కబాలి నటి క్రైమ్ థ్రిల్లర్‌.. నాలుగు నెలల తర్వాత ఓటీటీలో స్ట్రీమింగ్ | Kabali Actress Sai Dhanshika Latest Thriller Movie streaming On This OTT | Sakshi
Sakshi News home page

Sai Dhanshika: ఓటీటీకి సైకో క్రైమ్ థ్రిల్లర్‌..ఎక్కడ చూడాలంటే?

Published Fri, Feb 21 2025 5:26 PM | Last Updated on Fri, Feb 21 2025 5:48 PM

Kabali Actress Sai Dhanshika Latest Thriller Movie streaming On This OTT

రజనీకాంత్‌ హీరోగా తెరకెక్కిన కబాలి మూవీతో  అలరించిన నటి సాయి ధన్సిక. ఆ తర్వాత పెద్దగా సినిమాల్లో కనిపించలేదు. అయితే ఇటీవల సరికొత్త క్రైమ్ థ్రిల్లర్ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. సాయి ధన్సిక ప్రధాన పాత్రలో తెరకెక్కించిన చిత్రం 'దక్షిణ'.  ఓ సైకో కిల్లర్ నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. గతేడాది అక్టోబర్‌లో థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పెద్దగా రాణించలేకపోయింది.

తాజాగా ఈ థ్రిల్లర్ మూవీ ఓటీటీకి వచ్చేందుకు సిద్ధమైంది. ఈ రోజు నుంచే లయన్స్ గేట్ ప్లేలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ చిత్రంలో సాయి ధన్సిక ఏసీపీ పాత్రలో కనిపించింది. అమ్మాయిలను వరుస హత్యలు చేస్తోన్న ఆ సైకో కిల్లర్‌ను ఏసీపీ పట్టుకుందా?  ఆ తర్వాత చోటుచేసుకున్న పరిణామాలేంటి? అసలు ఆ కేసును ఆమె ఎలా ఛేదించింది? అనేదే ఈ దక్షిణ మూవీ స్టోరీ.  ఈ సినిమా థియేటర్లలో రిలీజైన దాదాపు నాలుగు నెలల తర్వాత ఓటీటీకి వచ్చేసింది. ఇంకెందుకు ఆలస్యం క్రైమ్ థ్రిల్లర్‌ జానర్ ఇష్టపడే వారు ఎంచక్కా ఈ  సినిమాను చూసేయండి. కాగా.. ఈ చిత్రానికి మంత్ర ఫేమ్ ఓషో తులసీరామ్ దర్శకత్వం వహించారు.

 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement