Madhu Priya
-
వివాదంలో సింగర్ మధు ప్రియ.. అసలేం జరిగిందంటే?
'ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్లనాని' అనే సాంగ్‌తో గుర్తింపు తెచ్చుకున్న సింగర్ మధుప్రియ. తన మధురమైన వాయిస్‌తోనే ఫేమస్ అయ్యారు. అయితే తాజాగా ఆమె వివాదంలో చిక్కుకున్నారు. తన ప్రైవేట్ ఆల్బమ్ కోసం భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం ఆలయంలో మధు ప్రియ సాంగ్‌ను షూట్ చేశారు. అది కూడా ఆలయం గర్భగుడిలో కావడంతో వివాదానికి దారితీసింది. దీంతో మధు ప్రియ తీరుపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.గర్భగుడిలో సింగర్ మధు ప్రియ ప్రైవేట్ ఆల్బమ్ కోసం షూటింగ్ చేయడంపై భక్తులు మండిపడుతున్నారు. గుడి తలుపులు మూసి గర్భగుడిలో చిత్రీకరణ జరపడంపై మధుప్రియపై విమర్శలు చేస్తున్నారు. గర్భగుడిలో షూట్‌కు అనుమతి ఎవరు ఇచ్చారంటూ స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఆలయంలో మధు ప్రియ పాట పాడుతున్న వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.సంక్రాంతికి వస్తున్నాం సాంగ్ పాడిన మధుప్రియ.. కాగా.. సింగర్ మధు ప్రియ ఇటీవల రిలీజైన సంక్రాంతికి వస్తున్నాం మూవీలో గోదారి గట్టుమీద సాంగ్‌ను ఆలపించారు. ఈ పాటకు ఆడియన్స్ నుంచి విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది. ఇప్పటికే యూట్యూబ్‌లో రికార్డ్ స్థాయి వ్యూస్‌తో దూసుకెళ్తోంది. ఈ సాంగ్ మేల్ వాయిస్‌ను రమణ గోగుల పాడగా.. ఫీమేల్ వాయిస్ మధు ప్రియ పాడారు. ఈ సంక్రాంతికి విడుదలైన వెంకటేశ్ - అనిల్ రావిపూడి చిత్రం బాక్సాఫీస్ వద్ద సక్సెస్‌ఫుల్‌గా రాణిస్తోంది. భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం ఆలయం లో అపచారం.వీడియొ షూటింగ్ చేసిన సింగర్ మధు ప్రియ,ఎవరు పర్మిషన్ ఇచ్చారు అని మండి పడ్డ భక్తులు. pic.twitter.com/lbsGMllaSP— Telangana Maata (@TelanganaMaata) January 23, 2025 -
ఆ పేద తల్లిదండ్రుల కలలు ఆవిరయ్యాయి..
సాక్షి, ఆలూరు (కర్నూలు): రెండేళ్లుగా ప్రేమించుకున్నారు. విషయం ఇంట్లో పెద్దలకు తెలియడంతో ఇద్దరిని దూరంగా ఉంచారు. దీంతో మనస్తాపం చెందిన ప్రేమికులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ విషాద ఘటన ఆలూరులో చోటు చేసుకుంది. పట్టణంలోని స్థానిక గోవర్ధన్ టాకీస్ సమీపంలో నివాసం ఉంటున్న నాగేంద్ర, అనిత దంపతుల కుమారుడు విజయ్ కుమార్ (18), అదే కాలనీలో నివాసం ఉండే రమణ, అనిత దంపతుల కుమార్తె మధుప్రియ(18) రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. విజయ్ కుమార్ ఇంటర్ పూర్తి చేసి ప్రస్తుతం ఆలూరు ఐటీఐ కళాశాలలో డీజల్ మెకానికల్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. మధుప్రియ ఆలూరులోని మోడల్ స్కూల్లో ఇంటర్ వరకు చదివి పులివెందుల ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ మొదటి సంవత్సరం చదువుతోంది. ఇంటర్ చదివే సమయంలో వీరి ప్రేమ వ్యవహారం పెద్దలకు తెలియడంతో మధుప్రియను వైఎస్సార్ జిల్లాలోని పులివెందుల కళాశాలలో బీటెక్ చేర్పించారు. అప్పుడప్పుడు సెల్ ఫోన్లో ఇద్దరూ మాట్లాడుకునే వారని తెలిసింది. అయితే వారి మధ్య ఏమి జరిగిందో తెలియదు కాని శుక్రవారం రాత్రి 7.30 గంటలకు విజయ్ కుమార్ ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చదవండి: (ప్రియుడిని కలవడానికి భర్త అడ్డు.. ఏం చేయాలా అని ఆలోచించి..) ఈ విషయం మధుప్రియకు తెలిసి అదే రోజు హాస్టల్లో ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు హాస్టల్ నిర్వాహకులు కుటుంబీకులకు సమాచారం ఇచ్చారు. దీంతో విద్యార్థినిని అనంతపురం జిల్లా కదిరిలో ఉంటున్న పెదనాన్న ఇంటికి తీసుకొచ్చారు. విజయ్ మరణాన్ని జీర్ణించుకోలేక మధుప్రియ శనివారం మధ్యాహ్నం ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. బంధువుల ఫిర్యాదు మేరకు అక్కడి పోలీసులు కడుపునొప్పి తాళలేక ఆత్మహత్య చేసుకున్నట్లు కేసు నమోదు చేశారు. విద్యార్థిని మృతదేహాన్ని ఆదివారం గ్రామానికి తీసుకొచ్చి అంత్యక్రియలు చేశారు. తమ పిల్లలు ఉన్నతంగా చదివి ప్రయోజకులవుతారని ఆశించిన పేద తల్లిదండ్రుల కలలు ఆవిరయ్యాయి. ప్రేమికుల ఆత్మహత్యతో ఆలూరులో విషాదం అలుముకుంది. చదవండి: (భర్త పుణెలో సాఫ్ట్వేర్ ఉద్యోగం.. నవ్య అనారోగ్యంతో గుంటూరులో..) -
ఓటీటీలోకి ‘మగువా మజాకా’
‘మగువ’చిత్రంతో సంచలనం సృష్టించిన మధుప్రియ టైటిల్ పాత్రలో డీఎస్ రావు, రవీంద్ర నారాయణ్ ముఖ్యపాత్రలు పోషించిన చిత్రం ‘మగువా మజాకా’. ఊర్వశి ఓటిటి సమర్పణలో భీమవరం టాకీస్ సహకారంతో సంపత్ రాజ్ దర్శకత్వంలో ఫణిరాజ్ నిర్మించిన ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈనెల 8 నుంచి ఊర్వశి ఓటిటి ద్వారా ప్రపంచవ్యాప్తంగా గల తెలుగు ప్రేక్షకులను అలరించనుంది. తనపై అత్యాచారానికి ఒడిగట్టిన కామాంధులకు తెగువ కలిగిన ఓ మగువ ఏ విధంగా ప్రతీకారం తీర్చుకుందనే కాన్సెప్ట్ తో రూపొందిన ఈ చిత్రం తమ దర్శకుడు సంపత్ రాజ్ కు మంచి పేరు తెచ్చిపెడుతుందని, ఈనెల 8న ఊర్వశి ఓటిటిలో ‘మగువా మజాకా’ను విడుదల చేస్తున్నామని నిర్మాత ఫణిరాజ్ తెలిపారు. ‘మగువ’ చిత్రంతో సంచలనం సృష్టించిన మధుప్రియ ఈ చిత్రంతో ‘మధుప్రియా మజాకా’ అనిపిస్తుందని దర్శకుడు సంపత్ రాజ్ పేర్కొన్నారు. ఈ చిత్రానికి మ్యూజిక్: పి.ఎస్, కెమెరా: శ్రీను, డైలాగ్స్: మణి -
పోలీసులను ఆశ్రయించిన సింగర్ మధు ప్రియ
సింగర్ మధు ప్రియ తాజాగా హైదరాబాద్ పోలీసులను ఆశ్రయించింది. గుర్తు తెలియని వ్యక్తుల నుంచి తనకు పదే పదే బ్లాంక్ కాల్స్ వస్తున్నాయని శనివారం షీ టీమ్‌కు ఈ-మెయిల్ ద్వారా ఫిర్యాదు చేసింది. అంతేగాక సోషల్ మీడియా ద్వారా కూడా తనని వేధిస్తున్నారని, అసభ్యకరమైన సందేశాలు పంపిస్తున్నారంటు ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. దీంతో ఆమె మెయిల్‌ను షీ-టీమ్, సైబర్ క్రైం పోలీసులకు బదిలీ చేసింది. తనకు వస్తున్న బ్లాంక్ కాల్స్ వివరాలను మధు ప్రియ సైబర్ క్రైం పోలీసులకు అందించింది. ఆమె ఫిర్యాదు మేరకు ఐపీసీ 509, 354(బి) సెక్షన్ల కింద కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. కాగా మధు ప్రియ ‘ఆడపిల్లనమ్మా.. నేను ఆడపిల్లనాని’ అంటూ పాడి చిన్న వయసులోనే తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ తర్వాత పలు షోలలో తన పాటలతో అలరించిన మధు ప్రియ తన ప్రేమ, పెళ్లి వ్యవహరం విషయంలోనూ వార్తల్లో నిలిచింది. అయినప్పటికీ ఆమె క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ఏకంగా సినిమాల్లో కూడా పాటలు పాడే చాన్స్ కొట్టేసిందామే. తను పాడిన పాటలన్నీ సూపర్ హిట్ అయ్యాయి. ‘ఫిదా’ మూవీలో ఆమె పాడిన ‘వచ్చిండే... మెల్ల మెల్లగా వచ్చిండే’ పాట ఎంత పాపులర్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక గతేడాది వచ్చిన సూపర్ స్టార్ మహేశ్ బాబు మూవీ ‘సరిలేరు నీకేవ్వరు’లో ఆమె పాడిన ‘హి ఈజ్ సో క్యూట్’ పాట కూడా పెద్ద హిట్ అయ్యింది. -
పోలీసుల కస్టడీకి మధుప్రియ
సాక్షి, విశాఖపట్నం: నూతన్ నాయుడు భార్య మధుప్రియను విశాఖ పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. మధుప్రియతో పాటు బాధితుడు శ్రీకాంత్‌ను తీవ్రంగా హింసించిన ఇందిరాను కూడా అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం నూతన్ నాయుడు ఇంటి సూపర్వైజర్ను పోలీసులు విచారిస్తున్నారు. కాగా.. ఇప్పటికే నూతన్ నాయుడు ప్రమేయాన్ని పోలీసులు గుర్తించారు. అయితే తాజాగా.. శాస్త్రీయమైన సాక్ష్యాలు సేకరించే క్రమంలో ముగ్గురు నిందితులను రెండు రోజుల పాటు విశాఖ పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. (విశాఖ సెంట్రల్ జైల్‌కు నూతన్ నాయుడు) -
సాక్షి ఎక్స్‌లెన్స్ అవార్డ్స్: మోస్ట్ పాపులర్ సింగర్ ఆఫ్ ద ఇయర్ (ఫీమేల్)- ఎమ్.మధుప్రియ
-
పల్లెటూరి అమ్మాయి.. దేశం గర్వపడేస్థాయి!
రచన స్మిత్ ప్రధాన పాత్రలో ఆర్కే ఫిలింస్ పతాకంపై రామకృష్ణగౌడ్ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తోన్న లేడీ ఓరియంటెడ్ చిత్రం ‘మహిళా కబడ్డి’. రీసెంట్గా విడుదలైన ఈ సినిమాలోని మూడు పాటలకు మంచి స్పందన లభిస్తోంది. ఈ మూడు పాటలకు పది లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయని చిత్రబృందం చెబుతోంది. ఆడియో సక్సెస్‌మీట్‌లో నిర్మాత ముత్యాల రాందాస్ మాట్లాడుతూ –‘‘రామకృష్ణగౌడ్గారు స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో నిర్మిస్తున్న ఈ చిత్రం సక్సెస్ కావాలి’’ అన్నారు. ‘‘మా బ్యానర్లో చాలాకాలం తర్వాత నేను దర్శకత్వం వహిస్తూ నిర్మిస్తోన్న చిత్రమిది. మహిళలు ఎందులో తక్కువకాదనే కాన్సెప్ట్ ఆధారంగా తెరకెక్కిస్తున్నాం. ఒక పల్లెటూరి అమ్మాయి దేశం గర్వపడేస్థాయి కబడ్డీ ఛాంపియన్‌గా ఎలా ఎదిగింది అన్నదే కథాంశం. మధుప్రియ, మంగ్లీ, గీతామాధురి పాడిన పాటలకు యూట్యూబ్‌లో మంచి స్పందన లభిస్తోంది. మరో రెండు పాటలను మధుప్రియ, గీతా మాధురితో పాడించి త్వరలోనే విడుదల చేస్తాం. ఈ సినిమాతో రాజ్‌కిరణ్‌కు మ్యూజిక్ డైరెక్టర్‌గా మంచి బ్రేక్ వస్తుంది. షూటింగ్ ఫైనల్ స్టేజ్‌లో ఉంది’’ అన్నారు రామకృష్ణగౌడ్ . ఈ సినిమాకు కెమెరా: రాజు. -
దాసరి సినీ అవార్డుల ప్రదానోత్సవం
ఫిలిం ఎనాలిటికల్ అండ్ అప్రిషియేషన్ సొసైటీ (ఫాస్) ఈ ఏడాది దాసరి ఫిల్మ్ అవార్డు విజేతల ఎంపిక వివరాలను సంస్థ అధ్యక్షులు, పూర్వ సెన్సార్ బోర్డ్ సభ్యులు కె. ధర్మారావు వెల్లడించారు. ఈ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం ఈ నెల 6న హైదరాబాద్‌లో జరగనుంది. డైరెక్టర్ ఆఫ్ ది ఇయర్‌గా శేఖర్ కమ్ముల (ఫిదా), ఉత్తమ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ, ఉత్తమ గాయని మధుప్రియ, ప్రశంసా దర్శకుడు అవార్డు వడ్డేపల్లి కృష్ణ (లావణ్య విత్ లవ్‌బాయ్స్), దాసరి ప్రతిభా పురస్కారాలను సంపూర్ణేష్ బాబు, శివపార్వతి, సంగీత దర్శకులు వాసూరావు, మాటల రచయిత సంజీవని, దాసరి విశిష్ట సేవా పురస్కారాన్ని రెడ్‌క్రాస్ సొసైటీ అధ్యక్షుడు లయన్ డా.ఎ. నటరాజుకు ప్రదానం చేయనున్నారు. ఫాస్–దాసరి కీర్తి కిరిట సిల్వర్క్రౌన్ అవార్డులను దర్శకులను కోడి రామకృష్ణ, టీవీ యాంకర్ సుమ కనకాలకు అందజేయనున్నారు. దాసరి జీవన సాఫల్య పురస్కారాన్ని సూపర్‌హిట్ సినీ వార పత్రిక ఎడిటర్ అండ్ పబ్లిషర్ నిర్మాత బీఏ రాజు అందుకోనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నటి జమున హాజరు కానున్నారు. సభాధ్యక్షులుగా కైకల సత్యానారాయణ వ్యవహరిస్తారు. డైనమిక్ లేడీ డైరెక్టర్ జయ. బి సభను ప్రారంభించనున్నారు. సన్మానకర్తగా దర్శకుడు ఎన్.శంకర్ విచ్చేయనున్నారు. ఈ కార్యక్రమానికి చైర్మన్‌గా రేలంగి నరసింహారావు, ఫెస్టివల్ చైర్మన్‌గా లయన్ ఎ. విజయ్‌కుమార్ వ్యవహరించనున్నారు. శ్రీమతి టి.లలితబృందం దాసరి సినీ విభావరి నిర్వహించనున్నారు. -
'మధుప్రియ మాటలు నిజమైతే పీక కోసుకుంట'
హైదరాబాద్: మధుప్రియ చేసిన ఆరోపణలు నిజమైతే తాను పీకను కోసుకుంటానని గాయని మధుప్రియ భర్త శ్రీకాంత్ అన్నాడు. శ్రీకాంత్ తనపై కత్తులతో దాడి చేసేందుకు వచ్చాడని మధుప్రియ చెప్పింది. ఈ నేపథ్యంలో అతడు స్పందిస్తూ ఆమె చేసిన ఆరోపణలు నిజమైతే నిలువునా ప్రాణం తీసుకుంటానని, ఉరిశిక్షకు సిద్ధమని, జైలుకు కూడా వెళ్తానని చెప్పాడు. ఘర్షణ నేపథ్యంలో మధుప్రియ భర్త శ్రీకాంత్ సాక్షి స్టూడియోకి వచ్చి మాట్లాడగా.. మధుప్రియ ఇంటి నుంచి సమాధానాలు చెప్పింది. ఈ సందర్బంగా శ్రీకాంత్ స్టూడియో నుంచి మాట్లాడుతూ మధుప్రియ చెప్పే మాటలు నిరూపిస్తే జిందగీలో ఆమెకు నాముఖం చూపించబోనని అన్నాడు. తాను ఆమెతో మాట్లాడేందుకు ఎంతో ప్రయత్నించానని అన్నాడు. వాళ్ల బావ మహేష్‌కు ఫోన్ చేస్తే .. మెహిదీపట్నం పోలీస్ స్టేషన్ వద్ద అన్నారని.. తర్వాత ఉస్మానియా, ఆ తర్వాత ఫీవర్ ఆస్పత్రి అన్నారని చివరికి ఇంటికి రా అని పిలిచి అక్కడకు వెళ్లగానే శ్రీనివాస్ రెడ్డి అన్న వ్యక్తికి వాళ్ల అమ్మ కర్ర ఇచ్చి కొట్టించిందని అన్నాడు. తాను ఏనాడైనా ఆస్తి కోసమో, కట్నం కోసమో ఇబ్బంది పెట్టలేదని అన్నారు. -
'కడుపులో తన్నాడు.. కత్తులతో వచ్చాడు'
హైదరాబాద్: 'నిన్ను చేసుకున్నాకే నాకు దరిద్రం పట్టుకుంది. నాజీవితం నాశనమైంది. బతికితే ఇక్కడే బతుకు చస్తే ఇక్కడే చావు' అంటూ ప్రతి రోజు తనను కొడుతున్నాడని సింగర్ మధుప్రియ తన భర్త శ్రీకాంత్ పై ఆరోపణలు చేసింది. అమ్మనాన్నలను ఎదురించి వివాహం చేసుకున్న విషయం అందరికీ తెలుసని.. అందరినీ కాదని తన వెంట వెళ్లినందుకు అతడు తన మనసును విరిచేశాడని చెప్పింది. శనివారం రాత్రి మధుప్రియ వాళ్ల ఇంటివద్ద ఘర్షణ చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భర్త శ్రీకాంత్ సాక్షి స్టూడియోకి వచ్చి మాట్లాడగా.. మధుప్రియ ఇంటి నుంచి సమాధానాలు చెప్పింది. మధుప్రియ మాట్లాడుతూ .. పెళ్లయిన మూడు నెలలు మాత్రమే శ్రీకాంత్ బాగున్నాడని, అలాగని మంచోడు కాదని అనబోనని, అప్పుడప్పుడు కూడా బాగానే చూసుకున్నాడని అన్నారు. ఏనాడు తన తండ్రితో ఒక్కమాట పడలేదని, కానీ శ్రీకాంత్ మాత్రం ప్రతిరోజు నన్ను కొడుతున్నాడని, నిన్న