![badiga dharmaraju dies in nizamabad - Sakshi](/styles/webp/s3/article_images/2017/12/2/prabhu.jpg.webp?itok=IXBBtHcW)
నిజామాబాద్ : నృత్య దర్శకుడు ప్రభుదేవా గురువు బాడిగ ధర్మరాజు(97) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న ధర్మరాజు శనివారం తుదిశ్వాస విడిచారు. ధర్మరాజు మృతి చెందిన వార్త తెలుసుకున్న ప్రభుదేవా, నస్రుల్లాబాద్ మండలం అంకోల్‌కు చేరుకుని గురువు భౌతికకాయానికి నివాళులర్పించారు. ధర్మరాజు కుటుంబ సభ్యులను ప్రభుదేవా పరామర్శించారు.
20వ ఏట నుంచే డ్యాన్స్‌పై ఆసక్తితో తన చిన్నాన్న బీవీ నరసింహరావు వద్ద శిక్షణ తీసుకున్నారు. ఆ తర్వాత చెన్నైలో స్థిరపడ్డారు. ఎన్టీఆర్, కృష్ణ, మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, ఉదయభానుతో పాటు ప్రముఖ హీరోలకు క్లాసికల్ డ్యాన్స్ మాస్టర్‌గా పని చేశారు. సినిమా రంగానికి చెందిన కృపావతిని ధర్మరాజు పెళ్లి చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment