పెద్ద నోట్ల రద్దు ప్రభావం పరీక్ష ఫీజులు చెల్లించే విద్యార్థులపైనా పడింది. బ్యాంకుల నుంచి డబ్బులు డ్రా చేయలేక ఇంటర్ విద్యార్థుల్లో చాలామంది ఇంకా పరీక్ష ఫీజు చెల్లించలేకపోయారు. సాధారణ గడువులోగా, అంటే ఈ నెల 4వ తేదీలోగా ఫీజు చెల్లించిన వారికి సమస్య తలెత్తకపోరుునా ఆలస్య రుసుముతో చెల్లించేవారు ఇబ్బందులు పడుతున్నారు. రూ.100 ఆలస్య రుసుముతో ఫీజు చెల్లింపు గడువు ఈ నెల 14తో ముగిసింది. కానీ ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర విద్యార్థుల్లో 15 శాతం మంది ఇంకా ఫీజు చెల్లించలేదు. ఈ నేపథ్యంతో రూ.100 ఆలస్య రుసుముతో ఫీజు చెల్లింపు గడువును ఈ నెల 21 వరకు పొడిగించినట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్ మంగళవారం తెలిపారు. రాష్ట్రంలోని అన్ని జూనియర్ కాలేజీల ప్రిన్సిపళ్లు ఆలస్య రుసుముతో ఫీజును స్వీకరించాలని, ఆ మొత్తాన్ని 22న మొత్తాన్ని బోర్డుకు పంపాలని సూచించారు. రూ. 50 ఆలస్య రుసుముతో టెన్త ఫీజు చెల్లింపు అవకాశం మార్చిలో జరిగే పదో తరగతి పరీక్షలకు ఈ నెల 23వ తేదీ వరకు రూ.50 ఆలస్య రుసుముతో ఫీజు చెల్లించవచ్చని ప్రభుత్వ పరీక్షల విభాగం డెరైక్టర్ సురేందర్‌రెడ్డి తెలిపారు. రూ.200 ఆలస్య రుసుముతో డిసెంబరు 1 దాకా, రూ.500 ఆలస్య రుసుముతో డిసెంబర్ 9 దాకా చెల్లించవచ్చన్నారు. ఆలస్య రుసుము లేకుండా ఫీజు గడువు అక్టోబరు 31తో ముగియగా విద్యార్థుల విజ్ఞప్తి మేరకు నవంబర్ 15 దాకా పొడిగించారు. ఆ గడువూ ముగిసినా మరో 10 శాతం విద్యార్థులు ఫీజు చెల్లించాల్సి ఉంది. -
23లోగా కళాశాలల వివరాలు పంపాలి
ఆదిలాబాద్ టౌన్ : 2016–17 విద్యా సంవత్సరానికి ప్రథమ సంవత్సరం ప్రవేశాల కోసం లాగిన్ అవడానికి సంబంధిత ధ్రువీకరణ పత్రాలను ఆర్ఐవో కార్యాలయంలో ఈ నెల 23లోగా సమర్పించాలని ఇంటర్మీడియెట్ బోర్డు ప్రాంతీయ పర్యవేక్షకుడు నాగేందర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ వివరాలను ఇంటర్ బోర్డుకు పంపాల్సి ఉంటుందని, వివరాలు సమర్పించని వారికి అడ్మిషన్ లాగిన్ ఇవ్వబోమని తెలిపారు. కళాశాలల్లో సీసీ కెమెరాలను అమర్చాలని తెలిపారు. అక్టోబర్‌లో బోర్డు ప్రతినిధులు ప్రతి కళాశాలను పరిశీలిస్తారని పేర్కొన్నారు. -
ఇంటర్ విద్యార్థి ఆత్మహత్యాయత్నం
హైదరాబాద్ : కళాశాల ప్రిన్సిపాల్ వేధింపులు తట్టుకోలేక ఓ విద్యార్థి ఆత్మహత్యాయత్నం చేశాడు. వనస్థలిపురం నాగార్జుననగర్ కాలనీలో శనివారం ఈ ఘటన చోటుచేసుకుంది. ఇంటర్ చదుతున్న ప్రదీప్ శనివారం ఉదయం యాసిడ్ తాగి ఆత్మహత్యకు యత్నించాడు. గమనించిన కుటుంబసభ్యులు అతడిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ప్రదీప్ పరిస్థితి విషమంగా ఉంది. అయితే తన చావుకు శ్రీమేథ కళాశాల ప్రిన్సిపాల్ వేధింపులే కారణమంటూ అతడు స్నేహితుల సెల్ఫోన్లకు మెసేజ్‌లు పంపాడని సమాచారం. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
సీబీఎస్ఈకి ఇంటర్ విద్యార్థుల మార్కులు
సాక్షి,హైదరాబాద్: రాష్ట్రంలో ఇంటర్ పూర్తిచేసిన విద్యార్థుల మార్కుల వివరాలతో కూడిన సీడీని ఇంటర్‌బోర్డు సీబీఎస్ఈకి గురువారం పంపింది. జేఈఈ ఆలిండియా ర్యాంకులను ఖరారు చేసేందుకు ఈ సీడీని అందించింది. జేఈఈ మెయిన్స్ కోర్కు 60% వెయిటేజీ, ఇంటర్ మార్కుల స్కోరుకు 40% వెయిటేజీ ఇచ్చి పర్సంటైల్ నార్మలైజ్ చేసి ఆల్ఇండియా జేఈఈ మెయిన్ర్యాంకులను ఖరారు చేస్తుంది. వీటి ఆధారంగానే ఎన్ఐటీ, ఐఐఐటీలలో ప్రవేశాలను చేపడతారు. ఈ ర్యాంకులను ఈ నెల 30న లేదా అంతకంటే ముందే సీబీఎస్ఈ ప్రకటించనుంది. ఐఐటీల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష ఆలిండియా ర్యాంకులను ఈ నెల 12న విడుదల చేసేందుకు ఐఐటీ గువాహటి చర్యలు చేపట్టింది. -
ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య
సంబేపల్లె: చెంచురెడ్డిగారిపల్లెకు చెందిన పూజిత(16) అనే ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థిని తక్కువ మార్కులు వచ్చాయని మనస్థాపంతో ఆత్మహత్య చేసుకుంది. సంబేపల్లె జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న అమరనాథరెడ్డి, వెంకటేశ్వరమ్మ రెండవ కుమార్తె పూజిత. విజయవాడ చైతన్య కాలేజీలో ఇంటర్ బైపీసీ ఫస్ట్ ఇయర్ పూర్తి చేసింది. మంగళవారం విడుదలైన ఫలితాల్లో 440కి గాను 406 మార్కులు వచ్చాయి. ఇతరుల కంటే తనకు తక్కువ మార్కులు వచ్చాయని విష ద్రావణం తాగింది. కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందింది. -
470కి 406 మార్కులే వచ్చాయని..
కడప: ఇవ్వాళ ఇంటర్ పరీక్షా ఫలితాలు వచ్చాయి. ఫస్ట్ ఇయర్ పూర్తిచేసిన పూజిత మంచి మార్కులతో పాసైంది. 470కిగానూ ఆమెకు 406 మార్కులు వచ్చాయి. మామూలు పిల్లలైతే ఎగిరి గంతేసి ఎంజాయ్ చేసేవారు. కానీ పూజిత అలా చెయ్యలేదు. సెంట్ పర్సెంట్ కు 64 మార్కులు తక్కువొచ్చాయే అని బాధపడింది. ఎందుకంటే ఆమె టీచర్ల బిడ్డమరి! అవును. పూజిత తల్లిదండ్రులిద్దరూ టీచర్లు. ఇంకా చెప్పాలంటే సొంతంగా చేతగాక పిల్లల ర్యాంకులతో 'హోదా' కోరుకునే సోకాల్డ్ 'చైల్డ్ లవింగ్' పేరెంట్స్. పిల్లలు బాగా చదవాలని కోరుకోవడంలో తప్పులేదు. కానీ మార్కుల రేసులో పిల్లల్ని పరుగెత్తించడం తప్పు. ఇప్పుడు పూజిత ఈ లోకంలో లేదు. తక్కువ మార్కులు వచ్చాయని తల్లిదండ్రులు దండించడంతో పురుగుల మందుతాగి ప్రాణాలు వదిలింది. వైఎస్సార్ కడప జిల్లాలోని సంబేపల్లిలో అమరనాథ్ రెడ్డి దంపతులు టీచర్లుగా పనిచేస్తున్నారు. వారికి ఇద్దరు కుమార్తెలు. పెద్దమ్మాయి మంచి మార్కులు సాధిస్తూ చదువుల్లో ముందుకు వెళుతోంది. చిన్నమ్మాయి పూజిత కూడా తెలివైన విద్యార్థినే. ఇంటర్ మొదటిసంవత్సరం పరీక్షలు రాసింది. మంగళవారం వాటి ఫలితాలు విడుదల అయ్యాయి. పూజితకు 470 మార్కులకు 406 మార్కులు వచ్చాయి. ఆమెకు వచ్చిన మార్కులతో తల్లిదండ్రులు సంతృప్తి పడలేదు. పెద్ద కూతురి మార్కులతో పోల్చుతూ పూజితను అవమానించారు. మనస్తాపం చెందిన ఆ చదువుల తల్లి పురుగుల మందు తాగి ఆత్మహత్య పాల్పడింది. ఇది గమనించిన తల్లిదండ్రులు ప్రాణాపాయంలో ఉన్న పూజితను సంబేపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కానీ చికిత్స చేస్తుండగానే ఆ విద్యార్థిని ప్రాణాలు వదిలింది. ఈ సంఘటన స్థానికులను కంటతడి పెట్టించింది. టీచర్ కుటుంబంలోనే ఇలాంటి సంఘటన జరగటం చర్చనీయాంశం అయింది. -
ఇదో రకమైన ‘పరీక్ష’!
♦ ఆటో బోల్తా, 19 మంది ఇంటర్ విద్యార్థులకు గాయాలు ♦ ఒకరి పరిస్థితి విషమం ♦ గాయాలతోనే పరీక్షలు రాసిన 18 మంది మిరుదొడ్డి: ఆటో బోల్తా పడగా 19 మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. మిగిలిన 18 మంది విద్యార్థులు గాయాలతోనే పరీక్షలు రాయాల్సి వచ్చింది. ఈ ఘటన మెదక్ జిల్లా మిరుదొడ్డి మండలం పెద్ద చెప్యాలలో సోమవారం చోటుచేసుకుంది. దౌల్తాబాద్ మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియెట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు మిరుదొడ్డిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల, తెలంగాణ మోడల్ స్కూలులో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో సోమవారం దౌల్తాబాద్ నుంచి పరీక్షలు రాయడానికి 19 మంది విద్యార్థులు ఆటోలో మిరుదొడ్డికి బయలుదేరారు. పెద్ద చెప్యాల రాజీవ్ గాంధీ చౌరస్తా మూల మలుపు వద్దకు రాగానే ఆటో అదుపు తప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో చేగుంట మండలం గోవిందాపూర్‌కు చెందిన సతీశ్‌కుమార్‌కు నడుము భాగంతో పాటు రెండు కాళ్లు విరిగిపోయాయి. గాయాలతోనే పరీక్షలు 18 మంది విద్యార్థులు గాయాలను భరిస్తూనే ఇంటర్ సెకండియర్ పరీక్షను రాశారు. పరీక్షలు రాసిన అనంతరం స్థానిక పీహెచ్‌సీకి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. గాయాలతోనే పరీక్షలు రాసిన విద్యార్థుల పరిస్థితిని చూసిన ప్రతి ఒక్కరూ చలించిపోయారు. తరలి వచ్చిన ఇంటర్ బోర్డు అధికారులు ప్రమాదం జరిగిన విషయం తెలుసుకున్న ఇంటర్మీడియెట్ బోర్డు అధికారులు డా. నాగమణి రత్నం, డా. నర్సింహులు హైదరాబాద్ నుంచి మిరుదొడ్డిలోని పరీక్షా కేంద్రాలను సందర్శించారు. జరిగిన ప్రమాదం గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. దౌల్తాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పరీక్షా కేంద్రం ఏర్పాటు చేస్తే ఇలాంటి సంఘటన జరగకుండా ఉండేదని విద్యార్థులు అధికారుల దృష్టికి తెచ్చారు. వచ్చే ఏడాదికి దౌల్తాబాద్‌లోనే పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేసేలా నివేదికలు అందిస్తామని బోర్డు సభ్యులు తెలిపారు. -
ఆటో బోల్తా: 9 మంది విద్యార్థులకు గాయాలు
రామాయంపేట (మెదక్) : ఇంటర్ పరీక్ష రాసి ఆటోలో ఇళ్లకు వెళుతున్న విద్యార్థులు ప్రమాదానికి గురయ్యారు. మెదక్ జిల్లా రామాయంపేట శివారులో మంగళవారం మధ్యాహ్నం ఈ ఘటన చోటుచేసుకుంది. బాధితుల కధనం మేరకు... మండలంలోని కల్వకుంట గ్రామానికి చెందిన కొందరు విద్యార్థినీ విద్యార్థులు రామాయంపేటలోని సాయికృప, స్నేహ కళాశాలల్లో చదువుకుంటున్నారు. వారంతా మంగళవారం పరీక్ష రాసి మధ్యాహ్నం తిరిగి ఆటోలో బయలుదేరారు. వారు ప్రయాణిస్తున్న ఆటో రామాయంపేట శివారులో ప్రమాదవశాత్తు బోల్తా పడింది. ఈ ఘటనలో ఏడుగురు బాలికలు, ఇద్దరు బాలురు గాయపడ్డారు. ప్రమాద సమయంలో ఒక విద్యార్థి ఆటో నడుపుతున్నట్లు సమాచారం. క్షతగాత్రులను రామాయంపేటలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. -
అల్పహారం వికటించి విద్యార్థినులకు అస్వస్థత
కృష్ణాజిల్లా: విజయవాడ గుణదలలోని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ వసతి గృహంలో ఆహారం వికటించి ఇంటర్ విద్యార్థినులు అనారోగ్యానికి గురయ్యారు. సోమవారం ఉదయం వడ్డించిన అల్పాహారం తిన్న విద్యార్థినుల్లో 11 మందికి వాంతులు, విరేచనాలతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వారిని వెంటనే ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందించారు. విద్యార్థినులకు ఎటువంటి అపాయం లేదని వైద్యులు తెలిపారు. -
ముందే బుక్లెట్ లాక్కున్నారు
* ఇంటర్ విద్యార్థులు ఆవేదన * వనస్థలిపురం మాస్టర్ మైండ్ కాలేజీలో ఘటన సాక్షి, హైదరాబాద్: ‘పరీక్షకు సకాలంలో చేరుకోవాలి. నిమిషం ఆలస్యమైనా పరీక్ష రాయడానికి అనుమతించం’ అనే నిబంధన బాగానే ఉంది. కానీ ఈ నిబంధన సమాధాన పత్రాలు తీసుకునే ముందు వర్తించదా? అని ఇంటర్ విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు. గురువారం జరిగిన ఇంటర్ పరీక్షలో సమయం ముగియక ముందే సమాధానాల బుక్లెట్ని ఇన్విజిలేటర్ లాక్కున్నాడు. ఈ ఘటన వనస్థలిపురంలోని మాస్టర్ మైండ్ జూనియర్ కళాశాల సెంటర్లో జరిగింది. తమకు జరిగిన అన్యాయం గురించి బాధిత విద్యార్థులు ‘సాక్షి’ కి చెప్పారు. సెకండ్ లాంగ్వేజ్ కాబట్టి సరిపోయింది.. ఇతర సబ్జెక్టులైతే తమ పరిస్థితి ఏంటని నిలదీస్తున్నారు. ఈ ఘటనపై రంగారెడ్డి జిల్లా తూర్పు ఆర్ఐఓ హన్మంత్‌రెడ్డిని వివరణ అడగగా.. ‘నిర్దిష్ట సమయం పూర్తికాకముందే బుక్లెట్ లాక్కోవడం క్షమించరాని విషయం. ఈ ఘటనపై విచారణ చేసిన తర్వాత ఇన్విజిలేటర్‌పై చర్యలు తీసుకుంటా’మని సమాధానమిచ్చారు. -
పెళ్లికి పెద్దలు ఒప్పుకోరని ప్రేమజంట ఆత్మహత్య
డిచ్పల్లి (నిజామాబాద్ జిల్లా): డిచ్పల్లి మండలం కమలాపూర్ శివారులో మంగళవారం ఓ ప్రేమజంట ఆత్మహత్య చేసుకుంది. మండలంలోని నర్సింగ్‌పూర్ గ్రామానికి చెందిన అజ్జం నర్సయ్య-వినోద కూతురు శిరీష(17), సిరికొండ మండలం రావుట్ల గ్రామానికి చెందిన ఇట్టెంపేట రాజేందర్-లక్ష్మిల పెద్ద కొడుకు సాయిరాం (18)లు ఎనిమిది నెలలుగా ప్రేమించుకుంటున్నారు. ఇద్దరూ వేర్వేరు కళాశాలల్లో ఇంటర్ ఫస్టియర్ చదువుతున్నారు. వీరి ప్రేమ విషయం తెలిసిన ఇరువైపు కుటుంబాలవారు చిన్న వయసులోనే పెళ్లి చేసుకుంటే ఇబ్బందులు పడతారని అడ్డు చెప్పారు. తమ పెళ్లి పెద్దలు అంగీకరించరేమోనని భావించిన ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. సోమవారం బంధువుల పెళ్లి ఉందని రెండు కుటుంబాల వారు డిచ్పల్లి మండలం రాంపూర్ గ్రామానికి వెళ్లారు. పరీక్షలు ఉండటంతో శిరీష ఇంటి వద్దనే ఉంది. బైక్‌పై నర్సింగ్‌పూర్‌కు వచ్చిన సాయిరాం ఎస్సీ కాలనీలో బైక్‌ను పెట్టి, శిరీష ఇంటికి చేరుకున్నాడు. గ్రామస్తులు బైక్‌ను గమనించి గ్రామ పంచాయతీ ఆవరణలో పెట్టారు. దీంతో సాయిరాం, శిరీషలు మంగళవారం వేకువ జామున సుమారు 3.30 గంటల సమయంలో కమలాపూర్ గ్రామ శివారులోని స్మశాన వాటికకు కాలినడకన చేరుకున్నారు. అక్కడ వేపచెట్టుకు తమ వెంట తెచ్చుకున్న తాడుతో ముందుగా శిరీష ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తర్వాత సాయిరాం అదే చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాలను గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందజేశారు. ఘటనా స్థలాన్ని సందర్శించిన పోలీసులు మృతుడి జేబులో ఉన్న సెల్‌ఫోన్ ద్వారా వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. -
ఇంటర్ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి
ఇంటర్ విద్యార్థులకు కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. మరో నాలుగు రోజుల్లో జరగనున్న పరీక్షలకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లూ దాదాపు పూర్తి చేశారు. జిల్లా వ్యాప్తంగా 47,778 మంది విద్యార్థులు హాజరుకావాల్సి ఉండగా, వారి కోసం 66 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఎన్నడూ లేనివిధంగా ఈ సారి జీపీఎస్ విధానం అనుసంధానం చేశారు. దీంతో పరీక్ష తీరుతెన్నులన్నీ ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు గమనించవచ్చు. విద్యార్థులకు ఇబ్బంది లేకుండా రవాణా సౌకర్యం ఏర్పాటు చేస్తున్నారు. మార్చి 2 నుంచి 21 వరకు పరీక్షలు విజయనగరం అర్బన్: ఇంటర్మీడియట్ పరీక్షలకు ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి. మార్చి రెండు నుంచి జరగనున్న వార్షిక పరీక్షలకు సంబంధించిన ఏర్పాట్లలో అధికారులు నిమగ్నమయ్యూరు. పరీక్ష కేంద్రాల ఏర్పాటు, నిర్వహణ, సాధారణ, సమస్యాత్మకం, అతి సమస్యాత్మకం పరీక్ష కేంద్రాల గుర్తింపు, నిఘా పెంపు వంటి అంశాలపై దృష్ణి సారించారు. దూరప్రాంతాల విద్యార్థులు ఇబ్బందులు పడకుండా ఆర్టీసీ అధికారులతో చర్చించి రవాణా సౌకర్యం ఏర్పాటు చేస్తున్నారు. మార్చి 2 నుంచి 21 వరకు ఉదయం తొమ్మిది నుంచి 12 గంటల వరకు పరీక్షలు జరగనున్నారుు. 66 కేంద్రాలు జిల్లా వ్యాప్తంగా 66 కేంద్రాలలో పరీక్షలు నిర్వహించనున్నారు. ప్రథమ, ద్వితీయ సంవత్సరాలకు సంబంధించి 47,773 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. వీరిలో మొదటి సంవత్సరం విద్యార్థులు 24,062 మంది ( జనరల్: 21,705, ఒకేషనల్: 2,357 మంది) ఉన్నారు. ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 20,455 మంది ( జనరల్: 18,808, ఒకేషనల్: 1,647 ), ప్రైవేటు విద్యార్థులు 3,256 మంది (జనరల్: 3,078. ఒకేషనల్: 178 ) ఉన్నారు. ఈ పరీక్షలు జంబ్లింగ్ విధానంలోనే జరగనున్నాయి. పక్కగా నిర్వహణ ఇంటర్ పరీక్షలను పక్కాగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. గతేడాది 68 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించగా అందులో ఐదింటిని రద్దు చేసి కొత్తగా మూడు కేంద్రాలను మాత్రమే ఎంపిక చేశారు. దీంతో 66 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించనున్నారు. జీపీఎస్‌కు అనుసంధానం... పరీక్ష కేంద్రాలను జీపీఎస్‌తో అనుసంధానం చేస్తున్నారు. దీంతో పరీక్ష జరుగుతున్న తీరు, పర్యవేక్షకుల పనితీరు ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు పరిశీలించవచ్చు. అలాగే ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న తొమ్మిది కేంద్రాలను సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించారు. పాచిపెంట మండలం పి.కోనవలస గిరిజన కళాశాలలో నిఘా కెమెరాలను ఏర్పాటు చేస్తున్నామని ఇంటర్మీడియట్ ప్రాంతీయ తనిఖీ అధికారి విజయలక్ష్మి చెప్పారు. పరీక్ష కేంద్రాలు ప్రభుత్వ కళాశాలు-21, ఎయిడెడ్ కళాశాలలు-05, మోడల్ పాఠశాలలు-04, ఏపీఎస్‌డబ్లూఆర్ జూనియర్ కళాశాలలు-05, గిరిజన కళాశాలలు -04, ఏపీ గురుకుల కళాశాలలు-01, ప్రైవేటు అన్ అయిడెడ్ జూనియర్ కళాశాలలు-26 ఉన్నాయి. పరీక్షల నిర్వహణలో 145 మంది సిబ్బంది పాల్గొంటారు. -
ఇంటర్మీడియెట్‌లో ‘ఫ్రీ ఫ్లో’
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన నేపథ్యంలో అనేకమంది ఇంటర్ విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యకు ఇంటర్మీడియెట్ బోర్డు ‘ఫ్రీ ఫ్లో’ ద్వారా పరిష్కారాన్ని చూపింది. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ, ఏపీప్రాంతాల్లో ఇంటర్ ఫస్టియర్ చదివిన విద్యార్థులు రాష్ట్ర విభజనతో ఇబ్బందుల్లో పడ్డారు. ఫస్టియర్ ఎక్కడ చదివారో సెకండియర్ కూడా అదే రాష్ట్రం బోర్డు నుంచి రాయాలి. రాష్ట్ర విభజనతో మొదటి సంవత్సరం చదివిన ఏపీలోని విద్యార్థులు తెలంగాణకు, తెలంగాణలోని విద్యార్థులు ఏపీకి వెళ్లేందుకు ఆస్కారం లేకుండా పోయింది. టెన్త్ వరకు ఒకచోట చదివి ఇంటర్ వేరే చోట చదివినప్పుడు స్థానికతతోపాటు మరిన్ని సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. దీంతో సొంత రాష్ట్రంలో ఇంటర్ సెకండియర్ పరీక్ష రాయాలనుకున్న వారికి కష్టాలు తప్పలేదు. కొంతమంది హైదరాబాద్‌లోని కాలేజీల్లో ఫస్టియర్ చదివి సెకండియర్ ఏపీలోని కాలేజీల్లో చేరడానికి వెళ్లినా మళ్లీ ఫస్టియర్ పరీక్షలు రాయాల్సిందేనని అక్కడి కాలేజీలు స్పష్టం చేశాయి. ఈ వ్యవహారంపై ఏపీ ఇంటర్‌బోర్డు కార్యదర్శి ఎంవీ సత్యనారాయణ, తెలంగాణ ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్‌తో చర్చించారు. ఒక రాష్ట్రం నుంచి వేరేగా కొత్త రాష్ట్ర ఏర్పాటు సమయంలో రెండు రాష్ట్రాల మధ్య ‘ఫ్రీ ఫ్లో’ విధానం అమలు చేయడానికి ఆస్కారమున్నందున దాన్ని అనుసరించాలని నిర్ణయించారు. ఫ్రీ ఫ్లో అంటే? ఒక రాష్ట్రంలో చదివిన విద్యార్థి తదుపరి తరగతులను కొత్త రాష్ట్రంలో కొనసాగించడానికి ‘ఫ్రీ ఫ్లో’ విధానం అవకాశమిస్తుంది. ఆయా విద్యార్థుల సమాచారాన్ని ఆయా రాష్ట్రాలు ఇచ్చిపుచ్చుకొని తదుపరి తరగతులు, పరీక్షలకు అనుమతించాలి. దీనికి సంబంధించి ఏపీ ఇంటర్ బోర్డు కార్యదర్శి సత్యనారాయణ ప్రతిపాదనలు పంపగా ప్రభుత్వం ఆమో దం తెలిపింది. తెలంగాణ బోర్డు కార్యదర్శి కూడా సంబంధిత ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపినట్లు సమాచారం. ఆ ప్రభుత్వం నుంచి అనుమతులు రాగానే ఇరు రాష్ట్రాల మధ్య మార్పును కోరుకునే ఇంటర్ విద్యార్థుల సమాచార మార్పిడికి అవకాశముంటుంది. ఏపీలో ఫ్రీ ఫ్లో విధానానికి వీలుగా ఏర్పాట్లు చేశామని ఇంటర్ బోర్డు కార్యదర్శి వెల్లడించారు.