
‘మగువ’చిత్రంతో సంచలనం సృష్టించిన మధుప్రియ టైటిల్ పాత్రలో డీఎస్ రావు, రవీంద్ర నారాయణ్ ముఖ్యపాత్రలు పోషించిన చిత్రం ‘మగువా మజాకా’. ఊర్వశి ఓటిటి సమర్పణలో భీమవరం టాకీస్ సహకారంతో సంపత్ రాజ్ దర్శకత్వంలో ఫణిరాజ్ నిర్మించిన ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈనెల 8 నుంచి ఊర్వశి ఓటిటి ద్వారా ప్రపంచవ్యాప్తంగా గల తెలుగు ప్రేక్షకులను అలరించనుంది.
తనపై అత్యాచారానికి ఒడిగట్టిన కామాంధులకు తెగువ కలిగిన ఓ మగువ ఏ విధంగా ప్రతీకారం తీర్చుకుందనే కాన్సెప్ట్ తో రూపొందిన ఈ చిత్రం తమ దర్శకుడు సంపత్ రాజ్ కు మంచి పేరు తెచ్చిపెడుతుందని, ఈనెల 8న ఊర్వశి ఓటిటిలో ‘మగువా మజాకా’ను విడుదల చేస్తున్నామని నిర్మాత ఫణిరాజ్ తెలిపారు. ‘మగువ’ చిత్రంతో సంచలనం సృష్టించిన మధుప్రియ ఈ చిత్రంతో ‘మధుప్రియా మజాకా’ అనిపిస్తుందని దర్శకుడు సంపత్ రాజ్ పేర్కొన్నారు. ఈ చిత్రానికి మ్యూజిక్: పి.ఎస్, కెమెరా: శ్రీను, డైలాగ్స్: మణి
Comments
Please login to add a commentAdd a comment