కళాశాల ప్రిన్సిపాల్ వేధింపులు తట్టుకోలేక ఓ విద్యార్థి ఆత్మహత్యాయత్నం చేశాడు. వనస్థలిపురం నాగార్జుననగర్ కాలనీలో శనివారం ఈ ఘటన చోటుచేసుకుంది.
హైదరాబాద్ : కళాశాల ప్రిన్సిపాల్ వేధింపులు తట్టుకోలేక ఓ విద్యార్థి ఆత్మహత్యాయత్నం చేశాడు. వనస్థలిపురం నాగార్జుననగర్ కాలనీలో శనివారం ఈ ఘటన చోటుచేసుకుంది. ఇంటర్ చదుతున్న ప్రదీప్ శనివారం ఉదయం యాసిడ్ తాగి ఆత్మహత్యకు యత్నించాడు. గమనించిన కుటుంబసభ్యులు అతడిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ప్రదీప్ పరిస్థితి విషమంగా ఉంది. అయితే తన చావుకు శ్రీమేథ కళాశాల ప్రిన్సిపాల్ వేధింపులే కారణమంటూ అతడు స్నేహితుల సెల్‌ఫోన్లకు మెసేజ్‌లు పంపాడని సమాచారం. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.