Rakesh Master
-
ఇది రాకేశ్ మాస్టర్ విగ్రహమా? పుల్లయ్యలా ఉందంటూ విమర్శలు
రాకేశ్ మాస్టర్ తెలుగు హీరోలకు డ్యాన్స్ నేర్పించాడు, డ్యాన్స్‌లో స్టైల్ ఎలా ఉంటుందో పరిచయం చేశాడు. వెండితెరపై ఎన్నో హిట్ సాంగ్స్‌కు కొరియోగ్రఫీ చేశాడు. టాప్ కొరియోగ్రాఫర్‌గా వెలుగు వెలిగిన ఆయన తర్వాత సినీ ఇండస్ట్రీకి దూరమయ్యాడు. ఇటీవల తీవ్ర అనారోగ్యానికి గురైన రాకేశ్ మాస్టర్ జూన్ 18న మరణించాడు. ఆయనకు గుర్తుగా విగ్రహాన్ని తయారు చేయిస్తున్నారు. రాకేశ్ మాస్టర్‌కు అత్యంత సన్నిహితుడు, తన చివరి శ్వాస వరకు పక్కనే ఉండి అన్నీ చూసుకున్న ఆలేటి ఆటం ఈ విగ్రహాన్ని తయారు చేయిస్తున్నారు. ఓ డ్యాన్స్ షోలో వైష్ణవుడి వేషధారణలో బీభత్సమైన పర్ఫామెన్స్ ఇచ్చాడు రాకేశ్ మాస్టర్. ఇది చాలామందికి ఇప్పటికీ గుర్తుండిపోయింది. అందుకే ఆ వైష్ణవుడి వేషధారణలోనే రాకేశ్ మాస్టర్ గెటప్ ఉండేలా విగ్రహాన్ని రెడీ చేయిస్తున్నారు. ఎవరి దగ్గరా సాయం కోసం చేతులు చాచకుండా సొంత డబ్బుతోనే దీన్ని రెడీ చేయిస్తున్నారు. ఈ విషయాన్ని రాకేశ్ మాస్టర్ శిష్యుడు, కొరియోగ్రాఫర్ బషీర్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. రాకేశ్ మాస్టర్ విగ్రహం ఎలా ఉందో వీడియో రిలీజ్ చేశాడు. విగ్రహం ఎలా ఉందో కామెంట్స్‌లో తెలియజేయండని కోరాడు. అయితే చాలామందికి ఈ విగ్రహం నచ్చినట్లు లేదు. ఇది రాకేశ్ మాస్టర్ విగ్రహంలా లేదు, పుల్లయ్యగాడి విగ్రహంలా ఉంది, మీకు ఏ ఫోటో దొరకలేదా భయ్యా? అస్సలు మ్యాచ్ కాలేదు అని కామెంట్లతో తిట్టిపోస్తున్నారు. ఒకరైతే.. వీడు దేనికి పనికిరాని వెధవ అని కామెంట్ చేయగా బషీర్ అందుకు సేమ్ టు యూ అంటూ రివర్స్ కౌంటర్ ఇచ్చాడు. ఈ విగ్రహం పూర్తిగా తయారవడానికి మరో నెల రోజులు పడుతుందని మరో వీడియోలో వెల్లడించాడు బషీర్. పూర్తిగా సిద్ధమైన తర్వాతైనా అందరికీ నచ్చుతుందో, లేదో చూడాలి! చదవండి: బతికుండగానే అంత్యక్రియలు, బ్యూటీ క్వీన్ కన్నుమూత -
రాకేశ్ మాస్టర్ ఇచ్చిన ఆస్తి పేపర్లు చించేశాడు.. ఎందుకో తెలిస్తే
టాలీవుడ్లో ప్రముఖ డ్యాన్స్ మాస్టర్ రాకేశ్ (53) ఇటీవల మృతి చెందిన సంగతి తెలిసిందే. 1,500కి పైగా సినిమాల్లోని పాటలకి పని చేసిన ఆయన.. తర్వాత పలు డాన్స్ రియాలిటీ షోలతో మెరిశారు. కరోనా సమయంలో ఆయన పలు యూట్యూబ్ ఛానల్స్‌కు ఇంటర్వ్యూలు ఇవ్వడంతో ఆయన పేరు ప్రముఖంగా వినిపించేది. ఆ తర్వాత రాకేశ్ మాస్టరే సొంతంగా పలు యూట్యూబ్ ఛానెల్స్ పెట్టుకుని పలు వీడియోలు అందులో పోస్ట్‌చేసే వారు. రాకేశ్ మాస్టర్ పెద్ద కర్మ కార్యక్రమం హైదరాబాద్‌లో నిర్వహించారు. అక్కడ ఆయన మామగారు పలు ఆసక్తికరమైన విషయాలు తెలియచేశారు. (ఇదీ చదవండి: మెగా వారసురాలికి ముఖేష్ అంబానీ స్పెషల్ గిఫ్ట్) '1996లో కొంత మంది యువకులను గ్రూప్‌గా తయారు చేసి తిరుపతి నుంచి హైదరాబాద్‌కు రాకేశ్ మాస్టర్ వచ్చాడు. నాది విజయవాడు.. శేఖర్ మాస్టర్ మా ఇంటికి దగ్గర్లోనే ఉండేవాడు. దీంతో శేఖర్ కుటుంబంతో మంచి సాన్నిహిత్యం ఉంది. శేఖర్‌కు కూడా డ్యాన్స్ అంటే ఇష్టం ఉండటంతో నేనే అతన్ని రాకేశ్ మాస్టర్ వద్దకు చేర్చాను. ఇలా వారిద్దరూ సినీ పరిశ్రమలో పేరుపొందారు. ఆ రోజుల్లోనే వారి కష్టంతో వచ్చిన డబ్బు నా చేతికి ఇచ్చేవారు.. దానిని నేనే దాచి హైదరాబాద్‌లోని బోరుబండలో ఇళ్లు కొన్నాను. అందులోనే కొద్దిరోజులు అందరం కలిసే ఉన్నాం. ఆ తర్వాత నేను విజయవాడ వెళ్లిపోయాను. ఈ మధ్య ఎస్ఆర్కే పేరుతో రాకేశ్ మాస్టర్ ఒక యూట్యూబ్ ఛానెల్ కూడా ప్రారంభించాడు. దాని నుంచి మంచి ఆదాయం వస్తుంది. కొద్దిరోజుల క్రితం నా వద్దకు ఒక ఖాళీ అగ్రిమెంట్ పేపర్‌తో రాకేశ్ మాస్టర్ వచ్చి ఇలా అన్నాడు. 'మామయ్య నువ్వు చనిపోతే నీ కుంటుంబాన్ని నేను కాపాడుతా... ఒకవేళ నేనే ముందు చనిపోతే నీవు అన్యాయం అయిపోతావ్ కాబట్టి ఈ అగ్రిమెంట్ పేపర్ తీసుకో .. నేను చనిపోయిన తర్వాత ఈ ఖాళీ పేపర్లో నీకు ఇష్టం వచ్చింది రాసుకో అన్నాడు.' (ఇదీ చదవండి: చనిపోయే రోజు సౌందర్య ఏం కోరిందో తెలుసా?) కొడుకు మాదిరి చూసుకున్న వాడే నేడు లేడు.. ఈ ఆస్తులు తనకెందుకు అంటూ ఆ అగ్రిమెంట్ పేపర్‌ను శేఖర్,సత్య మాస్టర్ ముందే ఆ పెద్దాయన చింపేశాడు. తను కష్టపడి సంపాధించిన ఆస్తి రాకేశ్ మాస్టర్ బిడ్డలకే చెందుతుందని ఆయన తెలిపాడు. ఆయన శిష్యులుగా పిల్లల బాధ్యతను తీసుకుంటామని శేఖర్,సత్య మాస్టర్లు ప్రకటించారు. -
Rakesh Master : రాకేష్ మాస్టర్ సంతాప సభ (ఫొటోలు)
-
