ఇదెక్కడి ట్విస్ట్.. మళ్లీ ఓటీటీకి వచ్చేసిన సూపర్‌హిట్‌ హారర్ థ్రిల్లర్ | Super Hit Movie Tumbbad Streaming On This OTT Once Again | Sakshi
Sakshi News home page

Tumbbad: ఓటీటీలో హారర్ థ్రిల్లర్‌ రీ ఎంట్రీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్

Published Fri, Feb 21 2025 8:00 PM | Last Updated on Fri, Feb 21 2025 8:16 PM

Super Hit Movie Tumbbad Streaming On This OTT Once Again

2018లో వచ్చి సూపర్‌ హిట్‌గా హారర్‌ థ్రిల్లర్‌ తుంబాడ్. చిన్న సినిమాగా వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద సూపర్‌ హిట్‌గా నిలిచింది. గతేడాది సెప్టెంబర్‌లో ఈ మూవీని రీ రిలీజ్ చేయగా అద్భుతమైన వసూళ్లు సాధించింది. ఏకంగా రూ.31 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. ఈ సినిమాకు రాహి అనిల్ బార్వే దర్శకత్వం వహించారు. అయితే రీ రిలీజ్‌కు ముందు ఈ సినిమా అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్‌ అందుబాటులో ఉండేది. కానీ ఊహించని విధంగా ఓటీటీ నుంచి ఈ చిత్రాన్ని తొలగించారు.

అయితే తాజాగా ఆడియన్స్‌కు మరో ట్విస్ట్ ఎదురైంది. ఇటీవల థియేటర్లలో అలరించిన ఈ హారర్ థ్రిల్లర్‌ తుంబాడ్  మరోసారి సడన్‌గా ఓటీటీకి వచ్చేసింది. అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో వేదికగా తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతోంది. కాగా.. ఈ చిత్రాన్ని మహరాష్ట్ర జానపద కథల ఆధారంగా తెరకెక్కించారు. ఈ సినిమాలో హనీ ట్రెహాన్, అషర్ హక్, హ్యారీ పర్మార్, ప్రశాంత్ సింగ్ కీలక పాత్రల్లో నటించారు.

తుంబాడ్ సూపర్ హిట్‌ కావడంతో ఈ చిత్రానికి సీక్వెల్‌గా తుంబాడ్‌-2ను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ మూవీకి సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి. ఈ మూవీ త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనున్నట్లు నటుడు, నిర్మాత, సోహమ్‌ షా ఇప్పటికే ప్రకటించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement