ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌పై లైంగిక వైధింపుల కేసు నమోదైన సంగతి తెలిసిదే. బాధితురాలు రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేయగా.. జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి, అనంతరం ఆ కేసును నార్సింగి పోలీసులకు అప్పగించారు. అక్కడి పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చెపట్టారు. ప్రస్తుతం జానీ వివాదం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఫిలిం ఛాంబర్‌తో పాటు పలువురు సినీ ప్రముఖులు ఈ వివాదంపై స్పందించారు. జానీ మాస్టర్‌పై చర్యలు తీసుకోవాలని సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేస్తున్నారు.
(చదవండి: త్రివిక్రమ్‌పై ఆరోపణలు.. పూనమ్ షాకింగ్ ట్వీట్)
తాజాగా ‘తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్’ అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వర రెడ్డి కూడా ఈ వివాదంపై స్పందిస్తూ.. జానీ మాస్టర్‌కి ప్రకటించిన జాతీయ ఉత్తమ కొరియోగ్రాఫర్ అవార్డును విచారణ ముగిసేవరకు ఆపాలని కమిటీకి విజ్ఞప్తి చేశారు. ఇలాంటివి జరిగినప్పుడు స్పందించడం మాత్రమే కాకుండా..శాశ్వత పరిష్కారం దిశగా చిత్ర పరిశ్రమ పెద్దలు అడుగులు వేయాలని కోరారు.
(చదవండి: జానీ మాస్టర్ వివాదంపై ఫిలిం ఛాంబర్ ఏం చెబుతుందంటే..?)
షూటింగ్ జరిగే ప్రదేశాలలో సీసీ టీవీలు ఏర్పాటు చేసి..ఇలాంటి వేధింపు ఉండకుండా చేయాలని డిమాండ్ చేశారు. అంతేకాదు లైగింక వేధింపు కేసు తేలేవరకు జానీ మాస్టర్‌కు చిత్ర పరిశ్రమలో అవకాశాలు ఇవ్వకూడదని నిర్మాతలను కోరారు. డాన్స్ మాస్టర్ అసోషియేషన్ అధ్యక్షుడిగా ఉన్న జానీ మాస్టర్‌ని వెంటనే ఆ పదవి నుంచి తొలగించాలని ఫిలిం ఛాంబర్‌కు విజ్ఞప్తి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment