ప్రముఖ కొరియోగ్రాఫర్ రాకేశ్ మాస్టర్ ఆదివారం(జూన్ 18న) సాయంత్రం కన్నుమూశారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ వల్లే ఆయన మృతి చెందారని వైద్యులు వెల్లడించారు. గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ రాజారావు మాట్లాడుతూ.. 'వాంతులు, విరోచనాలు అవుతున్నాయని రాకేశ్ మాస్టర్‌ను ఈరోజు మధ్యాహ్నం ఒంటి గంటకు ఆస్పత్రికి తీసుకొచ్చారు.
అప్పటికే ఆయన ఆరోగ్యం విషమించింది. డయాబెటిస్, సివియర్ మెటబాలిక్ ఎసిడోసిస్ కావడంతో మల్టీ ఆర్గాన్స్ ఫెయిల్యూర్స్ అయ్యాయి. అడ్మిట్ అయిన గంటకే ఆయన ఆరోగ్యం మరింత విషమించింది. ఆయన్ను బతికించేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. సాయంత్రం 5 గంటలకు మరణించారు' అని పేర్కొన్నారు.
చదవండి: శేఖర్ మాస్టర్‌తో గొడవ.. కానీ ఎందుకో ఇప్పటికీ తెలియదు
కాగా రాకేశ్ మాస్టర్ లాహిరి లాహిరి లాహిరిలో, దేవదాసు, చిరునవ్వుతో, సీతయ్య, అమ్మో పోలీసోళ్ళు వంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు డ్యాన్స్ మాస్టర్‌గా పని చేశారు. దాదాపు 1500 చిత్రాలకు కొరియోగ్రఫీ చేశారు. స్టార్ హీరోలందరికీ కొరియోగ్రఫీ చేసిన ఘనత ఆయన సొంతం. టాలీవుడ్‌లో నెంబర్ వన్ కొరియోగ్రాఫర్లుగా చెలామణీ అవుతున్న శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్లు ఈయన శిష్యులే!
Comments
Please login to add a commentAdd a comment