Dance master
-
జానీ మాస్టర్‌కి అవకాశాలు ఇవ్వొద్దు : కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌పై లైంగిక వైధింపుల కేసు నమోదైన సంగతి తెలిసిదే. బాధితురాలు రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేయగా.. జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి, అనంతరం ఆ కేసును నార్సింగి పోలీసులకు అప్పగించారు. అక్కడి పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చెపట్టారు. ప్రస్తుతం జానీ వివాదం టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది. ఫిలిం ఛాంబర్‌తో పాటు పలువురు సినీ ప్రముఖులు ఈ వివాదంపై స్పందించారు. జానీ మాస్టర్‌పై చర్యలు తీసుకోవాలని సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేస్తున్నారు. (చదవండి: త్రివిక్రమ్‌పై ఆరోపణలు.. పూనమ్ షాకింగ్ ట్వీట్)తాజాగా ‘తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్’ అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వర రెడ్డి కూడా ఈ వివాదంపై స్పందిస్తూ.. జానీ మాస్టర్‌కి ప్రకటించిన జాతీయ ఉత్తమ కొరియోగ్రాఫర్ అవార్డును విచారణ ముగిసేవరకు ఆపాలని కమిటీకి విజ్ఞప్తి చేశారు. ఇలాంటివి జరిగినప్పుడు స్పందించడం మాత్రమే కాకుండా..శాశ్వత పరిష్కారం దిశగా చిత్ర పరిశ్రమ పెద్దలు అడుగులు వేయాలని కోరారు. (చదవండి: జానీ మాస్టర్ వివాదంపై ఫిలిం ఛాంబర్ ఏం చెబుతుందంటే..?)షూటింగ్ జరిగే ప్రదేశాలలో సీసీ టీవీలు ఏర్పాటు చేసి..ఇలాంటి వేధింపు ఉండకుండా చేయాలని డిమాండ్ చేశారు. అంతేకాదు లైగింక వేధింపు కేసు తేలేవరకు జానీ మాస్టర్‌కు చిత్ర పరిశ్రమలో అవకాశాలు ఇవ్వకూడదని నిర్మాతలను కోరారు. డాన్స్ మాస్టర్ అసోషియేషన్ అధ్యక్షుడిగా ఉన్న జానీ మాస్టర్ని వెంటనే ఆ పదవి నుంచి తొలగించాలని ఫిలిం ఛాంబర్‌కు విజ్ఞప్తి చేశారు. -
మాస్ డ్యాన్సర్.. పోలకి విజయ్
ఊ అంటావా...మార్ ముంత వరకూ అనేక హిట్ సాంగ్స్‌కి మాస్ స్టెప్పులు ఏజాస్ మాస్టర్ పరిచయంతో ఇండస్ట్రీకి రణ్వీర్ కపూర్ బాగా ప్రోత్సహించారు ‘సాక్షి’తో కొరియోగ్రాఫర్ పోలకి విజయ్ పుష్ప–1 లో ఊ అంటావా మావా... ఊహూ అంటావా మావ.. పుష్ప–2 లో పుష్ప.. పుష్ప.. పుష్ప రాజ్.. డబుల్ ఇస్మార్ట్ శంకర్ చిత్రంలో మార్ముంత చోడ్ చింత.. మ్యాడ్ చిత్రంలో కళ్లజోడు కాలేజీపాప.. కాలేజ్ పోతున్నది.. కోట బొమ్మాళి చిత్రంలోని లింగిడి, లింగిడి.. ఇలాంటి పాటలు వింటుంటే స్టెప్పులు వేయాలనే ఆలోచన తప్పక వస్తుంది.. అలాంటి పాటలకు కొరియోగ్రఫీ చేసింది ఎవరో కాదు.. మన తెలుగబ్బాయే.. ఎటువంటి బ్యాక్‌గ్రౌండ్ లేదు.. కష్టేఫలి అనే సిద్ధాంతాన్ని నమ్ముకొని టాలీవుడ్ టు బాలీవుడ్‌కు పాగా వేసిన మన తెలుగు కొరియోగ్రాఫర్ పోలకి విజయ్ డెడికేషన్‌కి టాలీవుడ్ అగ్రహీరోలు ఫిదా అవుతున్నారు. స్టెప్పులు వేస్తే.. క్లాస్ టు మాస్ జనాలు ఉర్రూతలూగేలా చేస్తున్న పోలకి విజయ్ జీవితం ఓ ఇన్స్పిరేషన్లా ఉంటుంది.. ఈ నేపథ్యంలో విజయ్ ‘సాక్షి’తో పంచుకున్న పలు ఆసక్తికర విషయాలు. నేను పుట్టింది శ్రీకాకుళం జిల్లా పలాస. చిన్నతనంలోనే అమ్మ నాన్మ చనిపోయారు. అమ్మమ్మ, తాతమ్మల దగ్గరే పెరిగాను. చిన్నతనం నుండే నటన అంటే ఇష్టం. ఆర్టిస్ట్ అవుదామనే కల ఉండేది. కానీ డ్యాన్స్‌లు సైతం బాగా వేసేవాడిని. అలా నటన, డ్యాన్స్‌లలో స్వతహాగా మంచి ప్రావీణ్యం సంపాదించుకున్నాను. అమ్మమ్మ, తాతయ్యలకు భారం కాకూడదని బతుకుదెరువు కోసం హైదరాబాద్ వచ్చాను. కానీ ఇక్కడ ఎవరూ తెలియదు. ఎవరిని కలవాలో తెలియదు. చిన్నచిన్న పనులు చేసుకుంటూ.. కషే్టఫలి అనేది నమ్మాను. ఎన్నికష్టాలు వచి్చనా నా ప్రయాణాన్ని ఆపలేదు. పనులు చేస్తూ జీవనం గడుపుతూ అక్కడక్కడా నాకు తెలిసిన డ్యాన్స్‌లు వేసేవాడిని.ఏజాస్ మాస్టర్ పరిచయం..పని, డ్యాన్స్‌లు తప్ప వేరే వ్యాకపం ఉండేది కాదు.. అలా నా అభిలాషను మెచ్చి ఓ అజ్ఞాతవ్యక్తి ఓ డ్యాన్స్ ఇన్స్టిట్యూట్కి తీసుకువెళ్లాడు. ఏజాస్ మాస్టర్ స్వర్ణలత మాస్టర్ అసిస్టెంట్. అలా డ్యాన్స్ ఇన్స్టిట్యూట్లో చేరాను. చాలా మెళకువలు నేర్చుకున్నాను. నన్ను ఇన్స్టిట్యూట్కి తీసుకెళ్లిన ఆ అజ్ఞాతవాసి మరలా కనిపించలేదు.డ్యాన్సర్‌గా ఇండస్ట్రీకి..డ్యాన్స్‌లో మంచి పట్టు సాధించాక 2015లో తెలుగు సినీ డ్యాన్సర్స్ అసోసియేషన్‌లో కార్డ్‌ను తీసుకున్నాను. సినిమాల్లో డ్యాన్సర్‌గా చేసే సమయంలో తోటిడ్యాన్సర్స్ నీలో మంచి టాలెంట్ ఉంది. కొరియోగ్రాఫర్‌గా చేయమని సలహా ఇచ్చారు. కొన్ని డ్యాన్స్ విడియోస్ చేశాక ‘బేబి’ చిత్ర దర్శకుడు సాయిరాజేష్ నిర్మాణంలోని సంపూర్ణే‹Ùబాబు ‘కొబ్బరిమట్ట’ చిత్రంలో అవకాశం వచి్చంది. ఆ తర్వాత నేను పుట్టిన పలాస పేరుతో కరుణసాగర్ దర్శకత్వంలోని ‘పలాస’ చిత్రంలో నాదీ నక్కిలీసు గొలుసు పాటకు కొరియోగ్రఫీ చేశాను. ఈ పాటకు మంచి పేరు వచి్చంది. అలా కొరియోగ్రాఫర్‌గా స్థానాన్ని నిలబెట్టుకున్నాను.పుష్పతో మరోమెట్టు.. దర్శకుడు సుకుమార్, హీరో అల్లు అర్జున్ పుష్ప చిత్రంలో అవకాశం ఇచ్చారు. ఊ అంటావా పాటకు కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్యతో కలిసి చేశాను. ఈ పాట దేశంతోపాటు అంతర్జాతీయంగా ప్రాచుర్యం పొందింది. పుష్ప–2లో పుష్ప, జాతర పాటకూ కొరియోగ్రఫీ చేశాను. రవితేజ, శర్వానంద్, విజయ్‌దేవరకొండ, నాని చిత్రాలకు కొరియోగ్రఫీ చేశాను. రీసెంట్ రామ్ ‘డబుల్ ఇస్మార్ట్‌శంకర్’లో మార్ముంత చోడ్చింతకు కోరియోగ్రఫీ చేశా. యూట్యూబ్‌లో సంచలనంగా మారింది. బాలీవుడ్లో అవకాశం.. హీరో రణ్వీర్ కపూర్ నటిస్తున్న ‘తు ఝూతీ మైన్ మక్కర్’ చిత్రంలోని పాటకు కొరియోగ్రఫీ చేశాను. రణ్వీర్ కపూర్ బాగా ప్రోత్సహించారు. అంతేకాకుండా నాకు నచి్చన బెస్ట్ మాస్టర్ లారెన్స్ మాస్టర్‌కి ‘రుద్రుడు’ చిత్రంలో కొరియోగ్రఫీ చేశాను. ఈ అనుభవం జీవితంలో మరువలేనిది.చిరంజీవికి కొరియోగ్రఫీ నా ఆశయంచిన్నతనం నుండి నా గాడ్‌ఫాదర్ చిరంజీవి. ఆయన డ్యాన్సులు చూసి పెరిగాను. ‘ఇంద్ర’ చిత్రాన్ని 22సార్లు చూశాను. కేవలం దాయి దాయి దామ్మ పాట కోసమే చూశాను. ఆ పాటకు కొరియోగ్రఫీ చేసిన లారెన్స్ మాస్టర్‌కి కొరియోగ్రఫీ చేయడం సంతోషంగా ఉంది. కానీ నా గాడ్‌ఫాదర్ చిరంజీవికి కొరియోగ్రఫీ చేయాలన్నది నా ఆశయం. ఆ దిశగా ఆడుగులు వేస్తున్నాను. డ్యాన్స్‌పై ఇష్టంతో ఈ స్థాయికి వచ్చాను. గుర్తుండిపోయే కొరియోగ్రాఫర్‌గా ప్రజల మదిలో ఉంటూ మరో లక్ష్యం దిశగా నా ప్రయాణాన్ని కొనసాగించి విజయాన్ని సాధిస్తాను. మీ దీవెనలే నాకు కొండత బలమని నమ్ముతూ.. అందరికీ నా కృతజ్ఞతలు.. -
ప్రియురాలిపై సామూహిక అత్యాచారం.. డ్యాన్స్ మాస్టర్ అరెస్ట్
యశవంతపుర: యువతిని ప్రైవేట్ వీడియోలతో బెదిరించి ఆత్యాచారానికి పాల్పడిన డ్యాన్స్ మాస్టర్‌తో పాటు అతని ఇద్దరి స్నేహితులను బెంగళూరు కొడిగేహళ్లి పోలీసులు అరెస్ట్ చేశారు. యువతికి నాలుగేళ్ల క్రితం సోషల్ మీడియాలో యాండీ జార్జీ పరిచయమయ్యాడు. ఇతడు ఒక ప్రైవేటు స్కూల్లో డ్యాన్స్‌మాస్టర్‌గా పనిచేసేవాడు. ఆ పరిచయం ప్రేమగా మారి ఇద్దరూ రెండేళ్ల పాటు షికార్లకు వెళ్లారు. అతడు వేధించడంతో ఆమె కొంతకాలం నుంచి దూరంగా ఉంటోంది. దీంతో యువతితో కలిసి ఉన్న పాత పోటోలు, వీడియోలను చూపిస్తూ బ్లాక్ మెయిల్ చేయసాగాడు. ఇటీవల యాండీ జార్జి, స్నేహితులు సంతోష్, శశిలు కలిసి తనపై సామూహికంగా అత్యాచారం చేసినట్లు యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్, పెన్ డ్రైవ్‌ను స్వాధీనం చేసుకున్నారు. యాండీ జార్జీ పాఠశాలలోనూ విద్యార్థులతోను అసభ్యంగా ప్రవర్తించినట్లు విచారణలో తేలిందని ఈశాన్య డీసీపీ లక్ష్మీప్రసాద్ తెలిపారు. -
డ్యాన్స్ మాస్టర్ ఆత్మహత్య.. అసలేం జరిగింది?
నల్గొండ: ఉరేసుకొని డ్యాన్స్‌మాస్టర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన కోదాడ రూరల్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని కొమరబండలో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన దార సురేష్(30) డ్యాన్స్‌మాస్టర్‌గా పనిచేస్తున్నాడు. ఇటీవల మద్యానికి బానిసయ్యాడు. వివాహం కాకపోవడంతో జీవితంపై విరక్తి చెంది ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకున్నాడు. అతడి స్నేహితుడు ఇంటికి వెళ్లగా తలుపు తీయకపోవడంతో అనుమానం వచ్చి కిటికీలో నుంచి చూడగా ఉరి వేసుకుని ఉన్నాడు. వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడంతో వారు అక్కడకు చేరుకుని, కిందకు దించి చూసే వరకు సురేష్ మృతి చెంది ఉన్నాడు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అందజేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ సంఘటనపై మృతుడి సోదరుడు బొబ్బిలిరాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. -
Rakesh Master: రాకేశ్ మాస్టర్ కొరియోగ్రఫీ చేసిన తొలి సినిమా ఏదంటే?
తెలుగు చలన చిత్రపరిశ్రమలో విషాదం నెలకొంది. ప్రముఖ నృత్య దర్శకుడు ఎస్.రామారావు అలియాస్ రాకేష్ మాస్టర్(53) ఆదివారం మృతిచెందారు. వారం క్రితం ఓ సినిమా షూటింగ్ కోసం విశాఖపట్నం, భీమవరం వెళ్లి వచ్చిన ఆయన అప్పటినుంచి అనారోగ్యం పాలయ్యారు. ఆదివారం రక్త విరోచనాలు కావడంతో గాంధీ ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. 10 ఏళ్ల వయసులోనే డ్యాన్స్ వైపు అడుగులు ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి ప్రాంతంలో రాకేష్ మాస్టర్ జన్మించారు. ఆయన అసలు పేరు ఎస్.రామారావు. 10 ఏళ్ల వయస్సులో డిస్కో డాన్స్ చూసి డ్యాన్సర్‌గా మారాలనుకున్నారు. కానీ, ఎక్కడ నేర్చుకోవాలి? ఎవరు నేర్పుతారు? అని తెలియక టీవీలో వచ్చే పాటలను చూసి డ్యాన్స్ నేర్చుకున్నారు. ఆ తర్వాత తిరుపతి టౌన్‌కి వెళ్లి ఓ డ్యాన్స్ స్కూల్ ప్రారంభించారు. తొలిరోజుల్లో కేవలం రూ.5 ఫీజుతో డ్యాన్స్‌లో శిక్షణ ఇచ్చేవారు. కొన్ని రోజుల తర్వాత సినిమా అవకాశాల కోసం చెన్నై వెళ్లారు. ప్రభుదేవాపై సంచలన వ్యాఖ్యలు చాన్స్‌లు రాకపోవడంతో మళ్లీ తిరుపతికి వచ్చి డ్యాన్స్ ఇన్స్టిట్యూట్ను నడిపారు. ఆ తర్వాత ముక్కు రాజు మాస్టర్ దగ్గర కొంతకాలం పనిచేశారు రాకేష్ మాస్టర్. ‘ఆట’, ‘ఢీ’ లాంటి డ్యాన్స్ రియాలిటీ షోల ద్వారా డ్యాన్స్ మాస్టర్‌గా కెరీర్‌ను మొదలు పెట్టారాయన. ‘ఢీ’ షోలో బషీర్ అనే కుర్రాడికి మాస్టర్‌గా వ్యవహరిస్తున్న సమయంలో ఆ షోకి ఓ జడ్జిగా వ్యవహరించిన ప్రముఖ డ్యాన్స్ మాస్టర్, నటుడు ప్రభుదేవాతో ‘తెలుగు తెలిసిన వాళ్లే జడ్జిలుగా ఉండాలి’ అంటూ కామెంట్స్ చేసి, వార్తల్లో నిలిచారు రాకేష్ మాస్టర్. చిరునవ్వుతో సినిమాతో మొదలైన ప్రయాణం వేణు తొట్టెంపూడి హీరోగా నటించిన ‘చిరునవ్వుతో’ లో ‘నిన్నలా మొన్నలా లేదురా..’ పాటతో సినిమాల్లో కొరియోగ్రాఫర్‌గా తొలి అవకాశం అందుకున్నారాయన. ఆ తర్వాత ‘లాహిరి లాహిరి లాహిరిలో, దేవదాసు, సీతారామరాజు, యువరాజు, గర్ల్ ఫ్రెండ్, బడ్జెట్ పద్మనాభం, మనసిచ్చాను, సీతయ్య, అమ్మో పోలీసోళ్లు’ వంటి దాదాపు 1500 చిత్రాలకుపైగా కొరియోగ్రఫీ చేశారు రాకేష్ మాస్టర్. ‘గ్లోబల్ పీస్ యూనివర్సిటీ’ నుంచి డాక్టరేట్‌ను అందుకున్నారాయన. ప్రభాస్ వంటి పలువురు హీరోలకు డ్యాన్స్‌లో శిక్షణ ఇచ్చారు. కామెడీ షోలోనూ పార్టిసిపేట్ చేసిన రాకేశ్ టాలీవుడ్‌లోని పలువురు స్టార్ హీరోలందరికీ కొరియోగ్రఫీ చేసిన ఘనత ఆయన సొంతం. ప్రస్తుతం తెలుగులో అగ్ర కొరియోగ్రాఫర్లుగా ఉన్న శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్ రాకేష్ మాస్టర్ శిష్యులే కావడం విశేషం. ఓ టీవీ చానల్లో ప్రసారం అవుతున్న షోలో పలు స్కిట్లు చేసి, బుల్లితెర ప్రేక్షకుల్ని తనదైన శైలిలో నవ్వించారు రాకేష్ మాస్టర్. కొంతకాలంగా ఆయన సినిమాలకు దూరంగా ఉన్నారు. అయితే సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండేవారు. యూట్యూబ్ చానల్స్ వేదికగా పలువురు సెలబ్రిటీలపై వివాదాస్పద ఇంటర్వ్యూలు ఇచ్చి ఇటీవల మళ్లీ ట్రెండ్ అయ్యారాయన. వివాదాలతో కుటుంబానికి దూరం వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో వారి అభిమానుల నుంచి రాకేష్ మాస్టర్‌కి, ఆయన కుటుంబానికి బెదిరింపులు వచ్చేవి. ఈ కారణంగా ఆయన కుటుంబానికి దూరంగా అబ్దుల్లాపూర్‌మెట్‌లోని ఓ అనాథ ఆశ్రమంలో ఉంటూ వచ్చారు. ఆయనకు భార్య లక్ష్మి, కుమారుడు చరణ్‌తేజ్, కుమార్తె శ్రీజ ఉన్నారు. రాకేష్ మాస్టర్ మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు తమ సంతాపం తెలిపారు. కాగా హైదరాబాద్‌లోని బోరబండలో నేడు రాకేష్ మాస్టర్ అంత్యక్రియలు నిర్వహించనున్నారు. మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్‌తోనే.. ‘‘ఆదివారం మధ్యాహ్నం ఒంటిగంటకు రాకేష్ మాస్టర్ని గాంధీ ఆసుపత్రిలో అడ్మిట్ చేశారు. డయాబెటిక్ పేషెంట్ కావడం, సివియర్ మెటబాలిక్ ఎసిడోసిస్ కావడంతో మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ అయి సాయంత్రం 5గంటలకు మృతి చెందారు’’ అని గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ రాజారావు మీడియాకు తెలిపారు. చదవండి: డబ్బులు తీసుకుని డేట్స్ ఇవ్వని హీరోలు.. రెడ్ నోటీసులిచ్చేందుకు చిత్రమండలి రెడీ -
Rakesh Master: రాకేశ్ మాస్టర్ మృతి.. వైద్యులు ఏమన్నారంటే?
ప్రముఖ కొరియోగ్రాఫర్ రాకేశ్ మాస్టర్ ఆదివారం(జూన్ 18న) సాయంత్రం కన్నుమూశారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ వల్లే ఆయన మృతి చెందారని వైద్యులు వెల్లడించారు. గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ రాజారావు మాట్లాడుతూ.. 'వాంతులు, విరోచనాలు అవుతున్నాయని రాకేశ్ మాస్టర్‌ను ఈరోజు మధ్యాహ్నం ఒంటి గంటకు ఆస్పత్రికి తీసుకొచ్చారు. అప్పటికే ఆయన ఆరోగ్యం విషమించింది. డయాబెటిస్, సివియర్ మెటబాలిక్ ఎసిడోసిస్ కావడంతో మల్టీ ఆర్గాన్స్ ఫెయిల్యూర్స్ అయ్యాయి. అడ్మిట్ అయిన గంటకే ఆయన ఆరోగ్యం మరింత విషమించింది. ఆయన్ను బతికించేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. సాయంత్రం 5 గంటలకు మరణించారు' అని పేర్కొన్నారు. చదవండి: శేఖర్ మాస్టర్‌తో గొడవ.. కానీ ఎందుకో ఇప్పటికీ తెలియదు కాగా రాకేశ్ మాస్టర్ లాహిరి లాహిరి లాహిరిలో, దేవదాసు, చిరునవ్వుతో, సీతయ్య, అమ్మో పోలీసోళ్ళు వంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు డ్యాన్స్ మాస్టర్‌గా పని చేశారు. దాదాపు 1500 చిత్రాలకు కొరియోగ్రఫీ చేశారు. స్టార్ హీరోలందరికీ కొరియోగ్రఫీ చేసిన ఘనత ఆయన సొంతం. టాలీవుడ్లో నెంబర్ వన్ కొరియోగ్రాఫర్లుగా చెలామణీ అవుతున్న శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్లు ఈయన శిష్యులే! చదవండి: కొరియోగ్రాఫర్ రాకేశ్ మాస్టర్ కన్నుమూత -
Rakesh Master: నా శరీరంలో మార్పులు వస్తున్నాయి.. రాకేశ్ మాస్టర్ వీడియో వైరల్
ప్రముఖ కొరియోగ్రాఫర్ రాకేశ్ మాస్టర్ తీవ్ర అనారోగ్యంతో కన్నుమూశారు. ఎంతోమంది స్టార్ హీరోలతో పని చేసిన ఆయన రియల్ లైఫ్‌లో మాత్రం ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారు. నిత్యం ఏదో ఒక వివాదంలో చిక్కుకునే ఆయన కుటుంబానికి సైతం దూరంగా ఉన్నారు. ఆయన తన చావును ముందే పసిగట్టాడంటూ ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇందులో ఆయన మాట్లాడుతూ.. 'నాకు మోకాళ్ల నొప్పులు.. నా శరీరంలో మార్పులు వస్తున్నాయి.. తెలుసు, నేను అస్తమించే సూర్యుడిని.. నాకన్నీ తెలుసు' అంటూ బాధతో మాట్లాడారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన అభిమానులు బాధగా ఉంది మాస్టర్, మీ మాటలు వింటుంటే ఏడుపొస్తుంది అని కామెంట్లు చేస్తున్నారు. View this post on Instagram A post shared by CELLULOID PANDA (@celluloid_panda) చదవండి: ఒక్కమాటతో ఫేమస్ అయిన రాకేశ్ మాస్టర్ రక్త విరోచనాలు, కొరియోగ్రాఫర్ రాకేశ్ మాస్టర్ మృతి -
Rakesh Master Unseen Photos: టాలీవుడ్ కొరియోగ్రాఫర్ రాకేశ్ మాస్టర్ (ఫొటోలు)
-
Rakesh Master: కొరియోగ్రాఫర్ రాకేశ్ మాస్టర్ కన్నుమూత
తెలుగు చలన చిత్రసీమలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ సినీ నృత్యకారుడు ఎస్.రామారావు అలియాస్ రాకేశ్ మాస్టర్(53) మరణించారు. ఆదివారం ఉదయం ఆయన రక్తవిరోచనాలు చేసుకున్నారు. దీంతో ఆయనను గాంధీ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ కన్నుమూశారు. కాగా హైదరాబాద్‌లో ముక్కురాజు మాస్టర్ వద్ద పనిచేసిన రాకేష్ మాస్టర్.. ఆ తరువాత లాహిరి లాహిరి లాహిరిలో, దేవదాసు, చిరునవ్వుతో, సీతయ్య, అమ్మో పోలీసోళ్ళు వంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు కొరియోగ్రఫర్‌గా పని చేశారు. ఆ గొప్ప డ్యాన్సర్లు ఈయన శిష్యులే దాదాపు 1500 చిత్రాలకు కొరియోగ్రఫీ చేశారు. స్టార్ హీరోలందరికీ కొరియోగ్రఫీ చేసిన ఘనత ఆయన సొంతం. టాలీవుడ్లో నెంబర్ వన్ కొరియోగ్రాఫర్లుగా చెలామణీ అవుతున్న శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్లు ఈయన శిష్యులే! రాకేశ్ మాస్టర్ మరణవార్త గురించి ఆయన అసిస్టెంట్ సాజిత్ మాట్లాడుతూ.. 'హనుమాన్ క్లైమాక్స్ షూటింగ్ చేసినప్పుడు రాకేశ్ మాస్టర్‌కు విరోచనాలు, వాంతులు జరిగాయి. అప్పుడు ఆయన్ను ఆస్పత్రికి తీసుకెళ్లాం. కాళ్లు, చేతులు పడిపోవడంతో ఈయన బతకడం కష్టమని డాక్టర్లు అప్పుడే చెప్పారు. జాగ్రత్తగా చూసుకోమని చెప్పారు. ఇది జరిగి రెండు నెలలు అవుతోంది. వారం రోజుల క్రితం ఓ ప్రాజెక్ట్ షూటింగ్ నిమిత్తం విశాఖపట్నం, భీమవరం వెళ్లి ఈ మధ్యే హైదరాబాద్ వచ్చారు. అప్పటినుంచి ఆయన అనారోగ్యం పాలయ్యారు. ఈ రోజు మధ్యాహ్నం ఆయన కాళ్లు, చేతులు పడిపోయాయి అని ఫోన్ వచ్చింది. పక్షవాతంలాగా అనిపిస్తోందని ఇంటిసభ్యులు చెప్పారు. ఇంతలోనే ఆయన మరణించినట్లు తెలిసింది' అని చెప్పుకొచ్చాడు. చదవండి: శ్రీజతో విడాకులు.. కన్ఫర్మ్ చేసిన కల్యాణ్ దేవ్ -
ఢీ షోకి వెళ్లాక రూ. 6 లక్షల దాకా డబ్బులిచ్చాను: చైతన్య తల్లి
కొరియోగ్రాఫర్ చైతన్య ఏప్రిల్ 30న ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పుల బాధతోనే చనిపోతున్నట్లు సెల్ఫీ వీడియోలో పేర్కొన్నాడు. జబర్దస్త్‌లో కన్నా ఢీలో తక్కువ పారితోషికం ఇస్తారని, ఇక్కడ పేరు మాత్రమే వస్తుందని ఆయన వాపోయాడు. అయితే ఆయన కుటుంబసభ్యులు మాత్రం చైతన్యకు అప్పులుండే అవకాశమే లేదని చెప్తూ వస్తున్నారు. తాజాగా చైతన్య తల్లి లక్ష్మి రాయ్ ఓ మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేసింది. 'కాస్ట్యూమ్స్‌కు డబ్బులు కావాలంటూ రెండు, మూడు వేలు నా దగ్గర తీసుకునేవాడు. మీకు తెలియని ఇంకో విషయమేంటంటే.. ఢీ ఫైనల్ కోసం రూ.3,50,000 అడిగాడు. మా ఆయన్ని అడిగితే ఒప్పుకోలేదు. వాడిని చెడగొడుతున్నావు, డబ్బులివ్వను అన్నాడు. ఒక రోజంతా అలిగి కూర్చుంటే ఆ డబ్బంతా తెచ్చి ఇచ్చాడు. అమ్మ, నేను గెలిస్తే రూ.7,50,000 వస్తాయి. నీ డబ్బులు నీకు ఇచ్చేస్తా అన్నాడు. కానీ ఫైనల్ దాకా వచ్చి ఓడిపోయాడు. ఎందుకు ఓడిపోయాడో తెలియలేదు. ఇలా రెండుసార్లు జరిగింది. ఢీ షోకి వెళ్లిన తర్వాత దాదాపు రూ.6 లక్షల దాకా ఇచ్చాను. ఇంత చేసినదాన్ని ఏదైనా అప్పులున్నాయంటే తీర్చకపోయేదాన్నా? అప్పుల వల్ల చనిపోయాడనే మరక ఉండకూడదనే నా బాధ. ఢీ షోలో పేమెంట్స్ ఎలా ఇస్తున్నారో నాకు తెలియదు. కానీ ఢీ లేకపోతే మా అబ్బాయి లేడు. వాడికి ఇంత గుర్తింపు ఢీ వల్లే వచ్చింది' అని చెప్పుకొచ్చింది చైతన్య తల్లి. చదవండి: క్రికెట్ జట్టు కొనుగోలు చేయనున్న రామ్‌చరణ్ నావల్ల హీరోయిన్ ఆత్మహత్య చేసుకుందన్నారు: నవదీప్ -
కొరియోగ్రాఫర్ చైతన్య సూసైడ్.. కన్నీళ్లు పెట్టిస్తున్న సెల్ఫీ వీడియో
-
ఇంత మోసం చేస్తాడనుకోలేదు.. ఏడుపు కూడా రావడం లేదు : చైతన్య మాస్టర్ తల్లి
కొరియోగ్రాఫర్ చైతన్య ఆత్మహత్య ఘటన టాలీవుడ్లో సంచలనంగా మారింది. అప్పుల బాధలు తట్టుకోలేకనే చనిపోతున్నానంటూ సెల్ఫీ వీడియో తీసి, ఉరేసుకొని చనిపోయాడు. అయితే చైతన్య అప్పులపాలయ్యాడంటే స్నేహితులతో పాటు కుటుంబ సభ్యులు కూడా నమ్మడం లేదు. భారీగా అప్పులు చేసే అవసరం తనకు లేదని, ఒకవేళ అప్పులైనా తీర్చేంత ఆస్తులు తన కుటుంబానికి ఉన్నాయని చెబుతున్నారు. ఇక చైతన్య తల్లి లక్ష్మీ రాజ్యం అయితే తన కొడుకు అప్పుల బాధతో చనిపోయాడనేది అబద్దం అంటున్నారు. అన్ని సమస్యలు ఉన్నా.. తనతో ఒక్క మాట కూడా చెప్పలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ‘ఆత్మహత్యకు 15 నిమిషాల ముందు నాతో మాట్లాడాడు. సన్మాన కార్యక్రమంలో డల్‌గా ఉన్నావ్.. నవ్వుతూ ఉండమని చెప్పా. ‘పెద్ద పెద్ద వాళ్లు నీకు సన్మానం చేస్తున్నారు. అందరితో పరిచయాలు పెంచుకొ’ చెప్పా. సరే అన్నారు. ఆ తర్వాత 15 నిమిషాలకే సూసైడ్ చేసుకున్నాడు. ఎందుకు అలాంటి నిర్ణయం తీసుకున్నాడో నాకు అర్థం అవ్వట్లేదు. (చదవండి: చైతన్యకు అప్పు లేదు, ఇంకేదో జరిగింది.. డ్యాన్స్ మాస్టర్ మేనమామ) అంతకు ముందు టెంపుల్‌కి వెళ్లాలి ఇంటికి రా అంటే.. ‘నాక్కుడా చిరాకుగా ఉందమ్మా..గుడికి వెళ్దాం.. ప్లాన్ చెయ్’ అన్నాడు. ఇప్పుడు నన్ను వదిలి అన్యాయం చేశాడు. గతంలో ఒక్కసారి ఫోన్ చేసి ‘నువ్వు ఇంటికి రా లేదంటే చచ్చిపోతా’అంటే.. ‘నువ్వు చచ్చిపోతే నన్నెవరు చూస్తారమ్మా.. నీ పక్కన నాక్కుడా ఒక బెర్త్ కన్ఫామ్ చేయమని అన్నాడు. మరి ఇప్పుడు ఒక్కడే వెళ్లిపోయాడు. ‘నేను చనిపోతున్న.. నువ్వు కూడా రా అమ్మా’అంటే నేను కూడా వెళ్లేదాన్ని కదా’ అని చైతన్య తల్లి కన్నీళ్లు పెట్టుకుంది. (చదవండి: చైతన్య మాస్టర్ ఆత్మహత్య.. శ్రద్దా దాస్, శేఖర్ మాస్టర్ ఎమోషనల్ ) ఇంకా మాట్లాడుతూ.. ‘డబ్బుల కంటే ఎక్కువగా ఆరోగ్యం కాపాడుకోవాలని తరచూ చెప్పేవాడు. ‘పిల్లలకు మంచి ఫుడ్ పెడితేనే మనల్ని గౌరవిస్తారు. డబ్బులదేముంది. ఎప్పుడైనా సంపాదించుకోవచ్చు ’అని చెప్పేవాడు. ఇప్పుడు డబ్బులు వల్లే నేను చనిపోతున్నానని అనడమే నాకు నచ్చట్లేదు. అడిగితే నేను ఇవ్వానా? తనకు అప్పులున్నాయనే విషయం ఫ్రెండ్స్‌కి కూడా చెప్పకపోవడం బాధేస్తుంది. నన్నుమోసం చేసి పోయాడు. వాడు చేసిన పనికి ఏడుపు కూడా రావడం లేదు. ఇంత మోసం చేస్తాడనుకోలేదు. నా జీవితమే వాడు. వాడి కోసం ఎన్నో బాధలు పడ్డా. డబ్బుల విషయం ఏముంది? అది నాకో లెక్క కాదు. వాడు చనిపోయాడనే దానికంటే.. నాకు ద్రోహం చేశాడనే బాధే ఎక్కువగా ఉంది’అంటూ ఆమె ఎమోషనల్ అయింది. -
చైతన్యకు అప్పు లేదు, ఇంకేదో జరిగింది.. డ్యాన్స్ మాస్టర్ మేనమామ
కొరియోగ్రాఫర్ చైతన్య మాస్టర్ నెల్లూరులో ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే! అప్పుల బాధ భరించలేకే చనిపోతున్నట్లు సెల్ఫీ వీడియోలో పేర్కొన్నారు. అయితే తనకు తెలిసినంతవరకు చైతన్యకు ఎలాంటి అప్పులు లేవని ఆయన మేనమామ అంటున్నాడు. తాజాగా ఆయన మాట్లాడుతూ.. చైతన్య ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదు. అలాగని తనకు పెద్ద మొత్తంలో అప్పులున్నాయని కూడా నేను అనుకోవడం లేదు. తనకు లక్షల కొద్ది అవసరం ఏముంటుందని? అయినా అంత అప్పు ఎవరిస్తారు? మహా అయితే ఏదో పది, పదిహేను వేలు అప్పు చేసి ఉంటాడంతే! ఇంకేదో జరిగింది. చైతన్య చెల్లి పెళ్లి కూడా మేమే చేశాం. తను రూపాయి ఇవ్వలేదు. అతడు చిన్నప్పటి నుంచి హైదరాబాద్‌లోనే ఉన్నాడు. తన ఆదాయంపై కుటుంబం ఏనాడూ ఆధారపడలేదు. తను సంపాదించిందేమీ ఇంటికి పంపించేవాడు కాదు. పైగా తనకు అవసరమైనప్పుడల్లా వీళ్లే చైతూకు తిరిగిచ్చేవాళ్లు. తనకు ఊర్లో 30 ఎకరాల భూమి ఉంది. అప్పులు కాకుండా మరింకేదైనా కారణం ఉండొచ్చు' అని అనుమానం వ్యక్తం చేశాడు ఆయన మేనమామ. కాగా చైతన్య మరణంపై పలువురు డ్యాన్సర్లు, సెలబ్రిటీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల చైతన్య మాస్టర్ ఓ ఈవెంట్ ఒప్పుకున్నాడని, తీరా సమయానికి కొందరు డ్యాన్సర్లు ఆయనకు హ్యాండ్ ఇవ్వడంతో మేనేజ్మెంట్ టీమ్ పేమెంట్ ఇవ్వకుండా ఆపేసిందని డ్యాన్సర్, కండక్టర్ ఝాన్సీ పేర్కొంది. ఈవెంట్‌కు వచ్చిన మిగతా డ్యాన్సర్లకు డబ్బులు ఇచ్చేందుకు మాస్టర్ వేరే వాళ్ల దగ్గర అప్పు చేశాడని, బహుశా ఆ ఒత్తిడితోనే ఆయన ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని ఆమె అభిప్రాయపడింది. చదవండి: చైతన్య మాస్టర్ ఆత్మహత్య, గుండె బద్ధలైందన్న శేఖర్ మాస్టర్ రూ.7 లక్షలు రావాల్సి ఉంది.. పేమెంట్ ఇవ్వలేదు: కండక్టర్ ఝాన్సీ -
సంచలనంగా మారిన డ్యాన్స్ మాస్టర్ చైతన్య ఆత్మహత్య
-
ఢీ షో డాన్స్ మాస్టర్ చైతన్య ఆత్మహత్య
-
చైతన్య మాస్టర్ ఆత్మహత్య.. శ్రద్దా దాస్, శేఖర్ మాస్టర్ ఎమోషనల్
ఢీ షో కొరియోగ్రాఫర్ చైతన్య మాస్టర్ అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే! అప్పుల బాధలు తాళలేకపోతున్నానంటూ ఉరేసుకుని చనిపోయారు. చైతన్య మాస్టర్ మరణంతో అందరూ ఒక్కసారిగా షాకయ్యారు. ఈ క్రమంలో నటి శ్రద్దా దాస్.. మాస్టర్‌తో ఉన్న అనుబంధాన్ని పంచుకుంటూ ఎమోషనలైంది. 'పుట్టుక, చావు ఎప్పుడు? ఎందుకు? జరుగుతాయో అంతుచిక్కవు. కానీ జననమరణానికి మధ్యలో మనం ఎలా బతికామన్నదే మనల్ని గొప్పవారిలా చేస్తుంది. నిజంగా చెప్తున్నా.. చైతన్య మాస్టర్ చాలా మంచి వ్యక్తి, గొప్ప మనసున్న మనిషి. మీ ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. మీరు నవ్వుతూ అందరినీ నవ్వించేవాళ్లు. కానీ ఈరోజు నన్ను ఎంతగానో ఏడిపించారు. మీ స్మైల్ నాకెప్పటికీ గుర్తుండిపోతుంది' అని ఇన్స్టాగ్రామ్ స్టోరీలో రాసుకొచ్చింది. ఈ మేరకు అతడితో కలిసి డ్యాన్స్ చేసిన వీడియోను షేర్ చేసింది. చైతన్య మరణంపై శేఖర్ మాస్టర్ స్పందిస్తూ.. నీలాంటి టాలెంటెడ్ డ్యాన్స్ మాస్టర్‌ను కోల్పోవడం నిజంగా బాధాకరం. ఈ వార్త వినగానే నా గుండె ముక్కలయింది. చాలా డిస్టర్బ్ అయ్యాను. నీ చిరునవ్వు ఎన్నటికీ మర్చిపోలేను. నిన్ను ఎప్పటికీ గుర్తుంచుకుంటాం' అని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టాడు. యాంకర్ రష్మీ సైతం స్పందిస్తూ.. 'చావు అన్నింటికీ పరిష్కారం కాదు మాస్టర్. మీ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి' అంటూ ఇన్స్టాగ్రామ్ స్టోరీలో రాసుకొచ్చింది. కాగా ఢీ షోలో కొరియోగ్రాఫర్‌గా పని చేస్తున్న చైతన్య ఆత్మహత్యకు ముందు సెల్ఫీ వీడియో తీసుకున్నారు. 'అమ్మానాన్న, చెల్లి.. ఐ లవ్యూ.. నన్ను చాలా బాగా చూసుకున్నారు. ఏ కష్టం రానివ్వలేదు. కుటుంబానికి చాలా చేద్దామనుకున్నాను. కానీ కుదురలేదు. అప్పులయ్యాయి. తీర్చగలను కానీ తీర్చలేకపోతున్నా. తట్టుకోలేకపోతున్నా. ఢీ పేరు ఇస్తుందని కానీ సంపాదన తక్కువ. జబర్దస్త్‌లో సంపాదన ఎక్కువ వస్తుంది. స్నేహితులు, తోటి డ్యాన్సర్లకు సారీ' అని వీడియోలో పేర్కొన్నారు. ఇది చూసిన చైతన్య అభిమానులు కంటతడి పెట్టుకుంటున్నారు. View this post on Instagram A post shared by Sekhar Vulli Vj (@sekharmaster) చదవండి: మొన్ననే నాకు మాటిచ్చాడు, అంతలోనే ఇంత దారుణం: ఝాన్సీ కొరియోగ్రాఫర్ చైతన్య ఆత్మహత్య -
కొరియోగ్రాఫర్ చైతన్య ఆత్మహత్య
నెల్లూరు సిటీ: ‘అతను ఓ టీవీ షోలో డ్యాన్స్ మాస్టర్ అండ్ కొరియోగ్రాఫర్. మంచి పేరు వచ్చింది. కానీ సంపాదనలో మాత్రం వెనుకబడ్డాడు. కుటుంబాన్ని ఉన్నత స్థాయిలో నిలబెట్టాలని కలలు కన్నాడు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఏమి చేయలేకపోయాడు. దీంతో మానసికంగా కుంగిపోయిన అతను ఆత్మహత్యే శరణ్యం అనుకుని నిర్ణయించుకున్నాడు. ఫ్యాన్‌కు ఉరేసుకుని నిండు జీవితాన్ని అర్ధాంతరంగా ముగించాడు.’ ఆదివారం పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు.. లింగసముద్రం మండలంలోని ముత్తంవారిపాళేనికి చెందిన సుబ్బారావు, లక్ష్మి రాజ్యం దంపతులకు సి.చైతన్య (31), వినీల అనే పిల్లలున్నారు. చైతన్య హైదరాబాద్‌లో ఉంటూ ఐదేళ్లుగా ఢీ షోలో ఓ బృందానికి కొరియోగ్రాఫర్‌గా చేస్తున్నాడు. ఈ క్రమంలో నెల్లూరు నగరంలోని టౌన్హాల్లో శనివారం జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చాడు. అనంతరం నగరంలోని దర్గామిట్లలో ఉన్న నెల్లూరు క్లబ్లో గది తీసుకున్నాడు. చైతన్య తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సెల్ఫీ వీడియో తీసి స్నేహితులకు పంపాడు. ‘అమ్మా, నాన్న, చెల్లి ఐ లవ్ యూ.. నన్ను చాలా బాగా చూసుకున్నారు. ఏ కష్టం రానివలేదు. చెల్లీ ఫీల్ కావద్దు. నువ్వంటే చాలా ఇష్టం. కుటుంబానికి చాలా చేద్దామనుకున్నాను. కుదరలేదు. అప్పులు అవుతాం. తీర్చుకునే సత్తా ఉండాలి. తీర్చగలను కానీ అంతా తీర్చ లేకపోతున్నా. ఒత్తిళ్లు తట్టుకోలేకపోతున్నా. చాలా ప్రయత్నిస్తున్నా. కావట్లేదు. ఢీ పేరు ఇస్తుంది. కానీ సంపాదన తక్కువ ఇస్తుంది. జబర్దస్‌లో సంపాదన ఎక్కువ వస్తుంది. స్నేహితులు, తోటి డ్యాన్సర్లకు సారీ’ అని ఆ వీడియోలో ఉంది. కాగా చైతన్య స్నేహితులు వీడియో చూసి నెల్లూరు పోలీసులకు సమాచారం అందించారు. వారు చైతన్య ఉంటున్న గది వద్దకు చేరుకుని తలుపు తట్టారు. ఎంతకీ తీయకపోవడంతో కిటికీలో నుంచి చూడగా అప్పటికే అతను ఉరేసుకుని ఉన్నాడు. దీంతో ధనలక్ష్మీపురంలో నివాసం ఉంటున్న చైతన్య మేనమామ మాల్యాద్రికి పోలీసులు సమాచారం అందించారు. మాల్యాద్రి ఫిర్యాదు మేరకు దర్గామిట్ట ఎస్సై విజయకుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
డైరెక్టర్ గా మారిన శేఖర్ మాస్టర్.. హీరో ఎవరో తెలుసా..?
-
డాన్స్ మాస్టర్ బృందా దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీ
ప్రముఖ డాన్స్ మాస్టర్ బృందా గోపాల్ దర్శకత్వంలో తెరకెక్కిన పాన్ ఇండియా చిత్రం ‘థగ్స్’. ఈ చిత్రం ద్వారా నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ శిబు తమీన్స్ కుమారుడు హ్రిదు హరూన్ హీరోగా పరిచయమవుతున్నారు. తమీన్స్ సింహ, ఆర్కె సురేష్, మునిష్కంత్, శరత్ అప్పనీ ముఖ్య పాత్రలు చేశారు. హెచ్ఆర్ పిక్చర్స్ బ్యానర్ సమర్పణలో జియో స్టూడియోస్‌తో కలిసి రియా శిబు నిర్మించారు. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో రూపొందిన ఈ సినిమా త్వరలో విడుదల కానుంది. ఈ సినిమా ట్రైలర్స్‌ని విజయ్ సేతుపతి, దుల్కర్ సల్మాన్, ఆర్య, అనిరుధ్, కీర్తీ సురేష్ విడుదల చేశారు. తెలుగులో ‘కోనసీమ థగ్స్’ పేరుతో ఈ సినిమా విడుదల కానుంది. డైరెక్టర్ బృందా గోపాల్ మాట్లాడుతూ..‘‘కోనసీమ నేపథ్యంలో జరిగే రా యాక్షన్ ఫిల్మ్ ఇది. ప్రేక్షకులకు గ్రిప్పింగ్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది’’ అన్నారు. ఈ చిత్రానికి శామ్ సీఎస్ సింగీతం అందించారు. -
ఖరీదైన ఇంటిని కొనుగోలు చేసిన టాలీవుడ్ కొరియోగ్రాఫర్
టాలీవుడ్లో ప్రముఖ కొరియోగ్రాఫర్ ఆట సందీప్ పేరు తెలియనివారు ఉండరు. తాజాగా ఆయన హైదరాబాద్‌లో ఖరీదైన ఇంటిని కొనుగోలు చేశారు. ఈ విషయాన్ని తన అభిమానులతో పంచుకున్నారు. ప్రముఖ డ్యాన్స్ రియాలిటీ షో 'ఆట' ద్వారా ఫేమ్ సంపాదించారు. అందువల్లే అతని పేరుతోనే ఆట సందీప్‌గా అభిమానుల్లో ముద్ర వేసుకున్నారు. ఇటీవలే ఇంటి రిజిస్ట్రేషన్ కూడా పూర్తయినట్లు సందీప్ తెలిపారు. అయితే కొవిడ్ తర్వాత చాలా ఇబ్బందులు పడినట్లు వారు తెలిపారు. ఇది తమ ఐదేళ్ల కష్టానికి దక్కిన ఫలితమని సంతోషం వ్యక్తం చేశారు. కరోనా టైంలో పడిన కష్టాలను వివరిస్తూ తన ఇన్‌స్టాలో ఓ వీడియోను పంచుకున్నారు. దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు ఆట సందీప్, జ్యోతిరాజ్. ప్రముఖ డ్యాన్స్ రియాలిటీ షో 'ఆట' మొదటి సీజన్లోనే విన్నర్‌గా నిలిచారు సందీప్. View this post on Instagram A post shared by 𝐀𝐚𝐭𝐚 𝐒𝐚𝐧𝐝𝐞𝐞𝐩 𝐃𝐚𝐧𝐜𝐞 𝐌𝐚𝐬𝐭𝐞𝐫🇮🇳 (@aata_sandeep) -
‘ఆమె కూల్‌గా కనిపించినా, షూటింగ్ స్పాట్లో మాత్రం ఫైర్’
ప్రముఖ నృత్య దర్శకురాలుగా రాణిస్తున్న బృంద మాస్టర్ ఇటీవలే మెగాఫోన్ పట్టి హే సినామికా అనే చిత్రాన్ని తెరకెక్కించిన విషయం తెలిసిందే. దుల్కర్ సల్మాన్, నటి ఇలా, అతిథి రావ్, కాజల్ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా నటించిన వైవిధ్య భరిత ప్రేమ కథా చిత్రంతో బృందా మాస్టర్ దర్శకురాలిగా మంచి పేరు తెచ్చుకున్నారు. తాజాగా ఈమె కుమరి మావట్టత్తిన్ దగ్స్ పేరుతో చిత్రాన్ని రూపొందిస్తున్నారు. అయితే ఇది ఆమె తొలి చిత్రానికి పూర్తిగా భిన్నమైన కథ, కథనాలతో ఉండటం విశేషం. కమర్షియల్ అంశాలతో కూడిన పూర్తి యాక్షన్ ఓరియెంటెడ్ చిత్రంగా కుమరి మావట్టత్తిన్ దగ్స్ చిత్రాన్ని బృందా మాస్టర్ తెరకెక్కించారు. హెచ్ ఆర్ పిక్చర్స్ పతాకంపై రియా శిబు నిర్మిస్తున్న ఈ చిత్రం ద్వారా హ్రిదు హారన్ కథానాయకుడుగా పరిచయం అవుతున్నారు. ఈయన ఇంతకుముందే బాలీవుడ్లో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. కాగా నటి అన స్వరాజన్, సింహ, ఆర్కే సురేష్, మునీశ్కాంత్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సేమ్ సీఎస్ సంగీతం అందిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటుంది. ఈ సందర్భంగా కుమరి మావట్టత్తిన్ దగ్స్ చిత్ర పరిచయ కార్యక్రమాన్ని బుధవారం రాత్రి చెన్నైలోని సత్యం థియేటర్లో నిర్వహించారు. ఇందులో చిత్ర యూనిట్‌తో పాటు నటి కుష్భు, దర్శకుడు కె.భాగ్యరాజ్, గౌతమ్ మీనన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నటి కుష్బు మాట్లాడుతూ బృంద తనకు బెస్ట్ ఫ్రెండ్ అని పేర్కొన్నారు. ఆమె చూడ్డానికి కూల్‌గా కనిపించినా, షూటింగ్ స్పాట్లో మాత్రం ఫైర్‌గా ఉంటారని పేర్కొన్నారు. అలాంటి ఆమె యాక్షన్ కథాంశంతో కూడిన ఈ చిత్రాన్ని చేయడంలో ఆశ్చర్య పడాల్సిన పని లేదన్నారు. ఈ చిత్రాన్ని తాను చశానని కచ్చితంగా ఇది సంచలన విజయం సాధిస్తుందని అన్నారు. త్వరలో చిత్ర ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించి నవంబర్ నెలలో చిత్రాన్ని తమిళం, తెలుగు, కన్నడం, హిందీ, మలయాళం భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు నిర్మాత తెలిపారు. -
Rakesh Master: వైజాగ్‌లో రాకేష్ మాస్టర్ సందడి
గాజువాక(విశాఖపట్నం): ప్రముఖ డ్యాన్స్ మాస్టర్ రాకేష్ గాజువాకలో సందడి చేశారు. రిచ్ గైస్ ఆధ్వర్యంలో చిట్టినాయుడు కాలనీలో నిర్వహిస్తున్న వినాయక ఉత్సవాలకు హాజరైన ఆయన ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అన్న సమారాధనను ప్రారంభించారు. అనంతరం అభిమానులతో ముచ్చటించారు. చదవండి: ‘బ్రహ్మాస్త్ర’ ట్విటర్ రివ్యూ -
సినీ పరిశ్రమలో మరో విషాదం
చెన్నై: సినీ పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. సినీ నృత్య దర్శకుడు కూల్ జయంత్ (44)బుధవారం ఉదయం చెన్నైలో కన్నుమూశారు. సినీ రంగంలో డాన్సర్‌గా జీవితాన్ని ప్రారంభించి నృత్య దర్శకుడి స్థాయికి ఎదిగారు. ప్రభుదేవా, రాజు సుందరం వద్ద పలు చిత్రాలకు డాన్సర్‌గా పని చేసిన కూల్ జయంత్ సుమారు 800 చిత్రాలకు పైగా డాన్సర్‌గా పని చేశారు. అనంతరం కాదల్ దేశం చిత్రం ద్వారా నృత్య దర్శకుడిగా పరిచయమయ్యారు. తమిళం, మలయాళం భాషల్లో సుమారు 100కు పైగా చిత్రాలకు నృత్య దర్శకుడిగా పని చేశారు. మలయాళంలో మమ్ముట్టి, మోహన్‌లాల్ వంటి ప్రముఖ నటుల చిత్రాలకు కూల్ జయంత్ నృత్య దర్శకత్వం వహించారు. కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్న ఈయన బుధవారం ఉదయం స్థానిక వెస్ట్ మాంబళంలోని స్వగృహంలో కన్నుమూశారు. ఈయన మృతిపై పలువురు తమిళ, మలయాళ సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. బుధవారం సాయంత్రం అంత్యక్రియలు జరిగాయి. -
డ్యాన్స్ మాస్టర్ దొంగగా మారాడు.. 24 గంటల్లోనే పోలీసులకు చిక్కాడు
హైదరాబాద్: జీవనోపాదిలేక ఎంబీఏ చదివిన ఓ డ్యాన్స్ మాస్టర్ దొంగగా మారాడు. తను నివసించే ప్రాంతంలోనే చిన్న పిల్లలకు డ్యాన్స్ నేర్పుతూ జీవనం సాగించేవాడు. అయితే కొంత కాలంగా కరోనా కారణంగా ఉపాధి లేకపోవడంతో అతను తప్పుడు దారిలోకి అడుగుపెట్టాడు. అయితే ఆ పని అతనికి అలవాటు లేకపోవడంతో తప్పు చేసిన 24 గంటల్లోనే పోలీసులకు దొరికిపోయాడు. ఈ ఘటన హైదరాబాద్‌లోని ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలను ఎస్సార్ నగర్ పోలీసులు మీడియాకు వెల్లడించారు. ఆ వివరాలిలా ఉన్నాయి.. పెద్దపల్లికి చెందిన డి. సుచరిత అనే యువతి మాదాపూర్‌లోని ఓ సాఫ్ట్వేర్ సంస్థలో పనిచేస్తున్నారు. ఆమె మధురా నగర్ కాలనీలోని ఓ ఉమెన్స్ హాస్టల్లో ఉంటుంది. అయితే గురువారం కూడా ఆమె రోజు మాదిరిగానే ఆఫీస్‌కు బయలుదేరింది. ఈ క్రమంలోనే సుచరిత మధురానగర్ మెట్రో స్టేషన్ వద్ద లిఫ్ట్ కోసం ఎదురు చూడసాగింది. ఇక అదే సమయంలో అక్కడకు వచ్చిన ఓ యువకుడు సుచరిత మెడలోని రూ. 45 వేలు విలువ చేసే బంగారు గొలుసును దొంగిలించాడు. దీనితో బాధితురాలు జరిగిన ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. జరిగిన ఘటనపై పోలీసులు సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా దర్యాప్తు కొనసాగించారు. నిందితుడిని నల్గొండ జిల్లా నార్కట్‌పల్లికి చెందిన చింత వినోద్(27)గా గుర్తించారు. ఎట్టకేలకు నిందితుడు వినోద్‌ను పోలీసులు దొంగతనం జరిగిన 24 గంటల్లోనే అరెస్ట్ చేశారు. కరోనా కారణంగా ఉపాధి లేకనే గొలుసు చోరీకి పాల్పడ్డారని, చోరికి పాల్పడటం ఇదే తొలిసారని పోలీసులు తెలిపారు. -
అనకాపల్లి కుర్రాడు.. చైనాలో మొనగాడు
పాఠశాల వార్షికోత్సవాల్లో డ్యాన్స్ ప్రదర్శనతో ప్రారంభమైన ఆ యువకుడి ప్రస్థానం ఖండాంతరాలను దాటింది.. ఆ కళాకారుడి నృత్యానికి ఫిదా అయిన అభిమానులు అతన్ని అందలమెక్కించారు. ఉత్తరాంధ్ర స్థాయిని దాటి టీవీ చానళ్లలో డ్యాన్స్ కార్యక్రమాల ద్వారా రాష్ట్రస్థాయి ఇమేజిని సంపాదించాడు. విదేశాల్లో ప్రదర్శనల్చి, అక్కడి కళాభిమానులనూ ముగ్ధులను చేశాడు. అలా థాయిలాండ్‌లో కొన్నాళ్లు నృత్య శిక్షణ ఇచ్చి.. చైనాలో స్థిరపడ్డాడు. యోగాలోనూ ప్రావీణ్యం సంపాదిం అవార్డులెన్నో అందుకున్నాడు. అనకాపల్లిలో పుట్టి పెరిగిన కుర్రాడు అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్నాడు. సాక్షి, అనకాపల్లి: ఓ మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన కొణతాల విజయ్.. పేరుకు తగ్గట్టు విజయానికి చిరునామాగా మారాడు. ఆ గుర్తింపు అతనికి అంత సులువుగా రాలేదు. దాని వెనుక ఎంతో కృషి, తపన ఉంది. సూరి అప్పారావు, కాంతకుమారిల ముగ్గురు కొడుకుల్లో మధ్యవాడు విజయ్. విశాఖ జిల్లా అనకాపల్లిలో పాఠశాల వార్షికోత్సవాల్లో నృత్యాలు చేస్తూ విజయ్ గ్రూప్‌ను స్థాపించాడు. తండ్రితోపాటు అన్నయ్య కూడా చిన్నప్పుడే చనిపోవడంతో తల్లిని, సోదరుడ్ని చూసుకునే భారం అతనిపై పడింది. అయినా సరే తన అభిరుచిని వీడలేదు. తన టీం ద్వారా విశాఖపట్నంతోపాటు ఉత్తరాంధ్రలోనూ మంచి డ్యాన్సర్‌గా గుర్తింపు పొందాడు. కొత్తగా ప్రారంభమైన జెమినీ టీవీ షోలో అవకాశమ్చొంది. మొదటి ప్రయత్నంలోనే ప్రథమ స్థానంలో నిలిచిన విజయ్ బృందం ఆంధ్రప్రదేశ్‌లో గుర్తింపు పొందింది. చిరంజీవి, లారెన్స్ వంటి ప్రముఖుల ప్రశంసలు పొందిన విజయ్ హైదరాబాద్‌కు మకాం మార్చాడు. జీ తెలుగు చానల్లో ‘డేర్ టూ డ్యాన్స్’ ప్రోగ్రాంలో యాంకర్‌గా వ్యవహరించిన అనంతరం ఆ గుర్తింపుతో అంతర్జాతీయ వేదికలపై దృష్టి పెట్టాడు. ఈ క్రమంలోనే థాయ్‌లాండ్, బ్యాంకాక్‌లలో డ్యాన్స్ మాస్టర్‌గా ఎంతోమందికి శిక్షణ ఇచ్చాడు. నాన్న, అన్నయ్య ఉంటే గర్వపడేవారు పదహారేళ్ల వయసులోనే తండ్రిని కోల్పోయాను. చిన్నప్పుడు నా నృత్య ప్రదర్శనలు చసి అన్నయ్య ఎంతో సంతోషించేవాడు. ఈ స్థాయికి వచ్చానని తెలిస్తే ఎంతో గర్వపడతాడు. కానీ నాకు ఆ అదృష్టం లేదు. అన్నయ్య ఆశయం మేరకు డ్యాన్స్‌లో రాణించాను. పద నర్తన నాకో ప్యాషన్. ఆ అభిరుచే నన్ను ఇంతవాణ్ని చేసింది. ఆదరించిన కళాభిమానులకు కృతజ్ఞణ్ని. – కొణతాల విజయ్ చైనాలో రాణింపు... థాయ్‌లాండ్‌లో స్థిరపడిన విజయ్‌కు చైనాకు సంబంధింన వ్యక్తులతో పరిచయం ఏర్పడింది. విజయ్ ప్రతిభను గుర్తించిన చైనా మిత్రులు అక్కడికి రమ్మని ఆహ్వానించడంతో డ్యాన్స్ నేర్పేందుకు ఆ దేశానికి వెళ్లాడు. కొరియోగ్రఫీ చేస్తూ అక్కడ టీవీ చానళ్లలో కూడా డ్యాన్స్‌పై పలు కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. వివాహం అయిన తర్వాత విజయ్ ప్రస్థానం మరో మలుపు తిరిగింది. ఫిట్నెస్ కోసం యోగా నేర్చుకున్న అతను ఆ శాస్త్రంలో కూడా ప్రావీణ్యం సంపాదించాడు. మహిళలు గర్భం ధరించిన సమయంలో చేయగల యోగాసనాల్లో శిక్షణ ఇవ్వగల స్థాయికి చేరుకున్నాడు. గర్భిణిగా ఉన్న తన భార్యతో ఆసనాలు వేయించి రికార్డులను నెలకొల్పాడు. ఇటీవల అష్టవక్రాసనం, మయూరాసనాలను ప్రదర్శించి అవార్డులు దక్కించుకున్నాడు. విజయ్ ఇప్పుడు చైనాలో డ్యాన్సర్‌గా ఒక రోల్‌మోడల్‌గా నిలిచాడు. -
హీరోగా మరో సినిమా చేస్తున్న జానీ మాస్టర్!
Jani Master: ప్రముఖ నృత్యదర్శకుడు జానీ మాస్టర్ హీరోగా పరిచయమవుతున్న సంగతి తెలిసిందే. మురళీరాజ్ తియ్యాన దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా గత ఏడాది డిసెంబరులో ప్రారంభమైంది. తాజాగా హీరోగా ఇంకో ఆఫర్ అందుకున్నారు జానీ. ‘మంత్ర, మంగళ’ చిత్రాల ఫేమ్ ఓషో తులసీరామ్ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రానికి ‘దక్షిణ’ అనే టైటిల్‌ని ఖరారు చేశారు. నేడు (జులై 2) జానీ మాస్టర్ బర్త్‌డే సందర్భంగా ఈ చిత్రాన్ని ప్రకటించారు. ‘‘ఇదొక సూపర్ నేచురల్ థ్రిల్లర్. అరకు, గోవా ఫారెస్ట్, బెంగళూరు ప్రాంతాల్లో చిత్రీకరణ జరుపుతాం’’ అన్నారు తులసీరామ్. -
రాకేష్ మాస్టర్‌పై పోలీసులకు ఫిర్యాదు
సాక్షి, కుషాయిగూడ: హిందూ దేవుళ్లను కించపరిచేలా మాట్లాడిన డ్యాన్స్ మాస్టర్ రాకేష్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ బీజేవైఎం రాష్ట్ర నాయకులు సందీప్‌యాదవ్ ఆధ్వర్యంలో సోమవారం కుషాయిగూడ ఇన్స్పెక్టర్ మన్మోహన్‌కు ఫిర్యాదు చేశారు. అనంతరం సందీప్ యాదవ్ మాట్లాడుతూ శ్రీ కృష్ణ పరమాత్ముడిపై అనుచిత వాఖ్యలు చేసిన రాకేష్ మాస్టర్ భేషరతుగా క్షమాపణ చెప్పాలని, లేని పక్షంలో యాదవ సమాజం భౌతిక దాడులకు సైతం వెనుకాడదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు బంగి లక్ష్మణ్, బీజేవైఎం నాయకులు ఉదయ్‌కిరణ్, నరేష్, మధు, రాకేశ్, జయంత్, అడ్వొకేట్ హరికృష్ణ ఉన్నారు. చదవండి: నాపై దాడికి యత్నించారు: రాకేష్ మాస్టర్ -
నాపై దాడికి యత్నించారు: రాకేష్ మాస్టర్
బంజారాహిల్స్: ఇంట్లోకి ప్రవేశించి తనపై దాడి చేయడానికి యత్నించడమే కాకుండా ఇంట్లోని వస్తువులన్నీ ధ్వంసం చేశారంటూ సినీ నృత్యకారుడు ఎస్.రామారావు అలియాస్ రాకేష్ మాస్టర్ (50) బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో సోమవారం ఫిర్యాదు చేశారు. శ్రీకృష్ణానగర్ ‘ఏ’ బ్లాక్‌లోని దేవేందర్ గౌడ్ అపార్ట్‌మెంట్స్‌లో నివసిస్తున్న తన ఇంట్లోకి సాయంత్రం సాయి యాదవ్, ఇమ్రాన్‌తో పాటు మరికొందరు అక్రమంగా ప్రవేశించి తనను దుర్భాషలాడుతూ అసభ్యంగా ప్రవర్తిస్తూ కిటికీలు ధ్వంసం చేస్తూ చంపేందుకు ప్రయత్నించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తొమ్మిది నెలల క్రితం ఓ యూట్యూబ్ చానల్‌కు తాను ఇంటర్వ్యూ ఇచ్చానని ఈ నేపథ్యంలోనే తనపై దాడి జరిగిందని ఆయన పేర్కొన్నారు. సాయి యాదవ్, ఇమ్రాన్‌తో పాటు తనపై దాడికి యత్నించిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ ఆయన ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: ‘దీదీ ఓ దీదీ సినిమా..’ ఆర్జీవీ వైరల్ వీడియో..! -
హీరోగా మారిన జానీ మాస్టర్
డాన్స్ మాస్టర్ స్థాయి నుంచి హీరోలుగా, దర్శకులుగా ఎదిగారు ప్రభుదేవా, లారెన్స్. తాజాగా డ్యాన్స్ మాస్టర్ జానీ హీరోగా మారారు. సుజి విజువల్స్ పతాకంపై మురళిరాజ్ తియ్యాన దర్శకత్వంలో కె.వెంకటరమణ నిర్మిస్తున్న ఈ సినిమా సోమవారం ప్రారంభం అయ్యింది. తొలి సీన్‌కి నాగబాబు కెమెరా స్విచ్చాన్ చేయగా, వీవీ వినాయక్ క్లాప్ ఇచ్చి, గౌరవ దర్శకత్వం వహించారు. జానీ మాట్లాడుతూ – ‘‘నాకు కొరియోగ్రఫీ, డైరెక్షన్ అంటే ఇష్టం. యాక్టింగ్ అంతగా ఇష్టం లేదని చెప్పాను. కానీ దర్శకుడు చెప్పిన కథ విన్నాక నటించాలని నిర్ణయించుకున్నాను. ‘నువ్వు హీరోగా చేయకపోతే నేనీ సినిమా తీయను’ అని నిర్మాత చెప్పటంతో మరింత కనెక్ట్ అయ్యాను’’ అన్నారు. ‘‘జానీ మాస్టర్‌తో ఎప్పటికైనా సినిమా చేయాలనుకున్నాను. ఇప్పటికి కుదిరింది’’ అన్నారు వెంకటరమణ. ‘‘ఈ చిత్రకథ అద్భుతంగా ఉంది’’ అన్నారు కథానాయిక దిగంగనా సూర్యవంశీ. -
జానీ మాస్టర్ దర్శకత్వంలో పవన్ సినిమా!
సాక్షి, హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌కు ప్రముఖ డ్యాన్స్ మాస్టర్ జానీ మెగా అభిమాని. పలు పవన్ సినిమాలకు కోరియోగ్రాఫి అందించిన మాస్టర్.. ఆయన హీరోగా ఓ సినిమా తీయాలనేది ఆయన చిరకాల కోరికంటూ పలు ఇంటర్య్వూలో చెబుతూ ఉండేవారు. అంతేకాదు ఆయన కోసమే ప్రత్యేకంగా ఓ కథ కూడా రాస్తున్నట్లు చెప్పెవాడు. చెప్పినట్టుగానే జానీ మాస్టర్ కథ పూర్తి చేసి పవన్ కల్యాణ్‌ను సంప్రదించినట్లు తెలుస్తోంది. ఆ కథ విన్న పవన్.. జానీ డైరెక్షన్లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాలీవుడ్లో వార్తలు వినిపిస్తున్నాయి. (చదవండి: నటుల మధ్య చిచ్చుపెట్టిన గ్రేటర్ పోరు) ఇక పవన్ కల్యాణ్ తన కథకు ఒకే చెప్పడంతో జానీ మాస్టర్ రాంచరణ్‌ను కలిసి ఈ కథ వినిపించడంతో కొణిదెల ప్రొడక్షన్లో ఈ సినిమాను నిర్మించేందుకు చెర్రీ కూడా ఒకే చెప్పాడంట. అయితే చెర్రీ తన తండ్రి మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రంతో నిర్మాతగా మారిన విషయం తెలిసిందే. కొణిదెల ప్రొడక్షన్లో కేవలం తండ్రి భారీ చిత్రాలను మాత్రమే నిర్మించిన చెర్రీ ఇప్పడు బాబాయ్ సినిమాను కూడా నిర్మించడానికి జానీతో జతకట్టినట్టు తెలుస్తోంది. దీంతో జానీ దర్శకత్వంలో బాబాయ్ హీరోగా చరణ్ ఈ సినిమా నిర్మించడం దాదాపు ఓకే అయినట్టు కూడా టాలీవుడ్లో ప్రచారం జరుగుతోంది. -
నెల కిత్రమే కరోనా పాజిటివ్: శేఖర్ మాస్టర్
శేఖర్ మాస్టర్ స్టెప్పులకు ఎంత ఆదరణ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎందరో స్టార్ హీరోలకు ఆయన ఫేవరెట్ కొరియోగ్రాఫర్. స్టెప్పులతో వెండితెరపై, పంచ్‌లతో బుల్లితెరపై వినోదాన్ని పంచుతాడు. ఈమధ్యే శేఖర్ మాస్టర్ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. అయితే తొందరగానే కరోనాను జయించి ప్లాస్మాదానం కూడా చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం యూట్యూబ్‌లో వైరల్‌గా మారింది. (బలవంతంగా ఒప్పించారు: రియా) ఇందులో శేఖర్ మాట్లాడుతూ.. "ఇప్పుడే ప్లాస్మా ఇచ్చాను. నెల కిత్రమే కరోనా పాజిటివ్ వచ్చింది. కిమ్స్‌లో చికిత్స తీసుకున్నా. ఇప్పుడు నా వంతు సాయంగా ప్లాస్మా ఇచ్చాను. సంతోషంగా ఉంది. కరోనా నుంచి రివకరీ అయిన వారు కూడా ప్లాస్మాదానం చేయండి, ప్రాణాలు నిలబెట్టండి" అని కోరాడు. కాగా ఆయన తీసుకున్న నిర్ణయంపై అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మంచి పని చేశారంటూ మాస్టర్‌ను కొనియాడుతున్నారు. (శాండల్‌వుడ్ డ్రగ్స్ కేసు: సంజన అరెస్టు!) -
బిగ్‌బాస్ 4: రఘు మాస్టర్ అవుట్!
బిగ్‌బాస్ రియాలిటీ షో తెలుగు ప్రేక్షకులకు విపరీతంగా నచ్చేసింది. ఈ షో వస్తుందంటే చాలు, ఆ సమయంలో ప్రసారమయ్యే ఇష్టమైన సీరియళ్లను కూడా త్యాగం చేసేందుకు వెనుకాడరు. అలాంటి బిగ్‌బాస్ షో ఈ ఆదివారం నుంచి అందరి ఇళ్లలో తిష్ట వేయనుంది. కాగా ఇప్పటికే ఈ కార్యక్రమంలో పాల్గొనే కంటెస్టెంట్లు వీళ్లే అంటూ అనేకమంది పేర్లు వినిపిస్తున్నాయి. ముందుగా కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పాల్గొననున్నాడని ప్రచారం జరగ్గా ఆయన దాన్ని కొట్టిపారేశాడు. ఆ తర్వాత రఘు మాస్టర్ పేరు వినిపించింది. (కరోనా వార్తలను కొట్టిపారేసిన నోయల్) అంతేకాదు, రఘు మాస్టర్‌తో పాటు ఆయన భార్య ప్రణవి కూడా జంటగా బిగ్‌బాస్ హౌస్‌లోకి వెళ్లనున్నాడని ఊహాగానాలు మొదలయ్యాయి. తాజాగా రఘు మాస్టర్ ఈ వార్తలను కొట్టిపారేశాడు. "బిగ్‌బాస్ 4కు రావాల్సిందిగా నాకు ఆఫర్ వచ్చినమాట వాస్తవమే. కానీ వ్యక్తిగత కారణాల వల్ల షోలో పాల్గొనడం లేదు" అని స్పష్టం చేశారు. అయితే రఘు మాస్టర్ మొదట బిగ్‌బాస్‌కు వెళ్లేందుకు సిద్ధమయ్యాడని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. కానీ ఆఖరు నిమిషంలో అతను నిర్ణయాన్ని మార్చుకుని బిగ్‌బాస్‌కు హ్యాండ్ ఇచ్చాడని చెప్తున్నారు. దీంతో ఇప్పుడు అతని స్థానంలో ఎవరిని తీసుకోనున్నారనేది ఆసక్తికరంగా మారింది. ఈ సీజన్లో కొరియోగ్రాఫర్ కంటెస్టెంట్ ఉంటారో? లేదో? చూడాలి! (బిగ్‌బాస్ 4 ఎంట్రీ: కొట్టిపారేసిన నటి) -
అందాల సురభామినిని ఆడించిన వాడితడే
ప్రముఖ డ్యాన్స్ మాస్టర్ హీరాలాల్ శిష్యుడు, పదిహేను వందలకు పైగా చిత్రాలకు నృత్యరీతులు సమకూర్చిన శ్రీను మాస్టర్ (82) చెన్నయ్‌లోని టి.నగర్ నివాసంలో ఆదివారం ఉదయం గుండెపోటుతో మరణించారు. శ్రీను మాస్టర్ తల్లిదండ్రులు లక్ష్మీ దేవమ్మ, నారాయణప్ప. ఆయనకు భార్య (ఉమాదేవి), ఇద్దరు కుమార్తెలు, కుమారుడు విజయ్ శ్రీనివాస్ ఉన్నారు. విజయ్ శ్రీనివాస్ దర్శకత్వ శాఖలో పనిచేస్తున్నారు. శ్రీను మాస్టర్ నృత్య దర్శకులుగా 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. డాక్టరేట్ అందుకున్నారు. ఇటీవలే ‘సాక్షి’తో మాట్లాడారు. ఆ ఇంటర్వ్యూలోని కొన్ని భాగాలవి. ‘‘మా సొంత ఊరు కర్నూలు జిల్లా ఆదోని. 1956 అక్టోబర్‌లో మా అక్కయ్య నన్ను తనకు తోడుగా మద్రాసు తీసుకొచ్చారు. రెండు మూడురోజుల్లో పంపేస్తానన్నారు. నెలలు గడిచిపోయినా నన్ను పంపలేదు. హీరాలాల్ మాస్టారు మాకు దగ్గర్లోనే ఉండేవారు. సినిమా పాటలకు డ్యాన్స్‌లు ఇంట్లోనే రిహార్సల్స్ చేసేవారు. అవి చూస్తూ నేను ఏదో ఆడుతూ ఉండేవాడిని. నన్ను ఆయన గమనించారు. మా బావగారి మేనమామ గురు సుందర్‌ప్రసాద్ (ఢిల్లీ రవీంద్రభారతిలో కథక్ ప్రిన్సిపాల్) గారి దగ్గర నాకు కథక్ నేర్పించారు.ఆయనే నాకు ప్రథమ గురువు. ఆ తరవాత ఈశ్వర్‌లాల్ మాస్టారు దగ్గర సినిమా నాట్యం నేర్పించారు. ఒకరోజు హీరాలాల్ గారు నన్ను జెమినీ స్టూడియోకి తీసుకెళ్లారు. అక్కడ పద్మిని, జెమినీ గణేశన్‌లను చూశాను. అప్పుడే నటీనటులను నేరుగా చూడటం. ఆ రోజు హీరాలాల్ మాస్టర్ డ్యాన్స్ చేసి, నా వంక వేలు చూపుతూ ‘అర్థమయ్యిందా’ అని అడిగి, వెంటనే నన్ను చేయమన్నారు. నాకు తోచినట్లుగా చేశాను. పద్మినిగారు ప్రశంసించారు. ఆ తర్వాత జెమినీ ఎస్.ఎస్.వాసన్‌గారు నాకు అవకాశం ఇచ్చారు. ‘వహ్ని కోటై్ట వాలిబన్’ చిత్రాన్ని తమిళ, హిందీ భాషలలో తీసినప్పుడు తెలుగులోకి దానిని ‘విజయకోట వీరుడు’ గా డబ్ చేశారు. 1958లో విడుదలైంది. అందులో పద్మిని, వైజయంతిమాలకు పోటీ పాట ఉంటుంది. ఆ డ్యాన్స్ నేను కంపోజ్ చేసిందే. అది ఒక సెన్సేషన్. 1968లో విడుదలైన ‘నేనంటే నేనే’ నా మొదటి సొంత నృత్య దర్శకత్వ సినిమా. డూండీగారు నన్ను డ్యాన్స్ మాస్టర్‌గా తెలుగు తెరకు పరిచయం చేశారు. అలా నా కెరియర్ 1968లో ప్రారంభమై, 2013 దాకా కొనసాగింది. ఇంత కెరీర్లో వందకు పైగా దర్శకులతో, తొమ్మిది భాషలలో పనిచేశాను. నేను చేసిన ఆఖరి చిత్రం గోపీచంద్, నయనతారలతో. ఆ సినిమా విడుదల కాలేదు. విడుదలైన సినిమాలలో ‘శ్రీరామరాజ్యం’ ఆఖరిది. ఆ చిత్రంతో లెక్కవేసుకుంటే పదిహేను వందల సినిమాల కంటే ఎక్కువ సినిమాలకు నృత్య దర్శకత్వం వహించాను. నటీనటులతో అనుభవాలు చిరంజీవి మంచి ఫ్లెక్సిబిలిటీ ఉన్న నటుడు. అతను భరత నాట్యం నేర్చుకోకపోయినా ‘శివుడు శివుడు శివుడు’ సినిమాలో అద్భుతంగా నర్తించాడు. ‘అగ్నిపూలు’ సినిమాలో జయప్రద స్టేజీ మీద చేసే ‘పాము – నెమలి’ పాటను ఆరు రోజులు తీశాను. ఆ డ్యాన్స్‌లో ఒళ్లంతా కలిపి ఒకే డ్రెస్. కాని ఆ పాట కోసం ఒకేలాంటివి ఐదు కుట్టించాం. ఏ రోజుకారోజు చిరిగిపోతూ ఉండేది. ఆరు రోజులకు ఐదు కుట్టించాం. ఆవిడ ఎంత కష్టపడ్డారో పాటను చూస్తే అర్థమవుతుంది.‘యమగోల’లోని ‘ఆడవె అందాల సురభామిని’ పాటను రెండు రోజుల్లోనే తీసేశాను. స్వర్ణకమలంలోని ‘శివపూజకు చివురించిన సిరిసిరి మువ్వ’ ను మూడు రోజులలో తీశాను. ఆ పాటకు నాకు మొదటి నంది అవార్డు వచ్చింది. ‘అగ్నిపూలు’ పాటకు సితార అవార్డు వచ్చింది. 1968లో డ్యాన్స్మాస్టర్నైతే 1981లో నాకు అవార్డు వచ్చింది! ఎన్.టి.ఆర్.కి డ్యాన్సులు నేనే మొట్టమొదటగా ‘ఎదురులేని మనిషి’ చిత్రంతో ప్రారంభించాను. ఈ సినిమాలో బెల్‌బాటమ్స్, పెద్ద పెద్ద కాలర్లు. రామారావుగారిని ఒప్పించి చేయించాను. ఆయన సంతోషపడ్డారు. నన్ను కంటిన్యూ చేయమన్నారు. ఆయన ఏ షాట్ చేసినా నేను ఓకే అంటేనే ఒప్పుకునేవారు. లేదంటే మళ్లీ చేసేవారు. నిజానికి.. డ్యాన్స్ కోసమే పుట్టిన పసుమర్తి, వెంపటి సత్యం వంటి వారున్న సందర్భంలో నన్ను ఎందుకు తీసుకోవాలి? ఒక కొత్తదనం కావాలనుకుంటారు. అంతే. చిన్న చిన్న ఇబ్బందులు ‘నేనంటే నేనే’ చిత్రంలో కాంచనకు రెండు ఇబ్బందులు, కృష్ణకి ఒక ఇబ్బంది కలిగాయి. కారులోనే చిన్న చిన్న మూమెంట్ చేయాలి. ఆయన పొడుగుకి బెండ్ అయ్యి చేయడం ఇబ్బంది అయిపోతుంది. ఒక దెయ్యం పాటలో కొన్ని హార్డ్ మూమెంట్స్ ఉంటాయి. చీరలో చాలా ఇబ్బంది పడుతూ చేశారు కాంచన. తప్పనిసరి కాబట్టి సహకరించారు కాంచన. గీతాంజలితో మహాబలుడులో ఒక క్లాసికల్ డ్యాన్స్ చేయించాను. మోకాళ్ల మీద కూర్చుని చేయడానికి ఇబ్బంది పడినా చెప్పింది చెప్పినట్లు చక్కగా చేశారు. ఒక్క క్లాసికల్ మాత్రమే కాదు ఫోక్, వెస్ట్రన్ అన్నీ చేశాను. ఒక గమ్మత్తయిన విషయం కృష్ణగారి కురుక్షేత్రం, దానవీరశూరకర్ణ చిత్రాలకు నన్ను పెట్టుకోలేదు. నాకు క్లాసికల్ డ్యాన్స్‌లు రావనుకున్నారు. అప్పటికి నేను జ్యోతిలక్ష్మి, జయమాలిని వంటి వారికి క్లబ్ డ్యాన్సులు చేసేవాడిని. దానవీరశూరకర్ణకు వెంపటి గారిని, కురుక్షేత్రం చిత్రానికి పసుమర్తి, హీరాలాల్, చిన్ని సంపత్ ముగ్గురిని పెట్టుకున్నారు. మా గురువుగారు ఒక పాట చేశాక హిందీలో బిజీగా ఉండటంతో ఇంక చేయలేకపోయారు. అప్పుడు కమలాకర కామేశ్వరరావు ఇబ్బంది పడుతూనే నన్ను పెట్టుకున్నారు. డ్యాన్స్ చూశాక అందరూ మెచ్చుకున్నారు. క్లాసికల్‌కి నేను పనికిరాను అనుకున్న వారంతా నాతో క్లాసికల్ చేయించుకోవడం మొదలుపెట్టారు. సంభాషణ: వైజయంతి పురాణపండ -
వృత్తి పెయింటర్.. ప్రవృత్తి డ్యాన్స్ మాస్టర్..
సాక్షి, అశ్వారావుపేట : ప్రతిభ, పట్టుదల, ఆత్మవిశ్వాసంతో శ్రమిస్తే సాధించలేనిది ఏదీ లేదని నిరూపిస్తున్నారు అశ్వారావుపేటకు చెందిన యువ నృత్య కళాకారుడు మహ్మద్ యాసిన్. అశ్వారావుపేటలోని ముస్లిం బజారుకు చెందిన మహ్మద్ యాసీన్‌కు చిన్నప్పటి నుంచి నృత్యం అంటే అమితాసక్తి. గొప్ప నృత్యకళాకారుడు కావాలనే కోరిక ఉన్నా కుటుంబ ఆర్థిక పరిస్థితి తోడ్పాటు ఇవ్వలేదు. దీంతో టీవీల్లో వచ్చే నృత్య ప్రదర్శనలు చూస్తూ నృత్య సాధన చేశాడు. ఇలా గొప్ప డ్యాన్సర్ కావాలనే సంకల్పంతో తన నృత్య నైపుణ్యాలను మెరుగు పరుకున్నాడు. పేదరికం వెంటాడినా ఆత్మ విశ్వాసం కోల్పోకుండా గల్లీ స్థాయి నుంచి రంగుల ప్రపంచం(సినిమా రంగం)లోకి అడుగు పెట్టి యువ నృత్య కళాకారుడిగా ఎదిగారు. పొట్ట కూటి కోసం రోజు వారీ కూలీగా పెయింటర్‌గా పని చేస్తూనే ఎంతో మంది చిన్నారులు, పెద్దలకు నృత్యాలు నేర్పిస్తూ తాను ఉపాధి పొందుతూ ప్రశంసలు పొందుతున్నాడు. నిన్న మొన్నటి వరకు గల్లీ డ్యాన్స్ మాస్టర్‌గానే రాణించిన ఈ యువ కళాకారుడు ఓ ద్విభాషా చిత్రానికి (ఇటీవలె ఆడియో రిలీజ్ కాగా, మరో రెండు వారాల్లో సినిమా విడుదల కానున్నది.) కొరియోగ్రాఫర్‌గా పనిచేసి తన సత్తా చాటాడు. ఇలా స్వయంగా నేర్చుకున్న నృత్యాన్ని తనతోపాటు మరో నలుగురికి నేర్పించి, తాను ఉపాధి పొందాలనే ఉద్దేశంతో 2002వ సంవత్సరంలో ‘స్వయంకృషి’ పేరుతో డ్యాన్స్ కోచింగ్ సెంటర్‌ను ప్రారంభించాడు. ఈ సెంటర్లో చిన్నారులకు నృత్యాలు నేర్పిస్తూనే, అడపాదడపా చిన్న చిన్న నృత్య ప్రదర్శనలు ఇవ్వడం మొదలు పెట్టాడు. వాటికి మంచి స్పందన రావడంతో రెట్టింపు ఉత్సహంతో మరింత సాధన చేసి తనదైన గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ ఉత్సహంతోనే టీవీల్లో ప్రసారం అవుతున్న డ్యాన్స్ ప్రొగ్రామ్స్‌లో అవకాశాల కోసం ప్రయత్నించాడు. ఇలా ప్రయత్నిస్తున్న క్రమంలోనే కొద్ది రోజుల్లోనే ఓ ప్రముఖ టీవీ చానల్లో నిర్వహించిన ‘ఢూం డిగడిగ’ పోటీల్లో రాష్ట్రస్థాయిలో ద్వితీయ బహుమతి సాధించాడు. అనంతరం 2005లో డ్యాన్స్ బేబీ డ్యాన్స్, 2008లో ‘ఆట’, ‘ఛాలెంజ్’ ప్రొగామ్స్‌లో పాల్గొన్నాడు. టీవీల్లో ప్రసారమైన ‘ఢీ’ షో, ‘రంగస్థలం’ పోటీల్లో తన శిష్యులకు అవకాశం దక్కింది. డ్యాన్స్ మాస్టర్ సత్య చేతుల మీదుగా రాష్ట్ర స్థాయిలో రెండు బహుమతులు సాధించాడు. వాటితోపాటు హైదారాబాద్, ఖమ్మం, రాజమండ్రి, అశ్వారావుపేటలో జరిగిన అనేక కార్యక్రమాల్లో యాసిన్ నృత్యాలతో ఆకట్టుకున్నాడు. తన కోచింగ్ సెంటర్‌తోపాటు పాఠశాలలు, కళాశాలలు, యూనివర్సిటీల్లో దాదాపు ఇరవై వేల మంది చిన్నారులు, విద్యార్థులకు డ్యాన్స్ కోచింగ్ ఇచ్చాడు. ఇవే కాకుండా వేల సంఖ్యలో ప్రైవేట్, జాతర, శుభకార్యాల్లో నృత్య ప్రదర్శనలు చేశాడు. -
చిన్నారిపై డ్యాన్స్ మాస్టర్ లైంగికదాడి
పశ్చిమగోదావరి ,భీమవరం టౌన్: నృత్య శిక్షకుడు (డ్యాన్స్ మాస్టర్) రూపంలో ఉన్న కీచకుడిని తలుచుకుని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. భీమవరం టూటౌన్ జువ్వలపాలెం రోడ్డులోని శ్రీ భారతి రెసిడెన్షియల్ స్కూల్లో మూడో తరగతి చదువుతున్న బాలికపై డ్యాన్స్ మాస్టర్ సైదు చైతన్యవర్మ నృత్యం నేర్పే సమయంలో లైంగిక దాడికి పాల్పడ్డాడన్న ఫిర్యాదు మేరకు పోలీస్‌స్టేషన్‌లో ఈనెల 12న కేసు నమోదు చేసి నిందితుడిని పో లీసులు అదుపులోకి తీసుకున్న సంగతి విధితమే. నిందితుడు ఈ పాఠశాలతో పాటు పలు ప్రైవేట్ స్కూళ్లలోనూ నృత్య శిక్షణ ఇస్తున్నట్టుగా తెలి సింది. కొల్లేటికోటకు చెందిన సైదు చైతన్యవర్మ భీమవరంలోని పలు ప్రైవేట్ స్కూళ్లలో డ్యాన్స్ మాస్టర్‌గా పనిచేస్తున్నాడు. డ్యాన్స్ సరిగా చేయడం లేదని ఇంకా బాగా నేర్పుతానని ఓ బాలికను స్కూల్లోని వాష్‌రూమ్‌లోకి తీసుకువెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడని బాధితురాలి తల్లి ఫిర్యాదు చేయడంతో దారుణం వెలుగుచూసింది. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని బాలికను వైద్య పరీక్షల నిమిత్తం భీమవరం ప్రభుత్వాసుపత్రిలో చేర్పించారు. పెల్లుబికిన ఆగ్రహం బాలిక కుటుంబసభ్యుల ద్వారా విషయం తెలుసుకున్న పొరుగు మండలంలోని ఓ గ్రామానికి చెం దిన పలువురు బుధవారం భీమవరంలో శ్రీ భార తి స్కూల్ ఎదుట ధర్నాకు దిగడంతో ఉద్రిక్తత నెలకొంది. పాఠశాలను మూసివేయాలని, యాజ మాన్యంపై చర్యలు తీసుకోవాలని, నిందితుడిని కఠినంగా శిక్షించాలని పెద్దెత్తున నినాదాలు చేశా రు. భీమవరం టూటౌన్, వన్‌టౌన్ సీఐలు ఎస్ ఎస్వీ నాగరాజు, పి.చంద్రశేఖరరావు సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆందోళనకారులతో చర్చించారు. కేసులో బాధిత కుటుంబానికి పూర్తిన్యాయం చేస్తామని, ఎవరినీ విడిచి పెట్టే ప్రసక్తి లేదని సీఐ ఎస్ఎస్వీ నాగరాజు నచ్చచెప్పారు. 376 ఫోక్స్ యాక్ట్ కింద నిందితుడిపై కేసు నమోదు చేశామని కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. దీంతో గ్రామస్తులు ధర్నా విరమించారు. డీఎస్పీని కలిసిన బాలిక కుటుంబ సభ్యులు నరసాపురం డీఎస్పీ కె.నాగేశ్వరరావు బుధవారం సాయంత్రం భీమవరం వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌కు వచ్చారు. బాలిక కుటుంబ సభ్యులు, గ్రామస్తులు అక్కడికి చేరుకున్నారు. సీఐ ఎస్ఎస్వీ నాగరాజు వారితో మాట్లాడారు. డీఎస్పీ దృష్టికి విషయం తీసుకువెళతామని వారంతా కోరారు. బాలిక కుటుంబ సభ్యులతో డీఎస్పీ మాట్లాడారు. విష యం తెలిసిందని నిందితుడికి కఠినంగా శిక్ష పడేలా చూస్తామని డీఎస్పీ హామీ ఇచ్చారు. శ్రీభారతి స్కూల్‌కు షోకాజ్ నోటీసు ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): చిన్నారిపై ఉపాధ్యాయుడు లైంగిక దాడికి పాల్పడిన అంశంలో భీమవరం శ్రీ భారతి స్కూల్‌ను ఎందుకు మూసివేయరాదో సంజాయిషీ ఇవ్వాలని జిల్లా విద్యాశాఖాధికారి సీవీ రేణుక ఆ పాఠశాల యాజమాన్యానికి షోకాజ్ నోటీసు జారీ చేశారు. ఈ మేరకు పాఠశాల కరస్పాండెంట్‌కు నోటీసులు జారీ చేశామని, వారిచ్చే సంజాయిషీ ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. -
డ్యాన్స్ మాస్టర్ దారుణ హత్య
సాక్షి, నాయుడుపేట టౌన్: డ్యాన్స్ మాస్టర్‌పై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేసి దారుణంగా హత్య చేశారు. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నాయుడుపేటలో సోమవారం ఈ ఘటన వెలుగుచూసింది. అయితే మృతదేహాన్ని భద్రపరచడంలో ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారు. పోస్టుమార్టం గదిలో శవపేటిక మూతను మూయకపోవడంతో ఎలుకలు అతడి ముఖాన్ని కొరికేశాయి. దీంతో అతడి కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. పోలీసులు, కుటుంబసభ్యుల కథనం మేరకు.. పట్టణంలోని సంజయ్‌గాంధీ కాలనీలో నివాసముంటున్న జెడ శ్రీనివాసులు (31) డ్యాన్స్ మాస్టర్‌గా పనిచేస్తూ జీవన సాగిస్తున్నాడు. సోమవారం తెల్లవారుజామున అతను పాత రెవెన్యూ కార్యాలయం సమీపంలో అపస్మారక స్థితిలో ఉండటంతో స్థానికులు గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వారు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని శ్రీనివాసులను స్థానిక ప్రభుత్వ వైద్య శాలకు తరలించారు. వైద్యుల సూచన మేరకు మెరుగైన వైద్యం కోసం గూడూరు ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ శ్రీనివాసులు మృతి చెందాడు. అందరితో సఖ్యతగా ఉండే తన కుమారుడు శ్రీనివాసులును దారుణంగా కొట్టి చంపేశారని మృతుడి తల్లి భాగ్యమ్మ చెబుతోంది. పట్టణంలోని జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాల క్రీడా ప్రాంగణంలో గుర్తు తెలియని వ్యక్తులు శ్రీనివాసులుపై మూకుమ్మడి దాడి చేసినట్లు అక్కడి ఆనవాళ్లను బట్టి గుర్తించారు. మృతుడి బూట్లు తలో దిక్కు పడి ఉండటం, సమీపంలోని జిమ్ వెనుక గోడలకు రక్తపు మరకలు ఉండటాన్ని సైతం గుర్తించారు. శ్రీనివాసులుపై దాడి చేసి పాత తహసీల్దార్ కార్యాలయం సమీపంలో పడివేయడంతో, రాత్రి సమయంలో ఎవరూ గుర్తించలేకపోయినట్లు బాధితురాలు వాపోయింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ముఖాన్ని కొరికేసిన ఎలుకలు శ్రీనివాసులు మృతదేహాన్ని నాయుడుపేట ప్రభుత్వ వైద్య శాల పోస్టుమార్టం గదిలో భద్రపరచగా, అక్కడ సిబ్బంది శీతల శవపేటిక మూత మూయకండా నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో అతడి ముఖాన్ని ఎలుకలు కొరికేశాయి. దీంతో మృతుడి కుటుంబ సభ్యులు, బంధువులు సోమవారం రాత్రి ఆందోళన చేపట్టారు. సిబ్బందికి చెప్పినా వారు చాలా సేపటి తర్వాత స్పందించి శవపేటికపై మూత వేసినట్లు మృతుడి సోదరుడు అంకయ్య దేవరాజ్ వాపోయాడు. -
ఫైటింగ్ కింగ్‌గా డాన్సింగ్ స్టార్
సినిమా: ప్రభుదేవాను ఇప్పటి వరకూ డాన్సింగ్స్టార్గానే చూసిన ప్రేక్షకులు త్వరలో ఫైటింగ్కింగ్గా కూడా చూడబోతున్నారు. అవును ప్రభుదేవా హీరోగా నటిస్తున్న తాజా చిత్రాల్లో యంగ్ మంగ్ ఛంగ్ చిత్రం ఒకటి. వాసన్ విజువల్ వెంచర్స్ పతాకంపై కేఎస్.శ్రీనివాసన్, కేఎస్.శివరామన్ నిర్మిస్తున్న చిత్రం యంగ్ మంగ్ ఛంగ్. ఇందులో ప్రభుదేవా సరసన నటి లక్ష్మీమీనన్ నటిస్తోంది. దర్శకుడు తంగర్‌బచ్చన్, ఆర్జే.బాలాజి, కట్, మునీశ్కాంత్, మారిముత్తు, విద్య నటిస్తున్నారు. బాహుబలి చిత్ర విలన్ ప్రభాకర్ ఇందులోనూ విలన్‌గా నటిస్తున్నారు. నవ దర్శకుడు అర్జున్.ఎంఎస్ కథ, కథనం, మాటలు, దర్శకత్వం బాధ్యతలను నిర్వహిస్తున్న ఈచిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. యంగ్ మంగ్ ఛంగ్ చిత్ర వివరాలను దర్శకుడు తెలుపుతూ చిత్ర షూటింగ్ దాదాపు పూర్తి అయ్యిందని చెప్పారు. ఇటీవల ఇందులోని ప్రభుదేవా విలన్ ప్రభాకర్‌తో పోరాడే ఒక భారీ పోరు దృశ్యాలను చిత్రీకరించినట్లు తెలిపారు. చెన్నై సమీపంలోని పొళిచ్చనూర్ అడవుల్లో 7 రోజులు పాటు చిత్రీకరించిన ఈ పోరాట సన్నివేశాల్లో ప్రభుదేవా, ప్రభాకర్లతో పాటు వేలాది మంది సహాయ నటీనటులు పాల్గొన్నారని చెప్పారు. చిత్రంలోని హైలెట్ అంశాల్లో ఈ పోరాట దృశ్యం ఒకటి అని అన్నారు. ఇందులో ప్రభుదేవా కుంగ్‌ఫూ మాస్టర్‌గా నటిస్తున్నారని తెలిపారు. ఆయన నటించిన చిత్రాలన్నింటికంటే యంగ్ మంగ్ ఛంగ్ చిత్రం భిన్నంగా ఉంటుందని చెప్పారు. ఇక ప్రభాకర్ ఫైట్స్‌లో శిక్షణ ఇచ్చే బృందానికి నాయకుడిగా నటిస్తున్నారని చెప్పారు. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటున్న ఈ యంగ్ మంగ్ ఛంగ్ చిత్రం ఆబాలగోపాలాన్ని అలరించేవిధంగా ఉంటుందని దర్శకుడు అర్జున్ తెలిపారు. ఈ చిత్రానికి ఆర్పీ.గురుదేవ్ ఛాయాగ్రహణం, అమ్రీశ్ సంగీతాన్ని అందిస్తున్నారు. -
డాన్స్ ఫైట్.. వీరేబాస్..
సినిమా అంటే ఓ నాలుగు పాటలు... ఓ నాలుగు ఫైట్లు అనే ధోరణి చాలామందిలో ఉంటుంది. కానీ వాటిని తెరమీదకు తీసుకొచ్చేందేకు పడే కష్టం అంతాఇంతా కాదు. తాము కంపోజ్ చేసిన డ్యాన్స్ లేదా ఫైట్‌ను అంతేఅద్భుతంగా తెర మీదచూపేందుకు ఎంతో కష్టపడతారు మాస్టర్లు. సినిమాకు ప్రాణమైన డ్యాన్స్, ఫైట్లను కంపోజ్ చేసే కొరియోగ్రాఫర్లు, ఫైట్ మాస్లర్లకు కేంద్రం కృష్ణానగర్. వీరికి సహాయ సహకారం అందించే డ్యాన్సర్లు, ఫైటింగ్ కళాకారులకూ ఇదే అడ్డా. బంజారాహిల్స్: ఒకప్పుడు డ్యాన్స్ మాస్టర్లు, జూనియర్ ఆర్టిస్ట్‌లను చెన్నై నుంచి దిగుమతి చేసుకొనేవారు. కానీ తర్వాతి కాలంలో యూనియన్లు ఏర్పడ్డాయి. సినీ అవకాశాల కోసం వచ్చేవారు కృష్ణానగర్‌ను అడ్డాగా మార్చుకున్నారు. ఈ నేపథ్యంలోనే చాలామంది జూనియర్ ఆర్టిస్ట్‌లుగా ఇక్కడ అవకాశం పొందుతున్నారు. దీంతో దిగుమతి చేసుకోవాల్సిన అవసరం తప్పింది. ఇక ఫైట్ మాస్టర్లూ గతంలో చెన్నై నుంచే వచ్చేవారు. వారు కూడా ఇప్పుడు నగరంలోనే అందుబాటులో ఉన్నారు. అంతా కృష్ణానగర్, ఇందిరానగర్ తదితర ప్రాంతాల్లోనే వీరుంటున్నారు. తెర వెనుక హీరోలు... గతంలో డ్యాన్స్ లేదా ఫైట్ గురించి ముందుగా దర్శకత్వం విభాగంతో చర్చించేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఇన్‌స్టంట్‌గా అన్నీ కావాలని డైరెక్టర్లు కోరుకుంటున్నారు. అనుభవమున్న ఫైట్ మాస్టర్లు, కొరియోగ్రాఫర్లు తెరపై తమ ప్రతిభ చూపుతున్నారు. తెరపై హీరోలు అద్భుతంగా డ్యా న్స్ చేసినా, ఆహా.. అనుకునేలా ఫైట్లు చేసినా... ఆ కష్టమంతా తెరవెనుకున్న వీరిదే. డ్యాన్స్ విషయం లో హీరాలాల్ మాస్టర్ సినీ పరిశ్రమకు ఓ గుర్తింపు తీసుకొచ్చారు. అప్పుడు కేవలం ఐదారుగురే డ్యా న్సర్లు ఉండేవారు. సలీం మాస్టర్ వచ్చిన తర్వాత ఆ సంఖ్య 20 వరకు చేరింది. అయితే అప్పుడు తమిళం, మళయాలం, భోజ్‌పురి, తెలుగు, కన్నడ... ఇలా అన్ని భాషాలకు వీరే మాస్టర్లుగా ఉం డేవారు. యూనియన్లు ఏర్పడిన తర్వాత డ్యాన్స్ మాస్టర్లు, ఫైట్ మాస్టర్లతో పాటు జూనియర్ ఆర్టిస్ట్‌లకు ఇక్కడే అవకాశాలు లభిస్తున్నాయి. ఒకప్పుడు చాలా తక్కువ మంది ఫైట్ మాస్టర్లు ఉండేవారు. దీంతో చెన్నై నుంచి మాస్టర్లు వచ్చేవారు. అయితే స్థానిక యూనియన్లు ఏర్పాటుతో పరిస్థితి మారింది. ఇందిరానగర్, కృష్ణానగర్‌లలోని యూనియన్లలోనే చాలామంది సభ్యత్వం తీసుకున్నారు. రామ్‌లక్ష్మణ్, విజయ్, సాల్మాన్రాజ్ తదితర మాస్టర్లు ఇక్కడివారే. ఒకప్పుడు సినిమాల్లో ప్రమాదకర సన్నివేశాల్లో హీరోలకు డూపుగా ఫైట్ మాస్టర్లు లేదా జూనియర్ ఆర్టిస్టులు నటించేవారు. అయితే ఇప్పుడు కొంతమంది కథానాయకులు తామే సొంతంగా చేయాలనుకుంటున్నారు. ఈ క్రమంలో ప్రమాదాలు జరిగిన సందర్భాలున్నాయి. దీంతో కొంతమంది కథానాయకులు ఇప్పటికీ డూప్‌లకే ప్రాధాన్యమిస్తున్నారు. డూప్ టు రియల్...గుర్తుండిపోవాలి... సినిమాల్లో కొరియోగ్రాఫర్‌కు ఎంతో ప్రాధాన్యత ఉంది. తొలినాళ్లలో దర్శకులు కథను చెప్పి అందుకనుగుణంగా డ్యాన్స్ కంపోజ్ చేయమని చెప్పేవారు. కానీ ఇప్పుడు ట్రాక్ ఇచ్చి డ్యాన్స్ కావాలంటున్నారు. అది ఒకరోజు ముందుగా ఇస్తారంతే.. అయితే అనుభవమున్న కొరియోగ్రాఫర్లకు ఇదేం పెద్ద సమస్య కాదు. నేను ఇప్పటికి దాదాపు 800 సినిమాలు చేశాను. భారతీరాజా దర్శకత్వంలో మొదలైన నా ప్రయాణం తాజా ఆర్ఎక్స్ 100 వరకు కొనసాగుతూనే ఉంది. కొరియోగ్రఫీ ప్రేక్షకులకు గుర్తుండిపోయేలా ఉండాలన్నదే నా అభిప్రాయం. – స్వర్ణ, డ్యాన్స్ మాస్టర్ మళ్లీ రియల్... తొలి రోజుల్లో ప్రమాదకర సన్నివేశాల్లో డూపులుగా నటించాల్సి వచ్చేది. అయితే టెక్నాలజీ రావడంతో చాలా సన్నివేశాల్లో గ్రాఫిక్స్ మాయాజాలం ఉండేది. కానీ మళ్లీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. డూపు సన్నివేశాలను ప్రేక్షకులు కోరుకోవడం లేదు. దీంతో చాలామంది హీరోలు సహజంగా నటించేందుకే మొగ్గు చూపుతున్నారు. రంగస్థలం సినిమాలో అంతా సహజత్వం ఉట్టిపడుతుంది. ఇందులో చాలామంది కృష్ణానగర్ జూనియర్ ఆర్టిస్ట్‌లు అవకాశం పొందారు. – రామ్‌లక్ష్మణ్, ఫైట్ మాస్టర్లు సొంతంగాస్టూడియోలు... ఒకప్పుడు డ్యాన్స్, ఫైట్స్‌కు సంబంధించి లోకేషన్లోనే రిహార్సల్స్ ఉండేవి. దీంతో జూనియర్ ఆర్టిస్ట్‌లకు డబ్బులు వచ్చేవి. కానీ ఇప్పుడు ప్రముఖ హీరోలందరికీ సొంతంగా స్టూడియోలు వచ్చాయి. డ్యాన్స్, ఫైట్, జిమ్.. ఇలా ఏదైనా అక్కడే ప్రాక్టీస్ చేస్తున్నారు. మాస్టర్లు అక్కడికే వెళ్లి నేర్పిస్తున్నారు. దీంతో జూనియర్ ఆర్టిస్ట్‌లకు అవకాశాలు తగ్గాయి. -
ఆటా ఆహ్వానం
సాక్షి, సిటీబ్యూరో: అమెరికన్ తెలంగాణ అసోషియేషన్ (ఆటా) ఆహ్వానం మేరకు ప్రముఖ నృత్య గురువు పద్మజారెడ్డి అమెరికాలోని హూస్టన్ నగరంలో ఈ నెల 29, 30, జులై –1 తేదీల్లో మూడు రోజుల పాటు నాట్య ప్రదర్శనలు ఇవ్వనున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను సోమవారం పద్మజారెడ్డి లక్డీకాపూల్‌లోని సెంట్రల్ కోర్టు హోటల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో వెల్లడించారు. జీవిత సాఫల్య పురస్కారంతో తనను సత్కరించనున్నారని తెలిపారు. తాను ప్రణవ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ క్యూచిపూడి డ్యాన్స్ ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభవాన్ని కాకతీయం నృత్య రూపకం ద్వారా ప్రాచుర్యం కల్పించినందుకు ఈ పురస్కారాన్ని ఎంపిక చేశారన్నారు. హూస్టన్ నగరంలో తమ మూడు రోజుల పర్యటనలో నవదుర్గలు నృత్య రూపకంతో పాటు.. కాకతీయం నృత్యంలోని కొన్ని భాగాలను ప్రదర్శిస్తామన్నారు. భద్రాచలం అర్చకులు సీతారామకల్యాణం నిర్వహిస్తున్నట్లు ఆమె చెప్పారు. తాను శిష్య బృందంలోని ఆరుగురితో కలిసి సీతారామ కల్యాణానికి సంబంధించి అంశాలను నృత్యరూపంలో ప్రదర్శిస్తామని పద్మజారెడ్డి వివరించారు. అంతేకాకుండా కెనడా, సింగపూర్, మలేషియా, సిడ్నీల్లో ఇదే రకంగా ప్రదర్శనలకు ఆహ్వానం వచ్చిందన్నారు. భద్రాచలం దేవస్థానం ప్రధాన అర్చకులు మదన్ మోహనాచార్య మాట్లాడుతూ.. భద్రాది రామయ్య కల్యాణాన్ని అమెరికాలోని హూస్టన్‌లోని నగరంలో నిర్వహించేందుకు అనుమతించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి, దేవాదాయ కమిషనర్ శివశంకర్‌లకు కృతజ్ఞతలు చెప్పారు. కార్యక్రమంలో నాట్య బృందంలోని నర్తకిలు అమరనేని షాలిని, ఆవుల భూమిక, కనక హర్షిణి, త్రిష, చందన, మ్రేనిక రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
జానపదమే నృత్యపథం..
అమ్మలారా.. అయ్యలారా.. ఊరోన్ని నేను.. పల్లెటూరోన్ని నేను.. అంటూ ప్రారంభమైన ప్రస్థానం సినీపరిశ్రమ వరకు సాగింది. జానపద నృత్యంలో అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభచూపాడు. ఎన్నో అవార్డులు, రివార్డులు పొందాడు. సత్తుపల్లికి చెందిన ఓ అరటిపండ్ల వ్యాపారి నృత్య ప్రదర్శనలో ఎంతో ఖ్యాతిని ఆర్జించాడు. సత్తుపల్లిటౌన్: పట్టణంలో పేదకుటుంబానికి చెందిన బొమ్మారెడ్డి శ్రీనివాసరెడ్డి జీవనాధారం కోసం అరటిపండ్లు అమ్ముకుంటూ జానపదంపై పట్టు సాధించారు. బాల్యం నుంచే అనేక నృత్య పోటీల్లో పాల్గొని బహుమతులు సాధించారు. అంతర్జాతీయ నర్తకి, సినీనటి మంజుభార్గవి సరసన నృత్య ప్రదర్శన చేశాడు. దాదాపు 28 ఏళ్లుగా జానపదంపై పట్టు సాధించిన ఈయన అనేక పాఠశాలల విద్యార్థులతో పాటు సరిహద్దున ఉన్న కృష్ణా, పశ్చిమగోదావరి, విశాఖపట్నం ప్రాంతాలలోని చిన్నారులకు కూడా నృత్యంలో శిక్షణ ఇస్తూ.. జానపద కళకు ప్రాణం పోస్తున్నారు. ఈయన చేస్తున్న కృష్టికి ఇటీవల డాక్టరేట్ కూడా సాధించారు. దేశ,విదేశాలలో ప్రదర్శనలు దేశంలోని వివిధ ప్రాంతాలతో పాటు సింగపూర్, మలేషియా, థాయిలాండ్, బ్యాంకాక్, చైనా, కాట్మాండ్ దేశాలలో కూడా బొమ్మారెడ్డి అనేక నృత్యం ప్రదర్శించారు. అమ్మలారా.. అయ్యలారా అనే ఒకే జానపద నృత్యాన్ని 1800 సార్లు ప్రదర్శించి ఇటీవల తెలుగుబుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుల్లో స్థానం సంపాదించారు. బెంగుళూరు క్రిష్టయన్ యూనివర్సిటీ నుంచి జానపద నృత్యంలో డాక్టరేట్ కూడా సాధించారు. వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్, జీనియర్స్ బుక్ఆఫ్ రికార్డ్స్‌లో కూడా స్థానం సంపాదించారు. ఇలా ఇప్పటి వరకు 27 జాతీయ అవార్డులు, ఒక అంతర్జాతీయ అవార్డును సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం తెలుగుబుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ సీఈఓగా పని చేస్తున్నారు. మాజీ గవర్నర్ ఎన్డీ తివారీ, సినీహీరో చిరంజీవి, సినినటీ జయసుధ వంటి ప్రముఖుల నుంచి కూడా అభినందనలు పొందారు. తండ్రి పేరిట ఉచిత శిక్షణలు దేశ, విదేశాలలో ప్రదర్శనలు, ప్రశంసలు పొందుతూనే.. మరో వైపు తన తండ్రి పేరున స్థాపించిన బీఎన్ రెడ్డి మెమోరియల్ ట్రస్ట్ ద్వారా వివిధ జిల్లాల్లో ప్రతినెలా 400 మంది పేద విద్యార్థులకు వివిధ సంస్థల ద్వారా ఉచిత శిక్షణలు ఇస్తున్నారు. సినీ కొరియో గ్రాఫర్‌గా.. సినీరంగంపై బొమ్మారెడ్డి శ్రీనివాసరెడ్డికి ఉన్న ఆసక్తి కొరియో గ్రాఫర్‌గా అవకాశం లభించింది. జాతీయ సినీ నృత్య దర్శకులు డాక్టర్ శివశంకర్ మాస్టర్ వద్ద శిక్షణ పొందారు. రాష్ట్ర వ్యాప్తంగా విడుదలైన చందమల్ల అభిలాష్ డైరెక్టర్‌గా ఉన్న డేంజర్‌జోన్ అనే హరర్ తెలుగు చిత్రంలో సింగిల్‌కార్డు నృత్యదర్శకునిగా పని చేశారు. కందాల వంశీ దర్శకత్వంలో ‘ఏదో కలవరం’ చిత్రంలో కొరియో గ్రాఫర్‌గా.. మిరియాల రవికుమార్ దర్శకత్వంలో సుమన్ హీరోగా నటించిన త్యాగాల వీణ చిత్రం, రామచంద్రారెడ్డి దర్శకత్వంలోని ప్రేమశక్తి చిత్రానికి, మువ్వా దర్శకత్వంలో జగపతిబాబు, చార్మి నటీనటులుగా ఉన్న ‘శబ్దం’ చిత్రానికి కొరియో గ్రాఫర్‌గా పని చేశారు. క్లీన్ ఇండియా, శ్రీనుగాడి ప్రేమ, ప్రేమనీదే చిత్రాలకు కొరియో గ్రాఫర్‌గా పనిచేశారు. ఇలా 8 చిత్రాలకు కొరియో గ్రాఫర్‌గా పనిచేయగా 4 చిత్రాలు విడుదలయ్యాయి. ఇటీవల లేపాక్షి ఉత్సవాలలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా లేపాక్షి అవార్డును అందుకున్నారు. కళాకారులనుతయారు చేయాలని.. నా లాగే జానపద కళలో ఎంతోమంది నిరుపేద కళాకారులు ఉన్నారు. వారిని కూడా ఈ కళలో తీర్చిదిద్దాలనుకుంటున్నా.. 28 ఏళ్లుగా జానపదకళకు సేవ చేస్తున్నాను. ప్రతీ జిల్లాలో నృత్య పాఠశాలను ఏర్పాటు చేసి అంతరించి పోతున్న జానపద కళను పైకి తేవాలనేది నా ఆశయం. –బొమ్మారెడ్డి శ్రీనివాసరెడ్డి, నృత్య కళాకారుడు, సత్తుపల్లి -
కళను పది మందితో పంచుకుంటేనే ఆనందం
-
దుర్గమ్మను దర్శించుకున్న శేఖర్ మాస్టర్
చిట్టినగర్(విజయవాడపశ్చిమం): ప్రముఖ డ్యాన్స్ మాస్టర్ శేఖర్ బుధవారం కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారిని దర్శించుకునేందుకు విచ్చేసిన శేఖర్ మాస్టర్‌ను ఆలయ అధికారులు సాదరంగా స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించిన అనంతరం వేద పండితులు ఆశీర్వచనం అందచేయగా, ఆలయ అధికారులు ప్రసాదాలను అందజేశారు. శేఖర్ మాట్లాడుతూ నేను విజయవాడలో పుట్టి పెరిగిన వాడినేనని అన్నారు. నగరానికి వచ్చినప్పుడల్లా అమ్మవారిని దర్శించుకుంటానన్నారు. కార్యక్రమంలో శేఖర్ మాస్టర్‌తోపాటు టీడీపీ మైనార్టీ సెల్ ప్రధానకార్యదర్శి షేక్.హుస్సేన్ బాషా(బాషీ)తోపాటు ఉల్లి ప్రసాద్, ఉల్లి సుధాకర్, పలువురు డ్యాన్స్ విద్యార్థులు పాల్గొన్నారు. -
ఉపాధినిచ్చిన నృత్యం
మంచిర్యాలక్రైం: చిన్నతనంలో డ్యాన్స్ చేస్తున్నప్పుడు బంధువులు, స్నేహితులు చప్పట్లు కొట్టేవారు. ఆ చప్పట్లే ఆమెను నాట్యం వైపు నడిపించాయి. ఆ నాట్యమే ప్రస్తుతం జీవానోపాధిని కల్పిస్తోంది. మంచిర్యాలకు చెందిన శనిగారపు ఝాన్సీటోని నాట్య ప్రస్థానం ఆమె మాటల్లోనే.. హైదరాబాద్‌లో ఓ టీవీ చానల్ నిర్వహించిన డ్యాన్స్ ఈవెంట్ షోలో గోదావరిఖనికి చెందిన శనిగారపు వినయ్‌కాంత్(టోని)తో పరిచయం ఏర్పడింది. ఇద్దరం డ్యాన్సర్లం. మా ఇద్దరి పరిచయం కాస్త ప్రేమగా మారింది. కుటుంబ సభ్యులు అభ్యంతరం చెప్పడంతో ప్రేమ వివాహం చేసుకున్నాం. ప్రస్తుతం ఒక బాబు ఫిన్ని రుబేన్(లిరిక్స్)(4) ఉన్నాడు. ఇద్దరం డ్యాన్స్ మాస్టర్లు కావడంతో... ఇద్దరం డ్యాన్స్ మాస్టర్లం కావడంతో డ్యాన్స్‌నే వృత్తిగా మలుచుకుని గోదావరిఖని, మంచిర్యాలలో డ్యాన్స్ స్కూల్‌ను స్థాపించాం. ప్రైవేటు పాఠశాలలోనూ, ప్రభుత్వ, ప్రైవేటు కార్యక్రమాల్లో ఈవెంట్స్ చేస్తూ జీవనం సాగిస్తున్నాం. వివాహ అనంతరం మా ఇద్దరి కుటుంబాలు కలిశాయి. భర్త ప్రోత్సాహంతోనే నేను డ్యాన్స్ రంగంలో నిలదొక్కుకోగలిగాను. పలు చానెళ్లలో పాల్గొని నాకంటూ ఓ ప్రత్యేకమైన ముద్రను ఏర్పర్చుకున్నాను. 2016లో హైదరాబాద్‌లోని శిల్ప కళావేదిక ప్రాంగణంలో నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర డ్యాన్స్ ఈవెంట్స్ పోటీల్లో పొల్గొని ప్రథమ బహుమతి రూ. 50 వేలు నగదు అవార్డు అందుకున్నాను. ప్రస్తుతం బిత్తిరి సత్తి హీరోగా నిర్మిస్తున్న ‘తుపాకి రాముడు’ చిత్రంలో హీరోయిన్ చెల్లెలు పాత్రలో నటిస్తున్నాను. నేనూ మా ఆయన కలిసి ఇప్పటివరకు ప్రైవేటు కార్యక్రమాల్లో సుమారు 500కు పైగా ఈవెంట్స్ చేశాం. ప్రస్తుతం 30 మందికి ఫోక్ డ్యాన్స్, బ్రేక్ డ్యాన్స్, భరతనాట్యం, తదితర డ్యాన్స్‌లో శిక్షణ ఇస్తున్నాం. ఎంతో మంది కళాకారులను తయారు చేస్తున్నాం. పేద కళాకారులను గుర్తిం ప్రత్యేకంగా ప్రోత్సహిస్తున్నాం. మహిళలపై వివక్ష వీడాలి... సమాజంలో మహిళలపై వివక్ష ఇంకా కొనసాగుతూనే ఉంది. మహిళల రక్షణ కోసం ఎన్ని చట్టాలు తెచ్చినా వాటిని అమలు చేయడంలో ప్రభుత్వాలు విఫలమవుతూనే ఉన్నాయి. ఒకప్పటితో పోలిస్తే మహిళలు అన్ని రంగాల్లోనూ రాణిస్తున్నారు. వారు పురుషులకంటే ఎందులో తక్కువ లేరు. మహిళలకు అన్నిరంగాల్లో సమానత్వ హక్కులు కల్పించాలి. -
ప్రముఖ డ్యాన్స్ మాస్టర్‌కు అవార్డు..
సాక్షి, పెరంబూరు: హాస్యనటుడు వివేక్, నృత్యదర్శకుడు, హీరో రాఘవ లారెన్స్ ప్రముఖులు ఉళవే తలై అవార్డులను అందుకోనున్నారు. రైతులను ప్రోత్సహించాలనే సదుద్దేశంతో తమిళ సంస్కృతి, రైతుల దినోత్సవాన్ని పురష్కరించుకుని ఇందిర ఆగ్రోటెక్ సంస్థ తొలిసారిగా ఉళవే తలై పేరుతో అవార్డును ప్రవేశపెడుతోంది. రైతుల అభివద్ధిని కాంక్షించే, వారిని ఆదుకునే, అండగా నిలిచే సామాజిక సేవల్లో విశేష కృషి చేస్తున్న ప్రముఖులకు ఈ అవార్డును అందించినున్నారు. రైతులకు అదుకునే వారిని సత్కరించాలనే ఉద్దేశంతో నెల కొల్పినట్లు ఇందిర ఆగ్రోటెక్ నిర్వాహకులు వెల్లడించారు. ఈ అవార్డుల ప్రదానోత్సవ వేడుక శనివారం సాయంత్రం స్థానిక చేపాక్కం, స్వామి శివానంద రోడ్డులోని అన్నా ఆవరణలో ఘనంగా నిర్వహించనున్నారు. తమిళనాడు గవర్నమెంట్ ఎంప్లాయర్స్ అసోసియేషన్ మాజీ అధ్యక్షురాలు తమిళ్‌సెల్వి, దూరదర్శన్ పొదిగై ప్రోగ్రామింగ్ డైరెక్టర్ ఆండాళ్ ప్రియదర్శన్, ఇందిర గ్రూప్ ఆఫ్ చైర్మన్ భూపేశ్నాగరాజన్ పాల్గొననున్న ఈ కార్యక్రమానికి రాష్ట్ర భాషా, సాంస్కృతిక శాఖా మంత్రి కే.పాండియరాజన్ అవార్డులు ప్రదానం చేయనున్నారు. అదే విధంగా ప్రత్యేక అతిథులుగా సినీ దర్శకుడు కే.భాగ్యరాజ్, తంగర్‌బచ్చన్, అబ్దుల్ కలాం ఆలోచనకర్త పొన్రాజ్ వెళ్‌లైస్వామి పాల్గొననున్నారు. ఇక ఈ అవార్డులను సేనాపతి కంగయమ్ కాట్టిల్ రిచర్చ్ ఫౌండేషన్ నిర్వాహకుడు కార్తికేయ శివసేనాపతి, సీనియర్ హాస్య నటుడు వివేక్, నృత్యదర్శకుడు, నటుడు సామాజిక సేవకుడు రాఘవలారెన్స్, తమిళనాడు వీర విళైయాట్టు మీట్పు కళగం కోఆర్డనేటర్ రాజేశ్, సీడీఎంఎంఎఫ్పీఓ చైర్మన్ ఎల్.రవిచంద్రన్, అగ్రికల్చర్ ఎక్స్పర్ట్ పామైయన్, ఎఫ్ఐబీ, సోల్ లైఫ్ టెక్నాలజీస్ ప్రయివేట్ లిమిటెడ్ సీఈఓ కవిత సాయిరామ్, జల్లికట్టు ఆక్టివిటీస్ ఆర్గనైజేషన్ ఎస్.రాజేశ్, ఇండియన్ సాయల్బయాలజిస్ట్, ఎకోలజిస్ట్ సుల్లాన్ అహ్మద్ ఇస్మాయిల్ ఉళవే తలై అవార్డును అందుకోనున్నారని నిర్వాహకులు తెలిపారు. -
ప్రముఖ డ్యాన్స్ మాస్టర్ కన్నుమూత
నిజామాబాద్ : నృత్య దర్శకుడు ప్రభుదేవా గురువు బాడిగ ధర్మరాజు(97) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న ధర్మరాజు శనివారం తుదిశ్వాస విడిచారు. ధర్మరాజు మృతి చెందిన వార్త తెలుసుకున్న ప్రభుదేవా, నస్రుల్లాబాద్ మండలం అంకోల్‌కు చేరుకుని గురువు భౌతికకాయానికి నివాళులర్పించారు. ధర్మరాజు కుటుంబ సభ్యులను ప్రభుదేవా పరామర్శించారు. 20వ ఏట నుంచే డ్యాన్స్‌పై ఆసక్తితో తన చిన్నాన్న బీవీ నరసింహరావు వద్ద శిక్షణ తీసుకున్నారు. ఆ తర్వాత చెన్నైలో స్థిరపడ్డారు. ఎన్టీఆర్, కృష్ణ, మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, ఉదయభానుతో పాటు ప్రముఖ హీరోలకు క్లాసికల్ డ్యాన్స్ మాస్టర్‌గా పని చేశారు. సినిమా రంగానికి చెందిన కృపావతిని ధర్మరాజు పెళ్లి చేసుకున్నారు. -
ఖైదీ మలుపు తిప్పింది
తాడేపల్లిగూడెం : ఆయన కనురెప్పలు కదిపితే నృత్యం. ఆయన అభినయం ఆనందమయం. ప్రేక్షకులను మంత్ర ముగ్దులను చేయడంలో ఆయనకు ఆయనే సాటి. ఎన్టీఆర్, ఏఎన్నార్‌తో ఆకట్టుకునే స్టెప్పులేయించారు. ఆనాటి నుంచి నిన్నటి బాహుబలి వరకూ 1,400 సినిమాలకు నృత్య దర్శకత్వం వహించారు. 45ఏళ్ల సినీపయనంలో ఎన్నో అనుభూతులు.. వాటిని ‘సాక్షి’తో పంచుకున్నారు ప్రముఖ నృత్య దర్శకుడు శివశంకర్. పట్టణంలో శ్రీ డ్యాన్స్ అకాడమీ దశమ వార్షికోత్సవం, బాలల దినోత్సవం కార్యక్రమాలలో పాల్గొనడానికి వచ్చిన ఆయన మంగళవారం నాట్యరత్న బిరుదుతో సత్కారం అందుకోనున్నారు.ఈ సందర్భంగా సోమవారం సాయంత్రం ‘సాక్షి’తో చిట్‌చాట్ చేశారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. పుట్టింది మద్రాసులో. నటరాజ్ శంకుంతల వద్ద న్యాట ఆరంగేట్రం. సినీ నృత్యానికి సలీం మాస్టర్ గురువు. కురివికుడు అనే తమిళ సినిమాతో సినీ నృత్యదర్శకత్వానికి శ్రీకారం. తెలుగులో ఖైదీతో ఆరంగేట్రం. ఇది నా తొలి సినీ అడుగులు. ఖైదీలో రగులుతుంది మొగలి పొద పాటకు దర్శకత్వం వహించే అవకాశం అనుకోకుండా దక్కింది. అది నా సినీ నృత్య జీవితాన్ని మలుపు తిప్పింది. ఎన్టీఆర్, ఏఎన్నార్ నుంచి నేటితరం నాగశౌర్య వరకూ అందరికీ నృత్య దర్శకత్వం చేసే అవకాశం దక్కింది. పలు భాషల్లో 1,400 సినిమాలు చేశా. అరుంధతి సినిమాలో కంపోజ్ చేసిన డ్రమ్ డ్యాన్సుకు డాక్టరేట్ వచ్చింది మగధీరలో ధీర..ధీర.. పాటకు జాతీయ అవార్డు వచ్చింది. నటునిగా కూడా గుర్తింపు తెచ్చుకోవాలి నటునిగా కూడా గుర్తింపు తెచ్చుకోవాలనేది నా కోరిక. తుది శ్వాసనూ నృత్యం చేస్తుండగానే వదలాలి అనేది ఆకాంక్ష. తమిళ సినిమాలలో క్యారెక్టర్స్ చేస్తున్నా. సూర్య, రమ్యకృష్ణ, బ్రహ్మానందంతో కలిపి ఫుల్‌లెంగ్త్ క్యారెక్టర్ చేస్తున్నా. కన్నడలో కురుక్షేత్రం సినిమాలో పాత్రపోషిస్తున్నాను. 15 సినిమాలు చేతిలో ఉన్నాయి. తెలుగులో ఎక్కువ సినిమాలు చేయాలి. సెమీ క్లాసికల్ నృత్యానికి ప్రస్తుతం పెద్దపీట వేస్తున్నారు. -
హీరోగా బిజీ అవుతున్న డాన్స్ మాస్టర్
-
తొలియత్నం: ఆ సినిమా తరువాత... ఏడేళ్లు ఖాళీగా ఉన్నా!
కర్తవ్యం, మౌనపోరాటం... ఈ రెండు సినిమాలు చాలు డెరైక్టర్‌గా ఆయనేంటో చెప్పడానికి! పేరులో పీస్, థాట్స్‌లో ఫైర్ నింపుకున్న మోస్ట్ పవర్ఫుల్ డెరైక్టర్ మోహనగాంధీ! రియాలిటీ, ఫిక్షన్ కలగలిసి ఒక ఎమోషనల్ ప్యాక్డ్ ఫిలిం తీయడంలో ఆయన మాస్టర్. మోహనగాంధీ దర్శకుడిగా పరిచయం కావడానికీ ఒక సక్సెస్ఫుల్ దర్శకుడిగా నిలబడటానికీ మధ్య జరిగిన ప్రయాణానికి సాక్షి... అతని మొదటి సినిమా. తన తొలియత్నం ‘అర్ధాంగి’ నేపథ్యం ఇది. ‘నా మనసే ఒక తెల్లకాగితం’ పాటలో భార్యాభర్తల మధ్య అన్యోన్యతను, ఆప్యాయతను చాలా అందంగా చూపించాలి. ఇది డ్యాన్స్మాస్టర్తో చేసే పాట కాదు. దానికోసం నేను చాలా శ్రమించాల్సింది. నా ప్రయత్నానికి కెమెరామెన్ సుందరం చాలా సహకరించారు. మురళీమోహన్, జయసుధలు తమ నటనతో పాటకు ప్రాణం పోశారు.అసలు అవకాశం రాకపోతే ఎప్పుడో ఒకప్పుడు వస్తుందనే ఆశతో ఉండొచ్చు. ఒక అవకాశం వచ్చిన తరువాత మళ్లీ చాలాకాలం పాటు అవకాశం రాకపోతే... అది నిజంగా నరకం.కారణాలేవైనా కావచ్చు. నా మొదటి సినిమా చేసిన తరువాత మళ్లీ ఏడేళ్లు అవకాశం రాలేదు. నా మొదటి సినిమా నాకు తియ్యనైన చేదు జ్ఞాపకాలను మిగిల్చింది. అయితే అవకాశం రానప్పుడు, దారి దొరకనప్పుడు నా గుండె ధైర్యం జారకుండా, నా ఉత్సాహం ఆవిరవకుండా నన్ను కంటికి రెప్పలా కాచుకుంది పీఏపీ (ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్) సంస్థ. నేను పీఏపీలో అసిస్టెంట్‌గా చేస్తున్న రోజులవి. మహాబలిపురంలో ‘అల్లుడొచ్చాడు’ షూటింగ్ జరుగుతోంది. ఆరోజు నిర్మాత సుబ్బారావుగారి బర్త్‌డే. ఆ పార్టీలో నన్ను తమ బ్యానర్లో కాబోయే డెరైక్టర్‌గా అనౌన్స్ చేశారు సుబ్బారావుగారు. ఆ తరువాత అదే బ్యానర్లో ‘అత్తవారిల్లు’ సినిమాకు పనిచేశాను. ‘ఆలుమగలు’ స్క్రిప్ట్ రెడీ చేసుకుని మేం షూటింగ్‌కు వెళ్లేటప్పుడు సుబ్బారావుగారు నన్ను పిలిచి, ‘నీ సినిమా స్క్రిప్ట్ రెడీ చేసుకో. ఈ సినిమా షూటింగ్‌కు వెళ్లకు’ అన్నారు. వెంటనే మా గురువు ప్రత్యగాత్మగారు ‘నీ సినిమాకు నేను సబ్జెక్ట్ రెడీ చేస్తా’నని అభయమిచ్చారు. అన్నట్టుగానే ఆయన ఒక మంచి కథ ఇచ్చారు. ఇక నేను, సత్యానంద్‌గారు, ప్రత్యగాత్మగారు డిస్కషన్స్‌లో కూర్చున్నాం. చాలా సమయం దొరికింది కాబట్టి స్క్రిప్ట్ దశలోనే మార్పులు చేసే అవకాశం లభించింది. మొదట ప్రత్యగాత్మగారికీ, నాకూ ఓ సీన్ విషయంలో చాలా చర్చ జరిగింది. అదేంటంటే, సినిమా కోర్టు సీన్‌తో ఓపెన్ అవుతుంది. మనస్పర్ధలతో భార్యాభర్తలు విడాకులు తీసుకుంటారు. విడాకుల తరువాత భార్య తన పుట్టింటికి వస్తుంది. అప్పుడు ఆమె మానసిక పరిస్థితిని ఎస్టాబ్లిష్ చేయాలి. అందుకు ప్రత్యగాత్మగారు ఒక ఆలోచన చెప్పారు. ప్రత్యగాత్మ వెర్షన్: ఆ అమ్మాయి ఇంటి బయట నిలబడి లోపలికి అడుగుపెట్టగానే ఇంట్లోవాళ్లు తనను ఆదరిస్తారు అనుకున్నప్పుడు ఇల్లు తనకు దగ్గరగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఆదరించరు అనుకున్నప్పుడు ఇల్లు దూరమవుతుంది. నా వెర్షన్: ఆ అమ్మాయి ఇంట్లోకి అడుగుపెట్టగానే మూడు దశలు గుర్తుకొస్తాయి. తనకు పెళ్లికాక ముందు, పెళ్లవుతున్నప్పుడు, పెళ్లి తరువాత పుట్టింటి నుంచి వెళుతున్నప్పుడు... ముఖ్యంగా అప్పగింతలప్పుడు అన్న చెప్పిన మాటలు పదేపదే గుర్తుకొస్తుంటాయి. చదువుకునేటప్పుడు ఏదైనా తప్పు చేస్తే చెరిపేసి మళ్లీ దిద్దుకోవచ్చు. కానీ జీవితంలో ఏదైనా తప్పు జరిగితే దిద్దుకోవడం కష్టం అంటాడు. కానీ ఇప్పుడు అదే తప్పు చేసి ఇంట్లోకి అడుగుపెట్టింది. ఈ గుర్తుకుతెచ్చుకోవడం అనే పద్ధతిలో ఆమె ఆలోచనల సంఘర్షణను, సందిగ్ధతను బలంగా ఎస్టాబ్లిష్ చేయవచ్చని చెప్పాను. ప్రత్యగాత్మ శభాష్ అని మెచ్చుకున్నారు. అప్పట్లో స్క్రిప్ట్ దశలో అందరూ ఇన్వాల్వ్ అయి, తమ అభిప్రాయాలు పంచుకునేవాళ్లు. పీఏపీ ఆస్థాన విద్వాంసుడు చలపతిరావు డిస్కషన్లో మొదటి రీల్ అవగానే ఒక సాంగ్ పెడితే బావుంటుందన్నారు. చలపతిరావు వెర్షన్: విడాకుల తరువాత ఒక సాంగ్ సీక్వెన్స్ పెడితే, ఆ అమ్మాయి మానసిక పరిస్థితిని వివరిస్తూ ఒక బ్యాక్‌గ్రౌండ్ సాంగ్ ఉండాలి. నా వెర్షన్: ఆ అమ్మాయి కష్టనష్టాలు, జెన్యూనిటీ ప్రేక్షకులకు ఏమీ తెలియకుండా ఓపెనింగ్‌లోనే సాంగ్ పెట్టడం కరెక్ట్ కాదు. రెండు మూడు సీన్లలో ఆ అమ్మాయి సమస్యలు తెలిసిన తరువాత పాట పెట్టడం సరైంది అన్నాను. నా ఆలోచన ఎందుకు సరైందో చెప్పిన తరువాత ఆయన కన్విన్స్ అయ్యారు. అలా మా మధ్య జరిగిన ఈ చర్చలన్నీ స్క్రిప్ట్‌కు మరింత బలాన్నిచ్చాయి. ఇక సినిమా షూటింగ్‌కు ఏర్పాట్లు ప్రారంభించాం. 1977 మే 1న షూటింగ్ మొదలైంది. జయసుధ మీద మొదటి షాట్. ప్రత్యగాత్మగారు స్విచాన్, తాతినేని రామారావుగారు క్లాప్. సూర్యకాంతం, రాజబాబు, నాగభూషణం లాంటి పెద్ద పెద్ద ఆర్టిస్టులతో చేయడం గొప్ప ఎక్స్పీరియన్స్. అందరూ అనుభవజ్ఞుల మధ్య ఉండటం, మార్పులన్నీ దాదాపు స్క్రిప్ట్ దశలోనే చేశాం కాబట్టి, షూటింగ్ చాలా ప్రశాంతంగా సాగిపోయింది. మధ్యలో ఎప్పుడైనా రష్ చూడమని నేనంటే ప్రత్యగాత్మగారు బానే ఉంటుందిలే అనేవారు. ఆయనకు నామీద అంత నమ్మకం. ఒకరోజు షూటింగ్ జరుగుతున్నప్పుడు నాకో ఆలోచన వచ్చింది. అది భర్త, భార్య విషయంలో ఒక కన్ఫ్యూజన్ స్టేట్‌లో ఉండే సీన్. అతని డిస్ట్రబింగ్ మూడ్‌ను ఎస్టాబ్లిష్ చేసేందుకు మ్యూజిక్ మీద కొన్ని షాట్స్ తీయాలనుకున్నాను. ఒక షాట్ స్టడీగా ఉన్న సైకిల్ చక్రంలోంచి తీయాలనుకున్నాను. కెమెరామెన్తో చెబితే ఎందుకలా ప్లెయిన్‌గా తీయవచ్చుగా అన్నాడు. అతను అవుటాఫ్ మూడ్‌లో ఉన్నాడని అర్థమైంది. ఆ షాట్ అలా ఎందుకు తీయాలో అతనికి వివరిస్తే, అప్పుడు కన్విన్స్ అయ్యాడు. ఇందులో డెరైక్టర్‌గా నా ప్రతిభకు ఒక పాట సవాల్‌గా నిలిచింది. ‘నా మనసే ఒక తెల్లకాగితం’ పాటలో భార్యాభర్తల మధ్య అన్యోన్యతను, ఆప్యాయతను చాలా అందంగా చూపించాలి. ఇది డ్యాన్స్మాస్టర్తో చేసే పాట కాదు. దానికోసం నేను చాలా శ్రమించాల్సింది. నా ప్రయత్నానికి కెమెరామెన్ సుందరం చాలా సహకరించారు. మురళీమోహన్, జయసుధలు తమ నటనతో పాటకు ప్రాణం పోశారు. నా అనుభవం మేరకు బాగానే తీశాననిపించింది. ఇదే సాంగ్ సెకండ్ హాఫ్‌లో పాథటిక్గా వస్తుంది. దీన్ని ఇంకా బాగా తీయవచ్చు అని తరువాత చాలాసార్లు ఫీలయ్యాను. ఏకధాటిగా 28 రోజుల్లో షూటింగ్ పూర్తిచేశాం. పోస్ట్ ప్రొడక్షన్ పూర్తిచేసుకుని ప్రివ్యూ వేసినప్పుడు ఒక సీన్ విషయంలో కొంతమంది నాతో విభేదించారు. అది ప్రీ క్లయిమాక్స్ సీన్. భర్త అనుమానాన్ని పోగొట్టేందుకు భార్య ఎంత ప్రయత్నం చేసినా ఫలితం ఉండదు. అలాంటప్పుడు అక్కడ ఉండటం ఎందుకని భార్య వెళ్లిపోవడానికి రైల్వేస్టేషన్‌కు వెళుతుంది. ఈలోపు తన తప్పు తెలుసుకున్న భర్త రైల్వేస్టేషన్‌కు వెళతాడు. ఆమె కనిపించకపోవడంతో అన్నిచోట్లా వెదికి అలిసి ఇంటికొస్తాడు. ఇంటికొచ్చేసరికి భార్య ఉంటుంది. ఆమెను చూసి పట్టరాని ఉద్వేగంలో వెళ్లి కాళ్లమీద పడబోతాడు. అతని ప్రయత్నానికి ఆమె అడ్డుపడి దగ్గరకు తీసుకుంటుంది. ఆ సీన్ షూట్ చేసేటప్పుడు నేను చాలా థ్రిల్ ఫీలయ్యాను. కానీ ప్రివ్యూలో సీన్ రివర్స్ అయింది. మగవాడు ఆడదాని కాళ్లమీద పడితే ప్రేక్షకులు యాక్సెప్ట్ చేయరని అన్నారు. కానీ ప్రొడ్యూసర్, నా గురువులు నా ఆలోచనను బలపరిచారు. టైటిల్ విషయంలో కూడా కొంతమంది అబ్జెక్ట్ చేశారు. నాగేశ్వరరావుగారి ‘అర్ధాంగి’ ప్రభావం ఉంటుందని వెనక్కు లాగే ప్రయత్నం చేశారు. మరికొంతమంది దానితో దీనికేం పోలిక ఉండదన్నారు. నేను మాత్రం కథకు తగ్గట్టు అదే టైటిల్ బాగుందని ఫీలయ్యాను. అంతా అయ్యాక అక్టోబర్ 27న సినిమా విడుదలైంది. కానీ విచిత్రమేమిటంటే, దాదాపు అదే సమయంలో మరో మూడు సినిమాలు విడుదలయ్యాయి. అమరదీపం, ప్రేమలేఖలు, గోరంతదీపం. మరోవైపు మా సినిమా విడుదలకు ముందే పక్క థియేటర్లో నాగేశ్వరరావుగారి ‘అర్ధాంగి’ విడుదలైంది. వీటన్నిటిమధ్యా మా అర్ధాంగి ఏవరేజ్‌గా నడిచింది. అయితే నాకు ఆనందాన్ని కలిగించిన విషయం, పాత ‘అర్ధాంగి’ డెరైక్టర్ పి.పుల్లయ్యగారు మా సినిమా చూసి బాగుందని మెచ్చుకోవడం. నన్ను తీవ్రంగా కలిచివేసిన విషయం ఏమిటంటే, ఈ సినిమా తరువాత ఏడేళ్లపాటు నాకు అవకాశాలు రాలేదు. 1984లో కృష్ణంరాజుతో ‘రౌడీ’ సినిమా చేసేదాకా మళ్లీ నా మాతృసంస్థ పీఏపీ నాకు అండగా నిలిచింది. - కె.క్రాంతికుమార్‌రెడ్డి