Dakshina
-
ఊదీ ఏం బోధిస్తోంది..?
బాబా తన దర్శనార్థం వచ్చే భక్తుల నుంచి దక్షిణ తీసుకుంటారనే విషయం అందరికీ తెలిసిందే. కొందరి దగ్గర అయితే అడిగి మరీ తీసుకునేవారు. అలా వసూలు చేసిన మొత్తాన్ని సర్వసంగ పరిత్యాగి అయిన సాయి ఏం చేసుకుంటారనే కదా అందరి సందేహం... సాయిబాబా తన భక్తులనుంచి శ్రద్ధను, భక్తి విశ్వాసాలను దక్షిణగా కోరారు. ఎందుకంటే శ్రద్ధ, భక్తి విశ్వాసాలే ఏ పనిని చేయడానికైనా అత్యంత ఆవశ్యకాలు. అందుకే ఆయన భక్తులనుంచి శ్రద్ధ, సబూరి రూపంలో దక్షిణను అడిగి మరీ తీసుకునేవారు. వాటిని తనకిస్తే వారి జీవితాలను తీయబరుస్తానని చెబుతూ... ‘‘శ్రద్ధ, సబూరి అనే రెండు కాసులను ఎవరు దక్షిణగా సమర్పిస్తారో వారిని పరిపూర్ణంగా అనుగ్రహిస్తాను. భక్తులలోని ఉన్నతమైన శ్రద్ధాభక్తులే వారిని ఆధ్యాత్మికంగా సౌశీల్యవంతులుగా తీర్చిదిద్దుతాయి. నా పలుకులను విశ్వసించే వారు ధన్యులు’’ అని ఆయన పదే పదే బోధించేవారు. ఆయన బోధలను ఆచరించిన వారికి ఆయన అనుగ్రహంతో సకలైశ్వర్యాలు చేకూరతాయన టంలో సందేహం లేదు. తన వద్ద పోగుపడిన ధనంలో ఎక్కువభాగం దానం చేసి, మిగతా దానితో వంట చెరుకును కొనేవారు. ఈ కట్టెలను బాబానే స్వయంగా ధునిలో వేసి మండించేవారు. మసీదులో బాబా నిత్యం ధునిని వెలిగిస్తూనే ఉండేవారు. అది ఇప్పటికీ అలా మండుతూనే ఉంది. అందులో నుంచి ఉద్భవించే బూడిదనే ఊదీ అంటారు. బాబా ఆ ఊదీనే తీసి భక్తులకు ఇళ్లకు తిరిగి వెళ్లేముందు ఆశీర్వదించి వారికి అందించేవారు. ఒక్కోసారి దానితోనే వైద్యం చేసేవారు. చిటికెడు ఊదీని బాబా తన భక్తుల నుదుటిపై పెట్టారంటే వారికి సర్వ రోగాలూ నయమయేవి.ఊదీ ద్వారా భక్తులకు బాబా ఏం బోధించారంటే... ప్రపంచంలో కనిపించే వస్తువులన్నీ అశాశ్వతాలు. పంచభూతాలచే రూ΄÷ందిన మన శరీరాలన్నీ సౌఖ్యాలు అనుభవించిన తరువాత పతనమైపోయి శిథిలమై బూడిదవుతాయి. ఈ విషయాన్నే నిరంతరం గుర్తు చేసేందుకే బాబా భక్తులకు ఊదీ ప్రసాదాన్ని అందించేవారు. ఈ ఊదీ వల్లనే బ్రహ్మము నిత్యమని, ఈ జగత్తు అశాశ్వతమని, ప్రపంచంలో గల మన బంధువులు, కొడుకుగాని, తండ్రిగాని, తల్లిగాని, మనవారు కారని బాబా బోధించారు. మనం ఎందరితో ఎన్ని రకాలుగా ఎంతగా ఎన్ని బంధాలు, అనుబంధాలు పెనవేసుకున్నా, అవేవీ శాశ్వతం కావని, ఈ ప్రపంచంలోకి మనం ఒంటరిగానే వచ్చాము, తిరిగి ఒంటరిగానే వెళ్తామన్న సత్యాన్ని బోధించేవారు.ఊదీకి ఆధ్యాత్మిక విశేషమే కాదు, భౌతికప్రాముఖ్యం కూడా ఉంది. ఊదీ అనేక విధాలుగా శారీరక మానసిక రోగాలకు ఔషధంగా పనిచేసేది. రోగులకు, బాధార్తులకు స్వస్థత కలిగించేది. తాము ధరించిన ఊదీ ద్వారా భక్తుల చెవిలో నిత్యానిత్యాలకు గల తారతమ్యం, అనిత్యమైన దానిపై అభిమాన రాహిత్యం గంట మోతవలె వినిపించి, చెడుపనులు, చెడు తలంపుల నుంచి దూరం చేస్తాయి. అలాగే ఊదీ ధరించిన వారికి ఆరోగ్యం, ఐశ్వర్యం కలుగుతాయని భక్తుల విశ్వాసం. అందుకే బాబా భక్తులు తప్పనిసరిగా నుదుట విభూది ధరిస్తారు. -
రూ.14 వేలకే 'దివ్య దక్షిణ్ యాత్ర'..తొమ్మిది రోజుల్లో ఏకంగా ఏడు..!
దక్షిణాది పుణ్య క్షేత్రాలు దర్శించుకోవాలనుకునేవారికి ఇది మంచి ఆఫర్. తక్కువ ధరలోనే దక్షిణది పుణ్యక్షేత్రాలను దర్మించుకునేలా ఇండియన్ రైల్వేస్ క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) మంచి టూర్ ప్యాకేజ్ ప్రకటించింది. అందుకోసం సికింద్రబాద్ నుంచి మరో భారత గౌరవ్ టూరిస్ట్ రైలుని తీసుకొచ్చింది. పుణ్యక్షేత్రాలు, ఆధ్యాత్మిక ప్రాంతాలకు ప్రత్యేకంగా ఏర్పాటుచేసే భారత్ గౌరవ్ రైళ్లకు యాత్రికుల నుంచి అనూహ్య స్పందన రావడంతో సికింద్రాబాద్ నుంచి జ్యోతిర్లింగ సహిత దివ్యదక్షిణ యాత్ర కోసం ప్రత్యేక రైలును ఏర్పాటుచేసింది. ఈ పర్యటన తెలంగాణ , ఆంధ్ర ప్రదేశ్ రైలు ప్రయాణీకులకు జ్యోతిర్లింగం (రామేశ్వరం) దర్శనం చేసుకునే అవకాశాన్ని అందిస్తుంది. అలాగే ఇతర ముఖ్యమైన యాత్రా స్థలాలను కూడా కవర్ చేస్తుంది. ఈనెల 22 నుంచి ఈ యాత్ర ప్రారంభం అవుతుంది. ఈ గౌరవ్ రైలుని విజయవాడ, గూడూరు, ఖమ్మం, కాజీపేట, నెల్లూరు, ఒంగోలు, రేణిగుంట, సికింద్రాబాద్, తెనాలి, వరంగల్ స్టేషన్లలో ఎక్కొచ్చు. ప్రయాణం అనంతరం ఆయా రైల్వేస్టేషన్లలో దిగే వెసులుబాటు ఉంది. ఈ టూర్ మొత్తం ఎనిమిది రాత్రులు, తొమ్మిది పగళ్లుగా కొనసాగుతుంది. టూటైర్ ఏసీ, త్రీటైర్ ఏసీ, స్లీపర్ క్లాసుల్లో ప్రయాణానికి టికెట్లు బుక్ చేసుకోవచ్చు. టికెట్ ధరలు రూ.14వేల నుంచి మొదలవుతాయి.జర్నీ ఎలా సాగుతుందంటే..సికింద్రాబాద్‌లో మధ్యాహ్నం 12.00 గంటలకు రైలు బయలు దేరుతుంది. రెండో రోజు ఉదయం 7 గంటలకు తిరువణ్ణామలై(అరుణాచలం) చేరుకుంటారు. అరుణాచలం రైల్వే స్టేషన్‌కు చేరుకున్న తర్వాత, ఫ్రెష్ అవ్వడానికి హోటల్‌కు చేరుకుంటారు.ఆ తర్వాత అరుణాచలం ఆలయాన్ని దర్శించుకుంటారు. ఇక సాయంత్రం కుదల్‌నగర్‌కు పయనమవుతారు.మూడో రోజు ఉదయం 6.30 గంటలకు కూడాల్ నగర్ రైల్వే స్టేషన్‌కు చేరుకుంటారు. రోడ్డు మార్గంలో రామేశ్వరానికి చేరుకుంటారు. హోటల్లో బస చేసి, ఫ్రెష్ అప్ అయిన తర్వాత రామేశ్వరంలోని దేవాలయాలను సందర్శిస్తారు రాత్రికి రామేశ్వరంలోనే బస ఉంటుంది.నాలుగో రోజు మధ్యాహ్న భోజనం తర్వాత రామేశ్వరం నుంచి మధురైకి బస్సులో బయలుదేరతారు. మీనాక్షి అమ్మ వారి ఆలయాన్ని దర్శించుకుంటారు. సాయంత్రం స్థానికంగా షాపింగ్ చేయడానికి సమయం ఉంటుంది. కన్యాకుమారి వెళ్లేందుకు రాత్రి కూడాల్ నగర్ రైల్వే స్టేషన్లో డ్రాప్ చేస్తారు. రాత్రి 11.30 కన్యాకుమారికి పయనమవుతారు. ఐదో రోజు ఉదయం 8 గంటలకు కొచ్చువేలి రైల్వే స్టేషన్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో కన్యాకుమారికి వెళ్తారు. హోటల్లో బస చేస్తారు. ఆ తర్వాత వివేకా రాక్ మెమోరియల్, గాంధీ మండపం, సన్‌సెట్ పాయింట్ టూర్ ఉంటుంది. రాత్రికి కన్యాకుమారిలోనే స్టే చేస్తారు.ఆరో రోజు కన్యాకుమారి - కొచ్చువేలి - తిరుచ్చి-హోటల్ నుంచి చెక్ అవుట్ చేసి..రోడ్డు మార్గంలో త్రివేండ్రం బయలుదేరి వెళ్తారు. త్రివేండ్రంలో అనంత పద్మనాభస్వామి దేవాలయం, కోవలం బీచ్‌ని సందర్శిస్తారు. ఇక తిరుచిరాపల్లికి వెళ్లడానికి కొచ్చువేలి స్టేషన్లో రైలు ఎక్కుతారు.ఏడో రోజు ఉదయం 5 గంటలకు తిరుచిరాపల్లి రైల్వే స్టేషన్‌కు చేరుకుంటారు. హోటల్ చేరుకుని ఫ్రెష్ అయ్యి తర్వాత శ్రీరంగం ఆలయ దర్శనానికి వెళ్తారు. మధ్యాహ్న భోజనం తర్వాత రోడ్డు మార్గంలో తంజావూరు (60 కి.మీ.) వెళ్తారు. తంజావూరు బృహదీశ్వర దేవాలయాన్ని సందర్శించుకుంటారు. అనంతరం రాత్రి 11 గంటలకుతంజావూర్లో సికింద్రాబాద్ రైలు ఎక్కుతారు.ఎనిమిదో రోజు మొత్తం రైలు జర్నీయే ఉంటుంది. పైన పేర్కొన్న స్టేషన్లలో స్టాపింగ్ ఉంటుంది. తొమ్మిదో రోజు ఉదయం 2:30 గంటలకు సికింద్రాబాద్ చేరుకోవడంతో యాత్ర ముగుస్తుంది.ఛార్జీలు: ఎకానమీలో ఒక్కరికి రూ. 14,250, 5 నుంచి 11 ఏళ్ల మధ్య చిన్నారులకు రూ. 13,250 చెల్లించాలి.స్టాండర్ట్‌లో ఒక్కరికిరూ.21,900; 5 నుంచి 11 ఏళ్ల మధ్య చిన్నారులకు రూ.20,700 చెల్లించాలి.కంఫర్ట్‌లో ఒక్కరికిరూ.28,450; 5 నుంచి 11 ఏళ్ల మధ్య చిన్నారులకు రూ.27,010 చెల్లించాలి.ఫుడ్ ఐఆర్టీసీదే..రైలులో టీ, టిఫిన్, భోజనంన్ని ఐరా్టీసీనే ఏ ర్పాటు చేస్తుందియాత్రికులకు ట్రావెల్ ఇన్సూరెన్స్ ఉంటుంది.పర్యాటక ప్రదేశంలో ఎక్కడైనా ప్రవేశ రుసుములు మాత్రం వ్యక్తులే చెల్లించువాల్సి ఉంటుంది.పుణ్యక్షేత్రాల్లో స్త్రీ, పురుషులు తప్పనిసరిగా సంప్రదాయ దుస్తులు ధరించాల్సి ఉంటుంది.దక్షిణ భారత్‌లోని జ్యోతిర్లింగ దివ్య క్షేత్రాల ఐఆర్సీటీసీ టూర్ ప్యాకేజీ వివరాలు, బుకింగ్ కోసం ఐఆర్టీసీ టూరిజం లింక్‌పై క్లిక్ చేయండి.(చదవండి: తిరుచ్చిలో చూడాల్సిన అద్భుత పర్యాటకప్రదేశాలివే..!) -
సైకో థ్రిల్లర్‌గా 'దక్షిణ'.. ట్రైలర్‌తోనే భయపెట్టారు!