రాకేశ్ మాస్టర్ గురించి తొలిసారి రియాక్ట్ అయిన శేఖర్ మాస్టర్
ప్రముఖ టాలీవుడ్ కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ కొద్దిరోజుల క్రితం హఠాన్మరణం చెందిన సంగతి తెలిసింది. ఆయన హఠాన్మరణం అభిమానులను, కుటుంబ సభ్యులను తీవ్ర విషాదంలో ముంచెత్తింది. రాకేశ్ మాస్టర్ పెద్ద కర్మ కార్యక్రమాన్ని హైదరాబాద్‌లో నిర్వహించారు. (ఇదీ చదవండి: 'పుష్ప' పాటకు మనవాళ్ల డ్యాన్స్.. స్టాండింగ్ ఒవేషన్‌తో అమెరికన్స్) ఈ సందర్భంగా తను శిష్యులు అయినటువంటి శేఖర్ మాస్టర్‌తో పాటు సత్య మాస్టర్ భావోద్వేగానికి గురయ్యారు. రాకేష్ మాస్టర్‌తో ఉన్న అనుబంధాన్ని ఆయన మరణం తర్వాత శేఖర్ మాస్టర్ తొలిసారి ఇలా గుర్తుచేసుకున్నారు. 'నేను, సత్య ఇద్దరం విజయవాడలో డ్యాన్స్‌కు సంబంధించి బేసిక్స్ వరకు నేర్చుకున్నాం. డ్యాన్స్ అంటే మక్కువతో హైదరాబాద్‌కు వచ్చాం. మేము కష్ట సమయంలో ఉన్నప్పుడు రాకేష్మాస్టర్ ఆశ్రయం కల్పించి, డ్యాన్స్ నేర్పించారు. రాకేశ్ మాస్టర్ గొప్ప డ్యాన్సర్. మాది 8 ఏళ్ల అనుబంధం. మీరు యూట్యూబ్‌లో ఆయన డ్యాన్స్‌ను చూసింది 5 శాతమే. ఆయనకు ఉన్న టాలెంట్ చాలామందికి తెలియదు. మొదట్లో నేను ప్రభుదేవా మాస్టర్‌ను చూసి స్ఫూర్తి పొందాను. హైదరాబాద్‌కు వచ్చిన తర్వాత రాకేశ్ మాస్టర్ని అభిమానించడం ప్రారంభించా. ఆయన మా గురవు అని చెప్పుకుంనేందకు ఎప్పటికీ గర్వంగానే ఫీలవుతాము. ఆ రోజుల్లో డ్యాన్స్ తప్పా మాకు మరో ప్రపంచం లేదు. అప్పట్లో ఆయన పెళ్లి కూడా మేమే చేశాం. ఎప్పుడూ రాకేశ్ మాస్టర్ దగ్గరే ఉండేవాళ్లం. ఆయన ఎక్కడున్నా బాగుండాలనే కోరుకునే వాళ్లం, కానీ ఇలా జరుగుతుందని కలలో కూడా ఊహించలేదు. ఇంతలా ఆయనతో అనుబంధం ఉంది. కానీ ఇప్పుడు కొన్ని యూట్యూబ్ ఛానెళ్ల వారు ఇష్టం వచ్చినట్టు థంబ్‌నైల్స్ పెట్టి ఏదేదో రాసేస్తున్నారు. దయచేసి మీకు వాస్తవాలు తెలిస్తేనే రాయండి. లేదంటే రాయకండి. ప్లీజ్.. ఇకనైనా ఆపేయండి' అని శేఖర్ మాస్టర్ ఎమోషనల్ అయ్యారు. (ఇదీ చదవండి: SPY Review In Telugu: 'స్పై' సినిమా రివ్యూ) -
రాకేశ్ మాస్టర్ కోసం ఆ ప్రయత్నం ఎవరూ చేయలేదు: పరుచూరి గోపాలకృష్ణ
టాలీవుడ్ కొరియోగ్రాఫర్ రాకేశ్ మాస్టర్ ఇటీవలే మరణించిన సంగతి తెలిసిందే. ఆయన మరణంతో ఒక్కసారిగా టాలీవుడ్ విషాదంలో మునిగిపోయింది. ఎంతోమంది మాస్టర్లను తయారు చేసిన ఆయన అకాల మరణాన్ని జీర్ణించుకోలేకపోయారు. తాజాగా ఆయన మృతిపట్ల ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ సంతాపం తెలిపారు. ఆయన పడిన కష్టాలను వివరిస్తూ ఓ వీడియోను రిలీజ్ చేశారు. (ఇది చదవండి: రాకేశ్ మాస్టర్ అంత్యక్రియలు.. డ్యాన్స్ చేస్తూ వీడ్కోలు!) పరుచూరి మాట్లాడుతూ..' రాకేశ్ మాస్టర్‌తో ఎక్కువగా పనిచేయలేదు. ఆయన గురువైన ముక్కురాజుతో నేను ఎన్నో సినిమాల్లో కలిసి పనిచేశా. రాకేశ్ మాస్టర్ ఇక లేరంటూ టీవీలో చూడగానే షాకయ్యాను. తాజాగా వాళ్ల అబ్బాయి మా నాన్న గురించి మాట్లాడుకోవడం ఇకనైనా ఆపేయండి అని చెప్పగానే నాకు కళ్లల్లో నీళ్లు తిరిగాయి.' అంటూ విచారం వ్యక్తం చేశారు. పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ.. 'రాకేశ్ మాస్టర్ సెలవు తీసుకుని వెళ్లిపోయాడు. ఇండస్ట్రీలో ఆయన అద్భుతాలు సృష్టించాడు. దాదాపు 1500 పాటలకు కొరియోగ్రఫీ చేశారు. శేఖర్ , జానీ అనే ఇద్దరు అద్భుతమైన మాస్టర్లను తీర్చిదిద్దాడు. వాళ్లంతా వచ్చి ఆయన మృతదేహం దగ్గర కన్నీరు పెట్టుకుంటుంటే అందరికీ బాధేసింది. ఆయన ఆవేదనను ఎవరైనా పట్టించుకుని ఉంటే ఆయన జీవితం ఇంకో రకంగా ఉండేది. కానీ ఎవరూ ఆయన్ని దగ్గరకు తీసుకొని ఆయన జీవితానికి మంచి మార్గాన్నిచ్చే ప్రయత్నం చేయలేదు.' అని అన్నారు. అలా జరిగి ఉంటే.. పరుచూరి మాట్లాడుతూ.. 'టాలీవుడ్లో ప్రస్తుతమున్న అప్‌కమింగ్ హీరోలు, అప్ కమింగ్ దర్శకులో ఎవరో ఒకరు మళ్లీ సినిమాల్లోకి తీసుకొచ్చి ఉంటే ఆయన జీవితం మరోలా ఉండేదని నా అభిప్రాయం. ఆయన షో చూస్తే నాకు అనుక్షణం ఆవేదనే కనిపించేది. ఎంతలా ఆవేదన అనుభవించాడో. మిత్రులారా.. ఆయన జీవితాన్ని ఉదాహరణగా తీసుకోండి. మనకు భగవంతుడు ఓ ఛాన్స్ ఇచ్చాడు. మన జీవితంలో జరిగే స్ట్రగుల్స్ వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ఆయన ఆత్మ పరమాత్మను చేరుకుని.. శివుడి కూడా ఆయన లయ, విన్యాసాలు చూడాలని ఆశిస్తున్నా.' అని అన్నారు. (ఇది చదవండి: రాకేశ్ మాస్టర్ కుటుంబం గొప్ప నిర్ణయం!) -
మా నాన్న అందుకే అలా అయ్యారు.. రాకేష్ మాస్టర్ కుమారుడు ఫైర్
టాలీవుడ్లో ప్రముఖ కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ అనారోగ్యంతో మృతి చెందిన సంగతి తెలిసిందే. వైజాగ్‌లో షూటింగ్ కోసం వెళ్లిన రాకేష్ మాస్టర్.. అక్కడి నుండి హైదరాబాద్‌కు వచ్చిన తర్వాత అనారోగ్యంతో చికిత్స పొందుతూ కన్నుమూశారు. తాజాగా ఆయన కుమారుడు చరణ్ తన తండ్రి చావుకు సోషల్ మీడియానే కారణమని ఫైర్ అయ్యాడు. (ఇదీ చదవండి: కోడలితో కలిసి కొడుకు టార్చర్.. పోలీసులను ఆశ్రయించిన నటి) 'మా నాన్న ఇలా అవడానికి ప్రధాన కారణం సోషల్‌మీడియానే.. పలు యూట్యూబ్ ఛానల్ వారు లబ్ధిపొందేందుకు మా నాన్నను ఉపయోగించుకున్నారు. ఆ తర్వాత మళ్లీ ఆయనను ఎంత నెగిటీవ్‌గా చూపించాలో అంతగా చూపించారు. ఇకనైనా అలాంటి వీడియోలు ఆపేయండి. ఆయనకు సంబంధించిన విషయాలతో పాటు మా కుటుంబ సభ్యుల విషయాలు కూడా యూట్యూబ్‌లలో ప్రసారం చేయకండి. ఇప్పటి వరకు మా కుటుంబాన్ని అల్లరి పాలు చేసింది చాలు. మీ భవిష్యత్ ఎలా ఉండబోతుంది? మీ కష్టాలు ఏంటీ? మేము ఎలా ఏడుస్తున్నాం? అంటూ పదే పదే చూపిస్తూ మా జీవితాలను చీకట్లోకి లాగకండి. మరోసారి ఇలాంటి పనులు ఎవరైనా చేస్తే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తాను' అని రాకేష్ మాస్టర్ కుమారుడు చరణ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. (ఇదీ చదవండి: టాప్ లేకుండా వెళ్తేనే నిర్మాతలకు నచ్చుతారు: అర్చన) -
రాకేష్ మాస్టర్ చనిపోయిన తర్వాత...ఊహించని నిర్ణయం తీసుకున్న కుటుంబ సభ్యులు
-
రాకేశ్ మాస్టర్ అంత్యక్రియలు.. డ్యాన్స్ చేస్తూ వీడ్కోలు!
ప్రముఖ కొరియోగ్రాఫర్ రాకేశ్ మాస్టర్ అనారోగ్య సమస్యలతో జూన్ 18న ఆదివారం ఆకస్మాత్తుగా మరణించారు. ఆయన మృతితో టాలీవుడ్ విషాదంలో మునిగిపోయింది. ఎంతోమందికి సాయంగా నిలిచిన డ్యాన్స్ మాస్టర్ మృతిని సినీ ప్రముఖులు జీర్ణించుకోలేకపోయారు. అలాంటిది రాకేశ్ మాస్టర్ ఇలా అకస్మాత్తుగా మరణించడం ఆయన కుటుంబానికి తీరని శోకాన్ని మిగిల్చింది. (ఇది చదవండి: Rakesh Master: రాకేశ్ మాస్టర్ భౌతిక కాయాన్ని చూసి ఏడ్చేసిన శేఖర్ మాస్టర్) టీవీ చూసుకుంటూ డ్యాన్స్ నేర్చుకునే స్థాయి నుంచి డ్యాన్సర్లను తయారు చేసే స్థాయికి ఎదిగారు రాకేశ్ మాస్టర్. టాలీవుడ్లో టాప్ కొరియోగ్రాఫర్స్‌గా వెలుగొందుతున్న శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్ ఈయన దగ్గర శిష్యరికం చేసినవాళ్లే. అలాంటి మాస్టర్‌కు తోటి కొరియోగ్రాఫర్స్ ఘనంగా వీడ్కోలు పలికారు. ఇవాళ హైదరాబాద్‌లోని బోరబండలో అభిమానులు, కుటుంబ సభ్యుల మధ్య అంత్యక్రియలు నిర్వహించారు. అయితే ఈ విషాద సమయంలో ఆయనతో పనిచేసిన కొరియోగ్రాఫర్స్, స్టూడెంట్స్ సగర్వంగా తుది వీడ్కోలు పలికారు. సత్య, బషీర్ మాస్టర్‌తో పాటు మరికొందరు కొరియోగ్రాఫర్లు డ్యాన్స్ చేస్తూ సాగనంపారు. రాకేశ్ మాస్టర్ అంత్యక్రియల్లో భారీగా అభిమానులు, స్థానికులు పాల్గొన్నారు. (ఇది చదవండి: రాకేశ్ మాస్టర్ కుటుంబం గొప్ప నిర్ణయం!) -
రాకేశ్ మాస్టర్ భౌతికకాయానికి నివాళిలు అర్పించిన శేఖర్ మాస్టర్
-
Rakesh Master: రాకేశ్ మాస్టర్ భౌతిక కాయాన్ని చూసి ఏడ్చేసిన శేఖర్ మాస్టర్
వారం రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ప్రముఖ కొరియోగ్రాఫర్ రాకేశ్ మాస్టర్ ఆదివారం (జూన్ 18న) కన్నుమూశారు. రక్త విరోచనాలతో ఆస్పత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. టీవీ చూసుకుంటూ డ్యాన్స్ నేర్చుకునే స్థాయి నుంచి డ్యాన్సర్లను తయారు చేసే స్థాయికి ఎదిగారు రాకేశ్ మాస్టర్. టాలీవుడ్లో టాప్ కొరియోగ్రాఫర్స్‌గా వెలుగొందుతున్న శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్ ఈయన దగ్గర శిష్యరికం చేసినవాళ్లే! ఎందుకో తెలియదు కానీ శేఖర్ మాస్టర్, రాకేశ్ మాస్టర్ల మధ్య దూరం పెరిగింది. గురుశిష్యుల బంధం చెదిరిపోయింది. శేఖర్ మాస్టర్ పేరెత్తితే చాలు నిప్పులు చెరిగేవారు రాకేశ్. అటు శేఖర్ మాత్రం.. ఆయన ఎప్పటికీ తన గురువే అని చెప్తూ ఉండేవారు. ఈ క్రమంలో శేఖర్ మాస్టర్ తన గురువును చివరి చూపు చూసేందుకు వచ్చారు. దీనవదనంతో అక్కడికి చేరుకున్న శేఖర్ మాస్టర్ తన గురువును నిర్జీవంగా చూసి కంటతడి పెట్టుకున్నారు. జానీ మాస్టర్ సైతం రాకేశ్ మాస్టర్ భౌతిక కాయాన్ని చూసి భావోద్వేగానికి లోనయ్యారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చదవండి: రాకేశ్ మాస్టర్ కుటుంబం గొప్ప నిర్ణయం -
రాకేశ్ మాస్టర్ కుటుంబం గొప్ప నిర్ణయం!
ప్రముఖ కొరియోగ్రాఫర్ రాకేశ్ మాస్టర్ అనారోగ్య సమస్యలతో సడన్ గా చనిపోయారు. ఒకప్పటి జనరేషన్ కు డ్యాన్స్ మాస్టర్ గా తెలిసిన ఆయన.. ఇప్పటి జనరేషన్ కి మాత్రం యూట్యూబ్ వీడియోలతో బాగా పరిచయం. పలు ఫన్నీ ఇంటర్వ్యూలతో సోషల్ మీడియాలో చాలామంది హ్యాపీనెస్ కు కారణమయ్యారు. అలాంటిది రాకేశ్ మాస్టర్ ఇలా అకస్మాత్తుగా మరణించడం ఆయన కుటుంబానికి తీరని శోకాన్ని మిగిల్చింది. ఇలాంటి టైంలోనూ వాళ్లు గుండె నిబ్బరం చేసుకుని ఓ గొప్ప నిర్ణయం తీసుకున్నారు. తిరుపతికి చెందిన రాకేశ్ మాస్టర్ ప్రస్తుతం హైదరాబాద్ లో ఉంటున్నారు. ఆదివారం ఉదయం తీవ్ర అనారోగ్యానికి గురికావడంతో సికింద్రాబాద్ లోని గాంధీ ఆస్పత్రిలో ఈయన్ని చేర్చారు. అలా చికిత్స పొందుతూ సాయంత్రం 5 గంటల సమయంలో చనిపోయారు. అయితే తను చనిపోతానని కొన్నిరోజుల ముందే పసిగట్టిన రాకేశ్ మాస్టర్.. తన అవయవాల్లో పనికొచ్చే వాటిని దానం చేయాలని సూచించారట. ఈ విషయాన్ని ఆయన అసిస్టెంట్ సాజిద్ బయటపెట్టాడు. ఇదే విషయాన్ని డాక్టర్లకు చెప్పిన సాజిద్.. పోస్టుమార్టం చేసి, బాడీపార్ట్స్ తీసుకున్న తర్వాత తమకు అప్పజెప్పాలని, దహన సంస్కారాలు చేసుకుంటామని వాళ్లకు చెప్పినట్లు పేర్కొన్నాడు. ఇక చూపులేని వారికి రాకేశ్ మాస్టర్ కళ్లని దానం చేసేందుకు ఆయన కుటుంబ సభ్యులు కూడా అంగీకరించినట్లు సాజిద్ క్లారిటీ ఇచ్చాడు. ఇలా తన అవయవాలని దానం చేయాలనే గొప్ప మనసు రాకేశ్ మాస్టర్ కు ఉందని తెలిసి నెటిజన్స్ మెచ్చుకుంటున్నారు. (ఇదీ చదవండి: నా శరీరంలో మార్పులు వస్తున్నాయి.. రాకేశ్ మాస్టర్ లాస్ట్ వీడియో) -
రాకేష్ మాస్టర్‌ది తిరుపతే
తిరుపతి కల్చరల్: ‘జీవితంలో రాణించాలంటే పట్టుదల ఉండాలి. సడలని సంకల్పంతో ముందుకు సాగాలి. అవరోధాలు ఎదురైనా..కష్టాలు వెంటాడుతున్నా పట్టువదలని విక్రమార్కుడిలా పోరాడాలి. విజయం చేకూరేవరకు కష్టాలు..కన్నీళ్లు దిగమింగుతూనే ఉండాలి’ అంటాడు ప్రముఖ కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్. అచ్చం ఆయన జీవితం అలాగే కొనసాగిందని తన బంధువులు చెప్పుకొస్తున్నారు. సినిమా రంగంలో వందలాది చిత్రాలకు కొరియో గ్రాఫర్‌గా పనిచేసిన రాకేష్ మాస్టర్ ఆదివారం సాయంత్రం హైదరాబాద్‌లో అనారోగ్యంతో మృతిచెందారు. ఈ విషాద వార్త తెలుసుకున్న కుటుంబ సభ్యులు హుటాహుటిన హైదరాబాద్‌కు తరలివెళ్లారు. ఆయన జ్ఞాపకాలు తలుచుకుని స్నేహితులు, బంధువులు కన్నీటిపర్యంతమయ్యారు. రాకేష్ మాస్టర్‌ది తిరుపతే రాకేష్మాస్టర్ తిరుపతిలోని బండ్ల వీఽధిలో 1960లో జన్మించారు. ఆయనకు పద్మావతి, అరుణ, విజయ, లక్ష్మి అనే సోదరిలతోపాటు అన్న కోటేశ్వరరావు, తమ్ముడు కృష్ణారావు ఉన్నారు. వీరు ప్రస్తుతం డీఆర్ మహల్ రోడ్డులోని ఎస్బీఐ కాలనీలో నివాసముంటున్నారు. బ్రూస్లీ స్ఫూర్తి హాలీవుడ్ నటుడు బ్రూస్లీ అంటే రాకేష్మాస్టర్కు ఇష్టం. ఆయన స్ఫూర్తితో కరాటే, జిమ్నాస్టిక్ నేర్చుకున్నారు. తిరుపతిలో అనేక నృత్య ప్రదర్శనలు చేశారు. తన ఆకాంక్ష నేరవేర్చుకోవాలనే తపనతో 1996లో చైన్నెకి వెళ్లి సినీ రంగంలో చేరే ప్రయత్నం చేశారు. ప్రయత్నాలు విఫలం కావడంతో తిరిగి తిరుపతికి చేరుకొని ఎస్వీ సంగీత, నృత్య కళాశాలలో భరతనాట్యం అభ్యసించారు. మిత్రుల ప్రోత్సాహంతో మళ్లీ హైదరాబాద్‌కు వెళ్లి సినిమాల్లో డ్యాన్స్ మాస్టర్‌గా స్థిరపడ్డారు. సుమారు 350 సినిమాలకుపైగా పనిచేశారు. ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ సైతంఈయన శిష్యుడే కావడం విశేషం. -
Rakesh Master: రాకేశ్ మాస్టర్ కొరియోగ్రఫీ చేసిన తొలి సినిమా ఏదంటే?
తెలుగు చలన చిత్రపరిశ్రమలో విషాదం నెలకొంది. ప్రముఖ నృత్య దర్శకుడు ఎస్.రామారావు అలియాస్ రాకేష్ మాస్టర్(53) ఆదివారం మృతిచెందారు. వారం క్రితం ఓ సినిమా షూటింగ్ కోసం విశాఖపట్నం, భీమవరం వెళ్లి వచ్చిన ఆయన అప్పటినుంచి అనారోగ్యం పాలయ్యారు. ఆదివారం రక్త విరోచనాలు కావడంతో గాంధీ ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. 10 ఏళ్ల వయసులోనే డ్యాన్స్ వైపు అడుగులు ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి ప్రాంతంలో రాకేష్ మాస్టర్ జన్మించారు. ఆయన అసలు పేరు ఎస్.రామారావు. 10 ఏళ్ల వయస్సులో డిస్కో డాన్స్ చూసి డ్యాన్సర్‌గా మారాలనుకున్నారు. కానీ, ఎక్కడ నేర్చుకోవాలి? ఎవరు నేర్పుతారు? అని తెలియక టీవీలో వచ్చే పాటలను చూసి డ్యాన్స్ నేర్చుకున్నారు. ఆ తర్వాత తిరుపతి టౌన్‌కి వెళ్లి ఓ డ్యాన్స్ స్కూల్ ప్రారంభించారు. తొలిరోజుల్లో కేవలం రూ.5 ఫీజుతో డ్యాన్స్‌లో శిక్షణ ఇచ్చేవారు. కొన్ని రోజుల తర్వాత సినిమా అవకాశాల కోసం చెన్నై వెళ్లారు. ప్రభుదేవాపై సంచలన వ్యాఖ్యలు చాన్స్‌లు రాకపోవడంతో మళ్లీ తిరుపతికి వచ్చి డ్యాన్స్ ఇన్స్టిట్యూట్ను నడిపారు. ఆ తర్వాత ముక్కు రాజు మాస్టర్ దగ్గర కొంతకాలం పనిచేశారు రాకేష్ మాస్టర్. ‘ఆట’, ‘ఢీ’ లాంటి డ్యాన్స్ రియాలిటీ షోల ద్వారా డ్యాన్స్ మాస్టర్‌గా కెరీర్‌ను మొదలు పెట్టారాయన. ‘ఢీ’ షోలో బషీర్ అనే కుర్రాడికి మాస్టర్‌గా వ్యవహరిస్తున్న సమయంలో ఆ షోకి ఓ జడ్జిగా వ్యవహరించిన ప్రముఖ డ్యాన్స్ మాస్టర్, నటుడు ప్రభుదేవాతో ‘తెలుగు తెలిసిన వాళ్లే జడ్జిలుగా ఉండాలి’ అంటూ కామెంట్స్ చేసి, వార్తల్లో నిలిచారు రాకేష్ మాస్టర్. చిరునవ్వుతో సినిమాతో మొదలైన ప్రయాణం వేణు తొట్టెంపూడి హీరోగా నటించిన ‘చిరునవ్వుతో’ లో ‘నిన్నలా మొన్నలా లేదురా..’ పాటతో సినిమాల్లో కొరియోగ్రాఫర్‌గా తొలి అవకాశం అందుకున్నారాయన. ఆ తర్వాత ‘లాహిరి లాహిరి లాహిరిలో, దేవదాసు, సీతారామరాజు, యువరాజు, గర్ల్ ఫ్రెండ్, బడ్జెట్ పద్మనాభం, మనసిచ్చాను, సీతయ్య, అమ్మో పోలీసోళ్లు’ వంటి దాదాపు 1500 చిత్రాలకుపైగా కొరియోగ్రఫీ చేశారు రాకేష్ మాస్టర్. ‘గ్లోబల్ పీస్ యూనివర్సిటీ’ నుంచి డాక్టరేట్‌ను అందుకున్నారాయన. ప్రభాస్ వంటి పలువురు హీరోలకు డ్యాన్స్‌లో శిక్షణ ఇచ్చారు. కామెడీ షోలోనూ పార్టిసిపేట్ చేసిన రాకేశ్ టాలీవుడ్‌లోని పలువురు స్టార్ హీరోలందరికీ కొరియోగ్రఫీ చేసిన ఘనత ఆయన సొంతం. ప్రస్తుతం తెలుగులో అగ్ర కొరియోగ్రాఫర్లుగా ఉన్న శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్ రాకేష్ మాస్టర్ శిష్యులే కావడం విశేషం. ఓ టీవీ చానల్లో ప్రసారం అవుతున్న షోలో పలు స్కిట్లు చేసి, బుల్లితెర ప్రేక్షకుల్ని తనదైన శైలిలో నవ్వించారు రాకేష్ మాస్టర్. కొంతకాలంగా ఆయన సినిమాలకు దూరంగా ఉన్నారు. అయితే సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండేవారు. యూట్యూబ్ చానల్స్ వేదికగా పలువురు సెలబ్రిటీలపై వివాదాస్పద ఇంటర్వ్యూలు ఇచ్చి ఇటీవల మళ్లీ ట్రెండ్ అయ్యారాయన. వివాదాలతో కుటుంబానికి దూరం వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో వారి అభిమానుల నుంచి రాకేష్ మాస్టర్‌కి, ఆయన కుటుంబానికి బెదిరింపులు వచ్చేవి. ఈ కారణంగా ఆయన కుటుంబానికి దూరంగా అబ్దుల్లాపూర్‌మెట్‌లోని ఓ అనాథ ఆశ్రమంలో ఉంటూ వచ్చారు. ఆయనకు భార్య లక్ష్మి, కుమారుడు చరణ్‌తేజ్, కుమార్తె శ్రీజ ఉన్నారు. రాకేష్ మాస్టర్ మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు తమ సంతాపం తెలిపారు. కాగా హైదరాబాద్‌లోని బోరబండలో నేడు రాకేష్ మాస్టర్ అంత్యక్రియలు నిర్వహించనున్నారు. మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్‌తోనే.. ‘‘ఆదివారం మధ్యాహ్నం ఒంటిగంటకు రాకేష్ మాస్టర్ని గాంధీ ఆసుపత్రిలో అడ్మిట్ చేశారు. డయాబెటిక్ పేషెంట్ కావడం, సివియర్ మెటబాలిక్ ఎసిడోసిస్ కావడంతో మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ అయి సాయంత్రం 5గంటలకు మృతి చెందారు’’ అని గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ రాజారావు మీడియాకు తెలిపారు. చదవండి: డబ్బులు తీసుకుని డేట్స్ ఇవ్వని హీరోలు.. రెడ్ నోటీసులిచ్చేందుకు చిత్రమండలి రెడీ -
నేను చనిపోతే శేఖర్,జానీ చేసేది ఇదే.. ముందే చెప్పిన రాకేష్ మాస్టర్
టాలీవుడ్లో దాదాపు 1500 పాటలకు కొరియోగ్రఫీ చేసిన రాకేశ్ మాస్టర్ (53) ఆకస్మిక మరణంతో తెలుగు చలన చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. సినీ పరిశ్రమ నుంచి ఆయనకు సోషల్ మీడియా ద్వార పలువురు సంతాపం ప్రకటించారు. గతంలో ఆయన వివిధ సందర్భాల్లో పంచుకున్న విషయాలను అభిమానులు షేర్ చేస్తున్నారు. రాకేష్ మాస్టర్ చనిపోయన తర్వాత ఏం జరుగుతుందో ఓ ఇంటర్వ్యూలో ముందే ఇలా చెప్పాడు. (ఇదీ చదవండి: ఎక్కడ సమాధి చేయాలో ముందే కోరిన రాకేష్ మాస్టర్) 'నా మరణం తర్వాత శేఖర్, సత్య మాస్టర్లు పూల మాలలతో వస్తారు. కానీ వారిలో బాధ కంటే సంతోషమే ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఆ సమయంలో వారికి ఏడుపు రాకున్నా.. కన్నీళ్లు పెట్టుకున్నట్లు నటిస్తారు. గతంలో నేను వారి కోసం చేసిన రెండు మంచిమాటలు చెబుతూ.. ఎప్పుడెప్పుడూ డెడ్‌బాడీని తీసేస్తారా..? అక్కడి నుంచి వెళ్లిపోదామా? అని' ఉంటారని చెప్పుకొచ్చాడు. జానీ మాస్టర్‌కు మాత్రం ఏడుద్దామని అనుకున్నా కన్నీళ్లు రావు.. దీంతో జెండూ బామ్‌ను పూసుకొని మ్యానేజ్ చేస్తాడని తెలిపాడు. ఇలా తన అంత్యక్రియలు పూర్తి అయిన తర్వాత వాళ్లందరూ చాలా రిలాక్స్ అవుతారని గతంలో తెలిపాడు. మెడికల్ కాలేజీకి మృతదేహం తన మరణం తర్వాత డెడ్‌బాడీని మెడికల్ కాలేజీకి చెందాలని, అందుకు ముందే ఏర్పాట్లు చేసుకున్నానని తెలిపాడు. కాబట్టి తన శిష్యులకు ఎలాంటి ఇబ్బంది ఉండదని చెప్పాడు. తన అంత్యక్రియలకు వారెవరూ ఖర్చు చేయాల్సిన అవసరం ఉండదు. చివరకు తన కుమారుడు కూడా చితికి నిప్పు పెట్టాల్సిన పని లేదన్నాడు. తన అస్తికలు తీసుకొని గంగానదిలో కలపాల్సిన అవసరం కూడా లేదన్నాడు. అలాంటి వాటిపై నమ్మకం లేదు.. అందుకే మరణానంతరం తన డెడ్‌బాడీని మెడికల్ కాలేజీకి చేరాలని నిర్ణయించుకున్నానన్నాడు. దీంతో కొంతమంది మెడికల్ విద్యార్థులకు శవ పంచనామాకు ఉపయోగపడుతుందని చెప్పుకొచ్చాడు. ఇలా అందరూ శరీర దానం చేయడం వల్ల మెడికల్ విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నాడు. (ఇదీ చదవండి: Rakesh Master: ఆ ఒక్క మాటతో ఫేమస్ అయిన రాకేష్ మాస్టర్) -
ఎక్కడ సమాధి చేయాలో ముందే కోరిన రాకేష్ మాస్టర్
టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ రాకేశ్ మాస్టర్ ఆదివారం (జూన్ 18) కన్నుమూశారు. కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న రాకేశ్. హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. గతంలో పలు యూట్యూబ్ ఇంటర్వ్యూలలో తను చనిపోయిన తర్వాత ఎక్కడ సమాధి చేయాలో చెప్పారు. ఇప్పుడా మాటాలు వైరల్ అవుతున్నాయి. తన అంతిమ యాత్ర ఎలా ఉంటుందో చూసుకోవాలనిపించి సంబంధిత వీడియోను ముందే తీశామని తెలిపాడు. తన మామగారు (భార్య తండ్రి) సమాధి పక్కన ఒక వేప మొక్కన నాటాడట. తను మరణించాక ఆ చెట్టు కిందే సమాధి చేయాలని ఓ ఇంటర్వ్యూలో కోరాడు. (ఇదీ చదవండి: Rakesh Master: ఆ ఒక్క మాటతో ఫేమస్ అయిన రాకేష్ మాస్టర్) తన తమ్ముడంటే చాలా ఇష్టమని తను చనిపోయినప్పుడు చాలా బాధపడినట్లు తెలిపాడు. తర్వాత తన అమ్మ చనిపోవడంతో జీవితం మీద విరక్తి పుట్టిందని చెప్పేవాడు. ఇలా తన కుటుంబ సభ్యుల్లో అక్క కుమారుడితో పాటు తండ్రి కూడా మరణించడంతో చావు అంటే భయం లేకుండా పోయిందని తెలుపుతూ.. ఆ ఇంటర్వ్యూలో కంటతడి పెట్టాడు. (ఇదీ చదవండి: Adipurush: దిల్ రాజు ముందే ఊహించాడా?) -
ప్రముఖ కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ మృతి
-
Rakesh Master: రాకేశ్ మాస్టర్ మృతి.. వైద్యులు ఏమన్నారంటే?
ప్రముఖ కొరియోగ్రాఫర్ రాకేశ్ మాస్టర్ ఆదివారం(జూన్ 18న) సాయంత్రం కన్నుమూశారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ వల్లే ఆయన మృతి చెందారని వైద్యులు వెల్లడించారు. గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ రాజారావు మాట్లాడుతూ.. 'వాంతులు, విరోచనాలు అవుతున్నాయని రాకేశ్ మాస్టర్‌ను ఈరోజు మధ్యాహ్నం ఒంటి గంటకు ఆస్పత్రికి తీసుకొచ్చారు. అప్పటికే ఆయన ఆరోగ్యం విషమించింది. డయాబెటిస్, సివియర్ మెటబాలిక్ ఎసిడోసిస్ కావడంతో మల్టీ ఆర్గాన్స్ ఫెయిల్యూర్స్ అయ్యాయి. అడ్మిట్ అయిన గంటకే ఆయన ఆరోగ్యం మరింత విషమించింది. ఆయన్ను బతికించేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. సాయంత్రం 5 గంటలకు మరణించారు' అని పేర్కొన్నారు. చదవండి: శేఖర్ మాస్టర్‌తో గొడవ.. కానీ ఎందుకో ఇప్పటికీ తెలియదు కాగా రాకేశ్ మాస్టర్ లాహిరి లాహిరి లాహిరిలో, దేవదాసు, చిరునవ్వుతో, సీతయ్య, అమ్మో పోలీసోళ్ళు వంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు డ్యాన్స్ మాస్టర్‌గా పని చేశారు. దాదాపు 1500 చిత్రాలకు కొరియోగ్రఫీ చేశారు. స్టార్ హీరోలందరికీ కొరియోగ్రఫీ చేసిన ఘనత ఆయన సొంతం. టాలీవుడ్లో నెంబర్ వన్ కొరియోగ్రాఫర్లుగా చెలామణీ అవుతున్న శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్లు ఈయన శిష్యులే! చదవండి: కొరియోగ్రాఫర్ రాకేశ్ మాస్టర్ కన్నుమూత -
Rakesh Master: నా శరీరంలో మార్పులు వస్తున్నాయి.. రాకేశ్ మాస్టర్ వీడియో వైరల్
ప్రముఖ కొరియోగ్రాఫర్ రాకేశ్ మాస్టర్ తీవ్ర అనారోగ్యంతో కన్నుమూశారు. ఎంతోమంది స్టార్ హీరోలతో పని చేసిన ఆయన రియల్ లైఫ్‌లో మాత్రం ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారు. నిత్యం ఏదో ఒక వివాదంలో చిక్కుకునే ఆయన కుటుంబానికి సైతం దూరంగా ఉన్నారు. ఆయన తన చావును ముందే పసిగట్టాడంటూ ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇందులో ఆయన మాట్లాడుతూ.. 'నాకు మోకాళ్ల నొప్పులు.. నా శరీరంలో మార్పులు వస్తున్నాయి.. తెలుసు, నేను అస్తమించే సూర్యుడిని.. నాకన్నీ తెలుసు' అంటూ బాధతో మాట్లాడారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన అభిమానులు బాధగా ఉంది మాస్టర్, మీ మాటలు వింటుంటే ఏడుపొస్తుంది అని కామెంట్లు చేస్తున్నారు. View this post on Instagram A post shared by CELLULOID PANDA (@celluloid_panda) చదవండి: ఒక్కమాటతో ఫేమస్ అయిన రాకేశ్ మాస్టర్ రక్త విరోచనాలు, కొరియోగ్రాఫర్ రాకేశ్ మాస్టర్ మృతి -
Rakesh Master: అనాథాశ్రమంలో జీవితం వెల్లదీసిన రాకేశ్ మాస్టర్, ఎందుకంటే?
టాలీవుడ్లో టాప్ కొరియోగ్రాఫర్‌గా కీర్తి గడించిన రాకేశ్ మాస్టర్ అనారోగ్యంతో కన్నుమూశారు. ఎప్పుడూ ఏదో ఒక వివాదంతో వార్తల్లో ఉండే ఆయన ఈ లోకం నుంచి శాశ్వతంగా నిష్క్రమించారు. గత కొంతకాలంగా ఇంటర్వ్యూల్లో కనిపిస్తున్న రాకేశ్ మాస్టర్ వేరు, అంతకుముందున్న మాస్టర్ వేరు. 1500 సినిమాలకు కొరియోగ్రఫీ, గ్లోబల్ హ్యూమన్ పీస్ యూనివర్సిటీ నుంచి డాక్టరేట్.. ఇలా ఎంతో కీర్తి పొందిన ఆయన కొంతకాలం క్రితమే అబ్దుల్లాపూర్‌మెట్‌లోని అనాథాశ్రమంలో చేరారు. అందరూ ఉన్నా ఎవరూ లేని అనాథగా చివరి రోజుల వరకు అదే ఆశ్రమంలో జీవించారు. మానసికంగా కుంగిపోయి ఎక్కడికి వెళ్లాలో తెలియని స్థితిలో అనాథాశ్రమానికి వెళ్లానని రాకేశ్ మాస్టరే స్వయంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఆ ఇంటర్వ్యూలో ఆయన ఇంకా ఏమన్నారంటే.. 'నేను ఏదైనా ముక్కుసూటిగా మాట్లాడతాను. అదే నాకు సమస్యలు తెచ్చిపెట్టింది. మణికొండలో కారు పార్కింగ్ విషయంలో ఇంటి యజమానితో గొడవ జరిగింది. అక్కడెందుకు ఉండటమని నా భార్య దగ్గరకు వెళ్లిపోయా. అక్కడికి వెళ్లగానే గొడవ మొదలైంది. ఆమె.. మీరు రావొద్దండీ.. మీ వల్ల నా పిల్లలకు హాని అన్నారు. నా ఇంటర్వ్యూ వల్ల పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ నా కొడుకు చరణ్‌ను కొట్టారు. చదవండి: ఆ ఒక్క మాటతో ఫేమస్ అయిన రాకేశ్ మాస్టర్ అందుకే ఆమె అలా మాట్లాడింది. ఎక్కడికైనా వెళ్లిపోండి, ఆఖరికి నేను చచ్చిపోయినా రానని అనేసింది. తన మాటల్లోని బాధ నాకు అర్థమైంది. అందుకే కుటుంబానికి దూరమయ్యాను. అయితే ఓ మహిళ నాకు అన్ని పనుల్లో సాయంగా ఉండేది. ఎక్కడికి వెళ్లినా నావెంటే వచ్చేది. కొంతమంది.. ఆమెను నా మూడో భార్య అని రాశారు. అందరి ముందు ఆమె పరువు పోతుందని, తనతో సహజీవనం చేస్తున్నానని చెప్పాను. ఎవరూ పట్టించుకోనప్పుడు తను నాకు సమయానికి తిండి పెట్టిందని నెత్తిన పెట్టుకున్నాను. కానీ ఆమె నా డబ్బులే దోచుకుంటూ నన్ను, నా కుటుంబాన్ని నిలువెల్లా ముంచింది. నా పరువుప్రతిష్టలు బజారునపడేసింది. నన్ను వశీకరణ చేయాలనుకుంది. తనవల్ల నా కుటుంబానికి మరింత దూరమై మనోవేదనకు గురయ్యాను. అందుకే అనాథాశ్రమంలో చేరాను' అని చెప్పుకొచ్చారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) చదవండి: రక్త విరోచనాలు.. రాకేశ్ మాస్టర్ కన్నుమూత -
Rakesh Master: ఆ ఒక్క మాటతో ఫేమస్ అయిన రాకేష్ మాస్టర్
తెలుగు చలన చిత్రసీమలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ సినీ నృత్యకారుడు ఎస్.రామారావు అలియాస్ రాకేశ్ మాస్టర్(53) మరణించారు. రాకేష్ మాస్టర్ సినీ పరిశ్రమలోని ప్రముఖ కొరియోగ్రాఫర్లలో ఒకరు. 10 సంవత్సరాల వయస్సులో అతను డిస్కో డాన్సర్‌ని చూసి డ్యాన్సర్‌గా మారాలని అనుకున్నారు. కానీ డ్యాన్స్ ఎవరు నేర్పుతారు..? ఎక్కడ నేర్చుకోవాలో తెలియదు. దీంతో అతనే టీవీలో వచ్చే వైవిధ్యమైన పాటలను చూసి డ్యాన్స్ నేర్చుకున్నారు. ఆ తర్వాత తిరుపతికి వెళ్లి అక్కడ డ్యాన్స్ స్కూల్ ప్రారంభించారు. కేవలం రూ. 5 ఫీజుతో చాలా మంది విద్యార్థులను చేర్చుకున్నారు. కొన్ని రోజుల తర్వాత సినిమా అవకాశాల కోసం ప్రయత్నించారు. అందుకోసం మద్రాసు వెళ్లిపోయారు. తన టాలెంట్‌కి అక్కడ విలువ లేదని మళ్లీ తిరుపతికి వచ్చి ఇన్స్టిట్యూట్ను నడిపారు. (ఇదీ చదవండి: కొరియోగ్రాఫర్ రాకేశ్ మాస్టర్ కన్నుమూత) రాకేష్ మాస్టర్‌కు టర్నింగ్ పాయింట్ ఇదే.. ఢీ షోలో బషీర్ అనే కుర్రాడికి మాస్టర్‌గా వ్యవహరిస్తున్న సమయంలో ప్రముఖ డ్యాన్స్ మాస్టర్ ప్రభుదేవాకు సవాల్ విసిరి వార్తల్లో నిలిచారు రాకేష్ మాస్టర్. తెలుగు గురించి తెలిసిన వాళ్లే జడ్జిలుగా వ్యవహరించాలని, తెలుగు వాళ్లే వచ్చి ఈ షోలో పాల్గొని