
సింగర్ ఆత్మహత్యాయత్నం ఘటనలో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. అసలు తాను సూసైడ్ అటెంప్ట్ చేయలేదని పోలీసులకు తెలిపింది. కేవలం తన కూతురితో వచ్చిన మనస్పర్థల వల్లే నిద్రమాత్రలు వేసుకున్నట్లు తెలిపింది. చదువుకోవడానికి హైదరాబాద్ రావాలని తన కూతురిని అడిగానని.. తాను రానని చెప్పడంతోనే మనోవేదనకు గురైనట్లు వివరించింది. మనస్తాపంతోనే ట్యాబ్లెట్లు వేసుకున్నానని పోలీసులకు ఇచ్చిన స్టేట్‌మెంట్‌లో వెల్లడించింది. దీంతో ఈ విషయానికి సంబంధించి కేపీహెచ్‌బీ పోలీసులు ప్రెస్‌నోట్ విడుదల చేశారు. ఈ ఘటనలో ఎవరి ప్రమేయం లేదని కల్పన చెప్పారని పోలీసులు పేర్కొన్నారు.
కాగా.. అంతకుముందు కల్పన కూతురు కూడా మాట్లాడారు. నా తల్లి ఎలాంటి ఆత్మహత్యాయత్నం చేయలేదని తెలిపారు. కేవలం వైద్యుల సూచన మేరకే నిద్రమాత్రలు వేసుకున్నారని పేర్కొన్నారు. మా కుటుంబంలో ఎలాంటి గొడవలు లేవని కల్పనా రాఘవేందర్ క్లారిటీ ఇచ్చింది.
అయితే సింగర్ కల్పన ఆత్మహత్య యత్నంపై పోలీసులు తొలుత ఆమె భర్తని అనుమానించారు. మంగళవారం సాయంత్రం ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. కానీ కూతురితో జరిగిన వాగ్వాదం వల్లే కల్పన ఇలా చేశారనే అసలు విషయం ఒకటి బయటకొచ్చింది. ప్రస్తుతం కల్పనా తన భర్త దయ ప్రసాద్‌తో కలిసి నిజాంపేట్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో నివాసముంటోంది.
Comments
Please login to add a commentAdd a comment