కడుపులో తన్నిండని, తిట్టడం కొట్టడం సర్వసాధరణం అయిపోయిందని చెప్పింది. శ్రీకాంత్ కి ఎంతిష్టమో నాకు తెలియదని, శ్రీకాంత్ అంటే మాత్రం తనకు చాలా ప్రేమ అని అది గత రాత్రితో పోయిందని అన్నారు. తనకు ద్వేషించే అవకాశం ఇచ్చాడని అంది. కానీ శ్రీకాంత్ చేతిలో బాగా దెబ్బలు తిన్నానని, నా మనసు చనిపోయిందని చెప్పింది. తల్లిదండ్రుల మాట వినకుండానే పెళ్లి చేసుకున్న తాను తిరిగి వాళ్ల మాట విని ఎలా మారిపోతానని ప్రశ్నించింది. మాట్లాడటానికి వచ్చే వారు డీసెన్స్ గా ఉండాలని, మా వీధిలో లైట్లు ఎందుకు బంద్ చేశారని ప్రశ్నించింది. శ్రీకాంత్ వాళ్లు కత్తులతో దాడి చేసేందుకు వచ్చారని చెప్పింది. చెత్తగా మాట్లాడింది, చచ్చేలా కొట్టింది నిజం కాదంటే ఒప్పుకోనని అన్నారు. -
మాట్లాడుకుందామని పిలిచి కొట్టారు: శ్రీకాంత్
హైదరాబాద్: గాయని మధుప్రియ, ఆమె భర్త శ్రీకాంత్ ల మధ్య నెలకొన్న వివాదం మలుపులు తిరుగుతోంది. ఒకవైపు పోలీస్ స్టేషన్ లో నమోదయిన వేధింపుల కేసు దర్యాప్తు కొనసాగుతుండగానే శనివారం అర్ధరాత్రి ఇరు వర్గాలు ఘర్షణకు దిగాయి. ఉప్పల్ లోని తమ ఇంటిపై శ్రీకాంత్ అనుచరులు దాడిచేశారని మధుప్రియ కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదుచేశారు. అయితే శ్రీకాంత్ వాదన మాత్రం మరోలా ఉంది. మాట్లాడుకుందాం రమ్మని మధుప్రియ బంధువులు పిలిస్తేనే వెళ్లానని, అక్కడ తనపై దాడి చేసి తీవ్రంగా గాయపర్చారని శ్రీకాంత్ మీడియాకు సమాచారం ఇచ్చాడు. -
గాయని మధుప్రియ వివాహం
-
మధుప్రియ పెళ్లైపోయింది
-
మధుప్రియ పెళ్లైపోయింది
బెజ్జూరు (ఆదిలాబాద్) : నాటకీయ పరిణామాల మధ్య వర్ధమాన గాయని మధుప్రియ వివాహం శుక్రవారం మధ్యాహ్నం వైభవంగా జరిగింది. కెరీర్ మీద దృష్టి పెట్టాల్సిన వయసులో అప్పుడే పెళ్లి చేసుకోవడం సరికాదని మధుప్రియ తల్లిదండ్రులు అభ్యంతరం తెలిపినప్పటికీ ఆమె వినిపించుకోలేదు. ఆఖరికి తమ పెళ్లి రోజైన నవంబర్ 18న పెళ్లి చేస్తామని తల్లిదండ్రులు ప్రాధేయపడినా మధుప్రియ ఒప్పుకోలేదు. దీంతో ఆమె తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్ నుంచి వెళ్లిపోయారు. ముందు నుంచి ఏర్పాటు చేసుకున్న ప్రకారమే సిర్పూర్ కాగజ్‌నగర్‌లోని వాసవీ గార్డెన్స్‌లో తన అభీష్టం మేరకు ప్రియుడు శ్రీకాంత్‌ను ఆమె వివాహం చేసుకుంది. పెళ్లికొడుకు తల్లిదండ్రులు, బంధువుల సమక్షంలో వివాహం జరిగింది. అనూహ్య మలుపులతో ప్రేమ వ్యవహారం ఎట్టకేలకు పెళ్లి పీటలెక్కడంతో శుక్రవారం ఉదయం నుంచి నెలకొన్న ఉత్కంఠకు తెర పడినట్లయింది. -
షార్ట్ ఫిలింలలో అవకాశం ఇచ్చి..
-
షార్ట్ ఫిలింలలో అవకాశం ఇచ్చి..
గాయని మధుప్రియ ప్రేమించిన శ్రీకాంత్ గురించి భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. అతడు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తాడని కొందరు, రియల్ ఎస్టేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడని మరికొందరు చెబుతున్నారు. అయితే ఇంకొందరు మాత్రం షార్ట్ ఫిలింలు డైరెక్ట్ చేస్తాడని అంటున్నారు. ఇలా షార్ట్ ఫిలింలు తీసే క్రమంలోనే అతడు రెండు మూడు షార్ట్ ఫిలింలలో మధుప్రియకు అవకాశం ఇచ్చాడని, వాటి షూటింగ్ సమయంలోనే ఇద్దరి మధ్య ప్రేమ చిగురించిందని చెబుతున్నారు. హైదరాబాద్ నల్లకుంట ప్రాంతంలో మధుప్రియ కుటుంబం నివాసం ఉంటుంది. ఆ సమీపంలోనే శ్రీకాంత్ కూడా ఉండేవాడని, అప్పుడే ఇద్దరికీ పరిచయం ఉందని తెలుస్తోంది. రెండేళ్లుగా వీళ్ల మధ్య ప్రేమ వ్యవహారం ఉన్నా.. నెల రోజుల క్రితమే ఆమె మేజర్ కావడంతో, ఆ తర్వాతి నుంచి ఇరువైపుల పెద్దలను తమ పెళ్లి గురించి వీళ్లు అడుగుతున్నారు. శ్రీకాంత్ తల్లిదండ్రులు పెళ్లికి అంగీకరించినా.. మధుప్రియ తరఫు వాళ్లు మాత్రం ససేమిరా అంటున్నారు. ఇప్పటికీ ఎలాగోలా పెళ్లిని ఆపేందుకు వాళ్లవైపు నుంచి ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. -
అన్ని అంశాలతో..
సందేశంతో పాటు ప్రేక్షకులకు కావాల్సిన అన్ని అంశాలు ఉన్న చిత్రం ‘ది బెల్స్’. జగదాంబ ప్రొడక్షన్స్ పతాకంపై ఎర్రోజు వెంకటాచారి నిర్మిస్తున్న ఈ చిత్రానికి ప్రవీణ్ నెల్లుట్ల దర్శకుడు. ‘ఆడపిల్లనమ్మా నేను ’ అనే ప్రైవేట్ సాంగ్‌తో సుపరిచితురాలైన మధుప్రియ పై పాట చిత్రీకరణతో ఈ చిత్రం పూర్తయింది. నిర్మాణానంతర కార్యక్రమాలు శరవేగంగా సాగుతున్నాయి. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ -‘‘అనుకున్న విధంగా ఈ చిత్రం వచ్చిందంటే దానికి కారణం మా నిర్మాతే. అలాగే అతిథి పాత్రలో నటించిన తెలంగాణా భారీ నీటిపారుదల సలహాదారులు విద్యాసాగర్‌రావు గారికి నా కృతజ్ఞతలు. త్వరలో పాటలు విడుదల చేసి, మార్చిలో చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అని తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: కాసర్ల శ్యామ్, పాటలు: వరికుప్పల యాదగిరి, కాకర్లశ్యామ్, గోరటి వెంకన్న కెమెరా: ఉదయ్.