మన దమ్ము ఏంటో చూపించాలని రాకేష్ మాస్టర్ చెప్పుకొచ్చారు. తెలుగు డ్యాన్సర్లకు జరుగుతున్న అన్యాయాన్ని ఢీ వేదికగా ప్రపంచానికి తెలియజేశారు. ఇక్కడ మరో విషయం ఏమిటంటే! ప్రభుదేవా అప్పటికే స్టార్ హీరోగా, కొరియోగ్రాఫర్‌గా కొనసాగుతున్న రోజుల్లోనే ఈ కామెంట్స్ చేసి సంచలనం సృష్టించారు రాకేష్ మాస్టర్. దీంతో ఒక్కసారిగా ఆయన పేరు అందరికీ పరిచయం అయింది. ప్రస్తుతం ఇండస్ట్రీలో స్టార్ కొరియోగ్రాఫర్లుగా చలామణి అవుతున్న చాలా మంది రాకేష్ మాస్టర్ దగ్గర శిష్యరికం పొందినవారే. శేఖర్ మాస్టర్‌తో విబేదాలు టాలీవుడ్లో ప్రముఖ డ్యాన్స్ మాస్టర్ అయిన శేఖర్ కూడా ఆయన శిష్యుడే.. కానీ వారిద్దరి మధ్య ఎన్నో గొడవలు జరిగాయని పలు ఇంటర్వ్యూలలో రాకేష్ మాస్టర్ చెప్పుకొచ్చారు. అయితే ఆయన చేసిన ఆరోపణలపై శేఖర్ మాస్టర్ పెద్దగా రియాక్ట్ అయిన సందర్భాలు లేవు. ఒకరోజు ఫేస్బుక్ లైవ్ చాట్‌లో రాకేష్ మాస్టర్‌తో మీ గొడవ ఏమిటి? అని ఓ అభిమాని ప్రశ్నకు శేఖర్ మాస్టర్ స్పందిస్తూ.. తనపై మాస్టర్‌కు ఉన్న కోపానికి కారణం ఏంటో తెలియదు. కానీ ఆయన మాటల చాలా ఇబ్బంది పెట్టాయని తెలిపాడు. గొడవకు కారణం ఇప్పటికీ సస్పెన్సే రాకేష్ మాస్టర్ చాలా ఇంటర్వ్యూలు ఇచ్చారు కానీ శేఖర్‌తో గొడవకు గల కారణాలను తెలపకుండానే కొన్ని ఆరోపణలు చేసేవారు. వారి మధ్య ఏం జరిగింది? అని అడిగితే అసలు విషయం చెప్పకుండా దాటవేసేవారు. వారి మధ్య జరిగిన విషయాలు చెప్పకుండా వాళ్ల పాప బర్త్ డేకు పిలవలేదు, చిరంజీవి సాంగ్ చేస్తే చెప్పలేదు అని శేఖర్‌పై ఫైర్ అయ్యేవారు. దీంతో ఇప్పటికీ వారి మధ్య గొడవకు కారణం మాత్రం సస్పెన్స్‌గానే ఉండిపోయింది. (ఇదీ చదవండి: రాజకీయాల్లో సినిమా ఇంపాక్ట్.. గతం ఏం చెబుతోంది?) -
Rakesh Master Unseen Photos: టాలీవుడ్ కొరియోగ్రాఫర్ రాకేశ్ మాస్టర్ (ఫొటోలు)
-
Rakesh Master: కొరియోగ్రాఫర్ రాకేశ్ మాస్టర్ కన్నుమూత
తెలుగు చలన చిత్రసీమలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ సినీ నృత్యకారుడు ఎస్.రామారావు అలియాస్ రాకేశ్ మాస్టర్(53) మరణించారు. ఆదివారం ఉదయం ఆయన రక్తవిరోచనాలు చేసుకున్నారు. దీంతో ఆయనను గాంధీ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ కన్నుమూశారు. కాగా హైదరాబాద్‌లో ముక్కురాజు మాస్టర్ వద్ద పనిచేసిన రాకేష్ మాస్టర్.. ఆ తరువాత లాహిరి లాహిరి లాహిరిలో, దేవదాసు, చిరునవ్వుతో, సీతయ్య, అమ్మో పోలీసోళ్ళు వంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు కొరియోగ్రఫర్‌గా పని చేశారు. ఆ గొప్ప డ్యాన్సర్లు ఈయన శిష్యులే దాదాపు 1500 చిత్రాలకు కొరియోగ్రఫీ చేశారు. స్టార్ హీరోలందరికీ కొరియోగ్రఫీ చేసిన ఘనత ఆయన సొంతం. టాలీవుడ్లో నెంబర్ వన్ కొరియోగ్రాఫర్లుగా చెలామణీ అవుతున్న శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్లు ఈయన శిష్యులే! రాకేశ్ మాస్టర్ మరణవార్త గురించి ఆయన అసిస్టెంట్ సాజిత్ మాట్లాడుతూ.. 'హనుమాన్ క్లైమాక్స్ షూటింగ్ చేసినప్పుడు రాకేశ్ మాస్టర్‌కు విరోచనాలు, వాంతులు జరిగాయి. అప్పుడు ఆయన్ను ఆస్పత్రికి తీసుకెళ్లాం. కాళ్లు, చేతులు పడిపోవడంతో ఈయన బతకడం కష్టమని డాక్టర్లు అప్పుడే చెప్పారు. జాగ్రత్తగా చూసుకోమని చెప్పారు. ఇది జరిగి రెండు నెలలు అవుతోంది. వారం రోజుల క్రితం ఓ ప్రాజెక్ట్ షూటింగ్ నిమిత్తం విశాఖపట్నం, భీమవరం వెళ్లి ఈ మధ్యే హైదరాబాద్ వచ్చారు. అప్పటినుంచి ఆయన అనారోగ్యం పాలయ్యారు. ఈ రోజు మధ్యాహ్నం ఆయన కాళ్లు, చేతులు పడిపోయాయి అని ఫోన్ వచ్చింది. పక్షవాతంలాగా అనిపిస్తోందని ఇంటిసభ్యులు చెప్పారు. ఇంతలోనే ఆయన మరణించినట్లు తెలిసింది' అని చెప్పుకొచ్చాడు. చదవండి: శ్రీజతో విడాకులు.. కన్ఫర్మ్ చేసిన కల్యాణ్ దేవ్