కబాలి ఫేమ్ సాయి ధన్షిక ప్రధానపాత్రలో వస్తోన్న చిత్రం దక్షిణ. మంత్ర, మంగళ సినిమాలతో మెప్పించిన ఓషో తులసి రామ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. కల్ట్ కాన్సెప్ట్స్ మూవీ బ్యానర్‌పై అశోక్ షిండే నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో రిషవ్ బసు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించి గ్లింప్స్ రిలీజ్ చేయగా.. ఆడియన్స్ నుంచి విశేష స్పందన వచ్చింది. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను డైరెక్టర్ బుచ్చిబాబు సనా రిలీజ్ చేశారు.ఈ సందర్భంగా డైరెక్టర్ బుచ్చిబాబు మాట్లాడుతూ... 'ఈ మధ్య కాలంలో నన్ను బయపెట్టిన ట్రైలర్ ఇదే. తులసి రామ్ టాలీవుడ్‌కి మరో ట్రెండ్ సెట్టర్. దక్షిణ సినిమాతో సైకో థ్రిల్లర్‌ను ఇవ్వబోతున్నారు' అంటూ అభినందించారు. కాగా.. ఈ కార్యక్రమంలో దర్శక నిర్మాతలతో పాటు చిత్రబృందం కూడా పాల్గొన్నారు. ఈ సినిమా సైకో థ్రిల్లర్‌గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా చూసేటప్పుడు ఏం జరుగుతోందన్న సస్పెన్స్ ప్రేక్షకుల్లో ఉత్కంఠ కలిగిస్తుందని నిర్మాత అశోక్ షింజే అన్నారు. త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తామని ఆయన తెలిపారు. -
సైకో థ్రిల్లర్
సాయిధన్సిక ప్రధాన పాత్రలో రూపొందుతోన్న చిత్రం ‘దక్షిణ’. ఓషో తులసీరామ్ దర్శకత్వంలో కల్ట్ కాన్సెప్ట్స్ పతాకంపై అశోక్ షిండే నిర్మిస్తున్నారు. ఆదివారం (నవంబరు 20) సాయిధన్సిక బర్త్ డే సందర్భంగా ఈ సినిమా మోషన్ పోస్టర్‌ను రిలీజ్ చేసింది చిత్రయూనిట్. ‘‘సైకో థ్రిల్లర్‌గా రూపొందుతున్న చిత్రమిది. సాయి ధన్సిక హై ఓల్టేజ్ పెర్ఫార్మెన్స్ చేస్తున్నారు. తెలుగు, తమిళంలో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ 70 శాతం పూర్తయింది. డిసెంబరులో విశాఖలో జరిగే షెడ్యూల్‌తో షూటింగ్ కంప్లీట్ అవుతుంది’’ అన్నారు అశోక్ షిండే. బెంగాలీ హీరో రిషవ్ బసు విలన్‌గా నటిస్తున్న ఈ సినిమాకు సంగీతం: బాలాజీ. -
హీరోగా మరో సినిమా చేస్తున్న జానీ మాస్టర్!
Jani Master: ప్రముఖ నృత్యదర్శకుడు జానీ మాస్టర్ హీరోగా పరిచయమవుతున్న సంగతి తెలిసిందే. మురళీరాజ్ తియ్యాన దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా గత ఏడాది డిసెంబరులో ప్రారంభమైంది. తాజాగా హీరోగా ఇంకో ఆఫర్ అందుకున్నారు జానీ. ‘మంత్ర, మంగళ’ చిత్రాల ఫేమ్ ఓషో తులసీరామ్ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రానికి ‘దక్షిణ’ అనే టైటిల్‌ని ఖరారు చేశారు. నేడు (జులై 2) జానీ మాస్టర్ బర్త్‌డే సందర్భంగా ఈ చిత్రాన్ని ప్రకటించారు. ‘‘ఇదొక సూపర్ నేచురల్ థ్రిల్లర్. అరకు, గోవా ఫారెస్ట్, బెంగళూరు ప్రాంతాల్లో చిత్రీకరణ జరుపుతాం’’ అన్నారు తులసీరామ్. -
భక్తులిచ్చే దక్షిణను కూడా లంచమంటారా?
చంద్రబాబుపై ఏపీ అర్చక సమాఖ్య ఆగ్రహం సాక్షి, హైదరాబాద్: భక్తులు పూజారులకు సమర్పించుకునే దక్షిణను కూడా సీఎం చంద్రబాబు లంచంగా అభివర్ణించడంపై ఏపీ అర్చక సమాఖ్య ఆగ్రహం వ్యక్తం చేసింది. శ్రీకాకుళంలో జరిగిన ఏపీఎన్జీవోల సభలో ముఖ్యమంత్రి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమని సమాఖ్య ప్రధాన కార్యదర్శి ఆత్రేయబాబు, కార్యదర్శి పెద్దింటి రాంబాబు, ప్రతినిధులు పద్మనాభశర్మ, సుధీర్ ఫణిగోపాల్ శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. పూజారులకు, అర్చకులకు దక్షిణ సమర్పించడం సంప్రదాయంలో భాగమని.. దానిని లంచంగా, అవినీతిగా చిత్రీకరించడం తగదన్నారు. అధికారంలోకి వస్తే అర్చకులకు అనేక మేళ్లు చేస్తామని చెప్పిన చంద్రబాబు, నేడు ఇలా మాట్లాడడం శోచనీయమన్నారు. ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి దూరదృష్టి వల్లే ఈరోజు అర్చకులు ఆలయాల్లో సేవలు చేయగలుతున్నారని వివరించారు. -
మరణంలోనూ తోడుగానే..
ఒకేరోజు భార్యాభర్తల మృతి మల్కాజిగిరిలో విషాదం గౌతంనగర్: ‘నాతి చరామి’ అన్న పదానికి వారు అర్థమై నిలిచారు. మూడు ముళ్ల బంధంతో మొదలైన వారి ప్రయాణం... మరణశయ్య వరకూ కలిసే సాగింది. ఏడడుగులు నడిచి... ఆరు దశాబ్దాల పాటు కష్టసుఖాలను కలసి పంచుకున్న ఆ జంట చివరి అడుగునూ కలిసే వేశారు. అందరినీ కన్నీటి సంద్రంలో ముంచి సుదూర తీరాలకు సాగిపోయారు. మల్కాజిగిరిలో చోటుచేసుకున్న ఈ విషాద సంఘటన వివరాలివీ... స్థానిక హనుమాన్‌పేట్‌కు చెందిన దక్షి ణామూర్తి (86), కమలా మూర్తి (82) భార్యాభర్తలు. దక్షిణామూర్తి ప్రముఖ కళాకారుడు, చిత్రలేఖనంలో సిద్ధ హస్తుడు. దక్షిణ మధ్య రైల్వేలో పనిచేసి, పదవీ విరమణ చేశారాయన.అనంతరం రైల్వే బాలల పాఠశాల, మహబూబియా కళాశాలల్లో కొన్నాళ్లు ఉపాధ్యాయునిగా సేవలందించారు. కమలా మూర్తినాలుగు రోజులుగా అనారోగ్యంతో బాధ పడుతుండడంతోఆస్పత్రిలో చేర్పించారు. భార్య ఆస్పత్రిలో చేరిన నాటి నుంచి భర్త దక్షిణామూర్తి మనోవేదనతో అన్నపానీయాలు మానేశారు. ఆమెపై దిగులుతో కుంగిపోయిన ఆయన...చివరకు శుక్రవారం తెల్లవారు జామున సుమారు 3 గంటల ప్రాంతంలో కన్నుమూశారు. భర్త ఇక లేడన్న నిజాన్ని కమలామూర్తి తట్టుకోలేకపోయారు. శుక్రవారం మధ్యాహ్నం 2.30 గంటలకు ఆమె తుది శ్వాస విడిచారు. గంటల వ్యవధిలో దంపతులు మృతి చెందడంతో స్థానికంగా విషాదం నెలకొంది. వీరి మరణ వార్త తెలుసుకున్న చిన్న నాటి స్నేహితులు, బంధువులు ఘనంగా నివాళులర్పించారు.