nagarjuna nagar colony
-
ఇంటర్ విద్యార్థి ఆత్మహత్యాయత్నం
హైదరాబాద్ : కళాశాల ప్రిన్సిపాల్ వేధింపులు తట్టుకోలేక ఓ విద్యార్థి ఆత్మహత్యాయత్నం చేశాడు. వనస్థలిపురం నాగార్జుననగర్ కాలనీలో శనివారం ఈ ఘటన చోటుచేసుకుంది. ఇంటర్ చదుతున్న ప్రదీప్ శనివారం ఉదయం యాసిడ్ తాగి ఆత్మహత్యకు యత్నించాడు. గమనించిన కుటుంబసభ్యులు అతడిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ప్రదీప్ పరిస్థితి విషమంగా ఉంది. అయితే తన చావుకు శ్రీమేథ కళాశాల ప్రిన్సిపాల్ వేధింపులే కారణమంటూ అతడు స్నేహితుల సెల్ఫోన్లకు మెసేజ్లు పంపాడని సమాచారం. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
విషం తాగి కుటుంబం ఆత్మహత్య
హైదరాబాద్: చేసిన అప్పులు తీరడం లేదు... వాటికి వడ్డీలు మాత్రం పెరిగిపోతున్నాయి. అప్పలు తీర్చాలని ఒత్తిడి రోజురోజూకు అధికమవుతుంది. రోజు గడవడమే కష్టంగా ఉంది. ఇంకా అప్పులు ఏలా తీరుస్తామనుకున్నట్లు ఉన్నారు. దాంతో మరణమే శరణ్యమని ఆ కుటుంబం భావించింది. అంతే ఆ కుటుంబంలోని భార్యాభర్తతోపాటు కుమారుడు విషం తాగి మరణించారు. ఆ ఘటన నగర శివారుల్లోని కుషాయిగూడ నాగార్జున నగర్ కాలనీలో శుక్రవారం అర్థరాత్రి చోటు చేసుకుంది. శనివారం ఉదయం స్థానికులు ఆ విషయాని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు నాగార్జున నగర్ కాలనీలోని మృతుల ఇంటికి చేరుకుని... మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. పోస్ట్మార్టం నిమిత్తం మృతదేహాలను గాంధీ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.