![Choreographer Rakesh Master Emotional Video Goes Viral - Sakshi](/styles/webp/s3/article_images/2023/06/18/rakesh-master_0.jpg.webp?itok=vRc-6A_u)
ప్రముఖ కొరియోగ్రాఫర్ రాకేశ్ మాస్టర్ తీవ్ర అనారోగ్యంతో కన్నుమూశారు. ఎంతోమంది స్టార్ హీరోలతో పని చేసిన ఆయన రియల్ లైఫ్‌లో మాత్రం ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారు. నిత్యం ఏదో ఒక వివాదంలో చిక్కుకునే ఆయన కుటుంబానికి సైతం దూరంగా ఉన్నారు. ఆయన తన చావును ముందే పసిగట్టాడంటూ ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇందులో ఆయన మాట్లాడుతూ.. 'నాకు మోకాళ్ల నొప్పులు.. నా శరీరంలో మార్పులు వస్తున్నాయి.. తెలుసు, నేను అస్తమించే సూర్యుడిని.. నాకన్నీ తెలుసు' అంటూ బాధతో మాట్లాడారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన అభిమానులు బాధగా ఉంది మాస్టర్, మీ మాటలు వింటుంటే ఏడుపొస్తుంది అని కామెంట్లు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment