Tumbbad Movie
-
'చరిత్ర పునరావృతం'.. త్వరలో తుంబాడ్ 2
కొన్ని సినిమాలు ఎన్నిసార్లు చూసినా అద్భుతంగా అనిపిస్తాయి. అలాంటి చిత్రమే తుంబాడ్. హారర్ జానర్లో ట్రెండ్ సెట్ చేసిన ఈ సినిమా 2018లో విడుదలైంది. అప్పుడు మరీ అంత ఆదరణ లభించలేదు కానీ ఓటీటీలో మాత్రం జనం విపరీతంగా చూశారు. తాజాగా ఈ సినిమాను రీరిలీజ్ కూడా చేశారు. బాలీవుడ్లో ఫ్రెష్‌గా రిలీజ్ చేసిన సినిమాలకంటే ఎక్కువ వసూళ్లు తుంబాడ్ రాబట్టడం విశేషం.చరిత్ర పునరావృతంతాజాగా తుంబాడ్ మేకర్స్ ఓ గుడ్‌న్యూస్ చెప్పారు. ఈ చిత్రానికి సీక్వెల్ ప్రకటించారు. ఈ మేరకు తుంబాడ్ చిత్ర హీరో సోహమ్ షా చిన్న టీజర్ కూడా వదిలారు. ఇందులో కాలం ఎన్నటికీ ఆగదు.. చరిత్ర పునరావృతం అవుతుంది. ఆ ద్వారాలు మళ్లీ తెరుచుకోనున్నాయి అని పేర్కొన్నారు. ఇది చూసిన నెటిజన్లు ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇండియన్ సినిమాలోనే గ్రేటెస్ట్ మూవీ తుంబాడ్. ఇప్పుడు దీనికి సీక్వెల్ రాబోతుందంటే ఆగలేకపోతున్నామంటూ కామెంట్లు చేస్తున్నారు.ఈసారి మరిన్ని ట్విస్టులుఈ సీక్వెల్ గురించి హీరో, నిర్మాత సోహమ్ షా మాట్లాడుతూ.. తుంబాడ్ 2తో ఆడియన్స్‌కు మరింత అద్భుతమైన అనుభూతిని అందించాలనుకుంటున్నాం. ఈసారి మరిన్ని ట్విస్టులు ఉండనున్నాయి. అత్యాశకు పోతే ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయనేది మరింత లోతుగా, వివరంగా చూపించనున్నాం అని పేర్కొన్నాడు. View this post on Instagram A post shared by Sohum Shah Films (@sohumshahfilms) చదవండి: యష్మికి బుల్లెట్ దింపిన నాగ్.. వెంటనే ప్లేటు తిప్పేసిందే! -
ఊహించలేని ట్విస్ట్‌లతో 'తుంబాడ్'.. రీ-రిలీజ్ ట్రైలర్ చూశారా..?
రీ రిలీజ్ ట్రెండ్ అన్ని చిత్రపరిశ్రమలలో కొనసాగుతుంది. తెలుగు, హిందీ అనే తేడా లేకుండా ప్రతిచోటా ఒకప్పటి హిట్ సినిమాల్ని మళ్లీ థియేటర్లలో రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. ఇప్పటి వరకు మీరు లవ్ స్టోరీస్, యాక్షన్ అండ్ థ్రిల్లింగ్ సినిమాలను రీ-రిలీజ్లో చూసి ఉంటారు. ఇప్పుడు హారర్ సినిమా చూసేందుకు సిద్ధంగా ఉండండి.హారర్ జానర్లో ట్రెండ్ సెట్ చేసిన మూవీ అంటే చాలామంది చెప్పే పేరు 'తుంబాడ్'. ఈ సినిమా సెప్టెంబర్ 13న దేశవ్యాప్తంగా రీ-రిలీజ్ కానుంది. ఈ క్రమంలో తాజాగా ట్రైలర్‌ను విడుదల చేశారు. 2018లో విడుదలైన ఈ సినిమా ఆ సమయంలో పెద్దగా మెప్పించలేదు. అయితే, కరోనా సమయంలో అమెజాన్ ప్రైమ్‌లో తుంబాడ్ విడుదలైంది. అప్పుడు మాత్రం ఈ సినిమాకు ఒక ప్రత్యేకమైన ఫ్యాన్స్ ఉన్నారు. ఇప్పుడా సినిమాను బిగ్ స్క్రీన్ మీదే చూడాలనుకునే అభిమానులు సెప్టెంబర్ 13న చూడొచ్చు. తెలుగులో కూడా ఈ చిత్రాన్ని రీ-రిలీజ చేయనున్నారు. మహారాష్ట్రలోని 'తుంబాడ్' అనే గ్రామంలో దాగి ఉన్న నిధి గురించి సాగే అన్వేషణతో ఈ చిత్ర కథ ఉంటుంది. అత్యాశ మనిషికి ఎలాంటి పరిస్థితికి దిగజారుస్తుందో తండ్రీకొడుకుల పాత్రలతో తుంబాడ్‌లో చక్కగా చూపించారు. అనేక సన్నివేశాలను రీషూట్ చేయాల్సి రావడంతో.. ఈ చిత్రం ఆరేళ్ల పాటు షూటింగ్ జరుపుకుందట.!