ఊహించలేని ట్విస్ట్‌లతో 'తుంబాడ్‌'.. రీ-రిలీజ్‌ ట్రైలర్‌ చూశారా..? | Tumbbad Movie ReRelease Official Trailer Out Now, Watch Video Inside | Sakshi
Sakshi News home page

Tumbbad Re Release Trailer: ఊహించలేని ట్విస్ట్‌లతో 'తుంబాడ్‌'.. రీ-రిలీజ్‌ ట్రైలర్‌ చూశారా..?

Published Thu, Sep 5 2024 6:01 PM | Last Updated on Thu, Sep 5 2024 7:00 PM

Tumbbad ReRelease Official Trailer Out Now

రీ రిలీజ్ ట్రెండ్ అన్ని చిత్రపరిశ్రమలలో కొనసాగుతుంది.  తెలుగు, హిందీ అనే తేడా లేకుండా ప్రతిచోటా ఒకప్పటి హిట్ సినిమాల్ని మళ్లీ థియేటర్లలో రిలీజ్ చేస్తున్నారు మేకర్స్‌. ఇప్పటి వరకు మీరు లవ్‌ స్టోరీస్‌, యాక్షన్‌ అండ్‌ థ్రిల్లింగ్‌ సినిమాలను రీ-రిలీజ్‌లో చూసి ఉంటారు. ఇప్పుడు హారర్‌ సినిమా చూసేందుకు సిద్ధంగా ఉండండి.

హారర్ జానర్‌లో ట్రెండ్ సెట్ చేసిన మూవీ అంటే చాలామంది చెప్పే పేరు 'తుంబాడ్'. ఈ సినిమా సెప్టెంబర్‌ 13న దేశవ్యాప్తంగా రీ-రిలీజ్‌ కానుంది. ఈ క్రమంలో తాజాగా ట్రైలర్‌ను విడుదల చేశారు. 2018లో విడుదలైన ఈ సినిమా ఆ సమయంలో పెద్దగా మెప్పించలేదు. అయితే, కరోనా సమయంలో అమెజాన్‌ ప్రైమ్‌లో తుంబాడ్‌ విడుదలైంది. అప్పుడు మాత్రం ఈ సినిమాకు ఒక ప్రత్యేకమైన ఫ్యాన్స్‌ ఉన్నారు. ఇప్పుడా సినిమాను బిగ్‌ స్క్రీన్‌ మీదే చూడాలనుకునే అభిమానులు సెప్టెంబర్‌ 13న చూడొచ్చు. తెలుగులో కూడా ఈ చిత్రాన్ని రీ-రిలీజ​ చేయనున్నారు. 

మహారాష్ట్రలోని 'తుంబాడ్‌' అనే గ్రామంలో దాగి ఉన్న నిధి గురించి సాగే అన్వేషణతో  ఈ చిత్ర కథ ఉంటుంది. అత్యాశ మనిషికి ఎలాంటి పరిస్థితికి దిగజారుస్తుందో తండ్రీకొడుకుల పాత్రలతో తుంబాడ్‌లో చక్కగా చూపించారు. అనేక సన్నివేశాలను రీషూట్‌ చేయాల్సి రావడంతో.. ఈ చిత్రం ఆరేళ్ల పాటు షూటింగ్‌ జరుపుకుందట.!
 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement