హీరోగా మరో సినిమా చేస్తున్న జానీ మాస్టర్‌! | Director Osho Tulasi Ram new film with Jaani Master | Sakshi
Sakshi News home page

Jani Master: హీరోగా ఇంకోటి!

Published Fri, Jul 2 2021 5:49 AM | Last Updated on Fri, Jul 2 2021 7:26 AM

 Director Osho Tulasi Ram new film with Jaani Master - Sakshi

Jani Master: ప్రముఖ నృత్యదర్శకుడు జానీ మాస్టర్‌ హీరోగా పరిచయమవుతున్న సంగతి తెలిసిందే. మురళీరాజ్‌ తియ్యాన దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా గత ఏడాది డిసెంబరులో ప్రారంభమైంది. తాజాగా హీరోగా ఇంకో ఆఫర్‌ అందుకున్నారు జానీ. ‘మంత్ర, మంగళ’ చిత్రాల ఫేమ్‌ ఓషో తులసీరామ్‌ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రానికి ‘దక్షిణ’ అనే టైటిల్‌ని ఖరారు చేశారు. నేడు (జులై 2) జానీ మాస్టర్‌ బర్త్‌డే సందర్భంగా ఈ చిత్రాన్ని ప్రకటించారు. ‘‘ఇదొక సూపర్‌ నేచురల్‌ థ్రిల్లర్‌. అరకు, గోవా ఫారెస్ట్, బెంగళూరు ప్రాంతాల్లో చిత్రీకరణ జరుపుతాం’’ అన్నారు తులసీరామ్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement