'ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్లనాని' అనే సాంగ్‌తో గుర్తింపు తెచ్చుకున్న సింగర్ మధుప్రియ. తన మధురమైన వాయిస్‌తోనే ఫేమస్ అయ్యారు. అయితే తాజాగా ఆమె వివాదంలో చిక్కుకున్నారు. తన ప్రైవేట్ ఆల్బమ్ కోసం భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం ఆలయంలో మధు ప్రియ సాంగ్‌ను షూట్ చేశారు. అది కూడా ఆలయం గర్భగుడిలో కావడంతో వివాదానికి దారితీసింది. దీంతో మధు ప్రియ తీరుపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
గర్భగుడిలో సింగర్ మధు ప్రియ ప్రైవేట్ ఆల్బమ్ కోసం షూటింగ్ చేయడంపై భక్తులు మండిపడుతున్నారు. గుడి తలుపులు మూసి గర్భగుడిలో చిత్రీకరణ జరపడంపై మధుప్రియపై విమర్శలు చేస్తున్నారు. గర్భగుడిలో షూట్‌కు అనుమతి ఎవరు ఇచ్చారంటూ స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఆలయంలో మధు ప్రియ పాట పాడుతున్న వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
సంక్రాంతికి వస్తున్నాం సాంగ్ పాడిన మధుప్రియ..
కాగా.. సింగర్ మధు ప్రియ ఇటీవల రిలీజైన సంక్రాంతికి వస్తున్నాం మూవీలో గోదారి గట్టుమీద సాంగ్‌ను ఆలపించారు. ఈ పాటకు ఆడియన్స్ నుంచి విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది. ఇప్పటికే యూట్యూబ్‌లో రికార్డ్ స్థాయి వ్యూస్‌తో దూసుకెళ్తోంది. ఈ సాంగ్ మేల్ వాయిస్‌ను రమణ గోగుల పాడగా.. ఫీమేల్ వాయిస్ మధు ప్రియ పాడారు. ఈ సంక్రాంతికి విడుదలైన వెంకటేశ్ - అనిల్ రావిపూడి చిత్రం బాక్సాఫీస్ వద్ద సక్సెస్‌ఫుల్‌గా రాణిస్తోంది.
భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం ఆలయం లో అపచారం.
వీడియొ షూటింగ్ చేసిన సింగర్ మధు ప్రియ,
ఎవరు పర్మిషన్ ఇచ్చారు అని మండి పడ్డ భక్తులు. pic.twitter.com/lbsGMllaSP— Telangana Maata (@TelanganaMaata) January 23, 2025
Comments
Please login to add a commentAdd a comment