మరో ఓటీటీకి వచ్చేసిన టాలీవుడ్ హారర్ థ్రిల్లర్‌.. స్ట్రీమింగ్ ఎక్కడంటే? | Tollywood Horror Movie Streaming On Another OTT From Today | Sakshi
Sakshi News home page

మరో ఓటీటీలో టాలీవుడ్ హారర్ థ్రిల్లర్‌.. స్ట్రీమింగ్ ఎక్కడో తెలుసా?

Oct 9 2024 4:03 PM | Updated on Oct 9 2024 4:19 PM

Tollywood Horror Movie Streaming On Another OTT From Today

ఓటీటీలో హారర్ చిత్రాలకు ప్రత్యేక డిమాండ్ ఉంది. హారర్ థ్రిల్లర్‌ సినిమాలపై ఆడియన్స్ ఎక్కువ ఇంట్రెస్ట్‌ చూపిస్తున్నారు. ఇటీవల థియేటర్లలో విడుదలైన టాలీవుడ్ హారర్ మూవీ కళింగ. ఇప్పటికే ఈ మూవీ ఓటీటీటీలోనూ స్ట్రీమింగ్ అవుతోంది. అక్టోబర్ 2 నుంచే ఆహాలో అందుబాటులోకి వచ్చేసింది.

తాజాగా ఈ సినిమా మరో ఓటీటీలోనూ అందుబాటులోకి వచ్చింది. ఇవాల్టి నుంచి అమెజాన్ ప్రైమ్‌లోనూ స్ట్రీమింగ్ అవుతోంది. కాగా.. టాలీవుడ్‌లో 'కిరోసిన్' సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న ధృవ వాయు ఇందులో హీరోగా నటించాడు. అయితే కళింగ చిత్రానికి దర్శకుడిగా కూడా  ధృవ వాయు పనిచేశారు. ప్ర‌గ్యా న‌య‌న్ హీరోయిన్‌గా న‌టించింది. ఇంజులో మీసాల ల‌క్ష్మ‌ణ్‌, ఆడుకాలం న‌రేన్‌, బ‌ల‌గం సుధాక‌ర్ కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. దీప్తి కొండవీటి, పృథ్వీ యాదవ్ ఈ చిత్రాన్ని నిర్మించారు.

హారర్‌ ఎలిమెంట్స్‌కు కాస్త ఫాంటసీ అంశాలను చేర్చి ఈ చిత్రాన్ని దర్శకుడు తెరకెక్కించారు. సెప్టెంబర్‌ 13న విడుదలైన కళింగ సినిమాకు బాక్సాఫీస్‌ వద్ద మంచి కలెక్షన్స్‌ వచ్చాయి. ఈ సినిమాకు సుమారు రూ. 5 కోట్ల మేరకు కలెక్షన్లు వచ్చినట్లు నిర్మాణ సంస్థ కూడా ప్రకటించింది.

కళింగ కథేంటంటే..

కళింగ అనే ప్రాంతం. ఈ ఊరు పొలిమేర దాటి అడవిలోకి వెళ్లినోళ్లు ప్రాణాలతో తిరిగి రారు. ఇదే ఊరిలో ఓ అనాథ లింగ (ధృవ వాయు). అదే ఊరిలో ఉండే పద్దు (ప్రగ్యా నయన్) ని ప్రాణంగా ప్రేమిస్తుంటాడు. కానీ ఈమె తండ్రి వీళ్ల ప్రేమకు అడ్డుచెబుతాడు. ఊరిపెద్ద దగ్గరున్న పొలం తనఖా విడిపిస్తేనే పెళ్లి చేస్తానని అంటాడు. కొన్ని గొడవల కారణంగా ఊరికి దగ్గరలోని అడవిలోకి లింగ, అతడి స్నేహితుడు వెళ్లాల్సి వస్తుంది. అప్పుడు ఊహించని పరిణామాలు ఎదురవుతాయి. ఇంతకీ అడవిలో ఏముంది? చివరకు ఏమైందనేదే స్టోరీ.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement